అయ్యో పాపం... స్వతంత్ర అభ్యర్థి
కేకేనగర్: ఓటర్లు జాబితాలో పేరు లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థి ఓటు వేయలేక నిరాశతో వెనుదిరిగారు. తిరువోత్తియూర్‌లో చిన్న మేట్టు పాలెయం కు చెందిన త మిళ్ సెల్వన్ ,మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈయన తిరువోత్తియూర్ నియోజక వర్గంలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సోమవారం ఉదయం తమిళ్‌సెల్వన్ తిరువోత్తియూర్ అవర్‌లేడి పాఠశాలలో ఓటు వేయడానికి ఓటర్ ఐడితో వెళ్లారు.
అక్కడున్న అధికారులు ఓటర్లు జాబితాను చెక్ చేయగా అందులో ఆయన పేరు లేదు. దీంతో తమిళ్ సెల్వన్ ఓటు వేయడానికి అనుమతి లభించలేదు. ఆయననిరాశతో వెనుదిరిగాడు. ఓటరు ఐడి,అభ్యర్థి గుర్తింపు కార్డులను చూపించి తనపేరు లేకుండా ఉంటే అధికారులు తన నామినేషన్‌ను ఎలా స్వీకరించారని ప్రశ్నించారు.
తంజావూరులో ఓటు వేయడానికి వచ్చిన ఓటర్లు
తంజావూరు నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థి ఓటర్లకు రూ.6 కోట్లు నగదు బట్వాడా చేసాడనే ఫిర్యాదు అందింది. విచారణలో నగదు బట్వాడా చేసినట్లు తెలియడంతో ఎన్నికలను హఠాత్తుగా నిలిపివేశారు. ఈ విషయం తెలియక అనేక మంది ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి నిరాశతో వెనక్కి వెళ్లారు.