chakradhar
-
బొగ్గుకు బకాయిలేం లేవు.!
సాక్షి, అమరావతి: అవే పైత్యపు కథనాలు.. నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు.. విలువలు లేకుండా అడ్డగోలుగా అచ్చేస్తున్న అవాస్తవాల పరంపరలో మరో నీతిమాలిన వార్తను రామోజీరావు ‘బొగ్గు రాదు.. బకాయిలే కారణం’ శీర్షికతో ఈనాడులో వండివార్చారు. కళ్లముందు నిజాలు కనిపిస్తున్నా.. టీడీపీ హయాంలో బొగ్గు సేకరణ ఇప్పటి కన్నా తక్కువే ఉన్నా ఆ నిజాన్ని దాచి ప్రజలను మభ్యపెట్టేందుకు ఆ కథనంలో విశ్వప్రయత్నం చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసిన కంపెనీలకు ఇంధన సరఫరా ఒప్పందాల (ఫ్యూయల్ సప్లయి అగ్రిమెంట్స్–ఎఫ్ఎస్ఏ) ప్రకారం సకాలంలో బకాయిలు చెల్లిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పాదక సంస్థ (ఏపీజెన్కో) మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు స్పష్టం చేశారు. ఈనాడు కథనంలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు ‘సాక్షి’కి ఏపీజెన్కో ఎండీ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ‘ఎఫ్ఎస్ఏ’ ప్రకారం సకాలంలో చెల్లింపులు మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్)కు ఏపీజెన్కో సెప్టెంబర్‌లో రూ. 554.57 కోట్ల బకాయిలు చెల్లించింది. గడువులోగా చెల్లించాల్సిన బకాయిలు ఏమీలేవు. సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు చెల్లింపులకు ‘బిల్ ఆఫ్ ఎఎక్స్చేంజ్’ విధానం వల్ల ఆ సంస్థకు పెండింగ్ బకాయిలు లేవు. ఎస్సీసీఎల్, ఎంసీఎల్ నుంచి ఎఫ్ఎస్ఏ ప్రకారం ఏపీజెన్కో బొగ్గు సేకరిస్తోంది. ఈ ఒప్పందాల ప్రకారం నిర్ణీత గడువులో బకాయిలు చెల్లిస్తోంది. ఇక ఈ ఏడాది దేశవ్యాప్తంగా పెరిగిన విద్యుత్ డిమాండ్ మేరకు బొగ్గు సరఫరా కానందున అన్ని రాష్ట్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. పైగా నైరుతీ రుతుపవనాల సీజన్లో బొగ్గు తవ్వకాలకు అంతరాయం కలిగింది. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన ఏపీజెన్కో వారం వారం జరిగే కేంద్ర ఉపసంఘం సమీక్షల్లో, ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ (ఐఎంసీ) సమావేశాల్లో బొగ్గు సరఫరా పెంచాలని పదేపదే విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పెంచుకోవడానికి, పెరిగిన ఏపీ గ్రిడ్ డిమాండ్ మేరకు విద్యుదుత్పత్తి పెంచేందుకు ఏపీజెన్కో ప్రణాళికాబద్ధంగా అన్ని ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగానే అదనపు బొగ్గు సేకరణ కోసం కోల్ కంపెనీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుత బొగ్గు కొరత పరిస్థితుల్లో సైతం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ఎఫ్ఎస్ఏ లక్ష్యంలో 95.67 శాతం మేరకు బొగ్గును ఏపీ జెన్కో సేకరించగలగడం విశేషం. టీడీపీ అధికారంలో ఉన్న 2018 ఇదే కాలంలో ఒప్పందంలోని 81.02 శాతం బొగ్గు మాత్రమే సేకరించడం గమనార్హం. పెరిగిన విద్యుత్ ఉత్పత్తికి తగ్గట్టు ప్రణాళిక ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి పెరిగినందున ఏపీజెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు వినియోగం కూడా పెరిగింది. మరోవైపు ఏపీజెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలు 75 శాతం పవర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడమే లక్ష్యంగా విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు, థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పెంచుకునేందుకు, బొగ్గు నిర్వహణ యూనిట్‌ను ఏపీజెన్కో పటిష్టం చేస్తోంది. ఇందుకు అనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకుని లక్ష్యాల సాధన దిశగా ముందుకెళుతోంది. జెన్కోను దెబ్బతీసింది చంద్రబాబే చంద్రబాబు హయాంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలను బలవంతంగా మూసివేయడం వల్ల ఏపీ జెన్కోకు భారీ నష్టం వాటిల్లింది. నాసిరకం బొగ్గును అధిక ధరకు గత టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. కాగ్ సైతం ఈ విషయాన్ని బయటపెట్టింది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ) 2011–12లో 22.235 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. కానీ 2015–16 నాటికి విద్యుదుత్పత్తి 19.359 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. దీనివల్ల విద్యుదుత్పత్తి ధర యూనిట్‌కు రూ. 2.94 నుంచి రూ. 4.34కు పెరిగింది. బలవంతంగా మూసివేయడం వల్ల ఆ రెండు విద్యుత్ కేంద్రాలకు రూ. 675.69 కోట్లు నష్టం వాటిల్లింది. మహానది కోల్ లిమిటెడ్ (ఎంసీఎల్) బొగ్గు సరఫరా చేయడం లేదనే సాకు చూపి 2014 జూలైలో 26.61 లక్షల మిలియన్ టన్నుల బొగ్గును, 2015–16లో ఎలాంటి అవగాహనా ఒప్పందం కుదుర్చుకోకుండానే 63.5 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి నుంచి ప్రీమియం ధరకు టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2014 నుంచి 2016 వరకూ కోల్ ఎనాలిసిస్ నివేదికలు, కోల్ ఇన్వాయిస్లను సమీక్షిస్తే జెన్కో కొనుగోలు చేసిన బొగ్గు నాణ్యతలో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. నాణ్యతలేని రూ. 3,179.32 కోట్ల విలువైన 86.02 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును అధిక ధరను కొనుగోలు చేయడం వల్ల జెన్కోకు రూ. 918.61 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కాగ్ తేల్చింది. అప్పట్లో విదేశీ బొగ్గునూ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు కొనుగోలు చేశారు. ప్రభుత్వ సంస్థలను ముందు పెట్టి తెరవెనుక కోల్‌మాఫియా చక్రం తిప్పింది. రూ. 500 కోట్లకు పైగా ప్రజాధనం వృథా అయ్యింది. -
విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్ కో రికార్డు!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విద్యుదుత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించింది. శనివారం 105.620 మిలియన్ యూనిట్ల (5137 మెగావాట్ల) విద్యుదుత్పత్తి నమోదు చేసింది. శుక్రవారం అర్ధరాత్రి 12 నుంచి శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకూ సుమారు 114 మిలియన్ యూనిట్ల విద్యుదుత్వత్తి చేయగా జెన్ కో వినియోగానికి పోనూ 105.620 మిలియన్ యూనిట్లు గ్రిడ్‌కు సరఫరా చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఒకరోజులో ఇదే అత్యధిక ఉత్పత్తి కావడం విశేషం. అత్యధిక విద్యుదుత్పత్తి చేయడానికి అన్ని విధాలొ సహకారం అందించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఇంధన శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డికి, కేంద్ర రైల్వే , కోల్ మంత్రిత్వ శాఖల అధికారులకు ఏపీ జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. మరింత అంకిత భావంతో పని చేయండి.. రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించినందుకు ఏపీ జెన్ కో ఉద్యోగులను మేనేజింగ్ డైరెక్టర్ చక్రధర్ బాబు అభినందించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేసి రాష్ట్ర అవసరాలను తీర్చడానికి మరింత అంకిత భావంతో పని చేయాలని ఉద్యోగులకు సూచించారు .రాష్ట్రంలో విద్యుత్ డిమాండు పెరుగుతున్నందున ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వ సహకారంతో ఏపీ జెన్ కో అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఎండీ పేర్కొన్నారు. వీటీపీఎస్ లో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన కొత్త యూనిట్ విద్యుదుత్పత్తి త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. లోయర్ సీలేరులో మరో 230 మెగావాట్ల ఉత్పత్తి కోసం రెండు యూనిట్ల నిర్మాణ పనులు త్వరగా చేపట్టి ఏడాదిలో పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పొరు. -
రెండేళ్లు.. బాధితులు 6 వేలు
హిమాయత్‌నగర్: నిరుద్యోగులకు డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇస్తామంటూ పంజాగుట్ట కేంద్రంగా నడుస్తున్న ఓ నకిలీ కాల్ సెంటర్‌పై హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. దాదాపు రెండేళ్లుగా మోసానికి పాల్పడుతున్న ప్రధాన నిర్వాహకుడు గడగోని చక్రధర్, సహకారులు గణేష్, శ్రావణ్‌లతో పాటు మరో 32మంది టెలికాలర్స్(వీరిలో అమ్మాయిలు 11మంది)ని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైం డీసీపీ స్నేహా మెహ్రా తెలిపారు. వారివద్ద నుంచి 14 ల్యాప్‌టాప్‌లు, 148 సెల్ఫోన్లు, రూ.1లక్షా 3వేలు నగదు, బీఎండబ్ల్యూ, ఫార్చునర్, ఇన్నోవా, మహేంద్ర కారులను స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. శనివారం బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైం కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు, సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు రఘునా«థ్, శ్రీనాథ్‌రెడ్డిలతో కలసి స్నేహా మెహ్రా వివరాలను వెల్లడించారు. ప్రతి 45రోజులకు సిమ్‌లు మార్పు డబ్బులు వసూలు చేసిన తర్వాత ప్రతి 45 రోజులకోసారి ఫోన్ నెంబర్లను చక్రధర్‌గౌడ్ మార్చేసేవాడు. ఫేక్ కేవైసీల ఆధారంగా వందల కొద్దీ సిమ్‌లను అనంతపురం వాసి కృష్ణమూర్తి నుంచి కొనుగోలు చేసేవాడు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు డేటా ఎంట్రీ జాబ్ ఇస్తానంటూ మాయమాటలు చెప్పి వారి నుంచి రూ.2500 చొప్పున వసూళ్లు చేసి ఉద్యోగం ఇవ్వలేదు. దీంతో ఆ ఇద్దరూ సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి మొత్తం నిర్వాకాన్ని వెలికితీశారు. వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్, సైబర్‌క్రైం పోలీ సులు ఈ కాల్‌సెంటర్ గుట్టును రట్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్‌రావు తెలిపారు. రెండేళ్లు..6వేల మంది బాధితులు నగరంలోని బాచుపల్లిలో స్థిరపడ్డ సిద్దిపేటకు చెందిన గడగోని చక్రధర్‌గౌడ్‌కు గతంలో కాల్సెంటర్లలో పనిచేసిన అనుభవం ఉండటంతో 2021లో పంజాగుట్టలో రూ.1లక్షా 30వేల విలువ గల ఫ్లాట్‌ను తీసుకుని కాల్‌సెంటర్‌ను ప్రారంభించాడు. ఏపీ, తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇస్తానంటూ వల వేశాడు. ఆయా రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులతో మాట్లాడేందుకు ఆ రాష్ట్రాలకు చెందిన వారినే టెలీకాలర్స్‌గా రూ.15వేల జీతానికి నియమించుకున్నాడు. ఈ రెండేళ్లలో ఒక్కో బాధితుడి నుంచి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు దాదాపు 6వేల మంది నుంచి వసూలు చేశారని గుర్తించారు. కొంతమంది నుంచి పెద్దమొత్తంలో కూడా వసూళ్లు చేశారు. -
రాష్ట్రంలో పుష్కలంగా విద్యుత్
సాక్షి, అమరావతి: రానున్న రోజుల్లో రాష్ట్రంలో మరింత విద్యుత్ అందుబాటులోకి వచ్చి వినియోగదారులకు పుష్కలంగా సరఫరా అవుతుందని, ఈ మేరకు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభం కానున్నాయని ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్కో) లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్‌బాబు తెలిపారు. ఆయన శుక్రవారం ఏపీజెన్కో ఎండీగా విద్యుత్ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. సంస్థ డైరెక్టర్లు, విద్యుత్ ఉద్యోగసంఘాల నాయకులు, పలువురు ఉద్యోగులు ఆయన్ని అభినందించారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడానికిగాను థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ప్లాంట్ల ఆధునికీకరణకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడానికి సిబ్బంది కలిసి పనిచేయాలని కోరారు. రానున్న నెలల్లో ఇంధన డిమాండ్ రోజుకి 250 మిలియన్ యూనిట్లను దాటుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. దాన్ని అందుకోవడానికి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఇంధన డిమాండ్ పెరగడం చాలా మంచి సంకేతమని, ఇది రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను సూచిస్తుందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి, అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ నిర్వహణలో జాతీయస్థాయిలో అత్యుత్తమ సంస్థగా అవతరించేందుకు ఏపీజెన్కో అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్) స్టేజ్–2 (1,600 మెగావాట్లు) ప్రస్తుతం పనిచేస్తోందని, వేసవి డిమాండ్‌ను తీర్చేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో మరో 800 మెగావాట్ల యూనిట్ ఈ ఏడాదిలోనే ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం గ్రిడ్ డిమాండ్‌లో 40 నుంచి 45 శాతం వరకు ఏపీజెన్కో ద్వారానే అందుతోందన్నారు. పోలవరం వద్ద ఒక్కొక్కటి 80 మెగావాట్ల సామర్థ్యమున్న 12 హైడ్రో ఎలక్ట్రిక్ యూనిట్లను (మొత్తం 960 మెగావాట్లు) కూడా జెన్కో ఏర్పాటు చేస్తోందని చెప్పారు. దశల వారీగా ప్రాజెక్టుతో పాటు ఇవి కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా దిగువ సీలేరు వద్ద 115 మెగావాట్ల రెండు అదనపు యూనిట్ల నుంచి వచ్చే ఏడాది జూలైలో ఉత్పత్తి మొదలుపెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
Chakradhar Goud: వంద రైతు కుటుంబాలకు రూ.కోటి సాయం
సాక్షి, సిద్దిపేట జోన్: రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వంద రైతు కుటుంబాలకు.. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.కోటి విలువైన చెక్కులను ఆదివారం సిద్దిపేట కొండ భూదేవి గార్డెన్స్‌లో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకోవడం, వారికి అండగా నిలిచే లక్ష్యంగా తమ సంస్థ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందన్నారు. చదవండి: (నీ కాళ్లు మొక్కుత సారూ.. పైసలిప్పియ్యరూ: రైతు ఆవేదన) -
ప్రాణాపాయంలో అభిమాని... అండగా నిలిచిన చిరంజీవి
ఎవరికి ఏ ఆపద వచ్చిన సాయం చేయడానికి ముందుంటాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక తన అభిమానులకు అయితే సొంత ‘అన్నయ్య’లా ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఏ చిన్న ఆపద వచ్చిన నేనున్నాను అంటూ భరోసా ఇస్తాడు. గతంలో ఆపదలో ఉన్న అనేకమందికి సాయం చేసిన చిరంజీవి.. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానికి తోడుగా నిలిచాడు. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్‌కు క్యాన్సర్ సోకింది. గత కొన్నాళ్ల నుంచి ఆయనఅనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈవిషయం తెలుసుకున్న చిరంజీవి.. వెంటనే ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేయించారు. అంతేకాదు ఆయన ఉన్న ఆసుపత్రికి సోమవారం సాయంత్రం వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్కడి వైద్యులతో మాట్లాడి పరిస్థితి ఏమిటో తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే చక్రధర్ కు అండగా ఉంటామని ఆయన కుటుంబసభ్యలకు కూడా మెగాస్టార్ చిరంజీవి అభయం ఇచ్చారు. (చదవండి: వ్యూస్ కోసం అలా రాసి మమల్ని బలిపశుల్ని చేయ్యొద్దు: దిల్‌రాజు ఎమోషనల్) -
12మంది బాల కార్మికులకు విముక్తి
ఆముదాలవలస: శ్రీకాకుళం జిల్లా నుంచి 12 మంది బాలకార్మికులను రైలులో గుజరాత్‌కు తరలిస్తుండగా ఐసీడీఎస్ అధికారులు బుధవారం వేకువజామున దాడిచేసి పట్టుకున్నారు. వివరాలు.. శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ నుంచి 12 మంది బాలకార్మికులను తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసుల సాయంతో అధికారులు రైల్వేస్టేషన్ చేరుకున్నారు. పూరి- అహమ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలులో బాలలను తరలిస్తుండగా దాడిచేసి వారిని పట్టుకున్నారు. పోలీసులను చూసిన ఏజెంట్లు పరారయ్యారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ చక్రధర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ కేవి రమణ ఇతర అధికారులు 12మంది బాల కార్మికులను విముక్తి చేసి వారిని బుధవారం ఉదయం శ్రీకాకుళం బాలసదన్‌కు తరలించారు. -
సంబోధన...సంప్రదాయం
‘ఒరేయ్ చక్రధర్....ఎక్కడున్నావ్!’ ఓ తండ్రి గట్టిగా అరిచాడు. పెరట్లో నుంచి పరుగులు పెడుతూ వచ్చిన కొడుకు చక్రధర్ కోపంగా జవాబిచ్చాడు. ‘ఇక్కడే ఉన్నాను. ఎందుకలా అరుస్తారు?’ కొంచెం హెచ్చుతగ్గులతో దాదాపు ప్రతి ఇంటా ఇదే సన్నివేశం రోజూ తారసపడుతూనే ఉంటుంది. తండ్రి కుమారుణ్ణి ఒకటి, రెండుసార్లు పిలిచి, రాకపోయేసరికి కాస్త కోపంగా అలా అని ఉండొచ్చు. పిల్లవాడు పలకలేదు. కానీ, ఆ సర్వంతర్యామి...అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు పిలవగానే పలుకుతాడు. స్పందిస్తాడు. కాబట్టే మన పెద్దలు ఈ అలవాటు మనకు బోధించారు. సాంకేత్యం పరిహాస్యంగా వా స్తోభం హేళన మేవవా వైకుంఠ నామగ్రహణం అశేషాఘహరం విదుః ఒకరిని అవసరార్ధమే పిలిచినా, హేళనగా పిలి చినా, స్తోత్రం చేసినా...ఏ భావంతో చెప్పినా ఆ వైకుం ఠుడి నామం పాపాలన్నిటినీ పోగొడుతుందని భావం. ఇటీవల పిల్లలకు భగవంతుని పేరే పెట్టినా ఆ పేర్లతో పిలిచే అలవాటు పోయింది. చిలుకూరులో జరిగిన ఒక సన్నివేశాన్ని మీ అందరికీ చెబుతాను. స్వామివారి పాదతీర్థాన్ని భక్తులకు ఇచ్చేటపుడు ఎవరైనా చిన్న పిల్లలను తీసుకుని వస్తే వారి పేర్లు అడగటం నాకు అలవాటు. ఆ పేరు తెలుసుకుని, అలాగే పిలవడం నా మనసుకు ఆనందాన్నిస్తుంది. ఒకసారి ఓ అమ్మమ్మగారనుకుంటాను...చిన్న పాపను ఎత్తుకుని వచ్చింది. ఆ పాప ముద్దుగా ఉంది. మూడేళ్లుంటాయేమో. ఆమెకు కూడా తీర్థం అడిగి తీసుకున్నారు. ‘పాప పేరేమిటమ్మా’ అని అడిగాను. ‘శ్రీవిద్య అని పెట్టాము స్వామీ’ అని ఆ పెద్దావిడ అన్నారు. అద్భుతమైన పేరు. తాంత్రికమైనటువంటి సాధనకై పెట్టిన పేరు శ్రీవిద్య. ఇందులో లక్ష్మీ సరస్వతులున్నారు. ‘ఇంట్లో ఈ పాపను ఏమని పిలుస్తారమ్మా’ అని అడిగితే ‘శ్రీవిద్యనే అంటాం స్వామీ’ అని ఆమె జవాబిచ్చారు. కాస్సేపయ్యాక తీర్థం పంచడాన్ని వేరొక అర్చకస్వామికి అప్పగించి మంటపంవైపు వెళ్లాను. అక్కడ ఆ పాప మళ్లీ కనబడింది. వాళ్ల అమ్మమ్మ అలా దించగానే పరుగెత్తడం మొదలెట్టింది. ‘ఏయ్... మ్యాగీ ఎటుపోతున్నావ్’ అంటూ ఆ అమ్మమ్మ గట్టిగా అరిచారు. భక్తులంతా గొల్లున నవ్వారు. సరిగ్గా ఆ సమయానికి అక్కడున్నందువల్ల నేను సరదాగా జోక్యం చేసుకుని అన్నాను. ‘చూశావామ్మా...స్వామివారి వద్ద అబద్ధం ఆడావు. పాపను ఇంట్లో శ్రీవిద్య అని పిలుస్తామన్నావు. ఇప్పుడేమో మ్యాగీ అంటున్నావు. అమ్మాయికి నూడుల్స్‌కు పెట్టే పేరు పెడతావామ్మా నువ్వు...’ అన్నాను. అందరూ గమనించవలసిన ముఖ్య విషయం ఉంది. ఈ ఆధునిక యుగంలో స్వామివారినిగానీ, మన దైవాన్ని గానీ, అమ్మవారినిగానీ తలచుకొనే అవకాశం తక్కువ. ఏ పండగకో, ఉత్సవానికో వెళ్లినప్పుడే స్వామివారిని తలుచుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో భగవన్నామాన్ని నిరంతరం ఉచ్చరించడానికి అవకాశం మనకు పిల్లల పేర్ల ద్వారా కలుగుతుంది. వాళ్లకు భగవత్సంబంధమైన పేర్లు పెట్టి వారిని అలాగే పిలుస్తుంటే భగవంతుని అష్టోత్తరం చదివినట్లు అవుతుంది. చక్రధర్ అని పేరుపెట్టి చంటి అని పిలుస్తున్నారు. పండు అంటున్నారు. కనీసం రోజుకి కొన్నిసార్లయినా వారిని పూర్తి పేరుతో పిలిచే అలవాటు చేసుకోవాలి. - సౌందరరాజన్ చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు -
స్నేహితులే.. ప్రాణం తీశారు
ఎన్టీపీసీ ఆటోనగర్‌కు చెందిన ఇప్ప చక్రధర్ హత్యకేసులో మిస్టరీ వీడింది. ఓ అమ్మాయిని ప్రేమించిన ‘పాపానికి’ అతడి నిండు జీవితం బలైంది. తన కుమార్తెను చక్రధర్ ప్రేమించడం ఇష్టం లేని అమ్మాయి తండ్రే కిరాయి హంతకుల చేత అతడి ప్రాణాలు తీయించాడు. డబ్బులకు లొంగిపోయి చక్రధర్ స్నేహితులే దగ్గరుండి అతడిని దారుణంగా హత్యచేయించారు. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ హత్యకేసును పోలీసులు పది రోజుల్లో ఛేదించారు. మొత్తం తొమ్మిది మంది నిందితులను ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో శనివారం అరెస్టు చూపించారు. గోదావరిఖని డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి వెల్లడించిన వివరాలు.. గోదావరిఖని, న్యూస్‌లైన్ : గోదావరిఖని అశోక్‌నగర్‌లో నివాసముండే డెల్టా సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థను నిర్వహించే వాహెద్‌బేగ్ కుమార్తె అస్మా ఎన్టీపీసీలోని సచ్దేవ పాఠశాలలో చదివేది. అదే పాఠశాలలో ఎన్టీపీసీ ఆటోనగ ర్లో నివాసముండే ఇప్ప చక్రధర్ ఉరఫ్ కన్నయ్య(22) చదివేవాడు. ఇద్దరు ఒకే తరగతి కాకపోయినప్పటికీ వీరిమధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. చక్రధర్ తండ్రి పెంటయ్య సింగరేణిలో కార్మికుడిగా పనిచేస్తూ అనారోగ్యంతో మరణించగా, 2011లో ఆయన ఉద్యోగాన్ని కుమారుడికి ఇచ్చారు. చక్రధర్ బెల్లంపల్లిలోని శాంతిగనిలో ఉద్యోగం చేస్తుండగా.. అస్మా గోదావరిఖనిలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. 2012 సెప్టెంబర్ 14న అస్మాను తీసుకుని చక్రధర్ వెళ్లగా ఆమె తండ్రి వాహెద్‌బేగ్ ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్ కేసు పెట్టాడు. అదే నెల 25న చక్రధర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించగా, కొద్ది రోజుల తర్వాత బెయిల్‌పై వచ్చాడు. 2014 జనవరి 20న ఆస్మా మైనారిటీ తీరుతుండగా ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని వీరిద్దరు నిర్ణయించుకున్నారు. తరచుగా ఫోన్లో మాట్లాడుకోవడంతో ఇది తండ్రి వాహెద్బేగ్కు నచ్చక వీరికి పెళ్లి అయితే తన పరువు పోతుందని భావించి చక్రధర్‌ను హత్య చేయించాడు. కిరాయి హంతకులు.. చక్రధర్‌ను చంపేందుకు వాహెద్‌బేగ్ ఎన్టీపీసీలో నివాసముండే దాసరి ఆనంద్ సహకారంతో అదే ఏరియాలో ఉండే తమిళనాడుకు చెందిన మణి అనే వ్యక్తికి కొంత డబ్బు ముట్టజెప్పాడు. కొద్దిరోజుల తర్వాత తాను ఈ హత్య చేయలేనని మణి చెప్పడంతో వాహెద్‌బేగ్ ఓ పత్రికలో(సాక్షి కాదు) విలేకరిగా పనిచేస్తూ పంచాయితీలు చేస్తున్న సంగెపు రాంచంద్రంను సంప్రదించాడు. ఈ హత్యకు మొత్తం రూ.4లక్షలు సుఫారీ ఇచ్చేందుకు మాట్లాడుకున్నారు. అందులో హత్య చేసిన వారికి రూ.2లక్షలు, పథకం రచించిన వారికి రూ.2 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ముందుగా చక్రధర్ స్నేహితులైన కంది గాంధీ, కె.విజయ్తకు కొంత డబ్బు ఇచ్చి హత్యకు పురమాయించారు. వీరితో ఆ పని సాధ్యపడకపోవడంతో చక్రధర్‌ను ప్రాణాలతో అప్పగించాలని కోరగా.. ఆ ఇద్దరు అంగీకరించారు. పథకం ప్రకారం దారుణం.. చక్రధర్ నెల రోజులుగా ఇంటివద్దే ఉంటూ డ్యూటీకి వెళ్లకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. చేతిలో డబ్బులు లేకపోవడంతో సెల్‌ఫోన్ అమ్మివేయడంతోపాటు బైక్‌ను అమ్మివేసేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో ఈ నెల 18న చక్రధర్‌ను విజయ్, గాంధీ గోదావరి ఖని బస్టాండ్ వద్దనున్న మద్యం దుకాణం వద్ద కు తీసుకొచ్చి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అతిగా మద్యం తాగించారు. తర్వాత బస్టాండ్ సమీపంలోని చెట్లపొదల్లో చీకటిపడే వరకు మళ్లీ మద్యం తాగించారు. ఈలోగా హత్యా పథకం వ్యూహకర్త రాంచంద్రం బెల్లంపల్లికి చెందిన తన స్నేహితుడైన బండి రాజుకు పనిని అప్పగించాడు. రాజు తన స్నేహితులైన బెల్లంపల్లికే చెందిన గుర్రం అశోక్, సుల్తానాబాద్‌కు చెందిన చెల్ల రమేష్, అదే మండలం నీరుకుల్లకు చెందిన వనపర్తి సతీష్‌ను ఫోన్ ద్వారా సంప్రదించి పథకం గురించి చెప్పాడు. వెంటనే వీరంతా ఎన్టీపీసీకి చేరుకున్నారు. చక్రధర్ మ ద్యం మత్తులో ఉండడంతో అతడిని ఆదిలాబా ద్ జిల్లా శ్రీరాంపూర్ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేయడానికి పథకం వేశారు. అది సాధ్యం కాకపోవడంతో తిరిగి ఎన్టీపీసీ వద్దనే హత్యకు వ్యూ హం పన్నారు. చక్రధర్‌ను అక్కడికి తీసుకురావాలని గాంధీ, విజయ్‌లకు సూచించారు. ఎన్టీపీసీ మార్కెట్ వెనకాల వ్యభిచారం చేస్తూ ఓ జంట ఉందని, వారిని బెదిరించి మనం కూడా ఎంజాయ్ చేద్దామని గాంధీ, విజయ్ తన స్నేహితుడైన చక్రధర్‌ను నమ్మించారు. రాత్రి 9.30 గంటల సమయంలో అతడిని తీసుకుని మార్కెట్ గోడ వెనుకవైపు తీసుకెళ్లి.. అక్కడున్న బండి రాజు, గుర్రం అశోక్, చెల్ల రమేష్, వనపర్తి సతీష్‌లకు అప్పగించారు. అక్కడ జంట ఉందని నమ్మించేందుకు వీరిలో ఒకరు అమ్మా యి మాదిరిగా చున్నీ ధరించాడు. అనంతరం అదే చున్నీని చక్రధర్ గొంతుకు బిగించారు. అక్కడే ఏదైనా చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడని నమ్మించాలనుకునే క్రమంలో ‘ఏందిరా గాంధీ ఇది... నన్ను చంపొద్దు’ అంటూ చక్రధర్ గట్టిగా అరిచాడు. దీంతో రాజు, సతీష్ కలిసి మరింత గట్టిగా గొంతుకు ఉరివేసి, ఆ తర్వాత కత్తితో గుండెభాగంలో పొడిచి, గొంతుకోశారు. తర్వాత అక్కడున్న సిమెంట్ ఇటుకలతో తలపై మోదారు. చక్రధర్ చనిపోయాడని నిర్ధారించుకుని పరారయ్యారు. తొమ్మిది మంది అరెస్ట్... రిమాండ్ చక్రధర్ హత్యకు వాహెద్‌బేగ్ సుపారీ (కిరాయి హత్య) మాట్లాడుకోగా, అందులో చక్రధర్ స్నేహితులైన గాంధీ, విజయ్‌లకు మొదటగా రూ.38 వేలు, తర్వాత రూ.8 వేలు ఇచ్చాడు. ఈ హత్యకు పథకం పన్నిన రాంచంద్రంకు రూ.50 వేలు ఇచ్చాడు. మిగతా డబ్బులను శనివారం ముట్టజెపుతానని చెప్పడంతో నిందితులు గోదావరిఖని ప్రాంతానికి వచ్చారు. వీరిలో వాహెద్‌బేగ్, ఆనంద్‌ను ఎన్టీపీసీలో, గాంధీ, విజయ్‌లను గోదావరిఖని బస్టాండ్ వద్ద, రాజు, సతీష్‌లను రామగుండం బీ-పవర్‌హౌస్ వద్ద, రాంచంద్రంను పవర్‌హౌస్‌కాలనీలోని అతడి ఇంట్లో అరె స్ట్ చేసినట్లు డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వీరిలో సుల్తానాబాద్‌కు చెందిన సతీష్‌పై ఇరవై దొంగతనం కేసులున్నాయని, ఆనంద్, గాంధీలపై రౌడీషీట్ ఉందని చెప్పారు. నిందితులందరిపై రౌడీషీట్ నమోదు చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. చిన్నపాటి డబ్బుకోసమే స్నేహితుడి హత్యకు సహకరించడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ఈ హత్యకు రాజకీయ రంగుపులిమి పోలీసులను ఇబ్బందులపాలు చేయడానికి ప్రయత్నించారని, ఇది సరైంది కాదని అన్నారు. నేరం చేసిన వారికి చట్టప్రకారం శిక్ష తప్పదన్నారు. పది రోజుల్లోనే ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించేందుకు కృషి చేసిన రామగుండం సీఐ నారాయణ, మంథని ఎస్సై ఉపేందర్, రామగుండం ఎస్సై ఎల్.శ్రీను, కానిస్టేబుళ్లు దుబాసి రమేష్, దేవేందర్, కనకయ్య, హోంగార్డులు శ్రీను, కిష్టయ్యలను డీఎస్పీ అభినందించారు. -
‘చితి’కిపోతున్నారు
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : డిగ్రీ చదువుకున్న వెంగల చక్రధర్‌కు ఉద్యోగం కరువైంది. కులవృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుందామని ఆశపడితే వస్త్ర పరిశ్రమ సంక్షోభం ఆ చేతులకు పనిలేకుండా చేసింది. అప్పుల బాధతో పచ్చని సంసారంలో చిచ్చు రేగగా, మానసిక సమస్యలూ చుట్టుముట్టడంతో ఆవేదనకు లోనైన చక్రధర్ బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చక్రధర్ ఇంట్లో అందరూ శ్రమించేవారే. తల్లి లక్ష్మీదేవి బీడీ కార్మికురాలు. తండ్రి భూపతి మరమగ్గాల కార్మికుడు. చెల్లెలు వీణ డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తోంది. ఇంట్లో అందరూ పనిచేస్తున్నా ఇల్లు గడ వడం కష్టంగానే ఉంది. పద్మనగర్‌లో చిన్న పెంకుటిం ట్లో ఉంటున్న చక్రధర్ వారం రోజులుగా పని సరిగా లేక.. సాంచాలు నడవక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. ఏడాదిన్నర కిందట శాంతినగర్‌కు చెందిన కవితతో అతడికి పెళ్లయింది. పెళ్లికి రూ.లక్షన్నర వరకు అప్పులయ్యాయి. ఆ అప్పుల బాధలు.. చెల్లెలు పెళ్లికి ఎదగడం... వచ్చే ఆదాయం పొట్టపోసుకోవడానికే సరిపోతుండడంతో మానసిక వేదనకు గురయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లోనే సెల్ఫోన్లో పాటలు వింటూ పరదా చాటున కూర్చున్నాడు. ఇంట్లో ఎవరి పనుల్లో వారుండగా ఉరేసుకున్నాడు. చేనేత దినోత్సవం వేళ.. ప్రపంచ చేనేత దినోత్సవం సంబరాలను సిరిసిల్లలో నేతన్నలు బుధవారం నిర్వహించగా.. ఆ సంబరాల మాటునే విషాదం చోటుచేసుకుంది. చక్రధర్ ఆత్మహత్య సంఘటన కార్మిక క్షేత్రంలో విషాదం నింపింది. సిరిసిల్ల పాలిస్టర్ పరిశ్రమకు దిగుమతయ్యే యారన్ (నూలు) రేట్లు భారీగా పెరగడం, ఉత్పత్తవుతున్న పాలిస్టర్ గుడ్డకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉత్పత్తి వ్యయం పెరిగి ఆదాయం రాకపోవడంతో సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులు రెండు వారాలుగా పూర్తిస్థాయిలో వస్త్రోత్పత్తి చేయడం లేదు. దీంతో సిరిసిల్లలో పద్నాలుగు వేల మరమగ్గాలు మూతపడ్డాయి. ఎనిమిది వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ సంక్షోభమే ఓ యువకుడి నిండుప్రాణాన్ని బలితీసుకుంది. భరోసా ఇవ్వని సర్కారు రాష్ట్రంలోనే అత్యధికంగా 38 వేల మరమగ్గాలు జిల్లాలో ఉండగా... ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి పాతికవేల మంది కార్మికులు పొట్టపోసుకుంటున్నారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి గురై ఇబ్బందులు పడుతుంటే భరోసా ఇవ్వాల్సిన సర్కారు నివేదికల పేరిట కాలయాపన చేస్తోంది. దివంగత నేత రాజశేఖరరెడ్డి హయాంలో సిరిసిల్ల నేతన్నలకు భరోసా ఇచ్చేందుకు 35 కిలోల బియ్యం, ఇంటింటికీ పావలా వడ్డీ రుణాలను సంపూర్ణ ఆర్థిక చేకూర్పు ద్వారా అందించారు. జాబ్‌మేళాలు నిర్వహించి నేత కుటుంబాల యువకులకు ఉద్యోగాలిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.లక్షన్నర ప్యాకేజీ అందించి ఆదుకున్నారు. ప్రస్తుత పాలకులు నేతన్న సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై బుధవారం సాయంత్రం చేనేత జౌళిశాఖ అధికారులు ఆర్డీవో సమక్షంలో సమావేశమయ్యారు. పరిశ్రమను నడపాలని వస్త్రోత్పత్తిదారులను కోరారు. పెరిగిన నూలు రేట్లతో పరిశ్రమను నడపలేమని యజమానులు తేల్చిచెప్పారు. ప్రభుత్వం మాత్రం నేతన్నలను ఆదుకోవడానికి ఎలాంటి ప్యాకేజీలు ప్రకటించకపోవడం శోచనీయం. ఈ కన్నీళ్లకు బాధ్యులెవరు? ఒక్కగానొక్క కొడుకు కళ్లెదుటే ఉరేసుకుని తనువు చాలిస్తే ఆ కన్నతల్లి గుండె చెరువైంది. గుండెలు బాదుకుంటూ ‘కొడుకా ఎంత పని చేసినావంటూ..’ లక్ష్మీదేవి చేస్తున్న రోదనలు అందరినీ కదిలించాయి. ‘అన్నయ్యా... ఎందుకీ పని చేశావని’ చెల్లెలు వేదనకు అంతేలేదు. ‘అయ్యో కొడుకా.. నేను సాంచాల్ పనికి పొయ్యేసరికి పాణం తీసుకుంటివి..’ అంటూ కన్న తండ్రి భూపతి కుమిలిపోతున్నాడు. అందరికి ఆ‘ధారమై’న చక్రధర్ ఇక సెలవంటూ.. ఈ లోకాన్ని వీడడంతో ఆ కన్నీళ్లకు బాధ్యలెవరు?. సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.