సాక్షి, హైదరాబాద్: ఏపీ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో)కు మరో జాతీయ అవార్డు లభించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో అంతర్జాతీయ ప్రమాణాలు నమోదు చేసినందుకు 8వ ఎనర్తియా జూరీ అవార్డుకు ఏపీ జెన్‌కో ఎంపికైంది. దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు 65.6 శాతం పీఎల్‌ఎఫ్(ప్రాజెక్టు లోడ్ ఫ్యాక్టర్) నమోదు చేస్తే, ఏపీ జెన్‌కో 78 శాతం పీఎల్‌ఎఫ్ సాధించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలోనూ ఈ సంస్థ అగ్రగామిగా ఉండడం వల్ల ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏజీ అయ్యర్ చేతుల మీదుగా ఏపీ జెన్‌కో సీఎండీ విజయానంద్ గురువారం అవార్డు అందుకున్నారు. జెన్‌కో సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగానే అవార్డు వచ్చిందని విజయానంద్ మీడియాకు తెలిపారు.