బయటి గ్రామాలకు వెళ్లకుండా అడ్డుగా ఉన్న బోదరవాగు తండా వాగు (ఫైల్)
అక్కన్నపేట(హుస్నాబాద్): అవి మూరుమూల గిరిజన తండాలు.. ఆపై కనీస సౌకర్యాలు లేవు. కొండల్లో, గుట్టల నడుమ ఉన్న తండాలపై ఇంత నిర్లక్ష్యమా!? అడవిలో నివసించేటోళ్లు అడవి లోనే ఉండాలా.. అని ఆ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఏ తండాకు వెళ్లాలన్నా కాళ్లు తడవాల్సిన పరిస్థితి. అక్కన్నపేట మండల కేంద్రానికి నాలుగు కిలో మీట ర్ల దూరంలోని బోదరవాగు తండా, చౌడు తండా, మంగ్యానాయక్ తండాలు నేటికి కనీస సౌకర్యాలు లేక దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ మూడు తండాల్లో దాదాపు 450కి పైగా జనాభా ఉంటుంది. కానీ ఈ తండాలు మండలం పరిధిలోనే లేవన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. తమ తం డాలన్నీ కలుపుకొని గ్రామ పంచాయతీ గా మార్చాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా తండాలను గ్రామ పం చాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్ర భుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. చెరువులు, కొండలు, గుట్ట లు, వాగులు ఉన్న తండాల్లో 300 నుంచి 400 వరకు జనాభా ఉంటే గ్రామపంచా యతీగా గుర్తించవచ్చని ప్రభుత్వం చెబు తోంది. కానీ ఆ తండాలను గుర్తించడం అటుంచి కనీసం ఆ వైపు కన్నెత్తి చూసే వారు లేక కనీస సౌకర్యాలు కరువై గిరి జనులు నరకయాతన పడుతున్నారు.
ప్రతిపాదనలో కేశనాయక్ తండా
నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు కానున్న కేశనాయక్ తండాలో బోదర్ వాగు తండా, చౌడు తండా, మంగ్యానాయక్ తండాలను కలిపితే చెరువుదాటి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మండల కేంద్రంలో కొనసాగిస్తే వాగు దాటి రావాల్సి ఉంది. గిరిజనులు ఏటు వెళ్లాలన్నా వాగైనా, చెరువైనా దాటాల్సిన పరిస్థితి నెలకొంది.
ఒకే పంచాయతీ పరిధిలో మూడింటికి ప్రతిపాదనలు
హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వంగరామయ్యపల్లి, బల్లునాయక్ తండా, పూల్‌నాయక్ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపిచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవి గ్రామ పంచాయతీకి అర కిలో మీటర్ దూరంలో మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్నాయి. ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో మూడు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేయడం రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే కొనసాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి హరీశ్‌రావు తమ తండాలపై దృష్టిసారించి కనీస సౌకర్యాల కల్పనతోపాటు గ్రామ పంచాయతీ ఏర్పాటు గురించి ఆలోచించాలని గిరిజనులు కోరుతున్నారు.
పంచాయతీలుగా గుర్తించాలి
బోదరవాగు తం డా, చౌడు తండా, మంగ్యానాయక్ తండాలవాసులు ఎటు వెళ్లాలన్నా చెరువైనా, వాగైనా దాటాల్సిన పరి స్థితి. ఆ తండాల చుట్టూ వాగు లు ఉన్నాయి. నేటికీ రోడ్డు, తాగునీటి సౌకర్యాలు లేవు. ఈ మూడు తండాలను కలిపి గ్రామపంచాయతీగా గు ర్తించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఆం దోళనకు దిగుతాం.
–బీమాసాహెబ్, గిరిజన జేఏసీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment