kuna ravi
-
ఏపీ అసెంబ్లీలో మంత్రుల తీరుపై TDP MLA కూన రవి విమర్శలు
-
‘టీడీపీ ఎమ్మెల్యే కూనరవితో ప్రాణహాని’
శ్రీకాకుళం, సాక్షి: టీడీపీ నేతల దాడులు, బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే కూనరవితో తనకు ప్రాణహాని ఉందని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస స్వతంత్ర అభ్యర్థి సనపల సురేష్ తెలిపారు. ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఎమ్మెల్యే దాడి, బెదిరింపుల విషయాన్ని బయటపెట్టారు. ‘‘ఎమ్మెల్యే కూనరవి నుంచి నాకు ప్రాణహాని ఉంది. అక్రమ ఇసుక రవాణా అడ్డుకుంటున్నానని దాడి చేశారు. ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు. జిల్లా ప్రభు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు. దెబ్బలు తగిలినా రిపోర్టు నార్మల్ అని ఇచ్చారు. పోలీసులతో కలిసి నన్ను చంపేందుకు రవి కూమార్ స్కెచ్ వేశారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాల్సిందే. నాపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు’’ అని వీడియోలో తెలిపారు. -
అచ్చెంనాయుడికి ముచ్చెమటలు!
-
ఉప సర్పంచ్కు అత్తింటి వేధింపులు
శ్రీకాకుళం: మహిళా ఉపసర్పంచ్కు అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తుంగపేటలో చోటు చేసుకుంది. గ్రామ ఉపసర్పంచ్ భర్త పేరు సుధీర్. ఆయన టీడీపీ నేత. ప్రభుత్వ విప్ కూన రవికి సన్నిహితుడు. దాంతో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'కూన రవి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు'
శ్రీకాకుళం: తుపాను నష్టాన్ని అంచనా వేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కూన రవి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆరోపించారు. ప్రజాధనాన్ని టీడీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని ధ్వజమెత్తారు. తుపాను బాధితులకు కాకుండా టీడీపీ కార్యకర్తలకు మేలు చేకూరేలా అధికారులు వ్యవహరించడంపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.