సాక్షి, అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటర్ల జాబితాలో మార్పులపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఓటర్ల జాబితాలకు సంబంధించి 175 నియోజకవర్గాల పార్టీ నేతలకు మంగళవారం తాడేపల్లిలో వర్క్‌షాప్ నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలపై పార్టీ శ్రేణులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని, ఓటర్ల చేర్పులు, ఇతర మార్పులను నిశితంగా పరిశీలించాలని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు ఉండేలా చూసి, వారి మద్దతు పొందాలని తెలిపారు.
అనర్హులను గుర్తించడానికి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక యంత్రాంగం పనిచేస్తోందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే వారిని నియమించుకుని బూత్ లెవెల్ నుంచి ఓటర్ల జాబితాలను పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల సంఖ్య నుంచి ఇటీవల జరిగిన మార్పుల వరకు సరిచూసుకోవాలని సూచించారు. జేసీఎస్ కోఆరి్డనేటర్లు, గృహసారథులు, పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారం నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ అవసరమని చెప్పారు.
మనం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు లాంటి మారీచులతో పోరాడుతున్నామని గుర్తుంచుకొని పనిచేయాలన్నారు. ఓటర్లకు సంబంధించి టీడీపీనే అక్రమాలకు పాల్పడుతూ, ఆ పార్టీ నేతలు ఎదురు మనపైనే ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. పచ్చ మీడియా, టీడీపీ కలిసి వైఎస్సార్‌సీపీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి, ఓటర్లు ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత నాలుగున్నరేళ్లుగా అమలు చేస్తున్న పథకాలతో మరోసారి వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించడం ఖాయమని చెప్పారు.
ప్రజలంతా వైఎస్సార్‌సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పాజిటివ్ ఓటుతో పాటు మరింత మంది వైఎస్ జగన్ నాయకత్వాన్ని బల పరుస్తున్నారని తెలిపారు. ఈ వర్క్‌షాప్‌లో తుమ్మల లోకేశ్వరరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతల సందేహాలను నివృత్తి చేశారు. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, శాసన మండలిలో ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి, జేసీఎస్ రాష్ట్ర కోఆరి్డనేటర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment