grama panchayath
-
అరచేతిలో పంచాయతీ సమాచారం! మళ్ళీ కొత్త హంగులతో..
ఆదిలాబాద్: గ్రామపంచాయతీ ఆదాయ, వ్యయాల విషయంలో పారదర్శకత పాటించేలా కేంద్ర ప్రభుత్వం మేరీ పంచాయతీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల వివరాలను పంచాయతీ కార్యాలయాలకు వెళ్లకుండానే యాప్ ద్వారా పరిశీలించవచ్చు. పంచాయతీలకు సంబంధించిన పద్దుల వివరాలు ప్రజల ముందుకు వచ్చాయి. ఈ యాప్‌ను 2019 లోనే రూపొందించగా కొన్ని కారణాలతో వివరాలన్నింటినీ నిక్షిప్తం చేయలేదు. గతేడాది నుంచి అన్నింటినీ ఇందులో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని అన్ని పంచాయతీలకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచారు. ఎప్పటికప్పుడు వివరాలు అప్లోడ్.. గ్రామపంచాయతీకి సంబంధించిన నిధుల వివరాలే కాకుండా సర్పంచ్, కార్యదర్శి, గ్రామ కమిటీలు, ఆస్తుల సమాచారాన్ని సైతం యాప్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా మంజూరు చేసే నిధుల వివరాలతో పాటు ఏయే పనులకు ఎంత మొత్తం వెచ్చించారు. పనులు ఏ దశల్లో ఉన్నాయనే సమాచం యాప్‌లో దర్శనమిస్తుంది. జిల్లా - పంచాయతీలు ► ఆదిలాబాద్ - 467 ► నిర్మల్ - 396 ► మంచిర్యాల - 311 ► ఆసిఫాబాద్ - 335 పారదర్శకతకు ప్రాధాన్యం.. పంచాయతీ నిధుల వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నిక్షిప్తం చేయడంతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేపడుతున్నాయనేది ప్రజలు సులువుగా తెలుసుకోవచ్చు. గ్రామంలో చేపట్టే పనులను జీపీఆర్ఎస్ ద్వారా గుర్తిస్తుండడంతో ఒక్కసారి నిధులు మంజూరైన పనికి మరోసారి బడ్జెట్ కేటాయించడానికి వీలుండదు. పద్దుల వివరాలు ప్రజల వద్దకు వెళ్లడంతో పాలకవర్గాలు పొరపాట్లు చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ తప్పుడు నివేదికలు రూపొందిస్తే ప్రజలు ప్రశ్నించవచ్చు. పంచాయతీ వివరాలు ఇలా.. ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లేస్టోర్‌కు వెళ్లి ‘మేరీ పంచాయతీ’ అని టైప్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని తెరవగానే ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, పంచాయతీ వివరాలు దర్శనమిస్తాయి. వాటిని నమోదు చేయగానే గ్రామపంచాయతీకి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. గ్రామం పేరు లేదా పిన్‌కోడ్‌తో సైతం సంబంధిత పంచాయతీ వివరాలు తెలుసుకోవచ్చు. సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు.. గ్రామపంచాయతీలకు సంబంధించిన వివరాలను నెలకోసారి ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా నిక్షిప్తపరుస్తారు. దీంతో ప్రజలు తమకు కావాల్సిన సమాచారాన్ని సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిధుల కేటాయింపు, పనుల వివరాల్లో సందేహాలు ఉంటే గ్రామసభల్లో ప్రశ్నించవచ్చు. – అరుణ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
పంచాయతీ సెక్రటరీలకూ బదిలీల పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉద్యోగుల విభజనలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ మలుపులు తిరుగుతోంది. కొన్ని జిల్లాల్లో పనిచేస్తున్న కార్యదర్శులకు ఒకలా, మరికొన్ని జిల్లాల్లో ఇంకోలా కేటాయింపులు, పోస్టింగ్‌లు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాలకు పోస్టింగుల వల్ల కుటుంబాలకు దూరమై వ్యయ, దూరభారాలు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. మే, జూన్‌ల్లో సాధారణ బదిలీలు చేసే దాకా పాత స్థానాల్లోనే డిప్యూటేషన్‌పై కొనసాగేలా ఉత్తర్వులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్నిజిల్లాల్లో ఔట్సోర్సింగ్ కార్యదర్శుల ఔట్ ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా ల్లోని పలువురు పంచాయతీ సెక్రటరీలను సాధారణ బదిలీలు జరిగే దాకా పాత జిల్లాల్లోనే డిప్యూటేషన్‌పై పనిచేసేలా తాజాగా ఉత్తర్వులిచ్చారు. అయితే ఇప్పటివరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న పలువురిని నిజామాబాద్, తదితర జిల్లాలకు బదిలీ చేయడంతో కుటుంబాలకు దూరంగా తాము ఇబ్బందిపడుతున్నామని వారు వాపోతున్నారు. మరోవైపు దాదాపు ఏడాది కిందట వివిధ జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 800 మంది వరకు గ్రామ పంచాయతీ సెక్రటరీలను నియమించగా వీళ్లలో నిజామాబాద్ జిల్లాలో70 మంది, నిర్మల్ జిల్లాలో 40 మందిని తాజాగా తొలగించారు. ప్రస్తుత బదిలీలు, కేటాయింపుల్లో భాగంగా వీళ్లు పనిచేస్తున్న పంచాయతీల్లో పలువురు గ్రేడ్–1, 2, 3 సెక్రటరీలను నియమించినట్లు తెలుస్తోంది. గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్–1 గ్రామాలకు కాకుండా ఔట్ సోర్సింగ్ సెక్రటరీలు పనిచేస్తున్న గిరిజన తండాలు, మారుమూల ప్రాంతాలకు బదిలీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. -
ఇక పంచాయతీల్లో పారదర్శకం
సాక్షి, వరంగల్/భీమదేవరపల్లి: తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో భాగంగా ఏర్పాటు కానున్న స్థాయీ సంఘాల(స్టాండింగ్ కమిటీ)తో గ్రామ పంచా యతీ పాలన పారదర్శకంగా సాగే అవకాశాలున్నాయి. స్థానిక సంస్థలకు గ్రామ పరిపాలన పగ్గాలు అప్పగించాలన్న ధ్యేయంతో 73, 74వ రాజ్యాంగ సవరణలతో పంచాయతీల స్థాయిలో అభివృద్ధి కోసం కమిటీలను ఏర్పాటు చేయాలని పొందుపర్చారు. కానీ ఈ విషయాన్ని గతంలో పట్టించుకోలేదు. గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగాలంటే సర్పం చ్ స్థాయిలోనే పెనుమార్పులతోనే సాధ్యమని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేశారు. జల భాగస్వామ్యం కోసం... గ్రామపంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ప్రజలను అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొం దించింది. అందులో భాగంగానే ప్రతీ గ్రామపంచాయతీకి నాలుగు స్టాండింగ్ కమిటీలతో పాటుగా ఒక్కో గ్రామ పంచాయతీకి ముగ్గురు చొప్పున కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియను 29వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, జిల్లాలోని మొత్తం ఏడు మండలాల్లో ఉన్న 130 గ్రామాల్లో ఈ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గ్రామానికి అన్ని కమిటీలు కలిపి 63 మంది సభ్యులుగా ఉండనున్నారు. దీంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో 8,190 మందికి కమిటీలో అవకాశం దక్కుతుంది. అభివృద్ధి వేగిరం గ్రామపంచాయతీ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల్లో మంజూరైన పనులు త్వరతగతిన పూర్తి అయ్యేందుకు ఈ కమిటీలు పరోక్షంగా దోహదం చేస్తాయి. ఇప్పటి వరకు పంచాయతీల నిధులతో చేపట్టిన పనులను పర్యవేక్షించేందుకే సర్పంచ్ల పూర్తి సమయం సరిపోయేది. ఈ కమిటీల ఏర్పాటుతో చేపట్టిన పనుల నాణ్యతపై కూడా దృష్టి సారించే అవకాశాలున్నాయి. ఈ కమిటీల్లో విషయ నిఫుణులు, అనుభవం గల వారికి ప్రాతినిధ్యం కల్పించనుండడంతో గ్రామాల అభివృద్ధి పరుగులు తీస్తుందని భా విస్తున్నారు. ఎన్నిక విధానం ప్రతీ కమిటీలో 15 మంది సభ్యులకు తక్కువ కాకుండా.. ఈఓ పీఆర్డీల సమక్షాన కమిటీలను ఏర్పాటుచేయాలి. ఇందులో ఒకరిని కన్వీనర్‌గా ఎన్నుకోవాలి. కమిటీ సభ్యులంతా గ్రామ నివాసితులై, ఆ గ్రామ ఓటరై ఉండాలి. వార్డు సభ్యులకు ఈ కమిటీల్లో స్థానం ఉండదు. ఇక కమిటీల వారీగా అవగాహన కలిగిన అనుభజ్ఞులైన, నిష్ణాతులైన వ్యక్తులను కమిటీల్లోకి తీసుకోవాలి. గ్రామపంచాయతీ తీర్మానం మేరకు కమిటీ ఎంపిక పూర్తిచేయాలి. ముగ్గురు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జిల్లా పరిషత్, మండల పరిషత్ మాదిరిగా గ్రామపంచాయతీల్లోనూ ముగ్గురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. జెడ్పీల్లో ఇద్దరు, మండలాల్లో ఒకరిని మాత్రమే కో–ఆప్షన్ సభ్యుడిని ఎన్నుకోగా గ్రామపంచాయతీల్లో మాత్రం ముగ్గురిని ఎన్నుకునేలా నూతన చట్టంలో పేర్కొన్నారు. ఈ కోప్షన్ సభ్యుల్లో ఒకరు సీనియర్ సిటిజన్, ఒకరు విశ్రాంత ఉద్యోగి(గ్రామాభివృద్ధికి ఆర్థిక సాయం చేసిన దాత, పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ), మరొకరు గ్రామ సమాఖ్య అధ్యక్షురాలై ఉండాలి. ఈ సంఘాలు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న సంఘం అధ్యక్షురాలికి అవకాశం కల్పిస్తారు. వీరు పంచాయతీల అభివృద్ధి కోసం గ్రామ పాలకవర్గం, స్టాండింగ్ కమిటీలతో కలిసి పనిచేస్తారు. అధికారుల కసరత్తు జీపీల్లో స్థాయి సంఘాల ఏర్పాటును ఈనెల 29లోగా పూర్తిచేసి 31లోగా జిల్లా పంచాయతీ అధికారికి అందచేయాలని కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో అధికా రులు కసరత్తు ప్రారంభించారు. సర్పంచ్, ప.కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని, వీటి ఏర్పాటును ఎంపీడీఓలు పర్యవేక్షించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఎన్నికకు సంబంధించి నోటీస్ బోర్డు ద్వారా తెలియజేయాలి. స్థాయీ సంఘాలు ఇవే... కమిటీ – 1 : పారిశుధ్యం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక నిర్వహణ కమిటీ – 2 : వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కమిటీ – 3 : మొక్కల పెంపకం, పచ్చదనం పెంపు కమిటీ – 4 : పనులు, సంతల పర్యవేక్షణ -
పంచాయతీరాజ్‌లో మామూళ్ల పర్వం
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా.. ప్రజలకు సేవలు అందాలన్నా జిల్లాలో పంచాయతీ వ్యవస్థే కీలకం. పంచాయతీ వ్యవస్థలో ఉన్నతాధికారుల వద్ద నుండి కిందిస్థాయి అధికారుల వరకూ మామూళ్ల మత్తులో ఊగుతున్నారు. వారు అడిగిన మేరకు మామూళ్లు ఇవ్వకుంటే వేధింపులకు గురి చేస్తున్నారు. జిల్లాలో 909 పంచాయతీలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రజలకు జిల్లా పంచాయతీ వ్యవస్థ సేవలందిస్తుంది. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా జిల్లాలోనూ బదిలీలు జరిగాయి. జిల్లా పంచాయతీ విభాగంలో నిర్వహించిన బదిలీ విషయంలో లక్షల్లో చేతులు మారినట్లు తెలుస్తోంది. కీలకమైన మేజర్ పంచాయతీల్లో పోస్టింగ్ కావాలంటే కీలక అధికారికి లక్షల్లో ముట్టచెబితేనే పోస్టింగ్‌లు వేసినట్లు సమాచారం. అంతే కాకుండా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిపాదన లేఖలు ఉన్నప్పటికీ సదరు ఉన్నతాధికారికి సొమ్ములు ముట్టచెపితేనే వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా గ్రేడ్ 1 పంచాయతీలో కార్యదర్శులకు పోస్టింగ్ కావాలంటే ఒక రేటు, గ్రేడ్ 2 పంచాయతీలో పోస్టింగ్ కావాలంటే మరో రేటు ఇలా ఆయా పంచాయతీల స్థాయిని బట్టి సొమ్ములు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పదోన్నతుల్లోనూ వసూళ్లు సాధారణ బదిలీలకంటే ముందుగా జిల్లా పంచాయతీలో బదిలీల ప్రక్రియను నిర్వహించారు. ఈ పదోన్నతుల్లో భాగంగా సుమారు 30మందికి పైగా పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతుల్లోనూ భారీ గానే చేతులు మారినట్లు తెలుస్తుంది. పదోన్నతులను బట్టి రూ.20వేల నుండి రూ.50వేల వరకూ ఉన్నతాధికారులకు చేరినట్లు సమాచారం. అదే విధంగా ఆపరేటర్ల పోస్టుల భర్తీలోనూ ఒక్కొక్కరి నుండి రూ.6వేల నుండి రూ.10వేల వరకూ సమర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. సొమ్ములు ఇవ్వకుంటే వేధింపులు డివిజనల్ స్థాయి పంచాయతీ అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకూ జిల్లాలో వారి పరిధిలోని పంచాయతీలకు తనిఖీలకు వెళుతుంటారు. ఈ తనిఖీలకు అధికారులు నిర్ణయించిన మేరకు కార్యదర్శులు చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అంతే కాకుండా అధికారులు నిర్దేశించిన మొత్తాల్లో చెల్లించకుంటే సంబం ధిత కార్యదర్శులపై వేధింపులు తప్పవు. ఇప్పటికైనా జిల్లా పంచాయతీలో వసూళ్ల పర్వానికి అడ్డుకట్ట వేయకుంటే జిల్లా పంచాయతీ వ్యవస్థ అవినీతి రొంపిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. -
ఇక గ్రామ పంచాయతీల వ్యవస్థ
సాక్షి, ఒంగోలు టూటౌన్: రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ పంచాయతీలు సచివాలయాలుగా రూపాం తరం చెందనున్నాయి. 70 ఏళ్ల క్రితం మహాత్మాగాంధీ కన్న కలలు నేడు సాకారం కాబోతున్నాయి. స్థానిక ప్రభుత్వాలతోనే పల్లెలు అభివృద్ధి చెందుతాయన్న బాపూజీ ఆలోచన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నెరవేరబోతోంది. పంచాయతీలకే అధికారాలు అప్పగిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం నేడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకోని పరిపాలనలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. గ్రామ పంచాయతీలకు బదలాయించిన 29 రకాల అధికారాలను పంచాయతీలే నిర్వహించుకునేలా గ్రామ సచివాలయ వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తరుŠువ్ల జారీ చేశారు. పనిలో పనిగా గ్రామ సచివాలయాల ఏర్పాటు, వాటి నిర్వహణకు సంబంధించిన విధి, విధానాలను కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయంలోనే పాలన... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరహాలోనే గ్రామ పంచాయతీల్లోనూ స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రభుత్వం ఏర్పాటు కావాలనే లక్ష్యంతో 1994 లో పార్లమెంట్లో అప్పటి కేంద్ర ప్రభుత్వం 73వ రాజ్యాంగ సవరణ చేశారు. దీనికి అనుగుణంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధీనంలో ఉన్న 13 శాఖలకు చెందిన 29 రకాల అధికారాలను స్థానిక పంచాయతీలకు బదలాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకోవడంతోపాటు 2007లోనే ఉత్తరుŠువ్ల కూడా జారీ చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం కూడా స్థానిక పాలనను అమలు చేసిన దాఖలాలు లేవు. స్థానిక పాలనను అమలు చేయాలని కోరుతూ అప్పట్లో సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో పలు పోరాటాలు, ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. పరిపాలనలో నూతన ఒరవడితోపాటు పేదల ఇంటివద్దకే సేవలు అనే నినాదంతో తొలి అడుగులేసిన సీఎం వెంటనే గ్రామ వాలంటీర్ల నియామకం చేపట్టారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ని నియమించి ప్రజల వద్దకే సత్వర సేవలు అనే విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ గ్రామ వలంటీర్లకు మొత్తం 56, 809 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 24వ తేదీ వరకు ఎంపిక ప్రక్రియ నిర్వహించన్నారు. ప్రస్తుతం కొన్ని మండలాల్లో ఎంపిక జాబితా కూడా పూర్తయ్యాయి. రెవెన్యూ గ్రామాల్లో సచివాలయాల ఏర్పాటు... జిల్లాలో 56 మండలాలు ఉండగా ఒంగోలు, కందుకూరు, మార్కాపురం డివిజన్లుగా పరిపాలన సాగుతోంది. వీటి పరిధిలో 1038 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటిలో మేజర్ పంచాయతీలు, మైనర్ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా మొత్తం మీద 33 లక్షల జనాభా ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలంటే జనాభా సంఖ్య ఆధారంగా చేయాల్సి ఉంది. రెండు వేలు జనాభా నుంచి నాలుగు వేల జనాభా మధ్య ఉండే గ్రామపంచాయతీలో ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు చేయాలని ఉత్తర్వుŠోల్ల పేర్కొన్నారు. వెయ్యి, పదిహేను వందలు, ఐదొందలు జనాభా కలిగిన గ్రామపంచాయతీలను ఒకటిగా చేసి ఒక గ్రామ సచివాలయంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో రెండు వేల కంటే తక్కువ జనాభా ఉన్నా ఒక గ్రామ సచివాలయం ఏర్పాటుకు వీలు కల్పించారు. పైగా రెవెన్యూ గ్రామంలోనే వీలున్నంత వరకు గ్రామ సచివాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలా జిల్లాలో 732 గ్రామ సచివాలయాలను గుర్తించారు. అయితే ప్రభుత్వం మళ్లీ ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాలను 912 గ్రామ సచివాలయాలకు ఎందుకు పెంచకూడదు అంటూ జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తరుŠువ్ల జారీ చేసింది. రెవెన్యూ విలేజ్‌కి గ్రామ పంచాయతీకి అనుసంధానం చేస్తూ గ్రామ సచివాలయాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ శారద ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదనలు పూర్తి చేసి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పంపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో అధికారులు మళ్లీ అటు వైపు కసరత్తు మొదలెట్టారు. దీంతో మళ్లీ జిల్లాలో గ్రామ సచివాలయాలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. గ్రామ సచివాలయంలో ఉద్యోగాల నియామకం: గ్రామ వాలంటీర్ల నియామకమే కాకుండా కొత్తగా ఏర్పాటయ్యే సచివాలయంలో వివిధ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. డిగ్రీ అర్హతగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. మొత్తం 91,652 ఉద్యోగాలు ఇవ్వాలనేది లక్ష్యం. ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా, వ్యయ ప్రయాసలు పడకుండా గ్రామ స్థాయిలోనే ప్రజల సమస్యలను తీర్చేందుకు సీఎం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్హం వ్యక్తమవుతోంది. అక్టోబర్ 2 నుంచి ఈ విధానం రాష్ట్రమంతటా ఒకే సారి అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సచివాలయ కన్వీనర్‌గా సెక్రటరీ: గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు గ్రామ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఉత్తర్వుŠోల్ల పేర్కొన్నారు. జీతాల చెల్లింపు కూడా కార్యదర్శి ద్వారానే నిర్వహిస్తారు. అయితే కార్యదర్శితో పాటు గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరికీ సెలవుల మంజూరు చేసే అధికారం సర్పంచ్‌కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
మహిళలను వేధిస్తే ఊర్లో ఉండనివ్వం..
వనపర్తి: చిన్నపిల్లలు, మహిళలను మానసికంగా, శారీరకంగా వేధిస్తే.. గ్రామంలో ఉండే అర్హత కోల్పోతారని వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామ పంచాయతీలో బుధవారం సర్పంచ్ పద్మమ్మ తీర్మానం చేశారు. ఇటీవల తరుచూ.. మహిళలు, చిన్నపిల్లలపై చోటు చేసుకుంటున్న వరుస సంఘటనల దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో తాడిపర్తిలో మహిళలకు అందించాల్సిన పౌష్టికాహారం, సామర్థ్యం అనే అంశంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి గ్రామంలోని మహిళలతో పాటు సర్పంచ్ పద్మమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు గురించి ప్రస్తావన వచ్చింది. గ్రామస్తులంతా ఒక్కతాటిపై ఉండి మన గ్రామంలో ఇలాంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా ముందస్తుగా కఠిన నిర్ణయాలు తీసుకుని అమలు చేయాలని ఆలోచించారు. వెంటనే ఉపసర్పంచ్ రామకృష్ణ, ఇతర వార్డుల సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రభుత్వ అధికారులను పిలిపించారు. చిన్న పిల్లలు, మహిళలపైగాని అత్యాచారానికి పాల్పడినా.. ప్రయత్నించినా.. అట్టి వారికి గ్రామంలో నివసించే స్థానం ఉండదని తీర్మానం చేశారు. ఈ రోజు నుంచే గ్రామ పంచాయతీ చేసిన ఈ తీర్మానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు, పక్కాగా అమలుచేస్తామని సర్పంచ్ ప్రకటించారు. మహిళలు, పెద్దలు, ఇతర గ్రామస్తులు పంచాయతీ చేసిన తీర్మానానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. గ్రామంలో ఉన్న ఐక్యతను చూసిన ఆర్డీఎస్ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ ప్రతిని«ధి శ్రీవాణి, అంగన్వాడీ కార్యకర్తలు, వీఆర్ఓ, ఎఎన్ఎం తదితరులు పాల్గొన్నారు. -
మాంసాహార విక్రయాలపై నియంత్రణేదీ..?
సాక్షి, ఆలేరు : ఆలేరులో మాంసాహర విక్రయాలపై అధికారుల నియంత్రణ కొరవడింది. గ్రామ పంచాయతీ, పశువైధ్యాధికారుల అనుమతి లేకుండానే మేకలు, గొర్రెలను వధిస్తున్నారు. మూగ జీవాలను కోసే ముందు సంబంధిత అధికారులు ఆమోద ముద్ర వేయాలి. ఆరోగ్యం ఉందని సర్టిఫై చేసిన తరువాతనే వధించాల్సి ఉంటుంది. అలాగే మాంసం కోసే వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఇవేమీ పట్టడం లేదు. ఆరోగ్యంగా లేని మేకలను, గొర్రెలను ఇండ్ల వద్ద వధిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మటన్‌ధర ప్రస్తుతం కేజీకి 550 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. కొందరు పొట్టేలు మాంసానికి బదులు మేక, గొర్రె మాంసాన్ని అంటగడుతున్నారని పలువురు వాపోతున్నారు. నిబంధనలు గాలికి.. మటన్ షాపులు రహదారి పక్కన మురికి కాల్వ పక్కన విక్రయిస్తున్నారు. మాంసం పై దుమ్ము ధూళి, ఈగలు వాలుతున్నాయి. మాంసాన్ని అమ్మే షాపులు పరిశుభ్రంగా ఉండాలి. నిల్వ చేసిన మాంసాన్ని అమ్మకూడదు. ఆహార పదార్థాలు..ప్రధానంగా మాంసాన్ని విక్రయించే షాపులకు అనుమతి ఉండాలి. మేకలను, గొర్రెలను వధించినప్పుడు వెలువడే వ్యర్థాలను నిర్ధేశిత ప్రాంతాలకు తరలించాలి. ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.. మాంసాన్ని ఫ్రిజ్‌లో ఉంచకుండా కొన్ని గంటల పాటు వేలాడదీస్తే వ్యాధి కారక క్రిములు చేరుతాయి. ఈ మాంసాన్ని తింటే అమీబియాసిస్, విరేచనాలు, ఈకొలై వల్ల సంక్రమించే వ్యాధులు సంభవిస్తాయి. ఈగలు ముసిరిన మాంసాన్ని తింటే టైపాయిడ్, గ్యాస్ట్రో, ఎంటరైటిన్ వ్యాధులు వస్తాయి. వీటితో పాటు విరేచనాలు అవుతాయి. అసంపూర్తిగా మడిగెలు.. మటన్ షాపుల నిర్వహణ కోసం ఆలేరు పట్టణంలో సుమారు 15సంవత్సరాల క్రితం మడిగెలు నిర్మించి అసంపూర్తిగా వదిలేశారు. వీటిని ఉపయోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పిల్లర్ల వరకు నిర్మించి వదిలేశారు. ప్రస్తుతం అసంపూర్తి మడిగెల్లో కంపచెట్లు పెరిగి, మూత్రశాలగా మారింది. వీటిని పూర్తి స్థాయిలో నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. -
తేలిన పంచాయతీ రిజర్వేషన్ల లెక్కలు
-
కొత్త పంచాయతీల్లోనూ రేషన్ షాపులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీల్లోనూ రేషన్ షాపులు ఏర్పాటు చేయా లని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. రేషన్ కార్డుల సంఖ్య ఆధారంగా షాపులను క్రమబద్ధీకరించాలనే నిర్ణయానికి వచ్చింది. దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. రేషన్ డీలర్ల సమస్యలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం ఈటల అధ్యక్షతన సమావేశమైంది. హైదరాబాద్‌లోని మంత్రి లక్ష్మా రెడ్డి ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ షాపుల ఏర్పాటు, రేషన్ డీలర్ల కమీషన్ పెంపుపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం క్వింటాల్ బియ్యానికి డీలర్లకు రూ.20 చెల్లిస్తున్నారని, ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్రం కమీషన్‌ను రూ.87కు పెంచిందని అకున్ స బర్వాల్ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో క్వింటాల్‌కు రూ. 250కి పైగా చెల్లిస్తున్నారని, డీలర్లు రూ.300 వరకు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. దీంతో డీలర్లు కోరిన మేర కమీషన్ పెంచి తే ఎంతభారం అవుతుందన్న దానిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం కోరింది. రూ.300 కమీషన్ ఇవ్వాలి రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు ఆధ్వర్యంలో డీలర్లు ఈటలను సచివాలయంలో కలిశారు. ఇతర రాష్ట్రాల కన్నా ఆదర్శంగా, గౌరవంగా డీలర్లకు క్వింటాల్‌పై రూ.300 కమీషన్ ఇవ్వాలని విన్నవించారు. -
బతికుండగానే చంపేశారు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి) : బతికుండగానే ఆ వృద్ధుడిని రికార్డుల్లో చంపేశారు. రూ.ఐదువేలు లంచం ఇవ్వనందు కే అధికారులు ఇంతపని చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లికి చెందిన జంగ మాధవరెడ్డి(80) వృద్ధుడు కొంతకాలంగా ఆసరా పెన్షన్ తీసుకుంటున్నాడు. అక్టోబర్ నుంచి పెన్షన్ జాబితాలో మాధవరెడ్డి పేరు తొలగించారు. ఎందుకు తొలగించారని అడిగితే బతి కున్నవారి జాబితాలో తనపేరు లేదని అం దుకే తొలగించారని అధికారులు సెలవిచ్చారని, పైఅ ధికారులకు రూ. ఐదువేలు లంచం ఇస్తే తిరిగి పెన్షన్ కొనసాగుతుందని అధికారులు కరాఖండిగా తేల్చారని బాదితుడు వాపోయాడు. తనకు భార్య పిల్లలు లేరని ప్రభుత్వం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో రూ.200 ఇచ్చారని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రూ. వెయ్యి ఇచ్చారని ఇప్పుడు లంచం ఇస్తేనే తిరిగి పింఛన్ ఇస్తామనడంతో ఆ వృద్ధుడు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చాడు. లంచం అడగలేదు.. పింఛన్ విషయమై ఎంపీడీవో సురేశ్‌ను ‘సాక్షి’ వి వరణ కోరగా గ్రామ పంచాయతీ వారు పంపిన జాబితాలో చనిపోయినట్లు పేర్కొనడంతో పింఛన్ నిలిపి వేశామని తానెవరిని లంచం అడగలేదన్నారు. కావాలనే నాపై ఆరోపణలు చేస్తున్నారని మాధవరెడ్డికి తిరిగి పింఛన్ కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా
నిర్మల్‌టౌన్ : గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో షెడ్యూల్ ప్రకారం నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కాంగ్రెస్ జిల్లా నాయకుడు వినాయక్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట మంగళవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడారు. తండాలను పంచాయతీలుగా చేసి, కొత్త పంచాయతీలకు రూ.50లక్షల ప్రత్యేక నిధులివ్వాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లుగా పంచాయతీలకు నిధులు, విధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. మన ఊరు–మన ప్రణాళిక, గ్రామజ్యోతి లాంటి పథకాలు ఆర్భాటంగా ప్రకటించినా వాటికి ఒక్క పైసా కూడా కేటాయించలేదన్నారు. నాయకులు సత్యం చంద్రకాంత్, అయిర నారాయణరెడ్డి, హైదర్, సంతోష్, పద్మాకర్, కూన శివకుమార్, జుట్టు దినేశ్, అజర్, జమాల్, నిర్మల, పోశెట్టి తదితరులున్నారు. -
ఇదేం లెక్క
అక్కన్నపేట(హుస్నాబాద్): అవి మూరుమూల గిరిజన తండాలు.. ఆపై కనీస సౌకర్యాలు లేవు. కొండల్లో, గుట్టల నడుమ ఉన్న తండాలపై ఇంత నిర్లక్ష్యమా!? అడవిలో నివసించేటోళ్లు అడవి లోనే ఉండాలా.. అని ఆ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఏ తండాకు వెళ్లాలన్నా కాళ్లు తడవాల్సిన పరిస్థితి. అక్కన్నపేట మండల కేంద్రానికి నాలుగు కిలో మీట ర్ల దూరంలోని బోదరవాగు తండా, చౌడు తండా, మంగ్యానాయక్ తండాలు నేటికి కనీస సౌకర్యాలు లేక దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ మూడు తండాల్లో దాదాపు 450కి పైగా జనాభా ఉంటుంది. కానీ ఈ తండాలు మండలం పరిధిలోనే లేవన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. తమ తం డాలన్నీ కలుపుకొని గ్రామ పంచాయతీ గా మార్చాలని పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా తండాలను గ్రామ పం చాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్ర భుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. చెరువులు, కొండలు, గుట్ట లు, వాగులు ఉన్న తండాల్లో 300 నుంచి 400 వరకు జనాభా ఉంటే గ్రామపంచా యతీగా గుర్తించవచ్చని ప్రభుత్వం చెబు తోంది. కానీ ఆ తండాలను గుర్తించడం అటుంచి కనీసం ఆ వైపు కన్నెత్తి చూసే వారు లేక కనీస సౌకర్యాలు కరువై గిరి జనులు నరకయాతన పడుతున్నారు. ప్రతిపాదనలో కేశనాయక్ తండా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు కానున్న కేశనాయక్ తండాలో బోదర్ వాగు తండా, చౌడు తండా, మంగ్యానాయక్ తండాలను కలిపితే చెరువుదాటి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మండల కేంద్రంలో కొనసాగిస్తే వాగు దాటి రావాల్సి ఉంది. గిరిజనులు ఏటు వెళ్లాలన్నా వాగైనా, చెరువైనా దాటాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకే పంచాయతీ పరిధిలో మూడింటికి ప్రతిపాదనలు హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వంగరామయ్యపల్లి, బల్లునాయక్ తండా, పూల్నాయక్ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపిచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవి గ్రామ పంచాయతీకి అర కిలో మీటర్ దూరంలో మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్నాయి. ఒకే గ్రామ పంచాయతీ పరిధిలో మూడు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేయడం రాజకీయ నాయకుల కనుసన్నల్లోనే కొనసాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి హరీశ్‌రావు తమ తండాలపై దృష్టిసారించి కనీస సౌకర్యాల కల్పనతోపాటు గ్రామ పంచాయతీ ఏర్పాటు గురించి ఆలోచించాలని గిరిజనులు కోరుతున్నారు. పంచాయతీలుగా గుర్తించాలి బోదరవాగు తం డా, చౌడు తండా, మంగ్యానాయక్ తండాలవాసులు ఎటు వెళ్లాలన్నా చెరువైనా, వాగైనా దాటాల్సిన పరి స్థితి. ఆ తండాల చుట్టూ వాగు లు ఉన్నాయి. నేటికీ రోడ్డు, తాగునీటి సౌకర్యాలు లేవు. ఈ మూడు తండాలను కలిపి గ్రామపంచాయతీగా గు ర్తించాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఆం దోళనకు దిగుతాం. –బీమాసాహెబ్, గిరిజన జేఏసీ చైర్మన్ -
పురుషాధిక్యం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో పక్కా ఓటర్ల జాబితా ఖరారయ్యింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం ఓటర్ల తుదిజాబితాను జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. జాబితాను అన్ని గ్రామపంచాయతీలు, పోలింగ్‌బూత్‌లు, తహశీల్దారు కార్యాలయాలు, పోలీసు స్టేషన్లలో ప్రచురించిన నేపథ్యంలో ఓటరు లిస్టులో ఎవరి పేర్లున్నాయా లేదో సరిచూసుకోవచ్చు. ఈ జాబితా ప్రకారమే సాధారణ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించనున్నా రు. జిల్లా యంత్రాంగం రూపొందించిన ఈ జాబితాను ఎన్నికల సంఘానికి నివేదించా రు. దీని ప్రకారం జిల్లాలో ప్రస్తుతం 27,43,655 మంది ఓటర్లున్నారు. 2013 నవంబర్ 18 నాటి ముసాయిదా ఓటర్ల జాబితా నాటికి జిల్లాలో 2,64,0264 మంది ఓటర్లుండగా అనంతరం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియలో 1,03,431 మంది అర్హులు జాబితాలో చేరారు. జనాభాప్రకారం 67శాతం ఓటర్ల నిష్పత్తికి అనుగుణంగా ఓటర్ల జాబితాను తయారు చే శారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నా ఫిబ్రవరి 15 వరకు నమోదయ్యే ఓటర్లకు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. తుదిజాబితా ప్రకారం తుదిజాబితా ప్రకారం జిల్లాలో పురుష ఓటర్లే ఎక్కువగా ఉన్నా కొత్తగా చేరిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 6,999 ఎక్కువ మంది నమోదయ్యారు. గతేడాది నవంబర్ 18 నాటి ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 3,88,0041 మంది జనాభా ఉన్నారు. అందులో మహిళలు 19,47,556 మంది ఉండగా పురుషులు 19,32,485 మంది. అందులో పురుష ఓటర్లు 13,29,067, మహిళా ఓటర్లు 13,11,157 మంది ఉన్నారు. అనంతరం అదే తేదీ నాటి నుంచి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాయంత్రాంగం ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. గతేడాది నవంబర్ 18 నుంచి డిసెంబర్ 23 వరకు ఓటరు నమోదు ప్రక్రియలో సమర్పించిన దరఖాస్తుల్లో ఆక్షేపణలు, మార్పులు, చేర్పులను మొత్తంగా 1.64 లక్షల మంది నుంచి స్వీకరించారు. అందులో అధికార యంత్రాంగం నివేదిక ప్రకారం ఓటు కోసం నమోదు చేసుకున్నవారిలో 1,47,497 మంది ఉన్నారు. అందులో పరిశీలన, విచారణ అనంతరం రెండు చోట్ల ఓటు నమోదైనవారితో పాటు మొత్తంగా 44066 మంది తిరస్కరణకు గురయ్యారు. కొత్తగా నమోదు చేసుకున్నవారిలో 1,03,431 మంది అర్హులుగా గుర్తించారు. 18-19 ఏళ్ల వయస్సు గల యువకులు కొత్తగా 72,086 మంది నమోదయ్యారు. ఇందులో యువకులు 44,582, యువతులు 27,504 మంది కొత్తగా నమోదయ్యారు. తుది జాబితా ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య 27,43,655 మందికి చేరింది. అందులో మహిళా ఓటర్లు 13,67,372, పురుషులు 13,77283 మంది ఉన్నారు. వచ్చే ఎన్నికల కోసం జిల్లాలో 3393 పోలింగ్ బూత్‌ల ఏర్పాటును ఖరారు చేసారు. -
పంచాయతీలను తీర్చిదిద్దాలి: నాగిరెడ్డి
ఇందూరు, న్యూస్‌లైన్: నిర్దిష్ట ప్రణాళికతో గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దాలని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి, సమస్య అనేదే లేకుండా పద్ధతి ప్రకారం నిధులు ఖర్చు చేయాలన్నారు. బుధవారం నిజామాబాద్‌లో ‘మెరుగైన స దుపాయాల కల్పన దిశలో గ్రామ పంచాయతీలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లాల డీపీఓలు, జడ్పీ సీఈఓలు, డీఎల్పీఓలు, ఈఓపీఆర్డీ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో నిర్దిష్ట ప్రణాళికలు లేకపోవడంతో సమస్యలను పరిష్కరించడం, సౌకర్యాలను కల్పించడం సాధ్యం కావడం లేదన్నారు. నిధులు ఎన్ని అవసరం అవుతున్నాయో కూడా తెలియడం లేదన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కావాలి? వాటికి ఎన్ని నిధులు ఖర్చవుతాయి? తెలిపే విధంగా సర్పంచుల సహాయంతో వార్షిక, పంచవర్ష ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను అదేశించారు. ఈ ప్రణాళికల ఆధారంగా పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. నిర్ణీత కాల వ్యవధిలో ప్రజలకు సౌకర్యాలు సమకూరుతాయన్నారు. 50 రకాల విధులు, అధికారాలు పం చాయతీలకు ఉన్నాయని, వాటిని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. ప్రతి పంచాయతీ పరిధిలో వ్యాపారాలు జరుగుతున్నా, ప్రకటనలు ఇస్తున్నా, వాటికి పన్నులు వసూలు చేయడం లేదని, ఇక పై అన్ని పన్నులు పక్కాగా వసూలు చేయించాల ని సూచించారు. విద్య, ఆరోగ్యం, ఇతర పనులన్నీ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉంటాయని, చేసే ప్రతి పనికి తీర్మానం తప్పని సరిగా ఉండాలన్నారు. మున్సిపల్ శాఖలాగే, పంచాయతీరాజ్ శాఖ పని చేస్తుందన్నారు. పౌర సేవలు మెరుగుపడతాయి గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడం ద్వారా పౌర సేవలు మెరుగు పడతాయని పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ అన్నారు. పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, రహదారులు, మురుగు కాలువలు, ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు, వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి ప్రతి జిల్లాలో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.ఇందుకు ఒక మండలాన్ని పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, మండలంలోని పలు గ్రామాలను గుర్తించి సందర్శిస్తున్నామని తెలి పారు. నిజామాబాద్ జిల్లాలో జక్రాన్‌పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు. గ్రామంలోని ప్రజలకు ఎలాం టి సౌకర్యాలు కావాలో అడిగి తెలుసుకుంటామని, అలాగే ఆదాయ వనరులను సమకూర్చుకోవడం ఎలాగో కూడా తెలియజేస్తామన్నారు. 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్, బీఆర్జీఎఫ్ ద్వారా పంచాయతీలకు మం జూరవుతున్న నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. గుర్తించిన పనులకు అయ్యే ఖర్చుకు ప్రతి పైసా లెక్క ఉంటుందన్నారు. పంచాయ తీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి క్లస్టర్‌కు, పంచాయతీకి కార్యదర్శి ఉం టాడని తెలిపారు. కొందరికి పదోన్నతులు కూడా ఇవ్వనున్నామని వెల్లడించారు. సదస్సులో నిజామాబాద్ కలెక్టర్ ప్రద్యుమ్న తది తరులు పాల్గొన్నారు. -
రెండున్నర కోట్లతో అభివృద్ధి
జక్రాన్‌పల్లి, న్యూస్‌లైన్: ప్రభుత్వ నిధులు, గ్రామ పంచాయతీ భాగస్వామ్యంలో రూ. రెండున్నర కోట్ల రూపాయల నిధులతో జక్రాన్‌పల్లి మండలంలోని బ్రా హ్మణ్పల్లి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చే స్తామని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యద ర్శి నాగిరెడ్డి తెలిపారు. పెలైట్ ప్రాజెక్టుగా ఎంపికైన ఈ గ్రామాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రా మసభలో ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ముందుగా ఐదేళ్ల ప్ర ణాళిక తయారు చేసుకోవాలన్నారు. 22 రకాల ఆదాయ వనరులను సమకూర్చుకోవచ్చన్నా రు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలన్నా రు. పంచాయతీరాజ్ కమిషనర్ డి వరప్రసాద్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అమలు చేస్తామన్నారు. గ్రామానికి అవసరాలు ఏమిటి, నిధు లు ఎలా సమకూర్చుకోవాలి, ప్రభుత్వ నిధు లు, వివిధ శాఖల ద్వారా ఏ మేరకు నిధుల వ స్తాయి, పన్నుల ద్వారా ఎంత ఆదాయం ఉం టుంది? అనే అంశాలను అధ్యయనం చేశారు. రూపేణ ఎన్ని నిధుల వస్తాయి అనే అంశాలపై అధికారులు అధ్యయనం చేశారు. ఐదేళ్లలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దవచ్చు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ ప్రభుత్వ గ్రాంట్లతోపాటు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో ఐదేళ్లలో గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దవచ్చన్నారు. ఈ ప్రాజెక్టును అధికారులు, గ్రామస్తులు సమన్వయంతో కృషి చేసి విజయవంతం చేయాలన్నారు. గ్రామంలో సమస్యలన్నింటిని పరిష్కరించి, అభివృద్ధి పనులు చేపట్టా లంటే రూ.2కోట్ల 51లక్షల 25వేల నిధులు అవసరమవుతాయని అధికారులు గుర్తించారు. వివిధ శాఖల ద్వారా రూ. ఒక కోటి 51 లక్షల 55వేలు నిధులు వస్తాయన్నారు. రూ.32.75లక్షలు ప్రభుత్వం నుంచి వస్తాయన్నారు. ఇంకా రూ.24.95లక్షలు గ్రామ పంచాయతీయే సమకూర్చుకోవాలన్నారు. సుమారు రెండున్నర కోట్ల నిధులతో విడత లవారీగా అభివృద్ధి పనులు చేపట్టడానికి ఐదేళ్ల ప్రణాళికను తయారు చేశారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పది శాతం నిధులు సమకూర్చడానికి తమకు అభ్యంతరం లేదని గ్రామస్థులు అధికారులకు విన్నవించారు. సర్పంచ్ గాండ్ల భూమిక అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఉపసర్పంచ్ గాండ్ల శేఖర్, జడ్పీ సీఈఓ రాజారాం, డీపీఓ సురేష్‌బాబు, ఎంపీడీఓ పీవీ శ్రీనివాస్, తహశీల్దార్ అనిల్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘ఈ-పంచాయతీ’ ఉత్తమాటేనా?
మోర్తాడ్, న్యూస్‌లైన్ : సాంకేతిక విప్లవంతో పల్లెసీమలను అభివృద్ధి పథంలో నడపడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఆచరణలో విఫలమవుతున్నాయి. గ్రామపంచాయతీలు పురోగతికి దూరంగానే ఉంటున్నాయి. పంచాయతీల ఆదాయ, వ్యయాలు, ఇతర నిధులు, అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయడానికి ఉద్దేశించిన పంచాయతీరాజ్ ఇనిస్ట్యూషన్స్ అకౌంటింగ్(ప్రియా) సాఫ్ట్వేర్ ఉత్తదే కానుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ వినియోగిస్తూ ఈ-పంచాయతీలుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇంతవరకు ఆచరణ సాధ్యం కావడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం, స్థానికంగా అవగాహన లేకపోవడంతో చాలా గ్రామాల్లో కంప్యూటర్లు ఉత్తవిగానే ఉంటున్నాయి. పలు పంచాయతీల సిబ్బంది ప్రైవేటు ఇంటర్నెట్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో.. జిల్లాలోని 718 పంచాయతీలకు గానూ 74పంచాయతీలను ఈ-పంచాయతీలుగా మార్చారు. వీటికి అవసరమైన కంప్యూటర్లను కొనుగోలు చేసి, బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ల ద్వారా ఆన్లైన్ కనెక్షన్లను తీసుకున్నారు. ఇందులో చాలా పంచాయతీలు టెలిఫోన్ బిల్లును చెల్లించక పోవడంతో ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ప్రియా సాఫ్ట్‌వేర్‌లో పంచాయతీ సమాచారాన్ని అప్లోడ్ చేయడానికి కార్యదర్శులు ప్రైవేటు కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లు, ఇంటర్ నెట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రియా సాఫ్ట్‌వేర్‌లో పంచాయతీ సమాచారాన్ని ఏరోజుకు ఆరోజు ఆన్లైన్లో ఉంచాలి. జిల్లాలోని 74 ఈ-పంచాయతీలలో కేవలం 20 పంచాయతీలలో మాత్రమే కంప్యూటర్లు పని చేస్తున్నాయి. ఇక్కడ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సమాచారాన్ని అప్లోడ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో సాంకేతిక విప్లవం తీసుకరావాలన్న ప్రభుత్వ ఆలోచన మంచిదైనా ఆచరణలో విఫలమవుతుండటంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ‘నూతన’ పాలకవర్గాలైనా.. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికైన సర్పం చ్లలో చాలామంది విద్యావంతులు, యువకులు ఉ న్నారు. వీరైనా ఈ-పంచాయతీల అమలును పకడ్బం దీగా చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు ఆశిస్తున్నా రు. పంచాయతీ నిధుల నుంచి కంప్యూటర్లను కొనుగోలు చేసి, మిగతా పంచాయతీలలో కూడా ప్రియా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలని కోరుతున్నారు. కొత్తగా కొలువుదీరిన పాలకవర్గాలు పంచాయతీల్లో కొత్తదనం తీసుకువస్తారన్న ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.