Vijayanand
-
పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల కేటాయింపు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకుగాను పలు ప్రైవేటు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆయా సంస్థలకు ప్రాజెక్టులను కేటాయిస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్టులకు 30 ఏళ్ల పాటు ప్రభుత్వం భూమిని సమకూరుస్తుందని, ఎకరాకు రూ.31 వేలు చొప్పున ఏటా లీజు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా వీటిలో పలు ప్రాజెక్టులను ముందుగా అనుకున్న సంస్థలను పక్కనపెట్టి కొత్త సంస్థల బదిలీ చేయడం గమనార్హం. ఎకోరెన్ ఎనర్జీ ఇండియా నుంచి బదిలీలుఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆంపిన్ ఎనర్జీ పవర్ ట్రాన్సిషన్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ సంస్థలకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 349.50 మెగావాట్ల పవన, సౌర విద్యుత్ పాజెక్టులు బదిలీ. » ఇదే సంస్థ నుంచి ఎన్ఎస్ఎల్ రెన్యూవబుల్ సీపీపీ ప్రైవేట్ లిమిటెడ్‌కు శ్రీ సత్యసాయి జిల్లా, కనగానపల్లె మండలం, మద్దెలచెర్వు గ్రామం వద్ద 50 మెగావాట్ల పవన, సౌర హైబ్రీడ్ విద్యుత్ ప్రాజెక్ట్ బదిలీ. » అనంతపురంలోని రాళ్ల అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో సంస్థకు కేటాయించిన 201.30 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ ఓ2 పవర్ గ్రూప్ కంపెనీలకు బదిలీ. » కర్నూలు జిల్లా ఆస్పరి సమీపంలో 498.30 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్.. అయన రెన్యూవబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ.ఎవరికి... ఏవి..? » మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్: అన్నమయ్య జిల్లాలో 2000 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్ట్.» టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ: అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం గంగవరం సమీప గ్రామాల వద్ద 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్.»నవయుగ ఇంజనీరింగ్: అల్లూరి సీతారామరాజు జిల్లా గుజ్జిలిలో 1500 మెగావాట్లు, చిట్టంవలసలో 800 మెగావాట్లు చొప్పున మొత్తం 2300 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్ట్‌లు.» కడప రెన్యూవబుల్స్: శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎలకుంట్ల, ముతవకుంట్ల, రామగిరి, నసనకోట గ్రామాలు, కనగానపల్లె, రామగిరి మండలాల్లో 231 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు.» అనంతపురం రెన్యూవబుల్స్: అనంతపురం జిల్లాలోని అడివిగొల్లపల్లె, బచ్చుపల్లె, యాటకల్, గరుడాపురం, పిల్లలపల్లె, కళ్యాణదుర్గ్, తీటకల్, హులికల్, చాపిరి, ముదిగల్, తూర్పు కోడిపల్లె, పాలవోయ్, నరసాపురం, కళ్యాణదుర్గం, బ్రహ్మాదురంలో 178.20 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్.» ఆస్పరి రెన్యూవబుల్స్: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని కంబదూరు, రామగిరి మండలాల్లోని మోటార్చింతలపల్లె, కూరాకులపల్లె, పేరూరు, కొండాపురం, మక్కినవారిపల్లె గ్రామాల్లో 118.80 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు.» సాయెల్ సోలార్: వైఎస్ఆర్ జిల్లా పెద్దముడియం మండలం గోవిందపల్లె దిగువ, కల్వతల, కొండసుంకేసుల, నాగిరెడ్డిపల్లే, నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలాల్లోని మాయలూరు గ్రామాల్లో 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్.» సాయెల్ సోలార్: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడయపల్లి గ్రామం, వైఎస్ఆర్ జిల్లా కొండాపురం మండలం కోడూరు, సంకేపల్లి, యర్రగుడి గ్రామాల వద్ద 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్. -
త్వరలో వాట్సాప్ గవర్నెన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలోనే ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెలలోనే తెనాలిలో ప్రయోగాత్మకంగా వాట్సాప్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణపత్రాలు పొందే ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ప్రక్రియపై సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ తెనాలిలో సాంకేతికంగా ఇబ్బందులను సునిశితంగా పరిశీలించి, దానికి అనుగుణంగా ఈ వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆర్టీజీఎస్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ వాట్సాప్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణపత్రాల జారీ కోసం ఏపీ సివిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ పేరిట ఒక పోర్టల్‌ను రూపొందించినట్లు తెలిపారు. సదరన్ జోనల్ కౌన్సిల్ దృష్టికి విభజన అంశాలు రాష్ట్ర విభజన సంబంధించిన పెండింగ్ అంశాలను సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకెళ్లి చర్చించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎస్ కె.విజయానంద్ ఆదేశించారు. త్వరలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. -
సీఎస్‌గా విజయానంద్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా విజయానంద్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన్ని సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరబ్‌కుమార్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన సీఎస్‌గా నవంబర్ 30 వరకు కొనసాగనున్నారు. -
ఇంధన పొదుపు అందరి బాధ్యత
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపును అందరూ సామాజిక బాధ్యతగా భావించి దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థౖ అయిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సౌజన్యంతో ఇంధన శాఖ, ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఆధ్వర్యంలో రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డు (స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్–సెకా)ల ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది. జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఏపీఎస్ఈసీఎం సీఈవో కుమారరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు విజయానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.రవి పాల్గొన్నారు. పరిశ్రమలు, భవనాలు, సంస్థల విభాగాల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన సంస్థలకు ‘సెకా’ అవార్డులు ప్రదానం చేశారు. అవార్డుల వివరాలివి..» పరిశ్రమల విభాగంలో థర్మల్ పవర్ ప్లాంట్ కేటగిరీలో మొదటి బహుమతి.. ఎస్ఈఐఎల్, ద్వితీయ బహుమతి.. సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లు సాధించాయి. » టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ కేటగిరీలో మొదటి బహుమతి.. మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్, ద్వితీయ బహుమతి.. రవళి స్పిన్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్ » ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ కేటగిరిలో మొదటి బహుమతి.. రా్రïÙ్టయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, ద్వితీయ బహుమతి.. ఆర్జాస్ స్టీల్ ప్రై.లిమిటెడ్ » బిల్డింగ్స్ విభాగంలో ఆఫీస్ బిల్డింగ్స్ కేటగిరీలో ప్రథమ బహుమతి.. విజయవాడ రైల్వే ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్, ద్వితీయ బహుమతి.. గుంటూరు రైల్ వికాస్ భవన్ » హస్పిటల్ కేటగిరీలో మొదటి బహుమతి.. గుంతకల్లు రైల్వే హస్పిటల్, ద్వితీయ బహుమతి.. విజయవాడ రైల్వే హస్పిటల్ » ఆర్టీసీ డిపో అండ్ బస్టాండ్స్ కేటగిరీలో మొదటి బహుమతి.. సత్తెనపల్లి బస్ డిపో, ద్వితీయ బహుమతి.. విశాఖ బస్ డిపో » ఇనిస్టిట్యూషన్ విభాగంలో మొదటి బహుమతి.. తాడిపత్రి మున్సిపాలిటీ, ద్వితీయ బహుమతి.. విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్ » విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో మొదటి బహుమతిని వి.వైకుంఠరావు, డి.వరప్రసాద్, ఆర్.తేజ, అంకం ఈశ్వర్, ద్వితీయ బహుమతిని వై.లోహితాక్స్, వై.జోహాన్, ఎండీ.ఖాషీష్ , రోసీ రాచెల్, పి.అంజలీ కుమారీలు అందుకున్నారు. -
2025 కల్లా గిగా ఫ్యాక్టరీ: అమర రాజా బ్యాటరీస్
ముంబై: ఆటోమోటివ్ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ 2025 ఆఖరు కల్లా తమ తొలి గిగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇలాంటి వాటికి అధునాతన టెక్నాలజీ, భారీగా పెట్టుబడులు అవసరమవుతాయని సంస్థ ప్రెసిడెంట్ విజయానంద్ సముద్రాల తెలిపారు. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) నిర్వహించిన ఇండియా బ్యాటరీ తయారీ, సరఫరా వ్యవస్థ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం వివరించారు. తొలి విడత 24 నెలల్లోగానే పూర్తి కాగలదని, దాన్ని బట్టి చూస్తే వచ్చే సంవత్సరం (2025) ముగిసేలోగా ఫ్యాక్టరీలో కార్యకలాపాలు ప్రారంభం కాగలవని విజయానంద్ పేర్కొన్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో గిగా ఫ్యాక్టరీకి కంపెనీ గతేడాది మేలో శంకుస్థాపన చేసింది. ఈ ప్యాక్టరీలో లిథియం సెల్, బ్యాటరీ ప్యాక్‌లను తయారు చేయనుంది. -
యథాస్థితికి విద్యుత్ వ్యవస్థ
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపానుకు అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్థను విజయవంతంగా య«థాస్థితికి తీసుకొచ్చామని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య పంపిణీ సంస్థల (ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్) పరిధిలో పునరుద్థరణ పనులు వంద శాతం పూర్తయ్యాయని తెలిపాయి. తీవ్రంగా ప్రభావితమైన దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో మరమ్మతు పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని ఇంధన శాఖకు డిస్కంలు శుక్రవారం నివేదించాయి. ఈ సందర్భంగా జరిగిన టెలీకాన్ఫరెన్స్‌లో తుపానును ఎదుర్కోవడం, పునరుద్ధరణ ప్రణాళిక అమలులో సమర్థవంతంగా పని చేసిన విద్యుత్ సంస్థలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అభినందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వంలో ఏపీ విద్యుత్ శాఖ సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి విద్యుత్ మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారని ఆయన వెల్లడించారు. భారీ గాలులు, వర్షం వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏపీజెన్కో ఎండీ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, డిస్కంల సీఎండీలు ఐ.పృ«థ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె. సంతోషరావు క్షేత్రస్థాయిలో పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, పడిపోయిన విద్యుత్ స్తంభాలను తిరిగి ఏర్పాటు చేయడం, పాడైన ఇన్సులేటర్ల మారి్పడి, విరిగిన కండక్టర్లను సరిచేయడం వంటి పనులను శరవేగంగా పూర్తి చేయించారని తెలిపారు. జిల్లా కేంద్రాల నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాలకు అవసరమైన స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర సామాగ్రితో పాటు ప్రత్యేక బృందాలు, ఇతర అన్ని రకాల సామగ్రిని వేగంగా సమకూర్చుకొని పనులు పూర్తి చేశాయని పేర్కొన్నారు. కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి, జిల్లా కేంద్రాల నుంచి క్షేత్రస్థాయి అధికారులను, సిబ్బందిని నిరంతరం పర్యవేక్షించడం వల్ల మరమ్మతు పనులు వేగంగా జరిగాయని తెలిపారు. దెబ్బతిన్న 17 ఫీడర్లలో 14 ఫీడర్లను పునరుద్ధరించామని, తమిళనాడులో విద్యుత్ టవర్ కూలిపోవడం వల్ల మూడు ఫీడర్ల పనులు ఇంకా కొనసాగుతున్నాయని ట్రాన్స్‌కో గ్రిడ్ డైరెక్టర్ ఏవీకే భాస్కర్ వెల్లడించారు. అయినప్పటికీ విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వివరించారు. -
ఏపీలో విద్యుత్ కోతలు లేవు.. అవాస్తవాలు నమ్మొద్దు: విజయానంద్
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎక్కడా విద్యుత్ కోతలు లేవని, పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చామని కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు అవాస్తవమని ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ కే. విజయానంద్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహావసరాలకి ఎక్కడా కోతలు విధించటం లేదని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్ట్ లో 18 శాతం డిమాండ్ పెరిగిందని ఆయన వివరించారు. ఆగస్ట్ నెలలో సరాసరిన రోజుకి 230 మిలియన్ యూనిట్ల డిమాండ్ కాగా, గత ఏడాదిలో 190 మిలియన్ యూనిట్ల మాత్రమే ఉంది. పెరిగిన డిమాండ్‌తో పాటు వర్షాభావ పరిస్ధితులు తోడయ్యాయి. ఆగస్ట్ 30, 31 తేదీల్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సెప్టెంబర్ నెల ఈ వారంలో సరాసరిన 210 మిలియన్ యూనిట్ల వరకు డిమాండ్ ఉంది. ఏపీలోనే కాదు దేశ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ ఉంది. కర్ణాటక, తమిళనాడు, రాజస్ధాన్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కోతలు అమలవుతున్నాయి. పెరిగిన విద్యుత్ డిమాండ్‌కి తగ్గట్లు ఏపీలో విద్యుత్ సరఫరా చేస్తున్నాం.’’ అని విజయానంద్ తెలిపారు. చదవండి: బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే ఏపీలో విద్యుత్ కొరత రాకుండా ముందు జాగ్రత్తగా 40 మిలియన్ యూనిట్ల కొనుగోలు చేశాం. యూనిట్‌ని 13 రూపాయిల వరకు కొనుగోలు చేయడానికి కేంద్రం అనుమతి ఉన్నా యూనిట్ 7.50 రూపాయిలకే కొనుగోలు చేశాం. బొగ్గు కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. ఏపీలో సెప్టెంబర్ నెలకి సరిపడా బొగ్గు నిల్వలు’’ ఉన్నాయని విజయానంద్ వెల్లడించారు. -
కోతల్లేకుండా విద్యుత్ సరఫరా
సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ) : నైరుతి రుతుపవనాల ఆలస్యం కారణంగా దక్షిణాదిన ఈ ఏడాది మే, జూన్ నెలల్లో మునుపెన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినప్పటికీ ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేసి దక్షిణ ప్రాంతీయ గ్రిడ్ సామర్థ్యాన్ని నిరూపించామని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె. విజయానంద్ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలలో విద్యుత్ రంగ అభివృద్ధి నిమిత్తం శుక్రవారం విశాఖపట్నంలో మొదలైన సదరన్ రీజనల్ పవర్ కమిటీ (ఎస్ఆర్పీసీ) 47వ సమావేశం శనివారం ముగిసింది. ప్రాంతీయ కమిటీకి చైర్మన్‌గా ఉన్న విజయానంద్ అధ్యక్షతన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఆర్పీసీతో పాటు 45వ టెక్నికల్ కో–ఆర్డినేషన్ కమిటీ (టీసీసీ) సమావేశం కూడా జరిగింది. రెండ్రోజుల పాటు జరిగిన ఈ సదస్సులకు రాష్ట్ర విద్యు త్ సంస్థలైన ట్రాన్స్‌కో, డిస్కంలు ఆతిథ్యం ఇచ్చా యి. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు ప్రభు త్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోందని.. దీనికి ఖర్చుచేసే మొత్తాన్ని రైతుల ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలకు బదిలీ చేయడానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకాన్ని అమలుచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల వసూళ్ల కోసం అమలుచేస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ. పృథి్వతేజ్ ప్రతినిధులకు వివరించారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు లేఖ.. ఇక దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ రంగ సంస్థలు, వాటి నిర్వహణ, వాణిజ్య కార్యకలాపాలు, సమస్యలు, వాటి పరిష్కారం కోసం పరస్పరం సహకరించుకోవడం, అందుకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం.. దక్షిణ గ్రిడ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్పీసీ, ఎస్ఆర్ఎల్డీసీ సంస్థల నుంచి అవసరమైన సలహాలు పొందడం వంటి అంశాలపై ఈ సదస్సులో ప్రతినిధులు చర్చించారు. అలాగే, అంతర్రాష్ట్ర విద్యుత్ రవాణా చేసే ఇంట్రా స్టేట్ లైన్లకు సెంట్రల్ పూల్ నుంచి ట్రాన్స్మిషన్ చార్జీలను పొందేందుకు గతేడాది డిసెంబర్ 6న ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని విద్యుత్ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని కమిటీ తీర్మానించింది. -
పుష్కలంగా కరెంటు
సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం: రాష్ట్ర విద్యుత్ రంగంలో ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్టీటీపీఎస్)లో స్టేజ్–5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 8వ యూనిట్‌ను విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేసింది. కోవిడ్ కష్టకాలాన్ని, అనేక సవాళ్లను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయించిన ఈ యూనిట్‌ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్కో చైర్మన్ కె.విజయానంద్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు శుక్రవారం ఉదయం ‘లైట్ అప్’ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఆగస్టు నాటికి దీనిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే ఏపీ జెన్కో విద్యుదుత్పత్తి సామర్థ్యం 8,789 మెగావాట్లకు పెరుగుతుంది. తగ్గనున్న కొనుగోళ్లు ఏపీ జెన్కో ప్రస్తుతం 5,810 మెగావాట్ల థర్మల్, 1773.6 మెగావాట్ల హైడల్, 405.426 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. లోయర్ సీలేరులో 230 మెగావాట్ల అదనపు ఉత్పత్తి కోసం రెండు అదనపు యూనిట్లను 2024 ఏప్రిల్‌కి అందుబాటులోకి తేనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టు అయిన మాచ్‌ఖండ్ పవర్ హౌస్ సామర్థ్యాన్ని కూడా 120 నుంచి 150 మెగావాట్లకు పెంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునర్నిర్మించాలని కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వేసవిలో ఎనిమిదేళ్ల తరువాత అనూహ్యంగా డిమాండు పెరిగినప్పటికీ ఏపీ జెన్కో రోజూ సగటున 105 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తోంది. రాష్ట్ర మొత్తం వినియోగంలో 40 నుంచి 45 శాతం విద్యుత్ ఏపీ జెన్కో నుంచే వస్తోంది. కొత్తగా లైట్‌అప్ చేసిన యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తే రోజూ మరో 15 నుంచి 20 మిలియన్ యూనిట్లను జెన్కో అదనంగా సరఫరా చేస్తుంది. జెన్కో ఉత్పత్తి సామర్థ్యం ఎంత మేరకు పెరిగితే అంత మేరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలును డిస్కంలు తగ్గించుకోవచ్చు. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయాలు విజయానంద్ గత ఏడాది కాలంలో 1,600 మెగావాట్ల అదనపు సామర్థ్యం గల రెండు యూనిట్లు అందుబాటులోకి రావడం ఏపీ జెన్కో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయాలని జెన్కో చైర్మన్ విజయానంద్ చెప్పారు. ఎన్టీటీపీఎస్ నూతన యూనిట్‌ను ‘లైట్‌అప్’ చేశారు. ముందుగా బాయిలర్‌లో నీటి ద్వారా స్టీమ్ తయారీ ప్రక్రియను ప్రారంభించారు. కంట్రోల్ రూమ్‌లో స్టీమ్ రీడింగ్‌పై సంతృప్తి వ్యక్తం చేసి ఇంజినీర్లను అభినందించారు. ఆవిరి ప్రక్రియ పూర్తి స్థాయికి చేరగానే బొగ్గు ద్వారా స్టీమ్ రీడింగ్ పెరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అనంతరం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల సామర్థ్యం గల స్టేజ్–2 యూనిట్‌ను గతేడాది అక్టోబర్ 27న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేశారని గుర్తు చేశారు. ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్‌ను ఆగస్టు నాటికి కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ)కి వీలుగా సిద్ధం చేయాలని బీహెచ్ఈఎల్, బీజీఆర్ ప్రతినిధులకు సూచించారు. ట్రయల్ రన్లో వచ్చే లోటుపాట్లను సరిదిద్దుకుని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని జెన్కో ఎండీ చక్రధర్‌బాబు తెలిపారు. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు. ఏపీ జెన్కో డైరెక్టర్లు చంద్రశేఖర్‌రాజు (థర్మల్), బి.వెంకటేశులురెడ్డి (ఫైనాన్స్), సయ్యద్ రఫీ (హెచ్ఆర్, ఐఆర్), సత్యనారాయణ (హైడల్), అంథోనీ రాజ్ (కోల్) తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పథంలో ఇంధన రంగం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంధన రంగం అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. వార్షిక ఇంధన వినియోగం 2017–18లో 50,077 మిలియన్ యూనిట్లతో పోలిస్తే 2022–23లో 65,830 మిలియన్ యూనిట్లకు చేరుకోవడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. భవిష్యత్ ప్రణాళికలపై విద్యుత్ సంస్థలతో ఆయన ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే.. విద్యుత్ వినియోగం దాదాపు 31.45 శాతానికి పెరిగిందని, ఇటీవల రోజుకు 251 మిలియన్ యూనిట్లు ఆల్ టైమ్ హై ఎనర్జీ డిమాండ్ రాగా విద్యుత్ సంస్థలు విజయవంతంగా తీర్చాయని చెప్పారు. ఒప్పందాలతో ఉజ్వల భవిష్యత్ ఈ ఏడాది మార్చి నెలలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన రంగం పెట్టుబడులతో దాదాపు 1.80 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని విజయానంద్ వెల్లడించారు. ఈ 42 అవగాహన ఒప్పందాలను అమలు చేయాల్సిన అవసరం విద్యుత్ సంస్థలపై ఉందన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని ప్రభుత్వం మార్చిందన్నారు. విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడానికి ప్రభుత్వం ఇప్పటికే పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని ప్రకటించిందని తెలిపారు. పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్ట్‌లు (పీఎస్పీ) పూర్తయితే విద్యుత్ రంగంలో దేశంలోనే ఏపీ నంబర్ వన్‌గా మారి మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వినియోగదారులకు నమ్మకమైన విద్యుత్‌ను అందించాలని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించాలని పదే పదే చెబుతున్నారన్నారు. వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట ఉచిత విద్యుత్‌ను వచ్చే 25 ఏళ్ల పాటు కొనసాగించేందుకు 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాష్ట్ర గ్రిడ్ కు 105 మిలియన్ యూనిట్లు జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర గ్రిడ్‌కు రోజుకు 102 నుంచి 105 మిలియన్ యూనిట్లను జెన్కో సరఫరా చేస్తోందని, ఇది మొత్తం ఇంధన డిమాండ్‌లో 40 నుండి 45 శాతం ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఇదే అత్యధికమని, బొగ్గు నిల్వలను మెరుగుపరచడానికి కూడా జెన్కో అన్ని ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. సమావేశంలో ట్రాన్స్‌కో జేఎండీ బి.మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు, ఏపీ ఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి, ట్రాన్స్‌కో డైరెక్టర్లు ఏవీకే భాస్కర్, టి.వీరభద్రారెడ్డి పాల్గొన్నారు. -
Fact Check:చట్ట ప్రకారమే చెల్లింపులు
సాక్షి, అమరావతి : ఒకసారి విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిన తరువాత ఒప్పంద కాలానికి కొనుగోలు చేసినా, చేయకపోయినా, ఆ విద్యుత్ కేంద్రం ఉత్పత్తి చేసినా, చేయకపోయినా స్థిర ఛార్జీలు అనేవి భరించాల్సిందే. వీటిలో ముఖ్యంగా సిబ్బంది జీతభత్యాలు, అప్పు మీద వడ్డీ, మరమ్మతులు, నిర్వహణ ఖర్చులు, యంత్రాల అరుగుదల, తరుగుదల వంటివి ఉంటాయి. ఈ విషయం విద్యుత్ రంగంపై కనీస అవగాహన ఉన్న వారెవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ, తమవి అత్యున్నత విలువలని గొప్పలు చెప్పుకునే ఈనాడు దినపత్రికకు మాత్రం ఈ విషయం తెలియదు. తెలిసినా తెలియనట్లు నటిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే ప్రధాన ధ్యేయంగా తప్పుడు కథనాలను నిత్యం వండి వారుస్తోంది. దానిలో భాగంగానే ‘హిందుజాకు దోచిపెట్టింది రూ.1,234 కోట్లు’ అంటూ అబద్ధాలు అచ్చేసింది. అందులో అసలు నిజాలను ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ బీఏవీపీ కుమార్‌రెడ్డి, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె పద్మజనార్థనరెడ్డిలతో కలిసి రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ శుక్రవారం విద్యుత్ సౌథలో మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఈనాడు అబద్ధాల వెనుక నిజానిజాలిలా ఉన్నాయి.. ఒప్పందాలు ఇప్పటివి కాదు.. హిందూజ సంస్థతో ప్రస్తుత ప్రభుత్వం ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కొందరు దు్రష్పచారం చేస్తున్నారు. ఈ హిందుజా విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) మొదటిసారి 1994లోనే అప్పటి ఎలక్ట్రిసిటీ బోర్డుతో జరిగింది. తరువాత దానిని సవరించి 1998లో 1,040 మెగావాట్ల పవర్ ప్లాంట్ కడతామని ఒప్పందం చేసుకున్నారు. 2001 నాటికి ఆ పీపీఏ గడువు ముగిసింది. తర్వాత వారు మళ్లీ ప్రభుత్వాన్ని సంప్రదించి, మర్చంట్ పవర్ ప్లాంట్కైనా వెళ్తామని అమమతి కోరారు. 2010లో మెగావాట్‌కు రూ.5.33 కోట్లు చొప్పున రూ.5,545 కోట్లతో ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ధారించారు. వివిధ కారణాలతో విద్యుత్ కేంద్రం నెలకొల్పడంలో జాప్యం జరిగింది. హిందూజా రాకపోయినా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి 2011లో 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచి, యూనిట్ రూ.3.60 చొప్పున కొనేందుకు ఒప్పందం చేసుకుంది. 2013లో హిందూజాతో ఒక మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్‌ను ప్రభుత్వం కుదుర్చుకుంది. కానీ, 2014లో పీపీఏ ప్రకారం హిందూజా సంస్థ విద్యుత్‌ను సరఫరా చేయలేకపోయింది. దీంతో 2016 జనవరిలో మొదటి యూనిట్, జూలైలో రెండవ యూనిట్లో ఈ విద్యుత్ కేంద్రం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించింది. 2016 ఆగస్టులో ఏపీఈఆర్సీ హిందూజా టారిఫ్‌ను యూనిట్ రూ.3.82గా నిర్ణయించి, ఏటా 2,828 మిలియన్ యూనిట్లు తీసుకోవాలని డిస్కంలకు చెప్పింది. రూ.5,623 కోట్లు ఫిక్స్డ్ చార్జీలుగా నిర్ధారించింది. టీడీపీ అనాలోచిత నిర్ణయం ఫలితమే.. ఈ నేపథ్యంలో.. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఒప్పందం నుంచి వైదొలగాలని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు నిర్ధేశించింది. దానికి అనుగుణంగా ఈ ఒప్పందం వద్దని డిస్కంలు చేసిన అభ్యర్ధనకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతిచ్చింది. అప్పటి నుంచి ఈ ఒప్పందంపై న్యాయ పోరాటం, చిక్కులు ప్రారంభమయ్యాయి. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (ఆప్టెల్)ను హిందూజా ఆశ్రయించింది. ట్రిబ్యునల్ టీడీపీ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఆ తరువాత ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. అంతిమంగా ఫిబ్రవరి 2022లో సుప్రీంకోర్టు ‘ఈ ఒప్పందం రద్దు కుదరదు, విద్యుత్ కొనుగోలు ఒప్పందం వాణిజ్య కార్యకలాపాలు మొదలు పెట్టినప్పటి నుంచి అమలులో వున్నట్లే’ అని తీర్పునిచ్చింది. అంటే సుప్రీంకోర్టు తీర్పు మేరకు హిందూజాకు స్థిర చార్జీలు చెల్లించక తప్పని పరిస్థితి. నిజానికి.. ఇన్ని రోజులు హిందుజా విద్యుత్ కేంద్రం అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తి విద్యుత్ తీసుకోలేకపోవటానికి కారణం గత ప్రభుత్వం 2018లో తీసుకున్న లోపభూయిష్ట నిర్ణయమే. టీడీపీ ఈ ఒప్పందాన్ని రద్దుచేసుకోకపోయి ఉంటే, హిందూజా నుంచి విద్యుత్ తీసుకుని ఆ మేరకు చెల్లింపులు చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు విద్యుత్ తీసుకోకుండానే చార్జీలు చెల్లించాల్సి రావడం గత ప్రభుత్వ పాప ఫలితమే. అంతేగాని.. ఉత్తుత్తి విద్యుత్‌కు ప్రభుత్వం డబ్బులు కట్టిందన్న మాటలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం. అదీగాక.. 2022 మార్చి తర్వాత హిందూజా సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 1,040 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసింది. రాష్ట్రానికి అదనంగా 15 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా అవుతోంది. చట్టప్రకారమే అనుమతి.. అప్పీలెట్ ట్రిబ్యునల్ వారి ఉత్తర్వుల్లో హిందూజా టారిఫ్‌ను స్థిర, చర ఛార్జీలుగా విభజించమని ఆదేశాలిచ్చింది. వాటి ప్రకారం కమిషన్ అప్పటి తాత్కాలిక (ఆడ్హాక్) చార్జీ అయిన యూనిట్ రూ.3.82ను స్థిరచార్జీ రూ.1.06గాను.. చరచార్జీ రూ.2.76గాను విభజించింది. దీని ముఖ్యోద్దేశ్యం.. మెరిట్ ఆర్డర్ సూత్రాలను ఈ విద్యుత్ కేంద్రానికి అమలుపరచడమే. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆగస్టు 2022లో ఇచ్చిన తుది ఉత్తర్వుల్లో అప్పటికున్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఇంతకుముందు నిర్ణయించిన తాత్కాలిక (అడ్‌హక్) చార్జీయే 2016 నుంచి 2022 ఆగస్టు వరకు వర్తిస్తుందని చెప్పింది. టారిఫ్ అప్పటికే రెండు భాగాలుగా విభజించినందున ఇందులో స్థిరఛార్జీ చెల్లింపు అన్నది భాగమే కాబట్టి కమిషన్ నిర్ణయం మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అవసరంలేదు. హిందుజాకు స్థిరఛార్జీల బకాయిలు వాళ్ల ఉత్పత్తి అందుబాటు ప్రకటనలను బట్టి చెల్లించాలని అడ్వొకేట్ జనరల్, ఆంధ్రప్రదేశ్ న్యాయ శాఖా కార్యదర్శి, న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌గుప్తా విద్యుత్ పంపిణీ సంస్థలకిచ్చిన న్యాయ సలహాలో ధ్రువీకరించారు. సుప్రీంకోర్టు, అప్పీలేట్ ట్రిబ్యునల్, ఏపీఈఆర్సీ ఇచ్చిన తీర్పులను, ఉత్తర్వులు, ఎలక్ట్రిసిటీ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ప్రభుత్వం డిస్కంలకు, కేంద్ర ప్రభుత్వ ఆ«దీనంలోని విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఆలస్య చెల్లింపు సర్‌చార్జీ (ఎల్పీఎస్ ) స్కీం నిబంధనలకు లోబడి, హిందుజాకు రూ.1,234 కోట్లు స్థిర చార్జీలను చెల్లించడానికి అనుమతినిచ్చింది. ‘ఈనాడు’ అవగాహనా రాహిత్యం.. హిందుజాపై సుప్రీంకోర్టు, అప్పీలేట్ ట్రిబ్యునల్, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన తుది తీర్పుల ప్రకారం హిందూజా విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం అమలు చేయాల్సిన గురుతర బాధ్యత ఈ ప్రభుత్వంపైన, డిస్కంలపైన ఉంది. నిజానికి.. హిందూజా దాదాపు రూ.2,401 కోట్లకు అర్జీ పెట్టినప్పటికీ సాంకేతిక, న్యాయపరమైన అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని, కోల్ ఎంత ఉంది, ఆ రోజు నార్మేటివ్ అవైలబిలిటీ ఎంత అనేది ప్రతి యూనిట్ ప్రకారం అన్ని స్థాయిల్లోనూ రోజువారీగా క్షుణ్ణంగా పరిశీలించి చివరికి వారికి మొత్తం రూ.1,234 కోట్లు చెల్లించాలని లెక్కించాం. ఈ చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో జరిగాయి. కాబట్టి, ఈ వివరాలు కమిషన్‌కు ఆర్థిక సంవత్సరం 2022–23 నాల్గవ త్రైమాసికానికి డిస్కంలు సమర్పించే ఇంధన, విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు నివేదికలో నిబంధనల ప్రకారం పొందుపరుస్తాయి. వాస్తవాలిలా ఉంటే.. ఈ నిజాలను గాలికొదిలేసి, విద్యుత్ తీసుకోని కాలానికి స్థిరఛార్జీలు హడావిడిగా చెల్లించేశారని, కనీసం కమిషన్ అనుమతి తీసుకోలేదని ఈనాడు రాయడం పూర్తిగా అవగాహనా రాహిత్యం. విషయంపట్ల తగినంత పరిజ్ఞానం, ఏపీఈఆర్సీ ఇచ్చిన వివిధ నిబంధనలు, నియమావళి గురించి అవగాహన లేకుండా అబద్ధాలు అచ్చేశారు. -
‘హిందూజకు చెల్లింపుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోంది’
సాక్షి, విజయవాడ: హిందూజ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎలాంటి ప్రగతి చూపకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు ఉచితంగా డబ్బులిస్తోందని గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని, అపోహలేనని ఇంధనశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల, విద్యుత్ పంపిణీ సంస్థల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని న్యాయ నిఫుణుల సలహా, సూచనల మేరకు పారదర్శకతతో, ప్రణాళికాబద్ధంగా, చట్టం ప్రకారం, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎలక్ట్రిసిటీ రెగ్యులరేటరి కమిషన్ ఆదేశాలనుసారం, న్యాయశాఖ పరిశీలించి ధృవీకరించిన తర్వాతే హిందూజ సంస్థకు చెల్లింపుల విషయంలో నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని విజయానంద్ స్పష్టం చేశారు. కాగా, శుక్రవారం విజయవాడలోని విద్యుత్ సౌధ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయానంద్ మాట్లాడుతూ.. హిందూజ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌కు సంబంధించిన పలు వాస్తవాలను ప్రజల దృష్టికి తెచ్చేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా ఒక విద్యుత్ కొనుగోలు సంస్థతో ఒప్పందం చేసుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి చట్టాలు, నిబంధనలు, పవర్ పర్చేజ్ ఒప్పందం ప్రకారం ఆ ఒప్పందం గడువు పూర్తవ్వక ముందే విద్యుత్ సరఫరా కొనుగోలు చేయమని చెప్పిన పక్షంలో సాధారణంగా ఫిక్స్డ్ ఛార్జీలు, వేరియబుల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పీపీఏ ఉన్నంత వరకు విద్యుత్ తీసుకున్నా, తీసుకోకపోయినా ఫిక్స్డ్ ఛార్జీలు తప్పక చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌కు ప్రభుత్వం డబ్బులు కట్టిందన్న మాటలు అవాస్తవమని, నిరాధారమని స్పష్టం చేశారు. మార్చి 2022 తర్వాత హిందూజ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 1040 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసిందన్నారు. అంతేగాక రాష్ట్రానికి అదనంగా 15 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా అవుతోందని విజయానంద్ తెలిపారు. హిందూజ సంస్థతో ప్రస్తుత ప్రభుత్వం ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేయడం తగదన్నారు. హిందూజ సంస్థతో 1994లోనే ఒప్పందం కుదిరిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక, ఈ సమావేశంలో ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ బీఏవీపీ కుమార్ రెడ్డి, ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జె.పద్మ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత -
థర్మల్ ఉత్పత్తిలో ‘కోత’ లేదు
సాక్షి, అమరావతి: థర్మల్ విద్యుదుత్పత్తిని సామర్థ్యంలో 50 శాతానికి తగ్గించాలని ఇండియన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోడ్ (ఐఈజీసీ) నిబంధనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల అవసరాల మేరకు థర్మల్ పవర్ స్టేషన్లు సగటున 73 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 240 నుంచి 255 మిలియన్ యూనిట్లు ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) రోజుకు సమారు 100 నుంచి 105 మిలియన్ యూనిట్లను గ్రిడ్‌కు సరఫరా చేస్తోంది. అంటే రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో దాదాపు 40 నుంచి 45 శాతం వరకు ఏపీ జెన్కో నుంచే సమకూరుతోంది. అలాగని సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించడానికి లేదు. దీంతో పర్యావరణ హితం కోరి పవన, సౌరవిద్యుత్ వినియోగానికి ‘మస్ట్ రన్ స్టేటస్’ కింద అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇష్టానుసారం ఆపలేం సాధారణంగా లోడ్ డిస్పాచ్ సెంటర్ ఫ్రీక్వెన్సీని బట్టి గ్రిడ్‌కు విద్యుత్‌ను సరఫరా, స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. గ్రిడ్‌కు మనం ఎంత విద్యుత్ సరఫరా చేస్తామో అంత తీసుకోవచ్చు. ఎక్కువ (ఓవర్ డ్రా) తీసుకుంటే ఆ మేరకు చెల్లించాలి. అపరాధరుసుం భరించాలి. తక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకుంటే దక్షణాది రాష్ట్రాల రీజనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ హెచ్చరికలు జారీచేస్తుంది. తరచూ ఇలా చేస్తే గ్రిడ్ కనెక్షన్ తప్పిస్తుంది. మన అవసరాలకు మించి గ్రిడ్‌కు సరఫరా చేస్తే డిమాండు లేనప్పుడు అదనపు విద్యుత్‌కు పైసా రాదు. దీంతో విద్యుత్ డిమాండు ఎప్పుడు ఎలా ఉంటుందో స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) ద్వారా అధికారులు నిత్యం పరిశీలిస్తుంటారు. డిమాండుకు తగ్గట్టు సరఫరా పెంచాలో, తగ్గించాలో వారు సూచిస్తారు. అయితే డిమాండు లేని సమయాల్లో థర్మల్ ప్లాంట్లను షట్‌డౌన్ చేసి డిమాండు పెరగ్గానే లైటప్ చేయడం వీలుకాదు. అందువల్ల ప్లాంట్లను ఆన్‌లోనే ఉంచాలి. అందుకే 55 శాతం సామర్థ్యంతో పనిచేసేలా ప్లాంట్లను సిద్ధంగా ఉంచడానికి ఏయే చర్యలు తీసుకోవాలో సూచనలు, సలహాలు, సాంకేతిక సహకారం ఇచ్చే సంస్థలను ఆహ్వానిస్తూ ఏపీ జెన్కో ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) దరఖాస్తులు ఆహ్వానించింది. దుష్ప్రచారాలను నమ్మవద్దు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో 45 శాతానికి, డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్)లో 55 శాతానికి విద్యుదుత్పత్తిని తగ్గించి, రాష్ట్ర అవసరాలకు బయట కొనుగోలు చేసే ఎత్తుగడలో ప్రభుత్వం ఉందని కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి దుష్ప్రచారాలను ఎవరూ నమ్మనవసరం లేదు. సౌర, పవన విద్యుత్ అందుబాటులో ఉంటే దానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఇది పర్యావరణపరంగా మంచిదైనందున పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయేతర విద్యుత్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. – కె.విజయానంద్, చైర్మన్, ఏపీ జెన్కో -
ఆర్డీఎస్ఎస్తో డిస్కంల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ప్రపంచస్థాయి సేవలు అందించేలా విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను పునరుద్ధరణ పంపిణీరంగ పథకం (ఆర్డీఎస్ఎస్) ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.11 వేల కోట్ల పెట్టుబడి పెడుతోందని తెలిపారు. ఈ మొత్తం పెట్టుబడిలో 60 శాతం కేంద్రం నుంచి గ్రాంట్‌గా పొందవచ్చని చెప్పారు. ఆయన ఆదివారం ఇంధనశాఖ ఆధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ ద్వారా డిస్కంలు బలోపేతం కావడం వల్ల అన్నివర్గాల వినియోగదారులకు అధిక నాణ్యత గల విద్యుత్‌ను అందించవచ్చనితెలిపారు. విద్యుత్ సంస్థ (పవర్ యుటిలిటీస్)ల ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాల తగ్గింపు, ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, పంప్డ్ హైడ్రోస్టోరేజి ప్రాజెక్టులు మొదలైన వాటితోసహా అనేక రాష్ట్ర ప్రభుత్వం పథకాలను నవరత్నాల కింద విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. తద్వారా గత మూడునెలల స్వల్ప వ్యవధిలో విద్యుత్ సంస్థలు జాతీయస్థాయిలో ఆరు అవార్డులు సాధించాయని చెప్పారు. 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు వ్యవసాయానికి సబ్సిడీ రూపంలో రూ.8,400 కోట్లు ఏటా కేటాయిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లను అమర్చడం వల్ల డిస్కంలకు, రైతులకు ప్రయోజనమని చెప్పారు. ఏ రైతు తమ జేబులోంచి ఒక్కపైసా చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే బిల్లు మొత్తాన్ని రైతుల ఖాతాలో జమచేస్తుందని చెప్పారు. 16,66,282 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు బిగించాలని నిర్ణయించగా.. 16,55,988 కనెక్షన్లకు సంబంధించిన రైతులు అంగీకారం తెలిపారని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, డిస్కంల సీఎండీలు జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
AP: ఈ వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు: విజయానంద్
సాక్షి, విజయవాడ: ఈ వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు. గురువారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ, వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. సీఎం ఆదేశాలతో ప్రణాళికాబద్దంగా వేసవి డిమాండ్‌ని అధిగమిస్తామన్నారు. ‘‘గత ఏడాది కంటే ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో సరాసరిన రోజుకి 202 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 227 మిలియన్ యూనిట్లకి పెరిగింది. గత ఏడాది మార్చి నెలలో రోజుకి 212 మిలియన్ యూనిడ్ల డిమాండ్ ఉంటే ఇపుడు 232 మిలియన్ యూనిట్లకి డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో పీక్ డిమాండ్ 232 మిలియన్ యూనిట్ల కాగా.. ఈ ఏడాది మార్చి రెండవ వారంలోపే 232 మిలియన్ యూనిట్లు దాటాం. గడిచిన ఏడాది కాలంలో ఏపీలో పెరిగిన పరిశ్రమల కారణంగా వాణిజ్య అవసరాలకి 18 శాతం, పరిశ్రమలకి 20.31 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది’’ అని విజయానంద్ వివరించారు. ‘‘ఈ కారణంగానే విద్యుత్ డిమాండ్ ఊహించని విధంగా రికార్డు స్ధాయికి పెరిగింది. మార్చి నెలాఖరుకి 240 మిలియన్ యూనిట్లు.. ఏప్రిల్ నెలకి 250 మిలియన్ యూనిట్లకి డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఏప్రిల్ నెలలో ఒక్క వ్యవసాయానికే సరాసరిన 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. పెరిగిన డిమాండ్ కి తగ్గట్లుగా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నాం. పరిశ్రమలకి, గృహావసరాలకి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉంటుంది. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫారా కొనసాగిస్తాం’’ అని ఆయన తెలిపారు. చదవండి: సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల కృష్ణపట్నం మూడవ యూనిట్ ద్వారా 800 మెగా వాట్ల విద్యుత్ నేటి నుంచి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. సెమ్ కాబ్ ద్వారా 500 మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో యూనిట్ ధర 12 రూపాయిలుంటే వేసవి అవసరాలను దృష్డిలో పెట్టుకుని ముందుగానే మార్చి, ఏప్రిల్ నెల కోసం యూనిట్ 7.90 రూపాయలకు విద్యుత్ కొనుగోలుకి ఎంఓయు చేసుకున్నాం. అదే విధంగా ఇతర రాష్ట్రాలతో 300 మెగా వాట్ల విద్యుత్‌కి బ్యాంకింగ్ ఒప్పందాలు చేసుకున్నాం’’ అని విజయానంద్ వెల్లడించారు. -
ఆదా.. ఇదిగో
సాక్షి, అమరావతి: ‘‘శ్రీకాకుళంలో స్మార్ట్ మీటర్లను అమర్చడం, నెలవారీ రీడింగ్‌లు నమోదు చేయడం అభినందనీయం. వ్యవసాయ విద్యుత్ మీటరింగ్ కోసం విలువైన పాఠాలను అందించేలా ఈ ప్రయోగం చేపట్టిన డిస్కమ్‌లు, సంబంధిత విభాగాలను అభినందించాల్సిన అవసరం ఉంది’’ – తుది నివేదికలో ప్రయాస్ సంస్థ ప్రశంసలివీ.. వ్యవసాయ బోర్లకు స్మార్ట్ విద్యుత్ మీటర్లను అమర్చడం వల్ల రైతులకు మేలేగానీ కీడు జరగదు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం, ఇంధన శాఖ ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేసినా కొన్ని పార్టీలు, వాటి అనుకూల మీడియా పని గట్టుకుని విషప్రచారం చేస్తూనే ఉన్నాయి. అన్నదాతలను అయోమయంలోకి నెట్టేయాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నాయి. స్మార్ట్ మీటర్ల వల్ల ఏ మీటర్లో ఎంత విద్యుత్ వినియోగం జరుగుతోందనేది ప్రతి 15 నిమిషాలకు ఒకసారి తెలుస్తుంది. అదే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, ఫీడర్ల వద్ద మీటర్లు పెట్టి రీడింగ్ తీస్తే వాటి పరిధిలోని నాలుగైదు మీటర్ల విద్యుత్ వినియోగం వస్తుంది. ఏ రైతు ఎంత విద్యుత్ వాడుతున్నారనేది కచ్చితంగా చెప్పడం కష్టం. పంటలు ఉన్నప్పుడు మీటర్ల దగ్గరికి వెళ్లడం చాలా కష్టం. అదే స్మార్ట్ మీటర్లతో ఈ సమస్యలన్నీ తీరుతాయి. రిమోట్ ద్వారా మీటర్‌ను ఆపరేట్ చేయవచ్చు. రీడింగ్ కోసం మీటర్ దగ్గరకు వెళ్లవలసిన అవసరం ఉండదు. రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మీటర్ అమర్చడమే కాకుండా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్, మోటార్ కాలిపోకుండా, రైతుల ప్రాణ సంరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంది. అందుకు అవసరమైన ఐదు రక్షణ పరికరాలను (అలైడ్ మెటీరియల్) మీటర్లతో పాటు ఏర్పాటు చేయనుంది. మిగతా రాష్ట్రాల్లో కేవలం మీటర్లే ఇస్తున్నారు. మన దగ్గర స్మార్ట్ మీటర్‌తో పాటు మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్(ఎంసీసీబీ)తో కూడిన షీట్ మౌడ్లింగ్ కాంపొనెంట్(ఎస్ఎంసీ) బాక్స్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యూజు కారియర్లు ఇనుముతో చేసినవి ఉండగా వాటి స్థానంలో తాకినా విద్యుత్ షాక్ కొట్టని మెటీరియల్‌తో ఈ బాక్సులు తయారవుతాయి. ఇప్పుడున్నట్లు మూడు ఫ్యూజులు కూడా ఉండవు. దానివల్ల మోటార్లు కాలిపోయే అవకాశం ఉండదు. అలాగే ఎర్తింగ్ పైప్ కూడా ఇస్తారు. ఓల్టేజ్ సమస్యల నుంచి కాపాడేందుకు షంట్ కెపాసిటర్లను అమర్చుతారు. ఈ ఏర్పాటు వల్ల విద్యుత్ ప్రమాదాల నుంచి రైతులకు, జీవాలకు, వాతావరణ పరిస్థితుల నుంచి స్మార్ట్ మీటర్లకు రక్షణ లభిస్తుంది. అలైడ్ మెటీరియల్, మీటర్లకు కలిపి ప్రభుత్వం రూ.4,000 కోట్లు భరిస్తోంది. ఎవరు చెప్పారు? వాస్తవాలను వక్రీకరిస్తూ తప్పుడు సమాచారంతో అబద్ధాలను అడ్డంగా అచ్చేసిన ఈనాడు రాతలను ఇంధన శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని, వాటివల్ల విద్యుత్ ఆదా జరగకపోగా ఖర్చు వృథా అని ఏ సంస్థగానీ, రైతులుగానీ చెప్పలేదని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ బీఏవీపీ కుమార్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, సెంట్రల్ డిస్కమ్ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డితో కలసి విజయవాడలోని విద్యుత్ సౌధలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ► మీటర్లు అమర్చడం ద్వారా డిస్కమ్‌లలో జవాబుదారీతనం పెరగడంతో పాటు రైతులకు ఉచిత విద్యుత్ హక్కుగా లభిస్తుంది. ‘ప్రయాస్’ సంస్థ ఏడాదిన్నర క్రితం జరిపిన శాంపుల్ అధ్యయనంలో పలు సూచనలు మాత్రమే చేసింది. సగటు విద్యుత్ కొనుగోలు ధరను ప్రయాస్ ఎనర్జీ గ్రూప్ ఒక యూనిట్‌కి రూ.4.20 చొప్పున తీసుకుని లెక్కించడం వల్లే గణాంకాలు సరిగా లేవు. వాస్తవానికి సగటు సరఫరా ఖర్చు ఒక యూనిట్‌కి రూ.6.98 చొప్పున ఉంది. దీన్ని ఏపీఈఆర్సీ నిర్ణయించింది. ► ఫీడర్ల వద్ద నష్టాలు నమోదవుతున్నట్లు ప్రయాస్ చెబుతున్నా స్మార్ట్ మీటర్లు అమర్చిన తరువాత ఫీడర్ రీడింగ్ తీయలేదు. ఆ నష్టం విద్యుత్ చౌర్యం వల్ల జరిగి ఉండవచ్చు. ఇలాంటివి అరికట్టేందుకే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ► రెండు, మూడు వారాల్లో స్మార్ట్ మీటర్ల టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. రైతులను గందరగోళానికి గురిచేస్తూ పదేపదే తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న పత్రికలు, ప్రసారం చేస్తున్న ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వాటి యాజమాన్యాలకు లీగల్ నోటీసులు కూడా పంపుతున్నాం. ► మొత్తం 16,66,282 వ్యవసాయ సర్వీసుల్లో 16,55,988 మంది రైతులు బ్యాంకు ఖాతాలు తెరిచి నిరభ్యంతర పత్రాలిచ్చారు. 10,294 మందికి మాత్రమే ఖాతాలు లేవు. వారితో కూడా తెరిపించేందుకు డిస్కమ్‌లు ప్రయత్నిస్తున్నాయి. శ్రీకాకుళంలో ఇలా.. శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా 2023 ఫిబ్రవరి నాటికి 29,302 సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చగా 83.16 శాతం పని చేస్తున్నాయి. ఈ మీటర్ల ద్వారా 2021–22లో 33.24 శాతం అంటే 2.81 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఆదా అయ్యింది. సగటున 6.66 శాతం మాత్రమే పాడవడం, కాలిపోవడం జరిగింది. భవిష్యత్తులో వాటి మరమ్మతుల ఖర్చు సరఫరా సంస్థ భరించేలా టెండర్లు రూపొందించారు. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు పెడితే కేవలం రెండున్నరేళ్లలోనే పెట్టుబడి వెనక్కి వస్తుంది. -
స్మార్ట్ మీటర్లపై అపోహలు సృష్టించొద్దు: విజయానంద్
సాక్షి, విజయవాడ: స్మార్ట్ మీటర్లపై ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించొద్దని ఏపీ ఎనర్జీ స్పెషల్ సీఎస్ విజయానంద్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైందన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘వ్యవసాయంలో విద్యుత్ వినియోగం స్మార్ట్ మీటర్ల ద్వారా తెలుస్తుంది. స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు. విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విప్లవాత్మక నిర్ణయం. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ మీటర్లని ఏర్పాటు చేస్తున్నాం. మంచి టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు పది సంవత్సరాల క్రితం టెక్నాలజీని ఇపుడు ఎలా వాడతాం’’అని విజయానంద్ ప్రశ్నించారు. వాస్తవిక దృక్పథంతో పరిశీలించిన తర్వాతే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి నిర్ణయం తీసుకున్నాం. వ్యవసాయ రంగంతో పాటు గృహావసరాలకి, పరిశ్రమలకి కూడా స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయి. కేంద్ర ప్రభుత్వ సూచనలకి అనుగుణంగా 2025 లోపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ వినియోగంపై స్మార్ట్ మీటర్ల ద్వారా దాదాపు కచ్చిత సమాచారం లభిస్తుంది. స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులపై భారం ఉండదు’ అని విజయానంద్ స్పష్టం చేశారు. ‘‘రైతు అకౌంట్లలోనే వారి సబ్సిడీ నేరుగా వేస్తాం. బ్యాంకు అకౌంట్లు ఉన్నవారిలో 11.95 లక్షల మంది రైతులు సార్ట్ మీటర్లకి అంగీకరించారు. బ్యాంకు అకౌంట్లు ఉన్నవారిలో దాదాపు 99 శాతం స్మార్ట్ మీటర్లకి మద్దతు తెలిపారు. ఫిబ్రవరి నాటికి శ్రీకాకుళం జిల్లా పైలట్ ప్రాజెక్ట్ లో 83.16 శాతం స్మార్ట్ మీటర్లు పనిచేస్తున్నాయి. దాదాపు 50 శాతం మీటర్లు పనిచేయడం లేదనేది వాస్తవం కాదు’’ అని అన్నారు. చదవండి: మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే.. ‘‘స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్ చాలా పారదర్శకంగా చేస్తున్నాం. తప్పుడు వార్తలు పదే పదే రాస్తే లీగల్ గా చర్యలు తీసుకుంటాం. స్మార్ట్ మీటర్ల టెండర్లపై పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. ప్రయాస్ రిపోర్ట్ వృధా.. తప్పు అని అనలేదు. సగటు విద్యుత్ ధర, కొనుగోలు ధరలని లెక్క వేయడంలో పొరపాట్లు వచ్చాయి. యూనిట్ రేట్లో వ్యత్యాసం వేయడం వలనే వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో 25 వేల నుంచి 30 వేల మీటర్లని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని పరిశీలన చేశాం. ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం తర్వాత మిగిలి జిల్లాలలో మళ్లీ పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు?. స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని తెలియాల్సిన అవసరం ఉంది’’ అని విజయానంద్ అన్నారు. -
విశాఖలో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ మోడల్ భవనం
సాక్షి, అమరావతి: ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్(ఈసీబీసీ) మోడల్ భవనాన్ని విశాఖలో నిర్మిస్తున్నట్టు ఇందన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్(ఏపీఎస్ఈసీఎం), విశాఖ నగరపాలక సంస్థ, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అధికారులతో శుక్రవారం ఆయన వరŠుచ్యవల్ సమావేశం నిర్వహించారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) సహకారంతో జి+1 అంతస్తుల ఇంధన సామర్థ్యం ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ను విశాఖలో తొమ్మిది నెలల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. తక్కువ విద్యుత్ వినియోగం, విద్యుత్ బిల్లుల తగ్గుదల, హీటింగ్, వెంటిలేషన్, కూలింగ్ లోడ్, పగటి కాంతి వంటివి సమర్థంగా ఉపయోగించడం ఈ భవనం ప్రత్యేకతలుగా చెప్పారు. సాధారణ భవనాలకంటే 30–40 శాతం మెరుగైన భవన నిర్మాణ సాంకేతికతతో ఈసీబీసీ భవనాలుంటాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 701 వాణిజ్య భవనాలను ఈ విధంగా నిర్మించేందుకు ‘ఈసీబీసీ’ ద్వారా అనుమతులిచ్చామని పేర్కొన్నారు. వీటితో పాటు దేశంలో నిర్మించే భవనాలకు వైజాగ్‌లో నిర్మించే భవనం సూపర్ మోడల్‌గా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని 541 కోర్టు భవనాలు, 100 మోడల్ పాఠశాలలు, ఒక ప్రధాన ఆస్పత్రిలో ఇంధన సామర్థ్య చర్యలు అమలు చేసినట్లు స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని భవన నిర్మాణ రంగంలో (వాణిజ్య భవనాలు) ఇంధన డిమాండ్ దాదాపు 4,800 మిలియన్ యూనిట్లుగా ఉందని, ఈసీబీసీని అమలు చేయడం వల్ల విద్యుత్ ఆదా అవుతుందన్నారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, డైరెక్టర్లు డి.చంద్రం, బి.రమేష్ ప్రసాద్, ఏవీవీ సూర్యప్రతాప్ పాల్గొన్నారు. -
AP: రైతులకు 25 ఏళ్లు ఉచిత విద్యుత్
సాక్షి, అమరావతి: వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చాలనే లక్ష్యంతో రానున్న 25ఏళ్లపాటు రైతులకు నమ్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. అదేవిధంగా డాక్టర్ వైఎస్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాపై అధికారులతో మంత్రి సోమవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌కు కేవలం రూ.2.49 చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో మొదటి విడత 3వేల మెగావాట్లు, 2025లో రెండవ విడత 3 వేల మెగావాట్లు, 2026లో మూడో విడత వెయ్యి మెగావాట్లు చొప్పున సెకీ విద్యుత్ సరఫరా చేస్తుందని వివరించారు. ఆక్వా కల్చర్‌కు సబ్సిడీ ధరపై విద్యుత్ సరఫరా చేయడంతోపాటు వారికి ఆర్థికంగా మరింత మేలు కలిగేలా రైతు భరోసా వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. చెల్లింపులు ఆలస్యమైనా సరఫరా ఆగదు: విజయానంద్ డిస్కంల పనితీరును మెరుగుపరచడానికి, వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకాన్ని అమలు చేస్తోందని ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ తెలిపారు. ప్రస్తుతానికి డిస్కంలు వ్యవసాయానికి సంవత్సరానికి 12 వేల మిలియన్ యూనిట్లను సరఫరా చేస్తున్నాయని, దీనికోసం ప్రభుత్వం ఏటా రూ.8,400 కోట్ల సబ్సిడీని భరిస్తోందని వివరించారు. డీబీటీ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తున్నామని, 28,684 వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను అమర్చామని చెప్పారు. అక్కడ వ్యవసాయ వినియోగానికి సంబంధించిన నెలవారీ బిల్లింగ్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తోందని, ఒకవేళ చెల్లింపులు సకాలంలో అందకపోయినా డిస్కంలు రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాను కొనసాగిస్తాయని విజయానంద్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీజెన్కో ఎండీ బి.శ్రీధర్, ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీ తేజ్, డిస్కంల సీఎండీలు జె.పద్మ జనార్దనరెడ్డి, కె.సంతోష్‌రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: కె విజయానంద్
సాక్షి, విజయవాడ: దేశాభివృద్ధికి వెన్నెముక విద్యుత్ రంగం అని ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ అన్నారు. అలాంటి కీలకమైన విద్యుత్ శాఖలో పనిచేయడం మనందరి అదృష్టమని చెప్పారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. 'విద్యుత్ ఉద్యోగులు బాధ్యతగా పనిచేయాలి. విద్యుత్ రంగం అభివృద్ది దిశగా పయనిస్తోంది. 11 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్ద్యానికి ఏపీ విద్యుత్ శాఖ పెరిగింది. కృష్ణపట్నం ప్రాజెక్ట్‌ని ఇప్పటికే జాతికి అంకితం చేశాం. విజయవాడలో 800 మెగావాట్ల ధర్మల్ ప్లాంట్‌ను త్వరితగతిన పూర్తి చేస్తాం. ప్రజలకి నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం. వేసవిలో విద్యుత్ కోతలు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకి 9 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నాం' అని విజయానంద్ చెప్పారు. చదవండి: (ఈ పిట్ట రుచికి నాటుకోళ్లు, పొట్టేలు కూడా సాటిరావు) -
స్మార్ట్ మీటర్లపై అపోహలొద్దు
సాక్షి, అమరావతి: స్మార్ట్ మీటర్లవల్ల ప్రయోజనాలే తప్ప ఎలాంటి నష్టంలేదని, ఈ విషయంలో ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేయడంపై పలు పత్రికల్లో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఆ కథనాల్లోని సందేహాలను నివృత్తి చేస్తూ.. స్మార్ట్మీటర్లవల్ల కలిగే ప్రయోజనాలను, ఈ ప్రాజెక్టులోని వాస్తవాలను ఆయన వివరించారు. విజయవాడ విద్యుత్ సౌథలో గవర్నమెంట్ డిప్యూటీ సెక్రటరీ కుమార్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ శ్రీధర్, సెంట్రల్ డిస్కం సీఎండీ పద్మాజనార్ధనరెడ్డిలతో కలిసి మంగళవారం విజయానంద్ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా 2025 మార్చి నాటికి దేశమంతా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు 2019లోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ ఇచ్చింది. రాష్ట్రంలో ముందుగా 18.56 లక్షల వ్యవసాయ, హైవాల్యూ.. అంటే నెలకు 500 యూనిట్లు పైన విద్యుత్ వినియోగం ఉన్న 27.68 లక్షల సర్వీసులకు స్మార్ట్‌మీటర్లు అమర్చాలని ప్రభుత్వం అదే ఏడాది నిర్ణయించింది. అలాగే. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టాలని 2020లో డిస్కంలకు ఆదేశాలు జారీచేసింది. టెండర్ల కోసం దేశమంతా ఒకే నిబంధనలతో ఒక డాక్యుమెంట్‌ను కేంద్రమే రూపొందించింది. దాని ప్రకారం టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. పైగా.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా టెండర్ డాక్యుమెంట్‌ను న్యాయ సమీక్షకు పంపించి అక్కడ నుంచి అనుమతి వచ్చాక మాత్రమే టెండర్ల ఖరారు జరుగుతుంది. మరోవైపు.. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ ఓపెన్‌గానే ఉంది. ఐఆర్డీఏ, బ్లూటూత్, స్మార్ట్, రేడియో ఫ్రీక్వెన్సీ మీటర్లను ఆయా ప్రాంతాల్లో వెసులుబాటులను బట్టి ఏర్పాటుచేసేలా టెండర్లు రూపొందించాం. ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనవచ్చు. ఏ ఒక్క సంస్థకో ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం ఎక్కడా జరగడంలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మీటర్ ఒక్కటే పెట్టడంతో సరిపెట్టకుండా రైతుల ప్రాణరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంది. అందుకు అవసరమైన పరికరాలను (అలైడ్ మెటీరియల్) ఆర్థికంగా భారమైనా మీటర్లతో పాటు ఏర్పాటుచేయనున్నాం. మిగతా రాష్ట్రాల్లో కేవలం మీటర్లే ఇస్తున్నారు. మన దగ్గర స్మార్ట్మీటర్తో పాటు (మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ (ఎంసీబీ)తో కూడిన ఫ్యూజ్బాక్స్నూ అందిస్తున్నాం. ముట్టుకున్నా షాక్ కొట్టని బాక్స్‌ను అందిస్తున్నాం. ఇప్పుడున్నట్లు మూడు ఫ్యూజులు ఉండవు. మోటార్లు కాలిపోయే అవకాశం ఉండదు. అలాగే, ఎర్తింగ్ రాడ్‌ను కూడా ఏర్పాటుచేస్తాం. గ్రిడ్‌పై లోడ్ పడకుండా జాగ్రత్త పడొచ్చు ఇక ప్రస్తుతం గ్రామాల్లో పొలాల మధ్య ఉండే వ్యవసాయ మీటర్ వద్దకు వెళ్లి రీడింగ్ నమోదు చేయడం శ్రమతో కూడుకున్నది కావడంతో ఎవరూ ముందుకు రావడంలేదు. పూర్తి ఆధునిక సాంకేతికతతో స్మార్ట్‌మీటర్లను ఇస్తున్నాం. అలాగే.. – వీటి ద్వారా మోటార్ ఆన్, ఆఫ్ చెయ్యొచ్చు. రైతు పొలానికి వెళ్లి మోటారు స్విచ్చాన్ చేయాల్సిన అవసరం ఉండదు. – భవిష్యత్‌లో గ్రిడ్‌పై పడే లోడ్‌ను మ్యానేజ్ చేయాలంటే స్మార్ట్‌మీటర్ల ద్వారానే వీలవుతుంది. – అదే విధంగా ఎప్పటికప్పుడు లోడ్‌ను మోనిటర్ చేస్తూ గ్రిడ్‌పై లోడ్ పడకుండా జాగ్రత్తపడొచ్చు. – తద్వారా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా కాపాడుకోవచ్చు. – పైగా ఒక ట్రాన్స్ఫార్మర్పై రెండు, మూడు సర్వీసులుంటే అన్ని సర్వీసులకూ ఒకే విధమైన వినియోగం జరగదు. అందరిదీ కలిపి ఒకే రీడింగ్ చూపిస్తుంది. దీనివల్ల రైతులకు నష్టం కలుగుతుంది. పైలట్ ప్రాజెక్టుతో సత్ఫలితాలు మరోవైపు.. స్మార్ట్ మీటర్లపై శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలిచ్చింది. ప్రయాస్ అనే సంస్థ 20 శాతం విద్యుత్ ఆదా అయినట్లు తేల్చింది. మేం అన్ని సర్వీసులపైనా అధ్యయనం చేశాం. 33 శాతం విద్యుత్ అదా కనిపించింది. ఇక రాష్ట్రంలో 12 వేల మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి వాడుతున్నారు. ఇందులో 20 శాతమే ఆదా అనుకుంటే రూ.1,900 కోట్లు, 33 శాతం అయితే రూ.3,600 కోట్లు మిగులుతాయి. మీటర్లు పెట్టడానికి రూ.4 వేల కోట్లు ఖర్చవుతోంది. అంటే పెట్టిన పెట్టుబడి ఒకటి, రెండేళ్లలోనే వచ్చేస్తుంది. ఈ ఫలితాల ఆధారంగానే స్మార్ట్ మీటర్లపై ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో 99 శాతం మంది రైతులు కూడా ఇప్పటికే తమ అంగీకారాన్ని తెలిపారు. -
విజయానంద్ బయోపిక్.. నేటి తరానికి స్ఫూర్తి..
కొన్ని చిత్రాలు వినోదాన్ని కలిగిస్తే మరికొన్ని చిత్రాలు సమాజానికి ప్రేరణగా నిలుస్తాయి. సూరరై పోట్రు వంటి చిత్రాలు రెండో కోవకు చెందినవే. తాజాగా విడుదలైన విజయానంద్ చిత్రం అలాంటిదే. జీవితం సంతోషంగా సాగిపోతోంది, అక్కడితో ఆగిపోకూడదు. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కనాలి. అందుకు శక్తి వంచన లేకుండా శ్రమించాలి. ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని అనుకున్నది సాధించాలి. ఈ నేపథ్యంలో రూపొందిన చిత్రమే విజయానంద్. ఈ కథ కల్పన కాదు.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి స్వయం కృషితో అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి నిజ జీవితం. కర్ణాటక రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త విజయ్ సంగేశ్వర్ బయోపిక్. అందుకే ఆ చిత్రాన్ని నేటి యువతకు ప్రేరణగా పేర్కొనవచ్చు. విజయ్ సంగేశ్వర్ తండ్రి మ్యాన్యువల్ ప్రింటింగ్ మిషన్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించారు. ఆయనకు చేదోడుగా ఉండే ఆయన కొడుకు డ్రీమ్ పెద్దదిగా ఉంటుంది. దీంతో ఆప్ సెట్ ప్రింటింగ్ మిషన్ కొనుగోలు చేస్తాడు. ఆ వృత్తి సాఫీగా సాగుతున్నా, కొత్త వ్యాపారం చేయాలని భావిస్తాడు. ఒక లారీని కొనాలన్న అతని నిర్ణయానికి తండ్రి అడ్డుపడ్డారు. దీంతో ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చేసి తన కలను సాకారం చేసుకోవడానికి లారీని కోనుగోలు చేస్తాడు. అలా తన స్వయం కృషితో 120 లారీలకు అధిపతి అవుతాడు. అంతటితో ఆగకుండా పత్రిక అధిపతి కూడా అవుతాడు. అందుకు అతను ఎంతగా శ్రమించాడు, ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం విజయానంద్. వీఆర్ఎల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై డా.ఆనంద్ సంగేశ్వర్ నిర్మించిన ఈ చిత్రానికి మహిళా దర్శకురాలు రిషిక శర్మ దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. -
విజయానంద్‌కి మహానటి స్ఫూర్తి
‘‘రెండున్నర సంవత్సరాల క్రితం ‘విజయానంద్’ సినిమా ప్రయాణం మొదలైంది. బయోపిక్స్‌లో తెలుగులో వచ్చిన ‘మహానటి’ వంటి సినిమా మళ్లీ రాదు. ఒకవిధంగా ‘విజయానంద్’ సినిమాకు ‘మహానటి’యే ఓ స్ఫూర్తి. దర్శకులు రాజమౌళిగారికి నేను పెద్ద అభిమానిని’’ అని డైరెక్టర్ రిషికా శర్మ అన్నారు. వీఆర్ఎల్ లాజిస్టిక్స్ అధినేత విజయ్ శంకేశ్వర్ బయోపిక్‌గా రూపొందిన చిత్రం ‘విజయానంద్’. నిహాల్ రాజ్‌పుత్ హీరోగా నటించారు. రిషికా శర్మ దర్శకత్వంలో వీఆర్ఎల్ ఫిలింస్ పతాకంపై విజయ్ శంకేశ్వర్ తనయుడు డా.ఆనంద్ శంకేశ్వర్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిహాల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ–‘‘విజయ్ శంకేశ్వర్గారి పాత్ర చేయడం చాలా పెద్ద బాధ్యత. ‘విజయానంద్’అనేది మాకు సినిమా కాదు.. ఓ ఎమోషన్. ‘మహానటి’లో కీర్తీసురేష్గారి తరహా పెర్ఫార్మెన్స్ చేయాలనుకున్నాను. తెలుగు సినిమాలు చాలా బాగుంటాయి. రాజమౌళిగారికి నేను బిగ్ ఫ్యాన్’’ అన్నారు. ‘‘రెండున్నర గంటల్లో ఈ కథను అద్భుతంగా చూపించిన రిషికాగారికి, బాగా నటించిన నిహాల్‌కి థ్యాంక్స్’’ అన్నారు ఆనంద్ శంకేశ్వర్. నటీనటులు సిరి ప్రహ్లాద, భరత్, అనీష్ కురివిల్లా, యూఎఫ్ఓ లక్ష్మణ్ పాల్గొన్నారు. -
పాన్ ఇండియా మూవీగా విజయ్ శంకేశ్వర్ బయోపిక్, టీజర్ అవుట్
సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి, వీఆర్ఎల్ అనే లాజిస్టిక్ కంపెనీకి అధినేతగా ఎదిగిన డా. విజయ్ శంకేశ్వర్ జీవితం వెండితెరపైకి రానుంది. ‘విజయానంద్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘ట్రంక్’ మూవీ ఫేమ్ రిషికా శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ శంకేశ్వర్ పాత్రలో నిహాల్ నటిస్తున్నారు. ఆనంద్ శంకేశ్వర్ సమర్పణలో వి.ఆర్.ఎల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. చదవండి: డ్రెస్సింగ్‌పై ట్రోల్.. తనదైన స్టైల్లో నెటిజన్ నోరుమూయించిన బిందు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. విజయ్ శంకేశ్వర్ సొంత తెలివితేటలతో లారీల వ్యాపారంలోకి ప్రవేశించి ఎలా సక్సెస్ అయ్యారు? అనేది టీజర్లో చూపించారు. అనంత్ నాగ్, వినయ ప్రసాద్, వి. రవిచంద్రన్, ప్రకాష్ బెలవాడి, అనీష్ కురివిల్లా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం దర్శకుడిగా పనిచేస్తున్నారు. -
AP: దేశంలోనే తొలిసారి.. సెకీతో ఒప్పందం ఓ ట్రెండ్‌సెట్టర్
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో చేసుకున్న ఒప్పందం దేశ వ్యవసాయ రంగంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్నారు. సచివాలయంలోని ఇంధన శాఖ కార్యాలయంలో గురువారం బాధ్యతలు చేపట్టిన అనంతరం విద్యుత్ సంస్థల అధికారులతో ఆయన తొలి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగానికి రానున్న 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌ను హక్కుగా అందించాలనేది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పమని తెలిపారు. చదవండి: ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు.. వివరాలు ఇదిగో.. అందులో భాగంగానే తక్కువ ధరకు 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను పాతికేళ్ల పాటు రాష్ట్రానికి సరఫరా చేసేలా సెకీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. వ్యవసాయానికి పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జెన్కో, ట్రాన్స్‌కో ఎండీ శ్రీధర్, ట్రాన్స్‌కో జేఎండీలు.. పృథ్వీతేజ్, మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు.. హెచ్.హరనాథరావు, పద్మజనార్దనరెడ్డి, సంతోషరావు, నెడ్కాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి పాల్గొన్నారు. -
స్వేచ్ఛగా బద్వేలు ఉప ఎన్నిక
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా బద్వేలు ఉప ఎన్నికకు సంబంధించిన అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి ఎన్నికల ప్రచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు నిలిపేసినట్లు తెలిపారు. ఎన్నికకు 12 గంటల ముందుగానే నియోజకవర్గం సరిహద్దులన్నీ మూసేయాలని, నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలు మినహా ఇతర వాహనాలను అనుమతించొద్దని ఆదేశించారు. 28వ తేదీ సాయంత్రం 7 నుంచి 30 వ తేదీ రాత్రి 10 గంటల వరకూ, ఓట్ల లెక్కింపు రోజైన నవంబర్2న మద్యం షాపులను మూసేయాలన్నారు. 30న నియోజకవర్గంలో అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. హుజూరాబాద్‌లో ముగిసిన ప్రచార హోరు తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం తెరపడింది. 30న ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగనుంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతోపాటు కొందరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ఎన్నిక కోసం.. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా దాదాపు నాలుగు నెలలపాటు ప్రచార పర్వం సాగింది. -
ఈనెల 8 వరకు నామినేషన్ల స్వీకరణ
-
బద్వేలు ఉప ఎన్నికకు సహకరించండి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ కోరారు. గురువారం ఆయన సచివాలయంలోని తన చాంబరులో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉప ఎన్నిక నిర్వహణలో రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 28న షెడ్యూల్ జారీ చేసిందని తెలిపారు. తద్వారా ఆ రోజు నుండి అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కోరారు. నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 8వ తేదీ తుది గడువు అని, 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉప సంహరణకు తుది గడువు అని చెప్పారు. అక్టోబర్ 30న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని, మొత్తంగా నవంబర్ 5వ తేదీ లోపు ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. వైఎస్సార్సీపీ నుంచి జోగి రమేష్, టీడీపీ నుంచి వర్ల రామయ్య, బీజేపీ నుంచి వెన్న హేమంత్ కుమార్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. ఇప్పటికి 2,16,154 మంది ఓటర్లు ► ఈ ఏడాది జనవరి 15న నాటికి ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం.. తర్వాత సెప్టెంబర్ 29 నాటికి నమోదు చేసుకున్న ఓటర్లను కూడా పరిగణనలోకి తీసుకుని మొత్తం 2 లక్షల 16 వేల 154 మంది జనరల్, సర్వీసు ఓటర్లు ఈ ఉప ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ► అయితే అక్టోబర్ 8వ తేదీలోగా ఓటర్లుగా పేరు నమోదు చేసుకున్న వారు కూడా ఈ ఉప ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ► 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, కోవిడ్ పాజిటివ్ ఓటర్లు కోరితే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తాం. నియోజకవర్గం పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున అదనంగా మరో తొమ్మిది ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశాం. ► ఈ ఉప ఎన్నికలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నాం. రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఈ ఉప ఎన్నికల నిర్వహణ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ► సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల క్రిమినల్ యాంటిసిడెంట్స్ (నేర చరిత్ర)ను అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ముందుగానే ప్రచురించాల్సి ఉంది. కోవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరి ► కోవిడ్ మార్గదర్శకాలను తప్పక పాటించాలి. ఈ మేరకు ఎన్నికల ప్రచారం, ర్యాలీలు నిర్వహించుకోవాలి. నామినేషన్లు వేసేందుకు మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ సమయంలో ర్యాలీలు, ఉత్సవాలు నిషేధం. ► ఎన్నికల ప్రచార సమయంలో ఇండోర్ సమావేశాలకు 200 మంది, బహిరంగ సమావేశాలకు.. స్టార్ క్యాంపైనర్లకు 1,000 మంది, ఇతరులకు 500 మంది, వీధుల్లో సమావేశాలకు 50 మంది, డోర్ టు డోర్ ప్రచారానికి ఐదుగురు, మొత్తంగా 20 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ► రోడ్ షోలు నిర్వహించకూడదు. పోలింగ్‌కు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలి. 2 డోసుల కోవిడ్ టీకా వేయించుకున్న వారినే ఎన్నికల ఏజెంట్లుగా నియమించుకోవాలి. ఉప ఎన్నికల నిర్వహణలో వలంటీర్ల ప్రమేయం ఉండదు. -
రేపే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆదివారం జరగనున్న రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా–గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు శుక్రవారం ప్రచారం ముగిసిందని పేర్కొన్నారు. పోలింగ్ పూర్తయ్యేవరకు ఎన్నికల ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, ఎటపాక, పశ్చిమగోదావరి జిల్లా కుకునూరు, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లలో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకే జరుగుతుందని వివరించారు. ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి 11 మంది పోటీచేస్తున్నారని, 17,467 మంది ఓటర్లుండగా 116 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కృష్ణా–గుంటూరు స్థానానికి 19 మంది బరిలో ఉన్నారని, 13,505 మంది ఓటర్లుండగా 111 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని వివరించారు. -
ఆమే నిర్ణేత
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శుక్రవారం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో నిర్ణాయక శక్తిగా అవతరించారు. జనవరి 15 నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,05,08,222 (సర్వీస్, ఎన్నారై ఓటర్లతో కలిపి) ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ ప్రకటించారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 2,00,30,486 ఉండగా, మహిళా ఓటర్ల సంఖ్య 2,04,73,601గా నమోదైంది. రాష్ట్రంలో పురుషుల కంటే 4,43,115 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 4,135.. సర్వీస్ ఓటర్లు 66,844, ఎన్నారై ఓటర్లు 7,070 మంది ఉన్నారు. నవంబర్ 11న విడుదల చేసిన ముసాయిదా జాబితాతో పోలిస్తే ఓటర్ల సంఖ్య 3,62,353 పెరిగింది. ముసాయిదా జాబితా తర్వాత 4,25,860 మంది కొత్త ఓటర్లు నమోదు కాగా, 63,507 మందిని తొలిగించారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో గతంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 45,836 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 45,917కి చేరింది. రాష్ట్ర జనాభాలో ప్రతి 1,000 మంది జనాభాకు 752 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఓటర్ల సంఖ్యలో 18 నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉన్న వారి సంఖ్య 2,83,301గా ఉంది. నవంబర్‌లో ప్రకటించిన ముసాయిదా జాబితాపై డిసెంబర్ 15 వరకు అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలన అనంతరం జనవరి 15న తుది జాబితా ఎస్ఎస్ఆర్–2021ను విడుదల చేసినట్లు ఎస్ఈసీ పేర్కొంది. తుది జాబితాను జిలాల్ల వారీగా రాజకీయ పార్టీలకు డీఈవో/ఈఆర్వోల ద్వారా ఇస్తామని, సీఈవో వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేశామని పేర్కొంది. -
జనవరి 15న ఓటర్ల తుది జాబితా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను జనవరి 15న ప్రచురిస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) కె.విజయానంద్ తెలిపారు. ఇటీవల విడుదల చేసిన మూసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు డిసెంబర్ 15లోగా తెలియజేయాలని రాజకీయ పార్టీలను కోరారు. సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో రాజకీయ పార్టీలతో శుక్రవారం ఆయన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. విజయానంద్ మాట్లాడుతూ, నూతన ఓటర్ల నమోదుకు కూడా సహకరించాలన్నారు. 1,500 మంది ఓటర్లతో కూడిన పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ.. ఈనెల 16న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,00,79,025 మంది ఓటర్లుగా నమోదైనట్లు తెలిపారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు జనవరి 5లోగా పరిష్కారం చూపుతామన్నారు. ఈ నెల 28, 29 తేదీలతో పాటు డిసెంబర్ 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా సవరణలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం ముఖ్యమని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులు రాష్ట్రంలో కొత్తగా 80 లక్షల మంది ఓటర్లకు ఫొటో ఐడెంటిటీ కార్డులు జారీ చేసినట్లు విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు 740 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఓటర్ల నివాసానికి రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజనులకు కూడా అందుబాటులో ఉండేలా పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. రేషనలైజేషన్ తర్వాత రాష్ట్రంలో 45,917 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు సహకరించండి మార్చిలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీల కోసం ఎన్నికలు జరగనున్నాయని, ఓటర్ల నమోదుకు సహకరించాలని పార్టీలను విజయానంద్ కోరారు. ప్రస్తుతం 30 వేల మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. డిసెంబర్ 31లోగా రాష్ట్రంలో అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. -
నవంబర్ 16 నుంచి ఓటర్ల జాబితా సవరణ
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నిండే యువతీ, యువకులను ఓటరుగా నమోదు చేసేందుకు ఈ ఏడాది నవంబర్ 16వ తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ► ఈ నెల 10వ తేదీ నుంచి పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణతో పాటు ఓటర్ల జాబితాల్లో అనర్హుల పేర్లను తొలగిస్తారు. అక్టోబర్ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ► నవంబర్ 1వ తేదీ నుంచి ఫాం 1 నుంచి 8 వరకు అందుబాటులో తెస్తారు. సప్లిమెంటరీతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్ 16వ తేదీన ప్రకటిస్తారు. అదే రోజు నుంచి వచ్చే ఏడాది జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండేవారితో పాటు ఓటర్ల జాబితాలో పేరులేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ► డిసెంబర్ 15వ తేదీ వరకు ఓటరుగా నమోదుకు లేదా అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ► నవంబర్ 28, 29, డిసెంబర్ 12, 13 తేదీ (శని, ఆదివారాలు)ల్లో పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారు. ► ఓటర్లుగా చేరేందుకు బూత్ స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా మార్పులు, చేర్పులుంటే వారి దృష్టికి తీసుకెళ్లవచ్చు. దరఖాస్తులను, అభ్యంతరాలను వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ నాటికి పరిష్కరిస్తారు. జనవరి 14న తుది ఓటర్ల జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని సరిచూసుకుంటారు. జనవరి 15వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. -
రాష్ట్రంలో ఓటర్లు 4,00,02,782
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య తొలిసారిగా 4 కోట్ల మార్కును దాటింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) తర్వాత ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ శుక్రవారం విడుదల చేశారు. దీని ప్రకారం.. గత సాధారణ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 6,57,065 పెరిగింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,93,45,717 నుంచి 4,00,02,782కు చేరుకుంది. కొత్తగా పెరిగిన ఓటర్లలో పురుష ఓటర్ల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే పురుష ఓటర్ల సంఖ్య 1,94,62,339 నుంచి 1,97,90,730కు చేరగా, మహిళా ఓటర్ల సంఖ్య 1,98,79,421 నుంచి 2,02,07,984కు చేరుకుంది. థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 111 పెరిగి, మొత్తం 4,068గా నమోదైంది. సవరణ తర్వాత పురుష ఓటర్ల కంటే 4,17,254 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మొత్తం 13 జిల్లాల్లో శ్రీకాకుళం, అనంతపురం మినహాయిస్తే మిగిలిన 11 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండడం గమనార్హం. రాష్ట్రంలో 65,388 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు జాబితాలో పేర్కొన్నారు. తగ్గిన పోలింగ్ స్టేషన్ల సంఖ్య ఓటర్ల సంఖ్య పెరిగినా రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య తగ్గడం గమనార్హం. ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్ స్టేషన్ ఉండే విధంగా కసరత్తు చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. కొత్తగా 437 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 521 పోలింగ్ స్టేషన్లను విలీనం చేసింది. దీంతో మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 45,920 నుంచి 45,836కు తగ్గింది. ఎస్‌ఎస్‌ఆర్‌లో భాగంగా 2019 డిసెంబర్ 23వ తేదీన 3,98,34,776 ఓటర్లతో జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలను కోరింది. 1,63,030 ఓటర్లను చేర్చాలని, 60,412 ఓటర్లను తొలగించాలని అభ్యర్థనలు వచ్చినట్లు విజయానంద్ తెలిపారు. నికరంగా 1,02,618 ఓటర్లను జత చేసి, ఓటర్ల తుది జాబితాను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఓటర్ ఫొటో గుర్తింపు కార్డులను ఓటర్లకు వారి ఇంటి వద్దనే అందించే ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. -
కొత్త ఓటర్ల నమోదు మొదలు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, కొత్త ఓటర్ల నమోదు ఆదివారం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ అక్టోబర్ 15 వరకు 45 రోజులపాటు కొనసాగుతుంది. ఇందుకోసం రాష్ట్రంలో 11వేల సహాయ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వచ్చే ఏడాది జనవరిలో తప్పుల్లేని తుది జాబితా ప్రచురణ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె. విజయానంద్ కోరారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఓటర్ల సహాయ కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారు జాబితాలో తమ వివరాల్లోని తప్పులను సరిచేసుకోవడానికి ఇది చక్కని అవకాశమన్నారు. రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంతోపాటు డివిజన్ స్థాయిలోను, తహశీల్దార్ ఆఫీసుల్లో ఏర్పాటుచేసిన సహాయ కేంద్రాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని విజయానంద్ వెల్లడించారు. అలాగే, బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితా పరిశీలిస్తారని వివరించారు. జాబితాలో మార్పులు, చేర్పుల కోసం పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్, రేషన్‌కార్డు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు జారీచేసే గుర్తింపు కార్డులు, బ్యాంకు పాస్‌బుక్, రైతు గుర్తింపు కార్డు వంటి ఏదో ఒక కార్డుతో ఎన్నికల సిబ్బందిని సంప్రదించాలన్నారు. ఇంటి నుంచే మార్పులు, చేర్పులు ఇదిలా ఉంటే.. నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్, ఓటర్స్ హెల్ప్, 1950 కాల్ సెంటర్ ద్వారా ఇంటి నుంచే తగిన మార్పులు చేసుకోవచ్చని కె. విజయానంద్ తెలిపారు. ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారించిన అనంతరమే సవరణలు చోటుచేసుకుంటాయన్నారు. కాగా, మార్పుల చేర్పులు కోసం ఫారం–8 ద్వారా దరఖాస్తులను సమర్పించుకోవచ్చని ఆయన చెప్పారు. మరణించిన, చిరునామా మారిన ఓటర్ల కోసం ఫారం–7 అందుబాటులో ఉంటుందన్నారు. 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఫారం–6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత, డీఆర్ఓ ఏ ప్రసాద్ విజయవాడ ఇన్చార్జి సబ్‌కలెక్టర్ చక్రపాణి పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఓటర్ల జాబితాలో సవరణలు
సాక్షి,, అమరావతి: ఓటర్ల జాబితాలో తప్పులు సరి చేసేందుకు, మార్పులు, చేర్పులు చేసుకునేందుకు సెప్టెంబర్ ఒకటి నుంచి 30 వరకూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఓటరు కార్డులోని పేర్లలో తప్పులు, బంధుత్వాలు, చిరునామాల్లో తేడాలు వంటి వాటిని సరి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి అన్ని పోలింగ్ బూత్‌ల్లోనూ బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) అందుబాటులో ఉంటారని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ సవరణలకు ప్రత్యేక విభాగాలు పనిచేస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 11 వేల మీసేవా కేంద్రాల్లోనూ మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుందని వివరించారు. దీనికోసం ఓటర్లు తమ పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, రేషన్ కార్డ్, ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్, రైతు గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దాన్ని చూపిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఎన్వీఎస్పీ (నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్), ఓటర్ హెల్ప్‌లైన్ యాప్, 1950 కాల్ సెంటర్ ద్వారా కూడా సవరణలకు అవకాశం ఉంటుందన్నారు. మార్పులు, చేర్పుల కోసం ఫామ్–8, మృతి చెందిన, చిరునామా మారిన ఓటర్ల కోసం ఫామ్–7 పోలింగ్ బూత్‌లు, ఆయా కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. బీఎల్వోలు క్షేత్ర స్థాయిలో నిర్ధారణ చేశాక మార్పులకు తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. సవరణ తర్వాత అక్టోబర్ 15న ముసాయిదా ఓటర్ల జాబితాను, 2020, జనవరిలో తుది జాబితాను ప్రచురిస్తామని చెప్పారు. -
ఓటర్ల జాబితా సవరణకు సన్నద్ధం
సాక్షి, అమరావతి: ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ ఆదివారం విజయవాడలో ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి నెల రోజులపాటు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని అన్ని పోలింగ్ కేంద్రాల్లో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పేర్ల నమోదు, మార్పులు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇక మీదట ఫామ్ 7 దుర్వినియోగం కుదరదని స్పష్టం చేశారు. WWW.NVSP.IN వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు అని సూచించారు. Voter helpline app, 1950 నంబర్ల ద్వారా కూడా ఓటర్ల నమోదుకు అవకాశం ఉందని ఆయన తెలియజేశారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పూర్తయ్యాక అక్టోబర్ 15న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామన్నారు. -
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె.విజయానంద్ నూతన సీఈవోగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయానంద్ ప్రస్తుతం ఏపీ జెన్కో సీఎండీగా ఉన్నారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఈవో ఆర్పీ సిసోడియా ఆకస్మికంగా బదిలీ చేసి ఆ స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన విషయం తెలిసిందే. -
ధర్మశాల టెస్టు పరిశీలకుడిగా విజయానంద్
సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగనున్న నాలుగో టెస్టుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) సంయుక్త కార్యదర్శి ఆర్. విజయానంద్ పరిశీలకునిగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏ అధికారులు ఆయనను అభినందించారు. ధర్మశాలలో ఈనెల 25 నుంచి 29 వరకు బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో చివరిదైన నాలుగో టెస్టు జరుగుతుంది. -
ట్రాన్స్‌కో భూమిని రక్షించండి
ట్రాన్స్‌కో సీఎండీకి వినతిపత్రం ఇచ్చిన ఇంజనీర్స్ అసోసియేషన్ సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో తమ సంస్థకు చెందిన రూ.200 కోట్ల విలువైన ఐదు ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునేందుకు ట్రాన్స్‌కో ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సన్నద్ధమయ్యారు. విజయవాడ గుణదలలోని విద్యుత్ సౌధ భూమిని స్టార్ హోటల్‌కు 99 ఏళ్ల పాటు లీజుకు కట్టబెట్టాలని ప్రభుత్వ ముఖ్యనేత నిర్ణయించడంతో శుక్రవారం పర్యాటక శాఖ అధికారులు ఇక్కడ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. లీజు ముసుగులో ట్రాన్స్‌కో భూమికి చినబాబు ఎసరు పెట్టడంపై ‘స్టార్.. స్టార్.. దగా స్టార్’ శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కో ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. విలువైన భూమిని స్టార్ హోటల్‌కు అప్పనంగా కట్టబెట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ను కలిశారు. ట్రాన్స్‌కో భూమి బినామీల పరం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే జేఏసీ ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామన్నారు. -
బాలాజీ, తరుణ్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: విజయానంద్ సీసీ బ్యాట్స్‌మెన్ బాలాజీ రెడ్డి (108), తరుణ్ సాయి (103) సెంచరీలతో చెలరేగారు. దీంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా సఫిల్‌గూడ సీసీతో జరిగిన మ్యాచ్‌లో విజయానంద్ 263 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన విజయానంద్ సీసీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 320 పరుగులు చేసింది. బాలాజీ రెడ్డి, తరుణ్ సాయిలతో పాటు అభిషేక్ (72) ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో హర్ష్ 4, రుత్విక్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 323 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన సఫిల్‌గూడ సీసీ జట్టు... తేజ (5/8), అభిషేక్ (5/6) ధాటికి 21.5 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు గన్‌రాక్ సీసీ: 202/7 (ఆకాశ్ 50, లక్ష్మణ్ 54; రితేశ్ 5/25), హెచ్‌పీఎస్: 203/7 (సారుురెడ్డి 37 నాటౌట్; చిరంజీవ్ 5/30). గోల్కొండ సీసీ: 257 (ఎజాజ్ 86, చిరంజీవి 53; రంగస్వామి 5/48), హైదరాబాద్ డిస్ట్రిక్ట్: 253 (సౌభిక్ 113; చిరంజీవి 4/48). రుషిరాజ్ సీసీ: 177 (రాజేశ్ 55, జీయ 38; జితేందర్ 5/20), అంబర్పేట్ సీసీ: 179 (రామకృష్ణ 50, భరత్ 50; తహ్సీన్ 4/30). పికెట్ సీసీ: 318/6 (ప్రద్యుమ్న 75, శాశ్వత్ 81; సారుుకృష్ణ 4/85), లక్కీ ఎలెవన్: 124 (అశ్విత్ 68 నాటౌట్; సందీప్ గౌడ్ 3/18, నితీశ్ 3/37). సత్య సీసీ: 224 (ప్రజ్వల్82, సారుు హర్ష 52; తేజస్ 3/67, అబ్దుల్ హఫీజ్ 3/61), టైమ్ సీసీ: 36 (అక్షయ్ 4/14, రిత్విక్ 5/10). నటరాజ్ సీసీ: 205/7 (వరుణ్ 52 నాటౌట్; ఫైజాన్ 3/20), సన్‌షైన్ సీసీ: 206/8 (అక్షయ్ 37, సారుు తేజ 4/55, అచ్యుత్ 3/49). సూపర్ స్టార్: 213/9 (రోహిత్ 90, విక్రవర్ధన్ 43), విజయ్ సీసీ: 75 (యశ్వంత్ 3/32, రోషన్ 3/18). ఎంపీ బ్లూస్: 311/6 (రాజు 118, యేసుదాస్ 76, స్వామి 40), అను సీసీ: 236 (నవల్ 51, నకుల్ 40; సిద్ధాంత్ 3/36). హైదరాబాద్ వాండరర్స్:219 (పటేల్ 74; కౌస్తుబ్ 3/49), రిలయన్స సీసీ: 168 (అఖిల్ 54; అనికేత్ 4/36, జితేందర్ 3/47) -
ఎన్నారై భర్తపై భార్య ఫిర్యాదు
విశాఖ : ఆడపిల్ల పుట్టిందనే కోపం భార్యబిడ్డలను వదిలేసి ఓ భర్త అమెరికా వెళ్లిపోతే, మరో ఘటనలో అదనపు కట్నం కోసం ఓ ఎన్నారై భార్యను వేధింపులకు గురి చేస్తున్న ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. దీంతో భర్త వేధింపులపై ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే ప్రతాప్‌రెడ్డి గార్డెన్‌కు చెందిన విజయానంద్‌తో జ్యోతిక వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.20 లక్షలు కట్నంగా ఇచ్చారు. అయినా అదనపు కట్నం కోసం భర్తతో పాటు, అత్తమామలు ఆమెను వేధింపులకు గురి చేస్తున్నారు. పైపెచ్చు జ్యోతికకు అక్రమ సంబంధం అంటగట్టి వేధించడంతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. యూకేలో టీసీఎస్ కంపెనీలో పని చేస్తున్న భర్త విజయానంద్ గత రెండేళ్లుగా తనను, కొడుకును పట్టించుకోవడం లేదని బాధితురాలు జ్యోతిక ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అక్రమ సంబంధం ఉందంటూ విడాకులు కావాలంటూ భర్త నోటీసులు పంపించాడని ఆవేదన వ్యక్తం చేసింది. డీఎన్ఏ పరీక్షలకు తాను సిద్ధంగా ఉన్నట్లు జ్యోతిక తెలిపింది. అయితే న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయించినా పట్టించుకోవటం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
'కృష్ణపట్నం' దేశానికే మణిపూస
కృష్ణపట్నం: కృష్ణపట్నం సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రం దేశానికే మణిపూసవంటిదని ఏపీ జెన్కో ఎండీ విజయానంద్ అభివర్ణించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేసినట్టు ఆయన చెప్పారు. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌ను తీర్చగల సత్తా కృష్ణపట్నంకే ఉందన్నారు. కృష్ణపట్నం ప్రాజెక్టును శనివారం ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు జాతికి అంకింతం చేస్తున్న సందర్భంగా శుక్రవారం ప్రాజెక్టు ఆవరణలో విజయానంద్ విలేకర్లతో మాట్లాడుతూ... అతి తక్కువ బొగ్గుతో అత్యుత్తుమ సామర్థ్యం ఉండేలా అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని రూపొందించామని చెప్పారు. దీని వల్ల ఈ వేసవిలో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు తీరడమే కాకుండా మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు విక్రయించే సత్తా ఏపీ జెన్కోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఇక మీదట స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ళు ఉండబోవని విజయానంద్ తెలిపారు. ప్రాజెక్టు వ్యయం ఇప్పటి వరకూ రూ. 12,290 కోట్లకు చేరిందని, దీని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ యూనిట్ రూ. 4.53కు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మరో మూడేళ్ళలో కృష్ణపట్నంలో ఇంకో 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త ప్రాజెక్టును నిర్మిస్తామని, అందుకు సంబంధించి బీటీజీ కాంట్రాక్టు బీహెచ్ఈఎల్కు ఇచ్చామని చెప్పారు. ఇంకా బీవోపీ కాంట్రాక్టులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జెన్కో ప్రాజెక్టు పరిధిలోని చుట్టపక్కల గ్రామాల్లో పర్యావరణ సమతుల్యత కాపాడతామని స్పష్టం చేశారు. సామాజిక బాధ్యత కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కృష్ణపట్నం కొత్త ప్రాజెక్టు కావడం వల్ల తొలి దశలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వచ్చాయని... అయితే క్రమంగా వీటిని అధిగమిస్తున్నామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రోజుకు 39 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకు అందేలా ఉత్పత్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే రెండు యూనిట్లు సీవోడీ ప్రక్రియను పూర్తి చేసుకున్నందున త్వరలో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు. ఏపీ జెన్కో ప్రాజెక్టులన్నీ దేశంలో ఎక్కడా లేని విధంగా 80 శాతం పీఎల్ఎఫ్ సాధిస్తున్నాయని విజయానంద్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో థర్మల్ డెరైక్టర్ సుందర్‌సింగ్, ప్రాజెక్టు మేనేజర్ రాఘవేందర్రావు, సీఈ సత్యనారాయణ, ఏపీ ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కృష్ణపట్నం ప్రాజెక్టుపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను విలేకర్లకు ఈ సందర్భంగా విజయానంద్ వివరించారు. -
విద్యుత్ వివాదం మళ్లీ మొదటికి
గైర్హాజరైన తెలంగాణ అధికారులు సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విద్యుత్ వివాదానికి పీటముడి పడింది. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ(సీఈఏ) సోమవారం ఢిల్లీలో ఇరు రాష్ట్రా ల ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. అయితే ఈ భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. ఆ రాష్ట్ర ఇంధన కార్యదర్శి అరవిందకుమార్ రాలేకపోయారు. దీంతో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ తమ వాదనను సీఈఏ ముందుంచారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు 53.89శాతం, ఏపీకి 46.11శాతం విద్యుత్ వాటాలు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు మినహా మిగతా వాటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు ఆమోదం తెలిపింది. దీంతో అటు తెలంగాణలో, ఇట ఏపీలో కొత్త ప్రాజెక్టుల విద్యుత్ వాటాలపై వివాదం తలెత్తింది. ఏపీలోని కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టుల పీపీఏలు అంగీకరించలేదు. కాబట్టి ఇందులో తెలంగాణకు ఎలాంటి హక్కు లేదని ఏపీ పట్టుబట్టిం ది. వివాదం పరిష్కారం కోసం కేంద్రం ఏర్పా టు చేసిన కమిటీ ఎలాంటి నిర్ణయం ఇవ్వకుండానే కాల పరిమితి ముగిసింది. ఈ క్రమంలో సీఈఏ నేరుగా రెండు రాష్ట్రాల అధికారులతో సమాలోచనలు జరపాలని నిర్ణయించింది. తాజా భేటీలో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణపట్నం విద్యుత్ అవసరం లేదని తెలంగాణ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు లేఖ రాసిందన్నారు. కనుక దీన్ని తమకే కేటాయించాలన్నారు. అలాగే హిందూజా కూడా ఏపీకే చెందాలన్నారు. తెలంగాణలో 600 మెగావాట్లతో నిర్మిస్తున్న కాకతీయ థర్మల్ పవర్‌స్టేషన్ రెండో దశలో ఏపీకి 46.11 శాతం వాటా రావాలన్నారు. 120 మెగావాట్ల పులిచింత విద్యుత్ కేంద్రంలో ఇదే నిష్పత్తిలో వాటా కోరారు. ఆదిలాబాద్ జిల్లాల్లో నిర్మిస్తున్న సింగరేణి ప్రాజెక్టులోనూ 484 మెగావాట్లు ఏపీకి హక్కు ఉందని స్పష్టం చేశారు. ఏపీలో కొత్తగా రాయసీమ థర్మల్ స్టేషన్ నాలుగో దశ, నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ఆంధ్రప్రదేశ్‌కే ఇవ్వాలన్నారు. తమ వాదనపై తెలంగాణ అభిప్రాయాలు తెలుసుకుని, నిర్ణయాన్ని ప్రకటిస్తామని సీఈఏ ఛైర్మన్ చెప్పినట్టు విజయానంద్ తెలిపారు. -
ఏపీ జెన్కోకు జ్యూరీ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఏపీ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో)కు మరో జాతీయ అవార్డు లభించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో అంతర్జాతీయ ప్రమాణాలు నమోదు చేసినందుకు 8వ ఎనర్తియా జూరీ అవార్డుకు ఏపీ జెన్కో ఎంపికైంది. దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు 65.6 శాతం పీఎల్ఎఫ్(ప్రాజెక్టు లోడ్ ఫ్యాక్టర్) నమోదు చేస్తే, ఏపీ జెన్కో 78 శాతం పీఎల్ఎఫ్ సాధించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలోనూ ఈ సంస్థ అగ్రగామిగా ఉండడం వల్ల ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏజీ అయ్యర్ చేతుల మీదుగా ఏపీ జెన్కో సీఎండీ విజయానంద్ గురువారం అవార్డు అందుకున్నారు. జెన్కో సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగానే అవార్డు వచ్చిందని విజయానంద్ మీడియాకు తెలిపారు. -
మరో 48 గంటలు చీకట్లే!
ఉత్తరాంధ్రలో కుప్పకూలిన విద్యుత్ సరఫరా వ్యవస్థ కూలిన టవర్లు.. విరిగిన స్తంభాలు.. తెగిన తీగలు రోడ్లపై చెట్లతో గ్రామాలకు సామాగ్రి సరఫరాలో సమస్యలు విశాఖ నగరానికి మాత్రం పాక్షిక విద్యుత్ నేడు పరిస్థితి మెరుగుపడే అవకాశం హైదరాబాద్: ఉత్తరాంధ్రలో మరో 48 గంటలు చీకట్లు తప్పవని అధికారులు అంటున్నారు. హుదూద్ తుపాన్‌తో విద్యుత్ వ్యవస్థ కకావికలమైందని తెలిపారు. 60 ఏళ్ళుగా సమకూర్చిన అన్ని వ్యవస్థలూ కుప్పకూలాయని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ‘దీని నుంచి కోలుకోవడానికి ఎన్ని గంటలు కాదు... ఎన్ని రోజులు పడుతుందో కూడా చెప్పలేం’ అని ఏపీ జెన్కో సీఎండీ విజయానంద్ ‘సాక్షి’తో అన్నారు. తాజా పరిస్థితుల్లో దశలవారీగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. అతి కష్టం మీద మంగళవారం విశాఖ నగరానికి పాక్షికంగా విద్యుత్ ఇవ్వగలిగారు. గాజువాక 220 కేవీ సబ్‌స్టేషన్‌ను కొంతవరకు పునరుద్ధరించారు. దీనిద్వారా పరిసర ప్రాంతాలకు అతి తక్కువ విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. దీనికీ క్షణానికో సాంకేతిక అవాంతరం ఎదురవుతోంది. బుధవారం పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక విజయగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విద్యుత్ సరఫరాపై అధికారులు ఇతమిద్దంగా హామీ ఇవ్వలేకపోతున్నారు. పెద్ద ఎత్తున సబ్స్టేషన్లు కుప్పకూలాయి. స్తంభాలు విరిగిపోయాయి. తీగలు తెగిపోయాయి. ఈ పరిస్థితుల్లో రెండురోజుల వరకు దీనిపై స్పష్టత ఇవ్వలేమని, జిల్లా కేంద్రాలకు మాత్రం సరఫరా సాధ్యం కావచ్చునని అంటున్నారు. సింహాద్రి గాడిలో పడాల్సిందే.. విశాఖను గాడిలో పెట్టేందుకు సోమవారం నుంచే అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కానీ మంగళవారం సాయంత్రం వరకు ఈ ప్రయత్నాలు ఫలించలేదు. మాంచ్‌ఖండ్ నుంచి లైన్ క్లియర్ కాలేదు. అన్నీ బ్రేక్ డౌన్లే ఉన్నాయి. వేమగిరి ప్లాంట్ అనుసంధానం కుదరలేదు. మార్గంలో అనేక టవర్లు కూలిపోయాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విద్యుత్ తీసుకునే అవకాశం లేకుండాపోయింది. విశాఖలో ప్రధాన ఆసుపత్రి కింగ్జార్జ్కు అతి కష్టం మీద కొన్ని గంటలు విద్యుత్ సరఫరా చేశారు. వేమగిరి ప్లాంట్ నుంచి గాజువాక 220 కేవీ సబ్‌స్టేషన్‌కు లింక్ చేసినా, ఇది విశాఖ అవసరాలు తీర్చే స్థాయిలో లేదు. జాతీయ థర్మల్ పవర్ స్టేషన్‌కు చెందిన సింహాద్రి యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన నిలిచిపోవడం పెద్ద అడ్డంకిగా మారింది. విపరీతమైన గాలికి ఊహించని విధంగా సింహాద్రి యూనిట్లలో నష్టం జరిగింది. యూనిట్ల రక్షణకు అమర్చిన రేకులు, గ్లాసులు పగిలిపోయాయి. దీంతో టర్బైన్లలోకి నీళ్లు వచ్చాయి. యథాతథ స్థితికి మరో 5 రోజులైనా పడుతుందని అధికారులు తెలిపారు. అప్పర్ సీలేరులోనూ ఇదే పరిస్థితి. మంగళవారం రాత్రి వరకు ఒక్క యూనిట్ ఉత్పత్తి జరలేదు. ముమ్మరంగా మరమ్మతులు: అజయ్ జైన్ విశాఖ నగరంలో బుధవారం విద్యుత్ సరఫరా మెరుగయ్యే అవకాశం ఉందని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఇప్పటికే గాజువాక 220 కేవీని పునరుద్ధరించామని, మిగతా సబ్ స్టేషన్లను బాగు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. కాగా, మంగళవారం రాత్రి విశాఖ శివార్లలో విద్యుత్‌ను పునరుద్దరించారు. కొత్త గాజువాక/గోపాలపట్నం సబ్ స్టేషన్ల నుంచి పద్మనాభపురం, నరవ, మింది గ్రామాల్లో వున్న జీవీఎంసీ నీటి సరఫరా విభాగానికి విద్యుత్ సరఫరా చేశారు. -
విద్యుత్ సౌధలో ఉద్యోగుల ఆందోళన
హైదరాబాద్: వేతన సవరణ చేయడానికి ప్రభుత్వం అంగీకరించనందుకు నిరసనగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ సౌధలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. సమస్యల పరిష్కారానికి యాజమాన్యాలు సానుకూలంగా స్పందించడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. ఉద్యోగులు ఆందోళన చేపట్టడంతో యాజమాన్యాల చర్చలు ప్రారంభించారు. ఉద్యోగ సంఘ నాయకులు,. యాజమాన్యాల మధ్య చర్చలకు జెన్కో ఎండీ విజయానంద్, ట్రాన్స్ కో సీఎండీ సురేష్ చందా హాజరయ్యారు. విద్యుత్ సమ్మె సోమవారం కూడా కొనసాగితే ఎన్టీటీపీఎస్ పూర్తిగా మూతపడే అవకాశాలు ఉన్నాయని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. -
జెన్కోకు ‘సౌర’ సొగసు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ జెన్కోకు ‘సౌర’ సొగసు సమకూరనుంది. రాష్ట్రవ్యాప్తంగా 30 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌరవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు జెన్కో పాలక మండలి ఆమోదముద్ర వేసింది. దాంతో పాటు మరో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకూ భూమిని సేకరించాలని నిర్ణయించింది. విద్యుత్ సౌధలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, జెన్కో చైర్మన్ ఎం.సాహూ అధ్యక్షతన గురువారం బోర్డు సమావేశం జరిగింది. వైఎస్సార్ జిల్లాలోని రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద 20 మెగావాట్లు, నెల్లూరులో 5 మెగావాట్లు, ఖమ్మంలోని కేటీపీఎస్ వద్ద మరో 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు బోర్డు ఆమోదముద్ర వేసింది. వాగులు, వంకలపై 104 మెగావాట్ల సామర్థ్యంతో 75 ప్రాంతాల్లో మినీ జల విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించగా.. 2.5 మెగావాట్ల సామర్థ్యంతో 3 కేంద్రాల ఏర్పాటుకు మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. విజయనగరం, వరంగల్‌లో ఒక్కో మెగావాట్ చొప్పున ఏర్పాటు చేసేందుకు పీవీఆర్ ఇంజనీర్స్ కంపెనీ ముందుకురాగా.. నల్లగొండలో 0.5 మెగావాట్ సామర్థ్యం కలిగిన కేంద్రం ఏర్పాటుకు శ్రీనివాసన్ అనే కాంట్రాక్టరు ముందుకు వచ్చారు. వీటికి కూడా బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒడిశాలోని తాల్చేరు నుంచి రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లకు రైల్వే వ్యాగన్ల ద్వారా మరింత బొగ్గును సరఫరా చేసేందుకు, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూడా బోర్డు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. అయితే, విద్యుత్ సంస్థల రుణాల పునర్వ్యవస్థీకరణ ప్యాకేజీ అమలు తర్వాతే 2012-13 ఆర్థిక సంవత్సరానికిగానూ జెన్కో ఆర్థిక ఫలితాలు ప్రకటించాలని బోర్డు అభిప్రాయపడింది. ఈ సమావేశంలో జెన్కో ఎండీ విజయానంద్, ఆర్థిక, సాగునీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, జెన్కో జేఎండీ ప్రభాకర్‌రావు, డెరైక్టర్లు పాల్గొన్నారు.