ఉన్నవి లేనట్టు... లేనివి ఉన్నట్టు పచ్చ పత్రిక అడ్డగోలు రాతలతో భ్రమింపజేస్తోంది. ఓటర్ల జాబితాలో ఉన్నవారు చనిపోయినట్టు చిత్రీకరిస్తోంది. ఓటర్ల జాబితా అంతా తప్పుల తడకలేనని నిర్ధారించేస్తోంది. ఎలాగోలా చంద్రబాబునాయుడును గద్దెనెక్కించడమే తమ లక్ష్యంగా దిగువస్థాయి నుంచి రామోజీ వరకూ అడ్డగోలు రాతలతో జనాన్ని తప్పుదారి పట్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, తప్పులు లేని ఓటర్ జాబితా తయారు చేసింది. – సాక్షి, నంద్యాల
అక్రమాలకు తెరతీసిన టీడీపీ
ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఓటర్ల అక్రమాలకు తెరలేపారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ సాయంతో గంపగుత్తంగా ఓటు హక్కు కోసం ఫారం–6లు నమోదు చేశారు. ఓటర్ జాబితాలో అనర్హులను తొలగించాలంటూ పెద్ద ఎత్తున ఫారం–7లను బూత్ స్థాయి అధికారులకు, ఎలక్ట్రోరల్ రిజి్రస్టేషన్ అధికారుల కార్యాలయాల్లో అందజేశారు. దురుద్దేశంతో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్వచ్ఛమైన తుది ఓటరు జాబితా రూపొందించారు. అయితే ఈనాడు మాత్రం తప్పుడు రాతలు రాస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతూ విషం కక్కుతోంది.
పచ్చ పత్రిక పిచ్చి రాతలు
పాణ్యం: పచ్చ పత్రిక విషపూరిత రాతలతో జనాన్ని పిచ్చెక్కిస్తోంది. లేనిపోని రాతలతో తప్పుదారి పట్టిస్తోంది. పాణ్యం నియోజకవర్గంలోని 131వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఆర్.జయరామ్, అతని భార్య ఆర్.రేణుకలకు ఓటు హక్కు ఉంది. వీరు అద్దె ఇంట్లో ఉండేవారు. ఆ తర్వాత సొంతింట్లోకి మారిన తర్వాత ఆర్.జయరామ్ మరణించారు.
131 బూత్‌లో ఉన్న ఓటు హక్కును రద్దు చేయాలని ఆర్.రేణుక ఫారం–7 ద్వారా అభ్యర్థించారు. పరిశీలించిన బీఎల్‌ఓలు ఆమె ఓటు(ఎన్‌కేడీ నంబర్ 2458899)ను జాబితా నుంచి తొలగించారు. ప్రస్తుతం 130 పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు నమోదైంది. అయితే భర్తతో పాటు భార్యకు కూడా 131లో ఓటు హక్కు తొలగించారని రాశారు. వాస్తవానికి ఆమె అభీష్టం మేరకే 131 బూత్‌లో భర్త ఓటు తొలగించి ఆమె ఓటును మార్చడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment