శ్రీకాకుళం జిల్లా నుంచి 12 మంది బాలకార్మికులను రైలులో గుజరాత్‌కు తరలిస్తుండగా ఐసీడీఎస్ అధికారులు బుధవారం వేకువజామున దాడిచేసి పట్టుకున్నారు.
ఆముదాలవలస: శ్రీకాకుళం జిల్లా నుంచి 12 మంది బాలకార్మికులను రైలులో గుజరాత్‌కు తరలిస్తుండగా ఐసీడీఎస్ అధికారులు బుధవారం వేకువజామున దాడిచేసి పట్టుకున్నారు. వివరాలు.. శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ నుంచి 12 మంది బాలకార్మికులను తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసుల సాయంతో అధికారులు రైల్వేస్టేషన్ చేరుకున్నారు.
పూరి- అహమ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలులో బాలలను తరలిస్తుండగా దాడిచేసి వారిని పట్టుకున్నారు. పోలీసులను చూసిన ఏజెంట్లు పరారయ్యారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ చక్రధర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ కేవి రమణ ఇతర అధికారులు 12మంది బాల కార్మికులను విముక్తి చేసి వారిని బుధవారం ఉదయం శ్రీకాకుళం బాలసదన్‌కు తరలించారు.