
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించే వరకు మున్సిపల్ ఓటర్ల జాబితాలను సవరించవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) వెల్లడించింది. ముందుగా అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో మార్పుచేర్పులు చేస్తే తదనుగుణం గా మున్సిపల్ ఓటర్ల జాబితాల్లో మార్పులు చేసేం దుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు అసెంబ్లీ ఓటర్ల జాబితాల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఓటర్ల జాబితాల్లో పేర్లు చేర్చాలని అనుకునే వారు ఇందుకోసం అవసరమైన ఫాం–6, 7, 8, 8 (ఏ)లను అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వద్ద సమర్పించాలని తెలి పింది. రాజకీయ పార్టీలు, ఓటర్లు, స్వచ్ఛందసంస్థ లు, ఆసక్తి ఉన్నవారు వార్డుల వారీగా ప్రచురించిన ఓటర్ల జాబితాలను పరిశీలించి ఎంట్రీలకు సంబంధించి తప్పులుంటే వాటిపై ఫిర్యాదులు, సలహాలకు సంబంధించిన లేఖలను మున్సిపల్ కమిషనర్లు లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ల (ఈఆర్‌వోలు) సమర్పించాలని సూచించింది.
ఈ ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఓటర్ల రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు పరిశీలించి పరిష్కరించాల ని పేర్కొంది. మార్పుచేర్పులుంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం, నిబంధనలకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలను సరిచేయాలని తెలిపింది. తదనుగుణంగా మున్సిపాలిటీల్లోని ఓటర్ల జాబితాల్లో మార్పులు చేసేందుకు మున్సిపల్ కమిషనర్లకు అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ నెల 16న మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల వారీ గా ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను ప్రచురించాక వాటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి నట్టు తెలిపింది. వీటి ప్రతులను ఇప్పటికే అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఉచితంగా అందజేసినట్టు, పరిశీలన కోసం విడి కాపీలు మున్సిపల్ కమిషనర్ల వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఈ జాబితాలను ఎస్‌ఈసీ వెబ్‌సైట్ ్టట్ఛఛి.జౌఠి.జీn నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకునేందు కు వీలు కల్పించినట్టు ఎస్‌ఈసీ తెలిపింది.