ప్రాణాపాయంలో అభిమాని... అండగా నిలిచిన చిరంజీవి | Megastar Chiranjeevi Helps To His Fan Dondapati Chakradhar | Sakshi
Sakshi News home page

Chiranjeevi: ప్రాణాపాయంలో అభిమాని... అండగా నిలిచిన చిరంజీవి

Published Tue, Aug 16 2022 5:10 PM | Last Updated on Tue, Aug 16 2022 5:23 PM

Megastar Chiranjeevi Helps To His Fan Dondapati Chakradhar - Sakshi

ఎవరికి ఏ ఆపద వచ్చిన సాయం చేయడానికి ముందుంటాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఇక తన అభిమానులకు అయితే సొంత ‘అన్నయ్య’లా ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఏ చిన్న ఆపద వచ్చిన నేనున్నాను అంటూ భరోసా ఇస్తాడు. గతంలో ఆపదలో ఉన్న అనేకమందికి సాయం చేసిన చిరంజీవి.. తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమానికి తోడుగా నిలిచాడు. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి అభిమాని దొండపాటి చక్రధర్‌కు క్యాన్సర్‌ సోకింది.

గత కొన్నాళ్ల నుంచి ఆయనఅనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈవిషయం తెలుసుకున్న చిరంజీవి.. వెంటనే ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్  తరలించారు. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జాయిన్‌ చేయించారు. అంతేకాదు ఆయన ఉన్న ఆసుపత్రికి సోమవారం సాయంత్రం  వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే అక్కడి వైద్యులతో మాట్లాడి పరిస్థితి ఏమిటో తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అలాగే చక్రధర్ కు అండగా ఉంటామని ఆయన కుటుంబసభ్యలకు కూడా మెగాస్టార్ చిరంజీవి అభయం ఇచ్చారు.
(చదవండి: వ్యూస్‌ కోసం అలా రాసి మమల్ని బలిపశుల్ని చేయ్యొద్దు: దిల్‌రాజు ఎమోషనల్‌)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement