సరుబుజ్జిలి,ఇచ్ఛాపురం రూరల్: అమ్మా పథకాలన్నీ బాగున్నాయా..? అన్నీ మీకు అందుతున్నాయా..? లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా..? అంటూ ప్రజా ప్రతినిధులు ప్రజలను ఆరా తీస్తున్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం యరగాంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంటింటికీ తిరిగారు.
లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలును వివరించారు. అలాగే ఇచ్ఛాపురం మండలం డొంకూరులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఇంటింటికీ వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment