
మీరామిథున్, శాలుషమ్ము
సినిమా: మీరామిథున్ తనపై హత్యా బెదిరింపులకు పాల్పడుతోందని నటి శాలు షమ్ము పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వరుత్త పడాద వాలిబర్ సంఘం చిత్రంలో నటించిన నటి శాలుషమ్ము. కాగా సమీపకాలంలో నటి మీరామిథున్ సినీ పరిశ్రమలోని ప్రముఖుల గురించి తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఉచిత ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్న ఈ అమ్మడు ప్రముఖ నటుడు విజయ్, సూర్యలడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆమె చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా కూడా ఇటీవల మీరామిథున్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తనపై మీరామిథున్ హత్యా వేధింపులకు పాల్పడుతొందని శాలుషమ్ము చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
అందులో ప్రముఖ నటులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి మీరా మిథున్ చర్యలను తాను ఖండించాలని పేర్కొంది. దీంతో ఆమె తన అనుచరులతో ఫోన్ ద్వారా హత్యా బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పింది. సినీ రంగంలో తనకు ఆమెకు మధ్య పోటీ ఉందని తెలిపింది. అయితే ఆమెకు అవకాశాలు లేకపోవడంతో తనపై అసూయ పెంచుకుందని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో తనను వ్యభిచారిగా చిత్రీకరించి అవకాశం లేకుండా చేసి పరిశ్రమ నుంచి తరిమికొడతానని బెదిరిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలను పొందుపరుస్తూ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తోందని చెప్పింది. దీంతో తాను తీవ్ర మనస్తాపానికి గురవుతున్నానంది. ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని చెప్పింది. కాబట్టి మీరామిథున్‌పై ఆమె అనుచరులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment