'కూన రవి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు'
శ్రీకాకుళం: తుపాను నష్టాన్ని అంచనా వేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కూన రవి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆరోపించారు. ప్రజాధనాన్ని టీడీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని ధ్వజమెత్తారు.
తుపాను బాధితులకు కాకుండా టీడీపీ కార్యకర్తలకు మేలు చేకూరేలా అధికారులు వ్యవహరించడంపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.