
ఇంధన శాఖ ఆదేశాలు జారీ
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకుగాను పలు ప్రైవేటు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆయా సంస్థలకు ప్రాజెక్టులను కేటాయిస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ప్రాజెక్టులకు 30 ఏళ్ల పాటు ప్రభుత్వం భూమిని సమకూరుస్తుందని, ఎకరాకు రూ.31 వేలు చొప్పున ఏటా లీజు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా వీటిలో పలు ప్రాజెక్టులను ముందుగా అనుకున్న సంస్థలను పక్కనపెట్టి కొత్త సంస్థల బదిలీ చేయడం గమనార్హం.
ఎకోరెన్ ఎనర్జీ ఇండియా నుంచి బదిలీలు
ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆంపిన్ ఎనర్జీ పవర్ ట్రాన్సిషన్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ ఆఫ్ సంస్థలకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 349.50 మెగావాట్ల పవన, సౌర విద్యుత్ పాజెక్టులు బదిలీ.
» ఇదే సంస్థ నుంచి ఎన్‌ఎస్‌ఎల్ రెన్యూవబుల్ సీపీపీ ప్రైవేట్ లిమిటెడ్‌కు శ్రీ సత్యసాయి జిల్లా, కనగానపల్లె మండలం, మద్దెలచెర్వు గ్రామం వద్ద 50 మెగావాట్ల పవన, సౌర హైబ్రీడ్ విద్యుత్ ప్రాజెక్ట్ బదిలీ. » అనంతపురంలోని రాళ్ల అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో సంస్థకు కేటాయించిన 201.30 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్ ఓ2 పవర్ గ్రూప్ కంపెనీలకు బదిలీ.
» కర్నూలు జిల్లా ఆస్పరి సమీపంలో 498.30 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్ట్.. అయన రెన్యూవబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదిలీ.
ఎవరికి... ఏవి..?
» మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్: అన్నమయ్య జిల్లాలో 2000 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్ట్.
» టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ: అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం గంగవరం సమీప గ్రామాల వద్ద 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్.
»నవయుగ ఇంజనీరింగ్: అల్లూరి సీతారామరాజు జిల్లా గుజ్జిలిలో 1500 మెగావాట్లు, చిట్టంవలసలో 800 మెగావాట్లు చొప్పున మొత్తం 2300 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్ట్‌లు.
» కడప రెన్యూవబుల్స్: శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎలకుంట్ల, ముతవకుంట్ల, రామగిరి, నసనకోట గ్రామాలు, కనగానపల్లె, రామగిరి మండలాల్లో 231 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు.
» అనంతపురం రెన్యూవబుల్స్: అనంతపురం జిల్లాలోని అడివిగొల్లపల్లె, బచ్చుపల్లె, యాటకల్, గరుడాపురం, పిల్లలపల్లె, కళ్యాణదుర్గ్, తీటకల్, హులికల్, చాపిరి, ముదిగల్, తూర్పు కోడిపల్లె, పాలవోయ్, నరసాపురం, కళ్యాణదుర్గం, బ్రహ్మాదురంలో 178.20 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్.
» ఆస్పరి రెన్యూవబుల్స్: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని కంబదూరు, రామగిరి మండలాల్లోని మోటార్చింతలపల్లె, కూరాకులపల్లె, పేరూరు, కొండాపురం, మక్కినవారిపల్లె గ్రామాల్లో 118.80 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు.
» సాయెల్ సోలార్: వైఎస్‌ఆర్ జిల్లా పెద్దముడియం మండలం గోవిందపల్లె దిగువ, కల్వతల, కొండసుంకేసుల, నాగిరెడ్డిపల్లే, నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలాల్లోని మాయలూరు గ్రామాల్లో 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్.
» సాయెల్ సోలార్: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడయపల్లి గ్రామం, వైఎస్‌ఆర్ జిల్లా కొండాపురం మండలం కోడూరు, సంకేపల్లి, యర్రగుడి గ్రామాల వద్ద 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్.
Comments
Please login to add a commentAdd a comment