
సినిమాలకంటే వివాదాలతో పాపులర్ అయ్యారు తమిళ హీరోయిన్ మీరా మిథున్. ఏదో ఒక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ బిగ్‌బాస్ బ్యూటీ. దళిత దర్శకులు, నటీనటులు సినిమాల్లోకి రావడం వల్ల తనకు సినీ అవకాశాలు తగ్గిపోయాయని, దళితులను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరో ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో పోలీస్ కమిషనర్ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా మీరాకు చెన్నై పోలీసులు నోటీసులు జారీచేశారు. అయితే విచారణకు ఆమె వస్తుందని అనుకోగా.. పోలీసుల నోటీసులను లెక్కచేయకుండా విచారణకు హాజరు కాలేదు. దీంతో మీరాను పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చనే సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. కాగా ఈ విషయంపై మీరా మిథున్ స్పందించింది. తనను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుందని తెలిపింది. తనను పోలీసులు అరెస్ట్ చేయడం జరగదని, అది అసాధ్యం అని పేర్కొంది. సాధ్యమైతే తనను నిర్భయంగా అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ విసిరింది.
Comments
Please login to add a commentAdd a comment