కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో పక్కా ఓటర్ల జాబితా ఖరారయ్యింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం ఓటర్ల తుదిజాబితాను జిల్లా యంత్రాంగం విడుదల చేసింది. జాబితాను అన్ని గ్రామపంచాయతీలు, పోలింగ్‌బూత్‌లు, తహశీల్దారు కార్యాలయాలు, పోలీసు స్టేషన్లలో ప్రచురించిన నేపథ్యంలో ఓటరు లిస్టులో ఎవరి పేర్లున్నాయా లేదో సరిచూసుకోవచ్చు. ఈ జాబితా ప్రకారమే సాధారణ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించనున్నా రు. జిల్లా యంత్రాంగం రూపొందించిన ఈ జాబితాను ఎన్నికల సంఘానికి నివేదించా రు. దీని ప్రకారం జిల్లాలో ప్రస్తుతం 27,43,655 మంది ఓటర్లున్నారు. 2013 నవంబర్ 18 నాటి ముసాయిదా ఓటర్ల జాబితా నాటికి జిల్లాలో 2,64,0264 మంది ఓటర్లుండగా అనంతరం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియలో 1,03,431 మంది అర్హులు జాబితాలో చేరారు. జనాభాప్రకారం 67శాతం ఓటర్ల నిష్పత్తికి అనుగుణంగా ఓటర్ల జాబితాను తయారు చే శారు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నా ఫిబ్రవరి 15 వరకు నమోదయ్యే ఓటర్లకు ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు.
తుదిజాబితా ప్రకారం
తుదిజాబితా ప్రకారం జిల్లాలో పురుష ఓటర్లే ఎక్కువగా ఉన్నా కొత్తగా చేరిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 6,999 ఎక్కువ మంది నమోదయ్యారు. గతేడాది నవంబర్ 18 నాటి ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 3,88,0041 మంది జనాభా ఉన్నారు. అందులో మహిళలు 19,47,556 మంది ఉండగా పురుషులు 19,32,485 మంది. అందులో పురుష ఓటర్లు 13,29,067, మహిళా ఓటర్లు 13,11,157 మంది ఉన్నారు. అనంతరం అదే తేదీ నాటి నుంచి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాయంత్రాంగం ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. గతేడాది నవంబర్ 18 నుంచి డిసెంబర్ 23 వరకు ఓటరు నమోదు ప్రక్రియలో సమర్పించిన దరఖాస్తుల్లో ఆక్షేపణలు, మార్పులు, చేర్పులను మొత్తంగా 1.64 లక్షల మంది నుంచి స్వీకరించారు. అందులో అధికార యంత్రాంగం నివేదిక ప్రకారం ఓటు కోసం నమోదు చేసుకున్నవారిలో 1,47,497 మంది ఉన్నారు.
అందులో పరిశీలన, విచారణ అనంతరం రెండు చోట్ల ఓటు నమోదైనవారితో పాటు మొత్తంగా 44066 మంది తిరస్కరణకు గురయ్యారు. కొత్తగా నమోదు చేసుకున్నవారిలో 1,03,431 మంది అర్హులుగా గుర్తించారు. 18-19 ఏళ్ల వయస్సు గల యువకులు కొత్తగా 72,086 మంది నమోదయ్యారు. ఇందులో యువకులు 44,582, యువతులు 27,504 మంది కొత్తగా నమోదయ్యారు. తుది జాబితా ప్రకారం జిల్లాలో ఓటర్ల సంఖ్య 27,43,655 మందికి చేరింది. అందులో మహిళా ఓటర్లు 13,67,372, పురుషులు 13,77283 మంది ఉన్నారు. వచ్చే ఎన్నికల కోసం జిల్లాలో 3393 పోలింగ్ బూత్‌ల ఏర్పాటును ఖరారు చేసారు.
పురుషాధిక్యం
Published Sat, Feb 1 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement
Advertisement