అసెంబ్లీకి పోటీ.. అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాలి: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Participates In Children's Day Celebrations At SCERT | Sakshi
Sakshi News home page

ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం విపక్షాల బాధ్యత: సీఎం రేవంత్‌

Published Thu, Nov 14 2024 5:14 PM | Last Updated on Thu, Nov 14 2024 6:11 PM

CM Revanth Reddy Participates In Children's Day Celebrations At SCERT

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీలో లీడర్‌ ఆఫ్‌ ది హౌస్‌, లీడర్‌ ఆఫ్‌ ది అపొజిషన్‌ ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయని అన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. సభను సమర్థవంతంగా నడిపే బాధ్యత స్పీకర్‌పై ఉంటుందన్నారు. సభలో ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం విపక్షాల బాధ్యత అని పేర్కొన్నారు.

నేడు(నవంబర్‌ 14) బాలల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్టీ(స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్)కార్యాలయ ప్రాంగణంలో ‘విద్యార్థులు అండర్‌-18 మాక్‌ అసెంబ్లీ’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం  మాట్లాడుతూ... మాక్‌ అసెంబ్లీ వంటి సమావేశాలు సమాజానికి చాలా అవసరమని తెలిపారు. శాసన సభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, సమాధానాలు, ఇతర అంశాలను విద్యార్థులు గమనించాలని సూచించారు.

‘విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం సమన్వయంతో సభను నడిపించేలా చూడాలి. కానీ దురదృష్టవశాత్తు ఈరోజుల్లో కొందరు సభను ఎలా వాయిదా వేయాలా అనే విధంగా చేస్తున్నారు. చైల్డ్రన్ మాక్ అసెంబ్లీని స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన మీ అందరినీ అభినందిస్తున్నా. జవహర్ లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. వారి వల్లే మనకు సమాజంలో ఇవాళ అవకాశాలు వచ్చాయి. దేశంలో నిర్బంధ విద్య అమలు చేసేందుకు సోనియా గాంధీ, మన్మోహన్ ఎంతో సింగ్ కృషి చేశారు.18 ఏళ్లకే యువతకు ఓటు హక్కును అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీది. 

ఎన్నికల్లో శాసనసభకు  పోటీ చేసేందుకు 25 ఏళ్ల వయసు నిబంధన ఉంది. ఓటు హక్కు పొందేందుకు వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 18ఏళ్లకు తగ్గించారు. అదే విధంగా అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాల్సిన అవసరముంది. 21 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలి. దీని వల్ల యువత రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. 21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్‌, ఐపీఎస్‌లుగా పనిచేస్తున్నప్పుడు... 21 ఏళ్లు నిండిన వారు శాసనసభ్యులుగా కూడా రాణిస్తారని బలంగా నమ్ముతున్నా. చిల్డ్రన్ మాక్ అసెంబ్లీలో ఇలాంటి బిల్స్‌ను  పాస్ చేయడం అభినందనీయం’ అని తెలిపారు.

మాక్ అసెంబ్లీలో చిన్నారులతో రేవంత్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement