‘పవర్‌’ ఫుల్‌ | AP CM YS Jagan Bhumi Pooja For Solar And Wind Projects In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

‘పవర్‌’ ఫుల్‌

Published Thu, Aug 24 2023 4:30 AM | Last Updated on Thu, Aug 24 2023 10:46 AM

CM Jagan Bhumi Pooja for solar and wind projects Andhra Pradesh - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలతో ఎన్‌హెచ్‌పీసీ ప్రతినిధులు, ఏపీజెన్‌కో అధికారులు

► రూ.10,350 కోట్ల పెట్టుబడి, 2,300 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్‌కో కంపెనీ నిర్మించే సౌర విద్యుత్‌ ప్రాజెక్టుకు సీఎం జగన్‌ శంకుస్ధాపన. దీనిద్వారా 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.
► 1,014 మెగావాట్లతో ఆర్సిలర్‌ మిట్టల్‌ గ్రీన్‌ ఎనర్జీ కంపెనీ నిర్మించే ప్రాజెక్టుకు శంకుస్ధాపన. ఇందులో 700 మెగావాట్లు సోలార్‌ పవర్‌ కాగా 314 మెగావాట్లు 
విండ్‌ పవర్‌ ఉత్పత్తి. రూ.4,500 కోట్ల పెట్టుబడితో 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.
► ఎకోరన్‌ ఎనర్జీ 2 వేల మెగావాట్ల (1,000 మె.వా. సోలార్, 1,000 మె.వా. విండ్‌ పవర్‌) సామర్ధ్యంతో నిర్మించనున్న ప్రాజెక్టుకు శంకుస్ధాపన. దాదాపు రూ.11 వేల కోట్ల పెట్టుబడితో 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.

పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు.. ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం
► 2 వేల మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజీ విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు సంబంధించి ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం. రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో యాగంటి, కమలపాడులో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టుల వల్ల 2 వేల మందికి ఉద్యోగాల కల్పన.
► వీటితో పాటు ఎన్‌హెచ్‌పీసీతో మరో మూడు ప్రాజెక్టుల ఫీజిబిలిటీపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం. మరో 2,750 మెగావాట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టులపై కలసి పని చేసేలా అడుగులు.

రాష్ట్రానికి.. రైతులకు.. యువతకు మేలు
ఈ ప్రాజెక్టుల ఏర్పాటుతో మనకు జరిగే మేలును ఒక్కసారి పరిశీలిస్తే.. రాబోయే రోజుల్లో మన యువతకు స్ధానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా అందుబాటులోకి వస్తున్న ప్రతి మెగావాట్‌కు మరో వందేళ్ల పాటు అంటే ఈ ప్రాజెక్టు లైఫ్‌ ఉన్నంత కాలం  మెగావాట్‌కు రూ.లక్ష చొప్పున రాయల్టీగా రాష్ట్ర ప్రభు­త్వానికి ఆదాయం వస్తుంది. దీంతో పాటు ఈ ప్రాజెక్టుల వల్ల జీఎస్టీ ఆదాయం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులకు తమ భూములిస్తూ సహకరి­స్తున్న రైతన్నలకు కూడా ఈ కంపెనీల నుంచి లీజు రూపంలో ఏటా ఎకరాకు రూ.30 వేలు చొప్పున ఆదాయం వస్తుంది.

ఇందుకు ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది. అంటే రైతులు ఎవరైనా భూములివ్వాలనుకుంటే ప్రతి రైతుకు, ప్రతి ఎకరానికి, ఏడాదికి రూ.30 వేలు లీజు రూపంలో ఇస్తారు. ప్రతి రెండేళ్లకు 5 శాతం లీజు రుసుము కూడా పెరుగుతుంది. దశాబ్దాలుగా నీళ్లకు కటకటలాడిన దుర్భిక్ష ప్రాంతం రాయలసీమ రైతన్నలకు ఈ ప్రాజెక్టులతో మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇవి పర్యావరణానికి  మేలు చేస్తాయి.
– సీఎం జగన్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంధన రంగానికి భద్రత చేకూరేలా మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుడుతూ చరిత్రాత్మక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ఒప్పందాలను శరవేగంగా కార్యా­చ­ర­ణ­లోకి తెస్తూ నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు క్యాంపు కార్యాలయం నుంచి బుధవా­రం వర్చువల్‌ విధానంలో భూమి పూజ నిర్వహించా­రు.

మరో రెండు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజె­క్టుల (పీఎస్పీ) ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరే­షన్‌ కార్పొరేషన్‌ (ఏపీ జెన్‌కో), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) మధ్య ఒప్పందం కుదిరింది. ఈ­మేరకు సీఎం జగన్‌ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఏపీ జెన్‌కో ఎండీ చక్రధరబాబు, ఎన్‌హెచ్‌పీసీ ఫైనా­న్స్‌ డైరెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ గోయల్‌ సంత­కాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ రంగంలో అపార పెట్టుబడుల అవకాశా­ల­పై సీఎం జగన్‌ శ్వేతపత్రాన్ని విడుదల చేసి మాట్లాడారు. 

భవిష్యత్తు గ్రీన్‌ ఎనర్జీదే 
ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ మనతో పాటు ఉన్న బ్రిటీష్‌ డిప్యూటీ హైక­మిషనర్‌ గారత్, గ్రీన్‌కో, ఆర్సెలర్‌ మిట్టల్, ఎకో­రన్‌ గ్రూపు యాజమాన్యాలకు, కంపెనీల ప్రతి­నిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకు­నేందుకు ఇక్క­డకు వచ్చిన ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ గోయల్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రజత్‌కు ధన్య­వా­దాలు. ఇవాళ మూడు ప్రాజెక్టులకు శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. నాలుగో కార్యక్రమం కింద ఎన్‌­హెచ్‌­పీసీతో అవగా­హన ఒప్పందం కూడా కుదుర్చు­కుంటున్నాం.

మొదటి ప్రాజెక్టు గ్రీన్‌కో.. 2,300 మెగా­­­వాట్ల సౌర విద్యు­త్తుకు సంబంధించి రూ.10,350 కోట్ల పెట్టు­బడి­తో 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకా­శాలు కలిగిస్తున్న ప్రాజెక్టు ఇది. ఇక పంప్డ్‌ స్టోరేజ్‌ అన్నది ఆర్టిఫీషియల్‌ బ్యాటరీ లాంటిది. పీక్‌ అవర్స్‌­లో పవర్‌ జనరేట్‌ చేస్తాం. నాన్‌ పీక్‌ అవర్స్‌లో మళ్లీ నీళ్లని వెనక్కి పంప్‌ చేసి ఆ తరు­వాత, పీక్‌ అవర్స్‌లో పవర్‌ని జనరేట్‌ చేసేందుకు ఆర్టిఫీషియల్‌ బ్యాటరీ మాదిరిగా ఏర్పాట్లు ఉంటాయి.

పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు భవిష్యత్తులో పూర్తిగా గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తయ్యేలా దోహదం చేస్తాయి. దీనివల్ల బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల మీద ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. పర్యావర­ణా­నికి మంచి జరగాలంటే రాబోయే రోజుల్లో పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సోలార్‌ ప్రాజెక్టులు, విండ్‌ ప్రాజెక్టులు, పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులతో మనం అనుసంధానమ­వు­తున్న తీరు గ్రీన్‌ ఎనర్జీలో పెను మార్పులకు దారి తీస్తాయి. పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. అదే సమ­యంలో విద్యుదుత్పత్తికి తోడ్పాటునివ్వడం ద్వారా గ్రీన్‌ ఎనర్జీలో ఒక విప్లవాత్మక మార్పు వస్తుంది.

మరో 30 ఏళ్లు ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా..
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 8,998 మెగావాట్ల సోలార్, విండ్‌ పవర్‌ ఉత్పత్తి చేస్తున్నాం. రైతులకు దీర్ఘకాలం పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా కొనసాగించేందుకు 16 వేల మిలియన్‌ యూనిట్లు అంటే దాదాపు 7,200 మెగావాట్లకు సంబంధించి సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఏజెన్సీ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ (సెకీ)తో యూనిట్‌ రూ.2.49కే అందేలా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం.

తద్వారా మరో 25 నుంచి 30 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పవర్‌ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా, ఒత్తిడి లేకుండా రైతులకు ఉచితంగా విద్యుత్‌ అందించే వెసులుబాటు లభిస్తుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో రూ.2.49కే మరో 25 – 30 ఏళ్ల పాటు ఉచిత కరెంటుకు ఢోకా లేకుండా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది గొప్ప అడుగు.

41 వేల మెగావాట్లు.. 37 ప్రాంతాలు
ఒకవైపు ఇవన్నీ చేస్తూనే మరోవైపు పంప్డ్‌ స్టోరేజీని ప్రోత్సహించడంలో భాగంగా దాదాపు 41 వేల మెగావాట్లకు సంబంధించి 37 ప్రాంతాలను ఇప్ప­టికే గుర్తించాం. ఇందులో 33,240 మెగావా­ట్లకు సం­బంధించి 29 చోట్ల ప్రాజెక్టు ఫీజిబులిటీ పరిశీ­లన జరుగుతోంది. 20,900 మెగావాట్ల కెపాసిటీకి సంబంధించిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు కూడా పూర్త­య్యా­యి. వీటిలో 16,180 మెగావాట్ల కెపాసిటీతో ఉత్పత్తి చేసేందుకు వివిధ కంపెనీలకు అలాట్‌­మెంట్లు కూడా పూర్తయ్యాయి. ఇందులో భాగ­ం­గానే ఇ­వాళ ఎన్‌­హెచ్‌పీసీతో ఒప్పందం చేసు­కుంటున్నాం. దీని­లో యాగంటిలో 1,000 మెగా­వాట్ల ప్రాజెక్టు, కమల­పాడులో మరో 950 మెగా­వాట్లు కలిపి మొ­త్తంగా దాదాపు 2 వేల మెగావాట్ల ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభు­త్వం ఎన్‌హెచ్‌పీసీతో కలిసి నిర్మించనుంది. దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఈ ప్రాజె­క్టులకు ఫీజిబులిటీ స్డడీస్‌ పూర్తయ్యాయి. ఎన్‌హెచ్‌­పీసీ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం వాటాతో ప్రాజె­క్టు­ను అభివృద్ధిలా ఇవాళ ఎంవోఓయూ కుదు­ర్చుకు­న్నాం.

హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు..
కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా­రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌­రెడ్డి, ఏపీ జెన్‌కో ఎండీ కేవీఎన్‌ చక్రధర్‌­బాబు, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ వీసీ, ఎండీ ఎస్‌.రమణా­రెడ్డి, బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్, డిప్యూటీ హెడ్‌ మిషన్‌ యూకే గవర్నమెంట్‌ వరుణ్‌ మాలి, యూకే గవర్నమెంట్‌ సీనియర్‌ అడ్వైజర్‌ నిషాంత్‌కుమార్‌ సింగ్, ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ గోయల్, గ్రీన్‌కో వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.శేషగిరిరావు, ఏఎం గ్రీన్‌ ఎనర్జీ బిజినెస్‌ హెడ్‌ సమీర్‌ మాథుర్, ఎకోరన్‌ గ్రీన్‌ ఎనర్జీ సీఎండీ వై.లక్ష్మీ ప్రసాద్, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరో మూడు చోట్ల కూడా...!
ఎన్‌హెచ్‌పీసీతో కలసి ఇంకా వేగంగా అడుగులు ముందుకువేసే కార్యక్రమంలో భాగంగా మరో 2,750 మెగావాట్లకు సంబంధించి 3 ప్రాంతాలలో ఫీజుబులిటీ స్డడీస్‌ జరుగుతున్నాయి. రాబో­యే రోజుల్లో ఆ ప్రాజెక్టులను కూడా ఎన్‌­హెచ్‌­­­పీసీతో కలిసి సంయుక్తంగా చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సామర్ధ్యాన్ని పెంచు­కుంటూనే మిగిలిన ప్రైవేట్‌ డెవల­పర్స్‌­కి కూడా అందుబాటులోకి తెచ్చి తద్వారా రాష్ట్రంతో పాటు దేశానికి కూడా మంచి చేసే కార్య­క్ర­మా­లు  చేస్తు­న్నాం. వీటన్నింటితో రాబోయే రోజు­ల్లో గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే ఆదర్శంగా నిలవనుంది.

ప్రపంచాన్ని శాసించే ఎనర్జీ
దేవుడు గొప్పవాడు.. అందుకే మానవాళికి ఇంత చక్కటి వనరులను సృష్టించాడు. ఎండ బాగున్న­ప్పుడు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సోలార్‌ పవర్‌ని ఉత్ప త్తి చేస్తే సాయంత్రం 6 నుంచి ఉదయం వర కు విండ్‌ పవర్‌ ఉత్పత్తి అవు­తుంది. పీక్‌ అ వర్స్‌లో నీళ్లతో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజె­క్టులను వాడుకోవచ్చు. ïపీక్‌ అవర్స్‌లో అవి ఆర్టిఫీషి­యల్‌ బ్యాటరీలా పనిచేస్తాయి. దీంతో ïపీక్‌ అవర్స్‌­లో విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది. ఫలి­తంగా శిలాజ ఇంధనాల నుంచి బయట­పడి పర్యావరణ హితమైన గ్రీన్‌ ఎనర్జీ లభిస్తుంది. ఇది ప్రపంచాన్ని శాసించ బోయే ఎన ర్జీగా నిలు­స్తుంది. అందులో ఏపీ తొలిస్థానంలో నిలిచేలా అడుగులు పడుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement