సాక్షి, విజయవాడ: ఈ వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్నారు. గురువారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ, వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు. సీఎం ఆదేశాలతో ప్రణాళికాబద్దంగా వేసవి డిమాండ్‌ని అధిగమిస్తామన్నారు.
‘‘గత ఏడాది కంటే ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలో సరాసరిన రోజుకి 202 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 227 మిలియన్ యూనిట్లకి పెరిగింది. గత ఏడాది మార్చి నెలలో రోజుకి 212 మిలియన్ యూనిడ్ల డిమాండ్ ఉంటే ఇపుడు 232 మిలియన్ యూనిట్లకి డిమాండ్ పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో పీక్ డిమాండ్ 232 మిలియన్ యూనిట్ల కాగా.. ఈ ఏడాది మార్చి రెండవ వారంలోపే 232 మిలియన్ యూనిట్లు దాటాం. గడిచిన ఏడాది కాలంలో ఏపీలో పెరిగిన పరిశ్రమల కారణంగా వాణిజ్య అవసరాలకి 18 శాతం, పరిశ్రమలకి 20.31 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది’’ అని విజయానంద్ వివరించారు.
‘‘ఈ కారణంగానే విద్యుత్ డిమాండ్ ఊహించని విధంగా రికార్డు స్ధాయికి పెరిగింది. మార్చి నెలాఖరుకి 240 మిలియన్ యూనిట్లు.. ఏప్రిల్ నెలకి 250 మిలియన్ యూనిట్లకి డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఏప్రిల్ నెలలో ఒక్క వ్యవసాయానికే సరాసరిన 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. పెరిగిన డిమాండ్ కి తగ్గట్లుగా విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపడుతున్నాం. పరిశ్రమలకి, గృహావసరాలకి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉంటుంది. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫారా కొనసాగిస్తాం’’ అని ఆయన తెలిపారు.
చదవండి: సీఎం జగన్ మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు: సజ్జల
కృష్ణపట్నం మూడవ యూనిట్ ద్వారా 800 మెగా వాట్ల విద్యుత్ నేటి నుంచి పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. సెమ్ కాబ్ ద్వారా 500 మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. మార్కెట్‌లో యూనిట్ ధర 12 రూపాయిలుంటే వేసవి అవసరాలను దృష్డిలో పెట్టుకుని ముందుగానే మార్చి, ఏప్రిల్ నెల కోసం యూనిట్ 7.90 రూపాయలకు విద్యుత్ కొనుగోలుకి ఎంఓయు చేసుకున్నాం. అదే విధంగా ఇతర రాష్ట్రాలతో 300 మెగా వాట్ల విద్యుత్‌కి బ్యాంకింగ్ ఒప్పందాలు చేసుకున్నాం’’ అని విజయానంద్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment