CM Jagan virtually started construction of companies as GIS agreements - Sakshi
Sakshi News home page

మరో 4 అడుగులు.. విశాఖ జీఐఎస్‌ ఒప్పందాల కార్యరూపం శరవేగంగా ..

Published Fri, Jun 23 2023 4:03 AM | Last Updated on Fri, Jun 23 2023 1:46 PM

CM Jagan started Companies construction works virtually as GIS Agreements - Sakshi

నెల్లూరు జిల్లా సర్వేపల్లి వద్ద క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ సంస్థ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్, క్రిబ్‌కో చైర్మన్‌ చంద్రపాల్‌సింగ్, మంత్రి అమర్‌నాథ్‌ తదితరులు

సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాల మేరకు మూడు జిల్లాల్లో రూ.1,425 కోట్ల విలువైన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురు­వారం తాడే­పల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరో ప్రాజెక్టులో ఉత్పత్తిని వర్చువల్‌గా ప్రారంభించారు. క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్‌ ఫుడ్‌ అండ్‌ బెవరేజెస్‌ పరిశ్రమల శిలాఫలకా­లను సీఎం జగన్‌ వర్చువల్‌గా ఆవిష్క­రించి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు.

ఏలూరు జిల్లా చింత­లపూడిలో ఏర్పాటైన గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్థ విస్తరించిన యూనిట్‌లో వాణిజ్య కార్యకలాపాలను సీఎం ప్రారంభించారు. ఈ రోజు మూడు జిల్లాల్లో నాలుగు యూనిట్లకు సంబంధించి గొప్ప కార్య­క్రమం జరుగుతోందని, వీటివల్ల 2,400 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం పేర్కొన్నారు. శంకుస్థాపన చేసి­న మూడు ప్లాంట్లు త్వరలో నిర్మాణ కార్య­కలాపాలను పూర్తి చేసుకుని అందుబాటు­లోకి వస్తాయన్నారు. ‘ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది.

ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న  విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని పారిశ్రామికవేత్తలకు సూచించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పద్మావతి, ఏపీ పుడ్‌ ప్రాసెసింగ్‌ సీఈవో ఎల్‌.శ్రీధర్‌రెడ్డి, పలువురు పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..

12 నెలల్లో క్రిబ్‌కో ఇథనాల్‌ ప్లాంట్‌ 
నెల్లూరు జిల్లాలో క్రిబ్‌కో ఆధ్వర్యంలో దాదాపు రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటవుతోంది. 12 నెలలలోపే ఈ కర్మాగార నిర్మాణం పూర్తవుతుంది. రోజుకు 500 కిలోలీటర్ల ప్రొడక్షన్‌ కెపాసిటీతో ఇక్కడ బయో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటవుతోంది. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్లాంట్‌ ద్వారా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నెల్లూరు జిల్లాలో స్ధానికంగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. కృష్ణపట్నం వద్ద ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన క్రిబ్‌కో యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 

ఏడాదిన్నరలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్‌
ఇదే నెల్లూరు జిల్లాలోనే విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్‌ కూడా వస్తోంది. రోజుకు 200 కిలోలీటర్ల కెపాసిటీతో నెలకొల్పుతున్న బయో ఇథనాల్‌ ప్లాంట్‌ వల్ల 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయి. రూ.315 కోట్లతో నెలకొల్పుతున్న ఈ ప్లాంట్‌ 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. మన యువతకు ఈ ప్లాంట్‌ వల్ల ఉద్యోగ అవకాశాలు లభించనుండటం ఆనందదాయకం. ప్లాంట్‌ డైరెక్టర్‌ జితేంద్రతో పాటు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు. 

కాంటినెంటిల్‌ కాఫీ ఫ్యాక్టరీ
తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్‌ కాఫీ ఫ్యాక్టరీని స్థాపిస్తోంది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏటా 16 వేల టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని నెలకొల్పుతోంది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్లాంట్‌ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందలు తెలియజేస్తున్నా. 

9 నెలల్లోనే మొదలైన గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ యూనిట్‌
ఏలూరు జిల్లాలో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.వంద కోట్ల పెట్టుబడి, 400 టన్నుల సామర్ధ్యంతో ఎడిబుల్‌ ఆయిల్‌ (వంట నూనె) రిఫైనరీ ప్రాజెక్టును విస్తరిస్తోంది. ప్లాంట్‌ ఏర్పాటుకు మన దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చిన 9 నెలల్లోనే యూనిట్‌ ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయం. ఇందుకు సహకరించిన ప్రతి అధికారికి అభినందనలు. ఈ యూనిట్‌ వల్ల ఏలూరు జిల్లా యువకులకు మరో 500 ఉద్యోగ అవకాశాలు లభించడం శుభపరిణామం. కంపెనీ యాజమాన్యానికి అభినందనలు. 

సర్వేపల్లిలో ‘క్రిబ్‌కో’ గ్రీన్‌ ఎనర్జీ 
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్‌కో గ్రీన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బయో ఇథనాల్‌ తయారీని చేపడుతోంది. ఉప ఉత్పత్తిగా ఏడాదికి 64 వేల టన్నుల కార్బన్‌ డయాక్సైడ్, 4 వేల టన్నుల డ్రైడ్‌ డిస్టిలరీ గ్రెయిన్స్‌ తయారవుతాయి. 

బియ్యం, మొక్కజొన్నతో ‘విశ్వసముద్ర బయో ఎనర్జీ’
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో విశ్వసముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్‌ ఇథనాల్‌ తయారీ కర్మాగారాన్ని స్థాపిస్తోంది. విరిగిన బియ్యం, రంగు మారిన బియ్యం, పాడైపోయిన బియ్యం నుంచి రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్‌ తయారీ చేయనున్నారు.
వరి సాగు చేసే రైతులకు ఇది ఎంతో ఉపయోగకరం. మొక్కజొన్నను వినియోగించుకుని రోజుకు మరో 160 కిలోలీటర్ల డిస్టిలరీతోపాటు బై ప్రొడక్ట్‌గా డ్రైడ్‌ డిస్టిలరీస్‌ గ్రెయిన్స్‌ తయారు కానున్నాయి. 

కాంటినెంటిల్‌ ఇన్‌స్టెంట్‌ కాఫీ 
తిరుపతి జిల్లా వరదాయిపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటల్‌ కాఫీ లిమిటెడ్‌ పుడ్‌ బెవెరేజెస్‌ కంపెనీ ఏర్పాటు కానుంది. ఏటా 16 వేల టన్నుల సొల్యుబుల్‌ ఇన్‌స్టెంట్‌ కాఫీ ఈ ప్లాంట్‌లో తయారవుతుంది. 

యూనిట్‌ విస్తరించిన ‘గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌’
ఏలూరు జిల్లా చింతలపూడిలో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ కంపెనీ రోజుకు 400 టన్నుల వంట నూనె తయారీ సామర్థ్యంతో విస్తరించిన యూనిట్, 200 టన్నుల సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ యూనిట్‌ను ప్రారంభించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement