caste conflict
-
నన్ను అరెస్ట్ చేయడం కలలోనే సాధ్యం.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
సినిమాలకంటే వివాదాలతో పాపులర్ అయ్యారు తమిళ హీరోయిన్ మీరా మిథున్. ఏదో ఒక విషయంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ బిగ్బాస్ బ్యూటీ. దళిత దర్శకులు, నటీనటులు సినిమాల్లోకి రావడం వల్ల తనకు సినీ అవకాశాలు తగ్గిపోయాయని, దళితులను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు మరో ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పోలీస్ కమిషనర్ కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా మీరాకు చెన్నై పోలీసులు నోటీసులు జారీచేశారు. అయితే విచారణకు ఆమె వస్తుందని అనుకోగా.. పోలీసుల నోటీసులను లెక్కచేయకుండా విచారణకు హాజరు కాలేదు. దీంతో మీరాను పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చనే సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. కాగా ఈ విషయంపై మీరా మిథున్ స్పందించింది. తనను అరెస్ట్ చేయడం కలలోనే జరుగుతుందని తెలిపింది. తనను పోలీసులు అరెస్ట్ చేయడం జరగదని, అది అసాధ్యం అని పేర్కొంది. సాధ్యమైతే తనను నిర్భయంగా అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ విసిరింది. -
నా కులంపై దుష్ప్రచారం చేస్తున్నారు: పుష్ప శ్రీవాణి
సాక్షి, విజయనగరం: తన కులంపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. నూటికి నూరు శాతం తాను ఎస్టీ కొండ దొర కులానికి చెందిన వ్యక్తిని అన్నారు. తన సోదరి స్పెషల్ డీఎస్సీ పోస్టును వెనక్కి తీసుకోవడంపై ఆమె స్పందించారు. ‘‘నాన్ లోకల్ కారణంగానే మా సోదరికి స్పెషల్ డీఎస్సీలో పోస్టు వెనుకకి తీసుకున్నారు. కులం కారణం కాదు. ఏ విషయం మీద తొలగించారన్నది ఎందుకు మీరు చెప్పడం లేదు. 2014 ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఎమ్మార్వో ఇచ్చిన కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించినందుకు రిటర్నింగ్ అధికారికి అనర్హత వేటు వేయాలని కొందరు ఫిర్యాదు చేశారు’’ అని పుష్ప శ్రీ వాణి తెలిపారు. ‘‘అయితే, ఎస్టీ కుల ధృవీకరణ పత్రం ఆర్డీవో కాకుండా ఎమ్మార్వో ఇవ్వచ్చొన్న నిబంధన ఉందని… ఇదే విషయం సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద నుంచి లిఖిత పూర్వకంగా తీసుకున్నాం. దీనిపై విచారణ జరుగుతుంది. నిజాలు త్వరలోనే తేలుతాయి. రాజకీయంగా కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారే తప్ప.. వాళ్లకీ తెలుసు నేను ఏ తప్పు చేయలేదని. కానీ అబద్దాన్ని పది సార్లు చెప్పి నిజం అనిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. న్యాయం నావైపే ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు పుష్ప శ్రీవాణి. చదవండి: గిరిజనులకు రక్షణగా ఎస్టీ కమిషన్: పుష్పశ్రీవాణి -
‘సహరాన్పూర్’ బాధితులను కలిసిన రాహుల్
జిల్లాలోకి అనుమతించని అధికారులు సహరాన్పూర్: కులఘర్షణలతో అట్టుడికిన ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లోకి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అధికారులు శనివారం అనుమతించకపోవడంతో ఆయన బాధితులను జిల్లా సరిహద్దుల్లోనే కలిశారు. ఈ విషయాన్ని రాహుల్ ట్వీటర్లో తెలిపారు. సహరాన్పూర్లోని షబ్బీర్పూర్ గ్రామంలో మే 5న ఠాకూర్లకు, దళితులకు మధ్య జరిగిన గొడవల్లో దళితుల ఇళ్లను తగులబెట్టడం తెలిసిందే. వీరిని పరామర్శించేందుకు రాహుల్ షబ్బీర్పూర్ వెళ్లాలనుకున్నారు. ఆయనను గ్రామంలో పర్యటించేందుకు అనుమతించేది లేదని అధికారులు ముందుగానే హెచ్చరించారు. బాధితులు చికిత్స పొందుతున్న వైద్యశాలకు వెళ్లేందుకైనా అనుమతి ఇవ్వాలని రాహుల్ కోరారు. వైద్యశాలలో ఇప్పుడు ఎవరూ లేరనీ, అందరినీ డిశ్చార్జి చేశారని అధికారులు చెప్పారు. అయితే కాంగ్రెస్ నేత పీఎల్ పునియా మాట్లాడుతూ, శుక్రవారం రాత్రే ఆసుపత్రికి వెళ్లాననీ, 23 మందిని అర్ధాంతరంగా డిశ్చార్జి చేసి పంపించారని అన్నారు. బాధితులకు ఇప్పటివరకు ప్రభుత్వం కేవలం రూ.5 లక్షలు పరిహారాన్ని మాత్రమే విడుదల చేయడాన్ని రాహుల్ ప్రశ్నించగా, ఈ అంశాన్ని పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు.