Power generate
-
విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ జెన్ కో రికార్డు!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విద్యుదుత్పత్తిలో సరికొత్త రికార్డు సృష్టించింది. శనివారం 105.620 మిలియన్ యూనిట్ల (5137 మెగావాట్ల) విద్యుదుత్పత్తి నమోదు చేసింది. శుక్రవారం అర్ధరాత్రి 12 నుంచి శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకూ సుమారు 114 మిలియన్ యూనిట్ల విద్యుదుత్వత్తి చేయగా జెన్ కో వినియోగానికి పోనూ 105.620 మిలియన్ యూనిట్లు గ్రిడ్‌కు సరఫరా చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఒకరోజులో ఇదే అత్యధిక ఉత్పత్తి కావడం విశేషం. అత్యధిక విద్యుదుత్పత్తి చేయడానికి అన్ని విధాలొ సహకారం అందించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఇంధన శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డికి, కేంద్ర రైల్వే , కోల్ మంత్రిత్వ శాఖల అధికారులకు ఏపీ జెన్ కో మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. మరింత అంకిత భావంతో పని చేయండి.. రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించినందుకు ఏపీ జెన్ కో ఉద్యోగులను మేనేజింగ్ డైరెక్టర్ చక్రధర్ బాబు అభినందించారు. వేసవి తీవ్రత నేపథ్యంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేసి రాష్ట్ర అవసరాలను తీర్చడానికి మరింత అంకిత భావంతో పని చేయాలని ఉద్యోగులకు సూచించారు .రాష్ట్రంలో విద్యుత్ డిమాండు పెరుగుతున్నందున ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వ సహకారంతో ఏపీ జెన్ కో అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఎండీ పేర్కొన్నారు. వీటీపీఎస్ లో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన కొత్త యూనిట్ విద్యుదుత్పత్తి త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. లోయర్ సీలేరులో మరో 230 మెగావాట్ల ఉత్పత్తి కోసం రెండు యూనిట్ల నిర్మాణ పనులు త్వరగా చేపట్టి ఏడాదిలో పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పొరు. -
మీ చేతివేళ్లే ఫోన్ చార్జర్! చెమట నుంచి కరెంట్
స్మార్ట్‌ఫోన్ లేనిదే కాలం గడవని పరిస్థితి. రోజూ ఒకట్రెండు సార్లు చార్జింగ్ పెట్టాలి. ఎక్కడికైనా వెళ్తే చార్జర్ కూడా వెంట తీసుకెళ్లాలి, లేకుంటే వెళ్లిన చోట చార్జర్ కోసం వెతుకులాట తప్పదు. ఇక ముందు అలాంటి తిప్పలు తప్పనున్నాయి. విడిగా చార్జర్ అవసరమేదీ లేకుండా.. మీ చేతి వేళ్లే చార్జర్‌గా మారిపోనున్నాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు అలాంటి ఓ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా? చిన్న ప్లాస్టర్‌లా వేసుకుంటే చాలు.. ఎప్పుడైనా చిన్నపాటి గాయమైతే వేసుకునే ప్లాస్టర్ తరహాలోనే.. ఈ సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని పరిమాణం ఒక చదరపు సెంటీమీటర్ మాత్రమే. దీన్ని అమర్చిన స్ట్రిప్‌ను చేతివేలి కొసలకు చుట్టేసి పెడితే చాలు.. ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కూర్చుని ఉన్నా, పడుకున్నా, ఇంకేదైనా పనిలో ఉన్నా సరే.. ఆటోమేటిగ్గా అదే చార్జ్ అవుతూ ఉంటుంది. చెమట నుంచి కరెంటు ఈ పరికరంలో కార్బన్ ఫోమ్‌తో తయారైన ఎలక్ట్రోడ్లు, కొన్నిరకాల ఎంజైమ్‌లు ఉంటాయి. అవి చేతి వేళ్ల వద్ద ఏర్పడే చెమటను గ్రహించినప్పుడు.. రసాయనిక చర్యలు జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంతేగాకుండా ఇందులోని ఎలక్ట్రోడ్ల దిగువన ‘పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్ (ఒత్తిడికి లోనైనప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసే పదార్థాలు)’ను అమర్చారు. దీనివల్ల మనం ఏదైనా వస్తువును పట్టుకోవడం, కీబోర్డుపై టైపింగ్ చేయడం, కారు, బైక్ నడపడం వంటివి చేసినప్పుడు వేళ్లకు ఉన్న స్ట్రిప్‌లపై ఒత్తిడిపడి.. విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. పరికరంలోని కెపాసిటర్‌లో ఆ విద్యుత్ నిల్వఅవుతుంది. టెస్టులు.. పరికరాలకు.. ప్రస్తుతం ఒక స్ట్రిప్‌ను పది గంటల పాటు ధరిస్తే.. ఒక సాధారణ చేతి గడియారాన్ని 24 గంటలపాటు నడిపేంత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అదే పది వేళ్లకు పది స్ట్రిప్‌లను ధరిస్తే ఎక్కువ ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. ఈ స్ట్రిప్ ప్రస్తుతానికి ప్రాథమిక నమూనా మాత్రమేనని, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి విద్యుత్ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపారు. గుండెకు అమర్చే పేస్ మేకర్లు వంటి పరికరాలకు, బ్లడ్ షుగర్, విటమిన్, సోడియం సెన్సర్లు, ఇతర టెస్టుల కోసం శరీరానికి అమర్చే పరికరాలకు ఈ స్ట్రిప్‌ల సాయంతో విద్యుత్ అందించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. హా ప్రస్తుతం ఒక్కో స్ట్రిప్‌తో సెల్‌ఫోన్‌ను చార్జింగ్ చేయడానికి మూడు వారాలు పడుతుందని.. భవిష్యత్తులో కొద్దిగంటల్లోనే చార్జ్ అయ్యే స్థాయికి అభివృద్ధి చేస్తామని వివరించారు. - సాక్షి సెంట్రల్‌డెస్క్ -
అరటి చెట్టు నుంచి విద్యుత్
గౌరీపట్నం(దేవరపల్లి), న్యూస్‌లైన్: ఈ నెల 23న ఏలూరు బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీల్లో దేవరపల్లి మండలం గౌరీపట్నం జెడ్పీ హైస్కూలు విద్యార్థులు చూపిన ప్రదర్శనకు జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. అరటి చెట్టి నుంచి విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని ఈ విద్యార్థులు నిరూపించారు. అడవుల్లోను. రోడ్డు పక్కన గల పాలు కారే చెట్లు నుంచి విద్యుత్ బల్బులను వెలిగించవచ్చునని ప్రదర్శించారు. లీడర్ కేవీవీఆర్ఎస్ విష్ణుకు సహయలీడర్ ఎ.లఖిల, విద్యార్థులు ఎ.దుగ్గిరాజు, డి.రాజేష్, కె. వెంకటేష్ ఈప్రాజెక్టును తయారు చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ ఆర్. ప్రసాద్ సహకరించారు.విదార్థులను ఎంఈవో జి.రత్నకుమార్, ఉపాధ్యాయులు అభినంధించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికైందని ఉపాధ్యాయుడు రాజు తెలిపారు. -
ధర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి