apgenco
-
మనోళ్లేనా.. ఐతే సరే.!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టుల భర్తీకి జరుగుతున్న ఇంటర్వ్యూలు రెండో రోజు మంగళవారమూ మొక్కుబడిగానే సాగాయి. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కోలో డైరెక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి. కూటమి ప్రభుత్వం నిబంధనలు గాలికొదిలేసి, ఇస్టానుసారం మార్చేసుకుంది. కనీస అర్హత లేకున్నా వారికి నచ్చిన వారైతే అన్నింటినీ ఉల్లంఘించి అర్హత ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ పోస్ట్‌కు కనీస అర్హత మూడు సంవత్సరాల కాలంలో సూపరింటెండెంట్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసి ఉండాలి. కానీ జెన్కోలో డిప్యూటీ ఇంజనీర్‌గా పని చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక కార్పొరేషన్లో చేరిన ఓ అధికారికి నిబంధనలకు విరుద్ధంగా డైరెక్టర్ పోస్టుకు అర్హత కల్పించారు. ఆయన సహచరులు జెన్కోలో డీఈలుగానే ఉన్నారు. ఆయనకు హెచ్ఆర్ డైరెక్టర్ పోస్టుకు అవకాశమిచ్చారు.చిత్రమేమిటంటే ఇదే అభ్యర్ధిని థర్మల్, హైడల్ డైరెక్టర్ పోస్టులకు అనర్హుడిగా పేర్కొన్నారు. డైరెక్టర్ల పోస్టుల భర్తీలో అడ్డగోలు నిబంధనలకు ఇదో ఉదాహరణ. దాదాపు అన్ని పోస్టులకు తమ వారికి అనుగుణంగా ఇలా నిబంధనలు మార్చేశారు. బుధవారం ఏపీసీపీడీసీఎల్ డైరెక్టర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి.కాపు సంఘాల ‘సామాజిక’ ఉద్యమంవిద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టులకు పైరవీల కారణంగా తమ సామాజిక వర్గం అభ్యర్థులకు నష్టం వాటిల్లుతోందంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు సామాజిక మాధ్యమాల ద్వారా సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో గత ఎన్నికల్లో కాపులు కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారని, కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ రంగంలో కాపు సామాజిక వర్గానికి చెందిన అనుభవజ్ఞులు, నిజాయితీపరులు, చీఫ్ ఇంజనీర్ స్థాయిలో పని చేసిన వారు చాలా మంది ఉన్నారని, వారందరూ డైరెక్టర్ పోస్టులకు అర్హులని, దామాషా పద్ధతిలోనైనా న్యాయం జరగకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దామాషా పద్థతిలో ఇస్తే 15 పోస్టుల్లో జెన్కోలో ఒకటి, ట్రాన్స్‌కోలో ఒకటి, డిస్కంలలో ఒక్కొక్కటి చొప్పున కనీసం 5 పోస్టులు కాపులకు వచ్చే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఈ వాట్సప్ మెసేజ్‌లను సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్‌కు, మంత్రి లోకేశ్‌కు చేరే వరకూ ఫార్వార్డ్ చేయాలని ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేయడంతో మంగళవారం ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. -
ఏపీ జెన్కోలో రెడ్ బుక్ రాజ్యాంగం
-
జెన్కోలో ‘రెడ్ బుక్’ రాజ్యం
సాక్షి, అమరావతి: అధికారంలోకి వ చ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విద్యుత్ సంస్థలకు అన్వయిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో)లో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే నెపంతో గత రెండు నెలల్లో 135 మంది ఉద్యోగులను బదిలీ చేశారు.వీరిలో దాదాపు 90 శాతం ఎస్సీ, బీసీ సామాజికవర్గం వారే ఉండటం గమనార్హం. రాజకీయ ముద్ర వేసి ఇంతమంది ఉద్యోగులను బదిలీ చేయడం విద్యుత్ సంస్థల చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. లోకేశ్ రెడ్‌బుక్‌లో పేరుందని అధికారులపై ఒత్తిడి తెచ్చి బదిలీలు! వాస్తవానికి ఏపీజెన్కో ఉద్యోగులకు రాజకీయ నాయకులతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. అలాంటి సంస్థలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులని కొందరిపై ముద్ర వేసి ఒకేసారి వేరే ప్రాజెక్టులకు అర్ధాంతరంగా బదిలీ చేస్తున్నారు. ఒక అసోసియేషన్‌లో కీలకంగా ఉన్న నేతను పార్టీ ముద్ర వేసి ఏకంగా విజయవాడ జెన్కో కార్యాలయం నుంచి నెల్లూరుకు బదిలీ చేశారు. ఏపీ పవర్ జనరేటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అన్నె శ్రీనివాసకుమార్‌కు నిబంధనల ప్రకారం బదిలీ ప్రొటెక్షన్ (మినహాయింపు) ఉన్నప్పటికీ... ఆయన్ను సీలేరుకు బదిలీ చేశారు. ఈ బదిలీలను యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి ఎన్.వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం తీరును తప్పుబట్టారు. యూనియన్ బాధ్యతల్లో భాగంగా ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లి ప్రజాప్రతినిధులను కలుస్తుంటారని, తమ యూనియన్‌కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను ఆయన కోటరీలోని కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తున్నారని, అదేవిధంగా లోకేశ్ రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్నాయని అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ బదిలీలు చేయిస్తున్నారని వెంకట్రావు ఆరోపించారు. బదిలీలకు గడువు ముగిసిన తర్వాత...ఉద్యోగుల బదిలీలకు గడువు ముగిసిన తర్వాత... అసలు బదిలీలే వద్దనుకున్న ఏపీ జెన్కో యాజమాన్యం... రెండు నెలలుగా డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎనీ్టటీపీఎస్)తోపాటు విద్యుత్ సౌధ (జెన్కో ప్రధాన కార్యాలయం)లోను పెద్ద ఎత్తున బదిలీలు చేస్తోంది. దీనికి పరిపాలన, క్రమశిక్షణ అనే రెండు కారణాలను అధికారులు సాకుగా చూపుతున్నారు. ఈ విధంగా రెండు నెలల్లో విద్యుత్ సౌధలో 85 మందిని బదిలీ చేశారు. వీరిలో 31 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఎన్టీపీఎస్‌లో బుధవారం వరకు 50 మందిని బదిలీ చేయగా, వారిలో 15 మందిని దూర ప్రాంతాలకు పంపించారు. ఈ క్రమంలో బదిలీల వెనుక తమ ప్రమేయమే ఉందని టీడీపీకి చెందిన ఓ ట్రేడ్ యూనియన్ బాహాటంగా ప్రకటించుకుంది. తాము ఇ చ్చిన జాబితాల మేరకే బదిలీలు జరుగుతున్నాయని ఆ యూనియన్ నేరుగా ఉద్యోగులను భయపెడుతోంది. దీంతో ఏ క్షణాన తమపై ఏ ముద్ర వేసి వేధిస్తారోనని ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. -
ఆ పోస్టులకు 65 ఏళ్ల వారూ అర్హులే!
సాక్షి, అమరావతి: రాజు తలచుకుంటే ‘దెబ్బల’కు కొదవా అన్న నానుడికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పదవుల కోసం క్యూ కట్టేవారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడంతో.. తమకు అనుకూలంగా ఉన్న వారిని అందలం ఎక్కించేందుకు.. గతంలో ఉన్న నిబంధనలను సైతం అడ్డగోలుగా మార్చేస్తున్నది. తాజాగా రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల నియామకానికి సంబంధించి, ఇన్నాళ్లూ గరిష్ట వయసు పరిమితి 62 ఏళ్లుగా ఉండేది. అయితే ఇకపై 65 ఏళ్ల వయసు వారు కూడా ఆ పదవులకు అర్హులేనంటూ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లతో పాటు ఏపీజెన్కో, ఏపీ ట్రాన్స్‌కోలకు కూడా తాజా నిబంధన వర్తిస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో విద్యుత్ సంస్థల్లో నియమితులైనవారు.. రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హెచ్చరించింది. వారి స్థానంలో తమ వారిని, భారీగా ముడుపులు ఇచ్చే వారిని నియమించాలని కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో కీలక పోస్టుల్లో ఉన్న కొందరిని బలవంతంగా బయటకు పంపించారు. వారిలో ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి మల్లారెడ్డి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్లో ముఖ్య ఆర్థిక సలహాదారులు హనుమంతరావు, సింహాచలం, జెన్కో ఓఎస్డీ ఆంటోనిరాజు ఉన్నారు. వీరి తరువాత పదిమంది డైరెక్టర్ల చేత గత జూలైలో రాజీనామాలు చేయించారు. కూటమి నేతలు ఆ పోస్టులకు ఇప్పటికే రూ.కోట్లలో బేరాలు మొదలు పెట్టారు. అయితే తామనుకున్నది చేసేందుకు, తాము కోరుకున్నవారిని నియమించేందుకు వయసు అడ్డు రావడంతో దానిని సవరించారు. మూడేళ్లు పెంచేసుకుని, అరవై ఐదేళ్లు ఉన్నవారికీ అవకాశం కల్పించేలా కొత్త జీవో రూపొందించారు. గతంలో విద్యుత్ సంస్థల్లో చీఫ్ జనరల్ మేనేజర్లుగా పనిచేసిన వారు ఇప్పుడు తాజాగా డైరెక్టర్ల పోస్టులకు పోటీ పడుతున్నారు. ఎలాగైనా కూటమి నేతలను ప్రసన్నం చేసుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారి కోసమే కొత్తగా ఈ వయసు పెంపుదల అనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఇంధన శాఖపై ‘కూటమి’ కన్ను!
సాక్షి, అమరావతి: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకోవడంతో అప్పులు తీర్చుకుని ఆదాయం బాట పట్టిన ఇంధన శాఖపై టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల కన్ను పడింది. డిస్కంలతో పాటు ఏపీ జెన్కో, ట్రాన్స్‌కోలో కీలక స్థానాల్లో తమ వారిని నియమించుకొని, కోట్లాది రూపాయలు దండుకొనేందుకు కూటమికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు పెద్ద కుతంత్రానికే తెరలేపారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నియమితులైనవారిని రాజీనామాలు చేసి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వ శాఖలను జేబులు నింపుకొనేందుకు వాడుకున్నారో ఇప్పుడూ అదే తీరులో చెలరేగుతున్నారు. వారి ధన దాహానికి డైరెక్టర్ నుంచి అన్ని స్థాయిల ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. కూటమి పెద్దల బలవంతంతో వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. కొందరిని బలవంతంగా బయటకు పంపిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ, విశ్రాంత ఐపీఎస్ అధికారి మల్లారెడ్డి చేత రాజీనామా చేయించారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్లో ముఖ్య ఆర్థిక సలహాదారులు హనుమంతరావు, సింహాచలం, జెన్కో ఓఎస్డీ ఆంటోని రాజు, మరికొందరిని విధుల నుంచి తప్పించారు. డైరెక్టర్లనూ రాజీనామా చేయాలని ఇటీవల హుకుం జారీ చేశారు. మంగళవారం రాత్రి మరోసారి గట్టిగా చెప్పడంతో ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో, మూడు డిస్కంలలోని 10 మంది డైరెక్టర్లు బుధవారం రాజీనామా చేశారు. వారి బాధ్యతలను తాత్కాలికంగా సీజీఎంలకు అప్పగిస్తూ డిస్కంల సీఎండీలు ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీ అయిన పోస్టుల్లో కొన్నింటికి రూ. కోట్లలో బేరాలు మొదలు పెట్టినట్లు సమాచారం. కొన్ని పోస్టుల్లో అనుయాయులను నియమించుకొని వారి ద్వారా కోట్లు దండుకొనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల అధిపతులను కూడా మార్చాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తమకు అనుకూలంగా ఉండే పలువురు ఐఏఎస్ అధికారుల పేర్లును పరిశీలిస్తున్నట్లు సమాచారం.10 మంది డైరెక్టర్ల రాజీనామా ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్కో ఎండీ, డిస్కంల సీఎండీలకు 10 మంది డైరెక్టర్లు బుధవారం రాజీనామా లేఖలను అందజేశారు. వాటిని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌కు పంపగా, ఆయన వెంటనే ఆమోదించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాజీనామా చేసిన డైరెక్టర్లు » టి.వీరభద్రరెడ్డి (ఫైనాన్స్– ఏపీ ట్రాన్స్‌కో) » డి.ఎస్.జి.ఎస్.ఎస్. బాబ్జి (థర్మల్ – ఏపీ జెన్కో) » సయ్యద్ రఫి (హెచ్ఆర్, ఐఆర్ – ఏపీ జెన్కో) » ఎంవీవీ సత్యనారాయణ (హైడల్ – ఏపీ జెన్కో) » సి.శ్రీనివాసమూర్తి (ఆపరేషన్స్ – ఏపీఈపీడీసీఎల్) » ఎ.వి.వి.సూర్యప్రతాప్ (ప్రాజెక్ట్స్ – ఏపీఈపీడీసీఎల్) » వి. బ్రహా్మనందరెడ్డి (ఫైనాన్స్ – ఏపీసీపీడీసీఎల్) » బి. జయభారతరావు (టెక్నికల్ – ఏపీసీపీడీసీఎల్) » టి. వనజ (ప్రాజెక్ట్స్ – ఏపీసీపీడీసీఎల్) » కె.శివప్రసాదరెడ్డి (ప్రాజెక్ట్స్ – ఏపీఎస్పీడీసీఎల్) -
డిమాండ్‌కు తగ్గట్లు కరెంట్ కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది అనడానికి నిదర్శనంగా కనిపించే సూచికల్లో విద్యుత్ వినియోగం కూడా ఒకటి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి ఏపీలో విద్యుత్ డిమాండ్ ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. 2022లో తలసరి విద్యుత్ వినియోగం 1,234 యూనిట్లు ఉంటే 2023లో అది 1,357 యూనిట్లకు పెరిగింది. ఇలా ఏ ఏటికాయేడు కిందటి ఏడాదికి మించి కరెంటు రికార్డులు నమోదు చేస్తూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 236.73 మిలియన్ యూనిట్లుగా నమోదవుతోంది. ఇది గతేడాది ఇదే సమయానికి జరిగిన వినియోగం 231.05 మిలియన్ యూనిట్ల కంటే 2.46 శాతం ఎక్కువ. పగలు పీక్ డిమాండ్ 11,926 మెగావాట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 11,358 మెగావాట్లు ఉండేది. అంటే 5 శాతం పెరిగింది. ఈ ఏడాది వేసవి ఆరంభం కాకముందే ఎండలు ముదిరినప్పటికీ.. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా ఉంటున్నప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కొరత రాకుండా, కోతలు విధించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రజలకు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాయి. కొనుగోలుకు వెనుకాడకుండా.. రాష్ట్ర ప్రజలకు విద్యుత్ అందించేందుకు ప్రస్తుతం ఏపీజెన్కో థర్మల్ నుంచి 94.427 మి.యూ, ఏపీ జెన్కో హైడల్ నుంచి 4.528 మి.యూ, ఏపీ జెన్కో సోలార్ నుంచి 2.419 మి.యూ, సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్ల నుంచి 31.868 మి.యూ, సెయిల్, హెచ్‌పీసీఎల్, గ్యాస్ వంటి ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ల నుంచి 29.849 మి.యూ, సోలార్ నుంచి 21.635 మి.యూ, విండ్ నుంచి 20.535 మిలియన్ యూనిట్లు చొప్పున సమకూరుతోంది. నెల రోజుల్లో పవన విద్యుత్ ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయ్యింది. దీనితో పాటు బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ సగటు రేటు రూ.7.754 చొప్పున రూ. 20.634 కోట్లతో 30.211 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక ఆర్టిఫిషియల్ఇంటిలిజెన్స్(ఏఐ) సాంకేతికతను వినియోగిస్తున్నారు. డిమాండ్ ఫోర్కాస్ట్ విధానం ద్వారా ప్రతి పదిహేను నిమిషాలకూ విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేయగలిగే సామర్థ్యం మన విద్యుత్ సంస్థలకు ఉంది. దాని సాయంతో షార్ట్‌టెర్మ్ టెండర్ల ద్వారా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కోసం ముందస్తు బిడ్లు దాఖలు చేస్తున్నాయి. తద్వారా అప్పటికప్పుడు ఏర్పడే విద్యుత్ కొరత నుంచి బయటపడుతున్నాయి. రాష్ట్రంలో మునుపెన్నడూ ఇలాంటి ఏర్పాటు లేదు. గత ప్రభుత్వంలో అత్యవసర సమయాల్లో కరెంటు కొనేవారే కాదు. అనవసరంగా చేసుకున్న దీర్ఘకాల విద్యుత్ ఒప్పందాల వల్ల ఒరిగేదేమీ ఉండేది కాదు. ఫలితంగా రాష్ట్రంలో అన్ని కాలాల్లోనూ ప్రజలు విద్యుత్ కోతలతో అల్లాడిపోయేవారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు ప్రణాళికల కారణంగా విద్యుత్ వినియోగదారులకు అప్పటి ఇబ్బందులు ఇప్పుడు ఎదురవ్వడం లేదు. -
ఏపీలోనే వెలుగులు..రామోజీ తలెక్కడ పెట్టుకుంటాడో..
-
AP: ‘బొగ్గు’ భయం లేదు.!
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపు వల్ల రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ నిరాటంకంగా నడిచాయి. విద్యుత్ సంస్థలు సమర్థవంతంగా కరెంటు అందించాయి. ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గును సమకూర్చుకుంటున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క రోజు బొగ్గు కోసమే నానా తంటాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు కేంద్ర బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, సకాలంలో చెల్లింపులు చేస్తూ స్వదేశీ బొగ్గు కేటాయింపులను పొందడంతో పాటు, విదేశీ బొగ్గునూ దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో వారానికి సరిపడా నిల్వలు ఉంటున్నాయి. కొరత లేకుండా నిల్వలు వీటీపీఎస్‌కి రోజుకి 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా.. ప్రస్తుతం 1,24,324 మెట్రిక్ టన్నులు ఉంది. ఆర్టిపీపీకి 21 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉండగా.. 60,203 మెట్రిక్ టన్నులు ఉంది. కృష్ణపట్నం ప్లాంటుకు 29 వేల మెట్రిక్ టన్నులు అవసరం కాగా 1,66,606 మెట్రిక్ టన్నులు ఉంది. హిందూజాలో 19,200 మెట్రిక్ టన్నులు ఒక రోజుకి వాడుతుండగా, ఇక్కడ 1,04,891 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలో బొగ్గు నిల్వలు మూడు రోజుల నుంచి వారం రోజులకు సరిపోతాయి. ఈ బొగ్గు వాడుతూనే, తర్వాతి రోజుల్లో విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బంది రాకుండా నిత్యం మరింత బొగ్గును రాష్ట్రం దిగుమతి చేసుకుంటోంది. సాధారణంగా 65 నుంచి 75 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) వద్ద 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 3.5 నుంచి 4 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ఈ మేరకు డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్టిపీపీ) కోసం 8 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు ఏపీ జెన్కో టెండర్ ఖరారు చేసింది. మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి ఈ బొగ్గు వస్తుంది. విదేశీ బొగ్గుతో స్వదేశీ బొగ్గును కలిపి విద్యుత్ ఉత్పత్తికి వాడాలని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఇప్పటికే 7.5 లక్షల విదేశీ బొగ్గు టెండర్‌ను జెన్కో ఖరారు చేసింది. ఆర్టీపీపీకి 2 లక్షల టన్నులు, వీటీపీఎస్‌కు 3 లక్షల టన్నుల చొప్పున మరో 5 లక్షల టన్నుల విదేశీ బొగ్గు కోసం మరో టెండర్‌ను పిలిచింది. పూర్తి విదేశీ బొగ్గుతో నడిచే కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)కు 7.5 లక్షల టన్నుల బొగ్గును సమకూర్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. అవసరాలకు తగ్గట్టు.. రాష్ట్రంలో ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలన్నది ఏపీ జెన్కో లక్ష్యం. అందుకే విద్యుత్ ఉత్పత్తి పెంచుతూ వస్తోంది. సామర్థ్యాన్ని మించి దాదాపు 10 మెగావాట్ల అధిక ఉత్పత్తి నమోదు చేస్తూ రాష్ట్ర అవసరాల్లో దాదాపు 40 శాతం విద్యుత్‌ను అందిస్తోంది. కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల యూనిట్, ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్ (వీటీపీఎస్)లో 800 మెగావాట్లు విద్యుత్ వాణిజ్య ఉత్పత్తి ఈ ఏడాది ప్రారంభమైంది. ప్రస్తుతం రోజుకి 78.677 మిలియన్ యూనిట్ల విద్యుత్ జెన్కో థర్మల్ యూనిట్ల నుంచి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తికి కొరత రాకుండా బొగ్గు సమకూర్చుకుంటున్నాం. – కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎండీ, ఏపీజెన్కో -
‘థర్మల్’ వెలుగులు
సాక్షి, అమరావతి: దేశంలో కర్బన ఉద్గారాలను 2070 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంలో భాగంగా రానున్న కాలంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచుకుని.. థర్మల్ విద్యుత్‌ను తగ్గించుకోవాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కొన్ని నెలల క్రితం అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జెన్కో) థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రిజర్వు షట్ డౌన్ (ఉత్పత్తి తగ్గింపు)పై విధివిధానాలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కూడా ప్రకటించింది. పూర్తిగా మూసేయాల్సిన అవసరం లేదని, గ్రిడ్‌కు ప్రమాదం వాటిల్లే పరిస్థితి వస్తే అప్పుడు థర్మల్ యూనిట్లు షట్‌డౌన్ చేయవచ్చని ఏపీ ఈఆర్సీ స్పష్టం చేసింది. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా అకస్మాత్తుగా విద్యుత్ డిమాండ్ పడిపోయినప్పుడు కూడా ఉత్పత్తి తగ్గించవచ్చని పేర్కొంది. తక్కువ ధరకు విద్యుత్ అందించే ఉత్పత్తి సంస్థలకు మొదట ప్రాధాన్యం ఇచ్చేలా కొన్ని యూనిట్లను రిజర్వు షట్ డౌన్ చేసే వెసులుబాటు కల్పించింది. దీంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని అత్యవసరంగా తగ్గించాల్సిన ఆవçశ్యకత రాలేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ థర్మల్ యూనిట్ ఈ నెల 20న వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది. 2024లో 17 థర్మల్ ప్లాంట్లు భవిష్యత్‌లో పెరుగనున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవాలంటే పునరుత్పాదక ఇంధనంతో పాటు శిలాజ ఇంధన ఉత్పత్తిపైనా దృష్టి సారించాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా గుర్తించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒకడుగు ముందే ఉంది. ఇప్పటికే సోలార్, విండ్, హైడల్ కలిపి ఉండే పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇంధన రంగంలో ఏపీ చర్యలను ఇప్పటికే అనేక పర్యాయాలు ప్రశంసించిన కేంద్రం రాష్ట్రం బాటలోనే నిర్ణయాలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా భారీగా బొగ్గు ఆధారిత ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. 2024లో దేశంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 256 గిగావాట్లకంటే ఎక్కువ ఉంటుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నివేదిక అంచనా వేసింది. 2031–32కి ఇది 366.39 గిగావాట్లకు పెరుగుతుందని చెప్పింది. 2041–42కి 574.68 గిగావాట్లకు పెరగొచ్చనే అంచనాతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు అనివార్యమైంది. దీంతో 2024లో 17 గిగావాట్ల సామర్థ్యం గల థర్మల్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని, తర్వాత మరో 33 గిగావాట్ల ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఇలా దాదాపు రూ.7.28 లక్షల కోట్ల పెట్టుబడితో 91 థర్మల్ ప్లాంట్లు స్థాపించాలని యోచిస్తున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోనే ఆదర్శంగా ఏపీ ఏపీ గ్రిడ్ డిమాండ్ గతేడాది రోజుకు 190 మిలియన్ యూనిట్ల నుంచి 200 మిలియన్ యూనిట్లు ఉండగా.. ఈ ఏడాది 220 నుంచి 245 మిలియన్ యూనిట్లు రికార్డయ్యింది. అయినప్పటికీ విద్యుత్ కొరత లేకుండా సరఫరా చేయడంలో థర్మల్ కేంద్రాలు కీలక భూమిక పోషించాయి. ఎన్టీటీపీఎస్ ఆపరేషన్, మెయింటెనెన్స్ యూనిట్ల లభ్యత శాతం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 69.90 శాతం ఉంటే.. ఈ ఏడాదిలో 75.83 శాతానికి పెరిగింది. అలాగే గతేడాది ఎన్టీపీఎస్ స్టేజ్–4 యూనిట్ హీట్ రేట్ 2,517 కిలో వాట్ అవర్ నుంచి 2,436 తగ్గింది. అదేవిధంగా 2022–23లో ఎంవీఆర్ ఆర్టీపీపీ స్టేషన్ యూనిట్ల లభ్యత 67.85 శాతం నుంచి 75.68 శాతానికి మెరుగుపడింది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అత్యుత్తమ థర్మల్ ప్లాంట్‌గా ఆర్టీపీపీ గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) తన అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ పీడీసీఎల్)తో కలిసి థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్వహిస్తోంది. వీటిలో సామర్థ్యాన్ని మించి దాదాపు 10 మెగావాట్ల అధిక విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర గ్రిడ్ అవసరాలను సాధ్యమైనంత ఎక్కువగా తీర్చాలనే లక్ష్యంతో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ వస్తోంది. అందులో భాగంగానే కృష్ణపఛిట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది మార్చి 10న 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. తాజాగా ఎన్టీటీపీఎస్లో 8వ యూనిట్ సీవోడీతో జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 5,810 మెగావాట్ల నుంచి 6,610 మెగావాట్లకు పెరిగింది. -
ఏపీలో వేసవి సీజన్ కోసం ఇంధన శాఖ సంసిద్ధం
-
రాష్ట్ర విద్యుత్ రంగంలో మరో మైలురాయి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదన సంస్థ (ఏపీజెన్కో) మరో మైలురాయిని అధిగమించింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్టీటీపీఎస్లోని 8వ యూనిట్ వాణిజ్య ఉత్పత్తికి విజయవంతంగా శ్రీకారం చుట్టింది. కొత్తగా నిర్మించిన 800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్ 72 గంటలపాటు నిర్విరామంగా వందశాతానికిపైగా సామర్థ్యంతో పనిచేయడంతో.. బుధవారం ఉదయం 10.45 గంటలకు విద్యుత్ వాణిజ్య ఉత్పత్తి (కమర్షియల్ ఆపరేషన్ డేట్– సీవోడీ) ప్రారంభమైంది. ఏపీజెన్కో ఎండీ , ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్‌బాబు సమక్షంలో సంస్థ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, సిబ్బంది హర్షధ్వానాల మధ్య ఏపీజెన్కో, ఏపీట్రాన్స్కో, ఏపీపీసీసీ, ఏపీ డిస్కంల ప్రతినిధులు బుధవారం ఉదయం సీవోడీ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని 1,760 నుంచి 2,560 మెగావాట్లకు పెంచుకుని ఏపీజెన్‌కోలో డాక్టర్ ఎన్టీటీపీఎస్ అతి పెద్ద ఉత్పత్తి కేంద్రంగా ఆవిర్భవించింది. డాక్టర్ ఎన్టీటీపీఎస్లో స్టేజ్–5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన ఎనిమిదో యూనిట్ కోవిడ్ లాంటి కష్టకాలాన్ని, అనేక సవాళ్లను అధిగమించి వాణిజ్య ఉత్పత్తి సాధించింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ కేక్ కట్‌చేసి, కొత్త యూనిట్ నిర్మాణంలో భాగస్వాములై సేవలందించిన పలువురిని జ్ఞాపికలతో సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సంపూర్ణ సహాయ సహకారాలు అందించడంవల్లే ఎనిమిదో యూనిట్ నిర్మాణపనులు పూర్తిచేసి సీవోడీ చేసుకోగలిగామని ఏపీజెన్కో ఎండీ చక్రధర్‌బాబు చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సహించడంవల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అడుగడుగునా మార్గదర్శకం చేశారన్నారు. ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏపీజెన్కో ఉద్యోగులు, భాగస్వామ్య సంస్థలైన బీహెచ్ఈఎల్, బీజేఆర్, ఆర్ఈసీ ప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పారు. 8,789 మెగావాట్లకు పెరిగిన జెన్కో సామర్థ్యం డాక్టర్ ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్ సీవోడీతో జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 6,610 మెగావాట్లకు పెరిగింది. జెన్కో మొత్తం ఉత్పాదన సామర్థ్యం 8,789 మెగావాట్లకు పెరిగింది. ప్రస్తుతం జెన్కోకి 6,610 మెగావాట్ల థర్మల్, 1,773.600 మెగావాట్ల హైడల్, 405.426 మెగావాట్ల సోలార్ (మొత్తం 8,789.026 మెగావాట్లు) విద్యుదుత్పాదన సామర్థ్యం ఉంది. మొత్తం రాష్ట్ర గ్రిడ్ డిమాండ్‌లో 55 నుంచి 60 శాతం విద్యుత్ అందించే సామర్థ్యం ఏపీ జెన్కోకు వచ్చింది. -
‘పీఎస్పీ’ ప్రయోజనాలు కనిపించవా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టు (పీఎస్పీ)లకు ఇస్తున్న ప్రోత్సాహానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. దీనిని తట్టుకోలేని పచ్చ పత్రిక ఈనాడు పీఎస్పీలపై విషం చిమ్మింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అనుసరిస్తున్న పీఎస్పీలు అనవసరమంటూ ఓ కట్ట్దు కథ రాసింది. ఎగువ సీలేరులో ఉన్నది ఎన్ని మెగావాట్ల హైడల్ ప్రాజెక్టో కూడా అవగాహన లేని ఈనాడు పత్రిక.. దానిపై అసత్యాలు అల్లింది. రాష్ట్ర ప్రజలకు కోట్లలో ఆదా చేయడంతో పాటు డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో విద్యుత్‌ను అందించే పీఎస్పీలపై ‘జెన్కోకు గుదిబండగా.. ఎగువ సీలేరు పీఎస్పీ’ శీర్షికతో బుధవారం ‘రామోజీ’ రాసిన కథనమంతా పచ్చి అబద్ధమని ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) స్పష్టం చేసింది. అదనంగా ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం లేకపోయినా ఎగువ సీలేరులో పీఎస్పీ ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణను ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు ఖండించారు. వాస్తవాలను వెల్లడించారు. ఆ వివరాలు.. అసలు 1350 మెగావాట్ల ప్రాజెక్టు లేనే లేదు ఎగువ సీలేరులో ప్రస్తుతం 1,350 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల జల విద్యుత్ ప్రాజెక్టు ఉందనడంలో వాస్తవం లేదు. ఇక్కడ ప్రస్తుతం 240 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే ఉంది. సీలేరు నది నుంచి 1.7 టీఎంసీల నీటి వినియోగం ద్వారా 1,350 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీ నిర్మాణానికి ఏపీ జెన్కో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఆమోదంతో పాటు చట్టపరమైన అనుమతులు తీసుకుంది. ఒక్క సీలేరులోనే కాదు.. మిగతా ప్రాంతాల్లోనూ ఏపీజెన్కో పీఎస్పీలు ఏర్పాటు చేస్తోంది. ఎన్‌హెచ్‌పీసీ సంయుక్త భాగస్వామ్యంలో యాగంటి, కమలపాడు, అరవేటిపల్లి, దీనేపల్లి, గడికోటలో పీఎస్పీలు ఏర్పాటుకు డీపీఆర్ తయారవుతోంది. అవసరానికి ఆదుకుంటుంది డిమాండ్ తక్కువగా ఉన్న సమయంలో మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధర తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో మిగులు విద్యుత్‌ను లేదా చౌక ధరకు కొనే విద్యుత్‌ను వినియోగించుకుని నీటిని పంప్ చేసి పీక్ డిమాండ్ సమయంలో ఆ నీటితో విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్నదే పీఎస్పీల లక్ష్యం. ఈ ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అనేక ప్రైవేటు సంస్థలూ పీఎస్పీలు నిర్మిస్తున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఇవే ప్రాజెక్టులు చేపడుతున్నాయి. పీక్ సమయంలో పీఎస్పీ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్ వల్ల బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కరెంటు కొనాల్సిన అగత్యం తప్పుతుంది. రాష్ట్ర ప్రజలకు తక్కువ ధరతో విద్యుత్ అందించొచ్చు. యూనిట్ రూ.3 కే విద్యుత్ ఎగువ సీలేరులో 1,350 మెగావాట్ల పీఎస్పీ నిర్మాణం ద్వారా ఏటా సగటున 3,501 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది ఏపీ జెన్కో ప్రణాళిక. దీని ద్వారా గరిష్ట ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.3 ఉంటుందని అంచనా. పీక్ డిమాండ్ సమయంలో ప్రస్తుతం మార్కెట్లో విద్యుత్ ధర యూనిట్ రూ.10 ఉంది. మార్కెట్లో యూనిట్ కనిష్ట ధర రూ.8 ఉంటుంది. అంటే పీఎస్పీ విద్యుత్ ధర కంటే మార్కెట్ కనిష్ట ధరే చాలా ఎక్కువ. ఏపీ జెన్కో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను లాభాపేక్ష లేకుండా డిస్కంలకు సరఫరా చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర వినియోగదారులకు (ప్రజలకు) పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకీ ఊహాజనిత రాతలు రామోజీ? ఈ పీఎస్పీ నిర్మాణ వ్యయం రూ.11,884 కోట్లు కాదు. రూ.11,154.39 కోట్లు మాత్రమే. నిర్మాణంలో జాప్యమైతే తీసుకున్న వడ్డీ, ఇతర ఖర్చులు కలిపి వ్యయం రూ.15 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేసినట్లు ‘ఈనాడు’ పేర్కొంది. కానీ సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ఏపీ జెన్కో ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతోంది. నిర్మాణం ఆలస్యమైతే వ్యయం పెరుగుతుందనేది రామోజీ ఊహాజనిత కథనం మాత్రమే. సాంకేతికత పెరిగి బ్యాటరీ స్టోరేజి విధానం అందుబాటులోకి వస్తే పీఎస్పీలు భారమవుతాయని నిపుణులు చెబుతున్నారన్న వాదనలోనూ వాస్తవం లేదు. ప్రస్తుతానికి మన దేశంలో బ్యాటరీ స్టోరేజి విధానం కంటే పీఎస్పీనే ప్రయోజనకరంగా ఉంది. పీఎస్పీ జీవితకాలం 40 ఏళ్లు కాగా బ్యాటరీ స్టోరేజి సిస్టమ్ జీవిత కాలం పదేళ్లు మాత్రమే. పైగా బ్యాటరీ స్టోరేజి సిస్టమ్ ఏర్పాటు వ్యయం చాలా ఎక్కువ. ఈనాడు మాత్రం అదే తక్కువంటూ పచ్చి అబద్ధాలు రాసింది. అంతర్జాతీయంగా ఇదే విధానం ‘పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్‘ను మొట్టమొదటిసారి 1890 కాలంలో ఇటలీ, స్విట్జర్లాండ్‌లో వినియోగించారు. 1930లో యునైటెడ్ స్టేట్స్ (అమెరికా)లో కూడా వాడటం ప్రారంభించారు. ఇప్పుడివి ప్రపంచమంతా విస్తరించాయి. హైడ్రో పవర్ మార్కెట్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లోని మొత్తం యుటిలిటీ – స్కేల్ ఎనర్జీ స్టోరేజ్‌లో 93 శాతం వాటా పీఎస్పీలకు ఉంది. అమెరికాలో ప్రస్తుతం 43 ప్లాంట్లు ఉన్నాయి. పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లలో పగటిపూట సౌర ఫలకాల ద్వారా విద్యుత్ సరఫరా చేయవచ్చు. రాత్రి వేళ జలాశయం ద్వారా ఎగువ రిజర్వాయర్ నుంచి దిగువ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయడం వల్ల టర్బైన్ కదిలి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గాలి తక్కువగా ఉండి, సూర్యరశ్మి లేని పరిస్థితుల్లో కూడా ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో, ఆర్థికంగా లాభదాయకంగా, పెద్ద ఎత్తున శక్తిని నిల్వ చేయడానికి పంప్డ్ స్టోరేజీ మాత్రమే సరైన మార్గం. ఈ పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు 82 శాతం సామర్థ్యంతో పని చేస్తాయి. నీటి వనరుల నిర్వహణ, వరద నియంత్రణ, అతి ఎక్కువ జీవితకాలం వీటి అదనపు ప్రయోజనాలు. ఏపీ ముందు చూపు సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర విద్యుత్ రంగంలో పలు సంస్కరణలు తెచ్చి, వాటిని ప్రణాళికాబద్దంగా అమలు చేస్తున్నారు. వినూత్నమైన, అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో విద్యుత్ రంగాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రజలపైనా భారం పడకుండా చర్యలు చేపడుతున్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో విద్యుత్ కొరత రాకుండా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు సరైన మార్గమని ముందు చూపుతో నిర్ణయాలు తీసుకున్నారు. వేరియబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ (వీఆర్‌ఈ)ని బ్యాలెన్స్ చేయడానికి, పీక్ పవర్ డిమాండ్‌ను చేరుకోవడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం పీఎస్పీలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే 32,400 మెగావాట్ల పీఎస్పీల ఏర్పాటుకు 29 సైట్ల కోసం టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (టీసీఎఫ్‌ఆర్)లను సిద్ధం చేసింది. రాష్ట్రంలో మొత్తం 37 ప్రాంతాల్లో 42,370 మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్పీల నిర్మాణానికి స్థలాలను ప్రభుత్వం గుర్తించింది. పీఎస్పీల వల్ల గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ చార్జీలు, పన్నుల రూపంలో రాబడి వస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధీ లభిస్తుంది. -
బొగ్గుకు బకాయిలేం లేవు.!
సాక్షి, అమరావతి: అవే పైత్యపు కథనాలు.. నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు.. విలువలు లేకుండా అడ్డగోలుగా అచ్చేస్తున్న అవాస్తవాల పరంపరలో మరో నీతిమాలిన వార్తను రామోజీరావు ‘బొగ్గు రాదు.. బకాయిలే కారణం’ శీర్షికతో ఈనాడులో వండివార్చారు. కళ్లముందు నిజాలు కనిపిస్తున్నా.. టీడీపీ హయాంలో బొగ్గు సేకరణ ఇప్పటి కన్నా తక్కువే ఉన్నా ఆ నిజాన్ని దాచి ప్రజలను మభ్యపెట్టేందుకు ఆ కథనంలో విశ్వప్రయత్నం చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసిన కంపెనీలకు ఇంధన సరఫరా ఒప్పందాల (ఫ్యూయల్ సప్లయి అగ్రిమెంట్స్–ఎఫ్ఎస్ఏ) ప్రకారం సకాలంలో బకాయిలు చెల్లిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పాదక సంస్థ (ఏపీజెన్కో) మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు స్పష్టం చేశారు. ఈనాడు కథనంలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు ‘సాక్షి’కి ఏపీజెన్కో ఎండీ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ‘ఎఫ్ఎస్ఏ’ ప్రకారం సకాలంలో చెల్లింపులు మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్)కు ఏపీజెన్కో సెప్టెంబర్‌లో రూ. 554.57 కోట్ల బకాయిలు చెల్లించింది. గడువులోగా చెల్లించాల్సిన బకాయిలు ఏమీలేవు. సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు చెల్లింపులకు ‘బిల్ ఆఫ్ ఎఎక్స్చేంజ్’ విధానం వల్ల ఆ సంస్థకు పెండింగ్ బకాయిలు లేవు. ఎస్సీసీఎల్, ఎంసీఎల్ నుంచి ఎఫ్ఎస్ఏ ప్రకారం ఏపీజెన్కో బొగ్గు సేకరిస్తోంది. ఈ ఒప్పందాల ప్రకారం నిర్ణీత గడువులో బకాయిలు చెల్లిస్తోంది. ఇక ఈ ఏడాది దేశవ్యాప్తంగా పెరిగిన విద్యుత్ డిమాండ్ మేరకు బొగ్గు సరఫరా కానందున అన్ని రాష్ట్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. పైగా నైరుతీ రుతుపవనాల సీజన్లో బొగ్గు తవ్వకాలకు అంతరాయం కలిగింది. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన ఏపీజెన్కో వారం వారం జరిగే కేంద్ర ఉపసంఘం సమీక్షల్లో, ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ (ఐఎంసీ) సమావేశాల్లో బొగ్గు సరఫరా పెంచాలని పదేపదే విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పెంచుకోవడానికి, పెరిగిన ఏపీ గ్రిడ్ డిమాండ్ మేరకు విద్యుదుత్పత్తి పెంచేందుకు ఏపీజెన్కో ప్రణాళికాబద్ధంగా అన్ని ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగానే అదనపు బొగ్గు సేకరణ కోసం కోల్ కంపెనీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుత బొగ్గు కొరత పరిస్థితుల్లో సైతం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ఎఫ్ఎస్ఏ లక్ష్యంలో 95.67 శాతం మేరకు బొగ్గును ఏపీ జెన్కో సేకరించగలగడం విశేషం. టీడీపీ అధికారంలో ఉన్న 2018 ఇదే కాలంలో ఒప్పందంలోని 81.02 శాతం బొగ్గు మాత్రమే సేకరించడం గమనార్హం. పెరిగిన విద్యుత్ ఉత్పత్తికి తగ్గట్టు ప్రణాళిక ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి పెరిగినందున ఏపీజెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు వినియోగం కూడా పెరిగింది. మరోవైపు ఏపీజెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలు 75 శాతం పవర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడమే లక్ష్యంగా విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు, థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పెంచుకునేందుకు, బొగ్గు నిర్వహణ యూనిట్‌ను ఏపీజెన్కో పటిష్టం చేస్తోంది. ఇందుకు అనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకుని లక్ష్యాల సాధన దిశగా ముందుకెళుతోంది. జెన్కోను దెబ్బతీసింది చంద్రబాబే చంద్రబాబు హయాంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలను బలవంతంగా మూసివేయడం వల్ల ఏపీ జెన్కోకు భారీ నష్టం వాటిల్లింది. నాసిరకం బొగ్గును అధిక ధరకు గత టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. కాగ్ సైతం ఈ విషయాన్ని బయటపెట్టింది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ) 2011–12లో 22.235 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. కానీ 2015–16 నాటికి విద్యుదుత్పత్తి 19.359 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. దీనివల్ల విద్యుదుత్పత్తి ధర యూనిట్‌కు రూ. 2.94 నుంచి రూ. 4.34కు పెరిగింది. బలవంతంగా మూసివేయడం వల్ల ఆ రెండు విద్యుత్ కేంద్రాలకు రూ. 675.69 కోట్లు నష్టం వాటిల్లింది. మహానది కోల్ లిమిటెడ్ (ఎంసీఎల్) బొగ్గు సరఫరా చేయడం లేదనే సాకు చూపి 2014 జూలైలో 26.61 లక్షల మిలియన్ టన్నుల బొగ్గును, 2015–16లో ఎలాంటి అవగాహనా ఒప్పందం కుదుర్చుకోకుండానే 63.5 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి నుంచి ప్రీమియం ధరకు టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2014 నుంచి 2016 వరకూ కోల్ ఎనాలిసిస్ నివేదికలు, కోల్ ఇన్వాయిస్లను సమీక్షిస్తే జెన్కో కొనుగోలు చేసిన బొగ్గు నాణ్యతలో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. నాణ్యతలేని రూ. 3,179.32 కోట్ల విలువైన 86.02 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును అధిక ధరను కొనుగోలు చేయడం వల్ల జెన్కోకు రూ. 918.61 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కాగ్ తేల్చింది. అప్పట్లో విదేశీ బొగ్గునూ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు కొనుగోలు చేశారు. ప్రభుత్వ సంస్థలను ముందు పెట్టి తెరవెనుక కోల్‌మాఫియా చక్రం తిప్పింది. రూ. 500 కోట్లకు పైగా ప్రజాధనం వృథా అయ్యింది. -
‘పవర్’ ఫుల్
► రూ.10,350 కోట్ల పెట్టుబడి, 2,300 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్కో కంపెనీ నిర్మించే సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన. దీనిద్వారా 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ► 1,014 మెగావాట్లతో ఆర్సిలర్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ నిర్మించే ప్రాజెక్టుకు శంకుస్ధాపన. ఇందులో 700 మెగావాట్లు సోలార్ పవర్ కాగా 314 మెగావాట్లు విండ్ పవర్ ఉత్పత్తి. రూ.4,500 కోట్ల పెట్టుబడితో 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ► ఎకోరన్ ఎనర్జీ 2 వేల మెగావాట్ల (1,000 మె.వా. సోలార్, 1,000 మె.వా. విండ్ పవర్) సామర్ధ్యంతో నిర్మించనున్న ప్రాజెక్టుకు శంకుస్ధాపన. దాదాపు రూ.11 వేల కోట్ల పెట్టుబడితో 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు.. ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం ► 2 వేల మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు సంబంధించి ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం. రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో యాగంటి, కమలపాడులో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టుల వల్ల 2 వేల మందికి ఉద్యోగాల కల్పన. ► వీటితో పాటు ఎన్‌హెచ్‌పీసీతో మరో మూడు ప్రాజెక్టుల ఫీజిబిలిటీపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం. మరో 2,750 మెగావాట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టులపై కలసి పని చేసేలా అడుగులు. రాష్ట్రానికి.. రైతులకు.. యువతకు మేలు ఈ ప్రాజెక్టుల ఏర్పాటుతో మనకు జరిగే మేలును ఒక్కసారి పరిశీలిస్తే.. రాబోయే రోజుల్లో మన యువతకు స్ధానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా అందుబాటులోకి వస్తున్న ప్రతి మెగావాట్‌కు మరో వందేళ్ల పాటు అంటే ఈ ప్రాజెక్టు లైఫ్ ఉన్నంత కాలం మెగావాట్‌కు రూ.లక్ష చొప్పున రాయల్టీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీంతో పాటు ఈ ప్రాజెక్టుల వల్ల జీఎస్టీ ఆదాయం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులకు తమ భూములిస్తూ సహకరిస్తున్న రైతన్నలకు కూడా ఈ కంపెనీల నుంచి లీజు రూపంలో ఏటా ఎకరాకు రూ.30 వేలు చొప్పున ఆదాయం వస్తుంది. ఇందుకు ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది. అంటే రైతులు ఎవరైనా భూములివ్వాలనుకుంటే ప్రతి రైతుకు, ప్రతి ఎకరానికి, ఏడాదికి రూ.30 వేలు లీజు రూపంలో ఇస్తారు. ప్రతి రెండేళ్లకు 5 శాతం లీజు రుసుము కూడా పెరుగుతుంది. దశాబ్దాలుగా నీళ్లకు కటకటలాడిన దుర్భిక్ష ప్రాంతం రాయలసీమ రైతన్నలకు ఈ ప్రాజెక్టులతో మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇవి పర్యావరణానికి మేలు చేస్తాయి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంధన రంగానికి భద్రత చేకూరేలా మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుడుతూ చరిత్రాత్మక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఒప్పందాలను శరవేగంగా కార్యాచరణలోకి తెస్తూ నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం వర్చువల్ విధానంలో భూమి పూజ నిర్వహించారు. మరో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల (పీఎస్పీ) ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) మధ్య ఒప్పందం కుదిరింది. ఈమేరకు సీఎం జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఏపీ జెన్కో ఎండీ చక్రధరబాబు, ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ గోయల్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో అపార పెట్టుబడుల అవకాశాలపై సీఎం జగన్ శ్వేతపత్రాన్ని విడుదల చేసి మాట్లాడారు. భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీదే ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ మనతో పాటు ఉన్న బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారత్, గ్రీన్కో, ఆర్సెలర్ మిట్టల్, ఎకోరన్ గ్రూపు యాజమాన్యాలకు, కంపెనీల ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు ఇక్కడకు వచ్చిన ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ గోయల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్‌కు ధన్యవాదాలు. ఇవాళ మూడు ప్రాజెక్టులకు శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. నాలుగో కార్యక్రమం కింద ఎన్‌హెచ్‌పీసీతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్నాం. మొదటి ప్రాజెక్టు గ్రీన్కో.. 2,300 మెగావాట్ల సౌర విద్యుత్తుకు సంబంధించి రూ.10,350 కోట్ల పెట్టుబడితో 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగిస్తున్న ప్రాజెక్టు ఇది. ఇక పంప్డ్ స్టోరేజ్ అన్నది ఆర్టిఫీషియల్ బ్యాటరీ లాంటిది. పీక్ అవర్స్‌లో పవర్ జనరేట్ చేస్తాం. నాన్ పీక్ అవర్స్‌లో మళ్లీ నీళ్లని వెనక్కి పంప్ చేసి ఆ తరువాత, పీక్ అవర్స్‌లో పవర్‌ని జనరేట్ చేసేందుకు ఆర్టిఫీషియల్ బ్యాటరీ మాదిరిగా ఏర్పాట్లు ఉంటాయి. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు భవిష్యత్తులో పూర్తిగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తయ్యేలా దోహదం చేస్తాయి. దీనివల్ల బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల మీద ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. పర్యావరణానికి మంచి జరగాలంటే రాబోయే రోజుల్లో పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సోలార్ ప్రాజెక్టులు, విండ్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులతో మనం అనుసంధానమవుతున్న తీరు గ్రీన్ ఎనర్జీలో పెను మార్పులకు దారి తీస్తాయి. పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. అదే సమయంలో విద్యుదుత్పత్తికి తోడ్పాటునివ్వడం ద్వారా గ్రీన్ ఎనర్జీలో ఒక విప్లవాత్మక మార్పు వస్తుంది. మరో 30 ఏళ్లు ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా.. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 8,998 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేస్తున్నాం. రైతులకు దీర్ఘకాలం పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు 16 వేల మిలియన్ యూనిట్లు అంటే దాదాపు 7,200 మెగావాట్లకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో యూనిట్ రూ.2.49కే అందేలా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. తద్వారా మరో 25 నుంచి 30 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పవర్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా, ఒత్తిడి లేకుండా రైతులకు ఉచితంగా విద్యుత్ అందించే వెసులుబాటు లభిస్తుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో రూ.2.49కే మరో 25 – 30 ఏళ్ల పాటు ఉచిత కరెంటుకు ఢోకా లేకుండా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది గొప్ప అడుగు. 41 వేల మెగావాట్లు.. 37 ప్రాంతాలు ఒకవైపు ఇవన్నీ చేస్తూనే మరోవైపు పంప్డ్ స్టోరేజీని ప్రోత్సహించడంలో భాగంగా దాదాపు 41 వేల మెగావాట్లకు సంబంధించి 37 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. ఇందులో 33,240 మెగావాట్లకు సంబంధించి 29 చోట్ల ప్రాజెక్టు ఫీజిబులిటీ పరిశీలన జరుగుతోంది. 20,900 మెగావాట్ల కెపాసిటీకి సంబంధించిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు కూడా పూర్తయ్యాయి. వీటిలో 16,180 మెగావాట్ల కెపాసిటీతో ఉత్పత్తి చేసేందుకు వివిధ కంపెనీలకు అలాట్మెంట్లు కూడా పూర్తయ్యాయి. ఇందులో భాగంగానే ఇవాళ ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం చేసుకుంటున్నాం. దీనిలో యాగంటిలో 1,000 మెగావాట్ల ప్రాజెక్టు, కమలపాడులో మరో 950 మెగావాట్లు కలిపి మొత్తంగా దాదాపు 2 వేల మెగావాట్ల ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌పీసీతో కలిసి నిర్మించనుంది. దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులకు ఫీజిబులిటీ స్డడీస్ పూర్తయ్యాయి. ఎన్‌హెచ్‌పీసీ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం వాటాతో ప్రాజెక్టును అభివృద్ధిలా ఇవాళ ఎంవోఓయూ కుదుర్చుకున్నాం. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్, డిప్యూటీ హెడ్ మిషన్ యూకే గవర్నమెంట్ వరుణ్ మాలి, యూకే గవర్నమెంట్ సీనియర్ అడ్వైజర్ నిషాంత్‌కుమార్ సింగ్, ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ గోయల్, గ్రీన్కో వైస్ ప్రెసిడెంట్ ఎన్.శేషగిరిరావు, ఏఎం గ్రీన్ ఎనర్జీ బిజినెస్ హెడ్ సమీర్ మాథుర్, ఎకోరన్ గ్రీన్ ఎనర్జీ సీఎండీ వై.లక్ష్మీ ప్రసాద్, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మరో మూడు చోట్ల కూడా...! ఎన్‌హెచ్‌పీసీతో కలసి ఇంకా వేగంగా అడుగులు ముందుకువేసే కార్యక్రమంలో భాగంగా మరో 2,750 మెగావాట్లకు సంబంధించి 3 ప్రాంతాలలో ఫీజుబులిటీ స్డడీస్ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆ ప్రాజెక్టులను కూడా ఎన్‌హెచ్‌పీసీతో కలిసి సంయుక్తంగా చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సామర్ధ్యాన్ని పెంచుకుంటూనే మిగిలిన ప్రైవేట్ డెవలపర్స్‌కి కూడా అందుబాటులోకి తెచ్చి తద్వారా రాష్ట్రంతో పాటు దేశానికి కూడా మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. వీటన్నింటితో రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలవనుంది. ప్రపంచాన్ని శాసించే ఎనర్జీ దేవుడు గొప్పవాడు.. అందుకే మానవాళికి ఇంత చక్కటి వనరులను సృష్టించాడు. ఎండ బాగున్నప్పుడు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సోలార్ పవర్‌ని ఉత్ప త్తి చేస్తే సాయంత్రం 6 నుంచి ఉదయం వర కు విండ్ పవర్ ఉత్పత్తి అవుతుంది. పీక్ అ వర్స్‌లో నీళ్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను వాడుకోవచ్చు. ïపీక్ అవర్స్‌లో అవి ఆర్టిఫీషియల్ బ్యాటరీలా పనిచేస్తాయి. దీంతో ïపీక్ అవర్స్‌లో విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది. ఫలితంగా శిలాజ ఇంధనాల నుంచి బయటపడి పర్యావరణ హితమైన గ్రీన్ ఎనర్జీ లభిస్తుంది. ఇది ప్రపంచాన్ని శాసించ బోయే ఎన ర్జీగా నిలుస్తుంది. అందులో ఏపీ తొలిస్థానంలో నిలిచేలా అడుగులు పడుతున్నాయి. -
అనుకున్న సమయానికే ‘పోలవరం పవర్ హౌస్’
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2025 జూన్‌కి పూర్తవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అదే సమయానికి పోలవరం జల విద్యుత్ కేంద్రం (పవర్ హౌస్) పూర్తవుతుందని ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు వెల్లడించారు. 12 యూనిట్లతో 960 మెగావాట్ల సామర్ధ్యంతో నిర్మించే ఈ విద్యుత్ కేంద్రం ప్రగతిపై ఆయన సోమవారం ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు చౌకగా విద్యుత్ అందించడానికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ఆయన చెప్పిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ► పోలవరం పవర్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టిన మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) నూతన కాంట్రాక్టు ప్రకారం మొదటి మూడు యూనిట్లను 2024 జూలై నాటికి పూర్తి చేయనుంది. తర్వాత రెండు నెలలకు ఒకటి చొప్పున మిగిలిన 9 యూనిట్లను పూర్తి చేస్తుంది. తొలిదశ కింద 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో ఏడు యూనిట్లను ప్రారంభించి 560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుడుతుంది. ఆ తర్వాత మిగిలిన 5 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభిస్తుంది. నీటి నిల్వ స్థాయి తేలే వరకు ప్రాజెక్టు భవితవ్యాన్ని నిర్ణయించడం సాధ్యం కాదని, 2026 నాటికైనా ప్రాజెక్టు పూర్తవుతుందా అంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. నిర్ణీత సమయానికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుంది. 2025–26 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం 12 యూనిట్లు ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయి. ► పోలవరం వద్ద 41.15 మీటర్ల కాంటూరు వరకే నీరు నిల్వ చేస్తే జల విద్యుత్ కేంద్రం ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదనే అపోహలున్నాయి. వాస్తవానికి ఒక్కో యూనిట్ 80 మెగావాట్ల పూర్ధిస్థాయి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి నెట్ హెడ్ వద్ద 27 మీటర్లు, రిజర్వాయరు వద్ద 41.15 మీటర్లు, టెయిల్ వద్ద 13.64 మీటర్ల నీరు నిల్వ ఉంటే సరిపోతుంది. దీన్నిబట్టి రిజర్వాయరు నీటి మట్టం 41.15 మీటర్లు ఉంటే పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని స్పష్టమవుతోంది. ► ఒకవేళ స్పిల్‌వే ద్వారా వదిలే నీటి వల్ల టెయిల్ వాటర్ లెవల్ పెరిగి నెట్ హెడ్ వద్ద 27 మీటర్లకంటే తక్కువ నిల్వ ఉంటే ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. నీటి నిల్వ 41.15 మీటర్లకు పరిమితం చేసినా జల విద్యుత్ కేంద్రం నిర్వహణకు నష్టం లేదు. వరదల సీజన్లో ముందే విద్యుదుత్పత్తి ప్రారంభించొచ్చు. ► ముందు నిర్ణయించిన కాంట్రాక్టు సంస్థను తప్పించి వేరే సంస్థకు నిర్మాణం అప్పగించడంవల్ల సంప్రదింపులు (ఆర్బిట్రేషన్) కింద ఏపీ జెన్కో రూ.600 కోట్ల వరకు చెల్లించాలని, అది జెన్కోపై అదనపు భారమనే ప్రచారం జరుగుతోంది. కానీ గత కాంట్రాక్టు సంస్థతో ఇంకా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఆర్బిట్రేషన్ వల్ల ఏపీజెన్కోపై ఏమాత్రం భారం పడదని, తీర్పు అనుకూలంగా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాం. -
Fact Check: ఆరుబయట ఉంటే తడవదా!?
సాక్షి,అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో విద్యుత్ డిమాండ్ పెరగడంతోపాటు రకరకాల ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు సంస్థలు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం రాష్ట్రంలో ఎక్కడా కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేశాయి. అయినా, ‘విద్యుత్ ఉత్పత్తి లేదు.. కోతలే!’ అంటూ సోమవారం ‘ఈనాడు’ మళ్లీ ఓ అసత్య కథనాన్ని వండివార్చింది. వాస్తవ పరిస్థితులను అధికారులు ఎన్నిసార్లు వివరించినా పెడచెవిన పెట్టి, విద్యుత్ సంస్థల మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా, ప్రజలను ఆందోళనకు గురిచేసేలా తప్పుడు ప్రచారాన్ని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పచ్చపత్రిక తీరుపై విద్యుత్ సంస్థలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ మేరకు డిస్కంలు, ఏపీ జెన్కో ‘సాక్షి’కి వాస్తవాలు వెల్లడించాయి. ఆ వివరాలు.. ‘కోత’ లేకుండా సరఫరా.. ఇక ఏటా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల రాకతో ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో జూలై లేదా ఆగస్టు నెలల్లో కృష్ణా బేసిన్‌లోకి నీరు రావడంవల్ల జల విద్యుదుత్పత్తి ప్రారంభమయ్యేది. అలాగే, ఇది గాలుల సీజన్ అయినందున పవన విద్యుత్ అధికంగా వస్తుంది. అయితే, ఈ ఏడాది ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ఇలాంటి అనూహ్య పరిస్థితులతో ఏర్పడ్డ విద్యుత్ కొరత కారణంగా రెండు మూడ్రోజులు అక్కడక్కడా స్వల్ప అంతరాయాలు ఏర్పడ్డాయి. కానీ, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడానికి వెంటనే అన్ని రకాల చర్యలు తీసుకున్నాయి. దీంతో ఆదివారం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 91.097, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 48.842, ఎస్పీడీసీఎల్ పరిధిలో 89.445 కలిపి మొత్తం 229.384 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడినా ఎక్కడా కోతలేకుండా ఆ మేరకు విద్యుత్‌ను రాష్ట్ర గ్రిడ్ నుంచి డిస్కంలు సరఫరా చేశాయి. గతేడాది ఇదే రోజు విద్యుత్ వినియోగం 200.138 మిలియన్ యూనిట్లు కాగా ఈ ఏడాది డిమాండు ఊహించని విధంగా 29.146 మిలియన్ యూనిట్లు అధికంగా ఉంది. అయినా, రాష్ట్రంలో లభిస్తున్న విద్యుత్‌కు అదనంగా బహిరంగ మార్కెట్లో రూ.30.137 కోట్లు వెచ్చించి 50.621 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసి మరీ విద్యుత్ సమకూర్చాయి. ముందస్తు ప్రణాళికతో ఉత్పత్తి చేయడంతో పాటు ఇలా కొనుగోళ్లు చేస్తుండటంవల్లే కోతల్లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యమైంది. వాస్తవాలిలా ఉంటే.. విద్యుత్ సరఫరా చేయకుండా డిస్కంలు చేతులెత్తేశాయని పచ్చ పత్రిక నానా యాగీచేసింది. వర్షాకాలంలో సర్వసాధారణం వర్షాకాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తడిసిన బొగ్గు వినియోగించడం సర్వసాధారణంగా జరిగేదే. ఇప్పుడే, ఈ ఏడాదే ఇది కొత్తగా జరుగుతున్నది కాదు. బొగ్గును ఆరుబయట స్టాక్ ఉంచడంవల్ల వానకు తడుస్తుంది. అందువల్ల బొగ్గులో నీటిశాతం ఎక్కువ ఉంటుంది. అంతమాత్రానికే ‘థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును ముందస్తుగా నిల్వచేయడంలో ఏపీ జెన్కో అధికారులు విఫలమయ్యారంటూ ‘ఈనాడు’ గగ్గోలు పెట్టడం సరికాదు. నిజానికి.. దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉంది. అందువల్లే కేంద్ర ఇంధన, బొగ్గు మంత్రిత్వ శాఖల అధికారులు వారంలో రెండు మూడ్రోజులు జనరేషన్ సంస్థల అధికారులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ కేటాయింపులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల ప్రకారమే ఆయా బొగ్గు గనుల నుంచి ఉత్పత్తికి అంతరాయం లేకుండా ఏపీ జెన్కో బొగ్గు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం వీటీపీఎస్, ఆర్టీపీపీలో రెండ్రోజులు, కృష్ణపట్నంలో పది రోజులు, హిందూజాలో మూడ్రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. -
ఉత్పత్తిలో జెన్కో పరుగు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్కో) రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. రాష్ట్రంలో ఏటా 8% విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. దానికి తగ్గట్టు అంచనాలకు మించి జెన్కో 45.38% విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తోంది. దీంతో డిస్కంలపై ఆర్థిక భారం తగ్గుతోంది. తత్ఫలితంగా ఇంధన సర్దుబాటు (ట్రూ అప్) చార్జీల నుంచి వినియోగదారులకు ఉపశమనం లభిస్తుంది. పెరుగుతున్న సామర్థ్యం.. నాగార్జున సాగర్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో 287.213 మిలియన్ యూనిట్ల అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసింది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (డాక్టర్ ఎన్టీటీపీఎస్)లో ఇటీవల 800 మెగావాట్ల 8వ యూనిట్లో ప్రయోగాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించి, గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల సామర్థ్యం 5,810 మెగావాట్ల నుంచి 6,610 మెగావాట్లకు పెరగనుంది. మరోవైపు మాచ్‌ఖండ్‌లో ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఓహెచ్‌పీసీ), ఏపీ జెన్కో సంయుక్తంగా మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ఎగువ, దిగువ 98 మెగావాట్ల సామర్థ్యం గల మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఇతర చిన్న జలవిద్యుత్ కేంద్రాల మాదిరి ఇది సీజన్లో పనిచేసేది కాదు. ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. అప్పర్ సీలేరులో 1,350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ (పీఎస్పీ) నిర్మించాలని ఇప్పటికే కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) నుంచి జెన్కో అనుమతి తీసుకుంది. దీని నిర్మాణానికి టెండరు డాక్యుమెంటును జ్యుడీషియల్ ప్రివ్యూ కమిటీ ఆమోదించింది. రూ.11,154 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనుంది. సరికొత్త రికార్డులు.. రాష్ట్ర గ్రిడ్ విద్యుత్ డిమాండ్ గతేడాది మే నెలలో 5,947.39 మిలియన్ యూనిట్లు కాగా ఏపీ జెన్కో 1,989.37 మిలియన్ యూనిట్లు (33.45 శాతం) సమకూర్చింది. ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయిలో రాష్ట్ర విద్యుత్ డిమాండు 6,430.72 మిలియన్ యూనిట్లకు పెరగ్గా ఏపీ జెన్కో 2,917.99 మిలియన్ యూనిట్ల (45.38 శాతం)ను రాష్ట్ర అవసరాల కోసం గ్రిడ్‌కు అందించింది. గతేడాది కంటే 989.37 మిలియన్ యూనిట్లు (12 శాతం) అధికంగా సరఫరా చేసింది. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలు) ప్రైవేటు ఉత్పత్తి సంస్థలు, ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిన భారం నుంచి కొంతమేరకు ఉపశమనం లభిస్తోంది. దీనివల్ల విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు చార్జీల పెంపు భారం తప్పుతోంది. ప్రభుత్వ సహకారం.. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో అత్యధిక భాగం ఏపీ జెన్కో ద్వారా సమకూర్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్దేశించారు. వారి మార్గదర్శకం మేరకు, ప్రభుత్వ సహకారంతో తక్షణమే 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్పీ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాం. అదే విధంగా థర్మల్ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచుతున్నాం. ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి (సీఓడీ)కి జూలైలో శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దీంతో థర్మల్, హైడల్, సోలార్ కలిపి ఏపీ జెన్కో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8,789.026 మెగావాట్లకు చేరుతుంది. – కేవీఎన్ చక్రధర్ బాబు, ఎండీ, ఏపీ జెన్కో -
ఆంధ్రప్రదేశ్ లో పుష్కలంగా కరెంట్
-
పుష్కలంగా కరెంటు
సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం: రాష్ట్ర విద్యుత్ రంగంలో ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్టీటీపీఎస్)లో స్టేజ్–5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన 8వ యూనిట్‌ను విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేసింది. కోవిడ్ కష్టకాలాన్ని, అనేక సవాళ్లను అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయించిన ఈ యూనిట్‌ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్కో చైర్మన్ కె.విజయానంద్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు శుక్రవారం ఉదయం ‘లైట్ అప్’ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. ఆగస్టు నాటికి దీనిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే ఏపీ జెన్కో విద్యుదుత్పత్తి సామర్థ్యం 8,789 మెగావాట్లకు పెరుగుతుంది. తగ్గనున్న కొనుగోళ్లు ఏపీ జెన్కో ప్రస్తుతం 5,810 మెగావాట్ల థర్మల్, 1773.6 మెగావాట్ల హైడల్, 405.426 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. లోయర్ సీలేరులో 230 మెగావాట్ల అదనపు ఉత్పత్తి కోసం రెండు అదనపు యూనిట్లను 2024 ఏప్రిల్‌కి అందుబాటులోకి తేనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టు అయిన మాచ్‌ఖండ్ పవర్ హౌస్ సామర్థ్యాన్ని కూడా 120 నుంచి 150 మెగావాట్లకు పెంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునర్నిర్మించాలని కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ వేసవిలో ఎనిమిదేళ్ల తరువాత అనూహ్యంగా డిమాండు పెరిగినప్పటికీ ఏపీ జెన్కో రోజూ సగటున 105 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అందిస్తోంది. రాష్ట్ర మొత్తం వినియోగంలో 40 నుంచి 45 శాతం విద్యుత్ ఏపీ జెన్కో నుంచే వస్తోంది. కొత్తగా లైట్‌అప్ చేసిన యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తే రోజూ మరో 15 నుంచి 20 మిలియన్ యూనిట్లను జెన్కో అదనంగా సరఫరా చేస్తుంది. జెన్కో ఉత్పత్తి సామర్థ్యం ఎంత మేరకు పెరిగితే అంత మేరకు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలును డిస్కంలు తగ్గించుకోవచ్చు. సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయాలు విజయానంద్ గత ఏడాది కాలంలో 1,600 మెగావాట్ల అదనపు సామర్థ్యం గల రెండు యూనిట్లు అందుబాటులోకి రావడం ఏపీ జెన్కో చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయాలని జెన్కో చైర్మన్ విజయానంద్ చెప్పారు. ఎన్టీటీపీఎస్ నూతన యూనిట్‌ను ‘లైట్‌అప్’ చేశారు. ముందుగా బాయిలర్‌లో నీటి ద్వారా స్టీమ్ తయారీ ప్రక్రియను ప్రారంభించారు. కంట్రోల్ రూమ్‌లో స్టీమ్ రీడింగ్‌పై సంతృప్తి వ్యక్తం చేసి ఇంజినీర్లను అభినందించారు. ఆవిరి ప్రక్రియ పూర్తి స్థాయికి చేరగానే బొగ్గు ద్వారా స్టీమ్ రీడింగ్ పెరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. అనంతరం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల సామర్థ్యం గల స్టేజ్–2 యూనిట్‌ను గతేడాది అక్టోబర్ 27న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతికి అంకితం చేశారని గుర్తు చేశారు. ఎన్టీటీపీఎస్లో 800 మెగావాట్ల యూనిట్‌ను ఆగస్టు నాటికి కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీఓడీ)కి వీలుగా సిద్ధం చేయాలని బీహెచ్ఈఎల్, బీజీఆర్ ప్రతినిధులకు సూచించారు. ట్రయల్ రన్లో వచ్చే లోటుపాట్లను సరిదిద్దుకుని, మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని జెన్కో ఎండీ చక్రధర్‌బాబు తెలిపారు. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు. ఏపీ జెన్కో డైరెక్టర్లు చంద్రశేఖర్‌రాజు (థర్మల్), బి.వెంకటేశులురెడ్డి (ఫైనాన్స్), సయ్యద్ రఫీ (హెచ్ఆర్, ఐఆర్), సత్యనారాయణ (హైడల్), అంథోనీ రాజ్ (కోల్) తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్ కో రికార్డు!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విద్యుదుత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించింది. శనివారం 105.620 మిలియన్ యూనిట్ల (5137 మెగావాట్ల) విద్యుదుత్పత్తి నమోదు చేసింది. శుక్రవారం అర్ధరాత్రి 12 నుంచి శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకూ సుమారు 114 మిలియన్ యూనిట్ల విద్యుదుత్వత్తి చేయగా జెన్ కో వినియోగానికి పోనూ 105.620 మిలియన్ యూనిట్లు గ్రిడ్‌కు సరఫరా చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఒకరోజులో ఇదే అత్యధిక ఉత్పత్తి కావడం విశేషం. అత్యధిక విద్యుదుత్పత్తి చేయడానికి అన్ని విధాలొ సహకారం అందించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఇంధన శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డికి, కేంద్ర రైల్వే , కోల్ మంత్రిత్వ శాఖల అధికారులకు ఏపీ జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. మరింత అంకిత భావంతో పని చేయండి.. రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించినందుకు ఏపీ జెన్ కో ఉద్యోగులను మేనేజింగ్ డైరెక్టర్ చక్రధర్ బాబు అభినందించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేసి రాష్ట్ర అవసరాలను తీర్చడానికి మరింత అంకిత భావంతో పని చేయాలని ఉద్యోగులకు సూచించారు .రాష్ట్రంలో విద్యుత్ డిమాండు పెరుగుతున్నందున ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వ సహకారంతో ఏపీ జెన్ కో అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఎండీ పేర్కొన్నారు. వీటీపీఎస్ లో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన కొత్త యూనిట్ విద్యుదుత్పత్తి త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. లోయర్ సీలేరులో మరో 230 మెగావాట్ల ఉత్పత్తి కోసం రెండు యూనిట్ల నిర్మాణ పనులు త్వరగా చేపట్టి ఏడాదిలో పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పొరు. -
‘సీలేరు’లో మరో రెండు విద్యుదుత్పత్తి యూనిట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాలను పెంచడంలో భాగంగా జల విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులను సాధించడంలో మరో ముందడుగు పడింది. దిగువ సీలేరు హైడ్రో పవర్ హౌస్ వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతులిచ్చింది. ప్రస్తుతం ఇక్కడ 115 మెగావాట్ల సామర్ధ్యంతో నాలుగు యూనిట్లు పనిచేస్తున్నాయి. తాజా అనుమతులతో యూనిట్ల సంఖ్య ఆరుకు పెరగనుంది. మరో 230 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి రానుంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం వద్ద పవర్ కెనాల్ పనులను మెరుగుపరచనున్నారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంపాక్ట్ అసెస్మెంట్ విభాగం నుండి ఏపీ జెన్కోకు ఆదేశాలు అందాయి. ఉత్పత్తి సామర్ధ్యం పెంచేలా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. మోతుగూడెం వద్ద గల సీలేరు కాంప్లెక్స్‌లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ స్థాపిత సామర్థ్యం 460 మెగావాట్లు. పవర్ హౌస్ నిర్మాణ సమయంలోనే 115 మెగావాట్ల సామర్ధ్యం గల మరో రెండు యూనిట్ల ఏర్పాటుకు అవకాశం ఉండేలా చర్యలు తీసుకున్నారు. రూ. 415 కోట్లతో నిర్మించే ఈ యూనిట్లు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి దోహదపడుతుంది. ఈ యూనిట్ల పనులను 2024 చివరికి పూర్తి చేయాలని ఏపీ జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఏపీ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్) శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ 2వ దశలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ యూనిట్–3 ఈ ఏడాది మార్చిలో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ యూనిట్ రోజూ దాదాపు 16 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి అందిస్తోంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్టీటీపీఎస్)లో 800 మెగావాట్ల నూతన యూనిట్ మరో నెల రోజుల్లోనే వినియోగంలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ యూనిట్ ప్రారంభించిన 3 నెలల తర్వాత వాణిజ్య కార్యకలాపాలు మొదలవుతాయి. కాంట్రాక్టర్ సిద్ధం దిగువ సీలేరు హైడ్రో ప్రాజెక్ట్ విస్తరణకు పర్యావరణ అనుమతి వచ్చిన విషయాన్ని ఏపీ జెన్కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయనంద్కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పీక్ టైమ్ డిమాండ్‌ను తీర్చడానికి, ప్రీమియం ధరకు విద్యుత్ కొనుగోలును నివారించడానికి అదనపు యూనిట్ల నిర్మాణాన్ని ఏపీ జెన్కో చేపట్టిందని, తద్వారా విద్యుత్, డబ్బు రెండూ ఆదా అవుతాయని చక్రధర్‌బాబు తెలిపారు. సీలేరులో అదనపు యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలన్నీ ఉన్నాయని, కాంట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉన్నందున, పనులను వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేస్తామని వివరించారు. విజయానంద్ స్పందిస్తూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతర పర్యవేక్షణ, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారం వల్లనే ఇంధన రంగంలో ఇన్ని మైలురాళ్లను సాధించగలుగుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో జెన్కో డైరెక్టర్లు సత్యనారాయణ, వెంకటేశులురెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్రంలో పుష్కలంగా విద్యుత్
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరింత విద్యుత్ అందుబాటులోకి వచ్చి వినియోగదారులకు పుష్కలంగా సరఫరా అవుతుందని, ఈ మేరకు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభం కానున్నాయని ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్కో) లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్‌బాబు తెలిపారు. ఆయన శుక్రవారం ఏపీజెన్కో ఎండీగా విద్యుత్ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. సంస్థ డైరెక్టర్లు, విద్యుత్ ఉద్యోగసంఘాల నాయకులు, పలువురు ఉద్యోగులు ఆయన్ని అభినందించారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడానికిగాను థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ప్లాంట్ల ఆధునికీకరణకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి సిబ్బంది కలిసి పనిచేయాలని కోరారు. రానున్న నెలల్లో ఇంధన డిమాండ్ రోజుకి 250 మిలియన్ యూనిట్లను దాటుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దాన్ని అందుకోవడానికి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఇంధన డిమాండ్ పెరగడం చాలా మంచి సంకేతమని, ఇది రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను సూచిస్తుందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి, అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నిర్వహణలో జాతీయస్థాయిలో అత్యుత్తమ సంస్థగా అవతరించేందుకు ఏపీజెన్కో అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్) స్టేజ్–2 (1,600 మెగావాట్లు) ప్రస్తుతం పనిచేస్తోందని, వేసవి డిమాండ్‌ను తీర్చేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో మరో 800 మెగావాట్ల యూనిట్ ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం గ్రిడ్ డిమాండ్‌లో 40 నుంచి 45 శాతం వరకు ఏపీజెన్కో ద్వారానే అందుతోందన్నారు. పోలవరం వద్ద ఒక్కొక్కటి 80 మెగావాట్ల సామర్థ్యమున్న 12 హైడ్రో ఎలక్ట్రిక్ యూనిట్లను (మొత్తం 960 మెగావాట్లు) కూడా జెన్కో ఏర్పాటు చేస్తోందని చెప్పారు. దశల వారీగా ప్రాజెక్టుతో పాటు ఇవి కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా దిగువ సీలేరు వద్ద 115 మెగావాట్ల రెండు అదనపు యూనిట్ల నుంచి వచ్చే ఏడాది జూలైలో ఉత్పత్తి మొదలుపెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
‘సీలేరు’కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుచూపుతో చేపట్టిన పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు (పీఎస్పీ)ల ఏర్పాటుకు అడ్డంకులు తొలగుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని ఎగువ సీలేరు పార్వతీనగర్ వద్ద 1,350 మెగావాట్ల సామర్థ్యం గల భూగర్భ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఆర్థిక, పర్యావరణ అనుమతులు వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టుకు టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు ఏపీ జెన్కో వెల్లడించింది. ఇందులో భాగంగా పర్యావరణ అనుమతులకు అవసరమైన నివేదికను సిద్ధం చేసింది. అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది నివాసానికి అవసరమైన నివాసాలు, కార్యాలయాలు, షెడ్లను సిద్ధం చేస్తోంది. ఎగువ సీలేరు వద్ద ఉన్న గుంటవాడ రిజ ర్వాయర్ (ఎగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని వినియోగించడం ద్వారా పీక్ అవర్స్‌లో 1,350 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. అలాగే డొంకరాయి రిజర్వాయర్ (దిగువ) నుంచి 1.70 టీఎంసీల నీటిని గుంటవాడ రిజర్వాయర్‌కు ఆఫ్ పీక్ వేళల్లో పంపు చేయడం కూడా ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతల్లో ఒకటి. ఆకస్మిక హెచ్చుతగ్గుల కారణంగా గ్రిడ్‌పై భారం పడి.. సమస్యలు తలెత్తకుండా స్థిరంగా ఉంచేందు కు ప్రాజెక్ట్ సహాయపడుతుంది. ఇందుకు గ్రిడ్‌లో ఉన్న మిగులు విద్యుత్‌ను ఉపయోగిస్తారు. 29 ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం.. రాష్ట్రంలో 29 ప్రాంతాల్లో 33,240 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీలను నెలకొల్పడానికి ప్రణాళిక సిద్ధమైంది. మరో 10 వేల మినీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఇటీవల గుర్తించింది. మొత్తంగా 43,240 మెగావాట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వీటి కోసం వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 1.45 లక్షల ఎకరాల భూమికి టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ స్టడీస్ నిర్వహించింది. పెట్టుబడులు పెట్టేవారికి, పరికరాల తయారీ సౌకర్యాల ప్రాజెక్ట్ డెవలపర్లకు సుమారు 5 లక్షల ఎకరాలను లీజుకు ఇవ్వడానికి భూమిని సమకూరుస్తోంది. తొలి దశలో వైఎస్సార్ జిల్లా గండికోట, అనంతపురం జిల్లా చిత్రావతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సోమశిల, కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్, విజయనగరం జిల్లా కురుకూటి, కర్రివలస, విశాఖపట్నం జిల్లా ఎర్రవరంలలో 6,600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఏడు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. పీఎస్పీల వల్ల రాష్ట్రానికి గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఛార్జీల కింద రూ.8,058 కోట్లు అందుతాయి. పన్ను రాబడి కింద రూ.1,956 కోట్ల మొత్తం సమకూరుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 58,600 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. త్వరలోనే టెండర్లు.. సీలేరులో 1,350 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి దాదాపు 410 హెక్టార్ల భూమి అవసరమవుతోంది. టోపోగ్రాఫికల్, హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, జియోటెక్నికల్ పరిశోధనలు ఇప్పటికే పూర్తయ్యాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా సిద్ధంగా ఉంది. ఆర్థిక, పర్యావరణ అనుమతులు రాగానే టెండర్ డాక్యుమెంట్లను న్యాయ సమీక్షకు పంపిస్తాం. అక్కడి నుంచి క్లియరెన్స్ తీసుకుని టెండర్లు పిలిచి.. త్వరలోనే పనులు మొదలుపెడతాం. –బి.శ్రీధర్, ఎండీ, ఏపీ జెన్కో -
విద్యుత్ రంగంలో మరో ముందడుగు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విద్యుత్ రంగంలో రాష్ట్రం మరో ముందడుగు వేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లో నిర్మించిన 3వ యూనిట్‌ను గురువారం ఆయన జాతికి అంకితం చేశారు. అనంతరం కృష్ణపట్నం పోర్టు నిర్వాసితుల ఖాతాల్లో మత్స్యకారేతర పరిహారం జమ చేశారు. ఈ సందర్భంగా నేలటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏపీ జెన్కో స్వయంగా నిర్మించిన 800 మెగావాట్ల ప్లాంటును మీ అందరి సమక్షంలో జాతికి అంకితం చేస్తున్నానని చెప్పారు. ఈ థర్మల్ పవర్ స్టేషన్‌కు ఉమ్మడి రాష్ట్రంలో మన దివంగత నేత, ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి (నాన్న గారు) 2008లో శంకుస్థాపన చేశారని తెలిపారు. దేశంలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఈ పవర్‌స్టేషన్ నిర్మాణానికి ఆ మహానేత శ్రీకారం చుట్టగా, నేడు మనందరి ప్రభుత్వంలో పూర్తి సామర్థ్యంతో దానిని ప్రారంభించడం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ పవర్ స్టేషన్‌కు మన రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య పేరు పెట్టుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. నాణ్యమైన, నిరంతర విద్యుత్ ►రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులందరికీ రోజంతా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ►మననందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ థర్మల్ పవర్ స్టేషన్‌లోని ఈ ప్రాజెక్టుకు రూ.3,200 కోట్లు యుద్ధ ప్రాతిపదికన ఖర్చు చేశాం. 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రాజెక్టు పూర్తి చేశాం. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో దాదాపు 45 శాతం కరెంటు ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్నాయి. ►ఈ రోజు జాతికి అంకితం చేసిన ఈ ప్లాంటు నుంచి రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఏపీ గ్రిడ్‌కు సరఫరా అవుతుంది. సాధారణ థర్మల్ విద్యుత్ ప్లాంటుతో పోల్చితే సూపర్ క్రిటికల్ ప్లాంటు తక్కువ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల వెలువడే కాలుష్యం తగ్గుతుంది. భూములిచ్చిన రైతులకు అభివాదం ► ఒకవైపు కృష్ణపట్నం పోర్టు, మరోవైపు థర్మల్ పవర్ ప్లాంటు.. ఈ రెండూ ఈ ప్రాంతంలో రావాలి. వీటి ద్వారా జిల్లా అభివృద్ధి చెందాలని, ఈ ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులందరికీ నిండు మనసుతో శిరసు వంచి ప్రత్యేకంగా అభివాదం తెలియజేస్తున్నా. ► వీళ్లందరికీ మంచి కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇందులో భాగంగానే ఇదివరకే 326 కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా, రెండో దశలో మరో 150 కుటుంబాలకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియను ఈ నవంబర్ పూర్తయ్యేలోగా ప్రారంభించాలని ఆదేశించాం. నెరవేరిన మరో ఎన్నికల హామీ ► ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో పాటు ఎన్నికల వేళ ఆరోజు మీకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి నేను ఇక్కడకు వచ్చాను. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబునాయుడుకు మేమంతా గుర్తుకు వస్తామని ఆ రోజు మీరందరూ చెప్పారు. ► ఆయన ఐదేళ్ల పరిపాలనలో చేసిన మంచేమీ లేకపోయినా, హడావుడిగా ఎన్నికలప్పుడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ మళ్లీ మోసం చేసే ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. మీ అందరి కష్టాలు నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఆ రోజు నేను చెప్పాను. ► ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ 16,337 మత్స్యకారేతర కుటుంబాలకు కూడా బటన్ నొక్కి నేరుగా రూ.36 కోట్ల పరిహారాన్ని వాళ్ల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నాం. ఆ వేళ హడావుడిగా కేవలం మోసం చేసే ఉద్దేశంతో చంద్రబాబు కేవలం 3,500 మందికి అది కూడా రూ.14,000 కూడా సరిగా ఇవ్వని పరిస్థితులు. ఈ రోజు వాళ్లకు మిగతా సొమ్ము ఇవ్వడమే కాకుండా, మిగిలిపోయిన 12,787 కుటుంబాలకు కూడా మంచి చేస్తూ, అందరికీ ఈ ప్యాకేజీ ఇస్తున్నాం. ముదివర్తి–ముదివర్తిపాళెం మధ్య సబ్మెర్సిబుల్ కాజ్వే ► నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై ముదివర్తి–ముదివర్తిపాళెం మధ్య సబ్మెర్సిబుల్ కాజ్వే నిర్మాణం కోసం రూ.93 కోట్ల కేటాయిస్తూ.. దానికి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. నా సోదరుడు, శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోరిక మేరకు ఈ కాజ్వే నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నా. ► ఇటువంటి ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా అడుగుతున్నా, పట్టించుకోని పాలకులను మనం చూశాం. ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల సముద్రంలోకి వెళ్లే నీటిని ఆపగలుగుతాం. సముద్రం నుంచి వచ్చే బ్యాక్ వాటర్‌నూ ఆపగలుగుతాం. తద్వారా నాలుగు మండలాల్లో నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఇటీవల ప్రారంభించిన నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరు పెడుతున్నాం. మత్స్యకారుల కోసం ప్రత్యేక జట్టీ ► ఈ ప్రాంతానికి చెందిన మత్స్యకారులకు ప్రత్యేక జట్టీ ఏర్పాటు కోసం రూ.25 కోట్లతో శంకుస్థాపన చేశాం. ఉప్పుకాలువ, వెంకటాచలం రోడ్డు నుంచి తిరుమలమ్మపాళెం హైలెవల్ బ్రిడ్జి కోసం మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రూ.12 కోట్లు అడిగారు. దాన్ని మంజూరు చేస్తున్నాం. మరో హైలెవల్ బ్రిడ్జి.. నెల్లూరు నక్కలవాగు – కృష్ణపట్నం రోడ్డు నుంచి పోటంపాడు (వయా బ్రహ్మదేవం) వరకు మరో రూ.10 కోట్లు అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నా. ► ప్రతి గ్రామం రూపురేఖలు మార్చాలని, ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే తాపత్రయంతో అడుగులు వేగంగా వేస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. మనం గర్వించాల్సిన రోజు మనం నిజంగా గర్వించాల్సిన రోజిది. అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ కోసం ప్రతి వాగ్దానం చేయడం, అమలు చేయకపోవడం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు మూడు విడతల్లో ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. 3,500 మంది ఎస్సీ, ఎస్టీలకు గాను వారిలో కూడా టీడీపీ వారికే ఇస్తామని, వైఎస్సార్సీపీ వారిని పక్కనపెట్టండని చెప్పి.. ఎవరికీ ఇవ్వలేదు. మా నాయకుడు వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ ఇస్తున్నారు. టీడీపీ హయాంలో కేవలం 7 పంచాయతీలు మాత్రమే ప్యాకేజీకి ఎంపిక చేశారు. మన ప్రభుత్వం 20 పంచాయతీలతో పాటు, పోర్టుకు, థర్మల్ విద్యుత్ కేంద్రానికి భూములు ఇచ్చిన వారందరికీ రూ.36 కోట్ల ప్యాకేజీ ఇస్తోంది. జగనన్న ఏమి అడిగినా ఇస్తున్నారు. ఉప్పుకాలవ మీద రూ.12 కోట్లతో బ్రిడ్జి, కృష్ణపట్నం నక్కలకాలువ వాగు మీద రూ.9.40 కోట్లతో మరో బ్రిడ్జి మంజూరు చేయాలని అడుగుతున్నాం. – కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు ఈ రోజు 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల 3వ యూనిట్ అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ విద్యుత్ స్టేషన్ దేశంలోనే మొదటిది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో విద్యుత్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అడ్డగోలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లతో చంద్రబాబు రూ.20 వేల కోట్లకు పైగా నష్టాల్లోకి తోశారు. రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని బట్టి ఉత్పత్తి కూడా పెంచాలని సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తిని పెంచడమే కాకుండా ఖర్చు తగ్గేలా ప్రణాళికలు రూపొందించారు. ఇవి ఆచరణలోకి వస్తే మనం ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ట్రాన్స్‌కో అభివృద్ధికి రూ.4 వేల కోట్లతో ఎన్నో చర్యలు తీసుకున్నారు. రూ.40 వేల కోట్ల ఆర్థిక సాయంతో డిస్కంల ఆదుకుంటున్నారు. ఇవాళ మనం 45 శాతం విద్యుత్‌ను జెన్కో ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకా పలు విధాలా ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుష్టచతుష్టయం దు్రష్పచారం చేస్తోంది. నిత్యం అసత్యాలు వల్లించే ఈ పచ్చ పత్రికలు చదవద్దని, పచ్చ టీవీలు చూడద్దని విజ్ఞప్తి చేస్తున్నా. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి -
ఏపీ జెన్కో మూడో యూనిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
జెన్కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేస్తున్నాం: సీఎం జగన్
-
ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నా: సీఎం జగన్
సాక్షి, నెల్లూరు జిల్లా: తన తండ్రి వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో జెన్కో మూడో యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం కృష్ణపట్నం పోర్టు పరిధిలో చేపల వేటకు అనువుగా రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో నేడు మరో ముందడుగు పడిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జెన్కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేస్తున్నామన్నారు. చదవండి: CM YS Jagan: కలిసికట్టుగా క్లీన్ స్వీప్ ‘‘వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాం. ప్రాజెక్ట్‌కు భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు. 326 కుటుంబాలకు ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చాం. మరో 150 కుటుంబాలకు నవంబర్‌లో ఉద్యోగాలు ఇస్తామని’’ సీఎం అన్నారు. గతంలో ఓట్ల కోసం చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చారు. 16,218 మత్స్యకారేతర కుటుంబాలకు 35.74 కోట్ల సాయం అందించాం. స్థానికుల కోసం రూ.25 కోట్లతో ప్రత్యేక జెట్టీ నిర్మిస్తున్నాం.ప్రజలందరికీ మంచి చేయాలన్న ఉద్దేశంతో ముందడుగు వేశాం’’ అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్సార్ 2008లో ఈ విద్యుత్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. దేశంలో తొలిసారిగా ప్రభుత్వరంగంలో సూపర్ క్రిటికల్ థర్మల్‌పవర్ స్టేషన్‌కు ఆనాడు వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఇవాళ పూర్తిసామర్థ్యంతో మనం ప్రారంభించడం దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. వినియోగదారులకు రోజంతా నాణ్యమైన కరెంటు సరఫరాకు అన్నిచర్యలూ తీసుకుంటున్నాం. ఈ థర్మల్ పవర్ స్టేషన్‌కు మన ప్రభుత్వంలో అక్షరాల రూ.3,600కోట్లు ఇచ్చాం. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో దాదాపు 45 శాతం కరెంటు ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థలు ఉత్పత్తిచేస్తున్నాయి. ఈరోజు జాతికి అంకితం చేసిన ఈ ప్లాంట్ నుంచి రోజుకు 19 మిలియన్ యూనిట్లు గ్రిడ్‌కు అనుసంధానం అవుతుంది. తక్కువ బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల వెలువడే కాలుష్యం తగ్గుతుందని’’ సీఎం పేర్కొన్నారు. ‘‘కృష్ణపట్నంతో పాటు, విద్యుత్ ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులందరికీ కూడా నిండు మనస్సుతో అభివాదం తెలియజేస్తున్నా. ఇది వరకే 326 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చాం. రెండో దశలో 150 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ పూర్తవుతుంది. నవంబర్ మాసం పూర్తయ్యేలోగానే ఈ ఉద్యోగాలను కల్పిస్తాం. ఎన్నికల వేళ మీ అందరికీ ఇచ్చిన హామీని కూడా ఇవాళ అమలు చేస్తున్నాను. ఐదేళ్లలో మేలు చేయకపోయినా ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు హడావిడిగా వచ్చి మోసం చేస్తున్నారని మీరు నా దృష్టికి తీసుకు వచ్చారు. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని ఆరోజే చెప్పాను. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ 16,337 మత్స్యారేతర కుటుంబాలు మొత్తం అందరికీ కూడా బటన్ నొక్కి… నేరుగా రూ.36 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తున్నాను’’ అని సీఎం అన్నారు. ఆ రోజు హడావిడిగా చంద్రబాబు మోసం చేసే ఉద్దేశంతో కేవలం 3500 మందికి, అదికూడా కేవలం రూ.14వేలుచొప్పున కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. వీరి క్కూడా మిగిలిన డబ్బు కూడా ఇస్తున్నాం. నెల్లూరు జిల్లాలో పెన్నానది మధ్యలో ముదివర్తి పాలెం వద్ద సబ్మెర్జబుల్ చెక్‌డ్యాం నిర్మాణంకోసం రూ.93 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. దీనివల్ల సముద్రంనుంచి వచ్చే బ్యాక్ వాటర్‌ను ఆపగలుగుతాం. నాలుగు మండలాలకు నీటి సమస్యను కూడా తీర్చగలుగుతాం. శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అడిగిన మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో నెల్లూరు బ్యారేజీని కూడా ప్రారంభించడం జరిగింది. నెల్లూరు బ్యారేజీకి కూడా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి పేరుకూడా పెడుతున్నాం. మరో ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేశాం. ఈ ప్రాంత మత్స్యకారులకోసం రూ.25 కోట్లతో ప్రత్యేక జట్టీని నిర్మిస్తున్నాం. ప్రతి ఇంటికీ మంచి చేయాలన్న తపనతో అడుగులు వేస్తున్నాం. ప్రతి గ్రామం రూపురేఖలు మార్చాలన్న ధ్యేయంతో అడుగులు ముందుకేస్తున్నాం. దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి’’ అని సీఎం పేర్కొన్నారు. -
నేలటూరులో ఏపీ జెన్కో మూడో యూనిట్‌కు ప్రారంభోత్సవం
-
ముగిసిన సీఎం జగన్ నెల్లూరు పర్యటన
Live Updates కృష్ణా: నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గన్నవరం నుండి తాడేపల్లి నివాసానికి బయల్దేదారు. ► రేణిగుంట విమనాశ్రయం నుండి విజయవాడ గన్నవరం విమానాశ్రయంకు విమానం లో బయలుదేరిన సీఎం జగన్ అదృష్టంగా భావిస్తున్నా.. సీఎం జగన్ ►రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తిలో నేడు మరో ముందడుగు పడిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జెన్కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేస్తున్నామన్నారు. తన తండ్రి వైఎస్సార్ శ్రీకారం చుట్టిన ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం అన్నారు. ►కృష్ణపట్నం పోర్టు పరిధిలోని మత్స్యకారులు, మత్స్యకారేతరుల స్వప్నాన్ని సీఎం సాకారం చేస్తున్నారు. చేపల వేటకు అనువుగా రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ►నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో ఏపీ జెన్కో మూడో యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఫిషింగ్ జెట్టికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. జెన్కో మూడో యూనిట్ ప్రారంభించనున్న సీఎం జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లా చేరుకున్నారు. కాసేపట్లో ముత్తుకూరు మండలం నేలటూరులో జెన్కో మూడో యూనిట్ ప్రారంభించనున్నారు. జెన్కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేయనున్నారు. రేణిగుంట నుంచి నెల్లూరుకు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరిన సీఎం జగన్ ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసుదన్ రెడ్డి, కలెక్టర్ వెంకట రమణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరుకు బయలుదేరారు. సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్)లో 800 మెగావాట్ల యూనిట్‌ను యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రభుత్వ రంగంలో దేశంలోనే మొదటిదైన ఈ సూపర్ క్రిటికల్ యూనిట్ రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంట్‌ను సీఎం వైఎస్ జగన్ గురువారం ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు. సాధారణ థర్మల్ పవర్ ప్లాంట్లతో పోలిస్తే ఈ ప్లాంట్‌లో తక్కువ బొగ్గును వినియోగిస్తారు. దీనివల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం కొంత మేర తగ్గుతుంది. రోజుకు 9,312 టన్నుల బొగ్గుతో నడిచేలా ఈ యూనిట్‌ను రూపొందించారు. పూర్తి స్థాయిలో సన్నద్ధం కృష్ణపట్నం ప్లాంట్ మొత్తం సామర్థ్యం నాలుగు యూనిట్లు కాగా, స్టేజ్–1లో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. మూడవ యూనిట్‌గా స్టేజ్–2లోని 800 మెగావాట్ల ప్లాంట్‌ను రూ.5,082 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టారు. అయితే జీఎస్టీ అమలు, చట్టంలో మార్పు, ఇప్పటికే ఖర్చు చేసిన మొత్తంపై వడ్డీ కారణంగా అంచనా వ్యయంతో పోలిస్తే ప్రాజెక్ట్ వ్యయం కొంత పెరిగింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.5,935.87 కోట్లు, రాష్ట్ర విద్యుత్ ఆర్థిక సంఘం ద్వారా రూ 1,000 కోట్ల రుణ సాయంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి రెండవసారి ట్రయల్ రన్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. తాల్చేర్ నుంచి కృష్ణపట్నం పోర్టు ద్వారా బొగ్గు రవాణా జరుగుతుంది. బంగాళాఖాతం నుంచి సముద్రపు నీటిని గ్రహించి, ఆర్వో ప్లాంట్ల ద్వారా మంచినీటిగా మార్చి వినియోగిస్తారు. కాగా, ఈ ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 జూలై 17న శంకుస్థాపన చేయగా, ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ పూర్తి చేయడం విశేషం. కాగా, నేడు 3వ యూనిట్ ప్రారంభోత్సవం చేయనున్నారు. స్వప్నం సాకారం.. కృష్ణపట్నం పోర్టు పరిధిలోని మత్స్యకారులు, మత్స్యకారేతరుల స్వప్నాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేస్తున్నారు. చేపల వేటకు అనువుగా రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్ జెట్టి నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం శంకుస్థాపన చేయనున్నారు. పుష్కర కాలంగా ఎదురు చూస్తున్న కృష్ణపట్నం పోర్టు నిర్వాసితులకు మత్స్యకారేతర ప్యాకేజీ సైతం పంపిణీ చేయనున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన పాదయాత్రలో కోరిన విన్నపాన్ని సీఎం హోదాలో ఆచరణలో అమలు చేస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని కృష్ణపట్నంలో పోర్టు నిర్మాణంతో సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఇబ్బందిగా మారింది. ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేయాలన్న ఈ ప్రతిపాదన 16 ఏళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. హార్బర్ నిర్మించాలని కూడా గతంలో పలు సర్వేలు, పరిశీలనలు చేపట్టారు. అందుకోసం పాలకులు అంచనాలు కూడా రూపొందించారు. అవేవీ కార్యరూపం దాల్చలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇక్కడి మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని భావించారు. ఎన్నో ఏళ్లుగా మత్స్యకారుల కలగా మిగిలిపోయిన ఫిషింగ్ జెట్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నేలటూరు జెన్కో మూడో యూనిట్ ప్రారంభోత్సవానికి గురువారం రానున్న సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.25 కోట్లతో ఫిషింగ్ జెట్టి ముత్తుకూరు మండలంలోని నేలటూరు పట్టపుపాళెం వద్ద రూ.25 కోట్ల వ్యయంతో ఫిషింగ్ జెట్టి నిర్మాణం చేపట్టనున్నారు. జెట్టి అందుబాటులోకి వస్తే ఉప్పు కాలువల్లో, క్రీక్‌ల్లో బోట్లు, వలలను భద్రపరుచుకునే బాధ మత్స్యకారులకు తప్పుతోంది. ఫిషింగ్ జెట్టీ వద్ద భద్రపరుచుకొనే అవకాశం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి బోట్లు, వలలను కాపాడుకోవచ్చు. సముద్రంలో వేట చేసిన మత్స్య సంపదను ఈ జెట్టి వద్ద ఎండబెట్టుకొని, భద్రపరుచుకోవచ్చు. పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. పైగా వలలు అల్లుకొనే వెసులుబాటు లభిస్తుంది. రోడ్డు సదుపాయం ఏర్పడుతుంది. కొనుగోలుదారులు నేరుగా ఈ జెట్టిల వద్దకు వచ్చి మత్స్యసంపదను కొనుగోలు చేసుకొనే వెసులుబాటు లభిస్తోంది. క్రమంగా ఈ జెట్టిల వద్ద కోల్డ్ స్టోరేజీలు అందుబాటులోకి రానున్నాయి. చేపలు, రొయ్యలు చెడిపోకుండా ఈ కోల్డ్ స్టోరేజ్‌లో భద్రపరుచుకోవచ్చు. భవిష్యత్‌లో ఈ ఫిషింగ్ జెట్టి క్రమంగా మినీ ఫిషింగ్ హార్బర్‌గా రూపాంతరం చెందే అవకాశం లేకపోలేదని పలువురు వివరిస్తున్నారు. -
27న నెల్లూరు జిల్లాకు సీఎం జగన్
సాక్షి, అమరావతి/నెల్లూరు(అర్బన్): సీఎం వైఎస్ జగన్ ఈ నెల 27న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీ జెన్కో ప్రాజెక్టు మూడో యూనిట్(800 మెగావాట్లు)ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి.. 10.55 గంటలకు కృష్ణపట్నం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 11.10 గంటల నుంచి మధ్యాహ్నం 1.10 మధ్యలో నేలటూరులోని ఏపీ జెన్కో మూడో యూనిట్‌ను జాతికి అంకితం చేసి.. అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.35 గంటలకు నేలటూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. -
ప్రజలకు అందుబాటు ధరల్లో విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజలకు, భవిష్యత్ తరాలకు అందుబాటు ధరలో విద్యుత్ పుష్కలంగా ఉండేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం ఇంధనశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి వేగవంతమవడంతో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని, ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 2017–18లో 50,077 మిలియన్ యూనిట్లు ఉన్న డిమాండ్ 2021–22లో 60,943 మిలియన్ యూనిట్లకు (21.6 శాతం) పెరిగిందని తెలిపారు. వచ్చే మార్చి నాటికి డిమాండ్ రోజుకు 250 మిలియన్ యూనిట్లకు చేరుతుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (కృష్ణపట్నం) స్టేజ్–2 (1్ఠ800 మెగావాట్లు) ఈ నెలాఖరుకు, డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో స్టేజి–5 (1్ఠ800 మెగావాట్లు) వచ్చే మార్చి నాటికి ప్రారంభించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. పునరుత్పాదక విద్యుత్‌కు పెద్దపీట డిమాండ్‌ను అందుకోవడంతోపాటు విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్రంలో ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు ఢోకా లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మజనార్దనరెడ్డి, నెడ్‌క్యాప్ ఎండీ ఎస్.రమణారెడ్డి, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
ర్యాక్‌లు కొనుక్కోండి
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పలు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఖాళీ అయ్యాయి. బొగ్గు రవాణాలో జాప్యం కారణంగా రోజువారీ అవసరాలకు సరిపడా మాత్రమే బొటాబొటిగా అందుబాటులో ఉంది. రెండు నెలల క్రితం సరుకు రవాణా రైళ్లకు నెలకొన్న డిమాండ్ దృష్ట్యా ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే బొగ్గు తరలింపు కోసం కనీసం 10 రైల్వే ర్యాక్‌లను సొంతంగా కొనుగోలు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలకు సూచించింది. దీనివల్ల సెప్టెంబర్ వరకూ విద్యుదుత్పత్తి సాఫీగా సాగుతుందని కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. అయితే ఇది రాష్ట్రాలకు ఆర్థికంగా పెనుభారంగా మారుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 70 ర్యాక్‌లు నిల్వ ఉంచండి.. కొరత దృష్ట్యా కనీసం 70 ర్యాక్‌ల బొగ్గును నిల్వ ఉంచాలని ఎన్టీపీసీ లిమిటెడ్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన విద్యుత్ సంస్థలకు కేంద్ర విద్యుత్ శాఖ లేఖలు రాసింది. బొగ్గు తరలింపు కోసం పూర్తిగా రైల్వేలపై ఆధారపడొద్దని లేఖలో పేర్కొంది. ఇదీ పరిస్థితి.. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తెలంగాణలోని సింగరేణి కాలరీస్, ఒడిశాలోని మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు దిగుమతి అవుతోంది. రెండు చోట్లా కలిపి రోజూ దాదాపు 10 నుంచి 12 ర్యాక్‌ల బొగ్గు వస్తోంది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో రోజుకి 28,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం కాగా అక్కడ ప్రస్తుతం 98,566 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. ఇవి సుమారు 3, 4 రోజులకు సరిపోతాయి. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్(కృష్ణపట్నం)లో రోజుకి 19 వేల మెట్రిక్ టన్నుల బొగ్గును వినియోగిస్తుండగా 2,99,947 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. దీంతో దాదాపు 15 రోజుల పాటు విద్యుదుత్పత్తి చేయవచ్చు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లో 21,000 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇక్కడ ప్రస్తుతం కేవలం 7,997 మెట్రిక్ టన్నులే ఉంది. వర్షాకాలం కావడంతో డిమాండ్ తగ్గి రోజుకు 196.27 మిలియన్ యూనిట్లు మాత్రమే విద్యుదుత్పత్తి జరుగుతోంది. హిందూజా పవర్ ప్లాంట్ నుంచి కూడా రాష్ట్రానికి విద్యుత్ అందుతోంది. ఇక్కడ రోజుకి 9,600 మెట్రిక్ టన్నులు బొగ్గు వినియోగిస్తుండగా ప్రస్తుతం 30,917 మెట్రిక్ టన్నులు ఉంది. ఈ నిల్వతో మూడు రోజులు విద్యుదుత్పత్తి చేయవచ్చు. బొగ్గు నిల్వలు పెంచుకునేందుకు 20 ర్యాక్‌ల వరకూ కేటాయింపులు పెంచాలని ఏపీ జెన్కో కోరుతోంది. పెరిగిన ఉత్పత్తి, డిమాండ్ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి 27 శాతం పెరిగింది. గతేడాది జూన్ నాటికి 12,428.41 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి కాగా ఈ ఏడాది జూన్ నాటికి 15,913.37 మిలియన్ యూనిట్లకు పెరిగింది. మరోవైపు దీనికి తగ్గట్లు బొగ్గుకు డిమాండ్ ఏర్పడింది. ఆర్థికంగా భారమే.. ‘ర్యాక్‌లు సొంతంగా కొనుగోలు చేసుకోవాలని కేంద్రం గతంలోనూ చెప్పింది. సొంతంగా ర్యాక్‌లు కొనుగోలు చేస్తే రవాణా ఖర్చుల్లో దాదాపు 10 శాతం రాయితీ కూడా అందిస్తామంటోంది. అయితే ఇదేమీ తప్పనిసరి కాదు. ర్యాక్‌లను కొనుగోలు చేయడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. వాటి నిర్వహణ మరింత భారంగా మారుతుంది. ప్రభుత్వ రంగ థర్మల్ కేంద్రాలు సొంతంగా ర్యాక్‌లు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కేంద్రం సూచన మేరకు బొగ్గు దిగుమతి చేసుకునే ప్రైవేట్ సంస్థలు ర్యాక్‌లు కొనుగోలు చేసే అవకాశం ఉంది’ –బి.శ్రీధర్, సీఎండీ, ఏపీ ట్రాన్స్‌కో -
దేశంలో డిస్కంల బకాయిలు రూ.1,32,432 కోట్లు
సాక్షి, అమరావతి: దేశంలో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) విద్యుత్ ఉత్పత్తిదారులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.1,32,432 కోట్లకు చేరాయి. గతేడాది జూన్‌లో రూ.1,27,306 కోట్ల బ కాయిలు ఉండగా ఈ ఏడాది నాలుగు శాతం పెరిగాయి. ఉత్పత్తిదారులు, డిస్కంల మధ్య విద్యుత్ కొనుగోలు లావాదేవీల్లో పారదర్శకత తీసుకురావడానికి 2018 మే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రాప్తి పోర్టల్ ఈ వివరాలను వెల్లడించింది. విద్యుత్ సరఫరాకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేసేందుకు విద్యుత్ ఉత్పత్తిదారులు డిస్కంలకు 45 రోజుల గడువు ఇచ్చారు. ఆ గడువు తర్వా త కూడా చెల్లించని మొత్తం రూ.1,15,128 కోట్లుగా ఉంది. ఇది ఏడాది కిందట ఇదే నెలలో రూ.1,04,095 కోట్లుగా ప్రాప్తి పోర్టల్ పేర్కొంది. దీన్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, జమ్మూ–కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్లలోని డిస్కంలదే ఎక్కువ. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రూ.6,627.28 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. వీటిని వసూలు చేసి ఇప్పించాల్సిందిగా తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. జెన్కోల కోసం డిస్కంలకు రుణాలు గడువు ముగిసిన తరువాత డిస్కంలు బకాయిలను ఆలస్యంగా చెల్లించినందుకు జెన్కోలు జరిమానా వడ్డీని వసూలు చేస్తుంటాయి. కానీ కేంద్రం ఈ జరి మానా సర్‌చార్జీలను మాఫీచేసింది. దీర్ఘకాలిక రుణాల గడువును పదేళ్ల వరకు పెంచుతూ గత మే నె లలో ప్రభుత్వం రూ.90 వేల కోట్ల లిక్విడిటీ ఇన్ఫ్యూషన్ స్కీమ్ (ఎల్ఐఎస్)ను ప్రకటించింది. తద్వారా డిస్కంలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)ల నుంచి రుణాలు పొందాయి. ఆ తరువాత ఎల్ఐ ఎస్ ప్యాకేజీని రూ.1.35 లక్షల కోట్లకు పెంచారు. విద్యుత్ ఉత్పత్తి కంపెనీ (జెన్కో)లకు ఊరట కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల జెన్కోలకు కట్టాల్సిన బకాయిలు చెల్లిస్తారని ప్రభుత్వం భావించింది. -
నిరంతరాయంగా విద్యుత్
సీలేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): భవిష్యత్‌లో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. రాష్ట్రంలో మరిన్ని విద్యుత్ కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందని ఏపీ జెన్కో హైడల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన సీలేరు విద్యుత్ కాంప్లెక్సులో పలు జలవిద్యుత్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్‌కల్లా పోలవరం ప్రాజెక్టులో మూడు యూనిట్లు, 2024 జూలైలో మరో మూడు యూనిట్లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. 2026 జనవరి నాటికి అన్ని యూనిట్లను పూర్తిస్థాయిలో ప్రారంభించి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పారు. విండ్, సోలార్, హైడల్ విద్యుత్ ఉత్పత్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలోని 4 యూనిట్లలో 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా.. అదనంగా మరో 230 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. ఎత్తిపోతల పథకం ద్వారా కూడా సీలేరు కాంప్లెక్సులో 1,035 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. ఈ ప్రాజెక్టు కోసం సర్వేలు చేపట్టామన్నారు. ఇవి పూర్తయితే రాష్ట్రమంతటికీ నిరంతరాయంగా విద్యుత్ అందించగలుగుతామని చెప్పారు. డొంకరాయి పవర్ కెనాల్ మరమ్మతు పనులు 80 శాతం పూర్తయినట్టు చెప్పారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్ రాంబాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీజెన్కో ప్రాజెక్టులో పగిలిపోయిన ఈఎస్పీ హాపర్స్
ముత్తుకూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని శ్రీదామోదరం సంజీవయ్య ఏపీజెన్కో ప్రాజెక్టులో శుక్రవారం 2వ యూనిట్‌కి సంబంధించిన (ఈఎస్పీ) యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ హాపర్స్ పగిలిపోయాయి. 30 టన్నుల బూడిద సామర్థ్యం కలిగిన 2 హాపర్స్ హటాత్తుగా పగిలిపోవడంతో ప్రాజెక్టు అంతా ఫ్లైయాస్(బూడిద) వ్యాపించి, దట్టంగా పైకిలేచింది. ఇప్పటికే 1వ యూనిట్లో విద్యుదుత్పత్తి నిలిపివేయగా, ఈ ఘటనతో 2వ యూనిట్లో కూడా ఉత్పత్తి నిలిచిపోయింది. బూడిదతో నిండిపోయే ఈ ఇనుప రేకులతో తయారు చేసిన హాపర్స్ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి, బూడిదను తొలగించాల్సిన బాధ్యత ప్రత్యేకంగా ఒక కాంట్రాక్టు సంస్థ నిర్వహిస్తోంది. అయితే, కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం, యాష్ ప్లాంట్ ఇంజనీర్ల పర్యవేక్షణలోపం కారణంగా ఈ ఘటన జరిగింది. అయితే, ఈ హాపర్స్ నుంచి బూడిద సక్రమంగా వెలుపలకు రాకపోవడం వల్ల ఒత్తిడి పెరిగి, పగిలిపోయి ఉంటాయని మరో వాదన వినిపిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి జరిగే క్రమంలో నిత్యం వేల టన్నుల ఫ్లైయాస్ వెలుపలకు చేరుతుంది. ఈ క్రమంలో 2 హాపర్స్ నిండిపోయి, పగిలిపోవడం వల్ల ఈ ప్రాంతమంతా బూడిద అలుముకొంది. పూర్తిగా విద్యుదుత్పత్తి నిలిపివేశారు. దీంతో కిందపడే బూడిదను ట్రాక్టర్ల ద్వారా తొలగించే ప్రక్రియ చేపట్టారు. మండుటెండల్లో విద్యుచ్ఛక్తికి విపరీతమైన డిమాండ్ ఉన్న పరిస్థితిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో కార్మికులు, ఉద్యోగులు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం, ప్రాణనష్టం జరగలేదు. -
విభజన చట్టం అమలుకు ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలో పెండింగ్ అంశాలను పరిష్కరిస్తూ వాటి అమలుకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ప్రధానంగా రాష్ట్ర విభజన అనంతరం ఏపీ జెన్కో తెలంగాణ డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్‌కు చెల్లించాల్సిన బకాయిలు తెలంగాణ సర్కారు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ కార్యదర్శి అనురాధా ప్రసాద్ అధ్యక్షతన శనివారం తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ సమీర్ శర్మ, రాష్ట్ర పునర్విభజన విభాగం ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, జల వనరుల సలహాదారు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై ఏపీ చేసిన వినతికి స్టాండింగ్ కమిటీ సానుకూలంగా స్పందించింది. కేంద్రం ఆదేశాలతోనే పెండింగ్ అంశాలు పరిష్కారం అవుతాయని, లేదంటే ఎన్నేళ్లయినా అపరిష్కృతంగానే ఉంటాయని ఏపీ స్పష్టంచేసింది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించి ఏపీకి రూ.6,015 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఈ బకాయిలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. విభజన చట్టం ప్రకారం విద్యుత్ బకాయిలపై ఆదేశాలు జారీ చేసే అధికారం కేంద్రానికి ఉందని ఇటీవలే కేంద్ర న్యాయ శాఖ కూడా తెలిపింది. ఈ బకాయిలపై ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో గతంలో కేసు వేసింది. హైకోర్టులో కేసు ఉన్నందున కేంద్రం ఆదేశాలు ఎలా జారీ చేస్తుందని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కేసును ఉపసంహరించుకుంది. సమస్య పరిష్కారమయ్యేలా ఉన్నందున కేసు ఉపసంహరించుకుంటున్నామని, పరిష్కారం కాకపోతే మళ్లీ వస్తామని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టును కోరింది. కోర్టు కేసు కూడా లేనందున కేంద్రం వెంటనే విద్యుత్ బకాయిలపై ఆదేశాలు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనిపై స్టాండింగ్ కమిటీ సానుకూలంగా స్పందించింది. విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను నిలువరించాలని ఏపీ కోరింది. ఈ ప్రాజెక్టుల కారణంగా దిగువనున్న ఏపీకి కలిగే నష్టాన్ని వివరించింది. అలాగే విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ఏడు జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ, విభజన జరిగిన ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటును ప్రస్తావించింది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలు, న్యూఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. -
విద్యుత్ ఉద్యోగుల ‘పీఆర్సీ’ గడువు పెంపు
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పడ్డ పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) ఈ నెల 30 వరకూ వినతులు స్వీకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఆపరేషన్స్) సర్కిల్ కార్యాలయంలో ఫిబ్రవరి 15 నుంచి వినతులు స్వీకరించడం మొదలెట్టిన పీఆర్సీ.. తొలుత ఫిబ్రవరి నెలాఖరు వరకూ షెడ్యూల్ ఇవ్వగా, అనంతరం ఈ నెల 13 వరకూ గడువు పొడిగించుకుంటూ వచ్చింది. అయినప్పటికీ ఇంకా వినతులు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించి ఈ నెలాఖరు వరకూ అవకాశం కల్పిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీ ట్రాన్స్ కో, ఏపీ జెన్ కో, మూడు డిస్కంల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ యూనియన్ల నుంచి మంగళవారం నుంచి శుక్రవారం వరకూ రోజూ ఉదయం 11 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు నేరుగా స్వీకరిస్తారు. అయితే స్వయంగా వెళ్లి వినతులిచ్చే అవకాశం లేనివారి కోసం ఈ–మెయిల్ prc2022 powerutilities@gmail.com, వాట్సప్ నంబర్ 8500676988 సదుపాయాలను కూడా ఈసారి పీఆర్సీ అందుబాటులోకి తెచ్చింది. -
అదుపులోకి విద్యుత్ కొరత
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న తక్షణ చర్యలతో రాష్ట్రంలో విద్యుత్ కొరత అదుపులోకి వస్తోంది. గృహావసరాలకు ఎలాంటి కోతలు లేకుండా సంపూర్ణంగా నిరంతర విద్యుత్ సరఫరా అవుతోంది. వ్యవసాయానికి సైతం పగటిపూట 7 గంటల విద్యుత్ అందుతోంది. 11.40 మిలియన్ యూనిట్లు కొనుగోలు రాష్ట్రంలో మంగళవారం 226 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా.. ఏపీ జెన్కో, ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, జల, సౌర, పవన, గ్యాస్ ఆధారిత కేంద్రాల ద్వారా మొత్తం 197 మిలియన్ యూనిట్లు అందుబాటులో ఉంది. 29 మిలియన్ యూనిట్లు లోటు ఏర్పడటంతో బహిరంగ మార్కెట్ నుంచి డిస్కంలు 11.40 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేశాయి. వ్యవసాయ రంగానికి 7 గంటలు, గృహావసరాలకు నిరంతరాయంగా సరఫరా చేయడానికి పారిశ్రామిక రంగానికి 17.6 మిలియన్ యూనిట్ల మేర లోడ్ రిలీఫ్ అమలు చేసినట్లు ఇంధన శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పంటలు చాలా వరకూ కోతలు పూర్తవ్వడం, కొన్ని పంటలు చివరి దశలో ఉన్నందున వ్యవసాయావసరాలకు రోజుకి 7 గంటలు విద్యుత్ సరఫరా సరిపోతుందని, అయినప్పటికీ కొన్ని చోట్ల 9 గంటలు విద్యుత్ సరఫరా ఇస్తున్నామని తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మజనార్దనరెడ్డి, హెచ్.హరనాథరావు ‘సాక్షి’కి తెలిపారు. నెలాఖరుకు పరిశ్రమలకూ సంపూర్ణంగా.. ఈ నెల 8వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన పవర్ హాలిడేలో భాగంగా ఈ నెల 11 వరకూ పరిశ్రమలకు 72.04 మిలియన్ యూనిట్ల లోడ్ రిలీఫ్ ఇచ్చినట్లు ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పరిశ్రమలకు కూడా పూర్తిస్థాయి సరఫరా ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని, కొన్ని పరిశ్రమలకు ముందు, మిగతా వాటికి తరువాత దశల వారీగా నియంత్రణలు తొలగిస్తామని ఆయన వెల్లడించారు. -
కరెంట్ బకాయిలపై బాధ్యత తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన రూ.6 వేల కోట్లకుపైగా విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించేలా చొరవ తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. విభజన నష్టాలతోపాటు కోవిడ్ కారణంగా రాబడి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి బకాయిల వసూలు అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేసినందున బకాయిలు చెల్లించేలా బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్ నెలకొల్పాలని కోరారు. పన్నుల వాటాలో మినహాయించైనా.. ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.6,111 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించి నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థలను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను కోరింది. పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్షనేత పీవీ మిధున్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీల బృందం బుధవారం ఆర్కే సింగ్‌ను కలుసుకుని పలు అంశాలతో వినతిపత్రాన్ని సమర్పించింది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఆదేశాల మేరకు ఏపీ జెన్కో 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు తెలంగాణ డిస్కమ్‌లకు విద్యుత్ సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ఈ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ చెల్లించలేదని తెలిపారు. కేంద్ర విద్యుత్ శాఖ అధికారులతో గతేడాది నవంబర్ 8న తెలుగు రాష్ట్రాల అధికారుల చర్చల సందర్భంగా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించినా ఇంతవరకు కొలిక్కి రాలేదని తెలిపారు. తెలంగాణ వాటాగా కేంద్రం విడుదల చేసే పన్నుల ఆదాయం నుంచైనా మినహాయించి ఆంధ్రప్రదేశ్‌కు బకాయిలను చెల్లించాలని విజయసాయిరెడ్డి కోరారు. వినతిపత్రంలో ఇతర అంశాలు.. ► చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్బీపీపీఎల్ ప్లాంట్ కోసం కేవలం 5 ఎకరాలను మాత్రమే వినియోగిస్తోంది. వృథాగా ఉన్న మిగిలిన 748 ఎకరాలను ఎన్టీపీసీ – ఏపీఐఐసీ జాయింట్ వెంచర్‌తో పవర్ ఎక్విప్మెంట్ తయారీ కోసం మాన్యుఫాక్చరింగ్ జోన్‌గా మార్చాలి. ► కరువు నివారణకు రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 27 ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. రూ.12,500 కోట్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎస్పీవీ కింద ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులను ఒకే ప్రాజెక్టుగా పరిగణించి రుణ సదుపాయం కల్పించాలి. ఆక్వా రైతులకు బీమా కేంద్ర మత్స్యశాఖ మంత్రికి వైఎస్సార్సీపీ ఎంపీల వినతి పెద్దఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ఆక్వా రైతులకు బీమా పాలసీ అమలు చేయాలని వైఎస్సార్ సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆక్వా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని, కేంద్రం మద్దతిస్తే మెరుగైన తోడ్పాటు అందించవచ్చని నివేదించారు. ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుభరోసా కేంద్రాల ద్వారా ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. సీడ్, ఫీడ్ అందజేయడంతోపాటు మెరుగైన గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు వివరించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలాను కలుసుకుని ఈమేరకు పది అంశాలపై వినతిపత్రాన్ని అందజే సింది. ఎంపీలు మోపిదేవి వెంకటరమణరావు, గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్, వంగా గీత వీరిలో ఉన్నారు. దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. విజయనగరం జిల్లా చింతపల్లి, విశాఖపట్నం జిల్లా భీమిలి, రాజయ్యపేటల్లో రూ.75 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద కేంద్రం అనుమతించిందన్నారు. నెల్లూరు జిల్లా తడ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులు పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. తరచూ ఘర్షణలు చోటు చేసుకోవడం, పరస్పరం కేసులు నమోదు కావడంతో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిపారు. దీన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు పులికాట్ సరస్సులో ఇసుకమేట డ్రెడ్జింగ్‌కు రూ.45 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. నిధులు వెంటనే విడుదల చేయాలని కోరగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. వినతిపత్రంలో ఇతర ముఖ్యాంశాలివీ.. ► సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్వా కల్చర్ అథారిటీ ప్రాంతీయ కార్యాలయానికి కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో భూమి కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ► ఆక్వా రంగం ఆర్జించే విదేశీ మారక ద్రవ్యంలో రూ.15,600 కోట్ల వాటా ఏపీదే. ► ఆక్వా రంగానికి పవర్ టారిఫ్ తోడ్పాటు ఇవ్వాలి. ► రూ.40 కోట్లతో విశాఖ జిల్లా బండారుపల్లిలో ఆక్వా క్వారంటైన్ సెంటర్‌కు సవరించిన అంచనాలతో కేంద్రం గ్రాంటు మంజూరు చేయాలి. ► విశాఖలో నౌకాదళ విన్యాసాల సమయంలో జీవనోపాధికి ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు రూ.10 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ► బుడగట్లపాలెం, చింతపల్లి, ముక్కాం గ్రామాల్లో జెట్టీలు ఏర్పాటు చేయాలి. -
పుష్కలంగా విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ పుష్కలంగా అందుబాటులో ఉందని, మూడు రోజులుగా ఎటువంటి విద్యుత్ కోతలు లేవని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. శనివారం ఆయన ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్‌తో కలిసి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ను రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు 6,663 ఫీడర్ల ద్వారా అందిస్తున్నామని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల ఎక్కడైనా కొద్ది సేపు అంతరాయం ఏర్పడితే ఆ సమయాన్ని అదే రోజు సర్ధుబాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.9,717 కోట్లు సబ్సిడీ రూపంలో విడుదల చేసిందన్నారు. ఏడాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తామని, తొలుత శ్రీకాకుళంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. కోతలు లేకుండా చూస్తున్నాం ► పరిశ్రమలకు, గృహ, వాణిజ్య అవసరాలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చవక ధరలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. 2020లో 4,36,837 అంతరాయాలుంటే 2021లో వాటిని 2,02,496కు తగ్గించాం. ► రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 204 మిలియన్ యూనిట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో 198 యూనిట్లు ఉండింది. ప్రస్తుత డిమాండ్‌లో 170 మిలియన్ యూనిట్ల వరకు ఏపీజెన్కో, కేంద్ర విద్యుత్ సంస్థలైన ఎన్టీపీసీ, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్, న్యుక్లియర్ పవర్ ప్లాంట్స్, ప్రైవేటు పవర్ ప్లాంట్లతో ఉన్న దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా వస్తోంది. ► మిగతా 34 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను బహిరంగ మార్కెట్ నుంచి రోజు, వారం, నెల వారీ బిడ్డింగ్‌ల ద్వారా తీసుకుంటున్నాం. ఈ మూడు మాసాల్లో మాత్రమే అదనపు డిమాండ్ ఉంటుంది. దీనికోసం దీర్ఘకాలిక ఒప్పందాలు అవసరం లేదు. ► 700 నుండి 2000 మెగావాట్ల వరకు ప్రతి పావుగంటకు మార్కెట్లో ఆక్షన్ ద్వారా అన్ని రాష్ట్రాలతో పాటు మనం కూడా పాల్గొని నిర్ధారణ అయిన రేట్ల ప్రకారం కొనుగోలు చేస్తున్నాం. విద్యుత్ వినియోగించే సమయాలను బట్టి రేట్లలో మార్పులు ఉంటాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుని రైతుల పంపు సెట్లకు, గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. ► విద్యుత్ కొనుగోలు చెల్లింపులకు సంబంధించి గత ఏడాది నుంచి కేంద్రం నిబంధనలను కఠిన తరం చేసినందున అడ్వాన్సుగా చెల్సించాల్సి వస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండేళ్ల నుండి పెద్ద ఎత్తున నిధులను విద్యుత్ అవసరాలకు కేటాయిస్తోంది. ఎన్టీపీసీ విషయంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ సమస్య ఉత్పన్నమైతే రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ ఆ సమస్యను పరిష్కరించాయి. ► ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈఓ ఎ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. బొగ్గు సమస్య లేదు ఏపీ జెన్కోకు సంబంధించి విజయవాడ, కృష్ణపట్నం, రాయసీమలో మూడు థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 5,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందులోని మొత్తం 15 యూనిట్లు ఫంక్షనింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 80 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందుకోసం రోజుకు 60 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగించాల్సి ఉంటుంది. బొగ్గు సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. – బి.శ్రీధర్, ఏపీ జెన్కో ఎండీ -
జెన్కోకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్కో)ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల ఉద్యోగులకు ఈ నెల జీతాల చెల్లింపు ఆలస్యం అయినప్పటికీ మంగళవారం అందరికీ చెల్లించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చెల్లింపుల వివరాలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పుడిలా.. 2019–20 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ విభాగాల విద్యుత్ బిల్లులు, వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన సబ్సిడీ కలిపి మొత్తం రూ.12,388.93 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.16,849.27 కోట్లు అందాయి. 2020–21లో రూ.15,299.67 కోట్లు రావాల్సి ఉండగా రూ.12,989.81 కోట్లు ఇచ్చింది. 2021–22లో జనవరి నాటికి రూ.12,632.78 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.11,947.76 కోట్లు జమచేసింది. అప్పుడలా.. గత ప్రభుత్వ హయాంలో 2014–15లో రూ.4,099.60 కోట్లు కట్టాల్సి వస్తే రూ.3,953.52 కోట్లు, 2015–16లో రూ.5,302.54 కోట్లకు రూ.4589.96 కోట్లు ఇచ్చారు. 2016–17 నుంచి చెల్లింపులు తగ్గిస్తూ వచ్చారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.6,176 కోట్లకుగాను రూ.4,022.57 కోట్లు, 2017–18లో రూ.6,578.81 కోట్లకుగాను రూ.4,141.96 కోట్లు, 2018–19లో రూ.9,641 కోట్లకుగాను రూ.3,458.85 కోట్లు ఇచ్చారు. దీంతో పాత బకాయిలే చాలావరకు మిగిలిపోయాయి. వాటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తోంది. జెన్కో నుంచి రోజుకు 57 మిలియన్ యూనిట్లు ఏపీ జెన్కో నుంచి రాష్ట్రానికి 2014–15లో 16,285.4 మిలియన్ యూనిట్లు (ఎంయూ), 2015–16లో 22,044.4 ఎంయూల విద్యుత్ వినియోగించారు. 2016–17లో 24,728.8 ఎంయూ, 2017–18లో 20,562 ఎంయూ, 2018–19లో 22,362.2 ఎంయూ, 2019–20లో 22,470 మిలియన్ యూనిట్లు, 2020–21లో 16,430 ఎంయూ, 2021–22 జనవరి నాటికి 17,539.4 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను జెన్కో నుంచి తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో రోజుకి సగటున 57.3 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఏపీజెన్కో అందిస్తోంది. -
విద్యుత్ ఉద్యోగులకు ‘పీఆర్సీ’ ఏర్పాటు
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల ఉద్యోగుల కోసం వేతన సవరణ సంఘాన్ని(పీఆర్సీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర విద్యుత్ బోర్డు(ఏపీఎస్ఈబీ) కింద నియమితులై ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కోలలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలను సవరించేందుకు గానూ అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
మీరే ఇప్పించి.. తీసేసుకోండి!
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకున్న విద్యుత్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన రూ.6,283.68 కోట్ల బకాయిలను ఇప్పించాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇంధన శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ సమస్యలపై శనివారం నివేదిక ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర డిస్కంలు పొందుతున్న ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం రుణం కింద ఏపీ జెన్కో బకాయిలు జమ చేయాలని రాష్ట్రం కోరనుంది. ఈ పథకం ద్వారా కేంద్రం రాష్ట్రాలకు రుణాలిస్తుంటుంది. ఏపీకి సంబంధించిన రుణ బకాయిలను తెలంగాణ నుంచి తీసుకోవాలని ప్రధానంగా విజ్ఞప్తి చేయనుంది. నాడు ఆదుకున్న ఏపీ: ఏపీ విభజన సమయంలో డిమాండ్‌కు సరిపడా తెలంగాణలో విద్యుదుత్పత్తి లేకపోవడంతో ఏపీజెన్కో తెలంగాణ డిస్కంలకు 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు సరఫరా చేసింది. ఆ కాలంలో సరఫరా చేసిన విద్యుత్ ఖర్చు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, రూ.3,441.78 కోట్లు, ఆలస్యమైనందుకు సర్‌చార్జి రూ.2,841.90 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు తెలంగాణ చెల్లించలేదు. ప్రస్తుతం ఏపీ జెన్కో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తెలంగాణ బకాయిలు రాకపోవడంతో.. ఏపీ జెన్కో జూన్ 2021లో విద్యుత్ ఆర్థిక సంస్థ, గ్రామీణ విద్యుదీకరణ సంస్థలకు రూ.1700 కోట్ల రుణ వాయిదాలను గడువులోగా తీర్చలేకపోయింది. జూలై, ఆగస్టులో చెల్లించాల్సిన మరో రూ.1,020 కోట్లు చెల్లించలేదు. అంగీకరించారు గానీ..: వాస్తవానికి 2019 ఆగస్టు 19న ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థల మధ్య జరిగిన సమావేశంలోనూ, 2020 జనవరి 30న ఏపీ, తెలంగాణ సీఎస్ల సమావేశంలోనూ తెలంగాణ, ఏపీలు కలిసి ఈ బకాయిల చెల్లింపుపై వివిధ సందర్భాల్లో చర్చించాయి. తెలంగాణ డిస్కంలు ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించాయి. కానీ డబ్బులు ఇవ్వలేదు. కేంద్రం ఆదేశాలివ్వడం వల్లనే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినందున ఆ బకాయిలను ఆత్మనిర్భర్ పథకం ద్వారా రాష్ట్రానికి ఇప్పించి, వాటిని ఆర్ఈసీ, పీఎఫ్‌సీల రుణాలకు జమచేసుకోవాలనే ప్రతిపాదనను అమిత్ షా ముందుంచాలని రాష్ట్రం భావిస్తోంది. -
Andhra Pradesh: ఫుల్‌గా ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నేపథ్యంలో రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో కరెంట్ పరిస్థితులతో పాటు బొగ్గు సరఫరా, విద్యుత్ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీధర్ సహా పలువురు అధికారులతో దీనికి హాజరయ్యారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సింగరేణి సహా కోల్ ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. బొగ్గు తెప్పించేందుకు సరుకు రవాణా ఓడల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచన చేయాలని, దీనివల్ల రవాణా ఖర్చులు కలసి వస్తాయన్నారు. అవసరమైతే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాలని సూచించారు. దీనికోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా.. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుదుత్పత్తి వ్యూహాలపైనా దృష్టి సారించాలని సీఎం జగన్ ఆదేశించారు. 6,300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, ఇలాంటి ప్రాజెక్టుల వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. సీలేరులో ప్రతిపాదిత 1,350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలన్నారు. ఈ ప్రాజెక్టులు సాకారమయ్యేలా వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. నాన్ పీక్ అవర్స్‌లో నీటిని వెనక్కి పంపేందుకు (రివర్స్ పంపింగ్) సౌర విద్యుత్ వాడుకుని అనంతరం ఆ నీటినే వినియోగించి విద్యుదుత్పత్తి చేసే ప్రతిపాదిత ప్రాజెక్టు తొలిదశలో 6,300 మెగావాట్ల ఉత్పత్తికి డీపీఆర్‌లు ఇప్పటికే తయారయ్యాయి. సోలార్‌తో రివర్స్ పంపింగ్‌కు యూనిట్ రూ.2.49 దాకా ఖర్చు కానుంది. అనంతరం డిమాండ్, అవసరాన్ని బట్టి పీక్ అవర్స్‌లో అదే నీటితో జలవిద్యుదుత్పత్తి చేస్తారు. దీనికి రూ.3 వరకు వ్యయం అవుతుంది. దీన్ని పీకింగ్ ప్లాంట్ అని వ్యవహరిస్తారు. పీక్ అవర్స్‌లో డిమాండ్ అధికంగా ఉండటంతో విద్యుత్తు కొనుగోలుకు యూనిట్‌కు రూ.10 నుంచి రూ.12 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితి లేకుండా రివర్స్ పంపింగ్ వల్ల అవసరాన్ని బట్టి చౌకగా విద్యుదుత్పత్తి చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. అవాంతరాలు లేకుండా సరఫరా రాష్ట్రంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ తగిన చర్యలతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి 2 ర్యాక్‌ల బొగ్గు అదనంగా వచ్చిందని, రాష్ట్రంలో జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుదుత్పత్తిని 50 మిలియన్ యూనిట్ల నుంచి 69 మిలియన్ యూనిట్లకు పెంచామని అధికారులు తెలిపారు. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి 170 మెగావాట్ల విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తోందని చెప్పారు. -
AP: కరెంట్ కోతలంటూ కట్టుకథలు
సాక్షి, అమరావతి: అదిగో పులి.. ఇదిగో తోక లాంటి బెదిరింపులు, కట్టు కథలతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థపై వదంతులు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, కోవిడ్ ప్రభావం తగ్గి పారిశ్రామిక విద్యుత్ వినియోగం పెరగడం, డిమాండ్ – సరఫరాలో వ్యత్యాసం తదితర పరిణామాలతో దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం ఏర్పడే పరిస్థితులను ముందుగానే గమనించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 8వతేదీన ప్రధాని మోదీకి లేఖ రాయడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత దృష్ట్యా విద్యుత్తు సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణమే స్పందించాలని కోరారు. ఏపీలోని 2,300 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన గ్యాస్ ఆధారిత ప్లాంట్లకు ఓఎన్జీసీ, రిలయన్స్ నుంచి అత్యవసరంగా గ్యాస్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో పరిస్థితిని ఊహించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, బొగ్గు కొనుగోలుకు అత్యవసర నిధులను వెచ్చించడం, ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బొగ్గు సంక్షోభం ఏర్పడలేదు. కానీ దసరా తరువాత రాష్ట్రవ్యాప్తంగా భారీగా విద్యుత్ కోతలుంటాయని, ముఖ్యంగా రాత్రి వేళ గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో గంటల తరబడి చీకట్లు తప్పవంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. శనివారం ఉదయం నుంచి ఈ తరహా వదంతులతో రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేసే ప్రయత్నాలు జరిగాయి. రాత్రి సమయంలో విజయవాడ ఇలా.. లోటు.. లేదు విద్యుత్ కోతలంటూ జోరుగా జరుగుతున్న ప్రచారంపై స్పందించిన విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు, డిస్కమ్‌ల సీఎండీలు అది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈనెల 10వతేదీ నుంచి 14 వరకు విద్యుత్ లోటు సగటున రోజుకు 1.22 మిలియన్ యూనిట్ల కంటే తక్కువగానే ఉంది. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో విద్యుత్ లోటు మన దగ్గర కంటే ఎక్కువగా ఉంది. అక్టోబర్ 14న ఏపీలో 0.76 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండగా మరుసటి రోజు నాటికి అది కూడా పోయి లోటు పూర్తిగా జీరో అయ్యింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా డిస్కమ్ పూర్తి స్థాయిలో విద్యుత్ పంపిణీ చేయగలుగుతున్నాయి. రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని విద్యుత్ శాఖ హామీ ఇచ్చింది. కోతలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. విద్యుత్ సరఫరాపై తప్పుడు వార్తలను నమ్మవద్దని వినియోగదారులకు ఇంధనశాఖ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర అత్యవసర నిధులతో తీరుతున్న బొగ్గు కొరత ఇంధనశాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం బొగ్గు కొనుగోలు కోసం ఏపీ జెన్కోకు రూ.250 కోట్ల మేర అత్యవసర నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. దీంతో థర్మల్ విద్యుదుత్పత్తి మెరుగు పరచేందుకు రాష్ట్రానికి అదనంగా ఎనిమిది బొగ్గు రైళ్లు తరలి వస్తున్నాయి. వీటీపీఎస్‌లో 13,097 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉండగా శనివారం 29,806 మెట్రిక్ టన్నులు వచ్చింది. దీనిలో 25,410 మెట్రిక్ టన్నులు వినియోగించగా ఇంకా 17,493 మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నాయి. ఆర్టీపీఎస్లో 70,411 మెట్రిక్ టన్నుల బొగ్గుకు అదనంగా 19,457 మెట్రిక్ టన్నులు తెప్పించారు. ఇందులో 12,925 మెట్రిక్ టన్నులు వినియోగించగా ఇంకా 76,943 మెట్రిక్ టన్నులు ఉంది. కృష్ణపట్నంలో 68,459 మెట్రిక్ టన్నులు ఉండగా 8,533 మెట్రిక్ టన్నులు వినియోగించారు. ఇంకా 59,926 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. ఈ నిల్వలతో మరో మూడు నాలుగు రోజుల పాటు విద్యుదుత్పత్తి చేయవచ్చు. దీనికితోడు వచ్చే ఏడాది జూన్ వరకూ 400 మెగావాట్ల విద్యుత్ ఇవ్వాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మరోవైపు బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు శుక్రవారం రూ.20 నుంచి రూ.6.11కి పడిపోవడం గమనార్హం. ఇది మరింత తగ్గే అవకాశం కూడా ఉంది. సాధారంగా యూనిట్ రూ.4 నుంచి రూ.5కు లభించే విద్యుత్ ఈ నెల 8వతేదీ తరువాత రూ.15 – రూ.20 వరకూ పెరిగినా తాజాగా తగ్గుముఖం పట్టింది. ఆర్టీపీఎస్, కృష్ణపట్నంలో 800 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభం ఏపీ జెన్కో యూనిట్లను పూర్తి సామర్థ్యంతో నిర్వహించాలని, థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలను మెరుగుపరచాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఇంధనశాఖను ఆదేశించారు. థర్మల్ ప్లాంట్లలోని కొత్త యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి రాష్ట్రానికి 1,600 మెగావాట్లు అందుబాటులోకి తెచ్చేలా తక్షణం చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రానికి బొగ్గు సరఫరాను మెరుగుపరచడానికి సింగరేణి, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో చర్చించి సమన్వయం చేసుకోవాలని నిర్దేశించారు. ముఖ్యమంత్రి జగన్ సూచనల మేరకు రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లలో ఈనెల 15న అధికారులు 800 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. నిరంతర పర్యవేక్షణ విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ నిరంతరం విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. నగరాల నుంచి గ్రామ స్థాయి వరకు విద్యుత్ సరఫరాను సమీక్షిస్తూ అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి సీఎండీ స్థాయి వరకూ అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ క్రమంలో డిస్కమ్‌ల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మజనార్ధనరెడ్డి, కె.సంతోష్‌రావు, డైరెక్టర్/గ్రిడ్ – ట్రాన్స్మిషన్, కె.ప్రవీణ్‌కుమార్, సీఈ/గ్రిడ్, ఏవీ భాస్కర్లతో ఇంధన శాఖ కార్యదర్శి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈవో ఏ.చంద్రశేఖరరెడ్డి ఆ వివరాలను వెల్లడించారు. సీఎం సూచనల ప్రకారం.. రాష్ట్రంలో నిత్యం 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా గత 16 రోజులుగా సగటున రోజుకు ఒక మిలియన్ యూనిట్ కంటే తక్కువగానే లోటు ఉందని ఇంధన శాఖ కార్యదర్శి తెలిపారు. పదహారు రోజులకు కేవలం పది మిలియన్ యూనిట్లు మాత్రమే లోటు నమోదైందన్నారు. దీంతో లోడ్ రిలీఫ్‌లు చాలా తక్కువగానే విధించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత, పవర్ యుటిలిటీల అద్భుత పనితీరుతో నాణ్యమైన సరఫరా జరుగుతోందన్నారు. బొగ్గు కొరతను అధిగమించి నాణ్యమైన విద్యుత్ సరఫరా కొనసాగేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సీఎం సూచనల ప్రకారం తగిన చర్యలు చేపట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎలాంటి విద్యుత్ కోతలను ఎదుర్కోవడం లేదని, రాబోయే రోజుల్లో కూడా కోతలు ఉండవని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల వినియోగదారులకు రోజంతా నాణ్యమైన విద్యుత్ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా గణనీయంగా పెరిగినట్లు ఏపీ జెన్కో ఎండీ శ్రీధర్ వివరించారు. నమ్మొద్దు.. మేమే చెబుతాం –విద్యుత్ పంపిణీ సంస్థలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) వినియోగదారులకు విజ్ఞప్తి చేశాయి. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం వల్ల సరఫరాలో అంతరాయాలు, కోతలు లేవని స్పష్టం చేశాయి. విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఎలాంటి సమాచారానైన్నా సామాజిక మాధ్యమాల ద్వారా కాకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వినియోగదారులకు అధికారికంగా తెలియచేస్తామని ప్రకటించాయి. -
కరెంటు సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు
సాక్షి, అమరావతి: బొగ్గు కొరత నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే అనధికారిక కరెంటు కోతలు మొదలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో బ్లాక్ అవుట్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మహారాష్ట్ర, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని థర్మల్ విద్యుత్తు కేంద్రాలను షట్‌డౌన్ చేశారు. నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదిక ప్రకారం.. దేశంలో 116 థర్మల్ విద్యుత్ కేంద్రాలకుగాను 18 కేంద్రాల్లో బొగ్గు లేదు. మిగతా వాటిలో బొగ్గు నిల్వలు ఒక రోజు నుంచి వారం రోజులకు మాత్రమే సరిపోతాయి. ఫలితంగా 15 రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఏర్పడింది. ఈ నేపథ్యంలో బొగ్గు సంక్షోభాన్ని అధిగమించి, వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా కరెంటు సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బొగ్గు కొరత తీర్చే విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని, విద్యుత్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని దేశంలో అందరికంటే ముందు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రానికి బొగ్గు సరఫరా కొంత మెరుగైంది. ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్లకు సెప్టెంబర్‌లో సగటున రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం కాగా 24 వేల టన్నుల వంతున సరఫరా అయింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో ఇటీవల అది 40 వేల టన్నులకు పెరిగింది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 20 బొగ్గు రేక్‌లను కేటాయించేలా బొగ్గు, రైల్వే శాఖలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడానికి అవసరమైన ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్తు సంస్థలు చేస్తున్నాయి. అలాగే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లు, బొగ్గు అనుసంధానం లేకుండానే అత్యవసర ప్రాతిపదికన నిలిచిపోయిన, పనిచేయని పిట్ హెడ్ బొగ్గు గనులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. బాగా పెరిగిన విద్యుత్ డిమాండ్ దేశవ్యాప్తంగా బొగ్గు కొరతతో విద్యుత్ డిమాండ్, సరఫరాల మధ్య తేడా భారీగా పెరిగింది. రాష్ట్రంలో 5,010 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉన్న ఏపీ జెన్కో ప్రస్తుతం 2,300 నుంచి 2,500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. బొగ్గు కొరత కారణంగా ఆర్టీటీపీఎస్కి చెందిన కొన్ని యూనిట్లు షట్‌డౌన్ చేశారు. కృష్ణపట్నం, ఎన్టీటీపీఎస్ కూడా వాటి సామర్థ్యం కంటే తక్కువగానే విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. ఇటీవల విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది. ఈ నెలలో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ రోజుకు 190 మిలియన్ యూనిట్లకు చేరింది. బుధవారం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 185 మిలియన్ యూనిట్లు ఉంది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈనెలలో రోజుకు సగటున 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఎక్కువ వినియోగం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం బయట నుంచి యూనిట్‌కు రూ.14 నుంచి రూ.20 వరకు వెచ్చించి కొనుగోలు చేసి సరఫరా చేస్తోంది. సాధారణంగా యూనిట్ రూ.4 నుంచి రూ.5కు లభించే విద్యుత్ ధర భారీగా పెరిగినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. -
బొగ్గు.. భగ్గు!
సాక్షి, అమరావతి, సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేని వర్షాలు.. ఉత్పత్తి, సరఫరాలో అంతరాయాలు, కరోనా నుంచి కోలుకుని పరిశ్రమల్లో వినియోగం పెరగడం, వ్యవసాయ సీజన్ కావడం, విదేశీ బొగ్గు ధరలు ఎగబాకడంతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని బొగ్గుకు దేశవ్యాప్తంగా తీవ్ర కొరత ఏర్పడింది. కొరత కారణంగా పలు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల్లోనూ బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. థర్మల్ కేంద్రాల్లో బొగ్గు సంక్షోభంతో సోమవారం నాటికి దేశంలోని దాదాపు 13 రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ కోతలు అనివార్యమవుతున్నాయి. అంతర్జాతీయ, దేశీయ విపణిలో బొగ్గు కొరత తీరే వరకు మరికొన్ని రోజుల పాటు కోతలు కొనసాగే అవకా>శాలున్నాయి. జాతీయ స్థాయిలో గ్రిడ్ నిర్వహణను నియంత్రించే ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్’(పోసోకో) నివేదికలను విశ్లేషిస్తే వారం పది రోజులుగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యాణా, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కోతలు తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. బిహార్, ఝార్ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం రోజుకు 8 – 7 గంటలకు మించి విద్యుత్ సరఫరా ఉండడం లేదని జాతీయ మీడియా పేర్కొంటోంది. దక్షిణాదిన కేరళలో విద్యుత్ కొరత గణనీయంగా ఉండగా కర్ణాటక, ఏపీలో స్వల్పంగా కొరత నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. చైనా లాంటి దేశాలు కూడా బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ కోతలతో చైనాలోని పరిశ్రమలు అల్లాడుతున్నాయి. మన దేశంలోనూ విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరిగింది. మరోవైపు గత ఏడాది కాలంలో విదేశీ బొగ్గు ధరలు దాదాపు రెట్టింపు కావడంతో బొగ్గు దిగుమతులపై ఆధారపడ్డ థర్మల్ ప్లాంట్లపై ఆర్థిక భారం పెరిగిపోయింది. దీంతో దేశీయ కోల్ ఇండియా, సింగరేణి బొగ్గుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. వీటి నుంచి సరఫరాను క్రమంగా పెంచడం ద్వారా సంక్షోభాన్ని అధిగమిస్తామని కేంద్రం పేర్కొంటోంది. రోజూ 80 – 110 ఎంయూల కొరత దేశంలో ఈ ఏడాది తలెత్తిన కొరతలో ప్రస్తుత అక్టోబర్ నెల తొలి వారం రోజుల్లోనే ఏకంగా 11.2 శాతం కొరత నమోదు కావడం గమనార్హం. గతేడాది అక్టోబర్ తొలి వారంలో తలెత్తిన కొరతతో పోల్చితే ఇప్పుడు ఈ నెల తొలివారంలో 21 రెట్లు పెరిగినట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత వారం రోజులుగా దేశంలో సగటున రోజుకు 3,880 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వినియోగం ఉండగా 80 – 110 ఎంయూల వరకు కొరత నెలకొంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) తాజా నివేదిక ప్రకారం దేశంలోని 1,65,066 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సగటున కేవలం నాలుగు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా విద్యుత్ ప్లాంట్లలో 15 – 30 రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సినా 115 విద్యుత్ కేంద్రాల్లో ఆరు రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయి. బొగ్గు కొరత నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు స్థాపిత సామర్థ్యం కన్నా తక్కువ సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇదీ పరిస్థితి.. ఏపీలో 8,075 మెగావాట్ల ఉత్పత్తి కోసం సౌర, పవన విద్యుత్ వనరుల మీద ఆధారపడాల్సి వస్తోంది. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వీటి నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగటం లేదు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కెపాసిటీ 5,010 మెగావాట్లు కాగా వీటికి అవసరమైన బొగ్గు సమకూర్చేందుకు కోల్ ఇండియా, సింగరేణి సంస్థలతో పాటు విదేశాల నుంచి దిగుమతులే ఆధారం. జెన్కో బొగ్గు ప్లాంట్లకు రోజుకు ఇంచుమించు 70,000 టన్నుల బొగ్గు అవసరం కాగా సెప్టెంబరు చివరిలో 24,000 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ప్రస్తుతం రోజుకు 40,000 టన్నులకు పెరిగింది. దొరకని గ్యాస్ రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 908 మెగావాట్లు ఉన్నప్పటికీ కేవలం 100 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయటానికి మాత్రమే గ్యాస్ అందుబాటులో ఉంది. గ్యాస్ ప్లాంట్ల నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయటానికి గ్యాస్ లభ్యత లేదు. రాష్ట్రంలోని డిస్కంలలో 63,070 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా బొగ్గు, జల, పవన విద్యుత్, సౌర విద్యుత్ అన్ని కలిపి 50 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే లభ్యం అవుతోంది. బొగ్గు సంక్షోభం లేకుంటే.. రాష్ట్రంలో 20130 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా 1600 మెగావాట్లు కృష్ణపట్నం నుంచి, 600 మెగావాట్లు ఆర్టీపీపీ నుంచి, 1,040 మెగావాట్లు హెచ్‌ఎన్‌పీసీఎల్ నుంచి, 400 మెగావాట్లు కేఎస్కే నుంచి, 7,000 మెగావాట్లు సౌర పవన ఇతర విద్యుత్ వనరుల నుంచి లభ్యమవుతోంది. బొగ్గు సంక్షోభం లేకుంటే ఈ విద్యుత్ ఉత్పత్తి వనరులు రాష్ట్ర అవసరాలను తీర్చగలుగుతాయి. నిజానికి రాష్ట్రంలో 2018 అక్టోబర్‌లో కూడా బొగ్గు కొరత సంక్షోభం ఏర్పడింది. అప్పుడు రాష్ట్రంలో కొన్ని చోట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో డిస్కంలు బయట నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో జెన్కో కేంద్రాల చర వ్యయం కంటే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడం కోసం మార్కెట్ వేలం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో పీక్ అవర్స్‌లో మాత్రమే ‘రాష్ట్రంలో ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో విద్యుత్ కోతలు విధించడం లేదు. నిర్వహణ కోసం మాత్రమే అక్కడక్కడా సరఫరా ఆపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పీక్ అవర్స్‌లో కొంత వరకూ పవర్ కట్స్ ఉంటున్నాయి. అది కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఒకటి రెండు గంటలు మాత్రమే’ – నాగులపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి తెలంగాణాలో పరిస్థితి భిన్నం తెలంగాణలో సహజసిద్ధంగా బొగ్గు గనులు ఉండటం వల్ల అక్కడ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం తమ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందువల్ల సింగరేణి గనుల నుంచి ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా జరగటం లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీవ్ర బొగ్గు కొరత ఎదుర్కొంటున్నప్పటికీ తెలంగాణలో మాత్రమే 5 నుంచి 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండటానికి ఇదే కారణం. -
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయకపోతే కృష్ణా జలాలు వృథా
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరడం, 1.08 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తున్న నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో గేట్లు ఎత్తేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయకపోతే.. కృష్ణా జలాలను వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొంది. అందువల్లే శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో తక్షణమే విద్యుదుత్పత్తి ప్రారంభించాలని ఏపీ జెన్కో (విద్యుదుత్పత్తి సంస్థ)ను కోరామని వివరిస్తూ మంగళవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురేకు ఈఎన్సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. శ్రీశైలం కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తికి అనుమతి ఇవ్వాలని సోమవారం లేఖ రాసిన అంశాన్ని గుర్తుచేశారు. తాజాగా రాసిన లేఖలో ప్రధానాంశాలు.. ► మంగళవారం ఉదయం 11 గంటలకు శ్రీశైలంలో 882.4 అడుగుల్లో 201 టీఎంసీల నీరు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. పూర్తి నీటినిల్వ 215.807 టీఎంసీలు. ► శ్రీశైలంలోకి 1.08 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. వరద ఉద్ధృతి నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ► శ్రీశైలం గేట్లు ఎత్తేయడం వల్ల కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తాయి. ఈ నేపథ్యంలో తక్షణమే విద్యుదుత్పత్తిని ప్రారంభించి.. వరద నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ జెన్కోకు విజ్ఞప్తి చేశాం. -
AP Genco: ‘జెన్కో’కు జవసత్వాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజావసరాలకు సంబంధించిన అంశాల్లో గత ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు పెద్దపీట వేస్తే.. ప్రస్తుత సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలకే అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కోకు ఊతమిస్తోంది. 2021–22లో సింహభాగం విద్యుత్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సంస్థ ఏపీ జెన్కోను మరింత బలోపేతం చేయాలని నిర్ధేశించింది. ఈ దిశగానే ఏపీ విద్యుత్ సంస్థలు ఇటీవల రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి నివేదికలను సమర్పించాయి. చౌక విద్యుత్ తీసుకోవడంతోపాటు కొన్నేళ్లుగా చిక్కి శల్యమైన ఏపీ జెన్కోకు ఊపిరి పోయాలని నిర్ణయించాయి. చరిత్రను తిరగరాస్తూ.. 2019 వరకూ ఏపీ జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి ఏటా సగానికి సగం తగ్గింది. కొన్ని ప్రైవేట్ సంస్థల జేబులు నింపేందుకు జెన్కో ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగా తగ్గించారనే విమర్శలున్నాయి. ఈ చరిత్రను తిరగరాస్తూ.. 2021–22 సంవత్సరంలో జెన్కో, కేంద్ర విద్యుత్‌కే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ ఏడాది రాష్ట్రంలో 68,368.43 మిలియన్ యూనిట్ల (ఎం.యూల) విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 71,380.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. అనుకోని పరిస్థితులు వస్తే అధిగమించేందుకు మిగులు విద్యుత్‌నూ సిద్ధంగా ఉంచేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌లో ఏపీ జెన్కోకు చెందిన బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్ల నుంచి 36,475.56 ఎంయూలు, జల విద్యుత్ ప్లాంట్ల నుంచి 2,796.91 ఎంయూలు తీసుకోవాలని నిర్ణయించింది. ఏపీ జెన్కో వాటా ఉన్న అంతర్ రాష్ట్ర జల విద్యుత్ ప్లాంట్ల నుంచి మరో 415.77 ఎంయూలు తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. మొత్తంగా ఏపీ జెన్కో నుంచి 2021–22లో 39,688.24 ఎంయూలు విద్యుత్ తీసుకోబోతోంది. దీంతోపాటు 13,495.85 ఎంయూలను కేంద్రం నుంచి తీసుకుంటుంది. అంటే.. కేంద్ర, రాష్ట్ర విద్యుత్ కలిపి 53,184.09 ఎంయూలు ఉంటుంది. ఇక ప్రైవేట్ విద్యుత్ వాటాను కేవలం 16,196.86 ఎంయూలకు పరిమితం చేశారు. ఇది కూడా గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వల్ల విధిలేని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తోంది. ప్రైవేటు విద్యుత్‌కు దీటుగా.. రూపొందించిన ప్రణాళికలో ఏ నెలలోనూ విద్యుత్ సరఫరాకు ఢోకా ఉండదని ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ చెప్పారు. -
జూన్ 5 వరకు సీలేరులో విద్యుదుత్పత్తి బంద్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల నేపథ్యంలో సీలేరులో జూన్ 5వ తేదీ వరకు జలవిద్యుదుత్పత్తిని నిలిపి వేయాలని జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనను ఏజీ జెన్కో (ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థ) ఆమోదించింది. గోదావరి ప్రవాహాన్ని జూన్ రెండో వారంలో పోలవరం స్పిల్ వే మీదుగా మళ్లించే ప్రక్రియ ప్రారంభమయ్యాక.. సీలేరులో మళ్లీ విద్యుదుత్పత్తిని ప్రారంభించనున్నారు. గతంలో గోదావరి ప్రవాహం దిగువకు వెళ్లేందుకు వీలుగా ఎగువ కాఫర్ డ్యామ్‌లో 300 మీటర్ల ఖాళీ ప్రదేశాన్ని వదిలారు. ఇప్పుడు ఆ ఖాళీ ప్రదేశాన్ని భర్తీ చేసే పనుల ప్రక్రియను వేగవంతం చేశారు. గోదావరిలో సహజ సిద్ధ ప్రవాహం రెండు వేల క్యూసెక్కులు వస్తుండడంతో.. ఆ ప్రవాహాన్ని నిలుపుదల చేసేలా రింగ్ బండ్ వేసి ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును సగటున 38 మీటర్ల ఎత్తుకు పెంచే పనులను వేగవంతం చేశారు. గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించేందుకు నది నుంచి.. కుడి వైపునకు 2.18 కిమీల పొడవున అప్రోచ్ ఛానల్ తవ్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తయ్యాక.. స్పిల్ వే మీదుగా ప్రవాహాన్ని మళ్లిస్తారు. అనంతరం కాఫర్ డ్యామ్‌ను 42.5 మీటర్ల ఎత్తుకు పెంచే పనులను జూలై నాటికి పూర్తి చేసి.. వరద సమయంలోనూ ప్రధాన డ్యామ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) పనులు చేపట్టి 2022 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. -
పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ పనులు వేగవంతం
సాక్షి, అమరావతి: గోదావరికి వరద వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టు ఎగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తిచేసే దిశగా అధికారులు పనులను వేగవంతం చేశారు. డెల్టాలో రబీ పంటలకు నీటిని సరఫరా చేసేందుకు కాఫర్ డ్యామ్ రీచ్–3లో 400 మీటర్లను ఖాళీగా వదిలేశారు. రబీ పంటలు నూర్పిళ్ల దశకు చేరుకోవడంతో ఖాళీగా వదిలిన ప్రదేశాన్ని భర్తీచేసేందుకు సిద్ధమయ్యారు. ఎగువ సీలేరు, దిగువ సీలేరు కేంద్రాల నుంచి ఏపీ జెన్కో (ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థ) విద్యుదుత్పత్తి చేస్తూ 4 వేల క్యూసెక్కుల నీటిని వదులుతోంది. ఇది కాఫర్ డ్యామ్ రీచ్–3లో ఖాళీ ప్రదేశాన్ని భర్తీచేయడానికి అడ్డంకిగా మారింది. దీంతో జూన్ వరకు విద్యుదుత్పత్తిని నిలిపివేసి కాఫర్ డ్యామ్‌ను పూర్తిచేయడానికి సహకరించాలని ఏపీ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లను కోరినట్లు పోలవరం చీఫ్ ఇంజనీర్ సుధాకర్‌బాబు ‘సాక్షి’కి చెప్పారు. నీటి ప్రవాహం తగ్గగానే ఖాళీ ప్రదేశాన్ని శరవేగంగా భర్తీచేసి.. జూన్ నాటికి కాఫర్ డ్యామ్‌ను సిద్ధం చేస్తామన్నారు. గోదావరి నదిపై పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామన్నగూడెం వద్ద 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం విదితమే. ప్రాజెక్టులో నీటిని నిల్వచేసే ప్రధాన ఆనకట్ట (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్–ఈసీఆర్ఎఫ్)ను 2,467.5 మీటర్ల పొడవున మూడు భాగాలుగా నిర్మించాలి. ఈసీఆర్‌ఎఫ్‌ను నిర్మించాలంటే.. గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించేలా ఈసీఆర్‌ఎఫ్‌కు ఎగువన 2,480 మీటర్లు, దిగువన 1,617 మీటర్ల పొడవున కాఫర్ డ్యామ్‌లు నిర్మించాలి. ఎగువ కాఫర్ డ్యామ్‌ను 42.5 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్‌ను 30.50 మీటర్ల ఎత్తున నిర్మించాలి. 4 రీచ్‌లుగా ఎగువ కాఫర్ డ్యామ్ ఎగువ కాఫర్ డ్యామ్‌ను 4 రీచ్‌లుగా నిర్మిస్తున్నారు. రీచ్–1ను 0 నుంచి 480 మీటర్లు, రీచ్–2ను 480 నుంచి 1,700 మీటర్లు, రీచ్–3ని 1,700 నుంచి 2,100 మీటర్లు, రీచ్–4ను 2,100 నుంచి 2,480 మీటర్లుగా విభజించారు. డెల్టాలో రబీ పంటలకు నీరు సరఫరా చేయడానికి వీలుగా కాఫర్ డ్యామ్ రీచ్–3లో 400 మీటర్ల మేర ఖాళీ ప్రదేశాన్ని వదిలేశారు. మిగతా మూడు రీచ్‌లలోను కాఫర్ డ్యామ్ పనులను చేపట్టారు. జూన్‌లోగా కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేస్తేనే.. వరదను స్పిల్ వే మీదుగా మళ్లించడానికి సాధ్యమవుతుంది. అప్పుడే ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేయడానికి మార్గం సుగమం అవుతుంది. డెల్టాలో రబీ పంటలు నూర్పిళ్ల దశకు చేరుకోవడంతో రీచ్–3లో ఖాళీ ప్రదేశాన్ని భర్తీచేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గోదావరి సహజసిద్ధ ప్రవాహం కనిష్టస్థాయికి చేరుకుంది. సీలేరు నుంచి కూడా ప్రవాహం తగ్గగానే ఖాళీ ప్రదేశాన్ని భర్తీచేసే పనులు చేపడతారు. కార్యాచరణ ప్రణాళిక ప్రకారమే.. గోదావరికి వచ్చే వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి.. జూన్ నుంచి ఈసీఆర్ఎఫ్ పనులను ప్రారంభించి గడువులోగా పూర్తి చేయడానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారమే అధికారులు పనులు చేయిస్తున్నారు. స్పిల్ వే దాదాపుగా కొలిక్కి వచ్చింది. అప్రోచ్ చానల్, స్పిల్ చానల్ పనులు వేగంగా సాగుతున్నాయి. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. -
పెరుగుతున్న ఏపీ జెన్కో సామర్థ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థ.. ఏపీ జెన్కో ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగబోతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం (కృష్ణపట్నం)లో కొత్తగా 800 మెగావాట్లు అందుబాటులోకి రానుంది. మే 20 నాటికి ఈ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుంది. దీన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. జూన్ నెలాఖరు నాటికి వాణిజ్య ఉత్పత్తి (సీవోడీ)కి సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 5,010 మెగావాట్లు . కృష్ణపట్నం కొత్త యూనిట్‌ను కూడా కలుపుకుంటే ఇది 5,810 మెగావాట్లు అవుతుంది. వాస్తవానికి ఇబ్రహీంపట్నంలోని మరో 800 మెగావాట్ల ప్లాంట్ కూడా ఇదే సమయానికి అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ కాంట్రాక్టు సంస్థ నిర్మాణ పనుల్లో ఆలస్యం చేసింది. రెండేళ్లుగా పుంజుకున్న వేగం ► కృష్ణపట్నంలో మొదటి దశలో 800 మెగావాట్ల రెండు సూపర్ క్రిటికల్ (అత్యాధునిక టెక్నాలజీ) థర్మల్ యూనిట్లను నిర్మించారు. రెండో దశలో మరొక ప్లాంట్‌ను 2015లో ప్రారంభించారు. వాస్తవానికి ఇది 2018లోనే పూర్తవ్వాలి. కానీ గత టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా కాంట్రాక్టులు ఇవ్వడం, సకాలంలో ప్రాజెక్టు పూర్తవ్వని కారణంగా వ్యయం పెరిగింది. ► కొత్తగా ఏర్పడ్డ ఈ ప్లాంటుకు మహానది కోల్ ఫీల్డ్ (ఎంసీఎల్) నుంచి ఏడాదికి 3.54 మిలియన్ టన్నుల బొగ్గు లింకేజీ కూడా ఉంది. రెండు ప్రాజెక్టులను ఒకే కాంట్రాక్టు సంస్థకు కాకుండా.. సివిల్ బాయిలర్, టరై్బన్, జనరేటర్ (బీటీజీ)ని ప్రభుత్వ రంగ సంస్థ.. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్)కు ఇచ్చారు. సివిల్ కాంట్రాక్టు పనులను టాటా సంస్థకు అప్పగించారు. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రెండు థర్మల్ ప్లాంట్ల పనులపై దృష్టి పెట్టింది. జాప్యం చేస్తే నిర్మాణ వ్యయం పెరిగి, విద్యుత్ ధర ఎక్కువయ్యే ప్రమాదం ఉండటంతో ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియలో వేగం పెంచింది. ఒక్కోదానికి రూ. వెయ్యి కోట్ల చొప్పున ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి అప్పు ఇప్పించేందుకు ముందుకొచి్చంది. దీంతో పలు ఆర్థిక సంస్థలు ముందుకొచ్చాయి. రాష్ట్రానికి ఉపయోగాలివే.. ► జెన్కో కొత్త ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తే బయట నుంచి విద్యుత్‌ను కొనాల్సిన అవసరం తప్పుతుంది. ► అలాగే డిమాండ్ (పీక్) టైమ్‌లో కోతలకు ఆస్కారం లేకుండా విద్యుత్‌ను అందించవచ్చు. ► ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి నూటికి నూరు శాతం విద్యుత్ లభ్యతకు గ్యారెంటీ ఉంటుంది. ► అత్యధిక పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) వచ్చే అవకాశం ఉంది. జూన్‌లో ఉత్పత్తి కృష్ణపట్నం 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్‌ను జూన్ చివరి నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తిలోకి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే స్టీమ్‌లైన్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు ఫ్యూల్ గ్యాస్ డీ సల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కింది భాగం నుంచే బూడిద విడుదలయ్యే కొత్త టెక్నాలజీని ఈ ప్లాంట్‌లో ఉపయోగిస్తున్నాం. ఈ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభిస్తే రాష్ట్రానికి రోజుకు మరో 35 మిలియన్ యూనిట్ల విద్యుత్ అదనంగా అందుతుంది. – చంద్రశేఖర్‌రాజు, థర్మల్ డైరెక్టర్, జెన్కో -
పవర్'ఫుల్'
సాక్షి, అమరావతి: వేసవి సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. గత ఏడాది రికార్డులను బద్దలు కొడుతోంది. వారం రోజులుగా నిత్యం కనీసం 5 మిలియన్ యూనిట్ల (ఎంయూల) వరకూ అదనంగా డిమాండ్ ఏర్పడుతోంది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఏపీ జెన్కో ఉత్పత్తి చేసే విద్యుత్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. జెన్కో సైతం మునుపెన్నడూ లేనివిధంగా గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మండు వేసవిలో వాడకం పెద్దఎత్తున పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. తాజా పరిస్థితిని రాష్ట్ర విద్యుత్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదివారం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోజుకు 208 మిలియన్ యూనిట్లు వారం క్రితం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజుకు 168 ఎంయూలు ఉంది. బుధవారం నాటికి అదికాస్తా 175 ఎంయూలకు చేరింది. శనివారం ఏకంగా 208 ఎంయూల గరిష్ట వినియోగం రికార్డయింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ స్థాయిలో డిమాండ్ పెరగడం ఇదే మొదటిసారి. గత ఏడాది మార్చిలో రోజుకు గరిష్టంగా 206 ఎంయూల డిమాండ్ నమోదైంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే విశాఖ, విజయవాడ నగరాల్లో విద్యుత్ వినియోగం మరింత అధికంగా ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 220 ఎంయూల వరకూ వెళ్లే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) అంచనా వేస్తోంది. పెరుగుదలకు ఇవీ కారణాలు ► ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం ఒక్కసారిగా పెరిగింది. ► పారిశ్రామిక రంగంలో మార్చి నెలాఖరుకు వార్షిక సంవత్సరం ముగుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి లక్ష్యాలను దాటేందుకు కొన్ని పరిశ్రమలు ఎక్కువ స్థాయిలో పని చేస్తున్నాయి. దీంతో పారిశ్రామిక విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. ► రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పగటి పూటే 9 గంటల విద్యుత్ ఇస్తోంది. రబీ సీజన్ కావడంతో పగటి విద్యుత్ వినియోగం పెరిగింది. రోజుకు 28 ఎంయూల వరకూ ఉండే వ్యవసాయ విద్యుత్ వినియోగం 33 ఎంయూలకు చేరినట్టు చెబుతున్నారు. జెన్కో రికార్డు బ్రేక్ డిమాండ్‌కు తగ్గట్టే ఏపీ జెన్కో ఉత్పత్తిలో రికార్డు బద్దలు కొట్టింది. ఫిబ్రవరి 27న 103 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇందులో 93 ఎంయూలు థర్మల్, 10 ఎంయూల జల విద్యుత్ ఉంది. గతంలో జెన్కో గరిష్టంగా 80 ఎంయూల ఉత్పత్తి దాటలేదు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు యూనిట్‌కు రూ.8 పైనే ఉన్నాయి. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు జెన్‌కోపైనే ఆధారపడుతున్నాయి. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన ఏపీ జెన్కో వేసవికి ముందే యంత్రాలకు అవసరమైన మరమ్మతులు చేయించింది. పెద్దఎత్తున బొగ్గు నిల్వలను సిద్ధం చేసుకుంది. ఎంత డిమాండ్ పెరిగినా విద్యుత్ కోతలు రానివ్వబోమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. -
జెన్కో జోరు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఖరీదైన విద్యుత్‌ను చాలావరకు తగ్గించింది. చౌక విద్యుత్‌కు మాత్రమే ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి పెరుగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 987.39 మిలియన్ యూనిట్లు (ఎంయూలు) అదనంగా అందించగలిగింది. 2014–15తో పోలిస్తే ఏకంగా 6,407.09 ఎంయూలు ఎక్కువ. అప్పట్లో ఆనవాయితీగా మారిన బ్యాకింగ్ డౌన్ ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 5 వేల మెగావాట్లు. రోజుకు 105 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి చేసే వీలుంది. జెన్కో థర్మల్, జల విద్యుత్ కేంద్రాలతో ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కమ్‌లు) దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) ఉన్నాయి. పీపీఏ ప్రకారం విద్యుత్ కొనుగోలు చేయకపోతే ఫిక్స్డ్ (స్థిర) ఛార్జీలు (ప్లాంట్ల నిర్మాణ చార్జీలు) చెల్లించాలి. గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 మార్చి వరకు ఇదే జరిగింది. ప్రైవేట్ విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు జెన్కోలో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించింది. తరుచూ బ్యాకింగ్ డౌన్ (ఉత్పత్తి తగ్గించడం) ఆనవాయితీగా మారింది. అప్పుల్లో విద్యుత్ సంస్థలు థర్మల్ ప్లాంట్లు సామర్థ్యానికి తగినట్టుగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయకుండా ఆపడం వల్ల డిస్కమ్‌లు యూనిట్‌కు రూ.1.50 వరకు చెల్లించాల్సి వచ్చింది. దీంతో భారీయెత్తున నష్టాలకు గురయ్యాయి. మరోవైపు ఉత్పత్తి పెంచుకోలేక జెన్కో ఆర్థిక నష్టాల్లోకి వెళ్లింది. 2015–16లో జెన్కో విద్యుత్‌ను 1,747 ఎంయూలు తగ్గిస్తే... 2016–17లో 5,103 ఎంయూలు, 2018–19లో ఏకంగా 7,013 మిలియన్ యూనిట్లు తగ్గించేశారు. ఈ విధంగా పవన, సౌర విద్యుత్ కోసం థర్మల్ కేంద్రాలను పడుకోబెట్టడంతో 2015–16లో రూ.157.1, 2016–17లో రూ.629.9, 2017–18లో రూ.1,943.9, 2018–19లో రూ.2,766.4 కోట్ల చొప్పున స్థిర చార్జీలు చెల్లించాల్సి వచ్చింది. భారీగా ఉత్పత్తి తగ్గించడం, డిస్కమ్‌లు చెల్లించే స్థిర చార్జీలతో సరిపెట్టుకోవడం వల్ల జెన్కో కేంద్రాలు అప్పుల్లోకెళ్లాయి. గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న పీపీఏల వల్ల ఇప్పటికీ పవన, సౌర తదితర విద్యుత్‌ను ఉత్పత్తి అయినంతవరకు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తోంది. ప్రైవేటీకరణ ప్రచారానికి తెర ప్రస్తుత ప్రభుత్వం ఈ విధానాన్ని సమూలంగా మార్చివేసింది. జెన్కో సంస్థల ప్రైవేటీకరణ దిశగా గత ప్రభుత్వం అడుగులేస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రమాదం నుంచి బయటపడేసే ప్రయత్నాలు చేపట్టింది. ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి రుణాలిప్పించడం వంటి చర్యలు తీసుకుంటోంది. జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి పెంచడంతో పాటు కొనుగోలు కూడా చేస్తోంది. -
జనహితం కోరుతూ జెన్కో అడుగులు
సాక్షి, అమరావతి: వెలుగులు పంచే థర్మల్ విద్యుత్ కేంద్రాలు మరోపక్క విషవాయువులను వెదజల్లుతున్నాయి. దీన్ని తక్షణమే అదుపు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ముఖ్యంగా ఆమ్ల వాయువుల (సల్ఫ్యూరిక్ యాసిడ్) నియంత్రణ తప్పనిసరి చేసింది. వాస్తవానికి 2015లో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికే అమలు కావాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వం థర్మల్ ప్లాంట్లలో ప్లూగ్యాస్ డీ సల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) ప్రక్రియపై దృష్టి పెట్టలేదు. పర్యావరణానికి చేటు తెస్తున్న ఆమ్ల వాయువుల నియంత్రణపై ప్రస్తుత సర్కారు వేగంగా అడుగులేస్తోంది. రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాల్లో ఎఫ్‌జీడీ ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధమైంది. సల్ఫర్‌తో చిక్కే..! రాష్ట్రంలో ఏపీ జెన్కో పరిధిలో 5 వేల మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రాలున్నాయి. పూర్తి స్థాయిలో ఇవి విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే రోజుకు 70 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. బొగ్గును మండించినప్పుడు అందులోని నైట్రోజన్, సల్ఫర్ వంటి వాయువులు వెలువడతాయి. థర్మల్ కేంద్రాల నుంచి గాలిలోకి వెళ్లే వాయువుల్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ బొగ్గు వినియోగంలో పాయింట్ ఒక్క శాతం మాత్రమే ఉండాలి. పాత విద్యుత్ కేంద్రాల వల్ల ఇది ఆరు రెట్లు ఎక్కువ ఉంటోందని పర్యావరణ శాఖ చెబుతోంది. విదేశీ బొగ్గు వాడే కేంద్రాల్లో ఇది పది శాతం వరకూ ఎక్కువగా ఉంటోంది. ఆమ్ల వర్షాలకు సల్ఫ్యూరిక్ యాసిడే కారణం. దాదాపు 50 కి.మీ. పరిధిలో దీని ప్రభావం ఉంటుంది. పంటలకు హాని చేస్తుంది. ప్రాణాలను హరించే జబ్బులకూ కారణమవుతుంది. (చదవండి: ‘థర్మల్’కు డిమాండ్) ఎలా నియంత్రిస్తారు..? బొగ్గును బాయిలర్‌లో మండించటం వల్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ బయటకొస్తుంది. దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిమ్నీ ద్వారా భూమికి 100 అడుగులపైకి పంపి గాలిలో కలుపుతారు. అది భూమిని చేరేలోపు తీవ్రత తగ్గుతుంది. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ కేంద్రాలు అనుసరిస్తున్న విధానమిది. ఎఫ్‌జీడీ ప్రక్రియలో సున్నపురాయిని పొడిచేసి, నీళ్లతో కలిపి చిమ్నీపైకి పంపుతారు. రసాయన చర్య వల్ల సల్ఫర్ జిప్సమ్‌గా మారుతుంది. ఈ జిప్సమ్‌ను ఇళ్ల నిర్మాణానికి ఉపయోగిస్తారు. భారీ ఖర్చే..! ఎఫ్‌జీడీ ప్లాంట్ నిర్మించాలంటే ప్రతీ మెగావాట్‌కు రూ.50 లక్షలు ఖర్చు చేయాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ జెన్కో దశల వారీగా ఈ ప్రక్రియను చేపడుతోంది. ముందుగా నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం, కృష్ణపట్నం కేంద్రాల్లో ఎఫ్‌జీడీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. (చదవండి: ‘పవర్’ఫుల్ సెక్టార్) టెండర్లు పిలుస్తున్నాం: శ్రీధర్, ఎండీ, జెన్కో ‘ఎఫ్‌జీడీ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలుస్తున్నాం. ఇప్పటికే డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాం. పర్యావరణానికి ఏమాత్రం హాని లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో ఈ ప్లాంట్లను నిర్మించాలని చూస్తున్నాం’ అని జెన్కో ఎండీ శ్రీధర్ తెలిపారు. -
మనవైపు శ్రీశైలం ప్లాంట్లు సురక్షితం
సాక్షి, అమరావతి: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో భద్రతను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్కో) క్షుణ్నంగా పరిశీలించింది. ఏపీ జల విద్యుత్ కేంద్రాలు నూటికి నూరుపాళ్లు సురక్షితమని నివేదిక రూపొందించింది. ఏపీ జెన్కో ఎండీ శ్రీధర్ ఈ వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలోని జనరేటర్లు పోలికే లేదు... ► ఏపీ జెన్కో పరిధిలో ఉన్న జల విద్యుత్ కేంద్రాలు 1960లో ఏర్పాటు చేశారు. తెలంగాణ పరిధిలో ఉన్నవి 1990లో డిజైన్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంలో వీటికి పోలిక లేదు. ► తెలంగాణ జల విద్యుత్ కేంద్రాలు పూర్తిగా భూగర్భంలో (భూ ఉపరితలం నుంచి కిలో మీటరున్నర) ఉన్నాయి. ఏపీ జల విద్యుత్ కేంద్రం భూ ఉపరితలంపైనే ఉన్నందున విపత్కర సమయంలో పొగ, విషవాయువులు తేలికగా బయటకు వెళ్లిపోతాయి. ► తెలంగాణ విద్యుత్తు కేంద్రం జనరేషన్, నీళ్ల పంపింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అందుకు తగ్గట్టుగానే భూగర్భంలో నిర్మాణం చేశారు. ఏపీ వైపు ఉన్న ప్లాంట్లు కేవలం జనరేషన్ మాత్రమే చేస్తాయి. నీటిని రివర్స్ పంప్ చేసే టెక్నాలజీ లేదు కాబట్టి ప్రమాదానికి అంతగా ఆస్కారం లేదు. ► కుడివైపు జల విద్యుత్ కేంద్రాలు ఒక్కొక్కటి 110 మెగావాట్ల (మొత్తం 7) సామర్థ్యంతో కూడుకున్నవి. నీటి నిల్వ ఎక్కువగా ఉన్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను బయటకు పంపి ట్రాన్స్మిషన్ వ్యవస్థకు లింక్ చేశారు. తెలంగాణలో భూగర్భంలోనే (ఇండోర్) ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఉంది. ఇండోర్ ట్రాన్స్మిషన్ వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు కాపర్ వైర్ అతి వేడిని పుట్టించే వీలుంది. దురదృష్టవశాత్తూ ప్రమాదం.. ‘అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తెలంగాణ విద్యుత్ కేంద్రంలో దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగింది. అక్కడి టెక్నాలజీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నది. భూగర్భ బొగ్గు గని తరహాలో తెలంగాణ ప్లాంట్లు ఉంటే ఏపీ వైపు ఉన్నవి ఓపెన్‌కాస్ట్ మాదిరిగా ఉంటాయి. ఏపీ జల విద్యుత్ ప్లాంట్లు పూర్తిగా సురక్షితం’ – శ్రీధర్, జెన్కో ఎండీ -
మరో 1,600 మెగావాట్ల విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ జెన్కో మరో రెండు కొత్త సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లను ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఉత్పత్తిలోకి తెచ్చేందుకు సిద్ధమైంది. దీనివల్ల మరో 1,600 మెగావాట్ల మేర అదనపు విద్యుదుత్పత్తి జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక చేయూతతో ఈ ప్లాంట్ల నిర్మాణం వేగం పుంజుకుంది. ప్రస్తుతం ఏపీ జెన్కో 4,500 మెగావాట్ల విద్యుత్‌ను అందిస్తుండగా కొత్తవి అందుబాటులోకి వస్తే జెన్కో ఉత్పత్తి సామర్థ్యం 6,100 మెగావాట్లకు పెరుగుతుంది. భవిష్యత్తులో డిమాండ్ పెరిగినా సొంతంగా విద్యుత్ సరఫరా చేసే స్థాయికి జెన్కో ఎదిగింది. ఈ ప్రాజెక్టుల పురోగతిని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి గురువారం ‘సాక్షి’కి వివరించారు. ► రాష్ట్ర అవసరాల కోసం ఇబ్రహీంపట్నంలో డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం 8వ యూనిట్ (800 మెగావాట్లు), నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో రెండోదశ (800 మెగావాట్లు)ను 2015లో ప్రారంభించారు. వాస్తవానికి ఇవి 2018లోనే పూర్తవ్వాల్సినా గత ప్రభుత్వం ఇష్టానుసారంగా కాంట్రాక్టులు ఇవ్వడం, సకాలంలో ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో వ్యయం పెరిగింది. ► గత ప్రభుత్వం ఇష్టానుసారంగా విద్యుత్ సంస్థల ఆస్తులను కుదువపెట్టి అప్పులు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చేనాటికి జెన్కోకు స్థాయికి మించి అప్పులున్నాయి. ఫలితంగా కొత్తగా అప్పు అందే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం కొత్త థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం పనులు మందగించాయి. ► ఈ రెండు ప్లాంట్లకు ఒక్కోదానికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి అప్పు ఇప్పించేందుకు అంగీకారం తెలిపింది. దీంతో పలు ఆర్థిక సంస్థలు ముందుకు రావడంతో ఆరు నెలల్లో రెండు ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్లాంట్ల వ్యయం ఇలా రూ.కోట్లలో -
‘థర్మల్’కు డిమాండ్
సాక్షి, అమరావతి: ఏపీ జెన్కో ముందస్తు వ్యూహం ఇప్పుడు మంచి ఫలితాన్నిస్తోంది. పవన, సౌర విద్యుదుత్పత్తి పడిపోయినప్పటికీ విద్యుత్ సరఫరాలో జెన్కో కీలకపాత్ర పోషిస్తోంది. అందుబాటులో ఉన్న బొగ్గు నిల్వలతో అన్ని యూనిట్లనూ క్రమంగా ఉత్పత్తిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందించేందుకు జెన్కో సన్నద్ధమవుతోంది. ఏం జరుగుతోంది? ► గత మూడు రోజులుగా వాతావరణం మారడంతో పవన, సౌర విద్యుదుత్పత్తి ఒక్కసారిగా పడిపోయింది. ఇవి రెండూ కలిపి 7 వేల మెగావాట్ల ఉత్పత్తి చేస్తుండగా మూడు రోజులుగా క్రమంగా తగ్గుతోంది. మంగళవారం 1,900 మెగావాట్లకే పరిమితమైంది. సూర్యరశ్మి లేకపోవడం వల్ల సౌరశక్తి, గాలి లేకపోవడం వల్ల పవన విద్యుదుత్పత్తి పడిపోయింది. ► రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజుకు 9 వేల మెగావాట్ల నుంచి 7 వేలకు తగ్గింది. అయితే విండ్, సోలార్ పడిపోవడంతో విద్యుత్ సరఫరాలో క్లిష్ట పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలను ముందే ఊహించిన లోడ్ డిస్పాచ్ సెంటర్ ఏపీ జెన్కోను అప్రమత్తం చేసింది. ► కొంతకాలంగా నిలిపివేసిన కృష్ణపట్నం, వీటీపీఎస్, ఆర్టీపీపీ థర్మల్ విద్యుత్ కేంద్రాలను క్రమంగా ఉత్పత్తిలోకి తెచ్చారు. ప్రస్తుతం ఏపీ జెన్కో 4,500 మెగావాట్లకుగానూ 2 వేల మెగావాట్ల వరకు ఉత్పత్తిలోకి తెచ్చింది. ఇతర విద్యుత్ లభ్యత తగ్గితే తక్షణమే ఉత్పత్తి పెంచగల సమర్థత జెన్కోకు ఉందని అధికారులు తెలిపారు. బొగ్గు నిల్వలు పుష్కలం.. ► ఏపీ జెన్కో వద్ద ప్రస్తుతం 15 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. అన్ని థర్మల్ ప్లాంట్లకు కలిపి రోజుకు 70 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. దీన్నిబట్టి మూడు వారాలకు సరిపడా బొగ్గు అందుబాటులో ఉంది. రోజూ గనుల నుంచి బొగ్గు అందుతోంది. ► లాక్డౌన్ కాలంలో విద్యుత్ డిమాండ్ తగ్గడంతో పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ వాడకం పూర్తిగా ఆగిపోయింది. దీంతో బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే విద్యుత్ లభించింది. ఈ సమయంలోనే జెన్కో అప్రమత్తమైంది. ఉత్పత్తిని నిలిపివేసి బొగ్గు నిల్వలు పెంచుకుంది. ప్లాంట్లలో అవసరమైన మరమ్మతులు చేపట్టింది. ముందుచూపుతో వ్యవహరించడం ఇప్పుడు కలసి వస్తోంది. ► మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. క్రమంగా వ్యవసాయ విద్యుత్ వాడకం పెరిగే వీలుంది. అయినప్పటికీ ఎక్కడా చిన్న అంతరాయం లేకుండా విద్యుత్ అందించేందుకు జెన్కో ముందస్తు వ్యూహాలు ఉపకరిస్తున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. వర్షాకాలంలో బొగ్గు వెలికితీత, రవాణా కష్టమైనప్పటికీ నిరంతరాయంగా విద్యుదుత్పత్తికి జెన్కో సిద్ధమైందని పేర్కొంటున్నారు. -
లైట్లు మాత్రమే ఆర్పండి..
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్లలో లైట్లు ఆపేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు ఇబ్బందిలేకుండా చూడటానికి రాష్ట్ర విద్యుత్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్‌ను అదుపు చేయడానికి రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) నిరంతరం పనిచేస్తుంది. విద్యుత్‌ను చేరవేసే వ్యవస్థ (పవర్ గ్రిడ్)పై డిమాండ్ పెరిగినప్పుడు విద్యుత్ లభ్యత పెంచుతారు. డిమాండ్ తగ్గినప్పుడు ఉత్పత్తి తగ్గిస్తారు. ఎస్ఎల్డీసీ శుక్రవారం రాత్రి నుంచే ఈ కసరత్తు మొదలు పెట్టింది. ఆదివారం రాత్రి వరకూ అప్రమత్తంగానే ఉంటుంది. ► రాష్ట్రంలో సాధారణంగా 9 గంటల సమయంలో విద్యుత్ డిమాండ్ 6,800 మెగావాట్లు ఉంటుంది. ► 9 నిమిషాలు ఇళ్లల్లో లైట్లు ఆపేస్తే ఒక్కసారిగా డిమాండ్ 500 మెగావాట్ల మేర పడిపోతుంది. ఆతర్వాత ఒక్కసారే డిమాండ్ యథాతథ స్థితికి వస్తుంది. ► ఈ సమయంలో గ్రిడ్‌కు అనుసంధానమైన విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం, పెంచడం చేయకపోతే ఉత్పత్తి స్టేషన్లు సాంకేతికంగా దెబ్బతింటాయి. ట్రాన్స్ఫార్మర్లు ట్రిప్ అవుతాయి. ► ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని ఆదివారం ఉదయం నుంచే తగ్గిస్తారు. థర్మల్ను వెనువెంటనే ఉత్పత్తిలోకి తేవడం కొంత కష్టం. జల విద్యుత్ ఉత్పత్తిని అప్పటికప్పుడే ప్రారంభించవచ్చు. అందుకే సీలేరులోని 450 మెగావాట్లు, శ్రీశైలంలో 550 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాల్ని అందుబాటులోకి తెస్తున్నారు. ► లైట్లు ఆపేసిన సమయంలో లోడ్ తగ్గి గ్రిడ్ ఫ్రీక్వెన్సీ అదుపులో ఉండటం కష్టం. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ పంపుసెట్లు నడిపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రం మార్గదర్శకాలివీ.. ► ఇళ్లల్లో లైట్లు తప్ప అన్ని విద్యుత్ ఉపకరణాలు నడుస్తాయి. ► వీధి దీపాలు ఆన్‌లోనే ఉంటాయి. ► ఆసుపత్రులు, మున్సిపల్ సర్వీసులు, పోలీసు కార్యాలయాలు, ఇతర అత్యవసర విభాగాల్లో లైట్లు యథావిధిగా వెలుగుతాయి. వినియోగదారులు గమనించాలి ఆ తొమ్మిది నిమిషాలు ఇళ్లల్లో కేవలం లైట్లు మాత్రమే ఆపండి. ఏసీలు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు ఇతర ఉపకరణాలు ఆన్‌లోనే ఉంచండి. గ్రిడ్ బ్యాలెన్స్ కోసం వినియోగదారులు దీన్ని గమనించాలి. అన్నీ ఆపేస్తే డిమాండ్ ఒక్కసారే పడిపోయి గ్రిడ్‌పై ప్రభావం పడుతుంది. ఇది జరిగితే పునరుద్ధరణకు చాలా సమయం పడుతుంది. – హెచ్.హరినాథరావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ కేంద్రంతో సమన్వయం తొమ్మిది నిమిషాలు లైట్లు ఆపాలన్న నిర్ణయం నేపథ్యంలో కేంద్ర ఇంధనశాఖతోనూ సమన్వయం చేసుకుంటున్నాం. దక్షిణ, జాతీయ గ్రిడ్ అధికారులతో ఇప్పటికే మాట్లాడాం. రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్, జెన్కో స్టేషన్స్, ఇతర ఉత్పత్తిదారుల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నాం. అన్ని విభాగాల నుంచి నివేదికలు తీసుకుంటున్నాం. డిస్కమ్‌లకు అవసరమైన ఆదేశాలిచ్చాం. – శ్రీకాంత్ నాగులాపల్లి ఇంధనశాఖ కార్యదర్శి ఆ 9 నిమిషాలు ఓ సవాల్ మాకు ఆ తొమ్మిది నిమిషాలు ఓ సవాల్. దీనికోసం శుక్రవారం నుంచే కసరత్తు ముమ్మరం చేశాం. మనం కేంద్ర విద్యుత్ సంస్థల నుంచీ విద్యుత్ తీసుకుంటున్నాం. కాబట్టి ముందే దీనిపై సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే పవన, సౌర విద్యుత్‌ను ఆపేయడానికి ఏర్పాట్లు చేశాం. తీసుకున్న చర్యల కారణంగా గ్రిడ్‌పై ప్రభావం ఉండదనే భావిస్తున్నాం. – భాస్కర్, లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇంజనీర్ -
‘పవర్’ఫుల్ సెక్టార్
సాక్షి, అమరావతి: వచ్చే ఐదేళ్లలో విద్యుత్ రంగాన్ని రుణ భారం నుంచి విముక్తి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని విద్యుత్ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విద్యుత్ కొనుగోలు భారాన్ని పూర్తిగా అదుపులోకి తేవాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఏపీ జెన్కో సామర్థ్యాన్ని పెంచాలన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై బుధవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. గత ఐదేళ్లుగా అత్యధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేయడం, అందినకాడికి అప్పులు చేయడం వల్ల విద్యుత్ సంస్థలు సమస్యల్లో పడ్డాయని అధికారులు తెలిపారు. దాదాపు రూ.70 వేల కోట్ల అప్పులున్నాయని, దీనికి ఏటా వడ్డీనే రూ.7 వేల కోట్లు కట్టాల్సి వస్తోందని తెలిపారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి ముందుంచారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమించాలనే దానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అత్యధిక ధరలతో ఒప్పందాలొద్దు విద్యుత్ వ్యవస్థలను అప్పుల్లోకి నెడుతున్న విద్యుత్ కొనుగోలు భారాన్ని గణనీయంగా తగ్గించాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం అత్యధిక రేట్లతో పీపీఏలు చేసుకున్న విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు. ఎక్కువ రేటున్న విద్యుత్ కొనుగోళ్లను ఆపేయాలన్నారు. ప్రత్యామ్నాయంగా తక్కువ ధరకే లభించే ఉత్పత్తి కేంద్రాలు, బహిరంగ మార్కెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. చౌకగా లభించే పక్షంలో స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలుపైనా దృష్టి పెట్టాలని సూచించారు. తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని ఎవరు ముందుకొచ్చినా వారితో ఒప్పందాలు చేసుకోవాలని తెలిపారు. దీనివల్ల డిస్కమ్‌లపై భారం తగ్గుతుందన్నారు. చౌకగా విద్యుత్ ఇవ్వాలనుకునే పవన, సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగం పరిస్థితిపై బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెన్కోను లాభాల బాట పట్టించాలి ఏపీ జెన్కోను లాభాల బాట పట్టించాలని, ఇందుకు అనుగుణంగా సమగ్ర మార్పులు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రైవేట్ థర్మల్ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గు వస్తున్నప్పుడు ఏపీ జెన్కోకు సమస్యలెందు కొస్తున్నాయని ప్రశ్నించారు. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యమైన బొగ్గు తేవడమే కాకుండా పూర్తి లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో జెన్కో థర్మల్ ప్లాంట్ నడిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బొగ్గు నాణ్యతను పరిశీలించేందుకు థర్డ్ పార్టీతో ఎప్పటికప్పుడు ధ్రువీకరించేలా చూడాలన్నారు. జెన్కో పూర్తి స్థాయిలో ఉత్పత్తిలోకి వస్తే నష్టాలు తగ్గుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల విషయంలో మరింత ఒత్తిడి పెంచుతామన్నారు. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు చర్చలు జరిపేలా చేస్తామన్నారు. మనకు రావాల్సిన బకాయిల కింద సింగరేణి బొగ్గు తీసుకోవడమో, ఏపీ పవర్ సెక్టార్ అప్పుల్లో ఇవ్వాల్సిన బకాయిల కింద తెలంగాణకు బదలాయించడమో చేయడం సరైన పరిష్కార మార్గాలుగా సీఎం సూచించారు. నష్టాల్లోకి తీసుకెళ్తున్న పాత ప్లాంట్లపై నివేదిక ఇవ్వాలన్నారు. యూనిట్ గరిష్టంగా రూ.2.80పైసలకే లభించేలా ప్రణాళిక ఉచిత విద్యుత్ కోసం ప్రతిపాదించిన 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌పై సీఎం సమగ్రంగా చర్చించారు. 50 వేల ఎకరాలు గుర్తించామని అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గడువు పెట్టారు. విద్యుత్ గరిష్టంగా యూనిట్ రూ 2.80కే లభించేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. మార్కెట్లో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. ప్రాజెక్టు వ్యయం అనవసరంగా పెరగకుండా చూడాలని కోరారు. అప్పర్ సీలేరులో జెన్కో తలపెట్టిన పంప్డ్ జల విద్యుత్ ప్రాజెక్టు బాధ్యతనూ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చే విషయమై చర్చించారు. వచ్చే ఐదేళ్లకు విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసి, ఈ ప్రాజెక్టు నుంచి విద్యుత్ పొందేలా చూడాలన్నారు. నిర్మాణ దశలో ఉన్న 800 మెగావాట్ల సామర్థ్యం గల కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ ప్లాంట్లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ రంగంలో అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా కచ్చితమైన పారదర్శకత తీసుకురావాలని, ఉద్యోగులకు కూడా అవసరమైన మేర అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ కోసం కసరత్తు చేయాలని అధికారులకు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, సలహాదారు కృష్ణ, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. (ఇండియన్ జ్యుడీషియల్ సర్వీస్) అప్పుల భారం తగ్గించాలి విద్యుత్ సంస్థలకున్న అప్పులకు చెల్లిస్తున్న అత్యధిక వడ్డీని తగ్గించే ప్రక్రియపై సీఎం సమగ్రంగా చర్చించారు. అత్యధికంగా 12 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తున్న అప్పులపై పునరాలోచన అవసరమన్నారు. 8 శాతం వడ్డీకే అప్పులిచ్చే సంస్థల నుంచి రుణాలు తీసుకుని, అత్యధిక వడ్డీ భారం ఉన్న రుణాలు తీర్చాలని, దీనివల్ల ఏటా కొన్ని వేల కోట్లు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిపారు. అవసరమైతే అప్పులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్నారు. సంస్థలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీని ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని తెలిపారు. ఇక మీదట అనవసరమైన అప్పులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. -
'పవర్' ఫుల్ డిమాండ్
సాక్షి, అమరావతి: వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరగబోతోంది. ఈ ఏడాది (2019–2020) విద్యుత్ డిమాండ్ 68 వేల మిలియన్ యూనిట్లుగా ఉంది. 2023–24కు ఇది దాదాపు లక్ష మిలియన్ యూనిట్లకు చేరుకోవచ్చని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) అంచనా వేశాయి. పగటిపూటే 9 గంటలు వ్యవసాయ విద్యుత్ అందించడం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ఏటా పెంచాలని నిర్ణయించడం, వాణిజ్య, గృహ విద్యుత్ వినియోగం ఏటా 20 శాతం పైబడి పెరిగే అవకాశం ఉండటంతో ఐదేళ్లలో వినియోగం ఇప్పుడు ఉన్నదాని కంటే 32 వేల మిలియన్ యూనిట్లు అధికంగా ఉండొచ్చని లెక్కగట్టాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి డిస్కమ్‌లు అంచనాల (ఫోర్కాస్ట్)ను సమర్పించాయి. అందుబాటులోకి కొత్త ప్లాంట్లు కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నంలో నిర్మాణ దశలో ఉన్న 1600 మెగావాట్ల (ఒక్కొక్కటి 800 మెగావాట్లు) థర్మల్ ప్లాంట్లు 2020లో అందుబాటులోకి వస్తాయి. 2021 నాటికి పోలవరం జల విద్యుత్ కేంద్రాల్లో కొంత ఉత్పత్తిలోకి రావచ్చని భావిస్తున్నారు. అప్పర్ సీలేరులో రివర్స్ పంపింగ్ విధానంలో జల విద్యుత్ కేంద్రం ప్రతిపాదన దశలో ఉంది. మరో రెండేళ్లలో ఇది పూర్తి అవుతుందని అంచనా వేశారు. అదేవిధంగా రాష్ట్రంలో న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తిని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు వ్యవసాయ విద్యుత్ కోసం 10 వేల మెగావాట్లతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పేందుకు ఏపీ జెన్కో సన్నాహాలు చేస్తోంది. ఈ అంచనాల ప్రకారం వచ్చే ఐదేళ్లలో విద్యుత్ రంగంలో జెన్కో కీలక భూమిక పోషించే వీలుంది. ఫలితంగా వినియోగదారులకు చౌకగా విద్యుత్ లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఏపీ జెన్కో స్పీడ్.. విద్యుత్ డిమాండ్‌ను అధిగమించేందుకు ఏపీ జెన్కో సన్నద్ధమవుతోంది. గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లు చౌకగా లభించే ఏపీ జెన్కో ఉత్పత్తిని పెంచాలని, ఇదే క్రమంలో ప్రైవేటు విద్యుత్‌ను తగ్గించాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ప్రస్తుతం (2019–20)లో జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4621.75 మెగావాట్లుగా ఉంది. 2023–24 నాటికి దీన్ని 6117.75 మెగావాట్లకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అదేవిధంగా జల విద్యుత్‌ను ప్రస్తుతమున్న 1755.86 మెగావాట్ల నుంచి 2023–24లో 2706.26 మెగావాట్ల సామర్థ్యానికి తీసుకెళ్తారు. బహిరంగ మార్కెట్లో చౌకగా విద్యుత్ లభించినప్పుడు జెన్కో థర్మల్ ఉత్పత్తికి విరామం ఇవ్వాలని, మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నప్పుడు జెన్కో ఉత్పత్తిని వాడుకోవాలని ప్రణాళికలో పేర్కొన్నారు. -
భారీ ప్రక్షాళన!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పెద్ద ఎత్తున ప్రక్షాళన మొదలైంది. అసిస్టెంట్ ఇంజనీర్ మొదలుకొని, చీఫ్ ఇంజనీర్ వరకు కొత్త విభాగాలు అప్పగించనున్నారు. రూ. 50 వేల వేతనం దాటిన ప్రతి ఒక్కరికీ స్థాన చలనం ఉంటుంది. ఏపీ ట్రాన్స్‌కో, జెన్కోతో పాటు రెండు డిస్కమ్‌లలోని దాదాపు 8 వేల మందికి శాఖాపరమైన మార్పు ఉంటుందని అంచనా. ఈ వ్యవహారంపై శుక్రవారం అన్ని స్థాయిల ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఏ క్షణంలోనైనా ఆదేశాలు... మార్పులకు సంబంధించిన ఆదేశాలు ఏ క్షణంలోనైనా రావచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఎక్కడా కూడా ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రధాన కార్యాలయాల (హెడ్ క్వార్టర్స్)నుంచి బయటకు పంపడం లేదు. సెక్షన్లను మాత్రమే మారుస్తున్నారు. ముఖ్యమైన విభాగంలో కీలక వ్యక్తులకు ప్రస్తుతానికి మినహాయింపు ఉంటుందని ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ బాబు తెలిపారు. కాలక్రమేణా మార్పులు చేస్తామన్నారు. ఇవీ కారణాలు... గత ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వ అవినీతికి కొమ్ముగాసే వారికే కీలక పోస్టులు దక్కాయి. ఏళ్ల తరబడి అదే విభాగాల్లో తిష్టవేశారు. విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్లలో కీలకమైన బొగ్గు రవాణా, ఉత్పత్తి రంగంలోని ముఖ్యమైన పోస్టుల్లో కొంతమంది ఉద్యోగులు దాదాపు 15 ఏళ్ల పైబడి ఉన్నారు. నిజాయితీగా పనిచేసే వారిని ప్రాధాన్యత లేని పోస్టులకు పంపారు. అవినీతి నిరోధక శాఖకు అనేక మంది ఉద్యోగులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చినా విచారణ జరగకుండా అడ్డుకున్నారు. అవినీతి రహిత పాలన దిశగా కొత్త ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో పాత వ్యక్తులు అప్పటి అవినీతి వెలుగులోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయి సమాచారం సేకరించిన ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రక్షాళన చేపట్టింది. ఈ నిర్ణయం పట్ల మెజారిటీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్పు కోసమే: శ్రీకాంత్ భారీ ప్రక్షాళన విద్యుత్ సంస్థల్లో కొత్త మార్పుకు నాంది పలుకుతుందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విభాగాల మార్పువల్ల ఉద్యోగుల్లో నూతనోత్సాహం వస్తుందని, కొత్త ఆలోచనలతో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్పు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, పూర్తి పారదర్శకంగా చేపడుతున్నామని, ఇది విద్యుత్ సంస్థల చరిత్రలో మొదటిసారని పేర్కొన్నారు. -
బొగ్గు క్షేత్రం కేటాయించండి
మందాకిని బొగ్గు గనిని ఏపీజెన్కోకు కేటాయిస్తే ఏటా 7.5 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు లభ్యమవుతుంది. ఈ బొగ్గుతో రోజూ 1700 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఈ బొగ్గు క్షేత్రం నుంచి మొత్తం 287.886 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు లభిస్తుందని వెల్లడైంది. సాక్షి, అమరావతి: ఒడిశా రాష్ట్రంలోని కొత్త బొగ్గు క్షేత్రం మందాకినిని ఏపీజెన్కోకు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం పేర్కొంది. 5,010 మెగావాట్ల సామర్థ్యం గల ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్‌ల నుంచి బొగ్గు సరఫరా ఒప్పందాలున్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ నుంచే ఎక్కువగా సరఫరా అయ్యేదని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత సింగరేణి కోల్ కాలరీస్‌ను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారని, కనీసం బొగ్గు నిల్వల్లో వాటాను కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వలేదని, దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నామని లేఖలో స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్ర విద్యుత్ రంగానికి భరోసా లేకుండా పోయిందని, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు ఈ పరిస్థితి తీవ్ర అవరోధంగా మారిందని వివరించారు. లేఖలో ముఖ్యాంశాలు ఇలా.. – పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో ఐబి వ్యాలీ, తాల్చేరు క్షేత్రాల్లో భారీగా బొగ్గు నిల్వలున్నాయి. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్ఘడ్, తెలంగాణాలు బొగ్గు సంపద ఉన్న రాష్ట్రాలు. – వాణిజ్య అవసరాల కోసం మధ్యప్రదేశ్‌లో ఒకటి, చత్తీస్‌ఘడ్‌లో ఒక గనిని ఏపీఎండీసీకి కేటాయించారు. ప్రతి గని నుంచి 5 ఎంఎంటీఏలు తీసుకోవచ్చు.. అయితే ఈ గనుల నుంచి బొగ్గు వెలికితీతకు నిర్వహణ వ్యయం చాలా అధికంగా ఉంది. – బొగ్గు గనుల చట్టం – 2015 ప్రకారం ట్రాంచీ –6ను ఏపీజెన్కో వినియోగం కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని బొగ్గు మంత్రిత్వ శాఖకు ఏపీజెన్కో దరఖాస్తు చేసుకుంది. – మార్చి 2020 నాటికి ఏపీ జెన్కో తన థర్మల్ కేంద్రాల ద్వారా మరో 1600 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పాదనకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఏటా 7.5 ఎంఎంటీఏ బొగ్గు నిల్వలు అవసరం. – ప్రస్తుతం ఎదుర్కొంటున్న బొగ్గు కొరతను నివారించడానికి, బొగ్గు ఒప్పందాల ప్రకారం మరింత బొగ్గును సరఫరా చేయాల్సి ఉంది. ఈ కారణంగా మందాకిని బొగ్గు క్షేత్రాన్ని వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన విధంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో ఏడాదికి కనీసం 50 ఎంఎంటీఏ బొగ్గును ఏపీఎండీసీ, ఏపీ జెన్కోకు కేటాయించండి. -
బొగ్గులో ‘రివర్స్’
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ మరోసారి విజయవంతమైంది. ఈ విధానంలో ఏపీ జెన్కో మునుపెన్నడూ లేని విధంగా తక్కువ ధరకు బొగ్గు రవాణా కాంట్రాక్టులను ఖరారు చేసింది. రివర్స్ టెండరింగ్ చేపట్టి ఎల్–1 ధర కన్నా తక్కువ రేటుకు వచ్చేలా చేసింది. దీనివల్ల రూ.164.647 కోట్ల ప్రజాధనం ఆదా కానుంది. రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక విధానాలకు ఇది నిదర్శనమని విద్యుత్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సాంకేతిక అర్హత సాధించినవి 7 కంపెనీలు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం (కృష్ణపట్నం) కోసం ఏటా 3.675 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు రవాణాకు సంబంధించి ఏపీ విద్యుత్ అభివృద్ధి సంస్థ (ఏపీపీడీసీఎల్) సెప్టెంబర్‌లో టెండర్లు పిలిచింది. ఒడిశాలోని తాల్చేరు బొగ్గు క్షేత్రం నుంచి సమీపంలోని శుద్ధి చేసే ప్రాంతాలకు బొగ్గును చేరుస్తారు. అక్కడ శుద్ధి చేసిన (వాష్డ్ కోల్) బొగ్గును జల రవాణా ద్వారా కృష్ణపట్నం పోర్టుకు చేరవేస్తారు. ఈ టెండర్ దక్కించుకునేందుకు ఏడు కంపెనీలు సాంకేతిక అర్హత సాధించాయి. ఇందులో ముంబైకి చెందిన ఎంబీజీ కమొడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ టన్నుకు రూ.1,370.01 ధర కోట్ చేసి ఎల్–1గా నిలిచింది. అధికారులు ఈ ధరను కోట్ చేస్తూ రివర్స్ టెండరింగ్ చేపట్టగా చెన్నైకి చెందిన చిట్టినాడ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అతి తక్కువగా మెట్రిక్ టన్నుకు రూ.1,146 ధర కోట్ చేసి బొగ్గు రవాణా కాంట్రాక్టును దక్కించుకుంది. గతంలో ఆరోపణలు.. గత ఐదేళ్లుగా బొగ్గు రవాణా కాంట్రాక్టుల వ్యవహారంలో పలు ఆరోపణలు వచ్చాయి. బొగ్గు కుంభకోణాలపై ‘సాక్షి’ దినపత్రిక ఆధారాలతో సహా అనేక కథనాలు ప్రచురించింది. సీఎం వైఎస్ జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ అంశాన్ని అసెంబ్లీలో సైతం ప్రస్తావించారు. టీడీపీ నేతల కనుసన్నల్లో టెండర్ డాక్యుమెంట్లు రూపొందించిన వైనం విద్యుత్ వర్గాలనే కలవర పెట్టింది. ముడుపులు ఇచ్చిన వారికే కాంట్రాక్టులు దక్కేలా, అతి తక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ఏపీజెన్కోతో టెండర్ నిబంధనలు రూపొందించేలా చేశారు. నేడు పారదర్శకతే ప్రామాణికం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన రివర్స్ టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా నిబంధనలు పొందుపరిచారు. ఒకరికన్నా ఎక్కువ మంది కలిసి బొగ్గు రవాణా కాంట్రాక్టు చేపట్టవచ్చనే వెసులుబాటూ ఇచ్చారు. ఫలితంగా కాంట్రాక్టుల కోసం పలువురు పోటీ పడ్డారు. గత నెల 30వ తేదీన బిడ్స్ ఓపెన్ చేశారు. అదాని ఎంటర్ప్రైజెస్ (గుర్గామ్), ఆనంద్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ (చెన్నై), శరత్ చటర్జీ అండ్ కో (విశాఖ), చిట్టినాడ్ లాజిస్టిక్స్ (చెన్నై), గ్లోబల్ కోల్ మైనింగ్ (న్యూఢిల్లీ), కరమ్ చంద్ తప్పర్, ట్రైడెంట్ (కన్సార్టియం–హైదరాబాద్), ఎంబీజీ కమొడిటీస్ (హైదరాబాద్)తో కలిసి ఎలిగెంట్ లాజిస్టిక్స్ కన్సార్టియంగా ఫైనాన్షియల్ అర్హత పొందాయి. ఎల్–1 ధరతో ఈ నెల 10వ తేదీన రివర్స్ బిడ్డింగ్ నిర్వహించారు. చిట్టినాడ్ మెట్రిక్ టన్ను రూ.1,146 ధరకు ప్లాంట్‌కు బొగ్గు చేరవేసేందుకు ముందుకొచ్చింది. ఈ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. ప్రజాధనం ఆదా అమోఘం గత ప్రభుత్వ హయాంలో బొగ్గు రవాణా కాంట్రాక్టు టన్నుకు రూ.1,240 చొప్పున ఇవ్వగా ప్రస్తుతం ఇచ్చిన కాంట్రాక్టు టన్నుకు రూ.1,146 మాత్రమే కావడం గమనార్హం. అంటే గతంలో కంటే ఈసారి టన్నుకు రూ.100 చొప్పున తక్కువ ధరకు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ ప్లాంట్‌కు ఏటా 36,75,000 మెట్రిక్ టన్నుల బొగ్గు మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి రవాణా అవుతుంది. ఈ కాంట్రాక్టులో ఎల్–1 ధర టన్నుకు రూ.1,370.01 కాగా రివర్స్ టెండరింగ్ వల్ల ఇది రూ.1,146కి వచ్చింది. అంటే మెట్రిక్ టన్నుకు రూ.224.01 చొప్పున తగ్గింది. ఈ క్రమంలో ఏటా రవాణా చేసే 36,75,000 మెట్రిక్ టన్నుల బొగ్గులో రూ.82.32 కోట్లు ఆదా కానుంది. తద్వారా రెండేళ్ల కాంట్రాక్టు గడువులో రివర్స్ టెండరింగ్ ద్వారా మొత్తం రూ.164.647 కోట్లు ఆదా అవుతుంది. జెన్కో చరిత్రలో ప్రథమం వివాదాలకు తావులేకుండా, పారదర్శకంగా బొగ్గు రవాణా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం జెన్కో చరిత్రలో ఇదే ప్ర«థమం. ఎక్కువ మంది పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకున్నాం. రివర్స్ టెండరింగ్ విధానం జెన్కో వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. ప్రజాధనం వృధా కాకుండా కాపాడామన్న సంతృప్తి కలుగుతోంది. ఇక ముందు కూడా ప్రతి టెండర్లను ఇదే విధంగా నిర్వహిస్తాం. కాంట్రాక్టర్ల మధ్య పోటీతో నాణ్యమైన సేవలు అందుతాయి. – శ్రీధర్ (జెన్కో ఎండీ) -
జెన్ కో.. దేఖో..!
సాక్షి, సీలేరు: రాష్ట్రానికి నిరంతరం విద్యుత్ ఉత్పత్తిని అందిస్తున్న ఘనత సీలేరు విద్యుత్ కాం ప్లెక్సు సొంతం. రాష్ట్రానికి వెలుగులు నింపడంలో మొదటి స్థానంలో నిలిచి ప్రతి ఏటా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి ఎన్నో అవార్డులు దక్కించుకుంటోంది. అలాగే గోదావరి పంట భూములకు ఏటా 50టీఎంసీల వరకు నీటిని సరఫరా చేసి అన్నదాతలను ఆదుకునే గొప్పగుణమున్న విద్యుత్ కేంద్రంగా ఖ్యాతిని పెంచుకుంటోంది. ఇంతటి పేరున్న విద్యుత్ కేంద్రంపై ప్రస్తుతం నీలినీడలు కమ్ముకున్నాయి. జెన్కో సంస్థ ఎప్పు డూ ఇక్కడ విద్యుత్ తయారీని అభినందిస్తోందే తప్ప.. ఇక్కడ అధికారుల పనితీరు ఏమిటి? ఇక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి? పనుల నాణ్యత? నిధుల సక్రమ వినియోగం వంటి అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టిన దాఖ లాలు లేవనే విషయం కొన్ని అంశాల్ని పర్యవేక్షిస్తే స్పష్టమవుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం.. ప్రభుత్వానికి శాపంగా మారింది. కోట్లరూపాయల నష్టానికి కారణమవుతోంది. కమీషన్ల కక్కుర్తిలో పడి స్థానిక జెన్కో అధికారులు పనుల్లో నాణ్యతను గాలికొదిలేస్తున్నారు. ఈ నిర్లక్ష్యమే భారీ ప్రమాదాలకు కారణమవుతోంది. పది రోజుల క్రితం డొంకరాయి పవర్ కెనాల్‌కు భారీగా గండి పడిన సంగతి తెలిసిందే. అయితే తుఫాన్ ప్రభావంతో సంఘటన జరిగినప్పటికీ.. గతంలో ఉన్న లోపాల్ని అధికారులు పట్టించుకోకపోవడం కూడా జెన్కో సంస్థకు శాపంగా మారింది. పవర్ కెనాల్‌కు గండి పడడంతో డొంకరాయి, మోతుగూడెం జలవిద్యుత్ కేంద్రంలో 485 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పది రోజులుగా నిలిచిపోయింది. గండిపడి పదిరోజులవుతున్నా ఇప్పటికి నీటిని మళ్లించే పనుల నత్తనడకన సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.30లక్షల నుంచి రూ.40లక్షల ఖర్చుతో చేపడుతున్న పనులు పూర్తి కాలేదు. ఆ పనులు పూర్తయితే తప్ప గండి పడిన ప్రదేశాన్ని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు వీలు కుదరదు. అప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తిని పునఃప్రారంభించడానికి వీలుకాదు. భారీ ప్రమాదం జరిగినప్పటికీ పనుల్లో జాప్యం జరుగుతున్నా ఇప్పటి వరకు జెన్కోలోని డైరెక్టర్ స్థాయి అధికారులు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నత్తనడకన సాగుతున్న నీటి మళ్లింపు పనులు లీకేజీతో పనులకు ఆటంకం... సీలేరు విద్యుత్ కాంప్లెక్సు డొంకరాయి జలవిద్యుత్ కేంద్రం పైభాగంలో జలాశయానికి ఆనుకుని మూడు గేట్లతో శాడిల్ డ్యాం ఉంది. జలాశయంలో పూర్తిగా నీటిమట్టం చేరి జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేయని సమయంలో ఈ గేట్లను ఎత్తి పవర్ కెనాల్ ద్వారా పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి నీటిని సరఫరా చేస్తారు. ప్రస్తుతం పవర్ కెనాల్‌కు గండి పడడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసినా శాడిల్ డ్యాం గేట్లు లీకేజీల కారణంగా రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు పవర్ కెనాల్‌కు వస్తోంది. దీంతో ఆ నీటిని తగ్గించేందుకు ఇప్పటికే అండర్ వాటర్ సర్వీస్ ద్వారా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలీకృతం కావడం లేదు. శాడిల్ డ్యాం గేట్ల రబ్బర్ సీల్స్ నాణ్యమైనవి కాకపోవడమే దీనికి కారణం. అప్పటి అధికారుల కమీషన్ల కోసం చూసీ చూడనట్లు వ్యవహరించడంతో ఇపుడు అది పెద్ద ప్రమాదంగా మారింది. డైవర్షన్ పనులకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తోంది. లీకవుతున్న నీరు రెండు అడుగుల మేర రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పవర్ కెనాల్ కుడి ఎడమ గట్టు పరిస్థితి ప్రమాదంగా ఉందని, దాన్ని పూర్తిస్థాయిలో పనులు చేపట్టాలని ఏడాదిన్నర కిందట పవర్ కెనాల్ ఏఈ.. చీఫ్ ఇంజినీర్‌కు లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టులపై డైరెక్టర్ స్థాయి అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని, పది రోజులు గడిచినా తాత్కాలికంగా నీటిని మళ్లించే పనులు జరగకపోతే గండి పడిన ప్రదేశాన్ని పూడ్చేందుకు ఎన్నిరోజులు పడుతుందోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకింత నిర్లక్ష్యం.. ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్సులోని పలు శాఖల ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే తాజా ప్రమాదానికి కారణం. పవర్ కెనాల్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి దాన్ని మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. కుడి, ఎడమల కాలువల మరమ్మతులు చేపట్టారే తప్ప నీరు ప్రవహిస్తున్న 14 కిలోమీటర్ల అడుగుభాగం ఎలా ఉందని ఇప్పటి వరకు స్థానిక అధికారులు పరిశీలించలేదు. అడుగు భాగం 15మీటర్ల వరకు చొచ్చుకుపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. దీంతో ప్రస్తుతం నీటి మళ్లింపు ఖర్చు, పనుల ఖర్చు, గండి పడిన ప్రదేశంలో నిర్మాణం చేపట్టడంతో పాటు గత పదిరోజులుగా రెండు విద్యుత్ కేంద్రాల్లో నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి కారణంగా ప్రభుత్వానికి కోట్ల రూపాయల భారీ నష్టం తప్పలేదు. దీనికి స్థానిక అధికారులే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పని చేయాలి
సాక్షి, హైదరాబాద్: స్థానికత ప్రతిపాదికన ఏ రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ట్రంలోనే కొనసాగించాలని, ఒక వేళకాదని ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలని చూస్తే మలిదశ తెలంగాణ పోరాటానికి కూడా వెనుకాడబోమని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ విద్యుత్ ఎకౌంట్ ఆఫీసర్స్ అసోసియేషన్లు కోరాయి. సమస్య జటిలం కాకముందే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై తుది నిర్ణయానికి రావాలని అల్టిమేటం జారీ చేశాయి. ఈ మేరకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్. శివాజీ, మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ఎలక్ట్రికల్ ఎకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకుడు అంజయ్య సంయుక్తాధ్వర్యంలో బుధవారం ఎర్రగడ్డ జెన్కో ఆడిటోరియంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఇదే అంశంపై తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.రత్నాకర్‌రావు, కార్యదర్శి సదానందం అధ్యక్షతన ఆ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి, తీర్మా నం ప్రతిని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధు లు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను ఆప్షన్ల పేరుతో తెలంగాణ విద్యుత్ సంస్థల్లోకి తెచ్చే కుట్ర జరుగుతోందని, ఏపీ ప్రతిపాదనను తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని వారు స్పష్టం చేశారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 229 మంది తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ సంస్థల్లో చేర్చుకున్నట్లే.. ఆంధ్ర స్థానికత గల 1157 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీ విద్యుత్ సంస్థల్లో చేర్చుకోవాలన్నారు. తమ అభీష్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రులు వ్యవహరిస్తే..వారికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కిరణ్‌కుమార్, వెంకటనారాయణ, జనప్రియ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
జలవిద్యుదుత్పత్తి పనుల్లో గోల్మాల్!
సాక్షి, అమరావతి: పోలవరం పేరుతో టీడీపీ అధికారంలో ఉండగా సాగించిన అక్రమాల చిట్టాలో ఇది మరొకటి. పోలవరం జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనుల్లో తట్టెడు మట్టెత్తకుండానే కాంట్రాక్టర్‌కు రూ.481 కోట్లకుపైగా చెల్లించేశారు. కాంట్రాక్టు ఒప్పందం చేసుకోగానే నిబంధనలకు విరుద్ధంగా రూ.331.04 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించడం, జలవిద్యుద్పుత్తి కేంద్రం పనుల కోసం 3–డీ నమూనాలో పరిశోధనల పేరుతో రూ.వంద కోట్లు ఇచ్చేయడం గమనార్హం. సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులు చేయకున్నా రూ.50 కోట్లు ధారాదత్తం చేయడంపై ఏపీ జెన్కో (ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పత్తి సంస్థ) వర్గాలే నివ్వెరపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో సాగిన ఈ నిర్వాకాల్లో లోగుట్టు ఏమిటన్నది బహిరంగ రహస్యమే. కోటరీ కాంట్రాక్టర్‌కు పనులు దక్కేదాకా.. పోలవరానికి అనుబంధంగా 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే విద్యుదుత్పత్తి ప్రాజెక్టు పనులకు సంబంధించి రూ.3,157.93 కోట్లను ఐబీఎం (అంతర్గత అంచనా విలువ)గా నిర్ణయిస్తూ 2017 జనవరి 9వతేదీన ఈపీసీ(ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ విధానం)లో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు దక్కే అవకాశం లేకపోవడంతో అప్పటి ప్రభుత్వ పెద్దలు మూడుసార్లు టెండర్లు రద్దు చేయించారు. చివరకు తాము కోరుకున్న కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా చేసి 2017 అక్టోబర్ 11న టెండర్ల ప్రైస్ బిడ్ తెరిపించారు. 4.83 శాతం అధిక ధర (రూ.3,310.46 కోట్లు) కోట్ చేసి ఎల్–1గా నిలిచిన నవయుగ సంస్థకు జలవిద్యుత్పత్తి కేంద్రం పనులు అప్పగిస్తూ 2017 డిసెంబర్లో ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం 60 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. నిబంధనలు తుంగలోకి.. కాంట్రాక్టు ఒప్పందంలో అంచనా విలువలో పది శాతం (ఐదు శాతం మెటీరియల్‌కు, ఐదు శాతం లేబర్‌కు) మొబిలైజేషన్ అడ్వాన్సుగా కాంట్రాక్టర్‌కు చెల్లించవచ్చు. నిబంధనల ప్రకారం తొలుత అంచనా వ్యయంలో 1 శాతాన్ని సర్వే పనుల కోసం మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించాలి. తర్వాత మెటీరియల్ కోసం రెండు శాతాన్ని ఒకసారి, యంత్రాలు సమీకరించాక మిగతా రెండు శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించాలి. పనులు ప్రారంభించాక లేబర్ కాంపొనెంట్ కింద తొలుత ఒక శాతం, తర్వాత రెండు దఫాలుగా రెండు శాతం చొప్పున మొబిలైజేనేషన్ అడ్వాన్సు చెల్లించాలి. అయితే జెన్కో అధికారులు పనుల వ్యయంలో పది శాతం అంటే రూ.331.04 కోట్లను కాంట్రాక్టర్‌కు చెల్లించేశారు. మొబిలైజేషన్ అడ్వాన్సులు బడా‘బాబు’ జేబులోకి చేరాయని, అందుకే నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని జెన్కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. డబ్బుల్ ధమాకా.. పోలవరం జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులను నవయుగ దక్కించుకున్నాకే అదే సంస్థకు హెడ్ వర్క్స్ పనులను చంద్రబాబు కట్టబెట్టారు. వాస్తవంగా పోలవరం హెడ్‌వర్క్స్‌ను ట్రాన్స్ట్రాయ్ రూ.4,054 కోట్లకు దక్కించుకుంది. అనంతరం ఈ వ్యయాన్ని రూ.5,535.91 కోట్లకు పెంచేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌ని అడ్డం పెట్టుకుని హెడ్‌వర్క్స్ పనులన్నీ ‘సబ్’ కాంట్రాక్టర్లకు అప్పగించి ఫిబ్రవరి 2018 వరకు చేసిన పనులకు రూ.2,362.22 కోట్ల బిల్లులు చెల్లించి చంద్రబాబు కమీషన్లు వసూలు చేసుకున్నారు. 60సీ నిబంధన కింద ట్రాన్స్‌ట్రాయ్‌ని తొలగించి స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులను ఎల్ఎస్(లంప్సమ్)–ఓపెన్ విధానంలో రూ.3,102.37 కోట్లకు నవయుగ సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టేశారు. ట్రాన్స్‌ట్రాయ్‌తో ఈపీసీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా ఎల్ఎస్–ఓపెన్ విధానంలో మరో కాంట్రాక్టర్‌కు అప్పగించడం నిబంధనలకు విరుద్ధం. ఒకే సంస్థకు పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు కట్టబెట్టడం వెనుక లోగుట్టు ఏమిటన్నది బహిరంగ రహస్యమే. పనులు చేయకుండా.. చేస్తామంటూ పోలవరం హెడ్‌వర్క్స్ పనులు చేపట్టిన నవయుగ సంస్థే జలవిద్యుదుత్పత్తి కేంద్రం పునాది పనులను పూర్తి చేసి ఏపీ జెన్కోకు అప్పగించాలి. అయితే ఇప్పటివరకూ పునాది పనులను కూడా పూర్తి చేయని నవయుగ తమకు జలవిద్యుదుత్పత్తి కేంద్రం ప్రాంతాన్ని అప్పగిస్తే పనులు ప్రారంభిస్తామంటూ ఏపీ జెన్కో అధికారులకు పదేపదే లేఖలు రాస్తోంది. దీని ఆధారంగా జలవిద్యుత్పత్తి కేంద్రం పనులు చేపట్టే ప్రాంతాన్ని తమకు అప్పగించాలంటూ ఏపీ జెన్కో అధికారులు పోలవరం ఈఎన్సీకి లేఖలు రాస్తున్నారు. కానీ ఆ పనులు చేయాల్సిన నవయుగ సంస్థ ఇప్పటికీ వాటిని పూర్తి చేయలేదు. దీంతో పోలవరం ఈఎన్సీ ఆ ప్రాంతాన్ని ఏపీ జెన్కోకు అప్పగించలేదు. దీన్ని అడ్డంపెట్టుకుని జలవిద్యుత్పత్తి కేంద్రం పనులను నవయుగ ప్రారంభించలేదు. కాంట్రాక్టు ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకూ అంటే 20 నెలలుగా ఆ సంస్థ పనులు చేపట్టలేదు. జలవిద్యుదుత్పత్తి కేంద్రం ప్రాంతాన్ని తమకు అప్పగించడంలో జాప్యం వల్లే పనులు ప్రారంభించలేకపోయామని, ఇందుకు అదనంగా పరిహారం చెల్లించాలని, ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు చెల్లించాలని డిమాండ్ చేసేందుకు నవయుగ సంస్థ అప్పుడే సిద్ధమైందని ఏపీ జెన్కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఖజానాను కొల్లగొట్టి.. జలవిద్యుదుత్పత్తి కేంద్రం పనులు చేపట్టాలంటే నీటి ఉద్ధృతిని అంచనా వేసి డిజైన్ రూపొందించాలి. ఈ బాధ్యత కాంట్రాక్టర్‌దే. మొబిలైజేషన్ అడ్వాన్సు నిధులతో ఈ సర్వే పనులు చేయాలి. అయితే 3–డీ నమూనాలో పరిశోధనలు చేసి డిజైన్లు రూపొందించాలనే సాకుతో రూ.వంద కోట్లను నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్‌కు చెల్లించడం గమనార్హం. ఖజానాను కొల్లగొట్టి చెల్లింపులు చేయడంపై అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి. ఇక జలవిద్యుదుత్పత్తి కేంద్రం సర్వే పనులు చేయకున్నా మరో రూ.50 కోట్లను కాంట్రాక్టర్‌కు చెల్లించడం అక్రమాలకు పరాకాష్ట. -
రైతన్న కోసం ఎంతైనా ఖర్చు
సాక్షి, అమరావతి: చౌకగా నాణ్యమైన విద్యుత్‌ను ప్రజలకు అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. ఖరీదైన విద్యుత్ కొనుగోళ్లకు స్వస్తి చెప్పి, విద్యుత్ రంగాన్ని ఐదేళ్లుగా పట్టి పీడిస్తున్న జాడ్యాన్ని వదిలించాలని అధికారులకు పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం సచివాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ వివరాలను ఇంధన పొదుపు సంస్థ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు విడుదల చేశారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని మంత్రి బాలినేని చెప్పారు. తొమ్మిది గంటల పగటి విద్యుత్ సరఫరాను శాశ్వతం చేస్తామన్నారు. ఇందు కోసం రూ. 2,780 కోట్లు (రూ. 1,700 కోట్లు అదనపు మౌలిక సదుపాయాలకు, రూ. 1,080 కోట్లు అదనంగా 2 గంటలు సరఫరా చేసేందుకు) ఖర్చు చేయనున్నట్లు వివరించారు. దీనివల్ల సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిస్తుందనేది ముఖ్యమంత్రి ప్రగాఢ విశ్వాసమని తెలిపారు. ఉచిత విద్యుత్‌ను సమర్థంగా అమలు చేసేందుకుగాను 18 లక్షల మంది రైతుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు చెప్పారు. విద్యుత్ శాఖలో లొసుగులు లేకుండా కఠినంగా వ్యవహరించాలని, పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండును తీర్చే స్థాయిలో ఏపీ జెన్కో సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. జెన్కోను బలోపేతం చేద్దాం: ఇంధన శాఖ కార్యదర్శి ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కోను బలోపేతం చేసే దిశగా ఉద్యోగులు శ్రమించాలని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి సిబ్బందిని కోరారు. సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించడం, విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, ప్రజా భాగస్వామ్యాన్ని పెంచడం, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉదయ్, డీడీయూజీజేవై, ఐపీడీఎస్ వంటి వాటిని గరిష్టంగా వినియోగించుకోవడంపై నిర్దేశిత గడువుతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,995 మెగావాట్ల డిమాండ్ ఉందని, 2023–24 కల్లా ఇది 15,015 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ తలసరి విద్యుత్ వినియోగం 1,147 కిలోవాట్లుగా ఉందని, జాతీయ స్థాయిలో ఇది 1,149 కిలోవాట్లని తెలిపారు. విద్యుత్ డిమాండ్ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే దిశగా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, చౌక విద్యుత్ కొనుగోలుకే ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీకాంత్ సూచించారు. గడువులోగా జెన్కో పవర్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టినట్లు ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్ పేర్కొన్నారు. ఎన్టీటీపీఎస్ ఐదో దశ (800 మెగావాట్లు), కృష్ణపట్నం (800 మెగావాట్లు) థర్మల్ ప్రాజెక్టులను ఆర్నెల్లలో పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
బాబు పాలనలో ప్రైవేట్ ‘పవర్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడచిన ఐదేళ్లుగా ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి కంటే ప్రైవేటు రంగానికే పాలకులు పెద్దపీట వేశారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ ఏపీజెన్కో సమర్థతకు పూర్తిగా గండి కొట్టారు. అదేసమయంలో సరైన మౌలిక సదుపాయాలు కూడా లేని ప్రైవేటు రంగానికి ఎన్నో రెట్లు మేర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే అవకాశం కల్పించారు. కమీషన్లు ఇచ్చే సంస్థలను, ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్న వారిని టీడీపీ సర్కారు ప్రోత్సహించింది. ఫలితంగా ఏపీ జెన్కో ఉత్పత్తి సామర్థ్యం కోల్పోయి, అప్పుల ఊబిలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. నిజానికి జెన్కోకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే.. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ తక్కువ ధరకే లభించి ఉండేది. కానీ, ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో అలా జరగలేదు. తాజాగా విద్యుత్ శాఖ సమీక్షలో నివ్వెరపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. కృష్ణపట్నం నుంచే 1,600 మెగావాట్లు 2014లో ఏపీ జెన్కో కరెంటు ఉత్పత్తి సామర్థ్యం 4,483.29 మెగావాట్లు కాగా, 2019 నాటికి ఇది కేవలం 7,429.84 మెగావాట్లకు చేరింది. అంటే 2014–19 మధ్య కాలంలో జెన్కో ఉత్పత్తి సామర్థ్యం 2,946.54 మెగావాట్లు మాత్రమే అదనంగా పెరిగింది. ఇందులోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 1,600 మెగావాట్ల సామర్థ్యం గల కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. 2016లో సీవోడీ ప్రకటించారు. ఈ లెక్కన చూస్తే ఈ ఐదేళ్లలో ప్రభుత్వ రంగంలో ఒక్క మెగావాట్ కూడా కొత్తగా ఉత్పత్తి కాలేదు. ప్రైవేటు విద్యుత్ మాత్రం 2014లో 3,997.30 మెగావాట్లు ఉండగా, 2019 మార్చి నాటికి ఏకంగా 9,176.81 మెగావాట్లకు చేరింది. ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ఉత్పత్తి సామర్థ్యం కేవలం 2,946.54 మెగావాట్లు పెరిగితే, ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి 5,179.51 మెగావాట్లు పెరిగింది. వినియోగదారులపైనే భారం దేశవ్యాప్తంగా కాంపిటీటివ్ బిడ్డింగ్‌లో సోలార్, పవన విద్యుత్ ధరలను నిర్ణయిస్తుండగా, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రైవేటు సోలార్, విండ్ పవర్ ఉత్పత్తిదారులకు దోచిపెట్టింది. సోలార్ కరెంటుకు ఒక్కో యూనిట్‌కు గరిష్టంగా రూ.6, పవన విద్యుత్‌కు రూ.4.84 వరకూ చెల్లించింది. ఐదేళ్లలో ప్రైవేటు రంగంలో పవన విద్యుత్ ఉత్పత్తి 777.02 మెగావాట్ల నుంచి 4,102.39 మెగావాట్లకు చేరింది. ఇదే సమయంలో సౌర విద్యుత్ ఉత్పత్తి 76.85 మెగావాట్ల నుంచి 2,584.85 మెగావాట్లకు పెరిగింది. టీడీపీ ప్రభుత్వంలో పాలకులు తమ స్వలాభం కోసం జెన్కోను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం వల్ల విద్యుత్ సంస్థలు దాదాపు రూ.20 వేల కోట్ల మేర అదనపు భారాన్ని మోయాల్సి వస్తోంది. -
ఉద్యోగుల ట్రస్టు నిధులు హాంఫట్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇప్పటికే ఒక్కో సేవను ప్రైవేట్‌పరం చేస్తూ ఉద్యోగుల పొట్టకొడుతున్న విద్యుత్ సంస్థలు ఇప్పుడు ఏకంగా ఉద్యోగుల ట్రస్టుకే చిల్లు పెట్టేశాయి. ఏకంగా రూ.2 వేల కోట్ల మేర ఉద్యోగుల ట్రస్టు నిధులను దీని నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జెన్కో తన సొంతానికి వాడుకుంది. 25 వేల మంది ఉద్యోగుల భవిష్యత్ కోసం భద్రపరచిన సొమ్మును జెన్కో సొంత అవసరాలు, సింగరేణి నుంచి బొగ్గు కొనుగోలు చెల్లింపులు తదితరాలకు వినియోగించడం ఆందోళనకు దారి తీస్తోంది. సిబ్బంది సంక్షేమానికి తూట్లు ఉద్యోగుల పింఛన్ల కోసం భద్రపరిచిన రూ.1,500 కోట్లను జెన్కో ఇప్పటికే వినియోగించగా నాలుగేళ్లుగా అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ వాటాగా విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన రూ.500 కోట్లను ఇవ్వకుండా వాడుకోవడం చర్చనీయాంశమవుతోంది. జెన్కోతోపాటు ట్రాన్స్‌కో, డిస్కంల ఉద్యోగులందరికీ ఈ ట్రస్టు ద్వారానే పింఛను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల స్థూల వేతనంలో 9 శాతం చొప్పున సిబ్బంది సంక్షేమం కోసం మూడు విభాగాల నుంచి ట్రస్టుకు జమ చేస్తున్నారు. అయితే నాలుగేళ్లుగా సుమారు రూ.500 కోట్లను డిపాజిట్ చేయకుండా జెన్కో అవసరాలకు వినియోగించారు. మళ్లీ నిర్వీర్యం చేసే చర్యలు మొదలు.. ఇంధన ధరల్లో హెచ్చుతగ్గుల ఆధారంగా జెన్కోకు డిస్కంలు ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్ఎస్ఏ) రూపంలో అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సర్దుబాటు చార్జీల రూపంలో డిస్కంల నుంచి రావాల్సిన మొత్తాన్ని కాగితాల్లో మాత్రం ట్రస్టు నిధులుగా చూపుతున్నట్టు సమాచారం. విద్యుత్ సంస్కరణలో సమయంలో డిస్కంలను ప్రైవేట్‌పరం చేస్తారని, జెన్కోకు చెందిన ఒక్కో ప్లాంటును విక్రయిస్తారని అప్పట్లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చెందారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా వచ్చిన తర్వాత జెన్కోకు ప్రభుత్వ గ్యారంటీతో నిధులు ఇవ్వడంతో పాటు భారీగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని జెన్కో ఆధ్వర్యంలో చేపట్టారు. అంతేకాకుండా డిస్కంల ప్రైవేటీకరణ ఆలోచనను తిరస్కరించడంతో పాటు వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. అయితే చంద్రబాబు మళ్లీ సీఎంగా వచ్చిన తర్వాత తిరిగి విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసే చర్యలు మొదలయ్యాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై జెన్కో ఎండీ కె.విజయానంద్‌ను సంప్రదించగా.. ట్రస్ట్ నిధులను వినియోగించుకునేందుకు అవకాశం లేదన్నారు. ఏమిటీ ట్రస్టు..? గతంలో విద్యుత్ సంస్థలన్నీ కలిపి ఒకే సంస్థగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్ఈబీ) పేరుతో మనుగడలో ఉండేవి. 1999లో ఏపీఎస్ఈబీని చంద్రబాబు ప్రభుత్వం ముక్కలు చేసింది. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లుగా మూడు ముక్కలు చేసింది. విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగులకు మెరుగైన జీతాలు, హోదాతోపాటు పింఛన్లు కూడా ఇస్తామని ఈ సందర్భంగా హామీలను గుప్పించింది. ఈ మేరకు ఏపీఎస్ఈబీ, ప్రభుత్వం, ఉద్యోగులకు 1999లో త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. పెన్షన్ నిధికి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఓ ట్రస్టును కూడా ఏర్పాటు చేశారు. మొదట్లో రూ.4 వేల కోట్లతో ఈ ట్రస్టు ఏర్పాటైంది. ఏపీఎస్ఈబీ హయాంలో ఉద్యోగం పొందిన చివరి సిబ్బంది పదవీ విరమణ చేసేవరకూ ఈ ట్రస్టును మనుగడలో ఉంచాలని నిర్ణయించారు. ఇలా 2033 వరకూ ఈ ట్రస్టు మనుగడలో ఉండనుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ట్రస్టులో రూ. 2,500 కోట్ల మేర నిధులున్నాయి. ఇందులో నుంచి ఇప్పటిదాకా రూ.1,500 కోట్లు వినియోగించారు. -
అవినీతి చీకట్లో విద్యుత్ రంగం
-
ఈ నెలలోనే పోలవరం జలవిద్యుత్ కేంద్రం టెండర్లు
విశాఖపట్నం: పోలవరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టే జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు ఈ నెలలోనే టెండర్లు పిలవనున్నట్లు ఏపీ జెన్కో (హైడల్) డైరెక్టర్ సీహెచ్. నాగేశ్వరరావు తెలిపారు. తొలి దశలో ఒక్కొక్కటి 80 మెగావాట్లు చొప్పున మూడు యూనిట్లను నిర్మిస్తామని, మూడున్నరేళ్లలో ఉత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండో దశలో మరో తొమ్మిది యూనిట్లను 18 నెలల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. మొత్తం మీద ఐదేళ్లనాటికి 12 యూనిట్ల ద్వారా 960 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏటా 2,300 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, తద్వారా రూ.230 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. Tenders for Polavaram power station in january -
'ఏపీజెన్కో అధికారులు వేధిస్తున్నారు'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య మరో వివాదం తలెత్తింది. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 21 మంది తెలంగాణ ఇంజినీర్లు తమను ఏపీ జెన్కో అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై జెన్కో అధికారులు పరిమితికి మించిన పనిభారం మోపుతున్నారని పేర్కొటూ.. మూడు రోజులుగా తెలంగాణ ఇంజనీర్లు విధులకు హాజరవడం మానేశారు. -
సీఆర్డీఏ వర్సెస్ ట్రాన్స్‌కో
కాంట్రాక్టుల కోసం పవర్ వార్ టెండర్లు పిలిచే విషయంలో పోటాపోటీ సీఎం వద్దకు పంచాయితీ రాజీ కోసం అజయ్‌జైన్ రంగ ప్రవేశం సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి పరిధిలో ప్రతిపాదిత విద్యుత్ ప్రాజెక్టుల వ్యవహారం రెండు ప్రభుత్వ శాఖల మధ్య వివాదాస్పదమైంది. రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ (సీఈఆర్డీఏ), ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మధ్య కాంట్రాక్టుల విషయంలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. అన్నీ తమ పరిధిలోకే వస్తాయని సీఆర్డీఏ చెబుతుంటే, విద్యుత్ విషయంలో వాళ్ళకేం సంబంధమని ట్రాన్స్‌కో వాదిస్తోంది. ఈ పంచాయితీ చివరకు ముఖ్యమంత్రి వరకూ వెళ్ళడం విశేషం. రెండు శాఖల మధ్య రాజీ కుదిర్చే బాధ్యతను ఇంధన కార్యదర్శి అజయ్ జైన్‌కు అప్పగించినట్టు తెలిసింది. అమరావతిలో 2019 నాటికి 5 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని సింగపూర్ కంపెనీలు అంచనా వేశాయి. ఏపీ విద్యుత్ సంస్థలు మాత్రం మూడు వేల మెగావాట్లే ఎక్కువని చెబుతున్నారు. ఈ వివాదం అలా ఉంటే... తొలి దశలో 1500 మెగావాట్ల మేర విద్యుత్‌ను అందుబాటులోకి తేవడానికి కొన్ని ప్రాజెక్టులను ప్రతిపాదించారు. రాజధాని వలయం చుట్టూ భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్), ఏపీ ట్రాన్స్‌కో రూపొందించాయి. సీఆర్డీఏ అనుమతి ఇస్తే ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని విద్యుత్ సంస్థలు భావించాయి. ఈ మేరకు సీఆర్డీఏకు లేఖ కూడా రాశాయి. అయితే సీఆర్డీఏ పరిధిలోని ప్రతీ టెండర్పైన తమకే పిలిచే హక్కుందని సీఆర్డీఏ అంటోంది. విద్యుత్ లైన్లు వేయడం, ట్రాన్స్ఫార్మర్లు, భూగర్భ కేబుల్ వేయడం, వాటి నిర్వహణ సీఆర్డీఏకి ఏం తెలుసు? అని ట్రాన్స్‌కో వాదిస్తోంది. భవిష్యత్‌లోనూ విద్యుత్ లైన్ల నిర్వహణను చూసేది ట్రాన్స్‌కో కాబట్టి టెండర్లు ఎవరికి ఇవ్వాలనే దానిపై తమకే అధికారం ఉండాలంటోంది. ఆరంభంలోనే రెండు శాఖలు వీధికెక్కడం వెనుక స్వప్రయోజనాలున్నాయనే విమర్శలొస్తున్నాయి. దాదాపు రూ. 1500 కోట్ల కాంట్రాక్టులను దక్కించుకునేందుకు ఇప్పటికే ట్రాన్స్‌కో అధికారులతో ఓ కంపెనీ లోపాయికారి ఒప్పందాలు చేసుకుందని తెలిసింది. అదే విధంగా మరో కంపెనీ సీఆర్డీఏ అధికారులతో లాలూచీ వ్యవహారం నడుపుతోందనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే పరస్పరం వాదులాడుకుంటున్నారని ట్రాన్స్‌కో వర్గాల సమాచారం. -
పీఎల్ఎఫ్ హామీ.. జెన్కో కహానీ...
21శాతం పీఎల్ఎఫ్ దేశంలో ఎక్కడా లేదు.. అధిక బిడ్డింగ్‌ను సమర్థించుకోవడం కోసమే కథలు ప్రయివేటు కంపెనీలకు దోచిపెట్టే ఎత్తుగడలు నాణ్యమైన దేశీయ సోలార్ ప్యానల్స్ వాడాలన్న నిబంధన లేదు చౌకైన విదేశీ ప్యానెల్స్ వాడేందుకు వెసులుబాటు ఎక్కువ ప్యానల్స్‌తో అధిక ఉత్పత్తీ బూటకమేనంటున్న నిపుణులు ఏపీ జెన్కో ‘సోలార్’ టెండర్లలో తవ్వినకొద్దీ అవినీతి షోరూంలో ఒక ద్విచక్రవాహనం కొంటాం. లీటర్ పెట్రోలు 100 కిలోమీటర్లు ఇస్తుందని చెబుతారు. రోడ్డు మీదకొచ్చాక 60 కిలోమీటర్లు మించి ఇవ్వదు. అడిగితే... ల్యాబ్ కండిషన్స్ ప్రకారమే ఆ మైలేజీ అంటారు. రోడ్ కండిషన్స్ ఎలా ఉన్నా సరే అంత మైలేజీ వస్తుందని మేం హామీ ఇచ్చామా అని ప్రశ్నిస్తారు.... ఏపీ జెన్కో సోలార్ కాంట్రాక్టుల విషయంలో నూటికి నూరుపాళ్ళు ఈ సూత్రాన్నే రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తోంది. 21 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) ఉండటం వల్లే సోలార్ ప్లాంట్ల నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉందని జెన్కో చెబుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో గానీ, ఎన్టీపీసీ చేపట్టిన ఇతర ప్రాజెక్టులలో గానీ పీఎల్ఎఫ్ 18.2 శాతం మాత్రమే. దేశంలో ఎక్కడా 21శాతం పీఎల్ఎఫ్ సాధ్యం కాలేదు. మరి మన రాష్ర్టంలో ఇది ఎలా సాధ్యమవుతుంది? దానికి జెన్కో వద్ద సరైన సమాధానం లేదు. సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లా తాడిపత్రికి సమీపంలోని తలారిచెరువు వద్ద ఏపీ జెన్కో చేపట్టే 500 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం టెండర్ల వ్యవహారంలో తవ్వినకొద్దీ అవినీతి వెలుగులోకి వస్తోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ దినపత్రిక సోమవారం ప్రచురించిన ‘ఏపీ సోలార్... రూ.755 కోట్లు గోల్మాల్’ కథనం ఏపీ జెన్కో వర్గాల్లో కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టుల్లో చోటుచేసుకున్న ఇతర కోణాలపై సోలార్ విద్యుత్ రంగ నిపుణులు విలువైన సమాచారం అందించారు. ఇందులో ప్రధానంగా సోలార్ ప్యానళ్ళపై లోతైన విశ్లేషణలు చేశారు. పీఎల్ఎఫ్ అంటే... ఒక మెగావాట్ సామర్థ్యమున్న ప్లాంట్ 365 రోజులూ పనిచేస్తే వచ్చే ఉత్పత్తిని ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) అంటారు. పీఎల్ఎఫ్ అనేది ప్లాంట్‌లో ఏర్పాటు చేసే సోలార్ ప్యానెల్స్ నాణ్యత, సంఖ్య, వాతావరణ స్థితిగతులు వంటి ఎన్నిటిపైనో ఆధారపడి ఉంటుంది. ఏపీజెన్కో తలపెట్టిన తలారిచెరువు సోలార్ పవర్ప్లాంట్లలో పీఎల్ఎఫ్ సాధ్యాసాధ్యాలపై సోలార్ విద్యుత్ రంగ నిపుణులు అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. 21శాతం పీఎల్ఎఫ్ సాధ్యమేనా? భారత్‌లో తయారయ్యే సోలార్ ప్యానెల్స్‌కి, ఇతర దేశాల్లో తయారయ్యే ప్యానెల్స్‌కి చాలా తేడా ఉంది. విదేశాల్లో సాధారణంగా సగటు పరిసరాల ఉష్ణోగ్రత 20 డిగ్రీలకు మించదు. భారత్‌లో సగటు పరిసరాల ఉష్ణోగ్రత 24 నుంచి 29 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉంటుంది. అంటే స్వదేశీ ప్యానల్స్ కన్నా, విదేశీ ప్యానల్స్ నుంచి తక్కువ సౌరవిద్యుత్ వస్తుందని అర్ధమౌతుంది. ఒక మెగావాట్‌కు విదేశీ ప్యానళ్ళు వాడితే భారత వాతావరణ స్థితి గతుల ఆధారంగా 17 నుంచి 18 శాతం పీఎల్ఎఫ్ మాత్రమే ఇస్తాయి. ప్యానల్స్ సంఖ్య పెంచినా ఇందులో మార్పు ఉండదనేది నిపుణుల అంచనా. ఎందుకంటే, 500 మెగావాట్లకు 17.5 లక్షల ప్యానళ్ళు వాడితే, సౌరశక్తి నాణ్యమైన ఉత్పత్తిని ఇస్తుంది. అంతకు మించి వాడితే సోలార్ ప్యానల్స్ మధ్య తగినంత దూరం లేక రేడియేషన్ తగ్గుతుందని దానివల్ల ఉత్పత్తి కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. కానీ జెన్కో మాత్రం నమ్మశక్యం కాని వాదన విన్పిస్తోంది. బిడ్డింగ్‌లో ఎంపికైన కంపెనీలన్నీ 21 శాతం పీఎల్‌ఎఫ్‌కు హామీ ఇస్తాయని చెబుతోంది. ప్లాంట్‌లో అక్కడక్కడా రీడింగ్ తీసుకుని సగటున మొత్తానికి పీఎల్ఎఫ్ లెక్కగట్టాలనేది బిడ్డింగ్‌లో షరతు. దీనివల్ల రేడియేషన్ ఎక్కువగా ఉన్నచోట రీడింగ్ తీసి, దాన్నే కొలమానంగా చూపించే వీలుంది. దీనికి తోడు సూర్యరశ్మి సరిగా లేకపోతే, ఉత్పత్తి విషయంలో కాంట్రాక్టర్‌కు ఏ విధమైన సంబంధమూ ఉండదనే వెసులుబాటు కూడా కల్పించారు. ప్యానల్స్ పేరుతో మాయాజాలం... సోలార్ ప్లాంట్‌లో ప్యానళ్ళే కీలకం. ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం దీనికే ఖర్చవుతుంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి నాణ్యత వీటిపైనే ఆధారపడి ఉంది. జెన్కో మెగావాట్‌కు రూ. 6.26 కోట్ల చొప్పున సోలార్ కాంట్రాక్టులు ఇవ్వబోతోంది. అంటే 5 బ్లాకుల్లో 500 మెగావాట్లకు రూ. 3,130 కోట్లు అంచనా వ్యయం అన్నమాట. ఇందులో 60శాతం అంటే.. రూ. 1,878 కోట్లు ప్యానల్స్‌కు అవుతుంది. ఒక్కో మెగావాట్‌కు 3,500 సోలార్ ప్యానల్స్ అవసరం. పీఎల్ఎఫ్ కోసం మరో 17 శాతం ఎక్కువ ప్యానెల్స్ ఉపయోగిస్తున్నట్లు జెన్కో చెబుతోంది. ఈ లెక్కన సుమారు మరో 500 అదనంగా చేరిస్తే మెగావాట్‌కు 4,000 ప్యానెల్స్ వాడనున్నారు. అంటే 500 మెగావాట్లకు దాదాపు 20 లక్షల ప్యానల్స్ వాడతారన్నమాట. ప్యానెల్స్ కోసం రూ.1,878 కోట్లు ఖర్చుచేస్తున్నారని తేలింది కాబట్టి.. ఒక్కో ప్యానల్‌కు రూ. 9,370 చెల్లిస్తున్నారని అర్ధమౌతోంది. వాస్తవానికి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే సోలార్ ప్యానల్ ఖరీదు ప్రస్తుతం 96 డాలర్లు (సుమారు రూ. 6,500) మాత్రమే. ఈ లెక్కన ఒక్కో ప్యానల్‌కు రూ. 2,870 (9,370-6,500)చొప్పున, 20 లక్షల ప్యానల్స్‌కు ఏపీ జెన్కో అదనంగా చెల్లిస్తున్నమొత్తం రూ. 574 కోట్లు అన్నమాట. మన దేశ వాతావరణ పరిస్థితుల ప్రకారం తయారయ్యే నాణ్యమైన సోలార్ ప్యానెల్ కూడా రూ. 7,500 వేల లోపే లభిస్తోందని నిపుణులు అంటున్నారు. అయితే ఈ కాంట్రాక్టులో స్వదేశీ ప్యానళ్లు ఉపయోగించాలనే నిబంధన లేదు. అంటే చౌకగా దొరికే విదేశీ ప్యానెల్స్ మాత్రమే ఉపయోగిస్తారని వేరే చెప్పనక్కరలేదు. -
ఏపీజెన్కో బొగ్గు కొనుగోళ్లలో అనుమానాలు
-
ఏపీ సర్కార్ ‘కోల్’మాల్
♦ విదేశీ బొగ్గు సరఫరాలో ఖజానాకు రూ.500 కోట్ల నష్టం ♦ అంతర్జాతీయంగా బొగ్గు ధర తగ్గినా పాత ధరే చెల్లింపు ♦ అవసరం లేకున్నా భారీగా బొగ్గు దిగుమతులు ♦ ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీజెన్కో)కు విదేశీ బొగ్గు వ్యవహారంలో భారీ కొనుగోల్‌మాల్ జరిగినట్టు తెలుస్తోంది. ఆరు నెలలకు టెండర్లు పిలిచి రెండేళ్లపాటు భారీ స్థాయిలో బొగ్గు దిగుమతి చేసుకోవడతో ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.500 కోట్లు నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఓ రెండు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ముందుపెట్టి ప్రభుత్వ పెద్దలు కథ నడిపిస్తుంటే, అధికారులు వారికి చేయూతనిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జెన్కో ఆధ్వర్యంలోని థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు 70 శాతం స్వదేశీ బొగ్గును, 30 శాతం విదేశీ బొగ్గును వాడతారు. విదేశీ బొగ్గును సరఫరా చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఓపెన్ టెండర్ల ద్వారా దక్కించుకుంటాయి. విదేశీ బొగ్గు సరఫరా కోసం 2013 జూన్ 28న పిలిచిన టెండర్లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పీఈసీ లిమిటెడ్ (న్యూఢిల్లీ), ఎంఎస్టీసీ లిమిటెడ్ (కోల్‌కతా) చేజిక్కించుకున్నాయి. ఆ మేరకు విజయవాడలోని థర్మల్ కేంద్రాలకు టన్ను రూ. 4,970 చొప్పున ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు, ముద్దనూరు ఆర్టీపీపీకి మెట్రిక్ టన్ను రూ. 5,150 చొప్పున నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును సరఫరా చేయాలి. ఈ కాంట్రాక్టు గడువు 2013 డిసెంబర్‌తో ముగిసింది. నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచి, ఎవరు తక్కువ ధరకు సరఫరాచేస్తే వారికే కాంట్రాక్టు ఇవ్వాలి. కానీ ఏపీ జెన్కో ఈ ప్రక్రియను ముందుకు సాగనివ్వలేదు. 2013 డిసెంబర్ 20 నుంచి ఏడుసార్లు టెండర్లు పిలిచి, ఆ తర్వాత రద్దు చేసేసింది. 2014 ఏప్రిల్ 22వ తేదీన మరోసారి టెండర్లు పిలిచినా... ఏపీ జెన్కో పెట్టిన సవాలక్ష నిబంధనలవల్ల ఎవరూ అర్హత పొందలేదు. ఈ నేపథ్యంలో 2014 ఆగస్టు 25న మరోసారి 3.4 మెట్రిక్ టన్నులకు టెండర్లు పిలిచింది. ఎంఎస్టీసి ఒక్కటే టెండర్ వేయడంతో దీన్నీ రద్దు చేశారు. ఈ సంస్థల్లోని వ్యక్తులు ప్రభుత్వ పెద్దల అక్రమాలకు అన్నివిధాలుగా సహకరిస్తున్నందువల్ల... ఇప్పటివరకూ సరఫరా చేస్తున్న సంస్థలు మాత్రమే అర్హత పొందేలా, ఇతర సంస్థలేవీ అర్హత సాధించకుండా ఉండేలా నిబంధనలు పొందుపరిచినట్లు తెలుస్తోం ది. ఇలా వివిధ కారణాలతో టెండర్లు ఖరారు చేయకుండా.. 2013లో టెండర్లు దక్కించుకున్న ఎంఎంటీసీ, పీఈసీ లిమిటెడ్ సంస్థలు పాత ధరలకే బొగ్గు దిగుమతి చేసేందుకు మార్గం సుగమం చేశారు. బొగ్గు ధర తగ్గినా పాత రేటుకే సరఫరా 2013లో అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర టన్ను 69.15 డాలర్లుగా ఉంది. ఇది 2015 నాటికి 52.40 డాలర్లకు తగ్గింది. అయినప్పటికీ ఏపీ జెన్కో టన్నుకు 69.15 డాలర్లు చెల్లించడంలో ఆంతర్యం ఏమిటనేది అర్థం కాని విషయం. పైగా 2013 ఒప్పందం ప్రకారం 12 లక్షల టన్నులు సరఫరా చేయగా.. కాంట్రాక్టు గడువు పొడిగించిన తర్వాత 19.5 లక్షల టన్నులు దిగుమతి చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ సమయంలో స్వదేశీ బొగ్గు సమృద్ధిగా లభిస్తోంది. ఏపీ జెన్కో విద్యుత్ సంస్థలు పూర్తిస్థాయిలో పనిచేయడంలేదు. అయినా పెద్ద మొత్తంలో విదేశీ బొగ్గు దిగుమతి చేసుకోవడం ఆర్థిక ప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోంది. 2013తో పోలిస్తే ఏపీ జెన్కో 165 శాతం విదేశీ బొగ్గు కోసం వెచ్చించినట్టు కన్పిస్తోంది. దీని విలువ రూ. 1,100 కోట్లని లెక్కగట్టారు. కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత 10 లక్షల టన్నులు అవసరంకాగా 20 లక్షల టన్నులు దిగుమతి చేసుకున్నారు. ఫలితంగా రూ. 200 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. టెండర్లను ఖరారు చేసి, వాస్తవ వినియోగం ప్రకారం బొగ్గును దిగుమతి చేసుకుని ఉంటే... సుమారు రూ. 500 కోట్ల మేర ఖర్చు తగ్గేదని నిపుణులు చెబుతున్నారు. అడ్డగోలుగా హ్యాండ్లింగ్ ఛార్జీలు విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న బొగ్గును ఓడరేవులనుంచి థర్మల్ ప్రాజెక్టులకు చేర్చినందుకు ఏపీ జెన్కో కొంతమొత్తం చెల్లిస్తుంది. బొగ్గు సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సరుకు రవాణాకు సబ్కాంట్రాక్టర్లను టెండర్ల ద్వారా ఎంపిక చేస్తాయి. అలా ఎంపికైన అదానీ, మహేశ్వరి కోల్ కంపెనీలు మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నులను రవాణా చేశాయి. అయితే కృష్ణపట్నం పోర్టుకు, థర్మల్ ప్రాజెక్టుకు దూరం కేవలం ఏడు కిలోమీటర్లే. కాబట్టి ఎలాంటి హ్యాండ్లింగ్ ఛార్జీలు దీనికి వర్తించవనే నిబంధనలున్నాయి. కానీ ఏపీ జెన్కో ఉదారంగా హ్యాండ్లింగ్ ఛార్జీలకింద రూ. 100 కోట్లు చెల్లించి వారికి లబ్ధి చేకూర్చిందన్న ఆరోపణలున్నాయి. టెండర్లు రద్దు చేశాం: జెన్కో వర్గాలు ఇప్పటివరకూ గడువు పొడిగిస్తూ వచ్చిన సంస్థల టెండర్లు రద్దు చేస్తూ ఏపీ జెన్కో బోర్డు సోమవారం నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. అర్హతగల సంస్థలు ముందుకు రాకపోవడంవల్లే ఇంతకాలం టెండర్లు పిలవలేదని పేర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర తగ్గినప్పటికీ, డాలర్ విలువ పెరిగిందనీ, దీంతోపాటు రైల్వే రవాణా ఛార్జీలు పెరిగాయని తెలిపాయి. ఈ నేపథ్యంలో సరఫరా చేస్తున్న విదేశీబొగ్గుకు చెల్లించే మొత్తం ఒక్కపైసా కూడా ఎక్కువ ఉండదని పేర్కొన్నాయి. 69.15 డాలర్లు: 2013లో అంతర్జాతీయ మార్కెట్లో టన్ను బొగ్గు ధర 12 లక్షల టన్నులు: టెండర్ల ప్రకారం సరఫరా చేయాల్సిన విదేశీ బొగ్గు 52.40 డాలర్లు: 2015లో అంతర్జాతీయ మార్కెట్లో టన్ను బొగ్గు ధర 19.5 లక్షల టన్నులు: గడువు తర్వాత సరఫరా చేసిన విదేశీ బొగ్గు 1,100 కోట్లు: గడువు ముగిశాక సరఫరా చేసిన బొగ్గు విలువ 100 కోట్లు: హ్యాండ్లింగ్ ఛార్జీల పేరుతో చెల్లించింది -
తగ్గిన విద్యుత్ డిమాండ్
నాన్ పీక్ అవర్స్‌లో యూనిట్ల నిలిపివేత బొగ్గు నిల్వలు పెంచేందుకు జెన్కో కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత కారణంగా విద్యుత్ డిమాండ్ గణనీయంగా తగ్గుతోంది. దీంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని కొన్ని యూనిట్లలో ఉత్పత్తి నిలిపేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం నుంచి ఉదయం వరకు (నాన్ పీక్ అవర్స్) యూనిట్లను ఆపేస్తున్నారు. ఇదే సమయంలో బొగ్గు సరఫరా కూడా పెరగడంతో ఏపీ జెన్కోకు కాస్త ఊరట లభించింది. రాష్ట్రంలో గడచిన వారం రోజులుగా 500 మెగావాట్ల మేర డిమాండ్ తగ్గింది. గత రెండు రోజులుగా అన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలలోపు నమోదవుతున్నాయి. దీంతో మరో 100 మెగావాట్ల వాడకం తగ్గింది. వీటీపీఎస్, ఆర్టీపీఎస్, సింహాద్రిలో మొత్తం 4,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. సోమవారం నాటికి థర్మల్ విద్యుత్ కేంద్రాల ఉత్పత్తిని రెండువేల మెగావాట్లు తగ్గించి.. 2,500 మెగావాట్లకు పరిమితం చేశారు. మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బొగ్గును నిల్వచేసేందుకు జెన్కో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
ఏపీ జెన్కోకు జ్యూరీ అవార్డు
సాక్షి, హైదరాబాద్: ఏపీ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో)కు మరో జాతీయ అవార్డు లభించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో అంతర్జాతీయ ప్రమాణాలు నమోదు చేసినందుకు 8వ ఎనర్తియా జూరీ అవార్డుకు ఏపీ జెన్కో ఎంపికైంది. దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు 65.6 శాతం పీఎల్ఎఫ్(ప్రాజెక్టు లోడ్ ఫ్యాక్టర్) నమోదు చేస్తే, ఏపీ జెన్కో 78 శాతం పీఎల్ఎఫ్ సాధించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలోనూ ఈ సంస్థ అగ్రగామిగా ఉండడం వల్ల ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏజీ అయ్యర్ చేతుల మీదుగా ఏపీ జెన్కో సీఎండీ విజయానంద్ గురువారం అవార్డు అందుకున్నారు. జెన్కో సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగానే అవార్డు వచ్చిందని విజయానంద్ మీడియాకు తెలిపారు. -
విద్యుదుత్పత్తిలో టీజెన్‌కో రికార్డు
79.21 శాతం పీఎల్ఎఫ్ నమోదు దేశంలోనే రెండో స్థానం ఏపీజెన్కోకు మూడో స్థానం నంబర్ వన్ స్థానంలో ఒడిశా సాక్షి, హైదరాబాద్: విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ జెన్కో రికార్డు నెలకొల్పింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరు వరకు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని విద్యుత్తు ప్లాంట్ల సామర్థ్యాన్ని విశ్లేషిస్తూ సగటున 79.21 శాతం విద్యుత్తు ఉత్పత్తి జరిగినట్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నిర్ధారించింది. ఇటీవలే దేశవ్యాప్తంగా అన్ని థర్మల్ పవర్ ప్లాంట్ల ఉత్పత్తి ప్రగతి నివేదికలను అథారిటీ విడుదల చేసింది. ప్లాంట్ల వారీగా ప్రతి నెలా విద్యుత్తు ఉత్పత్తి గణాంకాల ఆధారంగా ఈ నివేదికను తయారు చేసింది. దీని ప్రకారం... ఒడిశా రాష్ట్రంలోని విద్యుత్తు ప్లాంట్లు ఉత్పత్తిలో నంబర్ వన్‌గా నిలిచాయి. అత్యధికంగా 81.71 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌తో ఒడిశా దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడు నెలల వ్యవధిలో దేశంలో సగటున ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 64.82 శాతంగా నమోదైంది. తెలంగాణ జెన్కో అంతకంటే 14.39 శాతం ఎక్కువ పీఎల్ఎఫ్ శాతం నమోదు చేయడం విశేషం. తెలంగాణ జెన్కో అధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల మొత్తం సామర్థ్యం 2082.5 మెగావాట్లు. కాగా, 76.90 శాతం పీఎల్‌ఎఫ్‌తో ఏపీ జెన్కో మూడో స్థానంలో ఉంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు.. వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు సీఈఏ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల అధ్వర్యంలో ఉన్న థర్మల్ విద్యుత్తు ప్లాంట్లకు సంబంధించి భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 94.35 శాతంగా నమోదైంది. ప్రైవేటు, ప్రభుత్వరంగంలోని విద్యుత్తు ప్లాంట్లన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కేటీపీపీ తొమ్మిదో స్థానంలో నిలిచింది. తెలంగాణలో విద్యుత్తు కొరతను అధిగమించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా అన్ని యూనిట్లలో ఉత్పత్తి సామర్థ్యం మెరుగుపడిందని, అందుకే రికార్డు స్థాయిలో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ సాధించగలిగామని టీఎస్జెన్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ప్రభాకర్‌రావు తెలిపారు.