సాక్షి, అమరావతి: ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ ఆదివారం విజయవాడలో ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి నెల రోజులపాటు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని అన్ని పోలింగ్ కేంద్రాల్లో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పేర్ల నమోదు, మార్పులు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇక మీదట ఫామ్ 7 దుర్వినియోగం కుదరదని స్పష్టం చేశారు. WWW.NVSP.IN వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు అని సూచించారు. Voter helpline app, 1950 నంబర్ల ద్వారా కూడా ఓటర్ల నమోదుకు అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పూర్తయ్యాక అక్టోబర్ 15న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment