life threats
-
‘టీడీపీ ఎమ్మెల్యే కూనరవితో ప్రాణహాని’
శ్రీకాకుళం, సాక్షి: టీడీపీ నేతల దాడులు, బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే కూనరవితో తనకు ప్రాణహాని ఉందని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస స్వతంత్ర అభ్యర్థి సనపల సురేష్ తెలిపారు. ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఎమ్మెల్యే దాడి, బెదిరింపుల విషయాన్ని బయటపెట్టారు. ‘‘ఎమ్మెల్యే కూనరవి నుంచి నాకు ప్రాణహాని ఉంది. అక్రమ ఇసుక రవాణా అడ్డుకుంటున్నానని దాడి చేశారు. ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు. జిల్లా ప్రభు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు. దెబ్బలు తగిలినా రిపోర్టు నార్మల్ అని ఇచ్చారు. పోలీసులతో కలిసి నన్ను చంపేందుకు రవి కూమార్ స్కెచ్ వేశారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాల్సిందే. నాపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు’’ అని వీడియోలో తెలిపారు. -
హీరోయిన్ అనుష్క సోదరునికి ప్రాణభయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో గ్యాంగ్స్టర్ల మధ్య విభేదాలతో ప్రముఖ బహుభాషా నటి అనుష్క శెట్టి సోదరుడు గుణరంజన్ శెట్టి హత్యకు ప్రత్యర్థులు పథకం పన్నినట్లు వార్తలొచ్చాయి. వివరాలు... గతంలో ప్రముఖ మాఫియా నేరగాడు ముత్తప్పరై బతికున్నప్పుడు మన్విత్ రై, గుణరంజన్శెట్టిలు కుడి, ఎడమ భుజంలా ఉండేవారు. ముత్తప్ప రై మరణించిన తర్వాత ఈ ఇద్దరూ విభేదాలతో ప్రత్యర్థులుగా మారారు. ముత్తప్పరై స్థాపించిన జయ కర్ణాటక సంఘం నుంచి గుణరంజన్ బయటకు వచ్చి జయకర్ణాటక జనపర వేదికను స్థాపించి మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. దీంతో అసూయ పట్టలేని మన్విత్ రై తమ నేత హత్యకు కుట్ర పన్నాడని గుణరంజన్ అనుచరులు ఆరోపించారు. ఆదివారం రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసి గుణరంజన్‌కు భద్రత కల్పించాలని కోరారు. ఈ ఆరోపణలను మన్విత్ రై తోసిపుచ్చారు. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. చదవండి: విక్రమ్‌లో సూర్య ‘రోలెక్స్ సర్’ అంత బాగా ఎలా పేలాడు? -
తనను వ్యభిచారిగా చిత్రీకరించి..
సినిమా: మీరామిథున్ తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతోందని నటి శాలు షమ్ము పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రంలో నటించిన నటి శాలుషమ్ము. కాగా సమీపకాలంలో నటి మీరామిథున్ సినీ పరిశ్రమలోని ప్రముఖుల గురించి తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఉచిత ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్న ఈ అమ్మడు ప్రముఖ నటుడు విజయ్, సూర్యలడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆమె చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కూడా ఇటీవల మీరామిథున్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తనపై మీరామిథున్ హత్యా వేధింపులకు పాల్పడుతొందని శాలుషమ్ము చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అందులో ప్రముఖ నటులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి మీరా మిథున్ చర్యలను తాను ఖండించాలని పేర్కొంది. దీంతో ఆమె తన అనుచరులతో ఫోన్ ద్వారా హత్యా బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పింది. సినీ రంగంలో తనకు ఆమెకు మధ్య పోటీ ఉందని తెలిపింది. అయితే ఆమెకు అవకాశాలు లేకపోవడంతో తనపై అసూయ పెంచుకుందని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో తనను వ్యభిచారిగా చిత్రీకరించి అవకాశం లేకుండా చేసి పరిశ్రమ నుంచి తరిమికొడతానని బెదిరిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలను పొందుపరుస్తూ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తోందని చెప్పింది. దీంతో తాను తీవ్ర మనస్తాపానికి గురవుతున్నానంది. ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని చెప్పింది. కాబట్టి మీరామిథున్‌పై ఆమె అనుచరులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొంది. -
‘దీప’కు బెదిరింపులు..!
సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేన కోడలు దీపకు బెదిరింపులు, వేధింపులు పెరిగాయి. ఎంజీఆర్, అమ్మ, దీప పేరవైను అన్నాడీఎంకేలో విలీనం చేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం కారణంగానే ఈ బెదిరింపులు, వేదింపులు పెరిగాయి. దీంతో తనకు, తన భర్తకు భద్రత కల్పించాలని కమిషనర్ విశ్వనాథన్‌కు దీప విజ్ఞప్తి చేశారు.జయలలిత మరణం అనంతరం ఆమె మేన కోడలు దీప ఓ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంజీఆర్ అమ్మ దీప పేరవైతో రెండేళ్ల పాటుగా సాగిన ఈ పార్టీ వ్యవహారాల మీద అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. పదవుల్ని అమ్ముకున్నట్టుగా కూడా ఆరోపణలే కాదు, వ్యవహారం ముదిరి పోలీసు స్టేషన్ వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం పార్టీని నడప లేని పరిస్థితుల్లో ఉన్న దీప, ఇక రాజకీయాలకు దూరం అని గత వారం ప్రకటించారు. అలాగే, ఎంజీఆర్ అమ్మ దీప పేరవైను అన్నాడీఎంకేలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఆ పార్టీ కోసం జేబులు చిల్లు చేసుకున్న వాళ్లలలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమతో మాట వరసకైనా చెప్పకుండా, ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటారా..? అని ప్రశ్నిస్తున్నారు. జయలలిత మీదున్న అభిమానంతో దీప వెన్నంటి నిలబడి ఆస్తుల్ని సైతం అమ్ముకున్నామని చాలా మంది వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో దీపకు ఆ శక్తుల నుంచి బెదిరింపులు, వేధింపులు క్రమంగా పెరిగినట్టుంది. ఆడియో ద్వారా ఫిర్యాదు సోమవారం కమిషనర్ విశ్వనాథన్‌కు దీప ఆడియో రూపంలో ఫిర్యాదు చేశారు. తాను జయలలిత మేన కోడలుగా పేర్కొంటూ, ఇది వరకు తాను రాజకీయాల్లో ఉన్నానని,ప్రస్తుతం తప్పుకున్నట్టు గుర్తు చేశారు. రాజకీయ జీవితం నుంచి దూరంగా ఉన్న తనకు ప్రస్తుతం బెదిరింపులు, వేధింపులు క్రమంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన పార్టీ పేరవైను అన్నాడీఎంకేలో విలీనం చేసిన అనంతరం ఈ బెదిరింపులు పెరిగినట్టు వివరించారు. ఫోన్ల ద్వారా, వాయిస్ మెస్సేజ్‌ల ద్వారా వస్తున్న బెదిరింపులు ఆవేదనకు, ఆందోళనకు గురి చేస్తున్నాయని పేర్కొన్నారు. తాను ఓ మహిళ అనే విషయాన్ని కూడా పరిగణించకుండా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు అనారోగ్య సమస్య ఉందని, కొంత కాలం చికిత్స సైతం తీసుకోవాల్సి ఉందని, ఈ సమయంలో ఈ బెదిరింపులు భయాన్ని కల్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణ హాని సైతం ఉందని, దయ చేసి తనకు తన భర్త మాధవన్‌కు భద్రత కల్పించాలని కోరారు. అన్నాడీఎంకేలో పేరవైను విలీనం చేయడానికి అంగీకరించని శక్తులు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నాయని, తనకు భద్రత కల్పించాలని విన్నవించారు. -
నా భార్యను అప్పగించకపోతే ఆత్మహత్యే శరణ్యం
పంజగుట్ట: ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను విడదీసి ఆమె కుటుంబసభ్యులు తన భార్యను బలవంతంగా తీసుకెళ్లడమే కాకుండా పోలీసుల అండతో తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తనను కాపాడాలని బాధితుడు విశాఖపట్నం ప్రాంతానికి చెందిన పొన్నాన ప్రభాస్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నం నగరానినికి చెందిన తాను హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఉంటూ బిఎఫ్ఏ చదువుతున్నట్లు తెలిపారు. గత డిసెంబర్లో అదే ప్రాంతంలోని లోధా అపార్ట్మెంట్లో ఉంటున్న తన్వి అనే యువతితో పరిచయం ఏర్పడటంతో ఇద్దరం ప్రేమించుకున్నట్లు తెలిపాడు. ఫిబ్రవరి 15న శ్రీనగర్‌కాలనీలోని సాయిబాబా దేవాలయంలో స్నేహితులు, తన్వి సోదరి సమక్షంలో పెళ్లి చేసుకున్నామన్నారు. తన్వి తరచూ తనను వారి ఇంటికి తీసుకువెళ్లేదని, వారి అమ్మతో మాట్లాడే వాడినని తెలిపాడు. గత ఆరు నెలలుగా అదే అపార్ట్మెంట్లోనే ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నామన్నారు. గత నెల 7న తన్వీ కుటుంబసభ్యులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి గృహనిర్భంధం చేశారని, అదే రోజు రాత్రి కెపీహెచ్బీ పోలీసులు తనను బలవంతంగా అరెస్టు చేసి తీసుకు వెళ్లారని, స్టేషన్లో మూడు గంటల పాటు చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిపాడు. పోలీసుల ఎదుటే తన్వి తండ్రి శ్రీనివాసరావు కొందరు వ్యక్తులు తనపై దాడి చేశారని, తన ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి తన భార్య దుస్తులు, పెళ్లి జరిగిన ఆధారాలను తీసుకెళ్లినట్లు తెలిపారు. తన ఫోన్, ల్యాప్‌ట్యాప్, ఇంట్లో ఉన్న బంగారం కూడా తీసుకెళ్లారని ఆరోపించాడు. న్యాయం చేయాల్సిన పోలీసులే నిందితులతో చేతులు కలిపి తనను వేధిస్తున్నారని ఆరోపించాడు. ప్రతీ రోజు తనను చంపేస్తామని బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని, తన ప్రాణాలకు హాని ఉందన్నారు. ఈ విషయం తెలియడంతో తమ కుటుంబసభ్యులు తనను విశాఖపట్నం రానివ్వడంలేదని, అటు భార్య దూరమై, ఇటు కన్నవారు దూరమై ఒంటరి అయిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్యను అప్పగించకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమన్నాడు. తన్వి చాలా మంచిదని, ఆరు నెలలు తాము ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. తన్విని గృహ నిర్భంధం చేసిన ఆమె కుటుంబసభ్యులు తనను కలవకుండా చూస్తున్నారన్నారు. రాష్ట్ర హోం మంత్రి, పోలీస్ కమిషనర్ జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరాడు. -
నటికి హత్యా బెదిరింపులు
పెరంబూరు: హత్యాబెదిరింపులపై నటి మీరామిథున్ చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వివరాలు చూస్తే 8 తోట్టాగళ్, తానా సేర్నద కూట్టం చిత్రాల్లో నటించిన నటి మీరామిథున్. ఈమె గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో స్థానిక వెప్పేరిలోని పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అంతకుముందు మీడియాతో మీరామిథున్ మాట్లాడుతూ తాను ఎంతో పారాడి మిస్ సౌత్ఇండియన్ కిరీటాన్ని గెలుచుకున్నానని చెప్పింది. అలా అందాల పోటీల్లో పాల్గొని కిరీటం గెలుచుకోవడం సులభమైన విషయం కాదంది. 15 ఏళ్లగా జరుగుతున్న మిస్ సౌత్ఇండియన్ పోటీల్లో తొలిసారిగా కిరీటం గెలుచుకున్న మహిళను తానేనని చెప్పింది. తన మాదిరి తమిళ యువతులు కష్టపడరాదన్న తలంపుతో తానే అందాల పోటీలను నిర్వహించడానికి సిద్ధం అయ్యానని చెప్పింది. మిస్ తమిళ్ దివా పేరుతో సోమవారం ఈ అందాల పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పింది. ఈ పోటీలను నిర్వహించకూడదంటూ ఇతర రాష్ట్రాల నుంచి తనకు పలు బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని చెప్పింది. ఈ పోటీల్లో పాల్గొనే మహిళలకు బెదిరింపు పోన్లు వస్తున్నాయని తెలిపింది. ఆరు నెలలుగా తాను వస్తున్న ఇలాంటి ఫోన్లను పక్కన పెడుతూ వచ్చానని, వారం రోజులుగా తనకు హత్యాబెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పింది. దీంతో ఈ రోజు పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వచ్చానని తెలిపింది. తాను నిర్వహించనున్న అందాల పోటీలకు పోలీసులు భద్రత కల్పిస్తారనే నమ్మకం ఉందని నటి మీరామిథున్ పేర్కొంది. మీరామిథున్ బాలీవుడ్ గాయకుడి పేరుతో మోసం పెరంబూరు: మోసపోయేవాళ్లు ఉన్నంత వరకూ మోసగాళ్లు పెరుగుతూనే ఉంటారు. ఏ విషయంలోనైనా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. లేకుంటే ఈ విధంగా మోసపోతుంటారు. కోవై, ఉళుందూర్‌కు చెందిన మహేంద్రవర్మన్ అనే బీఎడ్ పట్టభద్రుడు బాలీవుడ్ ప్రముఖ గాయకుడు అర్మాన్మాలిక్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ను రూపొందించి యువతులను బెదిరించి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించాడు. హింది గాయకుడి పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ను ప్రారంభించి తద్వారా యువతులను ఆకర్షించాడు. ఆ తరువాత వారితో స్నేహం చేసి ట్విట్టర్ ద్వారా వారి ఆంతరంగిక ఫొటోలను రాబట్టుకున్నాడు. ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తానని బెదిరించి వారి నుంచి డబ్బు గుంజుతున్నాడు. ఈ విధంగా 15 మంది వద్ద రూ.50 లక్షల వరకు దోచుకున్నాడు. అతని బాధితురాలైన కోవైకు చెందిన ఒక యువతి ధైర్యం చేసి కోవై నేర పరిశోధనా శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ యమున, సబ్ఇన్స్పెక్టర్ అరుణ్ నిందితుడిని పట్టుకునేందుకు పకడ్బందీగా పథకం రూపొందించారు. ఫిర్యాదు చేసిన యువతిని మహేంద్రవర్మన్‌తో మాట్లాడించి డబ్బు ఇస్తానని ఒక చోటుకు రావలసిందిగా చెప్పించారు. బుధవారం అతను ఆ యువతి చెప్పిన ప్రాంతానికి రాగా అక్కడ దాగిఉన్న పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. విచారణలో మహేంద్రవర్మన్ గత ఏదాడిన్నరగా మహిళలను ఇలాంటి బెదిరింపులకు గురి చేస్తూ డబ్బు గుంజుతున్నట్లు తెలిసింది. దీంతో అతనిపై నమోదు చేసి విచారిస్తున్నారు. -
ప్రియురాలి తండ్రి కిడ్నాప్
టీ.నగర్: చెన్నైలో ప్రియురాలి తండ్రిని కిడ్నాప్ చేసి హత్యా బెదిరింపులు చేసిన పెయింటర్ సహా ముగ్గురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మంగళవారం మధ్యాహ్నం సెక్రటేరియట్ కాలనీ పోలీసు మహిళా ఇన్స్పెక్టర్ రాజేశ్వరి కార్యాలయ పని నిమిత్తం ఐనావరం పోలీసు స్టేషన్లో ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి ఇద్దరు మహిళలు రోదిస్తూ వచ్చారు. వారిలో ఒకరు ఐనావరం పరశురామన్ వీధికి చెందిన ఆర్తి (20). ఇద్దరు మహిళలను ఇన్స్పెక్టర్ రాజేశ్వరి కూర్చోబెట్టి వివరాలు అడిగింది. ఆర్తి మాట్లాడుతూ తనకు ఐనావరం ఠాగూర్‌నగర్‌కు చెందిన ప్రవీణ్ (25)తో 2013లో వివాహమైందని, తమకు జోష్వా (4) అనే కుమారుడున్నట్లు తెలిపారు. మూడేళ్ల క్రితం భర్తను విడిచి పుట్టింటికి వచ్చానని, ఆ సమయంలో పెరంబూరు రాజీవ్‌గాంధీ నగర్‌కు చెందిన పెయింటర్ సుభాష్‌తో వివాహేతర సంబంధం ఏర్పడిందని, అతనితో కొన్నేళ్లు జీవించినట్లు తెలిపారు. తర్వాత భర్త ప్రవీణ్ తనను మళ్లీ కాపురానికి తీసుకెళ్లాడని, అక్కడ మళ్లీ సమస్యలు ఏర్పడడంతో పుట్టింటికి వచ్చినట్లు తెలిపారు. ఇదిలాఉండగా ఈనెల 19న తన తల్లికి ఒక ఫోన్‌కాల్ వచ్చిందని అందులో మాట్లాడిన సుభాష్ ఆర్తిని తనకు అప్పగించి మీ భర్తను తీసుకువెళ్లండని బెదిరించినట్లు పేర్కొన్నారు. తన తండ్రిని హతమారుస్తారనే భయంగా ఉందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలావుండగా దీనిపై కేసు నమోదు చేసిన పోలీసు ఇన్స్పెక్టర్ రాజేశ్వరి బుధవారం మారువేషంలో వెళ్లి పెయింటర్ సుభాష్‌ను అరెస్టు చేశారు. -
రక్షణ కల్పించండి
నెల్లూరు(దర్గామిట్ట): తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మిడతల హేమశ్రీ అనే యువతి కోరింది. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను దందు జగదీష్ అనే యువకుడు జూన్ నెలలో జొన్నవాడలో ప్రేమ వివాహం చేసుకున్నామని చెప్పింది. కుటుంబసభ్యుల్లో కొందరు భర్తను వదిలివేయమని చెబుతూ దౌర్జన్యం చేస్తున్నారని వాపోయింది. ఫోన్ చేసి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని తెలిపింది. తనను భర్తను వేరేచేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇబ్బంది పెడుతున్నారని చెప్పింది. వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి ఆదుకోవాలని కోరింది. -
డబ్బు ఇచ్చి అమ్మాయిలను..
పెరంబూరు: నటుడు అర్జున్ అభిమానుల నుంచి తనకు హత్యాబెదిరింపులు వస్తున్నాయని నటి శ్రుతీహరిహరన్ ఆరోపించింది. దేశంలో మీటూ కలకలం రోజురోజుకు పెరిగిపోతోందనే చెప్పాలి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఇది రచ్చ రచ్చగా మారింది. మీటూ ఆరోపణలు చాలా కాలం నుంచే ఉన్నా, గాయని చిన్మయి గీతరచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేయడంతో ఇది ఒక ఉప్పెనలా చెలరేగింది. నటుడు అర్జున్ను కూడా ఈ మీటూ సెగలు తాకాయి. మలయాళ నటి శ్రుతీహరిహరన్ ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. షూటింగ్ పూర్తి కాగానే క్యారవాన్‌కు రమ్మని సినీ కార్మికుడితో చెప్పేవారని, పలు మార్లు రాత్రి విందుకు ఆహ్వానించి వేధించారని ఆరోపించింది. శ్రుతీ హరిహరన్ ఆరోపణలను అర్జున్ కొట్టి పారేస్తూ, ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాగా ఆయన అభిమానులు తనపై హత్యాబెదిరింపులు చేస్తున్నారని ఆమె ఆదివారం మళ్లీ ఆరోపణలు చేసింది. ఈమె కేరళాలో జరిగిన హక్కులు సమధర్మ సినీ శాఖ అనే సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ నటుడు అర్జున్‌పై లైంగిక ఆరోపణలు చేసినప్పటి నుంచి ఆయన అభిమానులు తనపై హత్యాబెదిరింపులు చేస్తున్నారంది. అపరిచితుల ఫోన్‌కాల్స్ నిరాటంకంగా వస్తున్నాయని చెప్పింది. ఈ సందర్భంగా ఏడాది దాటిన తరువాత ఈ ఆరోపణలు చేయడంలో ఆంతర్యం ఏమిటని విలేకరి అడిగిన ప్రశ్నకు తాను అప్పుడే తన ఆవేదనను, వ్యతిరేకతను ఆ చిత్ర దర్శకుడి వద్ద వ్యక్తం చేశానన్నారు. అదే విధంగా ఆ చిత్ర రిహార్సల్స్‌కు వెళ్లడం మానేశానని, అంతకంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో తాను ఉన్నానని బదులిచ్చింది. ఇప్పుడు మీటూ ద్వారా పలువురు తాము ఎదుర్కొన్న వేధింపులను బహిరంగంగా చెప్పడానికి ముందుకు రావడంతో తాను తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు పేర్కొంది. సహాయ నటి ఆరోపణలు.. నటుడు అర్జున్‌పై మరో సహాయ నటి కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఒక చిత్ర షూటింగ్లో వేరే యువతిని తన గదికి తీసుకురమ్మని తనతో అర్జున్ చెప్పారని, అదే విధంగా ఆర్టిస్ట్ సప్లయర్‌కు డబ్బు ఇచ్చి అమ్మాయిలను తెప్పించుకునేవారని ఆ సహాయ నటి ఆరోపణలు చేస్తూ ఒక టీవీకిచ్చిన భేటీలో పేర్కొంది. -
బిక్కుబిక్కుమంటున్న చంద్రబాబు కాలనీ
తొట్టంబేడు: తొట్టంబేడు పంచాయతీలోని చంద్రబాబునాయుడు కాలనీ ఎస్టీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మంగళవారం టీడీపీ కార్యకర్తల నుంచి మళ్లీ ఎస్టీలకు బెదిరింపుల పర్వం మొదలైంది. డీఎస్పీ రామకృష్ణ, సీఐ బాలయ్య, ఎస్ఐ సుధాకర్ కాలనీకి వెళ్లి రక్షణగా ఉంటామని ప్రజలకు హామీ ఇచ్చి వెళ్లారో లేదో కాసేటికే పారిశ్రామికవేత్త అనుచరుడు ధర్మయ్య ఖాళీచేయాలని, కేసు వాపస తీసుకోవాలని బెదిరించి వెళ్లడం గమనార్హం! గొడవ జరిగి 48 గంటలు గడుస్తున్నా ఇంతవరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదని ఎస్టీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ లీలలతోనే సమస్యలు జటిలం హౌసింగ్ అధికారులు 25మంది ఎస్టీలకు పక్కాగృహాలు నిర్మించారు. వీరందరికీ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఎంజాయ్మెంట్, ఓటరు కార్డులు, నివాస, కుల ధ్రువీకరణపత్రాలు కూడా ఉన్నాయి. మౌలిక వసతులనూ కల్పించారు. పారిశ్రామికవేత్త గుడ్లూరి మల్లిఖార్జున నాయుడు పేరిట 2015లో అప్పటి తహసీల్దారు పట్టాలు పంపిణీ చేశారు. అయితే 1995లో ఎస్టీలకు పక్కా గృహాలు నిర్మించుకునేందుకు రెవెన్యూ అధికారులు ఎంజాయ్మెంట్ ఇస్తే దానిపై మళ్లీ ఎలా రెవెన్యూ అధికారులు పారిశ్రామికవేత్తకు పట్టా ఎలా ఇస్తారని ఎస్టీలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆ పారిశ్రామికవేత్త అనుచరులు ఎస్టీలను ఖాళీ చేయాలని నెల రోజులుగా చేస్తున్న దౌర్జన్యాలకు ఎస్టీలు ప్రాణభయంతో హడలిపోతున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, కలెక్టర్ అయినా స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. రికార్డులు పరిశీలిస్తున్నాం చంద్రబాబునాయుడు ఎస్టీ కాలనీ సంబం ధించిన రికార్డులు పరిశీలిస్తున్నాం. మహిళలకు రక్షణ కల్పించాలని పోలీసులకు చె ప్పాం. ఎస్టీలకు న్యాయం జరిగేలా చూస్తాం. –యుగంధర్, తహసీల్దారు,తొట్టంబేడు మండలం -
కోడలి కుటుంబం నుంచి రక్షించండి
కర్నూలు: కోడలు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామానికి చెందిన హుల్తెన్న ఎస్పీ గోపీనాథ్ జట్టికి ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ గోపీనాథ్ జట్టి పోలీస్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 9121101200 ఫోన్‌కు వచ్చిన ఫిర్యాదులను నోట్ చేసుకున్నారు. అలాగే ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జి ల్లా వ్యాప్తంగా మొత్తం 67 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల్లో కొన్ని... ♦ ఇల్లు లేని పేదలకు ప్రభుత్వ స్థలాలు ఇప్పిస్తానని చెప్పి తహసీల్దార్ సంతకం ఫోర్జరీతో నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేశారని నగరంలోని కృష్ణానగర్‌కు చెందిన విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచారణ జరిపి మోసం చేసినవారిని శిక్షించి తమ డబ్బులు ఇప్పించాలని కోరారు. ♦ తన పొలంలోకి రానివ్వకుండా కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామానికి చెందిన రామనాథ అయ్యమ్మ వాపోయింది. భూ సమస్య గురించి కొంతమంది నుంచి ప్రాణహాని ఉందని, విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరింది. ♦ ఆదోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో కొందరు పేకాట నిర్వహిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఆయా కాలనీల వాసులు ఫిర్యాదు చేశారు. ♦ కర్నూలు నగరంలో నెలనెలా స్కీమ్‌ల పేరుతో కొందరు డబ్బులు కట్టించుకుని మోసాలకు పాల్పడుతున్నారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలు కాలనీల వాసులు ఫిర్యాదు చేశారు. ♦ తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన పొలాన్ని కుమారుడు కౌలుకు తీసుకుని 12 ఏళ్లైనా ఇంతవరకు డబ్బు ఇవ్వకపోగా జీవనాధారం కోసం పొలాన్ని అమ్ముకుందామంటే అడ్డుకుంటున్నాడని, న్యాయం చేయాలని శిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామానికి చెందిన సిరిగిరి సుంకమ్మ ఫిర్యాదు చేసింది. చీకటి పడితే కళ్లు సరిగా కనిపించవని, ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు తనకు పొలాన్ని రాసిచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ♦ తమ కుమార్తెను అనుమానంతో హత్య చేశారని కొత్తపల్లి మండలం ఎదురుపాడు గ్రామానికి చెందిన నేరేడు చిన్నయ్య ఫిర్యాదు చేశారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాదర్బార్, డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాలకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ ఎస్పీ షేక్షావలి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు నజీముద్దీన్, బాబుప్రసాద్, వెంకటాద్రి, వినోద్‌కుమార్, సీఐలు ములకన్న, పవన్‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
'జుకర్ బర్గ్, జాక్‌లను చంపేస్తాం'!
లండన్: ప్రపంచ వ్యాప్తంగా అనూహ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని నరమేధం కొనసాగిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కన్ను ఇప్పుడు ఫేస్బుక్, ట్విట్టర్లపై పడింది. ఈరెండు సంస్థల బాస్‌లను తాము త్వరలోనే హత్య చేస్తామంటూ ఐసిస్ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో డిజిటల్ టెక్నాలజీతో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జూకర్ బర్గ్, ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సేల ఫొటోలను చూపిస్తూ వాటికి బుల్లెట్లతో రంధ్రాలు పెడుతున్నట్లు చూపించారు. ఉగ్రవాదానికి, తీవ్ర భావజాలానికి సంబంధించిన అంశాలకు చోటులేదని ప్రకటించి అలాంటి కంటెంట్ మొత్తాన్ని ఈ రెండు వెబ్ సైట్లు తొలగించడంతోపాటు మున్ముందు అలాంటివి పోస్ట్ చేసే అవకాశం లేకుండా చేశాయి. ఈ నేపథ్యంలోనే ఐసిస్ ఈ రెండు సైట్ల పెద్ద తలకాయలను టార్గెట్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. సన్స్ ఆఫ్ కాలిపత్ ఆర్మీ అనే పేరిట విడుదల చేసిన ఈ వీడియోలో పలు హెచ్చరికలను కూడా ఐఎస్ చేసింది. తాము ఇప్పటి వరకు 10,000 ఫేస్ బుక్ ఖాతాలు,150 ఫేస్ బుక్ గ్రూప్స్ ను హ్యాక్ చేసినట్లు చెప్పింది. 5,000 ట్విట్టర్ ఖాతాలను కూడా దొంగిలించినట్లు వెల్లడించింది. ఫేస్ బుక్, ట్విట్టర్ తన చర్యలు ఆపేయకుంటే వాటిని తన మద్దతుదారులకు తాము హ్యాక్ చేసిన ఖాతాలను కేటాయిస్తామని బెదిరించింది. 'మీరు, మీ అమెరికా ప్రభుత్వం మా ఖాతాలను ఎన్నైనా తొలగించుకోవచ్చు. వాస్తవానికి ఇప్పటి వరకు మాకు లక్ష్యంగా లేరు. కానీ ఇప్పటి నుంచి మీరు ఒక్క ఖాతా తొలగిస్తే మేం పది సృష్టిస్తాం. త్వరలోనే మీ పేర్లు చెరిపేస్తాం, మీ సైట్లను కుప్పకూల్చేస్తాం' అని ఐఎస్ హెచ్చరించింది.