list of voters
-
రామోజీ... కళ్లు కనిపించడం లేదా? మేం బతికే ఉన్నాం
ఉన్నవి లేనట్టు... లేనివి ఉన్నట్టు పచ్చ పత్రిక అడ్డగోలు రాతలతో భ్రమింపజేస్తోంది. ఓటర్ల జాబితాలో ఉన్నవారు చనిపోయినట్టు చిత్రీకరిస్తోంది. ఓటర్ల జాబితా అంతా తప్పుల తడకలేనని నిర్ధారించేస్తోంది. ఎలాగోలా చంద్రబాబునాయుడును గద్దెనెక్కించడమే తమ లక్ష్యంగా దిగువస్థాయి నుంచి రామోజీ వరకూ అడ్డగోలు రాతలతో జనాన్ని తప్పుదారి పట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, తప్పులు లేని ఓటర్ జాబితా తయారు చేసింది. – సాక్షి, నంద్యాల అక్రమాలకు తెరతీసిన టీడీపీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఓటర్ల అక్రమాలకు తెరలేపారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ సాయంతో గంపగుత్తంగా ఓటు హక్కు కోసం ఫారం–6లు నమోదు చేశారు. ఓటర్ జాబితాలో అనర్హులను తొలగించాలంటూ పెద్ద ఎత్తున ఫారం–7లను బూత్ స్థాయి అధికారులకు, ఎలక్ట్రోరల్ రిజి్రస్టేషన్ అధికారుల కార్యాలయాల్లో అందజేశారు. దురుద్దేశంతో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్వచ్ఛమైన తుది ఓటరు జాబితా రూపొందించారు. అయితే ఈనాడు మాత్రం తప్పుడు రాతలు రాస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతూ విషం కక్కుతోంది. పచ్చ పత్రిక పిచ్చి రాతలు పాణ్యం: పచ్చ పత్రిక విషపూరిత రాతలతో జనాన్ని పిచ్చెక్కిస్తోంది. లేనిపోని రాతలతో తప్పుదారి పట్టిస్తోంది. పాణ్యం నియోజకవర్గంలోని 131వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఆర్.జయరామ్, అతని భార్య ఆర్.రేణుకలకు ఓటు హక్కు ఉంది. వీరు అద్దె ఇంట్లో ఉండేవారు. ఆ తర్వాత సొంతింట్లోకి మారిన తర్వాత ఆర్.జయరామ్ మరణించారు. 131 బూత్‌లో ఉన్న ఓటు హక్కును రద్దు చేయాలని ఆర్.రేణుక ఫారం–7 ద్వారా అభ్యర్థించారు. పరిశీలించిన బీఎల్ఓలు ఆమె ఓటు(ఎన్‌కేడీ నంబర్ 2458899)ను జాబితా నుంచి తొలగించారు. ప్రస్తుతం 130 పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు నమోదైంది. అయితే భర్తతో పాటు భార్యకు కూడా 131లో ఓటు హక్కు తొలగించారని రాశారు. వాస్తవానికి ఆమె అభీష్టం మేరకే 131 బూత్‌లో భర్త ఓటు తొలగించి ఆమె ఓటును మార్చడం గమనార్హం. -
ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిదిద్దండి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాల్లో అవకతవకలను సరిదిద్ది, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న తెలుగుదేశం పార్టీపై తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లకు వైఎస్సార్సీపీ వినతిపత్రాలు సమర్పించింది. వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పేర్ని నాని శనివారం కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబుకు, పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆ జిల్లా కలెక్టర్ గిరిషాను కలిసి ఈమేరకు వినతిపత్రాలు సమర్పించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని, శాంతిభధ్రతలకు విఘాతం కలిగిస్తోందని తెలిపారు. టీడీపీ యాప్‌లో వ్యక్తిగత సమాచారాన్ని ఉంచుతూ యాప్ జనరేట్ అయ్యే ఓటీపీని సైతం అడుగుతున్నారని, ఇవ్వకపోతే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆధారాలను కూడా సమర్పించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్లను కోరారు. టీడీపీ యాప్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం : గడికోట ఓట్ల పరిశీలన ముసుగులో టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రజల వ్యక్తిగత స్వేఛ్చను హరించేలా సేకరణ చేయడం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ యాప్‌లో సమాచారం పొందుపరిచే మిషతో టెలిఫోన్ నంబర్ తీసుకుని ఓటీపీ కూడా అడుగుతున్నారని తెలిపారు. ఓటీపీ, వ్యక్తిగత సమాచారం ఇవ్వని వారిపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు. కలెక్టర్ దృష్టికి రాజంపేట ఉదంతం రాజంపేట నియోజకవర్గంలో ఇలా సమాచారం ఇవ్వని ఓ ఇంట్లోని వారిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగిన ఉదంతాన్ని కలెక్టర్ దృష్టికి శ్రీకాంత్‌రెడ్డి తీసుకువెళ్లారు. బాబు భరోసా, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాల కింద సమాచారం అడిగారని, 2024లో టీడీపీ ప్రభుత్వం వస్తోందంటూ ప్రజలను మభ్యపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించకుండా చూడటంతో పాటు దౌర్జన్యాలను అరికట్టాలని ,ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కలెక్టర్‌ను శ్రీకాంత్ రెడ్డి కోరారు. 2019కి ముందు నుంచే బోగస్ ఓట్లు : పేర్ని నాని 2019కి ముందు నుంచే ఒకే డోర్ నెంబర్ లో 50 నుంచి 100 ఓట్ల వరకు ఉన్నాయని పేర్ని నాని సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. అలా గే కొందరు ఏపిలో, తెలంగాణలో రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నారని వివరించారు. మరి కొందరికి మున్సిపల్ ఏరియాలో, గ్రామంలో వేర్వేరు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని, ఆ చిరునామాల్లో ఉంటున్న వారిని అడగ్గా వారికీ విషయం తెలియదని చెబుతున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఇలా ఉద్దేశపూర్వకంగా దొంగ ఓట్లు చేర్చారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత ఇలాంటి అవకతవకలు, బోగ స్ ఓట్లపై ఎన్నికల రాష్ట్ర ప్రధాన అధికారికి ఫిర్యా దు చేశామని తెలిపారు. తుది జాబితా విడుదలకు ముందు ఇలాంటి బోగస్, అక్రమ ఓట్లపై విచార ణ జరిపి ప్రజాస్వామ్యయుతంగా అర్హులైన ప్రతి ఓటరుకూ ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో జిల్లా కలెక్టర్‌ను కోరారు. -
‘ఈనాడు’ది ఉత్త ‘కథే’
సీతమ్మధార (విశాఖ ఉత్తర): అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుంది విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలపై ఈనాడు రాసిన ‘కథ’. టీడీపీ నేతగా వ్యవహరిస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఓటర్ల జాబితాపై అడ్డగోలు ఆరోపణలు చేయగా.. వాటి ఆధారంగా ఒకే చిరునామాలో పదుల సంఖ్యలో ఓట్లున్నాయంటూ ‘విశాఖ ఉత్తరంలో ఓట్ల మాయ’ పేరుతో ఈనాడులో శుక్రవారం కథనం అచ్చేసింది. ఈ ఆరోపణలు అవాస్తవాలని నెడ్‌క్యాప్ చైర్మన్, వైఎస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు క్షేత్రస్థాయిలో నిరూపించారు. కేకే రాజు ఓటర్ల జాబితా పట్టుకొని ఈనాడులో రాసిన బాలయ్యశాస్త్రి లేఅవుట్లోని 49–54–8 నంబర్ ఇంటికి వెళ్లారు. అక్కడ యజమానితో మాట్లాడగా 2 ఓట్లు మాత్రమే ఉన్నట్లు తేలింది. గతంలో ఈ ఇంట్లో రెండు ఓట్లు ఉండగా, జాబితాలో ఒకే ఓటు ఉందని, మరో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు రాజు చెప్పారు. అదేవిధంగా 49–54–8/1 ఒక అపార్ట్మెంట్, 8/2లో మరో అపార్ట్మెంట్ ఉన్నాయన్నారు. వాటిలో ఒకటి శిథిలమైపోవడంతో కూలగొట్టి మళ్లీ కడుతున్నారని, ఈ అపార్ట్‌మెంట్స్‌లో మొత్తం 27 ఓట్లే ఉన్నాయని తెలిపారు. ఇక్కడ లేని వారు చిరునామా మార్చుకోవాలని బీఎల్వోలు ఇప్పటికే నోటీసులిచ్చినట్లు చెప్పారు. వాస్తవాలిలా ఉంటే.. టీడీపీ, బీజేపీ నేతలు, విష పత్రిక ఈనాడు నిరాధార కథనాలు రాయడం సిగ్గు చేటని కేకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.2019 ఎన్నికల్లో టీడీపీ నేతలే ఇష్టం వచ్చినట్లుగా ఓట్లని చేర్పించేశారన్నారు. 2019లో ఉత్తర నియోజకవర్గంలో దాదాపు 2.80 లక్షల ఓట్లు ఉన్నాయని తెలిపారు. కొత్తగా 60 వేల ఓట్లు చేర్పించామంటూ విష్ణుకుమార్ రాజు, గంటా ఆరోపిస్తున్నారని, ఇన్ని చేర్పిస్తే 3 లక్షల పైచిలుకు ఓట్లు ఉంటాయన్నారు. కానీ.. ప్రస్తుత ముసాయిదాలో 2.70 లక్షల ఓట్లే ఉన్నాయని చెప్పారు. 2019లో 72 రోజుల్లోనే టీడీపీ ఇక్కడ వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్పించిందని తెలిపారు. ఇప్పుడు వాటన్నింటినీ తొలగిస్తుంటే ఓడిపోతారన్న భయంతో అడ్డగోలు ఫిర్యాదులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాయని తెలిపారు. -
ఓటర్ల జాబితాలో మార్పులపై అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటర్ల జాబితాలో మార్పులపై వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఓటర్ల జాబితాలకు సంబంధించి 175 నియోజకవర్గాల పార్టీ నేతలకు మంగళవారం తాడేపల్లిలో వర్క్‌షాప్ నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలపై పార్టీ శ్రేణులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని, ఓటర్ల చేర్పులు, ఇతర మార్పులను నిశితంగా పరిశీలించాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు ఉండేలా చూసి, వారి మద్దతు పొందాలని తెలిపారు. అనర్హులను గుర్తించడానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక యంత్రాంగం పనిచేస్తోందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే వారిని నియమించుకుని బూత్ లెవెల్ నుంచి ఓటర్ల జాబితాలను పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల సంఖ్య నుంచి ఇటీవల జరిగిన మార్పుల వరకు సరిచూసుకోవాలని సూచించారు. జేసీఎస్ కోఆరి్డనేటర్లు, గృహసారథులు, పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారం నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ అవసరమని చెప్పారు. మనం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు లాంటి మారీచులతో పోరాడుతున్నామని గుర్తుంచుకొని పనిచేయాలన్నారు. ఓటర్లకు సంబంధించి టీడీపీనే అక్రమాలకు పాల్పడుతూ, ఆ పార్టీ నేతలు ఎదురు మనపైనే ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. పచ్చ మీడియా, టీడీపీ కలిసి వైఎస్సార్సీపీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి, ఓటర్లు ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నాలుగున్నరేళ్లుగా అమలు చేస్తున్న పథకాలతో మరోసారి వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం ఖాయమని చెప్పారు. ప్రజలంతా వైఎస్సార్సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పాజిటివ్ ఓటుతో పాటు మరింత మంది వైఎస్ జగన్ నాయకత్వాన్ని బల పరుస్తున్నారని తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో తుమ్మల లోకేశ్వరరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతల సందేహాలను నివృత్తి చేశారు. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, శాసన మండలిలో ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి, జేసీఎస్ రాష్ట్ర కోఆరి్డనేటర్లు పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఉప ఎన్నికలకు కసరత్తు
సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో ఉప ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాల వివరాల సేకరణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కేఈఆర్బీహెచ్ఎన్ చక్రవర్తి సోమవారం పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. మున్సిపల్ శాఖ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరయ్యారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిలిచిపోయినవి కాకుండా 2021లో ఎన్నికలు జరిగి, గెలిచిన అభ్యర్థుల మరణం, రాజీనామాల కారణంగా ప్రస్తుతం ఐదు జెడ్పీటీసీ, 102 ఎంపీటీసీ, 53 సర్పంచి, 770 వార్డు సభ్యుల పదవులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఇదే తరహాలో పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి 11 డివిజన్ కార్పొరేటర్, నాలుగు వార్డు కౌన్సిలర్ పదవులు ఖాళీగా ఉన్నట్లు నిర్ధారించారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 945 స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమని గుర్తించారు. మరోవైపు ఒక మున్సిపల్ చైర్మన్, ఏడు ఎంపీపీ, తొమ్మిది వైస్ ఎంపీపీ, ఐదు కో–ఆప్షన్ సభ్యుల పదవులకు కూడా పరోక్ష పద్ధతిలో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని తేల్చారు. కొత్త ఓటర్ల జాబితాలతోనే... కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహిస్తోంది. జనవరిలో కొత్త ఓటర్ల జాబితాలు విడుదల చేసే అవకాశం ఉంది. ఆ జాబితాల ప్రకారమే స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. -
యువ ఓటర్లే లక్ష్యం
సాక్షి, అమరావతి: అర్హులైన యువతను ఓటర్లుగా నమోదు చేయడమే లక్ష్యంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన అనంతరం బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఓటరు నమోదుపై కళాశాల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.ఢిల్లీరావుతో కలసి పాల్గొన్నారు. బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ యువతతో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రంలో 18 – 19 ఏళ్ల వయసున్న యువత 12 లక్షల వరకు ఉండగా ముసాయిదా ఓటర్ల జాబితాలో 78 వేల మంది మాత్రమే ఉన్నారని ముఖేష్‌కుమార్ మీనా చెప్పారు. ఈ వయసు వారిలో 10 – 11 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యేలా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు చొప్పున ప్రత్యేకంగా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌ను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిందని, ఈ ప్రక్రియ సోమవారం నాటికి పూర్తవుతుందన్నారు. ► ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,98,54,093 కాగా ఇందులో అత్యధికంగా 2,01,34,621 మంది మహిళా ఓటర్లున్నారు. 1,97,15,614 మంది పురుష ఓటర్లు, 3,858 మంది ధర్డ్ జెండర్ ఓటర్లున్నారు. కాగా ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,07,36,000 మంది ఓటర్లు ఉన్నారు. మృతులు, మరో ఊరికి వెళ్లిన వారు, డూప్లికేట్ ఓట్లు కలిపి మొత్తం దాదాపు 8.82 లక్షల ఓట్లను తొలగించారు. ► ఓటర్లుగా నమోదు, అభ్యంతరాలు సమర్పించేందుకు ప్రత్యేక సవరణలో భాగంగా డిసెంబర్ 8వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. సీఈవో వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరిశీలన పూర్తి చేసిన తరువాత వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు నవంబరు 19, 20, డిసెంబర్ 3, 4వ తేదీల్లో పోలింగ్ కేంద్రాల స్థాయిలో ప్రత్యేక క్యాంపెయిన్లను నిర్వహిస్తారు. ► ప్రస్తుతం 17 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ, జూలై 1వ తేదీ, అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదుకు ఫామ్–6 ద్వారా ముందుగానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ► డూప్లికేట్ పేర్లను గుర్తించే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో రాష్ట్రంలో 25 లక్షల పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పంపింది. దీని ప్రకారం క్షేత్రస్థాయిలో తనిఖీల అనంతరం డూప్లికేట్ పేర్లను ఫొటోలతో సహా గుర్తించి 10,52,326 ఎంట్రీలను తొలగించారు. ఫలితంగా ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన జాబితాతో పోలిస్తే ముసాయిదాలో 8.82 లక్షల మంది ఓటర్లు తగ్గారు. ► ఇళ్లు లేని వారు, ఫుట్‌పాత్‌లపై నివసించే నిరాశ్రయులను సైతం ఓటర్లుగా నమోదు చేసేందుకు ఇంటి చిరునామా ధ్రువీకరణ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం మినహాయింపు ఇచ్చింది. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి పరిశీలన చేసి అలాంటి వారికి ఓటు హక్కు కల్పిస్తారు. ► మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఓటర్ల నమోదు చేపడతారు. రాష్ట్రంలో జనాభా ఓటర్ల నిష్పత్తి 70.9 శాతం ఉండాల్సి ఉండగా 72.4 శాతం ఉంది. మిగతా రాష్ట్రాల కన్నా ఏపీలో నిష్పత్తి మెరుగ్గా ఉంది. ► ఏపీలో గతంలోనూ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఇప్పుడు ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,025 మంది మహిళా ఓటర్లున్నారు. ► 18 ఏళ్లు నిండిన అర్హుల్లో 5,23,580 మంది దివ్యాంగ ఓటర్లున్నారు. ► అత్యధిక ఓటర్లున్న జిల్లాలుగా అనంతపురం (19,13,813), కర్నూలు (19,13,654), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (18,99,103) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. అత్యల్ప ఓటర్లున్న జిల్లాలుగా అల్లూరి సీతారామరాజు (7,15,990), పార్వతీపురం మన్యం (7,70,175), బాపట్ల (12,66,110) జిల్లాలు నిలిచాయి. ఆధార్ అనుసంధానం స్వచ్ఛందమే ఓటర్ల జాబితా విషయంలో అత్యంత పారదర్శకత పాటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఐదు సూత్రాలను అమలు చేస్తోందని ముఖేష్‌కుమార్ మీనా వెల్లడించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ముసాయిదా జాబితాలను అందచేస్తామన్నారు. ఓటరు కార్డులతో ఆధార్ అనుసంధానం ఇప్పటికే 60 శాతం పూర్తి కాగా మిగతా 40 శాతం డిసెంబర్ నాటికి పూర్తవుతుందన్నారు. ఫోన్ నంబర్లు కూడా సేకరించాల్సిందిగా సూచించామన్నారు. ఆధార్ అనుసంధానం స్వచ్ఛందమే కానీ తప్పనిసరి కాదన్నారు. ఆధార్ ఇవ్వకున్నా ఇతర సర్టిఫికెట్లు సమర్పించవచ్చన్నారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించాలంటే సంబంధిత ఫామ్ ద్వారా క్షేత్రస్థాయి తనిఖీ ద్వారానే జరగాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బూత్ స్థాయి అధికారులే ఓటర్ల నమోదు ప్రక్రియ చేపడతారని, వలంటీర్లకు అవకాశం లేదని తెలిపారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించామన్నారు. పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియపై ఫిర్యాదులు వచ్చాయని, విచారణ జరిపి తప్పుడు ధ్రువీకరణ ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ఓటర్ల నుంచి ఆధార్ నంబర్ సేకరణ.. అమల్లోకి నూతన మార్గదర్శకాలు..
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా సవరణకు నూతన మార్గదర్శకాలు సోమవారం అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 30న జారీచేసిన నోటిఫికేషన్ ద్వారా ప్రజాప్రాతి నిధ్య చట్టం 1950లో సవరణలు చేసినట్లు చెప్పారు. సవరించిన చట్టంలోని సెక్షన్ 23 ప్రకా రం ఇప్పటికే ఓటర్లుగా ఉన్నవారితో పాటు ఓట ర్లుగా నమోదు కావాలనుకునేవారు వచ్చే మార్చి నెలాఖరుకల్లా ఆధార్ సంఖ్యను పొందుపర్చాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల గుర్తింపును ఖరారు చేయడానికి, జాబితాలో వ్యక్తులను ప్రామాణీకరించడానికి, ఒక వ్యక్తి పేరు ఒకటికంటే ఎక్కువ చోట్ల నమోదు కాకుండా చూడటమే ఆధార్ సంఖ్య సేకరణ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఇది పూర్తిగా స్వచ్ఛందమని, ఆధార్ నంబరును సమర్పించని వారిని ఓటర్ల జాబితా నుండి తొలిగిం చటం ఉండదని స్పష్టం చేసారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదై ఉన్న వారి ఆధార్ నంబరు కోసం నూతనంగా ఫారమ్ 6 బి ప్రవేశపెట్టామన్నారు. ఇసిఐ, ఇరోనెట్, గరుడ, ఎన్వీఎస్పీ, వీహెచ్ఏ తదితర వెబ్ సైట్లలో నూతన దరఖాస్తులు అందుబాటులో ఉంచామన్నారు. 6బి దరఖాస్తును ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ఎన్నికల సంఘానికి సమర్పించవచ్చని చెప్పారు. ఎన్వీఎస్పీ, ఓటర్ల హెల్ప్‌లైన్ యాప్‌ని అనుసరించి స్వీయ ప్రామాణీకరణతో యూఐడీఐఏతో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబరు ఓటీపీని ఉపయోగించి ఆధార్‌ను ప్రామాణీకరించవచ్చని తెలిపారు. మరో వైపు బూత్ లెవల్ అధికారి ఓటర్ల నుండి ఆధార్ నంబరు సేకరించడానికి ఇంటింటిని సందర్శిస్తారని, ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఆధా ర్ నంబరు ఇవ్వలేని ఓటర్లు ఫారం 6బిలో పేర్కొన్న 11 ప్రత్యామ్నాయపత్రాలలో ఏదైనా ఒకటి సమ ర్పించాలని చెప్పారు. ఆధార్ సంఖ్య సేకరణ, నిర్వ హణలో జాగ్రత్తలు తీసుకుంటారని, ఇది జన బాహుళ్యంలోకి వెళ్లదని తెలిపారు. సేకరించిన హార్డ్ కాపీలు సురక్షితమైన కస్టడీలో ఉంటాయని, యూఐడీఏఐ నిబంధనలకు అనుగుణంగా భద్రత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పోస్టర్ విడుదల నూతన మార్గదర్శకాలపై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను డెప్యూటీ సీఈవో వెంకటేశ్వరరావు సోమవారం సచివాలయం ఐదో బ్లాక్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు, స్వీప్ కన్సల్టెంట్ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏలూరులో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలిగాయి. షెడ్యూల్ ప్రకారమే ఎన్నిక నిర్వహించవచ్చని, ఓట్ల లెక్కింపు మాత్రం చేపట్టవద్దని, ఫలితాలను ప్రకటించవద్దని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై ధర్మాసనం మంగళవారం స్టే విధించింది. బ్యాలెట్ బాక్సులను జాగ్రత్త చేయాలని, హైకోర్టు ఆదేశిస్తే కానీ వాటిని తెరవడానికి వీల్లేదని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం, ఇతరులు దాఖలు చేసిన అప్పీళ్లను సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉంచదలచుకోలేదని ఈ సందర్భంగా పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఎన్నికల నిలిపివేతపై సర్కార్ అప్పీల్... ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పులను సవరించాలంటూ గత ఏడాది హైకోర్టు ఇచ్చిన తీర్పును అధికారులు అమలు చేయలేదంటూ టీడీపీ నేత ఎస్వీ చిరంజీవి, మరో 33 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఓటర్ల జాబితాలో తప్పులను సవరించేందుకు వీలుగా కార్పొరేషన్ ఎన్నికను నిలిపేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్లు లంచ్‌మోషన్ రూపంలో అత్యవసర అప్పీల్ దాఖలు దాఖలు చేశారు. ఇలాగే మరో వ్యక్తి కూడా అప్పీల్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, టీడీపీ నేతలు ఎస్వీ చిరంజీవి తదితరుల తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. చిలకలూరిపేట ఎన్నికలకు హైకోర్టు ఓకే గుంటూరు జిల్లా చిలకలూరిపేట మునిసిపల్ పాలకవర్గ ఎన్నికల నిర్వహణకు కూడా హైకోర్టు అనుమతి ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఎన్నిక నిర్వహించుకోవచ్చన్న న్యాయస్థానం ఎన్నికల ఫలితాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయని తెలిపింది. ఈ విషయాన్ని అభ్యర్థులకు అందజేసే ధ్రువీకరణ పత్రాల్లో స్పష్టంగా పేర్కొనాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. మానుకొండవారిపాలెం, పసుమర్రు, గణపవరం పంచాయతీలను చిలకలూరిపేట మునిసిపాలిటీలో విలీనం చేస్తూ గతేడాది జనవరిలో పంచాయతీరాజ్, పురపాలక శాఖలు జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూæటి.పూర్ణచంద్రరావు, జి.రవితేజ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు ఆ జీవోల అమలును నిలిపేస్తూ గతేడాది అక్టోబర్‌లో మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై విచారణ చేపట్టాలని ప్రభుత్వ న్యాయవాది సత్యశివాజీ మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులను అభ్యర్థించారు -
90.61 లక్షల మంది ‘పుర’ ఓటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి 10న జరగనున్న పురపాలక ఎన్నికల్లో 90,61,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో 2,794 డివిజన్లు, వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 12 నగరపాలక సంస్థల్లో 671 డివిజన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 2,123 వార్డులు ఉన్నాయి. పురపాలక ఎన్నికల ఓటర్ల జాబితాలను పురపాలకశాఖ ఖరారు చేసింది. ఓటర్లలో పురుషులు కంటే మహిళలే అధికంగా ఉన్నారు. నగరపాలక సంస్థల్లో విశాఖపట్నంలోను, పురపాలకసంఘాల్లో నంద్యాలలోను ఎక్కువమంది ఓటర్లున్నారు. ► మొత్తం ఓటర్లు 90,61,806 మంది. వీరిలో పురుషులు 44,59,064 మంది, మహిళలు 46,01269 మంది. ఇతరులు 1,473 మంది. ► 12 నగరపాలికల్లో ఓటర్ల సంఖ్య 52,52,355. వీరిలో పురుషులు 25,97,852 మంది, మహిళలు 26,53,762 మంది, ఇతరులు 741 మంది. ► 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఓటర్ల సంఖ్య 38,09,451. వీరిలో పురుషులు 18,61,212 మంది, మహిళలు 19,47,507 మంది, ఇతరులు 732 మంది. ► నగరపాలక సంస్థల్లో మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) విస్తీర్ణంలోను, ఓటర్ల సంఖ్యలోను మొదటి స్థానంలో ఉంది. 98 డివిజన్లున్న జీవీఎంసీలో ఓటర్ల సంఖ్య 17,52,927. వీరిలో పురుషులు 8,80,481 మంది, మహిళలు 8,72,320 మంది, ఇతరులు 126 మంది. ► మచిలీపట్నం నగరపాలక సంస్థలో తక్కువ మంది ఓటర్లున్నారు. 50 డివిజన్లు ఉన్న ఈ నగరపాలక సంస్థలో ఓటర్ల సంఖ్య 1,31,829. వీరిలో పురుషులు 63,883 మంది, మహిళలు 67,936 మంది, ఇతరులు 10 మంది. ► ఓటర్ల సంఖ్యలో కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం మొదటి స్థానంలో ఉంది. 42 వార్డులున్న నంద్యాలలో ఓటర్ల సంఖ్య 1,86,310. వీరిలో పురుషులు 90,597 మంది, మహిళలు 95,640 మంది, ఇతరులు 73 మంది. ► గూడూరు నగర పంచాయతీ చివర్లో ఉంది. 20 వార్డులున్న ఈ నగర పంచాయతీలో ఓటర్ల సంఖ్య 15,789 మాత్రమే. -
బ్యాలెట్‌తోనే జీహెచ్ఎంసీ పోరు!
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణకు తగిన సంఖ్యలో వీవీప్యాట్ మెషీన్లు అందుబాటులో లేనందున వాటితో సాధ్యం కాకపోవచ్చుననే నిర్ధారణకు ఎస్ఈసీ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతీ ఈవీఎం మెషీన్‌కు వీవీప్యాట్‌ను జతచేయాలన్న సుప్రీంకోర్టు తాజా ఆదేశాలకు అనుగుణంగా బ్యాలెట్ పేపర్ల వైపే మొగ్గు చూపుతున్నట్టు ‘సాక్షి’కి ఎస్ఈసీ వర్గాలు తెలిపాయి. వీవీప్యాట్లను సరఫరా చేయాలంటూ ఇదివరకే ఈసీఐఎల్, బెల్ కంపెనీలను ఎస్ఈసీ కోర గా, అవి అనుమతి కోసం ఈసీకి రాశాయి. ఈసీ నుంచి అనుమతి లభించి, ఆ కంపెనీలు ఈ ఎన్నికలకు అవసరమైన సంఖ్యలో వీవీప్యాట్ యంత్రాలు తయారు చేసేప్పటికి కాలాతీతమౌతుందనే అభిప్రాయంతో ఎస్ఈసీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందువల్లే బ్యా లెట్ బాక్స్‌లతోనే ఎన్నికలకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. అయితే దీనిపై రెండు, మూడ్రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ముగిసిన గడువు.. త్వరలోనే ఈసీ, జీహెచ్ఎంసీ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల అభిప్రాయాలు కూడా ఎస్ఈసీ తీసుకోనుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఏ విధానమైతే సులభంగా ఉంటుందన్న దానిపై స్పష్టతనివ్వాలని కోరినట్టు తెలిసింది. ఈ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లు లేదా ఈవీఎంలతో నిర్వహించాలన్న దానిపై అభిప్రాయాలు తెలపాలంటూ రాజకీయ పార్టీలను ఎస్ఈసీ కోరిన గడువు కూడా బుధవారంతో ముగిసింది. టీఆర్ఎస్తో పలు పార్టీలు బ్యాలెట్ పేపర్ల వైపే మొగ్గుచూపగా, బీజేపీ మాత్రం ఈవీఎంలతోనే నిర్వహించాలని సూచించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం ఏ విధానం వల్ల ఎలాంటి ప్రయోజనమో ఎస్ఈసీ చెప్పకుండా, ముందుగానే బ్యాలెట్లతో నిర్వహించాలని నిర్ణయించి రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరడంలో ఔచిత్యమేంటని ప్రశ్నించింది. ఎన్నికలు ఏ పద్ధతిలో నిర్వహిస్తే ఓటర్లకు రిస్క్ తక్కువగా ఉంటుందన్న దానిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఎస్ఈసీ చెబితే దానిపై తమ నిర్ణయం చెబుతామంటూ టీపీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ బుధవారం లేఖను పంపింది. రెండింటిలోనూ రిస్కే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈవీఎం లేదా బ్యాలెట్ పత్రాలు.. ఏ రకంగా ఎన్నికలు నిర్వహించినా రిస్కేనని, ఈ రెండు పద్ధతుల్లోనూ సానుకూల, వ్యతిరేక అంశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఓటర్‌కు కోవిడ్ ఉన్నా లక్షణాలు కనిపించని అసింప్టమేటిక్‌గా ఉంటే ఏ విధానంలో నిర్వహించినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతరులకు సోకే అవకాశాలే ఎక్కువనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అదీగాకుండా కెమికల్స్‌తో ప్రింట్ చేసిన న్యూస్ పేపర్ లేదా బ్యాలెట్ పేపర్‌పై వైరస్ ఎక్కువ సేపుండే అవకాశాలు తక్కువనేది ఇప్పటికే స్పష్టమైనందున ఆ పద్ధతి వైపే ఎస్ఈసీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు..? ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడుంటాయన్న దానిపై ఇంకా ఎస్ఈసీ స్పష్టతనివ్వడం లేదు. ప్రభుత్వం నుంచి వార్డుల వారీగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల నివేదిక అందగానే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎన్నికలు జరిపేందుకు అవసరమైన వివిధ ప్రక్రియలను పూర్తి చేయడంలో నిమగ్నమైనట్టు తెలిపాయి. జీహెచ్ఎంసీ పాత చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున వచ్చే ఫిబ్రవరి 10తో ప్రస్తుత పాలకమండలి పదవీకాలం ముగియడానికి 3 నెలల ముందు ఎన్నికలు నిర్వహించే వీలుంది. దీన్ని బట్టి నవంబర్ 2, 3వ వారం నుంచి డిసెంబర్ చివరివరకు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశాలున్నాయి. సంక్రాంతి పండుగ ముగిశాక వచ్చే మంచి రోజుల్లో ఎన్నికలు జరపాలనుకుంటే మాత్రం జనవరి 15 నుంచి 25వ తేదీల మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్టుగా అంచనా వేస్తున్నారు. -
‘పుర’ పోరుకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలలో ఓటర్ల జాబితాలను ఇప్పటికే దాదాపుగా ఖరారు చేశారు. రాష్ట్రంలోని 16 నగర పాలక సంస్థలకుగానూ కాకినాడకు 2017లో ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాల్సిన మిగతా 15 నగర పాలక సంస్థల్లో ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేశారు. 88 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఓటర్ల జాబితాను కూడా విడుదల చేశారు. మరో 6 మున్సిపాలిటీలలో ఓటర్ల జాబితాను మంగళవారం విడుదల చేస్తారు. దీంతో అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితా తయారీ పూర్తి కానుంది. ఓటర్ల జాబితాలోని పేర్లపై అభ్యంతరాలు ఉంటే రిటర్నింగ్ అధికారులుగా ఉన్న ఆర్డీవోల దృష్టికి తేవచ్చు. అనంతరం ఓటర్ల జాబితాలను అధికారులు ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు. ఇక కొత్తగా ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన 12 మున్సిపాలిటీలలో కూడా ఓటర్ల జాబితా తయారీ దాదాపుగా పూర్తైంది. వీటిని ఏర్పాటు చేస్తూ అధికారికంగా ప్రకటన విడుదలైన వెంటనే ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పించాలని అధికారులు భావిస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు దిశగా... నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఓటర్ల సర్వే తుది అంకానికి చేరుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కేటగిరీలవారీగా ఓటర్ల సర్వే పూర్తి చేశారు. తదనుగుణంగా నగర పాలక సంస్థల్లో కార్పొరేటర్లు, మున్సిపాలిటీలలో కౌన్సిలర్ల రిజర్వేషన్లకు ప్రాథమిక కసరత్తు చేపట్టారు. రాష్ట్రం యూనిట్‌గా మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లను నిర్ణయిస్తారు. నిబంధనల మేరకు రిజర్వేషన్ల ప్రక్రియను ఖరారు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. అనంతరం ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు ఎప్పుడైనా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు రూ.60 కోట్లు విడుదల చేసింది. నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలలో వార్డుల పునర్విభజన కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఎన్నికల అధికారుల నియామక ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. కొత్తగా ఏర్పాటు చేసే మున్సిపాలిటీల వార్డుల పునర్విభజన, ఎన్నికల అధికారుల నియామకం దాదాపు ఓ కొలిక్కి వచ్చిందని చెబుతున్నారు. మార్చి మొదటి వారంలో ఎన్నికల నిర్వహణ దిశగా పురపాలక శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకుసన్నద్ధం: విజయ్‌కుమార్, పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్ ‘నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఓటర్ల జాబితాలను పూర్తి చేశాం. ఓటర్ల సర్వే చేసి తదనుగుణంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోపాటు మేయర్లు, చైర్పర్సన్ల రిజర్వేషన్లు నిర్ణయించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నాం’ -
రాష్ట్రంలో 2,98,64,689 మంది ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2,98,64,689 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,50,07,047 మంది పురుషులు, 1,48,56,076 మంది మహిళలు, 1,566 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2020లో భాగంగా సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ ప్రకటించారు. ఈ కార్యక్రంలో భాగంగా వచ్చే నెల 15 వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, తప్పుల సవరణకు దరఖాస్తులతో పాటు కొత్త ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జనవరి 27 నాటికి ఈ దరఖాస్తులను పరిష్కరించి ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు కలిగి ఉండి, ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని రజత్‌కుమార్ సూచించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 105 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. దీంతో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 34,707కి పెరిగిందని రజత్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
జనవరి 15 వరకు ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ జారీ చేసింది. 2020 జనవరి 15 వరకు ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరించనుంది. ఓటర్ల నమోదుతోపాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ కోసం కొత్త తేదీలను ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2020 జరుగుతోంది. 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసుకు చేరే యువతీయువకులతో పాటు ఓటర్ల జాబితాలో పేరు లేని వ్యక్తుల నుంచి ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30 వరకు ఓటర్ల జాబితాల పరిశీలన, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపట్టనున్నారు. డిసెంబర్ 16న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేని వారి నుంచి ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరణ, ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను 2020 జనవరి 15 వరకు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారని సీఈఓ రజత్‌కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓటర్ల పరిశీలన కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటా తిరిగి ఓటర్ల జాబితాలో పేర్లు, ఇతర వివరాలను నిర్ధారించుకుంటారన్నారు. ఓటరు జాబితాలో పేర్ల ధ్రువీకరణ కోసం పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, రేషన్‌కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, బ్యాంకు పాసుపుస్తకాలు, రైతు గుర్తింపు కార్డు, పాన్‌కార్డు, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జారీ చేసిన స్మార్ట్‌కార్డు, తాజాగా తీసుకున్న నల్లా, టెలిఫోన్, గ్యాస్ కనెక్షన్ బిల్లుల్లో ఏదో ఒక పత్రాన్ని బీఎల్ఓలకు అందజేయాలని సూచించారు. ఓటర్లు www.nvsp.in లేదా www.ceotelangana.nic.in లలో తమ రుజువులకు సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేసి ఓటు హక్కును నిర్ధారించుకోవచ్చన్నారు. -
రేపటి నుంచి ఓటర్ల జాబితాలో సవరణలు
సాక్షి,, అమరావతి: ఓటర్ల జాబితాలో తప్పులు సరి చేసేందుకు, మార్పులు, చేర్పులు చేసుకునేందుకు సెప్టెంబర్ ఒకటి నుంచి 30 వరకూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఓటరు కార్డులోని పేర్లలో తప్పులు, బంధుత్వాలు, చిరునామాల్లో తేడాలు వంటి వాటిని సరి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి అన్ని పోలింగ్ బూత్‌ల్లోనూ బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) అందుబాటులో ఉంటారని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ సవరణలకు ప్రత్యేక విభాగాలు పనిచేస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 11 వేల మీసేవా కేంద్రాల్లోనూ మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుందని వివరించారు. దీనికోసం ఓటర్లు తమ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, రేషన్ కార్డ్, ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్, రైతు గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దాన్ని చూపిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఎన్వీఎస్పీ (నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్), ఓటర్ హెల్ప్‌లైన్ యాప్, 1950 కాల్ సెంటర్ ద్వారా కూడా సవరణలకు అవకాశం ఉంటుందన్నారు. మార్పులు, చేర్పుల కోసం ఫామ్–8, మృతి చెందిన, చిరునామా మారిన ఓటర్ల కోసం ఫామ్–7 పోలింగ్ బూత్‌లు, ఆయా కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. బీఎల్వోలు క్షేత్ర స్థాయిలో నిర్ధారణ చేశాక మార్పులకు తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. సవరణ తర్వాత అక్టోబర్ 15న ముసాయిదా ఓటర్ల జాబితాను, 2020, జనవరిలో తుది జాబితాను ప్రచురిస్తామని చెప్పారు. -
ఓటర్ల జాబితా సవరణకు సన్నద్ధం
సాక్షి, అమరావతి: ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ ఆదివారం విజయవాడలో ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి నెల రోజులపాటు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని అన్ని పోలింగ్ కేంద్రాల్లో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పేర్ల నమోదు, మార్పులు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇక మీదట ఫామ్ 7 దుర్వినియోగం కుదరదని స్పష్టం చేశారు. WWW.NVSP.IN వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు అని సూచించారు. Voter helpline app, 1950 నంబర్ల ద్వారా కూడా ఓటర్ల నమోదుకు అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పూర్తయ్యాక అక్టోబర్ 15న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామన్నారు. -
అక్టోబర్‌లో ‘ఓటర్ల’ సవరణ
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2020 షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుత ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓటర్లను తొలగించి, ఇతర లోపాలను సరిదిద్దిన తర్వాత ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించింది. అక్టోబర్ 15 నాటికి ఓటర్ల జాబితాలోని లోపాలను సరిచేయాలని, అదే రోజు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరింది. 2020 జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా సవరణ జరపాలని సూచించింది. అంటే, 2020 నాటికి 18 ఏళ్ల వయసుకు చేరే యువతీయువకులు ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి అర్హులు కానున్నారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలకు సంబంధించిన దరఖాస్తును నవంబర్ 30 వరకు స్వీకరించనున్నారు. ఓటర్ల నమోదును ప్రోత్సహించేందుకు నవంబర్ 2, 3, 9, 11 తేదీల్లో పెద్ద ఎత్తున ప్రచారోద్యమాన్ని నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. ఓటర్ల నమోదు దరఖాస్తులతో పాటు అభ్యంతరాలను పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 15 నాటికి తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. లోపాలపై ప్రత్యేక దృష్టి.. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాలో లోపాలపై సర్వత్రా విమర్శలు చెలరేగిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఓటర్ల జాబితాలో లోపాలను సరిచేసేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఓటర్ల జాబితా నుంచి డూప్లికేట్ ఓటర్ల ఏరివేత, ఇతర లోపాలను సరిదిద్దడంతో పా టు ఓటర్ల ఫొటోల నాణ్యతను పరీక్షించే కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులను (సీఈఓ) ఇటీవల ఆదేశించింది. ప్రస్తుత ఓటర్ల జాబితాలోని ఓటర్లు తమ పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, రేషన్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్‌ని స్వచ్ఛందంగా సమరి్పంచి తమ ఓటు హక్కును ధ్రువీకరించుకునేలా ప్రోత్సహించాలని కోరింది. ఇంటింటికీ తిరిగి.. బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో) సెపె్టంబర్ 1 నుంచి 30 వరకు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాలను సరిచేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ సమాచారాన్ని ఏఈఆర్వో/ఈఆర్వో/డీఈవోలు /రోల్ అబ్జర్వర్లు అక్టోబర్ 15లోగా పరీక్షించాలంది. -
‘అసెంబ్లీ’ ఓటర్ల లిస్ట్‌తో మున్సి‘పోల్స్’
సాక్షి, హైదరాబాద్: ‘మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందస్తు ప్రక్రియను పూర్తి చేసిన ఇరవై రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధంగా ఉంది. అయితే కొత్త మున్సిపల్ చట్టం రూపొందించిన నేపథ్యంలో సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ నిమిత్తం పది రోజు లు గడువు నిర్ణయిస్తూ ఈ నెల 16న నోటిఫికేషన్ వెలువడింది. హైకోర్టు కేసుల కారణంగా అందుకు మరో ఏడు రోజులు సమయం అవసరమైంది’ అని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా, వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ వంటివి ప్రభుత్వమే చేయాలని, వార్డుల హద్దుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమై తే సమస్యలు వస్తాయని, 2016లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలప్పుడు డివిజన్ హద్దుల విషయంలో సమస్యలు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల అసెంబ్లీ, లోక్‌సభలకు జరిగిన ఎన్నికల నాటి ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తామని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆ జాబితాకు గడువు తగ్గించినా పర్వాలేదన్నారు. ప్రభు త్వం హడావుడిగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడాన్ని తప్పుపడుతూ నిర్మల్ జిల్లా నుంచి కె.అంజుకుమార్‌రెడ్డి వేసిన ప్రజాహిత వ్యాజ్యంలో ఎస్ఈసీ తరఫున ఆయన హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకూ జరిగిన పరిణామాలను, ప్రభుత్వం రాసిన లేఖలు, దానికి ఇచ్చిన జవాబుల గురించి సమగ్రంగా హైకోర్టుకు ఎస్ఈసీ వివరించింది. పిల్‌ను కొట్టేసి ఎన్నికల నిర్వహణకు వీలుగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రాజ్యాంగంలోని 243–జెడ్ఏ అధికరణ ప్రకారం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియ ప్రభుత్వం చేయాలి. 2018 డిసెంబర్ 31 నాటికి వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తి చేయాలని అదే ఏడాది సెప్టెంబర్ 15న ప్రభుత్వానికి లేఖ రాశాం. ఈ ఏడాది మార్చి 28 నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని కోరాం. ప్రభుత్వం మార్చి 12న రాసిన లేఖలో తెలంగాణ మున్సిపల్ చట్టం– 1965 స్థానంలో కొత్త చట్టాన్ని తేబోతున్నామని, అందుకు అనుగుణంగా ఓటర్ల జాబితా ప్రచురణ గడువును పొడిగించాలని కోరింది. దాంతో మార్చి 14 వరకూ ఆ ప్రక్రియను నిలిపివేశాం. మే 10 నాటికి ఎన్నికల ముందస్తు ప్రక్రియ, రిజర్వేషన్ల ఖరారు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. ఏప్రిల్ 3న రాష్ట్రం రాసిన లేఖలో.. ‘కొత్త మున్సిపల్ చట్టం తుది దశకు చేరింది. ఏప్రిల్ మూడో వారానికి వార్డుల పునర్విభజన పూర్తి అవుతుంది’ అని తెలిపింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన కౌం టర్లో తెలిపారు. ఈ నెల 7కి పునర్విభజన ప్రక్రియ, 14కి రిజర్వేషన్లు ఖరారు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఓటర్ల జాబితా సవరణ కోసం పది రోజులు గడువు నిర్ణయిస్తూ జూలై 16న నోటిఫికేషన్ వెలువడినా.. హైకోర్టులో రిట్ల దాఖలుతో మరో ఏడు రోజు లు అవసరమైంది. ప్రభుత్వం వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి, తమకు నివేదించిన 20 రోజుల్లోగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీ హైకోర్టుకు తెలిపింది. -
నోటిఫికేషన్ వెలువడే వరకు ఓటర్ల జాబితా సవరణ
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించే వరకు మున్సిపల్ ఓటర్ల జాబితాలను సవరించవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) వెల్లడించింది. ముందుగా అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో మార్పుచేర్పులు చేస్తే తదనుగుణం గా మున్సిపల్ ఓటర్ల జాబితాల్లో మార్పులు చేసేం దుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీ ఓటర్ల జాబితాల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఓటర్ల జాబితాల్లో పేర్లు చేర్చాలని అనుకునే వారు ఇందుకోసం అవసరమైన ఫాం–6, 7, 8, 8 (ఏ)లను అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ద సమర్పించాలని తెలి పింది. రాజకీయ పార్టీలు, ఓటర్లు, స్వచ్ఛందసంస్థ లు, ఆసక్తి ఉన్నవారు వార్డుల వారీగా ప్రచురించిన ఓటర్ల జాబితాలను పరిశీలించి ఎంట్రీలకు సంబంధించి తప్పులుంటే వాటిపై ఫిర్యాదులు, సలహాలకు సంబంధించిన లేఖలను మున్సిపల్ కమిషనర్లు లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ల (ఈఆర్వోలు) సమర్పించాలని సూచించింది. ఈ ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఓటర్ల రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు పరిశీలించి పరిష్కరించాల ని పేర్కొంది. మార్పుచేర్పులుంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం, నిబంధనలకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలను సరిచేయాలని తెలిపింది. తదనుగుణంగా మున్సిపాలిటీల్లోని ఓటర్ల జాబితాల్లో మార్పులు చేసేందుకు మున్సిపల్ కమిషనర్లకు అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ నెల 16న మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల వారీ గా ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను ప్రచురించాక వాటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి నట్టు తెలిపింది. వీటి ప్రతులను ఇప్పటికే అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఉచితంగా అందజేసినట్టు, పరిశీలన కోసం విడి కాపీలు మున్సిపల్ కమిషనర్ల వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ జాబితాలను ఎస్ఈసీ వెబ్సైట్ ్టట్ఛఛి.జౌఠి.జీn నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునేందు కు వీలు కల్పించినట్టు ఎస్ఈసీ తెలిపింది. -
85 మున్సిపాల్టీల్లో ఓటర్ల జాబితా వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన తొలి ఘట్టం ఒక కొలిక్కి వచ్చింది. ఓటర్ల జాబితా, వార్డుల విభజన ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు శుక్రవారం 85 మున్సిపాల్టీల్లో ఫొటో ఓటర్ల జాబితాను ప్రకటించారు. నిజానికి ఏప్రిల్ నెలాఖరులోపే వీటిని ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, సార్వత్రిక ఎన్నికల కారణంగా అధికారులు దీనిపై దృష్టి కేంద్రీకరించలేకపోయారు. ఈ కారణంతో ప్రభుత్వం ఈ నెల 10 వరకు ఓటర్ల జాబితా వెల్లడికి గడువిచ్చింది. దీంతో అన్ని మున్సిపాల్టీల్లో ప్రత్యేక ఎన్నికల విభాగాన్ని ఏర్పాటుచేసి ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకుగాను 85 మున్సిపాల్టీల్లో ఓటర్ల జాబితాను ప్రకటించారు. రెండు మున్సిపాల్టీల్లో కోర్టు కేసులు, 14 మున్సిపాల్టీల్లో చుట్టుపక్కల గ్రామాల విలీనం కాకపోవడంవల్ల వార్డుల పునర్విభజన జరగలేదు. దీంతో జాబితాను వెల్లడించలేదు. వీటిలో శ్రీకాకుళం జిల్లా రాజాం, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపాల్టీలపై కోర్టులో కేసులు ఉన్నాయి. వార్డుల పునర్విభజన జరగకపోవడం కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, గుంటూరు జిల్లా వినుకొండ, తాడేపల్లి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా నాయుడుపేట, కర్నూలు జిల్లా డోన్ మున్సిపాల్టీల్లో ఓటర్ల జాబితాను వెల్లడించలేదు. అయితే, విజయనగరం, గ్రేటర్ విశాఖ, మచిలీపట్నం, గుంటూరు, నెల్లూరు, వైఎస్సార్ కడప కార్పొరేషన్ల్లో వార్డుల పునర్విభజన, కాకినాడలో పాలకవర్గం కొనసాగుతుండటంతో ఓటర్ల జాబితాను వెల్లడించలేదు. కాగా, శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు కార్పొరేషన్లలో డివిజన్ల వారీ ఫొటో ఓటర్ల జాబితాను ప్రకటించారు. -
ఇక ‘పుర’పోరు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభమైంది. ఈ నెల 9న మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విషయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో రాష్ట్రంలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. అలాగే, ఓటర్ల జాబితాను వెంటనే రూపొందించాలని.. మే 1 నాటికి దానిని ప్రకటించాలని కూడా ఆదేశించింది. దీంతో మున్సిపల్ అధికారులు యుద్ధప్రాతిపదికన ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఓటర్ల జాబితాలను రూపొందించే పనిలోనూ నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో 13 కార్పొరేషన్లతో కలిపి 110 మున్సిపాల్టీలు ఉన్నాయి. ఇందులో నాలుగు సెలక్షన్ గ్రేడ్ మున్సిపాల్టీలు, ఏడు స్పెషల్ గ్రేడ్, 13 మొదటి గ్రేడ్.. 25 సెకండరీ గ్రేడ్, 23 థర్డ్ గ్రేడ్‌వి కాగా 25 నగర పంచాయితీలు ఉన్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితాలను పరిగణనలోకి తీసుకుని మున్సిపల్ ఓటర్ల జాబితా రూపొందించాల్సి ఉంది. ఈ మేరకు మున్సిపల్ అధికారులు జిల్లా ఎన్నికల సంఘాల నుంచి సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితాలను తీసుకుని జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు. కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఇంకా 12 రోజులే సమయం ఉండటంతో అధికారులు నానా హైరానా పడుతున్నారు. మున్సిపల్ ఓటర్లను వార్డుల వారీగా విభజన చేయనున్నారు. వీధులు, ఇంటి నెంబర్లు, పోలింగ్ కేంద్రాలను ఆధారంగా ఓటర్ల జాబితాను రూపొందిస్తారు. సాధారణంగా పట్టణాలు, నగరాల్లో విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు అధికంగా ఉంటారు. వీరిని పరిగణనలోకి తీసుకుని ఓటరు ఇంటికి సమీపంలోనే పోలింగ్ కేంద్రాలు ఉండే విధంగా చూసుకోవాలని ఎన్నికల సంఘం అదేశించింది. గ్రేటర్ విశాఖ, గుంటూరులో ‘విలీన’ సమస్యలు ఇదిలా ఉంటే.. గ్రేటర్ విశాఖ, గుంటూరు కార్పొరేషన్లకు సంబంధించి విలీన గ్రామాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఓటర్ల జాబితాలో నెలకొనే సమస్యలను వివరిస్తూ ఎన్నికల కమిషన్‌కు అక్కడి అధికారులు లేఖ రాశారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా రూపొందించే పనిలో వారు ఉన్నప్పటికీ, డివిజన్ల వర్గీకరణ సమయంలో సమస్యలు తలెత్తుతాయని వివరించారు. దీనిపై తగు సూచనలు ఇవ్వాలని కోరారు. అలాగే, ప్రతిపాదిత గ్రేటర్ విజయవాడలో విలీనమయ్యేందుకు పలు గ్రామ పంచాయతీలు సుముఖంగా లేకపోవడంతో అక్కడ ఇప్పుడున్న కార్పొరేషన్ పరిధిలోనే ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాక.. అతిపురాతనమైన మచిలీపట్నం జూలై 3వ తేదీతో కార్పొరేషన్‌గా రూపొంతరం చెందనుంది. 42 డివిజన్ల కలిగిన ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందితే డివిజన్ల సంఖ్య 50కు పెరుగుతుంది. ఈ 50చోట్లా ఎన్నికలు జరుగుతాయి. మరోవైపు.. తిరుపతి కార్పొరేషన్‌ను గ్రేటర్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఓటర్ల జాబితా వెలువడిన తరువాత ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థుల అన్వేషణలో పార్టీలు కాగా, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించడంతో రాజకీయ పార్టీలు కూడా పురపోరుకు సిద్ధమవుతున్నాయి. ధీటైన అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించాయి. సమావేశాలు నిర్వహిస్తూ డివిజన్లలోని పరిస్థితులను సమీక్షిస్తున్నాయి. -
టీడీపీ వ్యతిరేక ఓట్లు తొలగిస్తున్నారు
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లాలో సర్వేల పేరుతో ఇళ్లకు వెళ్తున్న సర్వే బృందాలు టీడీపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నాయని, వారిని పట్టుకుని అప్పగిస్తే అరెస్టు చేయాల్సిన పోలీసులు వైఎస్సార్సీపీ నేతల్ని నిర్బంధించి దౌర్జన్యం చేస్తున్నారని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయనతోపాటు పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్ తదితరులు సచివాలయంలో ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని, మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను శుక్రవారం కలిసి ఫిర్యాదు చేశారు. సర్వే చేయడానికి వచ్చిన ఎన్నికల కమిషన్ ఉద్యోగులమంటూ టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అభిమానులుగా పేర్కొన్న వారిని గుర్తించి, వారి ఓట్లను తొలగిస్తున్నారని ద్వివేది దృష్టికి తెచ్చారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో ఉద్యోగులుగా చెప్పుకుంటూ సర్వేలు చేస్తున్న ఓ ప్రైవేట్ సంస్థ సిబ్బంది నుంచి స్వాధీనం చేసుకున్న కొన్ని ట్యాబ్‌లను ఆయనకు అందజేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఓట్లు తొలగించే టీడీపీ సర్వే బృందాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, సర్వే పేరుతో ఓట్లు తొలగిస్తున్న యువకులను పట్టుకుని అప్పగిస్తే పోలీసులు వదిలేశారని డీజీపీ దృష్టికి తెచ్చారు. డీజీపీకిచ్చిన ఫిర్యాదులో.. విజయనగరం జిల్లాలో సర్వే బృందాలు చేస్తున్న అక్రమాల వివరాలు, జరిగిన ఘటన, పోలీసుల తీరు తదితర అంశాలను బొత్స డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలిలో టీడీపీకి చెందిన గొల్లు కృష్ణ్ణ, గొల్లు దేముడుబాబు, తొత్తు దేముడు అనే యువకులు ప్రభుత్వ అధికారులమని చెప్పుకుంటూ ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేశారని వివరించారు. వారు ట్యాబ్‌లు తీసుకొచ్చి అందులో ఓటర్ల జాబితాలు ఉంచుకుని ఎవరికి అనుకూలంగా ఉంటారు? ఏ పేపర్ చదువుతారు? ప్రభుత్వ పథకాలు బాగున్నాయా? అధికార పార్టీకి వ్యతిరేకమా? అనుకూలమా? అని ఓటర్ల నుంచి సమాధానాలు రాబట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వేపై అనుమానం వచ్చిన గ్రామస్తులు కొందరు వైఎస్సార్సీపీ నేతల్ని పిలిచి చెప్పారని, నేతలు ఆ యువకులను ప్రశ్నించడంతో వారు తడబడ్డారని తెలిపారు. పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్ పేరుతో సర్వే చేస్తున్నవారు టీడీపీకి చెందినవారేనని, ఇంటింటికీ తిరిగి అభిప్రాయాలు అడిగిన తర్వాత ఓటర్ల లిస్ట్‌లో వారి ఓట్లు మాయమవుతున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నేతలు సర్వే చేస్తున్న యువకులను పోలీసులకు అప్పగించగా పోలీసులు ఆ యువకులను పంపేశారని, ఆ ట్యాబ్‌లలో ఏముందో విచారించాలని కోరినా వినకుండా ఆ ట్యాబ్‌లను తమకు అప్పగించారని డీజీపీ దృష్టికి తెచ్చారు. విజయనగరం పోలీసులు అర్ధరాత్రి సమయంలో పార్టీ నేత మజ్జి శ్రీనివాసరావుతోపాటు ఇతర నేతల్ని అక్రమంగా నిర్బందించి ఆ ట్యాబ్‌లను యువకుల వద్ద నుంచి లాక్కున్నారంటూ అక్రమ కేసులు నమోదు చేశారని ఫిర్యాదు చేశారు. అక్రమాలను అడ్డుకుంటాం ఎన్నికల ప్రధాన అధికారిని, డీజీపీని కలిసిన తర్వాత పార్టీ నేత బొత్స మీడియాతో మాట్లాడారు. అధికారం కోసం చంద్రబాబు ఇలాంటి అడ్డదారులు తొక్కడం దారుణమని, వీటిని అడ్డుకుంటామని అన్నారు. శుక్రవారం జాతీయ ఓటర్ల దిన్సోతవమని.. అదే రోజున ఇలాంటివి జరగడం దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని వ్యాఖ్యానించారు. ఉద్యోగులుగా చెప్పుకుంటూ గ్రామాల్లో సర్వేలకొస్తున్న టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీకి అనుకూలురైనవారి ఓట్లను ట్యాబ్‌లో ఓటర్ల జాబితాలో మార్కు చేసుకొని, ఆ వివరాలను పైకి చేరవేస్తున్నారని చెప్పారు. విజయనగరంలో వీటిని అడ్డుకున్న తమ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేయడం ప్రభుత్వ అక్రమాలకు పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజక వర్గంలోనూ ఇలా సర్వేల ద్వారా గుర్తించిన వారి ఓట్లను 30 వేల దాకా అక్రమంగా తొలగించారని మండిపడ్డారు. ఇలా సర్వేల పేరుతో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపునకు వినియోగిస్తున్న ట్యాబ్‌లపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని ఎన్నికల ప్రధాన అధికారి, డీజీపీ హామీ ఇచ్చారన్నారు. డీజీపీ తీసుకునే చర్యలను బట్టి తమ భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నేతలతోపాటు లీగల్ సెల్ ప్రతినిధులు కోటంరాజు వెంకటేశ్వర శర్మ, సుజాతశర్మ, బి.సతీష్, పార్టీ సంయుక్త కార్యదర్శి అడపా శేషు ఉన్నారు. -
కాలనీ ఓటర్లపై కుట్ర!
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం గణపవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఆ వర్గానికి చెందిన ఓటర్లు 1,120 మంది ఉన్నారు. ఆ కాలనీ పక్కనే ఉండే ప్రాంతంలో ముస్లిం ఓటర్లు 150 మంది ఉన్నారు. మొత్తం 1,270 మంది ఓటర్లు కాగా గతంలో వీరంతా స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వీలుగా ఎస్సీ కాలనీలోని పాఠశాలలోనే రెండు పోలింగ్ కేంద్రాలు (151, 152) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిని తొలగించి గణపవరంలోని జడ్పీ పాఠశాలలో ఆ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ఎస్సీ కాలనీ వాసులు ఓటు వేయాలంటే గణపవరం గ్రామం మధ్యలోని రహదారి గుండా కిలోమీటర్ దూరం ప్రయాణించి పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. వీరికి ఈ దారి నుంచి వెళ్లడం మినహా మరో మార్గం లేదు. ఎన్నికల సమయంలో వీరిని భయభ్రాంతులకు గురిచేసి ఓటు వేయకుండా అడ్డుకునేలా ఓ సామాజిక వర్గానికి చెందిన అధికార పార్టీ నేతలు ప్రణాళికలు రచించారు. ఎస్సీ కాలనీ ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వీల్లేకుండా చేసేందుకే పోలింగ్ కేంద్రాన్ని మార్చేలా ఒత్తిడి తెచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, అమరావతి బ్యూరో: వచ్చే ఎన్నికల్లో గట్టెక్కేందుకు అధికార పార్టీ నేతలు అన్ని అడ్డదారులూ అన్వేషిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్‌ల మార్పుతోపాటు గంపగుత్తగా విపక్షం ఓట్ల తొలగింపు, వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉండే కాలనీల్లో ఓట్లను వివిధ పోలింగ్ కేంద్రాలకు మార్చి చిందరవందర చేయడం లాంటి చర్యలకు దిగుతున్నారు. బూత్ స్థాయి అధికారులను తమ కనుసన్నల్లో ఉంచుకుంటూ ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికారులకు ఇలాంటి అభ్యంతరాలు జిల్లావ్యాప్తంగా 35 వేలకు పైగా అందాయి. ప్రధానంగా సత్తెనపల్లి, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లోనే 22 వేలకు పైగా అభ్యంతరాలు వ్యక్తం కావడం గమనార్హం. సత్తెనపల్లి సమీపంలోని భృగుబండలో ఎస్సీ, ఓసీ కాలనీలోని ఓటర్లను ఆ గ్రామంలో రెండు పోలింగ్ కేంద్రాలకు ఇష్టం వచ్చినట్లు మార్చారు. నరసరావుపేటలో వైఎస్సార్ సీపీకి పట్టున్న ప్రాంతాల్లో ఓటర్లను ఇష్టారాజ్యంగా పోలింగ్ కేంద్రాలకు మార్చారు. ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలపై దృష్టి సారించిన గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ మంగళవారం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, బీఎల్వోలు, బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించాలని ఈఆర్ఓలను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాన్ని మార్చిన జిల్లాపరిషత్ పాఠశాల -
తూర్పు.. తూర్పు.. దొంగ ఓటర్ల కూర్పు
అనగనగా ఓ ఇల్లు.. ఆ ఇంట్లో వాస్తవంగా ఉండేది ఇద్దరే. కానీ ఓటర్ల జాబితా ప్రకారం.. ఆ ఇంట్లో ఏకంగా 35 మంది ఉంటున్నారట!.. ఉండటమే కాదు.. గత ఎన్నికల్లో ఓట్లు కూడా వేసేశారు. త్వరలో జరిగే జీవీఎంసీ ఎన్నికల్లోనూ ఓట్లేయడానికి సన్నాహాలు చేస్తున్నారు!ఆ ఎదురుగానే మరో ఇల్లు.. అక్కడా ఉండేది ఇద్దరే.. కానీ వారికి తెలియకుండా మరో ఏడుగురు ఉంటున్నట్లు ఓటర్ల జాబితా చెబుతోంది. ఇదెలా సాధ్యం అనుకోకండి.. తెలుగుదేశం నేతలు తలచుకుంటే.. ఇలాంటి దొంగాటకాలు ఎన్నయినా సాధ్యమే. ఎన్నికల్లో విజయం కోసం లేని ఓటర్లను సృష్టించి వారి పేరుతో ఓట్లు గుద్దేస్తున్నట్లు ఓటర్ల జాబితాపై ఒట్టేసి మరీ చెప్పొచ్చు.. విశాఖపట్నం: ఎన్నికల్లో విజయానికి ఓటర్లుండాలి. అభ్యర్థులు, పార్టీలు వారి ఆదరణ పొందాలి. కానీ ప్రతిదానికీ అడ్డదారులు తొక్కడం అలవాటైన తెలుగుదేశం నేతలు ఈ విషయంలోనూ అదే పని చేశారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ నేతలు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేయించి.. అడ్డదారిలో అధికారంలోకి వచ్చారు. మనుషులు లేకపోయినా ఇప్పటికీ ఆ దొంగ ఓట్లు ఓటర్ల జాబితాలో అలాగే కొనాసాగుతున్నాయి. ఇంకేముంది త్వరలో జరగనున్న మహావిశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) ఎన్నికల్లోనూ ఈ దొంగ ఓట్ల మద్దతుతో పీఠం దక్కించుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఇటువంటి దొంగ ఓట్లు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల వారిని ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా చేర్పించారు. ఇక్కడి ముఖ్యనేతలు తమకు నమ్మకస్తులైన ’దేశం’ నేతల ఇళ్ల చిరునామాలతో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఒక్కో డోరు నంబరులో 30 నుంచి 40 మందిని ఓటర్లుగా రాయించేశారు. ఆరా తీయని అధికారులు ఒకే డోరు నంబరు ఇంట్లో ఇంతమంది నివసించడం సాధ్యమా? అన్న అనుమానం ఏ ఒక్క అధికారికీ రాకపోవడం.. కనీసం ఆ దిశగా ఆరా తీయకపోవడం కూడా విడ్డూరమే. ఈ అక్రమాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ఇంకేముంది.. ఎక్కడెక్కడివారో ఇక్కడ ఓటర్ల అవతారమెత్తారు. గత ఎన్నికల్లో టీడీపీకి గంప గుత్తగా ఓట్లు కూడా వేసేశారు. ఇలా విశాఖ తూర్పు నియోజకవర్గంలో దాదాపు 35 వేల మంది స్థానికేతరులను టీడీపీ నాయకులు ఓటర్ల జాబితాలో చేర్పించారని తెలుస్తోంది. జీవీఎంసీ ఒకటో వార్డు ఆరిలోవ ప్రాంతంలో టీడీపీ నాయకుడు నీలి అప్పలరాజు ఉంటున్న 16–887 ఇంటి నంబరుతో ఏకంగా 35 మంది ఓటర్లను చేర్చారు. వాస్తవానికి ఆ ఇంట్లో ఇద్దరంటే ఇద్దరే ఉంటున్నారు. ఆ ఇంట్లో మహా అయితే ఏడెనిమిది మంది ఓటర్లకు మించి నివసించే అవకాశమే లేదు. కానీ 35 మంది ఓటర్లు ఆ ఇంట్లో ఉంటున్నట్టు ఓటర్ల జాబితా స్పష్టం చేస్తోంది. అదే ఇంటికి ఎదురుగా ఉన్న మరో ఇంట్లోనూ ఇద్దరే ఉంటున్నారు. కానీ ఆ ఇంటి డోరు నంబరు(16–893) తో తొమ్మిది మంది ఓటర్లను జాబితాలో చేర్చేశారు. కానీ ఆ విషయం ఆ ఇంట్లో వారికి తెలియనే తెలియదు. ఇలాంటి అక్రమాలు ఆ నియోజకవర్గంలో కోకొల్లలుగా జరిగాయని తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో 252 పోలింగ్ బూత్‌లున్నాయి. ప్రతి బూత్లోనూ వందకు పైగా ఇలాంటి దొంగ ఓటర్లను చేర్చినట్టు అంచనా. దీనిపై అప్పట్లో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా మొక్కుబడిగా కొంతమంది దొంగ ఓటర్లను తొలగించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల జాబితా ప్రకారం తనిఖీ చేయాలని ఈసీ ఆదేశించినా సంబంధిత బూత్ లెవల్ అధికారులు, బిల్లు కలెక్టర్లు ఆ పని చేయలేదు. దీంతో ఎన్నికలు సమీపించే సరికి మళ్లీ యధావిధిగా జాబితాలో వారు ప్రత్యక్షమయ్యారు. దొంగ ఓట్లను ఏరికోరి చేర్పించిన టీడీపీ నాయకులే ఎన్నికల్లో వీరందరిని ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నారు. -
అయ్యో పాపం... స్వతంత్ర అభ్యర్థి
కేకేనగర్: ఓటర్లు జాబితాలో పేరు లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి ఓటు వేయలేక నిరాశతో వెనుదిరిగారు. తిరువోత్తియూర్‌లో చిన్న మేట్టు పాలెయం కు చెందిన త మిళ్ సెల్వన్ ,మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈయన తిరువోత్తియూర్ నియోజక వర్గంలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోమవారం ఉదయం తమిళ్‌సెల్వన్ తిరువోత్తియూర్ అవర్లేడి పాఠశాలలో ఓటు వేయడానికి ఓటర్ ఐడితో వెళ్లారు. అక్కడున్న అధికారులు ఓటర్లు జాబితాను చెక్ చేయగా అందులో ఆయన పేరు లేదు. దీంతో తమిళ్ సెల్వన్ ఓటు వేయడానికి అనుమతి లభించలేదు. ఆయననిరాశతో వెనుదిరిగాడు. ఓటరు ఐడి,అభ్యర్థి గుర్తింపు కార్డులను చూపించి తనపేరు లేకుండా ఉంటే అధికారులు తన నామినేషన్‌ను ఎలా స్వీకరించారని ప్రశ్నించారు. తంజావూరులో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు తంజావూరు నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి ఓటర్లకు రూ.6 కోట్లు నగదు బట్వాడా చేసాడనే ఫిర్యాదు అందింది. విచారణలో నగదు బట్వాడా చేసినట్లు తెలియడంతో ఎన్నికలను హఠాత్తుగా నిలిపివేశారు. ఈ విషయం తెలియక అనేక మంది ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి నిరాశతో వెనక్కి వెళ్లారు. -
ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలి
ఒంగోలు టౌన్ : ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని జిల్లా రోల్ అబ్జర్వర్, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ బీ ఉదయలక్ష్మి ఆదేశించారు. జిల్లాలో ఓటర్ల నమోదు ప్రక్రియపై నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో బుధవారం సాయంత్రం స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2015 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు. ఇందుకోసం నాలుగు ఆదివారాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇప్పటికే ఈనెల 16వ తేదీ ఈ కార్యక్రమం జరిగిందని, మిగిలిన మూడు ఆదివారాలు(ఈనెల 23, 30, డిసెంబర్ 7వ తేదీ) ఓటరు నమోదు ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు ఓటర్ల జాబితాలతో అందుబాటులో ఉంటారన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు, తప్పులు దొర్లినవారు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ కావలసినవారు సంబంధిత ఫారాలు అందించాలని సూచించారు. డిసెంబర్ 22వ తేదీ నాటికి క్లెయిమ్‌లన్నింటినీ విచారిస్తామని చెప్పారు. జనవరి 5వ తేదీ ఓటర్లకు సంబంధించి సప్లిమెంటరీ జాబితా విడుదల చేస్తారని, 15వ తేదీ ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారని ఉదయలక్ష్మి వివరించారు. సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక నమోదు కార్యక్రమంలో పోలింగ్ కేంద్రాల వారీగా రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటుచేసి మినిట్స్ బుక్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఓటర్ల తొలగింపుకు సంబంధించిన కారణాలను అందులో పొందుపరచాలన్నారు. మండలానికో పీఎస్‌ను క్రాస్ చెక్ చేయాలి : 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో జండర్ రేషియో 981 మంది ఉండగా, ఎలక్ట్రోరల్ రోల్స్‌కు సంబంధించి 1012 మందిని చూపించడంపై కలెక్టర్ విజయకుమార్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ రెండు కేటగిరీలకు సంబంధించి వ్యత్యాసం ఎక్కువగా ఉన్నందున ఎలక్ట్రోరల్ రిటర్నింగ్ అధికారి ప్రతి మండలంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఎంపిక చేసుకొని క్రాస్ చెక్ చేయాలని ఆయన ఆదేశించారు. మూడు నాలుగు పోలింగ్ కేంద్రాలను కూడా స్వయంగా పరిశీలించాలన్నారు. ఓటర్ల నమోదుకు సంబంధించి ఒకేసారి కట్టలు కట్టలుగా ఫారాలు ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని ఆదేశించారు. సర్వీస్ ఓటర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆదేశించారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలో ఎక్కువ సంఖ్యలో ఓటర్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంపై సంబంధిత అధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఓటు వేస్తే సాంఘిక బహిష్కరణా? జిల్లా రోల్ అబ్జర్వర్ దృష్టికి రామాయపాలెం ఘటన రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కొన్ని దశాబ్దాల తరువాత వినియోగించుకున్న వారికి ఇచ్చే బహుమానం సాంఘిక బహిష్కరణా అని సీపీఎం జిల్లా నాయకుడు పెంట్యాల హనుమంతరావు ప్రశ్నించారు. స్థానిక సీపీవో కాన్పరెన్స్ హాలులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు నమోదు ప్రక్రియ, తదితర అంశాలపై జిల్లా అబ్జర్వర్ ఉదయలక్ష్మి బుధవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో మర్రిపూడి మండలం రామాయపాలెంలో జరిగిన ఘటనను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కలెక్టర్ విజయకుమార్ రామాయపాలెం గ్రామాన్ని సందర్శించారని, అక్కడి ఎస్సీలు కొన్ని దశాబ్దాల నుంచి తాము ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని చెప్పడంతో కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకొని ఓటు హక్కు అవకాశాన్ని కల్పించారన్నారు. గ్రామంలో ఉండే పెత్తందారులు దానిని జీర్ణించుకోలేక వారిని సాంఘిక బహిష్కరణకు గురిచేశారన్నారు. మంచినీళ్లు ఇవ్వకపోగా పనులకు కూడా వారిని పిలవడం లేదన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్‌కు మూడు లక్షలు మంజూరు చేశారని, అయితే ఆ గ్రామ సర్పంచ్ స్థలం ఇవ్వకుండా ఇప్పటికీ ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.