విద్యుత్‌ ఉత్పత్తిలో ఏపీ జెన్ కో రికార్డు! | APGENCO Record In Power Production After Division Of State | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఉత్పత్తిలో ఏపీ జెన్ కో రికార్డు!

Published Sun, May 14 2023 8:17 PM | Last Updated on Sun, May 14 2023 8:39 PM

APGENCO Record In Power Production After Division Of State - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విద్యుదుత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించింది. శనివారం 105.620 మిలియన్ యూనిట్ల (5137 మెగావాట్ల) విద్యుదుత్పత్తి నమోదు చేసింది. శుక్రవారం అర్ధరాత్రి 12 నుంచి శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకూ సుమారు 114 మిలియన్ యూనిట్ల విద్యుదుత్వత్తి చేయగా జెన్ కో వినియోగానికి పోనూ 105.620 మిలియన్ యూనిట్లు గ్రిడ్‌కు సరఫరా చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఒకరోజులో ఇదే అత్యధిక ఉత్పత్తి కావడం విశేషం. అత్యధిక విద్యుదుత్పత్తి  చేయడానికి అన్ని విధాలొ  సహకారం అందించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఇంధన శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డికి,  కేంద్ర  రైల్వే , కోల్ మంత్రిత్వ శాఖల అధికారులకు ఏపీ జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్  చక్రధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు.

మరింత అంకిత భావంతో పని చేయండి..
రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించినందుకు ఏపీ జెన్ కో ఉద్యోగులను మేనేజింగ్ డైరెక్టర్ చక్రధర్ బాబు అభినందించారు. వేసవి  తీవ్రత నేపథ్యంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేసి రాష్ట్ర అవసరాలను తీర్చడానికి మరింత అంకిత భావంతో పని చేయాలని ఉద్యోగులకు సూచించారు .రాష్ట్రంలో విద్యుత్ డిమాండు పెరుగుతున్నందున ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వ సహకారంతో ఏపీ జెన్ కో అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఎండీ పేర్కొన్నారు.

వీటీపీఎస్ లో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన కొత్త యూనిట్ విద్యుదుత్పత్తి త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. లోయర్ సీలేరులో మరో 230 మెగావాట్ల ఉత్పత్తి కోసం రెండు యూనిట్ల నిర్మాణ పనులు త్వరగా చేపట్టి ఏడాదిలో పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పొరు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement