ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడి
జాతీయ ఇంధన సంరక్షణ వారోత్సవాల్లో ‘సెకా’ అవార్డుల ప్రదానం
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపును అందరూ సామాజిక బాధ్యతగా భావించి దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థౖ అయిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సౌజన్యంతో ఇంధన శాఖ, ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) ఆధ్వర్యంలో రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డు (స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్–సెకా)ల ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది.
జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఏపీఎస్‌ఈసీఎం సీఈవో కుమారరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు విజయానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ జెన్‌కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.రవి పాల్గొన్నారు. పరిశ్రమలు, భవనాలు, సంస్థల విభాగాల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన సంస్థలకు ‘సెకా’ అవార్డులు ప్రదానం చేశారు.
అవార్డుల వివరాలివి..
» పరిశ్రమల విభాగంలో థర్మల్ పవర్ ప్లాంట్ కేటగిరీలో మొదటి బహుమతి.. ఎస్‌ఈఐఎల్, ద్వితీయ బహుమతి.. సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌లు సాధించాయి.
» టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీస్ కేటగిరీలో మొదటి బహుమతి.. మోహన్ స్పిన్‌టెక్స్ ఇండియా లిమిటెడ్, ద్వితీయ బహుమతి.. రవళి స్పిన్నర్స్ ప్రైవేట్ లిమిటెడ్
» ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ కేటగిరిలో మొదటి బహుమతి.. రా్రïÙ్టయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, ద్వితీయ బహుమతి.. ఆర్జాస్ స్టీల్ ప్రై.లిమిటెడ్
» బిల్డింగ్స్ విభాగంలో ఆఫీస్ బిల్డింగ్స్ కేటగిరీలో ప్రథమ బహుమతి.. విజయవాడ రైల్వే ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్
సెంటర్, ద్వితీయ బహుమతి.. గుంటూరు రైల్ వికాస్ భవన్
» హస్పిటల్ కేటగిరీలో మొదటి బహుమతి.. గుంతకల్లు రైల్వే హస్పిటల్, ద్వితీయ బహుమతి.. విజయవాడ రైల్వే హస్పిటల్
» ఆర్టీసీ డిపో అండ్ బస్టాండ్స్ కేటగిరీలో మొదటి బహుమతి.. సత్తెనపల్లి బస్ డిపో, ద్వితీయ బహుమతి.. విశాఖ బస్ డిపో
» ఇనిస్టిట్యూషన్ విభాగంలో మొదటి బహుమతి.. తాడిపత్రి మున్సిపాలిటీ, ద్వితీయ బహుమతి.. విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్
» విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో మొదటి బహుమతిని వి.వైకుంఠరావు, డి.వరప్రసాద్, ఆర్.తేజ, అంకం ఈశ్వర్, ద్వితీయ బహుమతిని వై.లోహితాక్స్, వై.జోహాన్, ఎండీ.ఖాషీష్ , రోసీ రాచెల్, పి.అంజలీ కుమారీలు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment