‘టీడీపీ ఎమ్మెల్యే కూనరవితో ప్రాణహాని’ | independent candidate says life threats from TDP MLA Kuna Ravi | Sakshi
Sakshi News home page

‘టీడీపీ ఎమ్మెల్యే కూనరవితో ప్రాణహాని’

Published Wed, Oct 23 2024 1:09 PM | Last Updated on Wed, Oct 23 2024 3:26 PM

independent candidate says life threats from TDP MLA Kuna Ravi

శ్రీకాకుళం, సాక్షి: టీడీపీ నేతల దాడులు, బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే కూనరవితో తనకు ప్రాణహాని ఉందని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస స్వతంత్ర అభ్యర్థి సనపల సురేష్‌ తెలిపారు. ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఎమ్మెల్యే దాడి, బెదిరింపుల విషయాన్ని బయటపెట్టారు. 

‘‘ఎమ్మెల్యే కూనరవి నుంచి నాకు ప్రాణహాని ఉంది. అక్రమ ఇసుక రవాణా అడ్డుకుంటున్నానని దాడి చేశారు. ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు. జిల్లా ప్రభు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌ సరిగ్గా జరగలేదు. దెబ్బలు తగిలినా రిపోర్టు నార్మల్‌ అని ఇచ్చారు.‌ పోలీసులతో కలిసి నన్ను చంపేందుకు రవి కూమార్‌ స్కెచ్‌ వేశారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాల్సిందే. నాపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు’’ అని వీడియోలో తెలిపారు.

నన్ను చంపేందుకు.. పోలీసులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే స్కెచ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement