Global Investors Summit
-
ప్రపంచం చూపు భారత్ వైపు
భోపాల్: భారతదేశ ఆర్థిక ప్రగతి పట్ల ప్రపంచం మొత్తం ఎంతో ఆశాభావంతో ఉందని, ఇలాంటి పరిణామం మన దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత్ నుంచి సామాన్య ప్రజలతోపాటు ఆర్థికవేత్తలు, ప్రపంచ దేశాలు, సంస్థలు ఎంతో ఆశిస్తున్నాయని అన్నారు. మనపై ఎన్నో ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నాయని తెలిపారు. సోమవారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ‘ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్–గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2025’లో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రపంచం భవిష్యత్తు భారత్‌లో ఉందనడంలో సందేహం లేదన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇండియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ప్రపంచబ్యాంక్ సైతం ఆశాభావం వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. ‘సోలార్ పవర్లో ఇండియా సూపర్ పవర్’ అని వాతావరణ మార్పులపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి సంస్థ ప్రశంసించిందని తెలిపారు. చాలా దేశాలు కేవలం మాటలకు పరిమితం అవుతుండగా, ఇండియా మాత్రం కార్యరంగంలోకి దిగి, ఫలితాలు సాధించి చూపుతోందని స్పష్టంచేశారు. అంతర్జాతీయంగా ఏరోస్పేస్ సంస్థలకు మన దేశమే అతిపెద్ద సరఫరాదారుగా మారిందన్నారు. రాబోయే కొన్నేళ్లలో టెక్స్టైల్, టూరిజం, టెక్నాలజీ వంటి రంగాల్లో యువతకు కోట్లాది ఉద్యోగాలు దక్కబోతున్నాయని వివరించారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో దూసుకెళ్తున్నాం గత దశాబ్ద కాలంలో ఇంధన రంగంలో మునుపెన్నడూ లేని ప్రగతి సాధించామని ప్రధానమంత్రి మోదీ వివరించారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ రంగంలో ముందుకు దూసుకెళ్తున్నామని చెప్పారు. పదేళ్లలో పునరుత్పాదక ఇంధన రంగంలో 70 బిలియన్ డాలర్ల(రూ.6 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చాయన్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో గత ఏడాది 10 లక్షలకుపైగా ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో పెట్టుబడులకు అద్బుతమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వీటిని సది్వనియోగం చేసుకోవాలని దేశ విదేశీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలో మధ్యప్రదేశ్ ముందంజలో ఉందని తెలిపారు. రాష్ట్రం అతిపెద్ద తయారీ కేంద్రంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి వివరించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన 18 నూతన విధాన నిర్ణయాలను మోదీ ఆవిష్కరించారు. విద్యార్థుల కోసమేఆలస్యంగా వచ్చా భోపాల్‌లో పెట్టుబడిదారుల సదస్సుకు ప్రధాని మోదీ కొంత ఆలస్యంగా హాజరయ్యారు. దీనిపై ఆయన సదస్సులో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ఈ రోజు పది, పన్నెండో తరగతుల విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయని చెప్పారు. రాజ్‌భవన్ నుంచి తాను బయలుదేరే సమయానికే వారు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉందని తెలిపారు. తాను బయటకు వస్తే రోడ్లపై ట్రాఫిక్ నిలిపివేస్తారు కాబట్టి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో దాదాపు 15 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరానని వెల్లడించారు. తన వల్ల విద్యార్థులు నష్టపోవడాన్ని తాను భరించలేనన్నారు. వారు సరైన సమయానికే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. -
ఆలస్యానికి అతిథులకు క్షమాపణలు చెప్పిన ప్రధాని
-
విద్యార్థులకు పరీక్షలున్నాయని.. ప్రధాని మోదీ ఏం చేశారంటే..
భోపాల్: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రస్తుతం మధ్యప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. ఆదివారం మధ్యప్రదేశ్ చేరుకున్న ఆయన ఈరోజు(సోమవారం) భోపాల్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనబోతున్నారు. అయితే ఆయన విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తన షెడ్యూల్లో మార్పులు చేసుకున్నారు.గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(Global Investors Summit) జరిగే ప్రాంతానికి నిర్థారించిన విధంగా ప్రధాని ఉదయం 9.45కు హాజరు కావలసివుంది. అయితే ఈ కార్యక్రమానికి 10 గంటలకు వెళ్లే విధంగా ప్రధాని మోదీ తన షెడ్యూల్ మార్చుకున్నారు. నగరంలోని పలు కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తన కాన్వాయ్ కారణంగా ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకే ప్రధాని మోదీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు.భోపాల్‌లోని నేషనల్ మ్యూజియంలో జరగనున్న ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ పారిశ్రామిక విధానాలను వెల్లడించనున్నారు. అలాగే దేశ, విదేశాల నుంచి వచ్చిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్(Aditya Birla Group) చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, గోద్రేజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ నాదిర్ గోద్రేజ్, రస్నా ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్ అధ్యక్షుడు పిరోజ్ ఖంబట్టా, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ బాబా ఎన్ కళ్యాణి, సన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ రాహుల్ అవస్థి, ఏసీసీ లిమిటెడ్ సీఈఓ నీరజ్ అఖౌరి తదితరులు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. ఇది కూడా చదవండి: Mahakumbh: జన ప్రవాహమే కాదు.. ఇవి కూడా.. -
ఒక్క ఫోన్ చాలు 'సమస్యలన్నీ పరిష్కారం'..
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా అన్ని రకాలుగా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉందని గుర్తు చేశారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదిరిన ఒప్పందాలను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ త్వరితగతిన అమల్లోకి తెస్తున్నామని, ఇందుకోసం కృషి చేస్తున్న అధికారులకు అభినందనలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలను విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,100 కోట్ల విలువైన తొమ్మిది ప్రాజెక్టులకు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. విశాఖ ఒప్పందాలు వేగంగా సాకారం.. పారిశ్రామిక రంగంపై ముఖ్యంగా ఎంఎస్ఎంఈ, పుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. జిల్లా స్ధాయిలో కలెక్టర్లు కూడా దీనిపై దృష్టి సారించి పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలి. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో 386 ఎంవోయూలు చేసుకున్నాం. వీటి ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులతోపాటు ఆరు లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవన్నీ సాకారమయ్యేలా నిరంతరం సమీక్షిస్తూ పురోగతి కోసం చర్యలు తీసుకున్నాం. ఇందులో 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. మరో 94 ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగిలిన వాటి పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో మరింత పురోగతి సాధించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తున్నాం. నెలకు కనీసం రెండు సమీక్షా సమావేశాలు నిర్వహించడం ద్వారా వీటన్నింటినీ వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నాం. కలెక్టర్లు కూడా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపిస్తూ దీన్ని మరింత వేగవంతం చేయాలి. ఎంఎస్ఎఈలతో 12.62 లక్షల మందికి ఉపాధి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగలిగాం. వీటి ద్వారా దాదాపు రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 86 వేలమందికి ఉద్యోగాలు కూడా ఇవ్వగలిగాం. ఎంఎస్ఎంఈ రంగంలో ఎప్పుడూ చూడని విధంగా అడుగులు వేశాం. కోవిడ్ సమయంలో ఎక్కడా, ఎవరూ కుప్పకూలిపోకుండా వారికి చేయూతనిచ్చాం. గత నాలుగున్నరేళ్లలో దాదాపు 1.88 లక్షల ఎంఎస్ఎంఈలు కొత్తగా వచ్చాయి. వీటి ద్వారా 12.62 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అందరం కలసికట్టుగా బాధ్యత తీసుకున్నాం కాబట్టే ఇది సాకారమైంది. పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా మనం కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామనే మెస్సేజ్‌ను ఎంత సానుకూలంగా తీసుకెళ్లగలిగితే అంత ఉత్సాహంగా ముందుకొస్తారు. ఇది కచ్చితంగా నా దగ్గర నుంచి మొదలుకుని మీ వరకు ఇదే రకమైన తత్వాన్ని అలవరచుకోవాలి. రూ.1,100 కోట్ల పెట్టుబడులకు శ్రీకారం పరిశ్రమలు–వాణిజ్యశాఖ, పుడ్ ప్రాసెసింగ్ రంగాలలో ఇవాళ తొమ్మిది ప్రాజెక్టులు చేపడుతున్నాం. దాదాపు రూ.1,100 కోట్ల పెట్టుబడితో 21,744 మందికి ఉద్యోగాలు లభించేలా మంచి అడుగు పడుతోంది. మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, మిగిలిన ఆరు ప్రాజెక్టులకు శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. కొద్ది రోజుల క్రితం నేను పత్తికొండ వెళ్లినప్పుడు టమోటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు దిశగా అడుగులు వేయమని చెప్పా. కొద్ది కాలంలోనే అది అధికారుల కృషితో కార్యరూపం దాల్చి శంకుస్ధాపన దశకు వచ్చింది. రూ.12 కోట్ల పెట్టుబడితో టమోటా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు పత్తికొండలో శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరూ అంతే వేగంగా అడుగులు ముందుకేయాలి. ఇవాళ శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను జరుపుకొంటున్న తొమ్మిది యూనిట్లకు శుభాభినందనలు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వివిధ పరిశ్రమలు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. మీ అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు, కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, వ్యవసాయం, పుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్, పుడ్ ప్రాసెసింగ్ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్‌కుమార్, హ్యాండ్లూమ్స్, టెక్టŠస్టైల్స్ కమిషనర్ ఎంఎం నాయక్, పరిశ్రమలశాఖ కమిషనర్ సీహెచ్ రాజేశ్వరరెడ్డి, ఉన్నతాధికారులు, పరిశ్రమలు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో శంకుస్థాపనలు, ప్రారంభించిన యూనిట్లు 1.ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ముత్తుకూరు మండలం దొరువులపాలెంలో రూ.250 కోట్లతో గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ లిమిటెడ్ సంస్ధ ఆధ్వర్యంలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్ ప్రారంభం. దీని ద్వారా 1,150 మందికి ఉద్యోగాలు. ఏటా 4.2 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి దీని సామర్ధ్యం. 2. రూ.144 కోట్లతో శ్రీవేంకటేశ్వర బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ పనులకు శంకుస్థాపన. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం కొమ్మూరు గ్రామం వద్ద ఏర్పాటయ్యే ఈ మొక్కజొన్న ఆధారిత పరిశ్రమ ద్వారా 310 మందికి ఉద్యోగావకాశాలు. ఏడాదికి 90 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. దీని ద్వారా వేలమంది రైతులకు ప్రయోజనం. 3. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కోనాడ వద్ద రూ.13 కోట్లతో బ్లూఫిన్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీకి శంకుస్థాపన. దీనిద్వారా 45 మందికి ఉద్యోగావకాశాలు. 3,600 మెట్రిక్ టన్నుల గోధుమలు, 480 టన్నుల మిల్లెట్స్, 720 మెట్రిక్ టన్నుల పొటాటో ఉత్పత్తులు తయారు చేసే ఈ కంపెనీ ఏర్పాటుతో స్థానిక రైతులకు లబ్ధి. 4. కర్నూలు జిల్లా పత్తికొండ వద్ద టామాటో ప్రాసెసింగ్ యూనిట్ పనులకు శంకుస్థాపన. రూ.12 కోట్ల పెట్టుబడితో ఏటా 3,600 మెట్రిక్ టన్నుల టమాటా ఉత్పత్తుల తయారీ. ఈ ప్రాజెక్టును పత్తికొండ వెజిటబుల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్‌కు అప్పగించనున్న ప్రభుత్వం. వారి ద్వారా లీజు ప్రాతిపదికన మంచి సమర్థత కలిగిన కంపెనీకి అప్పగించేలా సహకారం. పత్తికొండలో రైతులకు భారీ ప్రయోజనం. టమాటా ధరల స్థిరీకరణకు దోహదం చేయనున్న పరిశ్రమ. 5. విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం రేగ పంచాయతీ పెద్దిరెడ్లపాలెం వద్ద నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్‌కు ప్రారంభోత్సవం. ప్లాంట్‌ను నెలకొల్పిన ఏపీఎఫ్‌పీఎస్. ఎల్.కోట జైకిసాన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్‌కు ప్లాంట్‌ను అప్పగించిన ప్రభుత్వం. నువ్వుల నూనె, చిక్కీ ఉత్పత్తుల తయారీ. రూ.2.5 కోట్ల పెట్టుబడితో 20 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 600 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి కలిగిన ఈ యూనిట్‌తో స్థానిక రైతులకు ప్రయోజనం. పరిశ్రమల శాఖలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా 1. కర్నూలు జిల్లా ఓర్వకల్లు నోడ్ గొట్టిపాడు వద్ద సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా (ఏపీఐ) యూనిట్‌కు శంకుస్థాపన. రూ.280 కోట్ల పెట్టుబడితో 850 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 72 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. 2. కర్నూలు జిల్లా ఓర్వకల్ నోడ్ గొట్టిపాడు వద్ద న్యూట్రాస్యూటికల్స్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న ఆర్పీఎస్ ఇండస్ట్రీస్. పనులకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన. రూ.90 కోట్ల పెట్టుబడితో 285 మందికి ఉద్యోగాలు. ఏడాదికి 4,170 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. 3. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 18 జిల్లాల్లో 21 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు, ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లకు సీఎం ప్రారంభోత్సవాలు, మరికొన్ని చోట్ల పనులకు శంకుస్ధాపనలు. కాంప్లెక్స్ ద్వారా రూ.1,785 కోట్ల పెట్టుడులకు అవకాశం. తద్వారా 18,034 మందికి ఉద్యోగాలు. 4. కాకినాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రింటింగ్ క్లస్టర్లో కామన్ ఫెసిలిటీ సెంటర్లను ప్రారంభించిన సీఎం జగన్. ఈ సెంటర్లలో 1,000 మందికి ఉద్యోగాలు. -
పారిశ్రామికోత్సాహం
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఊపందుకుంది. ఆర్భాటానికి తావు లేకుండా వేలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కొత్త పరిశ్రమలు వెలుస్తున్నాయి. అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుండటం, శర వేగంగా అనుమతులు మంజూరవుతుండటంతో పారిశ్రామిక వేత్తలు కొత్త యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఒక్క ఎంఎస్ఎంఈల విషయాన్నే తీసుకుంటే రాష్ట్రంలో టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి వాటి సంఖ్య 1,93,530 మాత్రమే ఉండగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ సంఖ్య ఏకంగా 5,81,152కు చేరడమే ఇందుకు నిదర్శనం. ఈ లెక్కన కొత్తగా అర కోటి మందికి ఉపాధి లభించడం గమనార్హం. సాక్షి, అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో పాటు వేగంగా ఉత్పత్తి ప్రారంభించేలా పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలతో పాటు ఇతర ప్రాజెక్టులను వేగంగా అమల్లోకి తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా త్వరలో సుమారు రూ.2,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా నిర్మాణ పనులకు భూమి పూజ, వాణిజ్య పరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ రంగం సిద్ధం చేసింది. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన సుమారు 12కు పైగా ప్రాజెక్టులను సిద్ధం చేశారు. వీటి ద్వారా సుమారు 5,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రూ.280 కోట్లతో సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. అక్కడే రూ.90 కోట్లతో ఆర్పీఎస్ ఇండస్ట్రీస్ న్యూట్రాస్యూటికల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ రెండు యూనిట్ల నిర్మాణ పనులను వర్చువల్‌గా ప్రారంభించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. నంద్యాల వద్ద రూ.550 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఏర్పాటు చేసిన సిమెంట్ యూనిట్ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి సిద్ధమయ్యింది. వీటితో పాటు మరికొన్ని యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు పెద్ద పీట అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా సుమారు రూ.263 కోట్ల వ్యయంతో 18 చోట్ల పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్సీ)లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి జిల్లాకు కనీసం రెండు ఎంఎస్ఎంఈ క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా 18 ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. వైఎస్ఆర్ నవోదయం, రీస్టార్ట్ వంటి ప్యాకేజీలకు తోడు ఎంఎస్ఎంఈలకు అన్ని రకాలుగా చేయూత అందిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు భారీ ఎత్తున ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ఎప్పటికప్పుడు ప్రోత్సహకాలు అందజేస్తోంది. వచ్చే ఫిబ్రవరి నెలలో కూడా ప్రోత్సహకాలు విడుదల చేయనుంది. ఇప్పటివరకు కేవలం ఎంఎస్ఎంఈలకే రూ.1,706 కోట్లు ప్రోత్సాహక రాయితీలను అందజేసింది. దీంతో గడిచిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 3.87 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైనట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530 మాత్రమే కాగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఆగస్టు నాటికి వాటి సంఖ్య ఏకంగా 5,81,152కు చేరడం గమనార్హం. వచ్చే నాలుగేళ్లల్లో కొత్తగా 6 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా క్లస్టర్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. వీటితోపాటు రైతులకు అదనపు ఆదాయం ఇచ్చేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా సుమారు రూ.402 కోట్లతో అయిదు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి ముఖ్యమంత్రి భూమి పూజ, ప్రారం¿ోత్సవాలు చేయనున్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో రూ.230 కోట్లతో ఏర్పాటు చేసిన గోకుల్ ఆగ్రో రిసోర్సెస్, విజయనగరంలో రూ.2.5 కోట్లతో ఏర్పాటు చేసిన ఎల్ కోటా సీసేమి యూనిట్‌ను ప్రారంభిస్తారు. ఏలూరులో రూ.144 కోట్లతో మొక్క జొన్న నుంచి గంజి పౌడర్‌ను తయారు చేసే వెంకటేశ్వరా బయోటెక్, విజయనగరంలో రూ.15 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఆలూ చిప్స్, పాస్తా, న్యూడిల్స్ తయారు చేసే బ్లూఫిన్ ఎంటర్ప్రైజెస్, కర్నూలులో రూ.11 కోట్లతో ఏర్పాటు చేసే టమాట ప్యూరీ యూనిట్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఇంధన శాఖకు సంబంధించి సత్యసాయి జిల్లాలో రూ.700 కోట్లతో హెచ్‌పీసీఎల్ ఏర్పాటు చేయనున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్టు, ఎన్టీఆర్ జిల్లా నున్నలో అవేరా సంస్థ రూ.100 కోట్లతో ఏర్పాటు చేయనున్న స్కూటర్ బ్యాటరీ స్టోరేజ్ యూనిట్ల నిర్మాణ పనులను సైతం ప్రారంభించనున్నారు. వాస్తవ రూపంలోకి జీఐఎస్ ఒప్పందాలు విశాఖ వేదికగా మార్చి నెలలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు (జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాలను వేగంగా అమల్లోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. జీఐఎస్ సమావేశంలో రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు కుదరగా, అందులో ఇప్పటికే రూ.1.35 లక్షల కోట్ల విలువైన 111 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 24 యూనిట్లు ఇప్పటికే ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. ఇందులో 24 యూనిట్ల ద్వారా రూ.5,530 కోట్ల విలువైన పెట్టుబడులతో 16,908 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించింది. గ్రీన్‌ల్యామ్, డీపీ చాక్లెట్స్, ఆర్ఎస్బీ ట్రాన్స్మిషన్స్, గోద్రేజ్ ఆగ్రోవెట్, సీసీఎల్ ఫుడ్ అండ్ బేవరేజ్, సూక్ష్మ గామా ఎల్ఎల్పీ వంటి ప్రముఖ సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇవేకాకుండా రూ.1,29,832 కోట్ల విలువైన మరో 87 యూనిట్లు భూ కేటాయింపులు పూర్తి చేసుకొని నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. ఈ కంపెనీల ద్వారా 1,31,816 మందికి ఉపాధి లభించనుంది. మరో 194 యూనిట్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించే దశలో ఉన్నాయి. చేయిపట్టి నడిపిస్తున్నాం.. జీఐఎస్‌లో కుదిరిన ఒప్పందాలను వేగంగా అమల్లోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా పరిశ్రమలను చేయిపట్టి నడిపిస్తున్నాం. అనుమతులన్నీ వేగంగా ఇప్పించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అధ్యక్షతన 17 మంది అధికారులతో కమిటీ వేసి.. ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే పలు ఒప్పందాలు అమల్లోకి రాగా, మిగిలినవి కూడా అమల్లోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. – ఎన్ యువరాజ్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆహార పరిశ్రమల రంగానికి మరింత ఊతం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ఆహార శుద్ధి పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.775 కోట్లతో 9 యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభించగా, 1,130 మందికి ఉపాధి కల్పించారు. 1,510 మందికి ఉపాధి కల్పించేలా రూ.2,226 కోట్లతో మరో 9 యూనిట్లకు శంకుస్థాపన చేశారు. తాజాగా రూ.232.5 కోట్లతో ఏర్పాటు చేసిన మరో రెండు పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. రూ.169 కోట్లతో మూడు యూనిట్లకు శంకుస్థాపన చేయబోతున్నారు. తద్వారా 1,625 మందికి ఉపాధి, 3,654 మంది రైతులకు లబ్ధి కలగనుంది. – చిరంజీవి చౌదరి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ -
రూ.3,008 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న రూ.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే దాదాపు రూ.3,008 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో పరిశ్రమల రంగానికి చెందిన ఏడు యూనిట్లు రూ.2,294 కోట్ల పెట్టుబడితో పాటు 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుండగా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆరు యూనిట్ల ద్వారా రూ.714 కోట్ల పెట్టుబడితో 3,155 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా 91,000 మంది రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. పులివెందులలో ఏర్పాటైన అరటి ప్రాసెసింగ్ యూనిట్‌తోపాటు తిరుపతి జిల్లాలో నెలకొల్పిన డీపీ చాక్లెట్స్కు చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్, గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ కంపెనీ యూనిట్లను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. విశాఖ ఒప్పందాలపై ప్రత్యేక కమిటీ ఈరోజు 13 యూనిట్లకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నాం. ఇందులో ఒక ఎంవోయూ కూడా ఉంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదుర్చుకున్న 386 ఎంవోయూలతో దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండగా 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఇవన్నీ సాధ్యమైనంత త్వరగా కార్యాచరణలోకి తేవాలన్న లక్ష్యంతో సీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి ప్రతి నెలా సమీక్షిస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం అందించేలా చర్యలు తీసుకున్నాం. ఎక్కడ, ఎవరికి ఏ అవసరం ఉన్నా దాన్ని ప్రభుత్వం తన అవసరంగానే భావించి పారిశ్రామికవేత్తలను చేయి పట్టుకుని నడిపిస్తూ ఎంవోయూలను కార్యరూపంలోకి తెస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ 3 యూనిట్లకు ప్రారంభోత్సవాలు, 9 యూనిట్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఒక ఎంవోయూపై కూడా సంతకాలు చేశాం. దాదాపు రూ.3,008 కోట్ల పెట్టుబడితో 7 వేల మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించే బృహత్తర కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మిగతావి ఆర్నెల్ల నుంచి ఏడాదిన్నరలోపే సిద్ధం ఈ పరిశ్రమల వల్ల 14 జిల్లాల్లో సుమారు 7 వేల మందికి పైగా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం కూడా చేశాం. దీనివల్ల మన పిల్లలందరికీ మంచి జరుగుతుంది. అక్కడే వీరికి ఉద్యోగాలు రావడం వల్ల స్థానికులందరూ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు పలికి స్వాగతించేలా మనం ఈ చట్టం చేశాం. వీటివల్ల యువతకు ఆరు నెలల నుంచి గరిష్టంగా 18 నెలలలోగా ఈ పరిశ్రమలలో ఉద్యోగాలు రానున్నాయి. అప్పటిలోగా పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉంటాయి. ఇందులో 3 యూనిట్లను ఇప్పటికే ప్రారంభించుకున్నాం. మిగిలినవి ఆరు నెలల నుంచి ఏడాదిన్నరలోపే పూర్తవుతాయి. ఇవాళ ఎంవోయూ చేసుకున్న ప్లాంట్ కూడా ఏడాదిన్నరలోగా అందుబాటులోకి రానుంది. కార్యక్రమంలో ఆయా రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రతినిధులతో పాటు వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, మార్కెటింగ్, సహకార, పుడ్ ప్రాసెసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క ఫోన్ కాల్ దూరంలో.. ఈ సందర్భంగా మీ అందరికీ (పారిశ్రామికవేత్తలు) మద్దతు ఇచ్చే విధంగా నాలుగు మాటలు చెబుతా. పారిశ్రామిక వేత్తల పట్ల మేం అత్యంత సానుకూలంగా ఉన్నాం. మీకు ఎలాంటి సమస్య ఎదురైనా మేం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నామనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. అధికార యంత్రాంగం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఈ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తుంది. కలెక్టర్లు, ఏపీఐఐసీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, పరిశ్రమలశాఖ మంత్రి, సీఎస్ సహా అందరూ మిమ్మల్ని చేయి పట్టుకుని నడిపించేలా మీ పట్ల సానుకూలంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా కృషి చేసిన కలెక్టర్ నుంచి సీఎస్ వరకూ అందరికీ అభినందనలు. శ్రీకాకుళం జిల్లా నరువలో ‘నాగార్జున ఆగ్రో కెమికల్స్’ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్ పరిశ్రమల రంగంలో ప్రాజెక్టులివీ.. 1. గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ తిరుపతి జిల్లా నాయుడుపేట ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో 66.49 ఎకరాల్లో ఏర్పాటైన గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్. ఈ యూనిట్ ద్వారా రూ.800 కోట్ల పెట్టుబడి, దాదాపు 1,050 మందికి ఉద్యోగ అవకాశాలు. 2. ఎకో స్టీల్ ఇండియా లిమిటెడ్ అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం జాజరకళ్లు గ్రామంలో రూ.544 కోట్లతో ఏర్పాటు కానున్న బయో ఇథనాల్ తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు. 3. ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఏర్పాటయ్యే ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన. ఈ పరిశ్రమ వల్ల 600 మందికి ఉపాధి. 4. శర్వాణి బయో ఫ్యూయల్ బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం బుద్దవానిపాలెంలో ఏర్పాటు కానున్న శర్వాణి బయో ప్యూయల్ లిమిటెడ్ యూనిట్ శంకుస్థాపన. రూ.225 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగ అవకాశాలు. 5. నాగార్జున ఆగ్రో కెమికల్స్ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నరువ గ్రామంలో 57 ఎకరాల్లో ఏర్పాటు కానున్న నాగార్జున ఆగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఏసీఎల్) యూనిట్. దీనిద్వారా బయో పెస్టిసైడ్స్, సింధటిక్ ఆర్గానిక్ కెమికల్స్, ఫ్లోరైన్ ఆధారిత కెమికల్స్ ఉత్పత్తి. రూ.200 కోట్లతో 200 మందికి ఉపాధి. 6. రవళి స్పినర్స్ తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో రూ.150 కోట్లతో ఏర్పాటు కానున్న రవళి స్పిన్సర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్‌ఎస్‌పీఎల్) యూనిట్. దీని ద్వారా సుమారు 1,000 మందికి ఉపాధి. 7.యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లెలో రూ.125 కోట్లతో ఏర్పాటు కానున్న యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటోమోటివ్ ప్లాస్టిక్స్ ప్రైవేట్ లిమిడెట్ యూనిట్. దీని ద్వారా 750 మంది స్ధానికులకు ఉపాధి. ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఇవీ ప్రాజెక్టులు.. 1.డీపీ చాక్లెట్స్ తిరుపతి జిల్లా వరదాయిపాలెం మండలం కంచర్లపాలెంలో డీపీ చాక్లెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన కోకో బటర్, కోకో పౌడర్ ఉత్పత్తుల తయారీ యూనిట్ ప్రారంభం. రూ.325 కోట్ల పెట్టుబడితో 250 మందికి ఉద్యోగావకాశాలు. ఏటా 40 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి. ఈ యూనిట్ ద్వారా దాదాపు 18వేల మంది రైతులకు లబ్ధి. 2. పులివెందుల అరటి ప్రాసెసింగ్ క్లస్టర్ వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం బ్రాహ్మణపల్లిలో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్లో ఉత్పత్తి ప్రారంభం. రూ.4 కోట్ల పెట్టుబడితో నెలకొల్పిన ఈ క్లస్టర్ ద్వారా బనానా పౌడర్, స్టెమ్ జ్యూస్, హానీ డిప్ప్‌డ్ బనానా, కప్స్, ప్లేట్ల తయారీ. 700 మంది రైతులకు ఈ క్లస్టర్‌తో ప్రయోజనం చేకూరుతుంది. 3. ఓరిల్ ఫుడ్స్ విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం మద్ది గ్రామంలో ఓరిల్ పుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇన్స్టెంట్ వెజిటబుల్ చట్నీస్ తయారీ యూనిట్‌కు శంకుస్ధాపన చేసిన సీఎం జగన్. రూ.50 కోట్ల పెట్టుబడితో 175 మందికి ఉద్యోగ అవకాశాల కల్పన. ఏటా 7,500 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 1,000 మంది రైతులకు ప్రయోజనం. 4. నేటివ్ అరకు కాఫీ అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కొడవటిపూడిలో అరకు కాఫీ తయారీ యూనిట్‌కు వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్ధాపన. రూ.20 కోట్ల పెట్టుబడితో నెలకొల్పే ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉద్యోగావకాశాలు. ఏడాదికి 12 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు 1,000 మంది గిరిజన రైతులకు ప్రయోజనం కలగనుంది. 5. మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా 13 చోట్ల రూ.65 కోట్ల వ్యయంతో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు వర్చువల్‌గా సీఎం జగన్ శంకుస్థాపన. పాలకొండ, పార్వతీపురం, చింతపల్లి, భీమిలి, రాజానగరం, రంపచోడవరం, సూళ్లూరుపేట, పీలేరు, జమ్మలమడుగు (రెండు చోట్ల), ఆదోని, నంద్యాల, కదిరిలలో ఈ యూనిట్ల ఏర్పాటు. 6. అయ్యవరంలో ‘3 ఎఫ్ ఆయిల్స్’ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్న 3 ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సంజయ్ గోయెంకా, ఏపీఎఫ్‌పీఎస్ సీఈవో శ్రీధర్‌రెడ్డి. రూ.250 కోట్లతో 50 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గంటకు 60 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ యూనిట్ ద్వారా 25 వేల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు మేలు జరగనుంది. -
‘పవర్’ ఫుల్
► రూ.10,350 కోట్ల పెట్టుబడి, 2,300 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్కో కంపెనీ నిర్మించే సౌర విద్యుత్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన. దీనిద్వారా 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ► 1,014 మెగావాట్లతో ఆర్సిలర్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ నిర్మించే ప్రాజెక్టుకు శంకుస్ధాపన. ఇందులో 700 మెగావాట్లు సోలార్ పవర్ కాగా 314 మెగావాట్లు విండ్ పవర్ ఉత్పత్తి. రూ.4,500 కోట్ల పెట్టుబడితో 1,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ► ఎకోరన్ ఎనర్జీ 2 వేల మెగావాట్ల (1,000 మె.వా. సోలార్, 1,000 మె.వా. విండ్ పవర్) సామర్ధ్యంతో నిర్మించనున్న ప్రాజెక్టుకు శంకుస్ధాపన. దాదాపు రూ.11 వేల కోట్ల పెట్టుబడితో 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు.. ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం ► 2 వేల మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు సంబంధించి ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం. రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో యాగంటి, కమలపాడులో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టుల వల్ల 2 వేల మందికి ఉద్యోగాల కల్పన. ► వీటితో పాటు ఎన్‌హెచ్‌పీసీతో మరో మూడు ప్రాజెక్టుల ఫీజిబిలిటీపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం. మరో 2,750 మెగావాట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టులపై కలసి పని చేసేలా అడుగులు. రాష్ట్రానికి.. రైతులకు.. యువతకు మేలు ఈ ప్రాజెక్టుల ఏర్పాటుతో మనకు జరిగే మేలును ఒక్కసారి పరిశీలిస్తే.. రాబోయే రోజుల్లో మన యువతకు స్ధానికంగా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా అందుబాటులోకి వస్తున్న ప్రతి మెగావాట్‌కు మరో వందేళ్ల పాటు అంటే ఈ ప్రాజెక్టు లైఫ్ ఉన్నంత కాలం మెగావాట్‌కు రూ.లక్ష చొప్పున రాయల్టీగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీంతో పాటు ఈ ప్రాజెక్టుల వల్ల జీఎస్టీ ఆదాయం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టులకు తమ భూములిస్తూ సహకరిస్తున్న రైతన్నలకు కూడా ఈ కంపెనీల నుంచి లీజు రూపంలో ఏటా ఎకరాకు రూ.30 వేలు చొప్పున ఆదాయం వస్తుంది. ఇందుకు ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది. అంటే రైతులు ఎవరైనా భూములివ్వాలనుకుంటే ప్రతి రైతుకు, ప్రతి ఎకరానికి, ఏడాదికి రూ.30 వేలు లీజు రూపంలో ఇస్తారు. ప్రతి రెండేళ్లకు 5 శాతం లీజు రుసుము కూడా పెరుగుతుంది. దశాబ్దాలుగా నీళ్లకు కటకటలాడిన దుర్భిక్ష ప్రాంతం రాయలసీమ రైతన్నలకు ఈ ప్రాజెక్టులతో మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇవి పర్యావరణానికి మేలు చేస్తాయి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర ఇంధన రంగానికి భద్రత చేకూరేలా మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుడుతూ చరిత్రాత్మక ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఒప్పందాలను శరవేగంగా కార్యాచరణలోకి తెస్తూ నంద్యాల జిల్లాలో రూ.25,850 కోట్ల విలువైన మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం వర్చువల్ విధానంలో భూమి పూజ నిర్వహించారు. మరో రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల (పీఎస్పీ) ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో), కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) మధ్య ఒప్పందం కుదిరింది. ఈమేరకు సీఎం జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఏపీ జెన్కో ఎండీ చక్రధరబాబు, ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ గోయల్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ రంగంలో అపార పెట్టుబడుల అవకాశాలపై సీఎం జగన్ శ్వేతపత్రాన్ని విడుదల చేసి మాట్లాడారు. భవిష్యత్తు గ్రీన్ ఎనర్జీదే ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ మనతో పాటు ఉన్న బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారత్, గ్రీన్కో, ఆర్సెలర్ మిట్టల్, ఎకోరన్ గ్రూపు యాజమాన్యాలకు, కంపెనీల ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకునేందుకు ఇక్కడకు వచ్చిన ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ గోయల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రజత్‌కు ధన్యవాదాలు. ఇవాళ మూడు ప్రాజెక్టులకు శంకుస్ధాపన నిర్వహిస్తున్నాం. నాలుగో కార్యక్రమం కింద ఎన్‌హెచ్‌పీసీతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంటున్నాం. మొదటి ప్రాజెక్టు గ్రీన్కో.. 2,300 మెగావాట్ల సౌర విద్యుత్తుకు సంబంధించి రూ.10,350 కోట్ల పెట్టుబడితో 2,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగిస్తున్న ప్రాజెక్టు ఇది. ఇక పంప్డ్ స్టోరేజ్ అన్నది ఆర్టిఫీషియల్ బ్యాటరీ లాంటిది. పీక్ అవర్స్‌లో పవర్ జనరేట్ చేస్తాం. నాన్ పీక్ అవర్స్‌లో మళ్లీ నీళ్లని వెనక్కి పంప్ చేసి ఆ తరువాత, పీక్ అవర్స్‌లో పవర్‌ని జనరేట్ చేసేందుకు ఆర్టిఫీషియల్ బ్యాటరీ మాదిరిగా ఏర్పాట్లు ఉంటాయి. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు భవిష్యత్తులో పూర్తిగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తయ్యేలా దోహదం చేస్తాయి. దీనివల్ల బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల మీద ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది. పర్యావరణానికి మంచి జరగాలంటే రాబోయే రోజుల్లో పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సోలార్ ప్రాజెక్టులు, విండ్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులతో మనం అనుసంధానమవుతున్న తీరు గ్రీన్ ఎనర్జీలో పెను మార్పులకు దారి తీస్తాయి. పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి. అదే సమయంలో విద్యుదుత్పత్తికి తోడ్పాటునివ్వడం ద్వారా గ్రీన్ ఎనర్జీలో ఒక విప్లవాత్మక మార్పు వస్తుంది. మరో 30 ఏళ్లు ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా.. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 8,998 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేస్తున్నాం. రైతులకు దీర్ఘకాలం పగటి పూటే నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగించేందుకు 16 వేల మిలియన్ యూనిట్లు అంటే దాదాపు 7,200 మెగావాట్లకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో యూనిట్ రూ.2.49కే అందేలా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. తద్వారా మరో 25 నుంచి 30 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి పవర్ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులకు లోనుకాకుండా, ఒత్తిడి లేకుండా రైతులకు ఉచితంగా విద్యుత్ అందించే వెసులుబాటు లభిస్తుంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో రూ.2.49కే మరో 25 – 30 ఏళ్ల పాటు ఉచిత కరెంటుకు ఢోకా లేకుండా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది గొప్ప అడుగు. 41 వేల మెగావాట్లు.. 37 ప్రాంతాలు ఒకవైపు ఇవన్నీ చేస్తూనే మరోవైపు పంప్డ్ స్టోరేజీని ప్రోత్సహించడంలో భాగంగా దాదాపు 41 వేల మెగావాట్లకు సంబంధించి 37 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించాం. ఇందులో 33,240 మెగావాట్లకు సంబంధించి 29 చోట్ల ప్రాజెక్టు ఫీజిబులిటీ పరిశీలన జరుగుతోంది. 20,900 మెగావాట్ల కెపాసిటీకి సంబంధించిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు కూడా పూర్తయ్యాయి. వీటిలో 16,180 మెగావాట్ల కెపాసిటీతో ఉత్పత్తి చేసేందుకు వివిధ కంపెనీలకు అలాట్మెంట్లు కూడా పూర్తయ్యాయి. ఇందులో భాగంగానే ఇవాళ ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం చేసుకుంటున్నాం. దీనిలో యాగంటిలో 1,000 మెగావాట్ల ప్రాజెక్టు, కమలపాడులో మరో 950 మెగావాట్లు కలిపి మొత్తంగా దాదాపు 2 వేల మెగావాట్ల ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌పీసీతో కలిసి నిర్మించనుంది. దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులకు ఫీజిబులిటీ స్డడీస్ పూర్తయ్యాయి. ఎన్‌హెచ్‌పీసీ, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం వాటాతో ప్రాజెక్టును అభివృద్ధిలా ఇవాళ ఎంవోఓయూ కుదుర్చుకున్నాం. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ, ఎండీ ఎస్.రమణారెడ్డి, బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్, డిప్యూటీ హెడ్ మిషన్ యూకే గవర్నమెంట్ వరుణ్ మాలి, యూకే గవర్నమెంట్ సీనియర్ అడ్వైజర్ నిషాంత్‌కుమార్ సింగ్, ఎన్‌హెచ్‌పీసీ ఫైనాన్స్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ గోయల్, గ్రీన్కో వైస్ ప్రెసిడెంట్ ఎన్.శేషగిరిరావు, ఏఎం గ్రీన్ ఎనర్జీ బిజినెస్ హెడ్ సమీర్ మాథుర్, ఎకోరన్ గ్రీన్ ఎనర్జీ సీఎండీ వై.లక్ష్మీ ప్రసాద్, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మరో మూడు చోట్ల కూడా...! ఎన్‌హెచ్‌పీసీతో కలసి ఇంకా వేగంగా అడుగులు ముందుకువేసే కార్యక్రమంలో భాగంగా మరో 2,750 మెగావాట్లకు సంబంధించి 3 ప్రాంతాలలో ఫీజుబులిటీ స్డడీస్ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆ ప్రాజెక్టులను కూడా ఎన్‌హెచ్‌పీసీతో కలిసి సంయుక్తంగా చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున సామర్ధ్యాన్ని పెంచుకుంటూనే మిగిలిన ప్రైవేట్ డెవలపర్స్‌కి కూడా అందుబాటులోకి తెచ్చి తద్వారా రాష్ట్రంతో పాటు దేశానికి కూడా మంచి చేసే కార్యక్రమాలు చేస్తున్నాం. వీటన్నింటితో రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలవనుంది. ప్రపంచాన్ని శాసించే ఎనర్జీ దేవుడు గొప్పవాడు.. అందుకే మానవాళికి ఇంత చక్కటి వనరులను సృష్టించాడు. ఎండ బాగున్నప్పుడు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సోలార్ పవర్‌ని ఉత్ప త్తి చేస్తే సాయంత్రం 6 నుంచి ఉదయం వర కు విండ్ పవర్ ఉత్పత్తి అవుతుంది. పీక్ అ వర్స్‌లో నీళ్లతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను వాడుకోవచ్చు. ïపీక్ అవర్స్‌లో అవి ఆర్టిఫీషియల్ బ్యాటరీలా పనిచేస్తాయి. దీంతో ïపీక్ అవర్స్‌లో విద్యుదుత్పత్తి సాధ్యమవుతుంది. ఫలితంగా శిలాజ ఇంధనాల నుంచి బయటపడి పర్యావరణ హితమైన గ్రీన్ ఎనర్జీ లభిస్తుంది. ఇది ప్రపంచాన్ని శాసించ బోయే ఎన ర్జీగా నిలుస్తుంది. అందులో ఏపీ తొలిస్థానంలో నిలిచేలా అడుగులు పడుతున్నాయి. -
పర్యాటకానికి మహర్దశ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను చేపట్టింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని ప్రాంతాల్లో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసే విధంగా నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం వెళుతోంది. ఇందులో భాగంగా రూ.3,016 కోట్ల విలువైన 13 పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పట్టాలెక్కించడానికి వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో కుదిరిన ఒప్పందాలను వేగంగా వాస్తవరూపంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఈ 13 ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని రెండునెలల్లో మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 13 ప్రాజెక్టుల్లో 11 స్టార్ హోటళ్ల నిర్మాణానివి కాగా రెండు పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వే నిర్మాణానికి సంబంధించినవి. ఈ 13 ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 17,032 మందికి ఉపాధి లభించనుంది. అంతర్జాతీయ సంస్థలైన ఒబరాయ్, నోవోటెల్, హయత్, హిల్టన్, మారియట్, మై ఫెయిర్, లెమన్ ట్రీ.. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. ఒబరాయ్ గ్రూపు కడప గండికోట వద్ద భారీ ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణంతోపాటు తిరుపతి విశాఖల్లో కూడా హోటళ్లు నిర్మించనుంది. అలాగే దేవభూమి రోప్‌వేస్ సంస్థ కృష్ణా, నంద్యాల జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టనుంది. రాష్ట్ర పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయని, అందులో తొలుత 13 ప్రాజెక్టులపై దృష్టిసారించామని ఏపీ టూరిజం అథారిటీ ఎండీ కె.కన్నబాబు చెప్పారు. ఈ 13 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు పూర్తయ్యాయని, ఒకసారి ఎస్ఐపీబీ, మంత్రివర్గ ఆమోదం లభించిన వెంటనే సీఎం చేతుల మీదుగా నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక భారీ ప్రాజెక్టులను చేపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విశాఖ, గండికోట ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
మరో 4 అడుగులు.. విశాఖ జీఐఎస్ ఒప్పందాల కార్యరూపం శరవేగంగా ..
సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాల మేరకు మూడు జిల్లాల్లో రూ.1,425 కోట్ల విలువైన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో ప్రాజెక్టులో ఉత్పత్తిని వర్చువల్‌గా ప్రారంభించారు. క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమల శిలాఫలకాలను సీఎం జగన్ వర్చువల్‌గా ఆవిష్కరించి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో ఏర్పాటైన గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థ విస్తరించిన యూనిట్లో వాణిజ్య కార్యకలాపాలను సీఎం ప్రారంభించారు. ఈ రోజు మూడు జిల్లాల్లో నాలుగు యూనిట్లకు సంబంధించి గొప్ప కార్యక్రమం జరుగుతోందని, వీటివల్ల 2,400 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం పేర్కొన్నారు. శంకుస్థాపన చేసిన మూడు ప్లాంట్లు త్వరలో నిర్మాణ కార్యకలాపాలను పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తాయన్నారు. ‘ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఒక్క ఫోన్ కాల్ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని పారిశ్రామికవేత్తలకు సూచించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, వ్యవసాయం, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమలశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి, ఏపీ పుడ్ ప్రాసెసింగ్ సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి, పలువురు పారిశ్రామిక వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. 12 నెలల్లో క్రిబ్కో ఇథనాల్ ప్లాంట్ నెల్లూరు జిల్లాలో క్రిబ్కో ఆధ్వర్యంలో దాదాపు రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ తయారీ ప్లాంట్ ఏర్పాటవుతోంది. 12 నెలలలోపే ఈ కర్మాగార నిర్మాణం పూర్తవుతుంది. రోజుకు 500 కిలోలీటర్ల ప్రొడక్షన్ కెపాసిటీతో ఇక్కడ బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటవుతోంది. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్లాంట్ ద్వారా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నెల్లూరు జిల్లాలో స్ధానికంగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. కృష్ణపట్నం వద్ద ఈ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన క్రిబ్కో యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏడాదిన్నరలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ ఇదే నెల్లూరు జిల్లాలోనే విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ కూడా వస్తోంది. రోజుకు 200 కిలోలీటర్ల కెపాసిటీతో నెలకొల్పుతున్న బయో ఇథనాల్ ప్లాంట్ వల్ల 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయి. రూ.315 కోట్లతో నెలకొల్పుతున్న ఈ ప్లాంట్ 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. మన యువతకు ఈ ప్లాంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు లభించనుండటం ఆనందదాయకం. ప్లాంట్ డైరెక్టర్ జితేంద్రతో పాటు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు. కాంటినెంటిల్ కాఫీ ఫ్యాక్టరీ తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్ కాఫీ ఫ్యాక్టరీని స్థాపిస్తోంది. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏటా 16 వేల టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని నెలకొల్పుతోంది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్లాంట్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందలు తెలియజేస్తున్నా. 9 నెలల్లోనే మొదలైన గోద్రెజ్ ఆగ్రోవెట్ యూనిట్ ఏలూరు జిల్లాలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థ రూ.వంద కోట్ల పెట్టుబడి, 400 టన్నుల సామర్ధ్యంతో ఎడిబుల్ ఆయిల్ (వంట నూనె) రిఫైనరీ ప్రాజెక్టును విస్తరిస్తోంది. ప్లాంట్ ఏర్పాటుకు మన దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చిన 9 నెలల్లోనే యూనిట్ ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయం. ఇందుకు సహకరించిన ప్రతి అధికారికి అభినందనలు. ఈ యూనిట్ వల్ల ఏలూరు జిల్లా యువకులకు మరో 500 ఉద్యోగ అవకాశాలు లభించడం శుభపరిణామం. కంపెనీ యాజమాన్యానికి అభినందనలు. సర్వేపల్లిలో ‘క్రిబ్కో’ గ్రీన్ ఎనర్జీ నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ బయో ఇథనాల్ తయారీని చేపడుతోంది. ఉప ఉత్పత్తిగా ఏడాదికి 64 వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్, 4 వేల టన్నుల డ్రైడ్ డిస్టిలరీ గ్రెయిన్స్ తయారవుతాయి. బియ్యం, మొక్కజొన్నతో ‘విశ్వసముద్ర బయో ఎనర్జీ’ నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో విశ్వసముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్ ఇథనాల్ తయారీ కర్మాగారాన్ని స్థాపిస్తోంది. విరిగిన బియ్యం, రంగు మారిన బియ్యం, పాడైపోయిన బియ్యం నుంచి రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ తయారీ చేయనున్నారు. వరి సాగు చేసే రైతులకు ఇది ఎంతో ఉపయోగకరం. మొక్కజొన్నను వినియోగించుకుని రోజుకు మరో 160 కిలోలీటర్ల డిస్టిలరీతోపాటు బై ప్రొడక్ట్‌గా డ్రైడ్ డిస్టిలరీస్ గ్రెయిన్స్ తయారు కానున్నాయి. కాంటినెంటిల్ ఇన్స్టెంట్ కాఫీ తిరుపతి జిల్లా వరదాయిపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ పుడ్ బెవెరేజెస్ కంపెనీ ఏర్పాటు కానుంది. ఏటా 16 వేల టన్నుల సొల్యుబుల్ ఇన్స్టెంట్ కాఫీ ఈ ప్లాంట్‌లో తయారవుతుంది. యూనిట్ విస్తరించిన ‘గోద్రెజ్ ఆగ్రోవెట్’ ఏలూరు జిల్లా చింతలపూడిలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీ రోజుకు 400 టన్నుల వంట నూనె తయారీ సామర్థ్యంతో విస్తరించిన యూనిట్, 200 టన్నుల సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్‌ను ప్రారంభించింది. -
రూ.లక్ష కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్
సాక్షి, విశాఖపట్నం : తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులను ఎన్టీపీసీ ప్రారంభించేలా చర్యలు తీసుకుంది. సుమారు రూ.లక్ష కోట్లతో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తొలి విడత పనులను 2026కు, మొత్తం 2030నాటికి పూర్తి చేసే దిశగా ఎన్టీపీసీ ప్రణాళికలు సిద్ధంచేసింది. 1,200 ఎకరాల్లో ఏర్పాటు... రాబోయే 20 ఏళ్లలో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరులను క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఏపీ సిద్ధమవుతోంది. ఈ స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తీసుకురావడం ద్వారా భూతాపం, కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇందులో భాగంగా దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ అయిన ఎన్టీపీసీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. హైడ్రోజన్, ఎనర్జీ స్టోరేజ్ పరిష్కృత ప్రాజెక్టు ఏర్పాటుపై జరిగిన ఒప్పందంలో భాగంగా పూడిమడక వద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు తొలి విడత పనులను ఇటీవల ఎన్టీపీసీ ప్రారంభించింది. తొలి విడతలో 1,500 టన్నుల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ హబ్‌లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా సంబంధిత ఎక్వీప్మెంట్ ఉత్పత్తి, ఎగుమతులకు అవసరమైన మాన్యుఫ్యాక్చరింగ్ సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఏపీఐఐసీ 1,200 ఎకరాలను ఎన్టీపీసీకి కేటాయించింది. ఈ భూమిని చదును చేసే ప్రక్రియ మొదలైంది. మొదటి విడత ప్రాజెక్టు ప్రక్రియ పనులకు అవసరమైన మేర స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు ఎన్టీపీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 9,000 ఎండబ్ల్యూహెచ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్లు వారంలో ఖరారు ఇప్పటికే ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు ఫేజ్–1 పనులు ప్రారంభించిన ఎన్టీపీసీ... 9,000 మెగావాట్‌హవర్ (ఎండబ్ల్యూహెచ్) స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్లని ఈ వారంలో ఖరారు చేయనుంది. మొదటి విడత పనులను 2026 నాటికి పూర్తి చేయనుంది. సుమారు రూ.లక్ష కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు మొత్తం పనులను 2030నాటికి పూర్తి చేసి దేశానికి అంకితమిచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎన్టీపీసీ డైరెక్టర్(ఫైనాన్స్) శ్రీనివాసన్ తెలిపారు. ప్రీ ఇంజినీరింగ్ బిల్డింగ్స్, షెడ్లను నిర్మించి వీలైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్పత్తి పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. సోలార్ రూఫ్‌టాప్‌లు, ఎలక్ట్రోలైజర్స్, ఫ్యూయల్ సెల్స్, బ్యాటరీలు, సోలార్ వేపర్స్, సోలార్ మాడ్యూల్స్, విండ్ టర్బైన్ ఎక్విప్మెంట్, కార్బన్ క్యాప్చర్ సిస్టమ్స్ తదితర కొత్త టెక్నాలజీకి సంబంధించిన ఉత్పత్తులు ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లో తయారు కానున్నాయి. దక్షిణాసియా దేశాల మార్కెట్ కోసం రోజుకు 1,300 టన్నుల గ్రీన్ అమ్మోనియా, 1,200 టన్నుల గ్రీన్ ఇథనాల్ సహా గ్రీన్ హైడ్రోజన్, ఇతర ఉత్పత్తులు ఎగుమతి చేసే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు ద్వారా 2030 నాటికి 13.4 గిగావాట్ల సోలార్, 20 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం, నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు ఎన్టీపీసీ ప్రకటించింది. -
ఎంఎస్ఎంఈలపై త్రిముఖ సూత్రం
సాక్షి, అమరావతి: అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తూ పారిశ్రామిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ఎగుమతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వివిధ దేశాలకు ఎగుమతులు చేసే విధంగా డిమాండ్, టెక్నాలజీ, మార్కెటింగ్ లాంటి మూడు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టి ప్రభుత్వం మార్గదర్శనం చేయాలని సూచించారు. ఎంఎస్ఎంఈలు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు కేవలం స్థానిక మార్కెట్లపైనే ఆధారపడకుండా ఎంఎన్‌సీలతో (బహుళ జాతి కంపెనీలు) అనుసంధానిస్తే మెరుగైన మార్కెటింగ్ ఫలితాలు ఉంటాయని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై సీఎం జగన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రంగాల వారీగా సమీక్షించారు. ఎంఎస్ఎంఈలను మరింత ప్రోత్సహించేలా పరిశ్రమల శాఖలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి కార్యదర్శిని నియమించాలని ఆదేశించారు. డిగ్రీలకు తోడు నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా పరిశ్రమలకు నిపుణులైన మానవ వనరులను అందుబాటులోకి తేవాలన్నారు. రూ.3,39,959 కోట్ల పెట్టుబడులకు ఆమోదం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది దఫాలు ఎస్ఐపీబీ సమావేశాలను నిర్వహించిం 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలిపారు. వీటిద్వారా రూ.3,39,959 కోట్ల పెట్టుబడులు రానుండగా 2,34,378 మందికి ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు చేసుకోగా ఇప్పటికే రూ.2,739 కోట్ల విలువైన 13 ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చినట్లు తెలిపారు. వీటిద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పనులు మొదలు కానున్నాయి. 2024 జనవరిలోపు 38 కంపెనీలు, మార్చి లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో భాగస్వామ్య సదస్సుల్లో 1,739 ఎంవోయూల ద్వారా రూ. 18,87,058 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోగా 10 శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదన్నారు. విశాఖ ఖ్యాతిని పెంచేలా ఐటీ హబ్ ఐటీ, ఐటీ ఆధారిత సేవలకు విశాఖను హబ్‌గా తీర్చిదిద్దేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రముఖ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలన్నారు. దీనివల్ల విశాఖ నగర ఖ్యాతి పెరిగి ఐటీకి చిరునామాగా మారుతుందన్నారు. గత గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఐటీ, ఐటీ ఆధారిత, ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.44,963 కోట్ల విలువైన 88 ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇప్పటికే 85 శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడం / ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జీఐఎస్‌లో కుదిరిన పెట్టుబడుల్లో ఇప్పటికే రూ.38,573 కోట్లు వాస్తవ రూపం దాల్చినట్లు తెలిపారు. రూ.8.85 లక్షల కోట్ల విద్యుత్ ప్రాజెక్టులు విశాఖ సదస్సు ద్వారా 25 విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకోగా 8 ఎస్ఐపీబీ ఆమోదం కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. మరో నాలుగు ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభం కానుండగా మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. విశాఖ సదస్సు కంటే ముందు 20 విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలు కుదరగా 6 ప్రాజెక్టుల్లో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మరో 11 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధమైనట్లు అధికారులు పేర్కొన్నారు. వీటి ద్వారా రూ.8.85 లక్షల కోట్ల పెట్టుబడులతో 1,29,650 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడుల ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తెచ్చేలా కృషి చేయాలని సీఎం ఆదేశించారు. డిమాండ్‌లో తరచూ తీవ్ర వ్యత్యాసం ఉండే టమాటా, ఉల్లి లాంటి పంటల విషయంలో ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పే పనులను వేగవంతం చేయాలన్నారు. నాలుగేళ్లలో వృద్ధి బాగుంది – స్థిర ధరల సూచీ ప్రకారం 2019లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి 5.36 శాతం. ఇది దేశ సగటు 6.5 శాతం కన్నా తక్కువ – గత నాలుగేళ్లలో మాత్రం రాష్ట్రం మంచి ప్రగతి సాధించింది ట – 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 11.43 శాతానికి పెరిగింది – 2022–23లో జీఎస్డీపీలో గ్రోత్ రేట్ 16.22 శాతంగా ఉంది. – ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్న ఏపీ – జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం వాటా దాదాపు రూ.13 లక్షల కోట్లు. పారిశ్రామికరంగం వాటా 21 నుంచి 23 శాతానికి పెరుగుదల. – 2022 జనవరి – డిసెంబరు మధ్య రాష్ట్రానికి రూ.45,217 కోట్ల పెట్టుబడుల రాక. – 2022–23లో రాష్ట్రం నుంచి రూ.1.6 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతి. – 2021–22లో ఎగుమతుల విలువ రూ.1.43 లక్షల కోట్లు కాగా గత ఆర్థిక సంవత్సరంలో రూ. రూ.1.6 లక్షల కోట్లకు పెరుగుదల. -
పారిశ్రామిక రంగ ప్రగతిలో ఎంఎస్ఎంఈలది కీలక పాత్ర: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా నంబర్ ఒన్ స్థానంలో నిలుస్తున్నామని అధికారులు వెల్లడించగా, జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13లక్షల కోట్ల వాటా కలిగి ఉందని, పారిశ్రామికరంగం వాటా 21శాతం నుంచి 23శాతానికి పెరిగిందని స్పష్టం చేశారు. 2022 జనవరి – డిసెంబరు మధ్యకాలంలో రూ.45,217 పెట్టుబడులు వచ్చాయని వెల్లడించిన అధికారులు.. 2022-23లో రూ.1.6లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యాయని తెలిపారు.ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కొన్ని సూచనలు చేశారు. సీఎం వైఎస్ జగన్ కామెంట్స్ ►పారిశ్రామిక రంగ ప్రగతిలో MSMEలది కీలక పాత్ర ►ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కూడా ఈ రంగంలోనే ఉన్నాయి ►ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలి ►ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులు ఏంటి? వాటి ఉత్పత్తిని సాధించడానికి MSMEలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం? ఉత్పత్తి అయిన వస్తువులకు అంతర్జాతీయంగా ప్రముఖ బహుళజాతి సంస్థలతో అనుసంధానం? ఈ మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి ► MSMEలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా చూడాలి ►పరిశ్రమల శాఖలో MSMEఎంఎస్‌ఎంఈలకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి ►ఈ విభాగానికి ఒక కార్యదర్శిని కూడా నియమించాలి ►రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు లక్ష్యంగా ముందుకు సాగాలి ఈ సమీక్షా సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవెన్, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ ప్రవీణ్ కుమార్, టూరిజం సీఈవో కన్నబాబు, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఎన్ఆర్ఈడీసీఏపీ వీసీ అండ్ ఎండీ ఎస్.రమణా రెడ్డి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్ర కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ఒడిశా రైలు ప్రమాదం: బాధితులకు ఏపీ ప్రభుత్వ భరోసా -
Andhra Pradesh: పారిశ్రామిక దూకుడు!
సాక్షి, అమరావతి: పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రం వేగంగా దూసుకెళుతోంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు పారిశ్రామిక కారిడార్లతోపాటు 974 కి.మీ సుదీర్ఘ తీర ప్రాంతాన్ని కలిగి ఉండటం లాంటి అనుకూలతలను అందిపుచ్చుకుంటూ పురోగమిస్తోంది. విద్యుత్, నీరు, రోడ్లు, లాజిస్టిక్స్‌తో పాటు వివాద రహితంగా అభివృద్ధి చేసిన భూములను సమకూర్చడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయి. పారిశ్రామిక రాయితీలతోపాటు మౌలిక వసతులపై అధికంగా దృష్టిసారించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన సీఎం జగన్ కోవిడ్ సంక్షోభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చర్యలు తీసుకున్నారు. రాష్ట్రం గుండా వెళ్తున్న మూడు పారిశ్రామిక కారిడార్లు విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లలో రూ.11,753 కోట్లతో ఆరు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు రూ.18,897 కోట్లతో నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని కోవిడ్ సమయంలో ఏకకాలంలో చేపట్టారు. అంతేకాకుండా విశాఖ, అనంతపురంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద మరో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల కోసం ప్రతిపాదనలు పంపారు. మరోవైపు కాకినాడ వద్ద రూ.1,000 కోట్లతో బల్క్‌డ్రగ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వీటివల్ల అభివృద్ధి చేసిన 50,000 ఎకరాలు అందుబాటులోకి రావడంతో పాటు రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల ఉత్పత్తి వ్యయం 80 శాతం వరకు తగ్గనుంది. తద్వారా అంతర్జాతీయ కంపెనీలతో పోటీపడే స్థాయికి ఎదగనున్నట్లు పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పారిశ్రామిక మౌలిక వసతుల కోసం ఈ స్థాయిలో వ్యయం చేస్తున్న రాష్ట్రం దేశంలో మరెక్కడా లేదని పేర్కొంటున్నాయి. కోవిడ్లోనే కొప్పర్తి నోడ్ రెడీ ఒకపక్క కోవిడ్ సంక్షోభం వెంటాడుతున్నా విశాఖ–చెన్నై కారిడార్ పరిధిలోని కొప్పర్తి నోడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అందుబాటులోకి తెచ్చింది. విశాఖ–చెన్నై కారిడార్‌లో భాగంగా కొప్పర్తి వద్ద 6,739 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అభిృవృద్ధి చేస్తోంది. ఇందులో 801 ఎకరాల్లో వైఎస్సార్ ఈఎంసీ, 3,053 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చింది. ఇదే కారిడార్‌లో భాగంగా నక్కపల్లి, రాంబిల్లి, శ్రీకాళహస్తి, కొప్పర్తి నోడ్లను ఏడీబీ, నిక్‌డిక్ట్ నిధులతో అభివృద్ధి చేస్తోంది. ఏడీబీ నిధులతో తొలిదశలో రూ.2,900 కోట్లతో అభివృద్ధి చేయగా రెండోదశలో రూ.1,633 కోట్లతో అభివృద్ధి పనులకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఈనెల 23న ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ ఒక్క కారిడార్ పరిధిలోనే 26,182 ఎకరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక చెన్నై–హైదరాబాద్ కారిడార్ కింద కృష్ణపట్నం వద్ద 11,096 ఎకరాల్లో క్రిస్ సిటీని, హైదరాబాద్ –బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లు వద్ద 9,305 ఎకారాలను అభివృద్ధి చేయనుంది. ఈ పారిశ్రామిక పార్కులకు అవసరమైన నీటి వసతికి సంబంధించిన పనులను కూడా ఏపీఐఐసీ మొదలు పెట్టింది. మరోవైపు ఇప్పటికే కర్నూలు ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తేగా భోగాపురంతోపాటు రామాయపట్నం తెట్టు వద్ద మరో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వానికి భిన్నంగా.. టీడీపీ అధికారంలో ఉండగా తీరప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎన్నికలకు నెలన్నర ముందు ఎలాంటి అనుమతులు లేకుండా చంద్రబాబు కొబ్బరికాయ కొట్టి షూటింగ్ ముగించారు. ఇలాంటి వ్యవహారాలకు తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టుల నిర్మాణానికి అవసరమైన అన్ని కీలక అనుమతులు సాధించడంతోపాటు ఆర్థిక వనరులు (ఫైనాన్షియల్ క్లోజర్) సమకూరిన తర్వాతే పనులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల నిర్మాణం మొదలు కాగా ఈనెల 22వతేదీన మచిలీపట్నం పోర్టు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ఏపీ మారిటైమ్ బోర్డును నెలకొల్పడమే కాకుండా మూడు పోర్టులకు ప్రత్యేక కంపెనీలను ఏర్పాటు చేశారు. 2022 జూలైలో పనులు ప్రారంభించిన రామాయపట్నం శరవేగంగా సాకారమవుతోంది. ఈ ఏడాది చివరినాటికల్లా తొలి ఓడను ఇక్కడకు రప్పించే లక్ష్యంతో ముందుకువెళుతున్నారు. 60,000 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి పోర్టులకు అదనంగా 60,000 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించేలా తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. తొలిదశలో చేపట్టిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లలో పనులు వేగంగా జరుగుతుండటంతో త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. జువ్వలదిన్నె పనులు 86 శాతానికిపైగా పూర్తి కాగా నిజాంపట్నంలో 62 శాతం జరిగాయి. మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనులు 50 శాతం దాటాయి. ప్రైవేట్ రంగంలో నిర్మిస్తున్న కాకినాడ గేట్‌వే పోర్టుతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల కోసం రూ.18,897 కోట్లు వ్యయం చేస్తోంది. ఈ పోర్టులను ఆనుకుని భారీ పారిశ్రామిక నగరాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇందుకోసం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించారు. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మాన వనరులను సమకూర్చడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం 192 స్కిల్ హబ్స్ ఏర్పాటుతోపాటు 26 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో గుర్తింపు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీరప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రముఖ బిజినెస్ దినపత్రిక ‘ఎకనామిక్ టైమ్స్’ దేశీయ ఇన్ఫ్రా రంగంపై ఏటా ప్రకటించే అవార్డుల్లో ఈసారి మనకు చోటు దక్కింది. దేశంలో పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన అత్యున్నత ప్రగతిని గుర్తిస్తూ ఇన్ఫ్రా ఫోకస్ అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక వసతులకు పెద్దపీట వేస్తుండటంతో దిగ్గజ సంస్థలైన అదానీ, అంబానీ, మిట్టల్, బిర్లా, భంగర్, భజాంకా, సంఘ్వీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో 386 ఒప్పందాల ద్వారా రూ.13,11,468 కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే దీనికి నిదర్శనం. గతేడాది చివరి త్రైమాసికంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో ఉన్నట్లు ప్రాజెక్టŠస్ టుడే సర్వే వెల్లడించింది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా.. పోర్టులు, పారిశ్రామిక పార్కుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. సహజ వనరులను వినియోగించుకుంటూ మూడు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. రామాయపట్నం పోర్టుతో ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, మచిలీపట్నంతో కృష్ణా, ఎన్టీఆర్, మూలపేటతో శ్రీకాకుళం జిల్లాలు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మూడు పారిశ్రామిక కారిడార్ల ద్వారా 50,000 ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తున్నాం. అన్ని అనుమతులు, ఆర్థిక వనరులు సమకూరిన తర్వాతే సీఎం జగన్ పనులు ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన మరుసటి రోజునుంచే పనులు నిర్విఘ్నంగా కొనసాగాలన్నది సీఎం ఆకాంక్ష. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి వ్యయం తగ్గించడమే లక్ష్యం పరిశ్రమల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధానంగా దృష్టి సారించారు. లాజిస్టిక్ వ్యయం తగ్గించడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించి అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడేవిధంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నాం. యూరోప్‌లోని రోస్టర్ డ్యామ్, జపాన్‌లోని యకహోమా తరహాలో పోర్టు నగరాలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. కొత్తగా నిర్మిస్తున్న నాలుగు పోర్టుల వద్ద పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు ఇన్లాండ్ వాటర్‌వేస్, గ్యాస్, రోడ్లు, రైల్వే, విద్యుత్, నీటి సరఫరా లాంటి మౌలిక వసతులు కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వీటివల్ల ఉత్పత్తి వ్యయం 80 శాతం వరకు తగ్గుతుంది. తద్వారా పెట్టుబడులను ఆకర్షించవచ్చు. – కరికల్ వలవన్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంవోయూల కంటే ఎక్కువగా మూడు పారిశ్రామిక కారిడార్లలో అన్ని మౌలిక వసతులతో పారిశ్రామిక పార్కులను ఏడీబీ, నికిడిక్ట్ నిధులతో అభివృద్ధి చేయడంతో పాటు నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను ఏకకాలంలో నిర్మిస్తున్నాం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెంది రాష్ట్ర జీడీపీ పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఫిషింగ్ హార్బర్లు, పోర్టుల వద్దే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తున్నాం. ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకున్న రూ.13.11 లక్షల కోట్ల కంటే ఎక్కువగా పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నాం. – ప్రవీణ్‌కుమార్, వీసీఎండీ ఏపీఐఐసీ, సీఈవో ఏపీ మారిటైమ్ బోర్డు. -
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ 1 ..గుజరాత్‌ను అధిగమించి సత్తా
సాక్షి, అమరావతి: దేశంలోనే అత్యధికంగా పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 2022–23లో 306 ప్రాజెక్టులకు సంబంధించి రూ.7,65,030 కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలతో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రాజెక్ట్స్ టుడే తాజా సర్వే వెల్లడించింది. అంతకుముందు ఏడాది ప్రథమ స్థానంలో ఉన్న గుజరాత్‌ను అధిగమించి ఏపీ నంబర్ వన్‌గా నిలిచింది. 2022–23లో టాప్ పది రాష్ట్రాల్లో 7,376 ప్రాజెక్టులకు సంబంధించి రూ.32,85,846 కోట్ల విలువైన ఒప్పందాలు కుదరగా ఏపీ నుంచే 23 శాతానికి పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరగడం విశేషం. ఏపీ ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిల్లో 57 భారీ ప్రాజెక్టుల విలువ రూ.7,28,667.82 కోట్లుగా ఉంది. ఇందులో ఏడు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు సంబంధించినవి కాగా మరో 18 హైడల్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. నైపుణ్యాభివృద్ధి, లాజిస్టిక్స్‌కు డిమాండ్.. గుజరాత్ రూ.4,44,420 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలను సాధించడం ద్వారా రెండో స్థానంలో నిలిచింది. సెమీ కండక్టర్ల తయారీకి సంబంధించి గుజరాత్ మూడు భారీ ప్రాజెక్టులను ఆకర్షించింది. కర్ణాటక రూ.4,32,704 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ రూ.1,58,482 కోట్ల విలువైన 487 ప్రాజెక్టులతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా తర్వాత స్థానాల్లో కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాలున్నాయి. కోవిడ్ సంక్షోభం ముగిసిన తరువాత దేశంలో ప్రైవేట్ పెట్టుబడులు బాగా పెరిగినట్లు సర్వే పేర్కొంది. 2022–23లో మొత్తం రూ.36.99 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఇందులో ప్రైవేట్ రంగ పెట్టుబడుల విలువ రూ.25,31,800 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు రూ.5,62,083 కోట్లు, రాష్ట్రాల పెట్టుబడులు రూ.6,05,790 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా పెద్దఎత్తున పెట్టుబడులు కుదిరే అవకాశం ఉంది. నైపుణ్యాభివృద్ధి, లాజిస్టిక్స్ రంగాలపై దృష్టిసారించిన రాష్ట్రాలు ప్రైవేట్ పెట్టుబడులను అధికంగా ఆకర్షించనున్నట్లు సర్వే పేర్కొంది. విశాఖ సదస్సుతో ఏపీకి గరిష్ట ప్రయోజనం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు పెట్టుబడుల ఆకర్షణ కోసం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్స్ నిర్వహించగా అందులో అత్యధికంగా లబ్ధి పొందిన రా>ష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సర్వే తెలిపింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో 386 ఒప్పందాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంది. అయితే ఈ సర్వేలో కొన్ని ప్రాజెక్టుల ఒప్పందాలను పరిగణలోకి తీసుకోలేదని అధికారులు తెలిపారు. -
పాలిటెక్నిక్ కోర్సులకు ‘కొత్త’ ఊపు
విశాఖ విద్య: ఒకప్పుడు పాలిటెక్నిక్ అడ్మిషన్లకు తీవ్రమైన పోటీ ఉండేది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారికి కొలువు గ్యారెంటీగా దక్కేది. ఈ మూడేళ్ల కోర్సు అనంతరం ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం పొందొచ్చు. అయితే, గత పాలకుల నిర్లక్ష్యంతో పాలిటెక్నిక్ కాలేజీలు క్రమంగా నిర్వీర్యమైపోయాయి. ఇప్పుడు మళ్లీ వీటికి కొత్త ఊపు తీసుకొచ్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టిసారించింది. జీఐఎస్ ఒప్పందాలతో నయా జోష్ విశాఖపట్నం వేదికగా ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 (జీఐఎస్)లో ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీంతో 6 లక్షల మందికి పైగా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. పెద్దఎత్తున నెలకొల్పే పరిశ్రమలకు మానవ వనరుల అవసరం దృష్ట్యా, మూడేళ్ల కాల వ్యవధి గల పాలిటెక్నిక్ కోర్సులపై అందరి దృష్టి పడింది. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిం చేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. కొత్త కోర్సులకు రూపకల్పన ఎనర్జీ, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఖనిజ, పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్ వంటి రంగాల్లో పెద్దఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో వీటి విస్తరణకు అనువైన పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణం. ఆయా రంగాలకు అవసరమైన నిపుణులైన యువతను అందించేందుకు వీలుగా పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త కోర్సులను ప్రారంభించాలని సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. తొలిదశలో నాలుగుచోట్ల ఈ నేపథ్యంలో.. తిరుపతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రస్తుతం నిర్వహిస్తున్న కెమికల్ సుగర్ టెక్నాలజీ స్థానంలో ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఇండస్టీ ఇంటిగ్రేటెడ్), సత్యవేడులో మెకానికల్ ఇంజనీరింగ్ స్థానంలో మెకానికల్ రిఫ్రిజరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్, గన్నవరంలో కొత్తగా కంప్యూటర్ సైన్సు, గుంటూరులో గార్మెంట్ టెక్నాలజీ స్థానంలో డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులకు అనుమతిచ్చారు. 2023–24 విద్యా సంవత్సరం నుంచే వీటిలో ప్రవేశాలు కల్పించేలా చర్యలు చేపట్టారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఆయా ప్రాంతాల అవసరాల మేరకు సరికొత్త కోర్సుల రూపకల్పన చేసేలా సాంకేతిక విద్యాశాఖ ముందుకెళ్తోంది. 84 కాలేజీలు.. 17వేల సీట్లు.. 28 రకాల కోర్సులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 84 కాలేజీలు నిర్వహిస్తుండగా, వీటి పరిధిలో 17వేల వరకు సీట్లున్నాయి. వీటిలో సివిల్, మెకానికల్, ఎల్రక్టానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మైనింగ్, కెమికల్, బయోమెడికల్, మెటలర్జి, 3డి యానిమేషన్ అండ్ గ్రాఫిక్స్, పెట్రోలియం, టెక్స్టైల్ వంటి 28 రకాల కోర్సులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాలిటెక్నిక్ కాలేజీల బలోపేతంపై సాంకేతిక విద్యాశాఖ కార్యాచరణలోకి దిగింది. కొత్త కోర్సులు అవసరం ప్రభుత్వం మంచి ఆలోచన చేస్తోంది. పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సుల ఆవశ్యకత ఉంది. ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. భవిష్యత్తులో ఈ రంగంలో నిపుణులు అవసరం. క్యాడ్ కామ్, పవర్ సిస్టమ్, ఎల్రక్టానిక్స్ కమ్యూనికేషన్ వంటి కోర్సులు తీసుకొస్తే ఎంతో మేలు. – డాక్టర్ ఎన్. చంద్రశేఖర్, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పాలిటెక్నిక్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐఎఫ్‌పీటీఓ) అధ్యక్షులు పాలిటెక్నిక్ కాలేజీలకు మంచిరోజులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో నైపుణ్యంతో కూడిన శిక్షణ అందించేలా సకల సౌకర్యాలున్నాయి. కొత్త కోర్సులకు సాంకేతిక విద్యాశాఖ అనుమతులిస్తోంది. పాలిటెక్నిక్ కాలేజీలకు మంచి రోజులొస్తున్నాయి. ఈసారి అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉంది. – జీవీవీ సత్యనారాయణమూర్తి, పాలీసెట్ కనీ్వనర్, ఉమ్మడి విశాఖ జిల్లా క్యాంపస్ కొలువు కొట్టా మాది విశాఖ నగరంలోని తాటిచెట్లపాలెం. తండ్రి గోదాములో కలాసీగా పనిచేస్తున్నారు. అమ్మ ఇంటిదగ్గర మిషన్ కుడుతుంది. సత్వర ఉపాధి కోసమని పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్ కోర్సు ఎంచుకున్నాను. క్యాంపస్ సెలక్షన్స్‌లో టాటా ప్రాజెక్టులో ఏడాదికి రూ.3.25 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించా. – ఈతకోట సియోన్, విశాఖపట్నం -
పనులు ప్రారంభిస్తే అదనపు రాయితీలు
సాక్షి, అమరావతి: కేవలం పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని సాధ్యమైనంత తొందరగా వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. విశాఖ వేదికగా మార్చి 3–4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) ఒప్పందాలను త్వరగా వాస్తవరూపంలోకి తీసుకురావడం ద్వారా స్థానిక యువతకు పెద్దఎత్తున్న ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాల కోసం 2023–27 నూతన పారిశ్రామిక విధానంలో ప్రత్యేకంగా ఎర్లీబర్డ్ ప్రాజెక్టŠస్ పేరుతో పలు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ సదస్సులో మొత్తం 386 పెట్టుబడుల ఒప్పందాలు కుదరగా వీటిద్వారా రూ.13,11,468 కోట్ల విలువైన పెట్టుబడులు.. 6,07,383 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇంత భారీస్థాయిలో ఉపాధి లభించే అవకాశం ఉండటంతో ఈప్రాజెక్టులకు త్వరితగతిన అన్ని అనుమతులూ మంజూరు చేస్తూ పనులు మొదలుపెట్టేలా చూడటం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఇప్పటికే 17 మంది సభ్యులతో ఒక మనాటరింగ్ కమిటీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఆర్నెలల్లో మొదలు పెడితే ప్రోత్సాహకాలు విశాఖ గ్లోబల్ సమ్మిట్ జరిగిన తేదీ నుంచి ఆర్నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రాజెక్టులకు ఎర్లీబర్డ్ కింద పలు ప్రోత్సాహకాలను నూతన పారిశ్రామిక విధానం–2023–27లో పేర్కొన్నారు. ఈ ప్రోత్సాహకాలతో పాటు ఆర్నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన వారికి అదనపు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టులకు 100 శాతం స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్, 100 శాతం లాండ్ కన్వర్షన్ చార్జీల రీఎంబర్స్ చేయనున్నారు. అలాగే, ఈ ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వ్యయంలో 50 శాతం గరిష్టంగా రూ.కోటి వరకు తిరిగి చెల్లిస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమమైన కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో వాటితో సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించి స్థానిక ఉపాధితో పాటు రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రత్యేక రాయితీలను ప్రతిపాదించినట్లు పాలసీలో పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్న మౌలిక వసతులను ఈ పెట్టుబడుల ద్వారా వినియోగించుకోనున్నారు. మధ్య తరహా, లార్జ్, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు పాలసీలో పేర్కొన్న రాయితీలకు అదనంగా ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు పాలసీలో వివరించారు. -
గేమ్ ఛేంజర్.. పారిశ్రామిక ప్రగతి దిశగా అడుగులు
సాక్షి, అమరావతి: రేపటి తరాల భవిష్యత్, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం పరితపిస్తున్న, శ్రమిస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న అపార వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నారని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ (ఏపీ జీఐఎస్)పై శాసనసభలో శనివారం స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ఈ చర్చలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఆ సదస్సులో రూ.13,11,468 కోట్ల పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదిరాయన్నారు. ఈ క్రమంలో 6,07,383 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిలో జీఐఎస్ గేమ్ చేంజర్ అని కొనియాడారు. వ్యూహాత్మక విధానాలతో విజయం రాష్ట్ర ప్రభుత్వం సమ్మిట్ నిర్వహించడానికి ముందు రోడ్‌షోలు, వివిధ దేశాల దౌత్యవేత్తలతో సమావేశాలు, కర్టెన్‌రైజర్ కార్యక్రమాలు నిర్వహించాం. తద్వారా తీసుకున్న చర్యలు, వ్యూహాత్మక విధానాల ద్వారా విజయం సాధించాం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, ప్రపంచంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్తలు అయిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, నవీన్ జిందాల్, భారత్ బయోటెక్ కృష్ణా ఎళ్ల, జీఎంఆర్ గ్రూప్స్, జీఎం రావు, ఇతరులు సమ్మిట్‌కు హాజరయ్యారు. ఇంధన శాఖలో రూ.9.05 లక్షల కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యంలో రూ.3.38 లక్షల కోట్లు, పర్యాటక శాఖలో రూ.22,096 కోట్లు, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో రూ.41 వేల కోట్లు, వ్యవసాయ శాఖలో రూ.3,435 కోట్లు, పశు సంవర్థక శాఖలో రూ.1,020 కోట్లు చొప్పున రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదుర్చుకున్నాం. పెట్టుబడులకు వాస్తవ రూపం తీసుకు రావడం కోసం సీఎస్ అధ్యక్షతన ఒక ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో వరుసగా మూడేళ్లలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. కొత్తగా పరిశ్రమలు నెలకొల్పే వారి కోసం వైఎస్సార్ వన్ కింద 23 శాఖలకు సంబంధించి 96 క్లియరెన్స్‌లు 21 రోజుల్లో ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది ఏపీ ప్రభుత్వమే. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రాష్ట్రం నుంచి ఎగుమతులు బాగా పెరిగాయి. అప్పట్లో ఏటా సగటున రూ.90 వేల కోట్ల లోపు మాత్రమే ఎగుమతులు ఉండేవి. మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం నుంచి 2019–20లో రూ.1.04 కోట్లు, 2020–21లో రూ.1.24 లక్షల కోట్లు, 2021–22లో రూ.1.43 లక్షల కోట్లు, 2022–23లో డిసెంబర్ వరకు రూ.1.18 లక్షల కోట్ల చొప్పున ఎగుమతులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. వీటి పరిధిలో 48 వేల ఎకరాల భూమి పరిశ్రమలు నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసిన ఏకైక ప్రభుత్వం కూడా మాదే. ఇదివరకెన్నడూ లేని విధంగా సీఎం జగన్ ఎంఎస్ఎంఈలకు రీస్టార్ట్, ఇతరత్రా చర్యలతో ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా 13 లక్షల మందికిపైగా ఉపాధి లభించింది. బకాయిలతో కలిపి రూ.2800 కోట్ల మేర ప్రోత్సాహకాలు అందించాం. మూడేళ్లలో రూ.56 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో 111 భారీ పరిశ్రమలు తీసుకుచ్చాం. వీటిలో 73 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. మరో 88 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. రూ.16 వేల కోట్లతో మరో మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. రాష్ట్రానికి మంచి చేయాలని ఆలోచించిన నాయకులు నాడు వైఎస్సార్, నేడు సీఎం జగన్ మాత్రమే. టీడీపీ ప్రచారం అంతా అవాస్తవం. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థను మేం ఇబ్బంది పెట్టామా? అనకాపల్లి జిల్లాలో ఉన్న హెరిటేజ్ ప్లాంట్ నాలుగేళ్లుగా పన్ను చెల్లించలేదు. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి విప్లవాత్మక మార్పులతో పెట్టుబడులు సీఎం జగన్ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు కాబట్టే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. పరిశ్రమలకు విద్యుత్ శాఖ వెన్నెముక లాంటిది. ఇటీవల విశాఖలో మొత్తం రూ.13 లక్షల కోట్ల ఎంవోయూల్లో ఇంధన శాఖకు సంబంధించే రూ.8,85,515 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 2017లో చంద్రబాబు రూ.85,571 కోట్ల ఎంవోయూలు చేసుకుని 45,895 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పినప్పటికీ ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. 2018లో రూ.67,115 కోట్లతో ఎంవోయూలు చేసుకుంటే ఇందులో కూడా ఉద్యోగాలు జీరోనే. మేం చేసుకున్న ఒప్పందాలన్నీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. భూమి, నీళ్లు, ఇతర వనరులను సమర్థవంతంగా వాడుకునేలా కొత్త పాలసీలు తెచ్చాం. ఏ రాష్ట్రానికైనా పవర్ ఇచ్చేలా 2020లో రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీని తీసుకువచ్చాం. దీంతో సోలార్, ఎనర్జీ సంస్థలు వచ్చాయి. 29 పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టుల టెక్నికల్ కమర్షియల్ ఫీజబుల్ రిపోర్ట్ సిద్ధం చేశాం. మరికొన్ని చిన్న ప్రాజెక్టులకు నివేదికలు తయారు చేస్తున్నాం. మన దేశంలో 2030 నాటికి ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనే భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టుల స్థాపనలో ఎకరాకు రూ.31 వేలు చొప్పున రైతులకు లీజు లభిస్తుంది. – మంత్రి పెద్దిరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి ఆయనకు లోకజ్ఞానం ఉందా? దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్‌కు మాత్రమే వచ్చారంటే సీఎం జగన్ పట్ల వారు ఎంత నమ్మకంగా, సానుకూలంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఓ నాయకుడు తన పార్టీ పెట్టి పదేళ్లు అయ్యిందని సభ నిర్వహించి.. దారిన పోయే వారితో ఎంవోయూలు చేయించారని మాట్లాడారు. ఆ మనిషికి నిజంగా లోకజ్ఞానం ఉందా? పారిశ్రామిక వేత్తల గురించి కనీస అవగాహన ఉందా? పరిశ్రమలు తరలిపోతున్నాయి.. పారిశ్రామికవేత్తలు రావడం లేదని టీడీపీ చేసిన గోబెల్స్ ప్రచారాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో తిప్పికొట్టాం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నిర్వహించిన సదస్సులకు ఎప్పుడూ ఇలాంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు రాలేదు. దేశంలోనే అత్యధిక వృద్ధి రేటుతో సీఎం అద్భుతంగా పరిపాలన చేస్తున్నారని స్వయంగా ముఖేష్ అంబానీ సమ్మిట్‌లో అన్నారు. జే అంటే జగన్.. జే అంటే జోష్.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమని పునీత్ దాల్మియా ప్రశంసించారంటే ఇంతకంటే సర్టిఫికెట్ ఏం కావాలి? సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. పర్యాటక రంగంలో రూ.21,941 కోట్ల పెట్టుబడులతో 129 ఎంవోయూలు చేసుకున్నాం. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి టార్చ్ బేరర్ సీఎం జగన్ 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు, ఆశలను తన భుజస్కందాలపై వేసుకుని వాటిని నెరవేర్చడానికి ప్రయాణం చేస్తున్న టార్చ్ బేరర్ సీఎం జగన్. ఈ ప్రయాణంలో భాగంగా రాష్ట్ర యువత భవిష్యత్‌కు భరోసానిచ్చేలా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. తద్వారా దేశంతో పాటు, ప్రపంచాన్నే రాష్ట్రం వైపు చూసేలా చేశారు. ఈ సమ్మిట్ విజయవంతం అవ్వడంతో టీడీపీ నాయకులకు మైండ్ బ్లాంక్ అయింది. దీంతో వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు తెచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కన్నా దోపిడీ చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఫైబర్ నెట్ లిమిటెడ్‌లో రూ.రెండు వేల కోట్లు దోపిడీ చేసిన చరిత్ర లోకేశ్ ది. సీమెన్స్ కుంభకోణం రూపంలో రూ. 371 కోట్లు దోపిడీ చేశారు. ఈ కుంభకోణంపై ప్రస్తుతం దర్యాప్తు నడుస్తోంది. – అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే -
‘సీఎం వైఎస్ జగన్ యూత్ ఐకాన్’
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ఐదో రోజు బడ్జెట్ సమావేశాల సందర్బంగా విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌పై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సమ్మిట్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. యువతకు ఉపాధి కల్పించే రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలిపారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా జీఐఎస్‌కు వచ్చినట్టు స్పష్టం చేశారు. అనేక రంగాల్లో ఎంఓయూలు కుదుర్చుకున్నామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ యూత్ ఐకాన్. జీఐఎస్‌తో సీఎం వైఎస్ జగన్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది. పరిశ్రమల ద్వారా ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పట్ల పారిశ్రామికవేత్తలు విశ్వాసంతో ఉన్నారు. టీడీపీ నేతల గోబెల్స్ ప్రచారాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌తో తిప్పికొట్టాం. దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా ఒకే వేదికపైకి రావడం ఎన్నడూ లేదు. జె అంటే జగన్.. జె అంటే జోష్ అని పారిశ్రామికవేత్తలే చెప్పారు. జీఐఎస్‌తో సీఎం జగన్ ట్రెండ్ సెట్టర్ అని మరోసారి రుజువు చేశారు. పర్యాటక రంగంలో 129 ఎంవోయూలు కుదుర్చుకున్నాం. 40 ఇయర్స్ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేశారు. చంద్రబాబు హయంలో ప్రచారం ఎక్కువ.. పెట్టుబడులు తక్కువ అని ఎద్దేవా చేశారు. అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. చంద్రబాబు గ్రాఫిక్స్‌తో పెట్టుబడులు చూపించారు. మేం దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చాం. రూ.13లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చాం. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సూపర్ హిట్. జీఐఎస్‌తో సీఎం జగన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. జీఐఎస్ సక్సెస్ చూసి ఎల్లో బ్యాచ్‌కు గ్యాస్ ట్రబుల్ వచ్చింది. జీఐఎస్ సక్సెస్ చూసి లోకేష్‌కు మైండ్ బ్లాంక్ అయ్యింది. లోకేష్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. మాది గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. -
మొదలైన పెట్టుబడుల కార్యాచరణ
సాక్షి, అమరావతి: విశాఖ వేదికగా మార్చి 3–4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదిరిన పెట్టుబడుల ఒప్పందాలను వాస్తవ రూపంలోకి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. సదస్సులో కుదిరిన ఒప్పందాలను సాధ్యమైనంత త్వరగా అమల్లోకి తీసుకురావడానికి సీఎస్ చైర్మన్‌గా 17 మంది సభ్యులతో మానిటరింగ్ కమిటీని ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. వీరితో పాటు వ్యవసాయ, పశు సంవర్థక, ఆర్థిక, ఇంధన, జలవనరులు, పర్యాటక, రెవెన్యూ, వాణిజ్య పన్నుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జీఏడీ (కో–ఆర్డినేషన్), స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్లానింగ్, ఐటీ–ఐటీఈఎస్, ట్రాన్‌పోర్ట్ శాఖల కార్యదర్శలు సభ్యులుగా ఉంటారు. వీరుకాకుండా అవసరమైతే ఇతర శాఖలకు చెందిన అధికారులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తారు. ప్రతీ శాఖలో కుదరిన ఒప్పందాలను ఆయా ఇన్వెస్టర్లతో సమీక్షించి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పటిలోగా ఉత్పత్తిలోకి తీసుకొస్తారన్న అంశాలపై ఒక అజెండాను రూపొందించి ఆ వివరాలను పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు సమీక్ష కోసం మానిటరింగ్ కమిటీకి ఇవ్వాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఇక మానిటరింగ్ కమిటీ తరచూ సమావేశమై పెట్టుబడులను త్వరితగతిన వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి ఉన్న అడ్డంకులు, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. విశాఖ జీఐఎస్–2023 సమావేశాల సందర్భంగా మొత్తం 386 ఒప్పందాలు జరిగినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా రూ.13,11,468 కోట్ల పెట్టుబడులతో పాటు 6,07,383 మందికి ఉపాధి లభించనుంది. ప్రతీ 15రోజులకోసారి సమీక్షిస్తాం జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజ ప్రముఖలను విశాఖకు తీసుకొచ్చి లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రం ఇప్పుడు వాటిని వాస్తవరూపం తీసుకురావడంపై దృష్టిసారించింది. ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలు ఎప్పటిలోగా ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నాయో అన్న దానిపై సమాచారం సేకరించి దానికనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ఇందులో భాగంగా తొలి సమావేశం గత శుక్రవారం సీఎస్ అధ్యక్షతన జరిగింది. ఇలా ప్రతీ 15 రోజులకొకసారి సమావేశమై ఎంఓయూల పరిస్థితిని సమీక్షిస్తాం. – జి. సృజన, రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ -
స్టార్టప్స్‌కు ఊతమిచ్చిన జీఐఎస్
సాక్షి, అమరావతి: విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) కేవలం భారీ పెట్టుబడులను ఆకర్షించడానికే కాకుండా రాష్ట్ర స్టార్టప్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూడా వేదికగా నిలిచింది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు జీఐఎస్‌లో 36కు పైగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆలోచన దగ్గర నుంచి దాన్ని వాణిజ్యపరంగా పూర్తిస్థాయి నూతన ఆవిష్కరణగా తీర్చిదిద్దేలా స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను తయారు చేసే విధంగా పరిశ్రమలు, ఇంక్యుబేటర్లు, యాక్సిలేటర్స్, పరిశ్రమలతో రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ ఇన్నొవేషన్ సొసైటీ (ఏపీఐఎస్) పలు ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందుకోసం జీఐఎస్ ఎగ్జిబిషన్లో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేసి, స్టార్టప్స్‌పై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 595 స్టార్టప్స్, 30 ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. ఏపీ ఐటీ శాఖ నుంచి నాలుగు ఇంక్యుబేటర్లు, వివిధ కళాశాలల్లో మరో 26 ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా 1,500 మంది సొంతంగా ఇంటి నుంచే స్టార్టప్స్ కింద పనిచేయడానికి నమోదు చేసుకొన్నారు. రాష్ట్రంలోని స్టార్టప్స్ అంతర్జాతీయంగా ఎదిగేలా ఐటీ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా పలు సంస్థల సహకారాన్ని స్టార్టప్స్‌కి అందిస్తోంది. స్టార్టప్స్‌కు పరిశ్రమల మద్దతు రాష్ట్రంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు సహాయ సహకారాలందించడానికి పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. బహుళజాతి సంస్థలు పేటీఎం, ఒప్పొ, డసాల్ట్, స్మార్ట్ఫారి్మంగ్ టెక్, గ్లోబల్ యాక్సలేటర్ ఫర్ ఇన్నోవేషన్ నెట్వర్క్ వంటి సంస్థలు స్టార్టప్స్‌ను ప్రోత్సహించనున్నాయి. ఈ మేరకు ఏపీ ఇన్నొవేషన్స్ సొసైటీతో ఒప్పందాలు చేసుకున్నాయి. రాష్ట్రంలోని స్టార్టప్స్‌కు జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించేందుకు పేటీఎం ముందుకొచ్చింది. అలాగే ప్రముఖ సెల్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన అనుంబంధ సంస్థ ఓప్లస్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలోని స్టార్టప్స్ ప్రమోట్ చేయనుంది. రాష్ట్రంలోని స్టార్టప్స్ అభివృద్ధి చేసిన ప్రొడక్ట్సను 100 రోజుల్లో మార్కెటింగ్ చేసేందుకు డసాల్ట్ ఇండియా సిస్టమ్స్ ఆసక్తి కనబరుస్తోంది. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఆవిష్కరించే నూతన టెక్నాలజీలకు ఆర్థిక సాయం అందించేందుకు నెదర్లాండ్స్‌కు చెందిన స్మార్ట్ ఫార్మింగ్ టెక్ బీవీ ముందుకొచ్చింది. బెంగళూరుకు చెందిన యాక్సిలేటర్ ఇన్నోవేషన్ నెట్వర్క్ రాష్ట్రంలోని స్టార్టప్స్‌ను దేశ విదేశాల్లోని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లడానికి ఆర్థి క వనరులను సమకూర్చనుంది. ఫండింగ్ చేయడానికి మూడు సంస్థలు అలాగే రాష్ట్రంలోని స్టార్టప్స్ అభివృద్ధి చేసిన నూతన ఆవిష్కరణలకు దేశ విదేశాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వెంచర్ క్యాపిటలిస్ట్, ఏంజెల్ ఫండింగ్ రూపంలో ఆర్థి కసాయం అందించే విధంగా మూడు సంస్థలతో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ ఒప్పందాలు చేసుకుంది. స్పెయిన్‌కు చెందిన యూరోపియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఈఈడీసీ), చెన్నైకి చెందిన కన్సార్టీయం ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (సీటీఈ), బ్రిటన్‌కు చెందిన ఈస్క్వేర్ ఇన్నొవేషన్స్ లిమిటెడ్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అదే విధంగా డీఎల్టీ ల్యాబ్ టెక్నాలజీస్, దుబాయ్‌కు చెందిన క్రియేటర్స్ ఎఫ్జెడ్కో, మై స్టార్టప్ టీవీ, నెక్టŠస్ వేవ్ వంటి స్టార్టప్ సంస్థలతో కూడా ఒప్పందాలు జరిగాయి. ఇవి కాకుండా రాష్ట్రంలోని 13కుపైగా ఇంక్యుబేటర్ సంస్థలు, ఎస్టీపీఐ నెక్ట్స్, నాస్కాంలతో ఏపీఐఎస్ ఒప్పందాలు కుదుర్చుకుంది. పూర్తిస్థాయి ఎకోసిస్టమ్ అభివృద్ధే లక్ష్యం నూతన ఆవిష్కరణలు ఆలోచన దగ్గర నుంచి వ్యాపార పరంగా నూతన అప్లికేషన్ ఆవిష్కరించే విధంగా పూర్తిస్థాయి ఎకో సిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నాం. ప్రధానంగా మెటావర్స్, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమ్ డెవలప్మెంట్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, కామిక్స్, డిజిటల్ ఆర్ట్, మార్కెటింగ్, మీడియా డిస్ట్రిబ్యూషన్ రంగాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించాం. నాలుగో తరం టెక్నాలజీలో పనిచేస్తున్న వారందరినీ ఆన్లైన్లో ఒకే వేదికపైకి తేవడం ద్వారా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాం. ఇందుకోసం ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. రంగాల వారీగా నెలవారీ, మూడు నెలలకు, ఆరు నెలలకు ఒకసారి సమీక్షలతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రో గ్రాంలు, హ్యాక్థాన్లు, పోటీలు నిర్వహిస్తాం. – ఏపీ ఇన్నొవేషన్ సొసైటీ సీఈవో అనిల్ తెంటు -
ఏపీలో సోలార్ ప్రాజెక్టు పెడతాం
సాక్షి ప్రతినిధి: ఇంధన రంగంలో రాష్ట్ర ప్రభుత్వ పాలసీ.. పరిశ్రమలను ప్రోత్సహించడంలో ఇక్కడి పాలకులు అనుసరిస్తున్న విధానాలు పారిశ్రామిక దిగ్గజాలను రాష్ట్రానికి రప్పిస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో రూ. 9,57,139 కోట్ల పెట్టుబడులతో 42 ప్రాజెక్టుల ద్వారా 1,80,918 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థలు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వేదికగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ జాబితాలోకి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా (ఎన్‌ఎల్‌సీఐ) లిమిటెడ్ కూడా చేరింది. రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను స్థాపించడానికి ఈ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఎన్ఎల్సీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) ప్రసన్నకుమార్ మోటుపల్లి విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి ప్రతినిధి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పునరుత్పాదక విద్యుత్‌కు ఏపీలో అవకాశాలు.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ‘నైవేలీ’ సిద్ధంగా ఉంది. పునరుత్పాదక శక్తి (రెన్యూవబుల్ ఎనర్జీ) విభాగంలో.. ముఖ్యంగా సౌర, పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల స్థాపనకు ఏపీలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రానున్న నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 6 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడమే మా కార్పొరేషన్ లక్ష్యం. ఇందుకు అనుకూలమైన రాష్ట్రాలేమిటని చూసినప్పుడు మాకు మొదట ఏపీ కనిపించింది. దీంతో వెంటనే ప్రభుత్వానికి మేం ప్రతిపాదించాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌తో భేటీ అయ్యాం. రాష్ట్రంలో ఎన్ఎల్సీ విస్తరణ, పవర్ ప్రాజెక్ట్‌లు నెలకొల్పడానికి ఉన్న అవకాశాలపై చర్చించాం. ప్రభుత్వం వైపు నుంచి మాకు అత్యంత సానుకూల వాతావరణం కనిపించింది. లిగ్నైట్ ద్వారా విద్యుదుత్పత్తి.. లిగ్నైట్ (గోధుమ బొగ్గు) ద్వారా విద్యుదుత్పత్తి చేయడం మా కార్పొరేషన్ ప్రత్యేకత. తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్‌లలో మాత్రమే ఈ బ్రౌన్ కోల్ అందుబాటులో ఉంది. ఎన్‌ఎల్‌సీఐ ద్వారా లిగ్నైట్ మైనింగ్ చేసి నైవేలీలోనే విద్యుదుత్పత్తి చేస్తాం. అలా ఉత్పత్తి అయిన విద్యుత్ 8 వేల మెగావాట్లు కాగా అందులో థర్మల్ పవర్ 6 వేల మెగావాట్లు ఉంటుంది. ఇక దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలకి కార్పొరేషన్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌కి దాదాపు 310 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఏపీలో రూ.3 వేల కోట్ల పెట్టుబడితో.. దేశంలోనే తొలిసారిగా నైవేలీలో రూ.12 వేల కోట్లతో 1,320 మెగావాట్ల లిగ్నైట్ అల్ట్రా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్‌ని ఏర్పాటుచేయబోతున్నాం. దీనికి సంబంధించి ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఒడిశా రాష్ట్రం తాలబిరలో రూ.22 వేల కోట్ల వ్యయంతో 3,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ని నిర్మించబోతున్నాం. అన్నీ అనుకూలిస్తే ఏపీలో రూ.3 వేల కోట్లతో 500–1000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు నచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం. 2025లోగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించగలిగితే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీల నుంచి కూడా కేంద్రం ద్వారా మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రాజెక్టువల్ల ప్రత్యక్షంగా 200 మందికి పరోక్షంగా 1000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విద్యుత్ కూడా తక్కువ ధరకే దొరుకుతుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) లిమిటెడ్‌తో ఏపీ ఇప్పటికే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ పొందడానికి ఒప్పందం చేసుకుంది. వారి ధర యూనిట్ రూ.2.49గా నిర్ణయించారు. మేం కూడా ఇంచుమించు అదే ధరకు సౌర విద్యుత్‌ను అందిస్తాం. -
ఎలక్ట్రానిక్ రంగంలో భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి : ఎల్రక్టానిక్స్ అండ్ డిజైనింగ్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగానే పెట్టుబడులు ఆకర్షించింది. ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా ఎల్రక్టానిక్స్ రంగంలో రూ.15,711 కోట్ల విలువైన 23 ఒప్పందాలు జరిగినట్లు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా 57,640 మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలు విస్తరణ చేపట్టేలా ఒప్పందం చేసుకోగా మరికొన్ని కొత్త కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇందులో అత్యధిక పెట్టుబడులు తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోనే వచ్చాయి. అత్యధికంగా టీసీఎల్ గ్రూప్.. టీసీఎల్ గ్రూపు రాష్ట్రంలో అత్యధికంగా రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. టీవీ డిస్ప్లే ప్యానల్స్‌ను టీసీఎల్ గ్రూపు ఉత్పత్తి చేయనుంది. ♦ సెల్‌ఫోన్ కెమెరాలు, ఇయర్ ఫోన్స్ వంటి ఉపకరణాలను తయారుచేసేందుకు సన్నీఆపె్టక్ రూ.2,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ♦ అలాగే, ఇప్పటికే శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టిన బ్లూస్టార్, డైకిన్ సంస్థలు తమ విస్తరణ కార్యక్రమాలను ప్రకటించాయి. డైకిన్ సంస్థ రూ.2,600 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకోగా.. బ్లూస్టార్ రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ♦ ఇవికాక.. డ్రోన్స్, లాజిస్టిక్ సొల్యూషన్స్, డిఫెన్స్, వ్యవసాయ రంగాల్లో ఎల్రక్టానిక్ ఉత్పత్తులను తయారుచేసే పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం 23 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోగా మరిన్ని సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందని అపిటా గ్రూపు సీఈఓ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇక తిరుపతిలో రెండు, శ్రీసిటీలో ఒకటి, వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఈఎంసీ మొత్తం నాలుగు ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్ అందుబాటులో ఉండటంతో ఎల్రక్టానిక్స్ సంస్థలు రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నట్లు తెలిపారు. -
బొబ్బిలి వీణ.. శిఖరాగ్ర ఆదరణ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన 20 సభ్యదేశాల శిఖరాగ్ర సమావేశాల్లో బొబ్బిలి వీణ వైభవాన్ని చాటుకోనుంది. విశాఖలో ఈ నెల 28, 29వ తేదీల్లో జరగనున్న జీ–20 సదస్సుకు వివిధ దేశాల నుంచి హాజరయ్యే అతిథులను గౌరవించేందుకు 200 బొబ్బిలి వీణలను అధికారులు ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆయన చేతుల మీదుగా వీటిని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖలో ఈ నెల 3, 4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు దేశం నలుమూలల నుంచి హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు, ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బొబ్బిలి వీణలను బహూకరించారు. బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి ఇంటిపేరు గల కుటుంబీకులే దశాబ్దాలుగా బొబ్బిలి వీణలను తయారుచేస్తూ వస్తున్నారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా 1994వ సంవత్సరంలో సొసైటీని ఏర్పాటు చేసింది. 2002లో బొబ్బిలి పట్ణణ పరిధిలోని గొల్లపల్లిలో వీణల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది వీణల తయారీయే ఆధారంగా ఉన్న మా కళాకారులకు టీటీడీతో పాటు ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంలో 200 వీణలను తయారుచేసి అందించాం. అతిథుల కోసం మా వీణలతో కచేరీ కూడా ఏర్పాటు చేయించారు. ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న మరో ప్రతిష్టాత్మక సదస్సు జీ–20 కోసం కూడా 200 వీణలకు ఆర్డర్ వచ్చింది. – సర్వసిద్ధి రామకృష్ణ, ఇన్చార్జి, బొబ్బిలి వీణల కేంద్రం -
జీఐఎస్ సక్సెస్‌తో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్: మంత్రి రోజా
సాక్షి, విజయవాడ: సీఎం జగన్ బ్రాండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో అర్థమైందని మంత్రి ఆర్కే రోజా అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, జీఐఎస్ సక్సెస్‌తో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయిందన్నారు. ‘‘రాష్ట్రానికి 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 6 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. పారిశ్రామిక దిగ్గజాలు రావడాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. టీడీపీ గోబెల్స్ ప్రచారానికి ఈ సమ్మిట్‌తో సమాధానమిచ్చాం’’ అని రోజా అన్నారు. పర్యాటక శాఖలో పెద్దఎత్తున పెట్టుబడుల కోసం ఎంవోయూలు చేశాం. గ్రౌండింగ్ చేయడానికి రెండు కమిటీలు ఏర్పాటు చేశాం. పారిశ్రామిక దిగ్గజాలు రావడం ఈ ప్రభుత్వం బ్రాండ్ ఇమేజ్‌కి నిదర్శనం. అంబానీ, ఆదాని, దాల్మియా, జిందాల్ వంటి నేతలు సీఎం జగన్ పాలన కోసం చెప్పారు. సీఎం జగన్ పట్ల ఎంత విశ్వాసం ఉందో ఈ సమ్మిట్‌తో అర్థమైంది’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘మా టూరిజం శాఖలో ఎంవోయూలు గ్రౌండ్ చేయడానికి రెండు కమిటీలు వేశాం. పర్యాటక శాఖలో పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం ఎంవోయూలు చేశాం. ఒబేరాయ్ లాంటి సంస్థలు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఏనాడైనా ఇంత గొప్ప పారిశ్రామిక వేత్తలు చంద్రబాబు హయాంలో సమ్మిట్లకు వచ్చారా?. చంద్రబాబుకి చేతకానిది సీఎం జగన్ చేసి చూపించారు. సీఎం జగన్ క్రేజ్ ఎలా ఉంటుందో చంద్రబాబుకి అర్థమైంది’’ అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. చదవండి: స్మార్ట్ మీటర్లపై అపోహలు సృష్టించొద్దు: విజయానంద్ -
మంత్రులు, అధికారులను అభినందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రెండు రోజుల్లో రూ. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 378 ఒప్పందాలు జరిగాయి. 6.09 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఎంవోయూలు అమలు దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన ఏపీ సర్కార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. కమిటీ ప్రతి వారం సమావేశమై సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు సీఎం సూచించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవెన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ డా.జి. సృజన, ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఎండీ ఎస్.షన్మోహన్ పాల్గొన్నారు. చదవండి: మీ తప్పు ఒప్పుకునేదెప్పుడు బాబూ? -
పెట్టుబడుల కోసం సీఎం జగన్‌ది మంచి ప్రయత్నం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) నిర్వహించడం ద్వారా పెట్టుబడులను ఆకట్టుకోవడానికి కృషి చేశారన్నారు. సోమవారం ఆయన విశాఖలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమ్మిట్‌లో కుదుర్చుకున్న ఒప్పందాలు (ఎంవోయూలు) వాస్తవరూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు వస్తాయని అభిప్రాయపడ్డారు. జీఐఎస్ నిర్వహణ భేష్: విష్ణుకుమార్‌రాజు విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను గొప్పగా నిర్వహించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు విలేకరుల సమావేశంలో కొనియాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన ఈ సదస్సులో రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన ఎంవోయూలు కుదుర్చుకోవడం, అంబానీ, కరణ్ అదానీ, జిందాల్ వంటి అతిరథులు పాల్గొనడం గొప్ప విషయమని చెప్పారు. రాష్ట్రానికి ఇంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చారంటే మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే వేళ రాజకీయ విమర్శలు సరికాదని చెప్పారు. విశాఖలో రోడ్ల అభివృద్ధి, నగర సుందరీకరణ అభినందనీయమన్నారు. -
విశాఖను వరించిన పెట్టుబడులు
కేవలం 1 శాతం సంపన్నవంతులను మాత్రమే పట్టించుకుంటూ, ప్రపంచంలోని మిగతా 99 శాతం భవిష్యత్తును గాలికి వదిలేయకూడదు. కొద్దిమంది చేతుల్లో ద్రవ్య అధికార కేంద్రీకరణ జరిగి అది మిగతా ప్రపంచ భవిష్యత్తును శాసించడం పచ్చి నిరంకుశత్వం. వీటిని పూర్తిగా గుర్తెరిగి, ప్రపంచ పెట్టు బడులను పూర్తిగా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా మలుస్తూ సాగింది విశాఖపట్నంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్. విశాఖ కేంద్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు కేంద్ర స్థానంగా ఎందుకు మార్చకూడదన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముందుకు సాగిన ఫలితమే – ఈ సదస్సు. ‘‘20వ శతాబ్దపు పెట్టుబడిదారీ వ్యవస్థ 21వ శతాబ్దపు సమాజాన్ని తీర్చిదిద్దడంలో విఫలమైందా? గత 30 సంవత్సరాల వ్యవ ధిలో సంపన్న వర్గాలకూ, పేద వర్గాలకూ మధ్య ఆదాయ వనరులలో వ్యత్యాసం దారుణంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో మనకు నూతన వ్యవస్థ అవసరమని చెప్పినంత మాత్రాన పరిస్థితులు మారవు. ఉన్న వ్యవస్థ ఎందుకు ప్రజాబాహుళ్యం అవసరాలను తీర్చలేకపోతోంది? కొలది మందిలో పేరుకుపోయిన అవధులు లేని కోరికలు; పేద, కార్మిక వర్గాల హక్కులపై సాగుతున్న దాడులు– ఈ పరిస్థితులు వెరసి ఉత్పత్తి అవుతున్న సంపద పంపిణీలో వాటాను పేద సాదలు అనుభవించనివ్వకుండా చేస్తున్నాయి. ఇలా పేద సాదల న్యాయమైన డిమాండ్ కుంచించుకు పోతూ, వ్యాపార సరళి దెబ్బతింటూపోతే వ్యాపార వర్గాల వ్యాపారమూ బతికి బట్ట కట్టలేదని గుర్తించాలి. కను కనే, అమెరికా అధ్యక్ష కార్యాలయ సలహాదారుగా పనిచేసిన లారీ సమ్మర్స్ 40 శాతం అమెరికన్లలో పెట్టుబడిదారీ విధానమంటే సాను కూల అభిప్రాయం లేదని బాహాటంగా చాటాడు’’. – షరాన్ బ్రూనో, అంతర్జాతీయ ట్రేడ్ యూనియన్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ‘‘నానాటికీ పెరిగిపోతున్న సామాజిక అసమానతలు ప్రపంచ ప్రజల భావి భాగ్యోదయానికీ, భద్రతకూ కాచుకు కూర్చున్న పెద్ద ప్రమాదం’’. – ప్రపంచ ఆర్థిక, సహకారాభివృద్ధి సమాఖ్య ప్రపంచ పెట్టుబడులకు దావోస్ కేంద్ర స్థానంగా ఉండి, వర్ధమాన బతుకుల్ని శాసిస్తూ వచ్చిన దశ నుంచి కొత్త మార్పు మొదలైంది. కేవలం 1 శాతం సంపన్నవంతుల గొంతును వినిపిస్తూ ప్రపంచంలోని మిగతా 99 శాతం ప్రజాబాహుళ్యం భవిష్యత్తును దావోస్ గాలికి వదిలేస్తూ వచ్చింది. కనుకనే స్విట్జర్లాండ్ యువజన సమాఖ్య అధిపతి డేవిడ్ రాత్, కొద్దిమంది చేతుల్లో ఈ ఆర్థిక, ద్రవ్య అధికార కేంద్రీకరణ మిగతా ప్రపంచ ప్రజాబాహుళ్యం భవిష్యత్తును శాసించడం పచ్చి నిరంకుశత్వంగా అభివర్ణించాడు. అలాంటి దావోస్ సభలలో చర్చలను, ఫలితాలను అవగతం చేసుకొని వచ్చిన అనుభవం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్రెడ్డి రాష్ట్ర సమగ్రా భివృద్ధి కోసం పథక రచన చేశారు. భారతదేశంలో విశిష్ట సహజ సాగర వనరులకు కేంద్రంగా, సహజ సంపదలకు ఆలవాలంగా ఉండి, దేశీయ పారిశ్రామిక స్థావరా లలో ఆంధ్రప్రదేశ్ తూర్పు కోస్తాలో ప్రభవిల్లుతూ వచ్చిన నగరం– విశాఖపట్నం. విశాఖ కేంద్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు కేంద్రస్థానంగా ఎందుకు మార్చకూడదన్న ఆలోచనతో జగన్ ముందుకు సాగిన ఫలితమే – గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023. భారీ పారిశ్రామిక, ఉపాధి అవకాశాల కేంద్రంగా ఈ విశాఖ సదస్సును జయప్రదం చేయగలగడం అతని వయస్సుకు మించిన గౌరవాన్ని తెచ్చి పెట్టింది. ఎందుకంటే, బహు కొలది మందిగా ఉన్న సంపన్నుల చేతుల్లో ఆర్థిక, ద్రవ్య వనరుల కేంద్రీకరణ వల్ల ఆ వర్గాలే మిగతా అసంఖ్యాక ప్రజా బాహుళ్యంపై నియంతృత్వం చలాయించే ప్రమాదం ఇప్పటికే బలంగా పొంచి ఉంది. అందుకే జగన్ తన ‘నవరత్నాల’ పథకం ద్వారా ఆదిలోనే ప్రజా ప్రయోజనాల రక్షణకు ‘ఏడుగడ’గా నిలిచారు. అందుకే విశాఖ పెట్టుబడుల సదస్సు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయో జనాలకు రాగల నష్టం ఏమీ ఉండదు. పైగా ప్రపంచ వ్యాపిత పెట్టు బడులు రాష్ట్రానికి రాగల అవకాశాలు మరింతగా పెరిగాయి. రాష్ట్రానికి కేంద్రమూ, బీజేపీ పాలకులూ రాష్ట్ర విభజన సమయంలో హామీ పడిన ప్రత్యేక హోదా విషయంలో అనుసరిస్తున్న ‘రాజకీయ తాత్సారం’ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అపారమైన నష్టం వాటి ల్లింది. దీనికితోడు క్రియాశీల పాత్ర నిర్వహించవలసిన అతుకుల బొంత ‘తెలుగుదేశం’, ‘గాలివాటు’ రాజకీయాలకు పేరుమోసిన ‘సినీ వంగడం’ పవన్ కల్యాణ్ ‘వారాహి’ అబద్ధాలకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని దుఃస్థితిలో ఉన్నారు. ఈ రాజకీయ ‘విచిత్ర వేషధారణ’ తంతు పసికట్టిన ప్రధాని మోదీ తన బీజేపీ (ఆరెస్సెస్)కి ఏపీలో రాజకీయ అవకాశాల్ని పెంచుకోవడం కోసం ‘దేశం’తో పవ న్కు ఉన్న చెట్టాపట్టాల్ని తెగ్గొట్టగలిగారేగానీ, వారి మధ్య అక్కరకు రాని రహస్య సమావేశాల్ని ఆపలేకపోయారు. అయితే ఏపీ సీఎం జగన్ ప్రగతి మార్గాన్నీ, ‘నవరత్నాల’ బలమైన ప్రభావాన్నీ వీళ్లెవరూ అడ్డుకోలేక పోయారు. పైగా ఆయనకు అవాంతరాలు కల్పిస్తూ రోజు రోజుకీ ప్రజల ముందు అభాసుపాలవుతున్నారు. ఈ దశలో రాష్ట్రానికి దూసుకువచ్చిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ శిఖరాగ్ర సమావేశం జగన్ చొరవ ఫలితంగా జయప్రదం కాగల్గింది. అందుకే జగన్ ‘‘మేము అమలు చేస్తున్నవి కేవలం ఉచిత పథ కాలు కావు. ఇదంతా మానవ వనరుల మీద పెడుతున్న పెట్టుబడిగా మేం భావిస్తున్నాం. మానవ వనరుల నైపుణ్యాభివృద్ధిపైన పెట్టు బడిగా భావిస్తున్నాం. మా విద్యార్థులు సొంత కాళ్లపై నిలబడి, ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవసరమైన వనరులను సమకూరుస్తున్నాం. అందుకోసం విద్యాప్రమాణాలు పెంపొందిస్తున్నాం. అభివృద్ధిలో వారిని భాగస్వాములు చేస్తున్నాం’’ అనగలిగారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు 62 శాతం పదవులు ఇచ్చి దేశ చరిత్రలో నూతన ఒరవడిని సుస్థిరపరిచి దేశ చరిత్రలోనే మొదటి స్థానంలో జగన్ నిలబడటానికి ‘దమ్ము’ అందించినవీ, అధికారానికి రావడానికి ముందే సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా గడించిన ప్రజాస్పర్శతో ప్రకటించినవీ అనుల్లంఘనీయమైన ‘నవరత్నాల’ని మరచిపోరాదు. తద్వారా దేశంలోని రాజకీయ పార్టీలకూ, ముఖ్యమంత్రులకూ తండ్రి రాజశేఖరరెడ్డి తర్వాత అంత ఆదర్శంగా నిలిచినవాడు జగన్! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
‘ఎన్టీఆర్‌ను ఆ విధంగా నమ్మించారు.. స్వెట్టర్లు అమ్మే వ్యక్తి రాయబారి అయ్యారు’
విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు భారీగా విజయవంతం కావడం తెలుగుదేశం పార్టీకి గానీ, ఎల్లో మీడియాకు గానీ ఏ మాత్రం రుచించడం లేదని తెలుస్తోంది. ఏకంగా దేశంలో ఉన్న టాప్ క్లాస్ బిజినెస్ మాగ్నెట్లు అంతా రావడం, ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని కొనియాడటం, వేల కోట్ల పెట్టుబడులు పెడతామని నేరుగా ప్రకటించడం.. ఎల్లో బ్యాచ్‌కు మింగుడు పడలేదు. సాధారణంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడిదారుల సదస్సు జరిగితే అందులో రకరకాల వేషాలు, డ్రామాలు పుట్టుకొస్తాయి. అలాంటి ఓ విచిత్రమైన ఘటనను షేర్ చేసుకున్నారు సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు మంత్రిగా ఉండేవారు. ఆ సందర్భంలో జరిగిన సంఘటన, ఆయన చెప్పిన అనుభవం ఇది. "తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఫేక్ షోలు చేయడం అలవాటు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపం.. ఆయనకు పెద్దగా తెలియదు. ఎప్పుడూ చుట్టూ ఉండే చంద్రబాబు, ఆయన మనుష్యులు ఓ రోజు ఒకాయనను తీసుకొచ్చారు. నేరుగా ఎన్టీఆర్ దగ్గరకు తీసుకొచ్చి పరిచయం చేశారు. అయ్యా.. ఈయన భూటాన్ రాయబారి అని పరిచయం చేశారు. ఎన్టీఆర్ దానికి ఎంతో సంతోషించారు.. స్వయంగా వెంట తీసుకెళ్లి బుద్ధుడి విగ్రహాం చూపించారు. ఆ వ్యక్తితో ఫోటోలు దిగి పేపర్లో వేయించారు. టుప్కా అని భూటాన్ నుంచి రాయబారి వచ్చారని, ముఖ్యమంత్రిని కలిశారని పేపర్లలో ప్రచారం చేయించారు. అప్పట్లో నేను ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పని చేస్తుండే వాడిని. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తర్వాత .. నాతో పని చేస్తోన్న ఓ కొలీగ్ ఓ ఫోటో చూపించారు. అందులో నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర స్వెట్టర్లు అమ్ముకుంటున్న వ్యక్తి ఫోటో ఉంది. ఇతనే కదా మొన్న ఎన్టీఆర్‌ను కలిసిన భూటాన్ రాయబారి అని చెప్పారు. తెలుగుదేశం వాళ్లు ఇలాంటి పనులు చేస్తుంటారు. స్వెట్టర్లు అమ్ముకునే వ్యక్తిని భూటాన్ రాయబారి అని చెప్పించిన ఘనత చంద్రబాబుది.." అని దేవులపల్లి అమర్ అన్నారు. చదవండి: జాకీ యూనిట్‌పై రాప్తాడులో టీడీపీ కాకిగోల.. వాస్తవాలతో సాక్ష్యం ఇదిగో -
ఏమిటా రాతలు?
విజయనగరం: విశాఖ వేదికగా ప్రశాంత వాతావరణంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 విజయంతంగా జరిగితే ఓర్వలేని పచ్చపత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అడ్డగోలు రాతలు రాయడం దుర్మార్గమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయనగరంలో ఆదివారం జరిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మంచి జరిగినప్పుడు రాయకపోయినా ఫర్వాలేదు. కానీ, చెడురాతలు రాయడం సరికాదు. సమ్మిట్ ముగిసి ఒక్కరోజు కాకముందే రూ.12 లక్షల కోట్లు ఎంవోయూలు చేయడం గొప్ప కాదు... అవి ఆచరణలో చేసి చూపించగలరా... ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించగలరా... అంటూ లెక్కలు వేసి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. వారిది నోరా.. తాటి మట్టా...’ అని బొత్స మండిపడ్డారు. ‘పచ్చపత్రికలు చెప్పిందే భగవద్గీతలా భావించే రోజులు పోయాయి. వారేమిచెప్పినా నిజమని నమ్మే పరిస్థితి లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆర్భాటంగా నిర్వహించిన సమ్మిట్లపై ఎందుకు ఇలా రాయలేకపోయారు. రెండు రోజులపాటు జరిగిన విశాఖ సమ్మిట్‌కు దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సంస్థలు వచ్చిన విషయాన్ని ప్రజలు గమనించారు. ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు పరిశ్రమలు స్థాపించేందుకు పూర్తి సహకారం అందిస్తామని, దీనికోసం ప్రత్యేక కమిటీ వేస్తామని సీఎం చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి కొంత సమయం పడుతుంది. ఈలోపే ఏమిటా రాతలు? ప్రజలను తప్పుదోవ పట్టించేలా 2019 ఎన్నికలకు ముందు మీరు ఎన్ని రాతలు రాసినా ఎవరూ పట్టించుకోలేదు. వైఎస్సార్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారు...’ అని బొత్స చెప్పారు. అదేవిధంగా కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ విశాఖలో ఎన్నో వనరులు ఉన్నాయని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురే‹Ùబాబు పాల్గొన్నారు. -
వైజాగ్.. ఓ బ్రాండ్ సిటీ.. సక్సెస్ మంత్రంగా బీచ్ ఐటీ కాన్సెప్ట్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో ఓవైపు కడలి కెరటాలు.. మరోవైపు పెట్టుబడులు పోటెత్తాయి. బెస్త గ్రామం నుంచి మహానగరంగా మారిన విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్). పరిపాలన రాజధానిగా కాబోతున్న నేపథ్యంలో వైజాగ్.. ఓ బ్రాండ్ సిటీ అయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ నగరానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. సదస్సు విజయవంతం అయిన తర్వాత ‘దేశానికి ఆర్థికకోట విశాఖ..’ అని అందరి నోటా ఒకే మాట. జీఐఎస్–2023తో పెట్టుబడుల స్వర్గధామంగా సరికొత్త ఇమేజ్‌కు నాంది పలికిన వైజాగ్.. ఇదే స్ఫూర్తితో జీ–20 సదస్సుకు సిద్ధమవుతోంది. రాజదానులెన్నింటికో రాదారిగా ఉన్న విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా మార్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం సిద్ధించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. చోదకశక్తి కేంద్రాలుగా మారుతున్న ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల జాబితాలో అగ్రభాగంలో ఉన్న విశాఖపట్నంలో రెండురోజులు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయింది. ప్రణాళికాబద్ధంగా నిర్మితమైన నగరంగా విశాఖకు ఈ సమ్మిట్ నిర్వహణతో అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. గత ప్రభుత్వ హయాంలో మూడుమార్లు పెట్టుబడుల సదస్సులు నిర్వహించినా రాని ఇమేజ్.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదటిసారి ఏర్పాటు చేసిన జీఐఎస్‌తో వైజాగ్ పేరు ఖండాంతరాలు దాటింది. సీఎం వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నిర్వహించిన సమ్మిట్‌కు దేశవిదేశాలకు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు హాజరై విశాఖ నగర వైభవానికి వావ్ అన్నారు. కొత్త ఇమేజ్ తీసుకొచ్చారు ఇన్నాళ్లు.. విశాఖపట్నం అంటే అలల సవ్వడులతో.. అందాల నగరంగా.. పర్యాటక ప్రాంతంగా మాత్రమే గుర్తింపు ఉండేది. కానీ.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించిన తర్వాత నగరానికి సరికొత్త ఇమేజ్ వచ్చింది. ఎవరు వచ్చినా ఆహ్వానించదగ్గ ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న విశాఖ నగరంలో తమ వ్యాపార కార్యకలాపాలు విస్తరించాలన్న ఆలోచనల్ని పారిశ్రామికవేత్తలు స్వయంగా చూసిన తర్వాత మరింత బలపరుచుకున్నారు. నివాసయోగ నగరాల్లో టైర్–1 సిటీలతో పోటీపడుతున్న విశాఖపట్నం పెట్టుబడులకు కూడా ప్రధాన కేంద్రంగా మారింది. హైదరాబాద్‌ని మించి అభివృద్ధి చేసే అవకాశాలున్నప్పటికీ.. గత పాలకులు విశాఖని ఒక నగరంగానే గుర్తించి విస్మరించడంతో అనుకున్న మేర అభివృద్ధి చెందలేదు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. నగరానికి కొత్త ఇమేజ్ తీసుకొచ్చేందుకు ఆలోచనలు కార్యరూపం దాల్చేలా అడుగులు వేశారు. అనుకున్నట్లుగానే పెట్టుబడుల సదస్సుతో ‘తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి.. ఉంటే వైజాగ్‌లోనే ఉండాలి.. చేస్తే విశాఖలోనే వ్యాపారం చేయాలి..’ అనే స్థాయికి తీసుకెళ్లారు. బహుళ ప్రాజెక్టులతో ఆకర్షణ మంత్రం సువిశాల సాగరతీరం చెంతనే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఐటీ పరిశ్రమల్ని అభివృద్ధి చేసి సిటీ ఆఫ్ డెస్టినీని ఐటీ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో బీచ్ ఐటీ కాన్సెప్ట్‌ని తొలుత ప్రమోట్ చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమెజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖవైపు అడుగులు వేశాయి. తాజాగా విప్రో కూడా తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు విశాఖనే ఎంపిక చేసుకుంది. ఇలా ఐటీ డెస్టినీగా మారుతున్న విశాఖలో ఇతర పరిశ్రమలకూ ఆస్కారం ఉందన్న ఆలోచన దిగ్గజ పారిశ్రామికవేత్తల మదిలో కలిగేలా సీఎం వైఎస్ జగన్ విశాఖని విశ్వవ్యాప్తంగా ప్రమోట్ చేశారు. అందుకే అదానీ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అదేవిధంగా వైజాగ్ టెక్‌పార్క్ కూడా డేటాసెంటర్‌తో పాటు బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీలను రూ.21,844 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసి 39,815 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎన్టీపీసీ, ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, టర్బో ఏవియేçÙన్.. ఇలా విభిన్న రంగాల్లో బహుళ ప్రాజెక్టుల్ని విశాఖ జిల్లాలోనే ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు మొగ్గుచూపడానికి కారణం వైజాగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన సీఎం వైఎస్ జగన్ అన్నది జగమెరిగిన సత్యం. జీఐఎస్ ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లాకు దాదాపు రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరో అంతర్జాతీయ సదస్సుకు ముస్తాబు భిన్న వాతావరణం, విభిన్న సంస్కృతులు, మెచ్చే భాషలు, ఆది నుంచి దూసుకుపోతున్న రియల్ రంగం, అందుబాటులో మౌలిక వసతులు వెరసి.. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు విశాఖపట్నం వైపు చూస్తున్నారు. జీఐఎస్ విజయవంతం కావడంతో అంతర్జాతీయ ప్రముఖులకు సైతం వైజాగ్ అంటే ఇష్టం పెరిగింది. మళ్లీమళ్లీ నగరానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ ఖరారైన జీ–20 సదస్సుకు నగరం ముస్తాబవుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ స్ఫూర్తితో జీ–20 సదస్సుని విజయవంతం చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది. మరోవైపు త్వరలో విశాఖ నుంచి పాలన కొనసాగిస్తానని సీఎం వైఎస్ జగన్ పునరుద్ఘాటించడంతో ప్రజల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే జీ–20 సదస్సును విజయవంతం చేయడంలో తాము కూడా భాగస్వాములవుతామని నగరవాసులు చెప్పకనే చెబుతుండటం విశేషం. -
Andhra Pradesh: ప్రభుత్వ మద్దతు అమోఘం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటికే వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్న పారిశ్రామిక దిగ్గజాలు తమ భారీ విస్తరణ ప్రణాళికలను ప్రకటించడం ద్వారా రాష్ట్ర ఫ్రభుత్వంపై తమకున్న విశ్వాసాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు వేదికగా ప్రపంచానికి చాటిచెప్పారు. విశాఖలో జరిగిన రెండ్రోజుల జీఐఎస్ సదస్సులో కొత్త పరిశ్రమలు, పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకోవడమే కాకుండా ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న వివిధ సంస్థలు తమ భారీ విస్తరణ కార్యక్రమాలను ప్రకటించాయి. రిలయన్స్ గ్రూపు దగ్గర నుంచి కొత్త తరం నోవా ఎయిర్ సంస్థ వరకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్పందిస్తున్న తీరును సభా వేదికగా కీర్తించాయి. అంతేకాక.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రండి అంటూ ఇతర పారిశ్రామికవేత్తలను ఆయా సంస్థల అధిపతులు ఆహ్వా నించడం విశేషం. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, రిటైల్ వంటి వ్యాపారాల్లో ఇప్పటికే రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టామని.. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతుతో మరో రూ.50,000 కోట్లతో 10 గిగావాట్ల రెన్యువబుల్ సోలార్ ఎనర్జీ పార్కును ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. అదానీ మరో రూ.43,664 కోట్లు అలాగే.. అదానీ గ్రూపు పోర్టులు, సిమెంట్ వంటి రంగాల్లో రాష్ట్రంలో సుమారు రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెట్టగా భవిష్యత్తులో ఆయా రంగాల్లో సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నట్లు ఏపీ సెజ్ సీఈఓ కరణ్ అదానీ ప్రకటించారు. రాష్ట్రంలో డేటా సెంటర్, గ్రీన్ ఎనర్జీతో పాటు వివిధ రంగాల్లో రూ.43,664 కోట్ల పెట్టుబడులను పెట్టే విధంగా అదానీ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. ఇక లాక్డౌన్ కాలంలో తక్కువ సమయంలో యూనిట్‌ను ప్రారంభించామని, దీనికి రాష్ట్ర మద్దతే కారణమని నోవా ఎయిర్ సీఈఓ, ఎండీ గజానన్ నంబియార్ స్పష్టంచేశారు. సాధారణంగా ఆక్సిజన్ వంటి పారిశ్రామిక వాయువుల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేయడానికి కనీసం 18 నుంచి 24 నెలల సమయం పడుతుందని, కానీ కేవలం 14 నెలల కాలంలోనే యూనిట్‌ను ప్రారంభించి వేలాది మంది జీవితాలను కాపాడినట్లు ఆయన తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ రూ.50,632 కోట్లు జిందాల్ స్టీల్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ఏపీ పారిశ్రామిక రాష్ట్రంగా ఎదగనుందన్నారు. అందుకే తన సోదరుడికి చెందిన జేఎస్‌డబ్ల్యూ రూ.50,632 కోట్ల పెట్టుబడులు పెడుతోందన్నారు. ఇక, ఇతర రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ పార్కును దక్కించుకుంది. దీనితో రాష్ట్రంలో ఫార్మా రంగం మరింతగా విస్తరించనుంది. సాధారణంగా ఫార్మా పరిశ్రమ స్థాపనకు మూడు నుంచి నాలుగేళ్లు పడుతుందని, కానీ అన్ని అనుమతులున్న బల్క్ డ్రగ్ పార్కులో తక్షణం కార్యకలాపాలు మొదలుపెట్టే అవకాశం కలుగుతుందని దివీస్ ఫార్మా వైస్ ప్రెసిడెంట్ మధుబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా రంగానికి ఇస్తున్న మద్దతుతో తాము మరింతగా కార్యకలాపాలు విస్తరించడానికి రూ.వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు దివీస్, లారస్, హెటిరో, అపోలో తదితర సంస్థలు ప్రకటించాయి. రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్న సంస్థలు ఇలా భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించడంతో రాష్ట్రం నుంచి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ తెలుగుదేశంతో పాటు దాని అనుబంధ పత్రికల దుష్ప్రచారానికి తెరపడుతుందని భావిస్తున్నట్లు పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. -
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సూపర్ సక్సెస్
-
‘సీఎం కృషికి మెచ్చి పారిశ్రామిక వేత్తలు ఏపీకి క్యూ కడుతున్నారు’
సాక్షి,పశ్చిమగోదావరి:పారిశ్రామిక విధానం, గొప్ప ముఖ్యమంత్రి ఉన్నారన్న భరోసాతో రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఏపీకి వెల్లువలా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి కారుమూరి స్పందిస్తూ.. దేశంలో అతి పెద్ద రెండో తీరప్రాంతం మన రాష్ట్రంలో ఉండడం.. దానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో చేస్తోన్న కృషికి మెచ్చి పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్‌కు క్యూ కడుతున్నారన్నారు. రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులే పెట్టుబడిదారులను ఏపీ వైపు మళ్లిస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖ సమ్మిట్ లో పెట్టుబడులకు సంబంధించి ఊహించని రీతిలో 13 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. చంద్రబాబు లాగా మసిపూసి మారేడు కాయ చేయడం లేదని, ఆయన హయాంలో లాగా హెరిటేజ్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనిచేసే సిబ్బందికి సూట్లు, కోట్లు తగిలించి దొంగ ఒప్పందాలు చేసుకోలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో అంబానీ,ఆదానీ,అపాచీ మిట్టల్, జెఎస్డబ్ల్యు, జిఎంఆర్ తదితర బడా పారిశ్రామిక వేత్తలు వాస్తవ ఒప్పందాలు జరిగాయని చెప్పుకొచ్చారు. భావి తరాలకు చక్కని విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగాల కోసం సీఎం జగన్ బంగారు బాట వేస్తున్నారని కొనియాడారు. -
నాడు చంద్రబాబు అలా.. నేడు సీఎం జగన్ ఇలా..
ఆ సన్నివేశం చూస్తేనే ఎంతో సంతోషం కలుగుతుంది. నిజంగా ఏపీలో ఇంత ప్రముఖంగా పారిశ్రామిక సదస్సు జరిగిందా? అన్న ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సమర్ద నాయకుడు పాలకుడుగా ఉంటే ఇంత గొప్పగా కార్యక్రమం జరుగుతుందన్నమాట అన్న నమ్మకం ఏర్పడుతుంది. ఇదంతా దేని గురించి చెబుతున్నది అర్ధం అయ్యే ఉంటుంది. విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడుల సమ్మిట్ గురించే.. ఈ సమ్మిట్‌లో సుమారు 14 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు పెట్టడానికి దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక సంస్థలు ముందుకు రావడం బ్రహ్మాండమైన శుభ పరిణామం. 350 ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అన్నిటికంటే అందరిని ఆకర్షించిన అంశం ఏమిటంటే దేశంలోనే అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త ముకేష్ అంబాని స్వయంగా విశాఖకు తన మందీ మార్బలంతో వచ్చి పరిశ్రమ పెట్టడానికి ప్రతిపాదన ఇవ్వడం. ఇది వినడానికి, చూడటానికి ఎంత ఆనందం కలుగుతుంది!. అంతేకాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పక్కనే అంబానీ మూడు గంటలకుపైగా కూర్చుని ఆయా అంశాలపై మాట్లాడుతుండటం ఒక విధంగా సంచలనమే అని చెప్పాలి. ప్రతీ నిమిషాన్ని లెక్క వేసుకునే స్థాయిలో ఉన్న అంబానీ.. ఏపీ కోసం అంత టైమ్ కేటాయించడం, మొదటిసారిగా దక్షిణాదిలో ఒక పారిశ్రామిక సదస్సులో పాల్గొనడం ఇవన్నీ రాష్ట్రానికి శుభ సంకేతాలుగా కనిపిస్తాయి. సీఎం వైఎస్ జగన్ సత్తా ఏమిటో ఈ గ్లోబల్ సదస్సు రుజువు చేసింది. ఒక్క అంబానీనే కాదు.. అదానీ, జిందాల్, హెటిరో, అరబిందో, భారత్ బయోటెక్.. ఇలా ఒకటేమిటి దేశంలోని అన్ని ప్రముఖ సంస్థలు తరలి వచ్చి ఏపీ ప్రభుత్వానికి అండగా నిలబడ్డాయి. తమ పరిశ్రమలు పెట్టడం ద్వారా రాష్ట్ర ప్రజలలో ఒక విశ్వాసం, నమ్మకం కలిగించడానికి వారు సిద్దం అవడం ఒకరకంగా గేమ్ చేంజర్ అని అంతా భావిస్తున్నారు. ఏపీలో కొన్ని శక్తులు, టీడీపీ వంటి రాజకీయ పక్షం, టీడీపీ మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు ఈ సదస్సును విఫలం చేయాలని ప్రయత్నించినా, పారిశ్రామికవేత్తలను భయపెట్టేలా టీడీపీ ఆరోపణలతో రాష్ట్రానికి ద్రోహం చేస్తే, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా శక్తివంచన లేకుండా పచ్చి అబద్దపు కథనాలను వండి వార్చినా సీఎం జగన్ వ్యూహం ముందు నిలబడలేకపోయారు. వీరు చేసిన విష ప్రచారాన్ని దేశ, విదేశాలలోని పారిశ్రామిక ప్రముఖులు ఎవరూ విశ్వసించలేదు. అందుకే వారంతా విశాఖకు తరలివచ్చి సమ్మిట్‌ను గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ మొత్తం సదస్సు ఏపీ ఏయే రంగాలలో బలంగా ఉందో తెలియచేసింది. కేవలం ఐటీ రంగం వస్తేనే పరిశ్రమలు వచ్చినట్లుగా భావించే దశ నుంచి మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ మొదలైన రంగాలలో ఏపీ తన పట్టును నిరూపించుకోగలిగిందని వెల్లడైంది. అదే సమయంలో ఐటీకి సంబంధించి కూడా నలభై వేల కోట్ల మేర ఒప్పందాలు కుదిరాయి. విశాఖలో గ్రీన్ టెక్ నిర్మాణం, విజయవాడ కృష్ణా నదిలో టూరిజం ప్రాజెక్టు. సుమారు తొమ్మిది లక్షల కోట్ల మేర గ్రీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ వంటి రెన్యూవబుల్ ఇంధన రంగంలో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం అంటే బహుశా దేశంలోనే ఒక రికార్డు అని చెప్పాలి. ఇంత విద్యుత్ ఉత్పత్తి జరిగితే ఏమి చేసుకుంటారని కొందరు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. కానీ, దేశం అంతా వస్తున్న ఎనర్జీ విప్లవంలో ఎవరు ముందుకు వెళితే వారు సాధించగలుగుతారు. రానున్న కాలంలో సాంకేతిక విప్లవంలో ఇంకెన్ని మార్పులు వస్తాయో ఊహించలేం. అంబానీ, అదానీ, తదితరులు ఈ రంగంలోకి వస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్న ప్రాధాన్యత అర్ధం అవుతుంది. అలాగే టూరిజం, ఫార్మా, మినరల్ తదితర పోర్టు ఆధారిత పరిశ్రమలకు ఒప్పందాలు కుదిరాయి. కొందరు కావాలని సీఎం జగన్ దావోస్ ఒక్కసారే వెళ్లారని, ఈ నాలుగేళ్లలో ఒకేసారి సమ్మిట్ పెట్టారని వ్యాఖ్యానిస్తున్నారు. దావోస్‌కు వెళ్లిన సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ సాధించిన విజయాలు చూశాం. అదే సమయంలో ప్రపంచమంతా రెండేళ్లు కోవిడ్ కుదిపేసిన సంగతిని దాచిపెట్టి కొందరు కువిమర్శలు చేస్తే పట్టించుకోనవసరం లేదు. దావోస్‌ను మించి విశాఖపట్నంలో పదిరెట్ల విజయాలను ఆయన సాధించారు. 2018లో టీడీపీ హయాంలో సుమారు నాలుగున్నర లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే, జగన్ ప్రభుత్వం ఒకే సదస్సులో 14 లక్షల కోట్ల పెట్టుబడులు సంపాదించింది. దీనిని బట్టే ఈ సదస్సు ఎంత విజయవంతమైంది అనేది తెలుస్తుంది. ఇవన్నీ ఆచరణలోకి వస్తాయా అన్న సంశయం రావచ్చు. ఆ మాటకు వస్తే చంద్రబాబు టైమ్‌లో అన్ని సదస్సులు కలిపి ఇరవై లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పేవారు. కానీ, ఆచరణలో కేవలం ఏడు శాతం మాత్రమే అమలు అయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రచార యావలో పడి ఎవరితో పడితే వారితో ఎంవోయూలు చేసుకున్నారు. దారినపోయే వారితో కూడా ఒప్పందం అయ్యారన్న విమర్శలు వచ్చాయి. సీఎం జగన్ మాత్రం అలా చేయలేదు. ఉన్నంతలో అమలుకు అవకాశం ఉన్న ఎంవోయూలే చేసుకున్నారు. అందువల్లే ఒప్పందాలు సంఖ్య 350గానే ఉంది. అదే సమయంలో ఈ ఒప్పందాలు చేసుకున్న కంపెనీలలో తొంభై శాతం దిగ్గజ కంపెనీలు, లేదా పది మందికి తెలిసిన కంపెనీలే అన్న విషయం బోధపడుతుంది. ఎన్టీపీసీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు అమలు అయిపోతాయని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలంటేనే ఆరు నెలల నుంచి ఏడాదిపైగానే పడుతుంది. అలాంటిది ఒక భారీ పరిశ్రమ పెట్టడానికి ఎన్నో సమకూర్చుకోవాలి. అందుకు మూడు, నాలుగేళ్లపాటు పట్టవచ్చు. అది పెట్టుబడిని బట్టి ,సామర్ధ్యం బట్టి ఉంటుంది. మౌలిక సదుపాయాలు, యంత్ర పరికరాలు, మార్కెటింగ్, బ్యాంక్ రుణం తదితర అవసరాలను పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి. వీటిలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా అవి అవాంతరాలుగా మారతాయి. ఇదే సమయంలో ప్రభుత్వపరంగా సహకారం విషయంలో ఎక్కడా జాప్యం ఉండకూడదు. అనుమతులను నిర్దిష్ట సమయంలోనే మంజూరు చేయవలసి ఉంటుంది. ఈ విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటికే ముందంజ వేసిందని చెప్పాలి. ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థ సీఈవో ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రభుత్వం సహకారం వల్ల ఏడాది ముందుగానే తమ షెడ్యూల్ పూర్తి అవుతోందని, దీని వల్ల తమకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇక్కడే ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయినట్లు భావించవచ్చు. ఆయన తరచుగా పరిశ్రమలకు ఏ సమస్య వచ్చినా ఒక ఫోన్ కాల్ చేయండని చాలా స్పష్టంగా చెబుతున్నారు. సీఎం జగన్ సమర్ధతను, పరిశ్రమలపై ఉన్న చిత్తశుద్దిని అనేక మంది పారిశ్రామికవేత్తలు తమ ఉపన్యాసాలలో స్పష్టంగా చెప్పారు. ఇందులో రిలయన్స్ అధినేత అంబానీ ఒకరు. ఆయన ఏపీలో తమ ప్రజెన్స్ వివరిస్తూ, కొత్తగా పది గిగావాట్ల సామర్ద్యంతో సోలార్ ఎనర్జీ పరిశ్రమ స్థాపిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దార్శనికతను కొనియాడారు. ఏపీకి అపార వనరులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో లక్షాఇరవై కోట్ల రూపాయల వ్యయం చేస్తోందని, ఇది మంచి విషయమని సైంట్ సంస్థ వ్యవస్థాపకులు మోహన్ రెడ్డి మెచ్చుకున్నారు. గతంలో చంద్రబాబు పార్టనర్షిప్ సదస్సు పేరుతో నిర్వహించిన సమావేశాల్లో అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరిస్తూ తరచూ ఆయనే ప్రసంగాలు చేస్తుండేవారు. కానీ, సీఎం జగన్ అలాకాకుండా నిర్దిష్ట టైమ్‌లో అవసరమైనమేర క్లుప్తంగానే చెప్పదలచుకున్న విషయాలను సూటిగా చెప్పారు. పారిశ్రామికవేత్తలకు ఎక్కువ మందికి అవకాశం ఇచ్చి మాట్లాడించారు. ఏపీని షోకేస్ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయబోతున్న అంశాన్ని మరోసారి ఉద్ఘాటించారు. ఇక పరిశ్రమల ప్రతిపాదనలు అమలు కావడానికిగాను ఛీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రతివారం సమీక్షించాలని ఆదేశించారు. ఈ రకంగా కేవలం సమ్మిట్‌కే పరిమితం కాకుండా ఫాలో అప్ యాక్షన్‌కు కూడా సిద్దం అవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ సాధించిన ఈ విజయాన్ని చూసి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తట్టుకోలేకపోతోంది. ఏవో పిచ్చి ఆరోపణలు చేస్తూ ప్రకటనలు చేసింది. తద్వారా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడానికి యత్నించింది. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి, టీవీ-5 వంటివి కూడా పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారిని భయపెట్టేరీతిలో కథనాలు ఇచ్చాయి. అయితే, ఈనాడు.. సదస్సు జరిగినంతవరకు కవరేజీ మాత్రం పద్దతిగానే ఇచ్చిందని చెప్పాలి. మిగిలిన టీడీపీ మీడియా మాత్రం తమ ధోరణి మార్చుకోలేదు. పదమూడేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా, పద్నాలుగేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. చంద్రబాబు విశాఖలో అంబానీని చూడగానే అప్ సెట్ అయి ఉంటారు. తన హయాంలో రాని దిగ్గజం, సీఎం జగన్ నిర్వహించిన సమ్మిట్‌కు వస్తారా అని కడుపు మంటకు గురై ఉండవచ్చు. అందుకే తన పార్టీ నేతలతో చెత్త విమర్శలు చేయించారని అనుకోవాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సదస్సు జరిగిన రెండు రోజులు మాట్లాడబోనని చెప్పడం మంచిదే. కేంద్రం నుంచి వచ్చిన కేంద్ర మంత్రులు పార్టీలతో నిమిత్తం లేకుండా ఏపీకి పలు ప్రయోజనాలు చేకూర్చే రీతిలో ప్రసంగాలు చేయడం హర్షణీయం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన సహజ శైలిలో ఏపీకి మౌలిక సదుపాయాల కల్పనలో ఏ విధంగా కేంద్రం నిధులు మంజూరు చేసేది తెలిపారు. మరో ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సోనోవాల్ వచ్చి పారిశ్రామిక సదస్సుకు వన్నె తెచ్చారు. విశాఖపట్నం అభివృద్దికి వీరిద్దరూ కలిసి 13 వేల కోట్ల రూపాయలు వ్యయం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఏపీలో పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని, కొత్తవి రావడంలేదని అబద్దాలు ప్రచారం చేస్తున్నవారికి విశాఖ సదస్సు గట్టి జవాబే ఇచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి జగన్ ఆశించినట్లు ఈ పెట్టుబడుల ప్రతిపాదనలు ఆచరణలోకి వస్తే ఏపీ స్వరూపమే మారిపోయే అవకాశం ఉంటుందన్నది నిజం. ఆ క్రమంలో ఇది ఒక ముందడుగు. - కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు, సీ.ఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్. -
గత ప్రభుత్వం చేయలేనిది సీఎం జగన్ ఎలా సాధించారు ?
-
ఏపీ ఓ బంగారు గని
దొండపర్తి (విశాఖ దక్షిణ): పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అవసరమయ్యే గ్రీన్ అమ్మోనియా ఏపీలో పుష్కలంగా ఉందని, రాష్ట్రం ఒక బంగారు గని అని ఫార్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీస్ సౌత్ అండ్ సౌత్ఈస్ట్ అధ్యక్షుడు అలార్డ్ ఎం.నూయ్ అభివర్ణించారు . గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) రెండోరోజైన శనివారం ఆడిటోరియం–4లో పశ్చిమ ఆస్ట్రేలియా, వియత్నాం దేశాల ప్రతినిధులతో సెషన్స్ నిర్వహించారు. ఇందులో పశ్చిమ ఆ్రస్టేలియా ప్రతినిధిగా పాల్గొన్న అలార్డ్ ముందుగా ఆ దేశంలో పునరుత్పాదక ఇంధన ఉత్పతికి అనుసరిస్తున్న మార్గాలు, అందుకు అవసరమయ్యే ఖనిజాలను వెలికితీసేందుకు చేపడుతున్న చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిసారించడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామమన్నారు. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిపైనే దేశాలన్నీ దృష్టిసారిస్తాయని అలార్డ్ అభిప్రాయపడ్డారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకు కొన్ని ప్రైవేటు పరిశ్రమలతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందాలు చేసుకుందని గుర్తుచేశారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. దీని ఫలితంగానే రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడో ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రస్తుతించారు. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ టాప్ దేశంలో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషిస్తోందని మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ టీఆర్ గిబిన్కుమార్ తెలిపారు. జీఐఎస్‌లో జరిగిన మరో సెషన్లో రాష్ట్రంలో ఆక్వా, మెరైన్ ఉత్పత్తులు, ఇక్కడున్న వ్యాపార అవకాశాలను వియత్నాం ఎంబసీ ప్రతినిధులకు ఆయన వివరించారు. ఈ సందర్భంగా గిబిన్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త పోర్టులతోపాటు ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక హార్బర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. ఒకవైపు సముద్ర ఉత్పత్తులతోపాటు రిజర్వాయర్లు, చెరువులు, ఇతర ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించే విషయంపై ప్రభుత్వం దృష్టిసారించిందని చెప్పారు. అలాగే.. మెరైన్, ఆక్వా రంగానికి అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఉత్పత్తుల ఎగుమతులపై కూడా దృష్టిసారించాలని వియత్నాం ఎంబసీ ట్రేడ్ ఆఫీస్ ఫస్ట్ సెక్రటరీ డూ డుయ్ ఖాన్, ఎంబసీ పొలిటికల్ కౌన్సిలర్ థి ఎన్జాగ్ డెంగ్ ఎన్గుయెన్లను కోరారు. అలాగే, వియత్నాం మెరైన్ రంగంలో ఉన్న వాణిజ్య, వ్యాపార అవకాశాలను ఎంబసీ అధికారులు వివరించారు. ఈ సెషన్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ అడిషినల్ డైరెక్టర్ పి. కోటేశ్వరరావు, మ్యాట్రిక్స్ సీ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ సీఈఓ శివప్రసాద్ వెంపులూరు పాల్గొన్నారు. ఏపీతో కలిసి పనిచేస్తాం.. గత కొన్నేళ్లుగా పశ్చిమ ఆ్రస్టేలియా.. భారత్‌తో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలను కొనసాగిస్తోందని అలార్డ్ గుర్తుచేశారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను ఆయన అభినందించారు. అయితే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు, ప్రాజెక్టులకు కల్పించే మౌలిక సదుపాయాలపై పాలసీ ప్రకటిస్తే విదేశీ పెట్టుబడులు ఆంధ్రాకు పెద్దఎత్తున వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక రాష్ట్రంతో మరిన్ని వాణిజ్య, ఆర్థిక సంబంధాల మెరుగుకోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలో కొత్త ఇండస్ట్రీ పాలసీ దేశంలో ఉన్న పారిశ్రామిక దిగ్గజ సంస్థలే కాకుండా విదేశాల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా త్వరలోనే ప్రభుత్వం కొత్త ఇండ్రస్టియల్ పాలసీని ప్రవేశపెట్టనుందన్నారు. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేలా ఈ పాలసీని రూపొందించినట్లు వివరించారు. రాష్ట్రంలో అవలంబిస్తున్న మైనింగ్ విధానాలు, అందుబాటులో ఉన్న వనరులను మైన్స్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి వివరించారు. ఈ సమావేశానికి పశ్చిమ ఆ్రస్టేలియా ప్రతినిధులకు, రాష్ట్ర అధికారులకు సమన్వయకర్తగా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ నషీద్ చౌదరి వ్యవహరించగా, హెచ్ఏఎస్ హోల్డింగ్స్ డైరెక్టర్ అక్షయ్ పాల్గొన్నారు. -
ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఏపీకి అపార అవకాశాలు
(విశాఖపట్నంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి ) : ఆత్మనిర్భర్ భారత్ విధానంలో భాగంగా కేంద్రం 14 కీలక రంగాల్లో ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలను అమలు చేస్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఆహార ఉత్పత్తులు, వైద్య పరికరాలు మొదలైనవి వీటిలో ఉన్నాయని చెప్పారు. శనివారం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ..ఏపీకి ఉన్న సానుకూలతల దృష్ట్యా మెరైన్ ఉత్పత్తులు, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం, ఇంజినీరింగ్ ఉత్పత్తులు మొదలైన విభాగాల్లో వృద్ధి చెందడానికి రాష్ట్రానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి తోడ్పాటుపందిస్తుందని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంలో, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ తరహా సహకారం కీలకంగా ఉంటుందన్నారు. 2014లో 45 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు 2021–22 నాటికి రెట్టింపై 85 బిలియన్ డాలర్లకు చేరాయన్నారు. వ్యాపారాలను సులభతరం చేసే విధానాల్లో భారత్ ర్యాంకింగ్‌ను గణనీయంగా మెరుగుపర్చుకుందన్నారు. పన్నుల విధానాల్లో, కార్పొరేట్ చట్టాల్లోనూ సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. యూనికార్న్‌ల (1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ గల అంకుర సంస్థలు)కు సంబంధించి ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నామని చెప్పారు. -
ఉన్నత విద్యలో ఏపీ ఆదర్శం
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో అమలు చేస్తున్న విద్యా విధానం పొరుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని విద్యా రంగ నిపుణులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు ప్రశంసనీయమని చెప్పారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వం ముందుందని తెలిపారు. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లో రెండో రోజు శనివారం ఉన్నత విద్యపై ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్సీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి అధ్యక్షతన ప్యానల్ చర్చ జరిగింది. ‘ఇంపాక్ట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై విద్యా రంగ నిపుణులు చర్చించారు. హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ వృత్తి నైపుణ్య కేంద్రంగా మారిందని చెప్పారు. నాస్కాం, మైక్రోసాఫ్ట్, స్కిల్ ఫోర్స్, టీం లీడ్స్, టీసీఎస్ వంటి కంపెనీలతో ఏపీఎస్సీహెచ్ఈ ఒప్పందాలు కుదుర్చుకుంటోందన్నారు. ఇంజినీరింగ్, ప్రొఫెషనల్, డిగ్రీ, ఫార్మసీ విద్యార్థులకు ఆన్లైన్లో అడ్వాన్స్డ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కోర్సులను అందిస్తూ ఉద్యోగ కల్పనలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోందని వివరించారు. ఏపీలో విద్యా విధానం భేష్ విట్ ఫౌండర్, చాన్సలర్ జి.విశ్వనాథన్ మాట్లాడుతూ ఏపీలో ఉన్నత విద్యా బోధన, విధానం చాలా బాగున్నాయని, ప్రభుత్వం దీనిపై అధిక శ్రద్ధ పెట్టిందని చెప్పారు. ఏఐసీటీఈ సీవోవో బుద్దా చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయాన్ని కల్పించడం వల్ల చాలా కుటుంబాల్లో ఇంజినీర్లు తయారవుతున్నారని చెప్పారు. చర్చలో ఐఐఎస్సీ (బెంగళూరు) ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్, ఐఐటీ హైదరాబాద్ ఫౌండర్ ఉదయ్ దేశాయ్, ఐఐఎం విశాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
పోర్టు ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యం
(విశాఖపట్నంలోని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి ) : పోర్టు ఆధారిత అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో స్వయం సమృద్ధి సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. శనివారం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పీఎం గతిశక్తి పథకంతో మౌలిక సదుపాయల కల్పన వేగవంతం కావడంతో పాటు ప్రాజెక్టుల వ్యయాలూ తగ్గుతున్నాయని చెప్పారు. వివిధ రవాణా మార్గాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని చెప్పారు. సుదీర్ఘ తీర ప్రాంతం గల ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ముందంజలో ఉంటుందని అన్నారు. సాగర్మాలా కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1.1 లక్షల కోట్ల విలువ చేసే 110 ప్రాజెక్టులను గుర్తించినట్లు సోనోవాల్ చెప్పారు. ఇప్పటికే రూ. 32,000 కోట్ల విలువ చేసే 32 ప్రాజెక్టులు పూర్తయినట్లు పేర్కొన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన వైజాగ్ పోర్టు అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకంగా ఉందని తెలిపారు. వైజాగ్ పోర్టు కార్గో విభాగం ఆరోగ్యకరమైన వృద్ధి సాధిస్తోందని తెలిపారు. మత్స్యకారులకు ప్రయోజనకరంగా ఉండేలా ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి జరుగుతోంద అన్నారు. దాదాపు రూ. 97 కోట్లతో చేపట్టిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ పనులు పూర్తి కావొస్తున్నాయని చెప్పారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్‌లోనే అందుబాటులోకి రావొచ్చని చెప్పారు. -
పెట్టుబడులకు అత్యుత్తమం
సాక్షి, విశాఖపట్నం: అక్షర క్రమంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగింపు సదస్సులో పలువురు పారిశ్రామికవేత్తలు ప్రశంసించారు. విజనరీ లీడర్ షిప్‌తో అన్ని రంగాల్లో ఏపీ దూసుకెళుతోందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపు రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని కొనియాడారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను తమ తొలి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకుంటామని స్పష్టం చేశారు. ఒక్క ఫోన్ కాల్ చాలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పట్ల పరిశ్రమల యాజమాన్యాలన్నీ పూర్తి విశ్వాసంతో ఉన్నాయి. 11.47 శాతం వృద్ధితో ఏపీ అగ్రభాగంలో ఉండటం గర్వకారణం. దూరదృష్టి కలిగిన నాయకత్వం ఆధ్వర్యంలో రూపొందించిన పారిశ్రామిక పాలసీ అద్భుతమని అందరి మాటగా చెబుతున్నా. రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములుగా మారినందుకు సంతోషంగా ఉంది. రెండు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన సదస్సులో ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలన్న సీఎం వైఎస్ జగన్ భరోసా అందర్నీ ఆకట్టుకుంది. ఆయన చెప్పిన మాట నిజంగా వాస్తవం. ఫోన్ చేస్తే ఏ సమస్యనైనా పరిష్కరిస్తున్నారు. – గజానన్ నబర్, నోవా ఎయిర్ సీఈవో, ఎండీ అసాధారణ ఘనత.. ప్రపంచమంతా పునరుత్పాదక ఇంధనం వైపు పయనిస్తోంది. ఈ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది. ఏపీలో పంప్డ్ హైడ్రో ప్రాజెక్టులకు అనువైన స్థలాలను గుర్తించగలిగాం. సోలార్, విండ్, పంప్డ్ హైడ్రో పవర్ ఉత్పత్తిలో ఏపీ ప్రపంచంలోనే నంబర్1 గా ఎదిగే అవకాశాలున్నాయి. దీని వెనుక సీఎం జగన్ అకుంఠిత దీక్ష ఉంది. గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులతో పాటు సోలార్, విండ్, హైడ్రో ప్రాజెక్ట్‌లలో ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ రంగంలో ఏపీలో భారీగా పెట్టుబడులు పెడతాం. కర్బన రహిత పర్యావరణం కోసం ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా తొలి స్థానంలో నిలవడం సాధారణ విషయం కాదు. పారిశ్రామిక వాతావరణం అద్భుతంగా ఉండటం వల్లే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాం. దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది. – వినీత్ మిట్టల్, ఆవాదా గ్రూప్ చైర్మన్ చురుకైన ప్రభుత్వం.. రాష్ట్ర విభజన తర్వాత బల్క్ డ్రగ్ క్యాపిటల్‌గా ఏపీ మారింది. రాష్ట్రంలో కొన్ని అతిపెద్ద ఏపీఐ యూనిట్లు పనిచేస్తున్నాయి. మేం 2007లో ఒక ఉద్యోగి స్థాయి నుంచి 8 వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగామంటే సీఎం జగన్ అందించిన సహకారమే కారణం. ఇక్కడి పర్యావరణ వ్యవస్థ, చురుకైన ప్రభుత్వం, నిపుణులైన అధికారులు, నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం వల్లే అది సాధ్యమైంది. ఏపీకి ప్రత్యేకంగా మార్కెట్ అవసరం లేదు. పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా పెడితే పెట్టుబడులు వస్తాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే డ్రగ్ కంట్రోలర్ అనుమతులతో సహా ప్రక్రియను వేగంగా నిర్వహించేలా డిజిటల్ డ్రైవ్‌లోనూ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. ప్రపంచానికి కావాల్సిన ఔషధాలు ఏపీలో తయారవుతున్నాయి. – సూర్యనారాయణ చావా, లారస్ ల్యాబ్స్ ఫౌండర్, సీఈవో పరిశ్రమలు కోరుకునే సుస్థిర వాతావరణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థ నాయకత్వం కారణంగా సమ్మిట్‌లో అనూహ్యరీతిలో పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు కోరుకునే సుస్థిర విధానాలు, ఆహ్లాదకరమైన వాతావరణం రాష్ట్రంలో ఉంది. ఏపీలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైనందుకు ఆనందంగా ఉంది. పెట్టుబడుల్ని క్రమంగా ఇక్కడ విస్తరిస్తాం. నాణ్యమైన మానవ వనరులను అందించడం, పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడంలో రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉంది. ఏ సమస్య వచ్చినా ఉన్నతాధికారులు సత్వరమే స్పందించి పరిష్కరిస్తున్నారు. ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్న చేతల ప్రభుత్వం ఏపీలో ఉన్నందున నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టవచ్చు. – సంతానం, సెయింట్ గోబెన్ సీఈవో 96 సేవలు ఒకే చోట ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. కొత్తగా వచ్చే పరిశ్రమలకు 21 రోజుల్లో అన్ని అనుమతులను మంజూరు చేస్తున్నాం. 24 ప్రభుత్వ శాఖలకు చెందిన 96 సేవల్ని ఒకే చోట చేర్చి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులను మంజూరు చేస్తున్నాం. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ప్రతి సంస్థకు పూర్తి స్థాయి మద్దతిస్తూ ప్రతి విషయంలోనూ సహకరిస్తాం. – డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెండేళ్లలో రూ.రెండు వేల కోట్లు కోవిడ్ తర్వాత ఫార్మా రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. భారత్‌ను ఫార్మా స్యూటికల్ రంగంలో భాగస్వామిగా చేసుకునేందుకు అనేక దేశాలు పోటీ పడుతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. ఇప్పటికే ఫార్మా రంగంలో ఏపీ తనదైన ముద్ర వేసింది. ఇక్కడి పర్యావరణ వ్యవస్థ ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అనుకూలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, చూపిస్తున్న చొరవ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారం కారణంగా ఏపీ వైపు చూస్తున్నాం. రాబోయే రెండేళ్లలో ఏపీలో రూ.2 వేల కోట్లు పెట్టుబడులు పెడతాం. దీని ద్వారా కనీసం 3,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – వంశీకృష్ణ, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ -
నైపుణ్య మానవ వనరులకు ఏపీ చిరునామా
సాక్షి, విశాఖపట్నం: ‘ఆంధ్రప్రదేశ్‌లో సమృద్ధిగా సహజ వనరులున్నాయి.. సన్నద్ధంగా నైపుణ్య మానవవనరులు ఉన్నాయి.. నైపుణ్యవనరులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిరునామాగా నిలుస్తుంది..’ అని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఎస్ఐ)లో రెండోరోజు శనివారం ఆరు సెక్టార్లలో సెమినార్లు నిర్వహించారు. వీటిలో ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్, ఫార్మాస్యూటికల్ అండ్ లైఫ్‌సైన్సెస్, పెట్రోలియం–పెట్రోకెమికల్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, హయ్యర్ ఎడ్యుకేషన్, టెక్స్టైల్స్ రంగాల్లో సెమినార్లు నిర్వహించారు. పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లకు ఏపీ ప్రభుత్వం అందించే అవకాశాలతో పాటు ఇక్కడ సమృద్ధిగా ఉన్న వనరులు, నైపుణ్యం కలిగిన యువత, పుష్కలంగా నీటివనరులు, నిరంతర విద్యుత్ సరఫరా, విస్తారంగా భూమి లభ్యత గురించి ఆయన వివరించారు. స్కిల్లింగ్ ఏపీ ఫర్ సర్వింగ్ గ్లోబల్ ఎకానమీ సదస్సు సెమినార్ హాల్లో జరుగుతున్న ప్యానల్ డిస్కషన్లో ముఖ్య అతిథిగా మంత్రి బుగ్గన హాజరయ్యారు. నైపుణ్యశాఖ ముఖ్య కార్యదర్శి సౌరభ్ గౌర్ అధ్యక్షతన ‘స్కిల్లింగ్ ఏపీ ఫర్ సర్వింగ్ గ్లోబల్ ఎకానమీ’ అనే అంశంపై వారు చర్చించారు. టాటా స్టైవ్, సీఈవో అనితా రాజన్, ఈడీ4ఆల్ చైర్మన్ సంజయ్ విశ్వనాథన్, బెస్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకుడు భరత్‌లాల్ మీనా ఐఏఎస్ (విశ్రాంత), నాస్కమ్ ఫ్యూచర్ స్కిల్స్ సీఈవో కీర్తి సేథ్, సునీల్ దహియా (మాడరేటర్), నైపుణ్యాభివద్ధి, శిక్షణసంస్థ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి చర్చలో పాల్గొన్నారు. ముందుగా సౌరభ్ గౌర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 175 స్కిల్ హబ్‌లు, 26 స్కిల్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీ, 55 స్కిల్ స్పోక్ ట్రైనింగ్ సెంటర్లు, స్కిల్ ఇంటర్నేషనల్ ఎకోసిస్టం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,87,932 మందికి నిరుద్యోగులకు స్కిల్ ట్రైనింగ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. 100కిపైగా జాబ్‌మేళాలు, 1,030 పూల్ డ్రైవ్స్ నిర్వహించినట్లు తెలిపారు. సీఎం ఎక్సలెన్స్ సెంటర్ల ద్వారా 102 ఇంజినీరింగ్ కాలేజీల్లో 1.72 లక్షల మందికి ట్రైనింగ్, ఎంప్లాయిబిలిటీ స్కిల్ సెంటర్ల ద్వారా 498 డిగ్రీ, పీజీ కాలేజీల్లో 2.27 లక్షలమందికి నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. స్కిల్స్ స్పోక్స్–ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్‌లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలనేది ఎంవోయూలో ప్రధానంగా ఉందన్నారు. ఇప్పటివరకు 21,411 మందికి శిక్షణ ఇచ్చామని, వీరిలో 18,043 మందికి ప్లేస్మెంట్ కల్పించామని చెప్పారు. ఏపీఎస్ఎస్డీసీ రంగంలో 40 ఎంవోయూలు టాటా స్టైవ్, ఈడీ4ఆల్, సాని భారత్, ద టైమ్స్ గ్రూప్, జేబీఎం గ్రూప్, జేసీబీ ఇండియా లిమిటెడ్, ప్రకార్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఆరెంజ్ క్రాస్, ఎకొహమా ఇండియా, గ్రీన్కో గ్రూప్, ఈ–ప్యాక్ కాంపోనెట్స్, డైకిన్ ఇండియా, స్కైదర్ ఎలక్ట్రిక్, వింగ్‌టెక్ ఇండియా, బొల్లినేని మెడ్‌స్కిల్స్, అపోలో మెడ్‌స్కిల్స్, ఎడ్యునెట్ ఫౌండేషన్, విహాన్ ఎలక్ట్రిక్స్, టెక్నోడోమ్ ఇండియా, రమ్యశ్రీ ఎలక్ట్రికల్ ఆటోమేషన్, ఇండస్ ఇన్ఫోటెక్, బ్రాండెక్స్, నాస్కోమ్ ప్యూచర్ స్కిల్స్, లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్, కాపిటల్ గూడ్స్ స్కిల్ కౌన్సిల్, కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ సెక్టార్ స్కిల్ ఇండియా, ఆటోమేటివ్ సెక్టార్, డొమెస్టిక్ వర్కర్స్ సెక్టార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్, లెథర్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, హైడోకార్బన్, టెక్సటైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ తదితర సంస్థలు ఏపీఎస్ఎస్డీసీ రంగంలో 40 ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఎంవోయూలను మంత్రి బుగ్గన చేతుల మీదుగా అందజేశారు. -
లక్ష్యాన్ని మించి పెట్టుబడులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం.. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించటమే ప్రధాన లక్ష్యంగా రెండు రోజుల పాటు నిర్వహించిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ –2023’ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని భావించినా, సీఎం జగన్ నాయకత్వంలో లక్ష్యాన్ని మించి రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతోనే ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని చెప్పారు. జీఐఎస్ సదస్సు ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సదస్సు ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించామని చెప్పారు. ఫలితంగా సుమారు 378 ఎంవోయూలు జరిగాయన్నారు. ఈ సదస్సులో 48 దేశాలకు చెందిన 100 మంది వరకు వివిధ అంశాలపై చర్చించారని చెప్పారు. ఈయూ కూటమి దేశాల నుంచి అధిక సంఖ్యలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారన్నారు. 40 దేశాలకు చెందిన 595 మంది ప్రతినిధులు వర్చువల్‌గా పాల్గొన్నారని తెలిపారు. ప్రభుత్వ పని తీరుపై కేంద్ర మంత్రులు, కార్పొరేట్ ప్రముఖులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి , పరిశ్రమల శాఖ డైరెక్టర్ డా.జి.సృజన, సమాచార శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బ్రాండ్ భరోసా
(విశాఖ జీఐఎస్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : విశ్వసనీయత, భరోసాకు నిదర్శనంగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరే రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి బ్రాండ్‌గా మారింది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలిచింది. ముఖ్యమంత్రి జగన్ తానే స్వయంగా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారి పారిశ్రామిక సెన్సెక్స్‌లో రాష్ట్ర సూచీని ఉవ్వెత్తున ఎగసేలా చేశారు. ఒక్క పేరు కల్పించిన విశ్వాసంతో దిగ్గజ పారిశ్రామికవేత్తలు ప్రత్యేకంగా విశాఖ సమ్మిట్‌కు హాజరయ్యారు. విశాఖలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 వేదికగా అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. సత్వర నిర్ణయాలు, సమర్థ నాయకత్వం జీఐఎస్ 2023 సదస్సును విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ.13,41,734 కోట్లకుపైగా పెట్టుబడులను సాధించడం ద్వారా పారిశ్రామిక వర్గాల్లో నమ్మకాన్ని రుజువు చేసుకుంది. ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఎంతో కాలయాపన తరువాతగానీ నిర్ణయం తీసుకోని అగ్ర పారిశ్రామికవేత్తలు సైతం ఏపీలో పెట్టుబడుల విషయంలో మీనమేషాలు లెక్కించలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై సత్వరం సానుకూలంగా స్పందించి ఏకంగా 20 రంగాల్లో 378 పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ సమర్థ నాయకత్వం ఉందన్న నమ్మకమే దీనికి కారణం. విశ్వసనీయత, సమర్థత, సత్వర నిర్ణయాలకు సీఎం జగన్‌ను ప్రతీకగా పారిశ్రామికవేత్తలు గుర్తించారు. కోవిడ్ సమయంలో పరిశ్రమలకు అండగా నిలవడంతోపాటు గత మూడున్నరేళ్లుగా రాష్ట్రం సాధించిన వృద్ధిని కూడా వారు పరిగణలోకి తీసుకున్నారు. కోవిడ్‌లో కాపాడిన సంక్షేమం కోవిడ్ ప్రతికూల పరిస్థితులను దీటుగా ఎదురొడ్డి మరీ ఆంధ్రప్రదేశ్ 2021–22లో 11.43 శాతం వృద్ధి రేటు సాధించడం సాధారణ విషయం కాదు. గత మూడేళ్లలో ఎగుమతుల్లో సగటు వార్షిక వృద్ధిరేటు 9.3 శాతంగా నమోదైంది. సులభతర వాణిజ్య విధానాల్లో దేశంలోనే మొదటిస్థానంలో ఉంది. ఈ విజయాలన్నీ ముఖ్యమంత్రి జగన్ దక్షత, రాష్ట్ర అభివృద్ధి పట్ల నిబద్ధతకు నిదర్శనంగా పారిశ్రామికవేత్తలు గుర్తించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల విపక్షాలు ఎంత బురద చల్లుతున్నా కరోనా గడ్డు కాలంలో రాష్ట్ర ప్రజల కొనుగోలు శక్తిని నిలబెట్టింది అవేనని పారిశ్రామికవేత్తలు గుర్తించారు. అంత సమర్థ నాయకత్వం ఉన్నందువల్లే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమై ముందుకొచ్చారు. తీరం.. మనకు వరంలా ఇక అతి పొడవైన తీర ప్రాంతం రాష్ట్రానికే ఉందని గత పాలకులు చెప్పటమే కానీ సద్వినియోగం చేసుకున్న దాఖలాలు లేవు. ఇందుకు భిన్నంగా తీర ప్రాంతాన్ని రాష్ట్ర ప్రగతికి చుక్కానిగా మలచుకోవాలని విధానపరమైన నిర్ణయం తీసుకుంది సీఎం వైఎస్ జగన్ మాత్రమే. అందుకే ఇప్పటికే నిర్వహణలో ఉన్న ఆరు పోర్టులతోపాటు కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పలుమార్లు చర్చించి పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానించేందుకు రూ.20 వేల కోట్ల రహదారి ప్రాజెక్టులను మంజూరు చేయించడంలో విజయం సాధించారు. కార్యనిర్వాహక రాజధాని కానున్న విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు ఆరులేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. తద్వారా ఏపీని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో సీఎం జగన్ అతి పెద్ద ముందడుగు వేశారు. ఆ పోర్టులు, పారిశ్రామిక కారిడార్ల పరిధిలో భారీ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించగలిగారు. దీంతో రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం అమాంతం మారిపోనుంది. ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యువతకు స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా రాచబాట పరిచారు. దార్శనికత చాటిన దూరదృష్టి మారిన పరిణామాల నేపథ్యంలో యావత్ ప్రపంచం దృష్టి కర్బన ఉద్గారాలను తగ్గించడం, కాలుష్య నియంత్రణ మీదే ప్రధానంగా ఉన్నట్లు సీఎం జగన్ గుర్తించారు. భవిష్యత్ అంతా పునరుత్పాదక ఇంధన వనరుల రంగానిదేనని స్పష్టం కావడంతో ఆ దిశగా రాష్ట్రంలో వనరుల సద్వినియోగంపై దృష్టి సారించారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించారు. అందుకే ఇంధన రంగంలో రికార్డు స్థాయిలో రూ.9,57,139 కోట్ల మేర పెట్టుబడుల వరద పారింది. సగం విజయం ముందుగానే.. ఆంధ్రప్రదేశ్‌లో అపార సహజ వనరులున్నా గతంలో ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రాలేదు. రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ పరిణామాలను ముందుగానే అంచనా వేయడం ద్వారా 50 శాతం లక్ష్యాన్ని సాధించారు. అందుకనుగుణంగా రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక రూపొందించి మిగిలిన 50 శాతం లక్ష్యాన్ని చకచకా పూర్తి చేశారు. ఆ ఒక్క మాట... ఆ ఒక్క నిర్ణయం జీఐఎస్ వేదికగా ముఖ్యమంత్రి జగన్ చెప్పిన రెండు మాటలు యావత్ పారిశ్రామిక ప్రపంచానికి భరోసానిచ్చాయి. ఎంవోయూల మేరకు పరిశ్రమల స్థాపనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తనకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు పరిష్కరిస్తానని స్పష్టమైన హామీనిచ్చారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి భరోసానివ్వలేదని పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక వేగంగా ఎంవోయూల సాకారానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంతో అత్యున్నత కమిటీని నియమిస్తున్నట్లు సీఎం జగన్ చేసిన ప్రకటన పెట్టుబడిదారుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించింది. అటు ముఖ్యమంత్రే స్వయంగా ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉండటం... ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి వారం పరిశ్రమల ఏర్పాటును పర్యవేక్షించనుండటం విధానపరంగా విప్లవాత్మక నిర్ణయాలనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సరైన గమ్య స్థానమన్న భావన దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల్లో స్థిరపడిపోయింది. ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులు టేకాఫ్ అందుకున్నాయని, ఇక రాష్ట్ర ప్రగతి ఉవ్వెత్తున దూసుకుపోవడం ఖాయమన్నది జీఐఎస్–2023 ద్వారా స్పష్టమైంది. -
పెట్టుబడుల సదస్సు సూపర్ హిట్
విశాఖ జీఐఎస్ వేదిక నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలోని అపారమైన అవకాశాలను వివరిస్తూ ‘అడ్వాంటేజ్ ఏపీ’ పేరుతో విశాఖపట్నంలో నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సూపర్ హిట్ అయ్యింది. దేశ, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజాలు ఒకే వేదికపైకి రావడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులను పెడుతూ ఒప్పందాలు చేసుకున్నారు. రెండు రోజుల సమావేశాలకు రిలయన్స్ గ్రూపు చైర్మన్ ముఖేష్ అంబానీతో పాటు కరణ్ అదానీ, జిందాల్, బంగూర్, ఒబెరాయ్, భజాంకా, దాల్మియా, మిట్టల్, జీఎం రావు, కృష్ణ ఎల్లా, అపోలో ప్రీతా రెడ్డి, సతీష్ రెడ్డి, బీవీఆర్ మోహన్ రెడ్డి, మసహిరో యమగుచి, టెస్లా కోఫౌండర్ మార్టిన్ ఎబర్‌హార్డ్ వంటి 30కిపైగా కార్పొరేట్ దిగ్గజాలు హాజరయ్యారు. అంబానీ మొదలు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్త వరకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చుకోవడమే కాకుండా అందులో భాగస్వామ్యమవుతామంటూ ప్రకటించారు. ఈ రెండు రోజుల సమావేశాల్లో 20 రంగాల నుంచి రూ.13,41,734 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 378 ఒప్పందాల ద్వారా రాష్ట్ర యువతకు ప్రత్యక్షంగా 6,09,868 ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గత ప్రభుత్వాల వలే ప్రచారం కోసం ఒప్పందాలు కుదుర్చుకొని వదిలేయకుండా వాటిని తక్షణం అమల్లోకి తీసుకువచ్చే విధంగా ముఖ్యమంత్రి.. సీఎస్ అధ్యక్షతన ఒప్పందాల పర్యవేక్షణ కమిటీ వేశారు. ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై ఒప్పందాల అమలు తీరు, అనుమతుల మంజూరు వంటి అంశాలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటుందని సీఎం ప్రకటించడంపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్థవంతమైన చర్చలు ఈ సమావేశాల సందర్భంగా 15 రంగాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఇందులో ఆయా రంగాలకు చెందిన 100 మందికిపైగా ప్రముఖ నిపుణులు పాల్గొని చర్చించారు. పలు దేశాల్లో ఉన్న పరస్పర పెట్టుబడుల అవకాశాలపై వియత్నాం, నెదర్లాండ్స్, యూఏఈ, వెస్ట్రన్ ఆస్ట్రేలియా దేశాలతో కంట్రీసెషన్స్ జరిగాయి. పలు దేశాలకు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలోని పెట్టుబడులు, ఉత్పత్తులు, ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టుల నిర్మాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా 137 స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి పేరుతో జిల్లాల వారీగా ఎగుమతులను ప్రోత్సహిస్తున్న ఉత్పత్తుల స్టాల్ విశేషంగా ఆకర్షించింది. 25 దేశాల నుంచి 46 మంది రాయబారులతో పాటు మొత్తం 14,000కు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. 14 యూనిట్లు ప్రారంభం రాష్ట్రంలో వాణిజ్యపరంగా ఉత్పత్తికి సిద్ధమైన 14 యూనిట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శర్బానంద సోనోవాల్ సమక్షంలో వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ యూనిట్ల ప్రారంభం ద్వారా రూ.3,841 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపంలోకి రావడమే కాకుండా 9,108 మందికి ఉపాధి లభించనుంది. క్లింబెర్లీ క్లార్క్, బ్లూస్టార్, అంబర్, హావెల్స్, ఎక్సలెంట్ ఫార్మా, ఎన్జీసీ టాన్స్‌మిషన్స్, చార్ట్ ఇండస్ట్రీస్, లారస్ ల్యాబ్, అమరా లైఫ్, శారదా ఫెర్రో అల్లాయిస్, విన్‌విన్ స్పెషాలిటీ, ఏవోవీ ఆగ్రో ఫుడ్స్, ఎస్‌హెచ్ ఫుడ్, అవేరా కంపెనీలున్నాయి. -
వాస్తవం ఆవిష్కృతం
విశాఖ జీఐఎస్ వేదిక నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్న విధంగా వాస్తవ పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించింది. గత సర్కారు హయాంలో మాదిరిగా పెట్టుబడుల సదస్సు పేరిట హంగు, ఆర్భాటాలు కాకుండా దేశ, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను ఇనుమడింప చేసింది. టీడీపీ అధికారంలో ఉండగా సదస్సుకు ఊరు పేరు తెలియని సంస్థలు, డ్రైవర్లను తరలించి సూటు బూటు వేసి భారీ సంఖ్యలో ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం చేసుకుంది. నాడు చంద్రబాబు సర్కారు నాలుగు సమ్మిట్స్ ద్వారా రూ.18 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం చేసుకోగా కనీసం పది శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదు. తొలిసారిగా అంబానీ రాక రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను రప్పించడం, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా తాజాగా నిర్వహించిన విశాఖ సదస్సుకు రిలయన్స్, అదానీ, జేఎస్‌డబ్ల్యూ, జిందాల్, ఒబెరాయ్, దాల్మియా, బంగర్, బజాంకా తదితర పారిశ్రామిక దిగ్గజాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి పెట్టుబడుల ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. చంద్రబాబు హయాంలో నిర్వహించిన సదస్సులకు నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ముఖేష్ అంబానీ హాజరు కాకపోవడం గమనార్హం. దక్షిణాదిలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ పెట్టుబడుల సమావేశానికి ఆయన హాజరైన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన పెట్టుబడుల సమావేశానికి భారీ సంఖ్యలో పారిశ్రామిక దిగ్గజాలు హాజరు కావడం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై కార్పొరేట్ల నమ్మకానికి నిదర్శనమని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. దుష్ప్రచారానికి చెంపపెట్టులా సదస్సు విశాఖ సమ్మిట్ ద్వారా ఒక్క సమావేశంతో రికార్డు స్థాయిలో రూ.13.4 లక్షల కోట్లకుపైగా విలువైన పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఒప్పందం చేసుకున్న కంపెనీలన్నీ అంతర్జాతీయంగా పేరు పొందినవే. థర్మల్ పవర్ నుంచి గ్రీన్ ఎనర్జీ రంగంలోకి అడుగుపెట్టిన కేంద్ర ప్రభుత్వ రంగ నవరత్న కంపెనీ ఎన్టీపీసీ అందుకు రాష్ట్రాన్ని వేదికగా చేసుకుని రూ.2.35 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేలా మూడు ఒప్పందాలను కుదుర్చుకుంది. రిలయన్స్, ఏబీసీ, జేఎస్‌డబ్ల్యూ ఆదిత్య బిర్లా, జిందాల్, ఫ్యూచర్, అదానీ, ఐవోసీఎల్ , అరబిందో, హీరో తదితర దిగ్గజ కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై ఓ వర్గం మీడియా తరచూ చేస్తున్న దుష్ప్రచారానికి తాజా సదస్సు చెంపపెట్టు లాంటిదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సదస్సులకు గతంలో ఒకరిద్దరు మాత్రమే ప్రముఖులు హాజరయ్యే వారని అలాంటిది ఈసారి ఇంతమంది కార్పొరేట్ దిగ్గజాలు ఒకేసారి రావటాన్ని నమ్మలేకపోతున్నామని సమావేశానికి హాజరైన ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఒకరు పేర్కొన్నారు. కార్యాచరణ ప్రారంభం కేవలం పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుని వదిలేయడం కాకుండా అమల్లోకి తెస్తూ కార్యాచరణను సైతం రాష్ట్రం ప్రభుత్వం వెంటనే ప్రారంభించింది. ఒప్పందాలను వేగంగా వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీని నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. త్వరగా కార్యరూపం దాల్చే ఒప్పందాలకు ఎర్లీబర్డ్ రాయితీలు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఆరోగ్య రంగంలో ఆదర్శ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ద్వారా పెట్టుబడులకు ఏపీ అత్యంత అనువైన ప్రాంతంగా మారింది. హెల్త్‌కేర్ విభాగంలో దేశానికి ఆదర్శంగా నిలిచే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. పారిశ్రామికంగానే కాకుండా రాష్ట్రం సామాజికంగా పురోగమించడంలో సీఎం జగన్ చేస్తున్న కృషి అభినందనీయం. విశాఖ మరింతగా ఎదుగుతుంది. విశాఖలో మాకు 5 ఫార్ములేషన్ యూనిట్లు, రెండు బల్క్ డ్రగ్ యూనిట్లు ఉన్నాయి. మున్ముందు కూడా పెట్టుబడులను కొనసాగిస్తాం. – డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీష్‌రెడ్డి రెండేళ్లలో రూ.2 వేల కోట్లు ఇప్పటికే ఫార్మా రంగంలో ఏపీ తనదైన ముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, సీఎం జగన్ సహకారం వల్ల ఏపీ వైపు చూస్తున్నాం. రాబోయే రెండేళ్లలో ఏపీలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెడతాం. దీని ద్వారా కనీసం 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. – వంశీకృష్ణ బండి, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ ‘అపాచీ’ మరో 100 మిలియన్ డాలర్లు అపాచీకి చైనా, భారత్, వియత్నాంలో ప్లాంట్లు ఉండగా ఏపీ ప్లాంటే అతి పెద్దది. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నాం. ఇప్పటికే 100 మిలియన్ డాలర్లు వెచ్చించాం. మరో 100 మిలియన్ డాలర్ల (రూ. 820 కోట్లు) పెట్టుబడుల కోసం ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. తద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వ విధానాల వల్ల వ్యాపారాల నిర్వహణ సులభతరంగా మారిందనడానికి మా సంస్థే ఉదాహరణ. – అపాచీ ఇండియా డైరెక్టర్ సెర్గియో లీ ‘దివీస్’ రెండు కొత్త ప్లాంట్లు రాష్ట్రంలో మరో రెండు యూనిట్లు నెలకొల్పబోతున్నాం. రూ.780 కోట్ల ప్రతిపాదన ఆమోదం పొందగా.. మరో రూ.700 కోట్ల ప్రతిపాదనలకు సంబం ధించి ఒప్పందం కుదుర్చుకున్నాం. దీంతో అదనంగా 22 వేల ఉద్యోగాల కల్పన జరగనుంది. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయి. – దివీస్ వైస్ ప్రెసిడెంట్ మధుబాబు -
పారిశ్రామిక హబ్‌గా ఏపీ
రాష్ట్రంలో పెట్టుబడులను మరింతగా పెంచేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. పారిశ్రామిక, వ్యాపారవేత్తలు నిర్వహించే కార్యకలాపాలకు మా ప్రభుత్వ మద్దతు, సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది. మీతో బంధం మాకు చాలా విలువైనది. రెండు రోజుల ఈ సదస్సు రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మరింత సానుకూల వాతావరణం కల్పించడానికి అద్భుతంగా దోహదపడుతుంది. పారిశ్రామికీకరణ దిశగా ప్రయత్నాలకు రెట్టింపు ప్రోత్సాహాన్నిస్తుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ జీఐఎస్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులకు రాష్ట్రాన్ని ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలుపుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల వృద్ధికి కృతనిశ్చయంతో ఉన్న తమ ప్రభుత్వం.. అందుకు అవసరమైన మౌలిక వసతులు, ఇతర సదుపాయాలు కల్పిస్తుందని పారిశ్రామికవేత్తలకు భరోసానిచ్చారు. కరోనా ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి మూడున్నరేళ్లలో ఆర్థికాభివృద్ధి సాధించడం తమ ప్రభుత్వ ఘనత అని చెప్పారు. కీలక సమయంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కుదిరిన 378 ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు. తద్వారా రాష్ట్రంలో 6.09 లక్షల మందికి ఉద్యోగాలు లభించనుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాల మేరకు పరిశ్రమలను స్థాపించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023’ రెండో రోజు శనివారం ముగింపు సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమ్మిట్‌ను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తద్వారా తన ఆత్మవిశ్వాసం, ఉత్సాహం రెట్టింపు అయిందని చెప్పారు. ఈ సమ్మిట్‌లో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. మూడున్నరేళ్లలో పుంజుకున్న ఆర్థిక వ్యవస్థ ♦ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ శరవేగంతో పుంజుకుంది. కోవిడ్ మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా మా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అనేక రంగాలకు ప్రోత్సాహాన్నిచ్చింది. ♦ మా సుపరిపాలన విధానాలు ఆర్థిక వ్యవస్థకు రక్షణగా నిలిచాయి. ద్రవ్యలోటు నియంత్రణలో ఉండేలా చేశాయి. తద్వారా వ్యాపారాలు ప్రమాదంలో పడకుండా మా ప్రభుత్వం చూసింది. కోవిడ్ సమయంలో అత్యంత జాగురూకతతో వ్యవహరించి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు మరింత సానుకూల వాతావరణం కల్పించేందుకు ఒక నిర్దిష్ట మార్గాన్ని ఏర్పాటు చేశాం. మౌలిక సదుపాయాల వ్యవస్థను బలోపేతం చేశాం. ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించి యువతలో నైపుణ్యాలను మరింతగా పెంపొందించాం. పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా ఏపీ ♦ అత్యంత కీలక సమయంలో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను నిర్వహించాం. దేశ, విదేశీ పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను అనుకూల గమ్యస్థానంగా నిలపడంలో ఈ సమ్మిట్ విజయం సాధించింది. వివిధ రంగాలపై 15 సెషన్లుగా నిర్వహించిన చర్చాగోష్టుల్లో 100 మందికి పైగా ప్రముఖులు, నిపుణులు మాట్లాడారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సానుకూల అంశాలేమిటో వివరించారు. ♦ ఆటోమొబైల్, ఈవీ సెక్టార్, హెల్త్ కేర్, మెడికల్ ఎక్విప్మెంట్, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, అగ్రి ప్రాసెసింగ్, టూరిజం తదితర రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను విశదీకరించారు. మరిన్ని రంగాల్లో మరిన్ని పెట్టుబడులకు అవకాశాలను అన్వేషించేందుకు యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, వెస్ట్రన్ ఆస్ట్రేలియాలను భాగస్వాములుగా చేసుకుని మరో నాలుగు సెషన్లు కూడా నిర్వహించాం. సమ్మిట్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎరీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ♦ ‘ఒక జిల్లా–ఒక ఉత్పత్తి’ అనే థీమ్‌తో 137 స్టాళ్లను ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశాం. సమ్మిట్ సందర్భంగా రెండు రోజులపాటు కేంద్ర మంత్రులు, విదేశీ ప్రతినిధులు, దౌత్యవేత్తలు, రాయబారులు, దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి చర్చలు జరపడం సంతోషంగా ఉంది. ఈ సమావేశాలన్నీ ఫలప్రదమయ్యాయి. పరిశ్రమల గ్రౌండింగ్‌కు కమిటీ ♦ పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకించి మా ప్రభుత్వం మీద మీరు చూపించిన నమ్మకానికి ధన్యవాదాలు. ఎంవోయూలు కుదుర్చుకున్న వారంతా త్వరగా రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలని కోరుతున్నాను. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటుంది. అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. ♦ పరిశ్రమలు స్థాపించేలా పర్యవేక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసే ఈ కమిటీలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై ఈ సదస్సులో కుదిరిన ఎంవోయూల అమలు దిశగా చర్యలు తీసుకుంటుంది. పరిశ్రమలు స్థాపించే క్రమంలో పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ఎంవోయూలు ఫలప్రదమయ్యేలా చూస్తుంది. మా సానుకూల దృక్పథానికి నిదర్శనం ♦ రూ.3,841 కోట్లతో స్థాపించిన 14 పారిశ్రామిక యూనిట్లను ఈ సమ్మిట్ వేదిక నుంచి ప్రారంభించాం. వాటితో 9,108 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కింబర్లే క్లార్క్, బ్లూస్టార్, క్లైమాటిక్, లారస్ ల్యాబ్, హేవెల్స్ ఇండియా, శారదా మెటల్స్, అల్లాయిస్ తదితర కంపెనీలు ఈ పెట్టుబడులు పెట్టాయి. ఈ కంపెనీలను ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నాను. ♦ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును సాకారం చేయడానికి, పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందించడంలో మా ప్రభుత్వ సానుకూల దృక్పథానికి ఈ రోజు ప్రారంభించిన ఈ పారిశ్రామిక యూనిట్లే నిదర్శనం. ఈ రోజు యూనిట్లు ప్రారంభించిన వారందరికీ శుభాకాంక్షలు. వారి పారిశ్రామిక కార్యకలాపాలు విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. సరైన మార్గ నిర్దేశం చేస్తాంపారిశ్రామికవేత్తలను ఆహ్వానించడమే కాకుండా, వారికి సరైన మార్గనిర్దేశం చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. నైపుణ్యవంతమైన మానవ వనరులను అందించే చక్కటి వాతావరణం ఇక్కడ కల్పిస్తున్నాం. వ్యాపారాల్లో ఉన్న నష్టతరమైన సంక్లిష్టతను తగ్గించడంతోపాటు ఎంవోయూల మేరకు ఆటంకాలు లేకుండా పరిశ్రమల స్థాపనకు ఇది దోహదపడుతుంది. 378 ఒప్పందాలు.. 13.41 లక్షల కోట్ల పెట్టుబడులు ♦రెండు రోజుల సదస్సులో రూ.13,41,734 కోట్ల విలువైన పెట్టుబడులతో 378 ఎంఓయూలు కుదిరాయి. ఈ ఒప్పందాల వల్ల మొత్తం 6,09,868 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఒక్క ఇంధన రంగంలోనే రూ.9,57,112 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 42 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాం. దాంతో 1,80,918 మందికి ఉద్యోగాలు వస్తాయి. ♦ఐటీ, ఐటీ ఆధారిత రంగాలకు సంబంధించి 82 ఒప్పందాలు చేసుకున్నాం. వీటి విలువ రూ.73,819 కోట్లు. దాంతో 1,40,002 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. పర్యాటక రంగానికి సంబంధించి 117 అవగాహన ఒప్పందాలు చేసుకున్నాం. వాటితో రూ.22,096 కోట్ల పెట్టుబడులు వస్తాయి. దాంతో 30,787 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రెండో రోజు సదస్సులో భాగంగా రూ.1.56 లక్షల కోట్ల పెట్టుబడులతో 286 ఎంఓయూలు చేసుకున్నాం. వీటి ద్వారా సుమారు 2.09 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ♦ పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగంలో భారీగా పెట్టుబడులు సాధించాం. గణనీయమైన పెట్టుబడులకు అవకాశాలున్న రంగాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ రంగం ప్రధానం. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి సంబంధించి మేం సాధిస్తున్న పెట్టుబడులు ఈ రంగంలో ఉన్న సమస్యను, సంక్లిష్టతను పరిష్కరిస్తాయి. శిలాజ ఇంధన ఆధారిత ఉత్పత్తికి విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ ఇంధన వనరులను చూపిస్తాయి. కర్బన రహిత లక్ష్యంగా గ్రీన్ ఎనర్జీ సాధన దిశగా మన దేశ లక్ష్య సాధనకు ఆంధ్రప్రదేశ్ తగిన సహకారం అందిస్తుంది. -
ఇంకా అనేక కంపెనీలు ఏపీకి వస్తాయి : ఎంపీ మిథున్ రెడ్డి
-
ఎంవోయూలు గ్రౌండింగ్.. సీఎస్ అధ్యక్షతన కమిటీ: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయ్యిందని, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఒకే వేదికపైకి రావడం మొదటిసారి అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రానికి 13 లక్షల 5వేల 663 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 6 లక్షల 3వేల 223 మందికి ఉపాధి లభించనుందన్నారు. ఎంవోయూలు గ్రౌండింగ్ అయ్యేలా సీఎస్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఎంవోయూ పారదర్శకంగా రూపొందిందన్నారు. కాగా, మునుపెన్నడూ చోటు చేసుకుని పరిణామానికి ఆంధ్రప్రదేశ్ వేదికైంది. పాలన రాజధాని విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ సూపర్ సక్సెస్ అయ్యింది. అడ్డగోలుగా విమర్శించే వాళ్ళ నోళ్లే.. అబ్బురపోయేలా పెట్టుబడుల ప్రవాహం రాష్ట్రానికి పోటెత్తింది. చదవండి: ఏపీకి పెట్టుబడుల వరద.. శాఖల వారీగా వివరాలు ఇలా.. -
AP Global Investors Summit రెండో రోజూ: వ్యాపార ప్రముఖుల ఫోటోలు
-
ఏపీకి పెట్టుబడుల వరద.. శాఖల వారీగా వివరాలు ఇలా..
సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో ఏపీకీ పెట్టుబడుల వరద పారింది. రెండు రోజుల్లో 13 లక్షల 5వేల 663 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 352 ఎంఓయూలు జరిగాయి. శాఖలవారీగా పెట్టుబడుల వివరాలు ఇలా.. ► ఎనర్జీ విభాగంలో రూ.9 లక్షల 7వేల 126 కోట్లు ► ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగంలో రూ.3లక్షల 35వేల 644 కోట్లు ► ఐటీ అండ్ ఐటీఈఎస్ విభాగంలో రూ.39వేల 636 కోట్లు ► పర్యాటక విభాగంలో రూ.22వేల 96కోట్లు ► వ్యవసాయ విభాగంలో రూ.1,160 కోట్లు ► పశుసంవర్ధక విభాగంలో రూ.1,020 కోట్లు జీఐఎస్ విజయానికి కృషి చేసిన వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 6లక్షల 3వేల 223 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. పారదర్శక పాలనతోనే విజయాలు సాధిస్తున్నామన్నారు. చదవండి: విశాఖ జీఐఎస్ సూపర్ సక్సెస్.. ఇండస్ట్రీస్ మ్యాప్‌లో ఏపీ సుప్రీం -
గ్లోబల్ సమ్మిట్ చాలా అద్భుతంగా జరిగింది : పీవీ సింధు
-
రాజధానిగా విశాఖ..! చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి
-
GIS: విశాఖ జీఐఎస్ సూపర్ సక్సెస్
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల్లో.. ప్రభుత్వంతో 352 ఎంవోయూలు. 13 లక్షల 5 వేల 663 కోట్ల పెట్టుబడులు.. 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి. అంచనాలను మించి అందుకున్న లక్ష్యం. దటీజ్ ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆయన చెప్తాడు.. చెప్పిందే చేతల్లో చూపిస్తాడు కూడా. విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ద్వారా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసుకున్నారాయన. మునుపెన్నడూ చోటు చేసుకుని పరిణామానికి ఆంధ్రప్రదేశ్ వేదికైంది. పాలన రాజధాని విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ సూపర్ సక్సెస్ అయ్యింది. అడ్డగోలుగా విమర్శించే వాళ్ళ నోళ్లే.. అబ్బురపోయేలా పెట్టుబడుల ప్రవాహం పోటెత్తింది రాష్ట్రానికి. ఇది రాష్ట్రాభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్ష నేతకు ఏమాత్రం సహించని పరిణామమే!. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సుకు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు ఇన్వెస్టర్లు. సదస్సులో భారీపెట్టుబడులకు ఆసక్తిక కనబరిచారు. ప్రభుత్వంతో కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొత్తంగా.. రాష్ట్రం దిశనే మార్చేసింది ఈ సదస్సు. విశాఖ తీరాన విప్లవాత్మకమైన నిర్ణయాలకు జీఐఎస్ ప్రాంగణం నెలవైంది. ఎనర్జీ విభాగంలో ఏకంగా రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగంలో రూ.3,35వేల కోట్లకు పైనే, ఐటీ అండ్ ఐటీఈఎస్ కేటగిరీలో 39 వేల కోట్ల రూపాయలపైనే, టూరిజంలో 22 వేల కోట్ల రూపాయలకుపైనే, వ్యవసాయ విభాగంలో వెయ్యి కోట్ల రూపాయలకుపైనే, పశుసంవర్థక విభాగంలో మరో వెయ్యి కోట్ల రూపాయలకుపైనే పెట్టుబడులు వచ్చాయి. -
నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించిన సీఎం జగన్
-
ఏపీ అభివృద్ధికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది
-
ఏపీకి పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి : కిషన్ రెడ్డి
-
ఏపీని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దుతున్నాం : సీఎం జగన్
-
విశాఖలాంటి నగరం ఉండటం ఏపీ అదృష్టం: సర్బానంద సోనోవాల్
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాలు రెండో రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు పోర్ట్స్ అండ్ షిప్పింగ్ కేంద్ర మంత్రిసర్బానంద సోనోవాల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. ‘జీఐఎస్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. దేశంలో విశాఖపట్నం ప్రత్యేక నగరంగా నిలిచింది. శతాబ్ధాలుగా భారతదేశంలో విశాఖ కీలకంగా ఉంది. విశాఖ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం. ఏపీ వేగంగా అభివృద్ధి చెందడానికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. విశాఖ పోర్టు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. విశాఖపట్నం చాలా అందమైన ప్రదేశం. విశాఖలాంటి నగరం ఉండటం ఏపీ అదృష్టం. భారత దేశ ప్రగతిలో ఏపీ కీలకం కానుంది’ అని కామెంట్స్ చేశారు. -
కీలక సమయంలో సదస్సు నిర్వహించాం: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడులు మరింత వృద్ధి చెందేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023’ రెండో రోజు సదస్సులో ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు. ‘‘పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు నిర్వహించే కార్యకలాపాలకు మా నుంచి చక్కటి మద్దతు, సహకారం ఉంటుందని, మీతో మా బంధం చాలా అమూల్యమైనది’’ అని సీఎం అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ♦గౌరవనీయులైన కేంద్ర మంత్రులు, వివిధ దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, రాష్ట్ర మంత్రివర్గంలోని నా సహచరులు, వ్యాపార ప్రముఖులు మరియు పారిశ్రామిక ప్రతినిధులు, అధికారులందరికీ నమస్సులు. ♦జీఐఎస్ విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సదస్సు ద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసం నన్ను ఉప్పొంగేలా చేసింది. ♦రాష్ట్రంలో పెట్టుబడులు మరింత వృద్ధిచెందేందుకు మేం కృత నిశ్చయంతో ఉన్నాం. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు నిర్వహించే కార్యకలాపాలకు మా నుంచి చక్కటి మద్దతు, సహకారం ఉంటుంది. మీతో మా బంధం చాలా అమూల్యమైనది. ♦రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మరింత సానుకూల వాతావరణం కల్పించడానికి రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలను రెట్టింపు చేయడానికి ఈ సదస్సు కల్పించిన వాతావరణం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ♦మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ శర వేగంతో తిరిగి పుంజుకుంది. కోవిడ్ మహమ్మారి విస్తరించి, ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైన పరిస్థితుల్లో కూడా అనేక రంగాలకు మా ప్రభుత్వం సమయాను కూలంగా ప్రోత్సాహం ఇచ్చింది. సుపరిపాలన, సమర్థవంతమైన విధానాలు ఆర్థిక వ్యవస్థకు రక్షణగా నిలవడమే కాకుండా ద్రవ్యలోటును నియంత్రణలో ఉంచింది. ♦అంతేకాకుండా వ్యాపారాలు ప్రమాదంలో పడకుండా చూసింది. ఇదే సమయంలో పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారస్తులకు మరింత సానుకూల వాతావరణాన్ని కల్పించడానికి కోవిడ్ సమయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాం. మౌలికసదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా, ఇంటర్నెట్, బ్రాడ్ బాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చి యువతలో నైపుణ్యాలను మరింత బలోపేతం చేశాం. ♦అత్యంత కీలక సమయంలో ఈ సదస్సును నిర్వహించాం. దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను రూపొందించడంలో ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక పాత్ర పోషించినందుకు చాలా సంతోషిస్తున్నాను. 15 సెషన్లు- 100 మంది వక్తలు.. ♦ఈ సదస్సులో భాగంగా వివిధ రంగాలపై 15 సెషన్లు నిర్వహించాం.100 మందికిపైగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను కున్న బలాలేంటో చెప్పారు. ఆటోమైబైల్– ఈవీ సెక్టార్, హెల్తకేర్– మెడికల్ ఎక్విప్మెంట్, రెన్యువబుల్‌ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్‌అమ్మెనియా, అగ్రి ప్రాససింగ్ మరియూ టూరిజం తదితర రంగాలు.. ఇందులో ఉన్నాయి. ♦ఆంధ్రప్రదేశ్‌తో సహకారంకోసం మరిన్ని అవకాశాలు అన్వేషించేందుకు యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, వెస్ట్రన్‌ఆస్ట్రేలియాలతో మరో నాలుగు సెషన్లు కూడా నిర్వహించాం. ♦సదస్సులో భాగంగా మేం పెట్టిన ఎగ్జిబిషన్‌ఎరీనా ప్రత్యేకంగా అందర్నీ ఆకట్టుకుంది. ఒక జిల్లా – ఒక ఉత్పత్తి ( ఒన్ డిస్ట్రిక్ట్ – ఒన్ ప్రొడక్ట్) థీమ్‌ఆధారంగా 137 స్టాళ్లను ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశాం. ♦గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా ఈరెండు రోజులపాటు కేంద్రం మంత్రులు, విదేశీ ప్రతినిధులు, దౌత్యవేత్తలు, రాయబారులు, దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి చర్చలు జరపడం సంతోషంగా ఉంది. ♦ఈ సమావేశాలన్నీ అత్యంత ఫలప్రదంగా సాగాయి. పెట్టబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపేందుకు మేం చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇవ్వడం సంతోషంగా ఉంది. 352 ఎంఓయూలు– రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంతో భాగస్వామ్యానికి సంబంధించి మేం చూపిన ధృఢమైన నిబద్ధత కారణంగా, సానుకూల వ్యాపార పరిస్థితులు కారణంగా ఈ రెండు రోజుల సదస్సులో రూ. 13,05,663 కోట్ల పెట్టుబడికి సంబంధించి 352 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటివల్ల 6,03,223 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎనర్జీ రంగంలోనే రూ.8.84 లక్షల పెట్టుబడులు... ఒక్క ఎనర్జీ రంగంలోనే రూ. 8,84,823 కోట్లకు సంబంధించి 40 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నాం. 1,90,268 మందికి దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి. ఐటీ రంగంలో... ఐటీ మరియు ఐటీఈ రంగానికి సంబంధించి 56 ఒప్పందాలను కుదర్చుకున్నాం. వీటి విలువ రూ.25,587 కోట్లు. 1,04,442 మందికి ఉద్యోగాలు వస్తాయి. టూరిజం రంగంలో 117 ఎంఓయూలు కుదుర్చుకున్నాం. రూ.22,096 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. తద్వారా 30,787 మందికి ఉద్యోగాలు వస్తాయి. రెన్యువబుల్ ఎనర్జీ– గణనీయంగా పెట్టుబడులు.. గణనీయమైన పెట్టుబడులకు అవకాశాలు ఉన్న రంగాల్లో ఒకటి రెన్యువబుల్‌ఎనర్జీని నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, పంప్డ్ స్టో్టరేజీ మరియు గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి సంబంధించి వస్తున్న పెట్టుబడులు పునరుత్పాదక శక్తికి సంబంధించిన క్లిష్టతలను పూర్తిగా తగ్గిస్తాయి. శిలాజ ఇంధన ఆధారిత ఉత్పత్తికి విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని చూపిస్తాయి. కర్బన రహిత లక్ష్యంగా, గ్రీన్ఎనర్జీ దిశగా అడుగులేస్తున్న భారత్‌కు తన లక్ష్యసాధనలో చక్కటి సహకారాన్ని అందిస్తాయి. మీ నమ్మకానికి ధన్యవాదాలు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంమీద, రాష్ట్ర ప్రభుత్వంమీద మీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు. ఎంఓయూలు కుదుర్చుకున్న వారంతా వీలైనంత త్వరగా తమ పెట్టబడులతో రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరుతున్నాను. దీనికోసం అన్నిరకాలుగా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది. మీ వ్యాపారాలు ప్రారంభించడానికి, పరిశ్రమలు పెట్టేందుకు వేగవంతంగా, ఎలాంటి అడ్డంకులు లేకుండా సదుపాయాలను కల్పిస్తుంది. వీటిని సాకారం చేసేందుకు ఒక మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాల అధికారులు, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై ఈ సదస్సులో కుదిరిన ఒప్పందాలు అమలు దిశగా కృషి చేస్తుంది. మీ రోజువారీ కార్యకలాపాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చిన వాటిని ఈ కమిటీ పరిష్కరిస్తూ.. ఈ పెట్టుబడులు ఫలప్రదమయ్యేలా ఆటంకాలు లేకుండా చూస్తుంది. సదస్సు వేదికగా రూ.3841 కోట్ల విలువైన 14 యూనిట్లు ప్రారంభం... ఈ సదస్సు వేదికగా ఇవాళ రూ.3841 కోట్ల విలువైన 14 పారిశ్రామిక యూనిట్లను ప్రారంభిస్తున్నాం. దీనివల్ల 9,108 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. కింబర్లే క్లార్క్, బ్లూస్టార్, క్లైమాటెక్, లారస్ ల్యాబ్, హేవెల్స్‌ఇండియా, శారదా మెటల్స్ మరియు అల్లాయిస్ తదితర కంపెనీలు ఈపెట్టుబడులను పెట్టాయి. ఈ కంపెనీలను ప్రారంభించుకోవడం గర్వకారణం. పరస్పర ప్రయోజనాల దిశగా.... రాష్ట్రంలో పెట్టుబడులను సాకారం చేయడం, మరియు పెట్టుబడులు పెట్టేవారికి సహకారం అందించడంలో మా ప్రభుత్వం ఆలోచనా దృక్పథానికి ఇవాళ ప్రారంభం అవుతున్న యూనిట్లు ప్రతిబింబంలా నిలుస్తాయి. ఇవాళ యూనిట్లు ప్రారంభిస్తున్న వారంతా మీ ప్రయాణాన్ని ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెట్టబడిదారులకు ఆహ్వానం పలకడమే కాదు, వారికి మార్గనిర్దేశం చేయడంలో, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంలో, నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించే చక్కటి వాతావరణం ఇక్కడ లభిస్తుంది. వ్యాపారాల్లో ఉండే నష్టతరమైన క్లిష్టతలను తగ్గించడంలో మరియు, మీ పెట్టుబడులను సమర్థవంతంగా అమలు చేయడంలో ఇది తోడ్పడుతుంది. దీనివల్ల పారిశ్రామిక, వ్యాపార వేత్తలుగా మీకేకాదు, రాష్ట్రానికి కూడా పరస్పర ప్రయోజనకరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మీరు నమ్మకాన్ని ఉంచి, ఈ సదస్సును అద్భుతంగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. -
ఏపీ ప్రభుత్వ సహకారం మరిచిపోలేనిది : సతీష్ రెడ్డి
-
విశాఖ రాజధాని.. కిషన్ రెడ్డి నోట ఆ మాట..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాలు రెండో రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఇక సమ్మిట్ కోసం విశాఖకు విచ్చేసిన కిషన్ రెడ్డి రాజధాని విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అభివృధ్ది చెందిన విశాఖలో.. జిల్లా కేంద్రంలో బీజేపీ ఎమ్మెల్సీగా మాధవ్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. అయితే, పార్టీ కోసం కిషన్ రెడ్డి పైవ్యాఖ్యలు చేసినప్పటికీ.. రాజధానిగా విశాఖను ధృవీకరిస్తూ చేసిన కామెంట్స్ ప్రముఖంగా నిలిచాయి. ఇక సదస్సు సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జీఐఎస్‌లో పాల్గొనడం సంతోషకరంగా ఉంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఏపీ సొంతం. ప్రతిభగల యువత ఏపీలో ఉన్నారు. ప్రపంచ ఆర్థికప్రగతిలో ఇండియా కీలకమని ఐఎంఎఫ్ ప్రకటించింది. దేశంలో అంతర్జాతీయ రహదారులు నిర్మిస్తున్నాం. పలు కీలక రంగాల్లో కనెక్టివిటీ బాగా పెరిగింది. నూతన భారత్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. 2025 నాటికి ఇండియాలో 250 యూనికార్న్ సంస్థలు ఉంటాయి. రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోంది. ఏపీకి పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సమాఖ్య స్పూర్తితో ఏపీకి అన్ని విధాలా సహకారం అందిస్తాం. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఏపీలో ఎంవోయూలు జరిగాయి. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలకు అభినందనలు. ఏపీ ప్రగతికి చిత్తశుద్ధితో కృషిచేస్తోన్న సీఎం జగన్‌కు అభినందనలు అంటూ ప్రశంసలు కురిపించారు. -
ఆర్థిక వ్యవస్థలో ఏపీ నంబర్ వన్
-
విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు: రెండో రోజు ఫొటోలు
-
సీఎం వైఎస్ జగన్ మాటల మనిషి కాదు..చేతల మనిషి : అమర్నాథ్
-
రెండో రోజు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
-
ఇన్నోవేషన్‌లో ఏపీ ఆదర్శనీయంగా ఉంది: రెడ్డీస్ ల్యాబ్ సతీష్ రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 కార్యక్రమాలు రెండో రోజు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. సమ్మిట్ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో పెట్టబోయే పెట్టుబడులను ప్రకటిస్తున్నారు. సమ్మిట్‌లో భాగంగా.. రెడ్డిస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ పెట్టుబడుల కేంద్రంగా మారింది. అంతర్జాతీయంగా ఫార్మా ఇండస్ట్రీ కీలక పాత్ర పోషిస్తోంది. ఏపీ ప్రభుత్వ సహకారం మరిచిపోలేనిది. ఏపీలో పరిశ్రమలకు అపార అవకాశాలున్నాయి. ఏపీలో పారిశ్రామిక విధానాల కారణంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. పరిశ్రమలకు అనుమతులు వెంటనే లభిస్తున్నాయి. ఇన్నోవేషన్‌లో ఏపీ ఆదర్శనీయంగా ఉంది. ఏపీలో సామాజిక సూచికలు విశిష్టంగా ఉన్నాయి. ఆరోగ్య రంగ ప్రగతి కోసం వైఎస్సార్ చేసిన కృషి అమోఘం అని అన్నారు. అవాడ గ్రూప్ ఛైర్మన్ వినిత్ మిట్టల్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీ కీలకంగా ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ కీలక పాత్ర పోషించబోతోంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ అప్రోచ్ అమోఘం. కర్బన రహిత పర్యావరణం కోసం ఏపీ కృషి చేస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది. నెంబర్ వన్‌గా నిలవడం సాధారణమైన విషయం కాదు. పారిశ్రామిక అనుకూల వాతావరణంవలనే ఏపీలో మా పెట్టుబడ్డులు పెట్టాం అని తెలిపారు. సెయింట్ గొబెయిన్ సీఈవో సంతానం మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ సమర్థతలో అసాధారణ రీతిలో పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు కోరుకునే సుస్థిరమైన విధానాలు ఏపీలో ఉన్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టినందుకు సంతోషంగా ఉంది. ఏపీలో మా పెట్టుబడులు విస్తారిస్తాం. ఏపీ ప్రభుత్వం నిబద్దతలో పనిచేస్తోంది. నాణ్యమైన మానవ వనరులు ఏపీలో తయారవుతున్నాయి. ఉన్నతాధికారులు సహకారం చక్కగా ఉంది. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నారు. ఏపీలో హామీలు నెరవేరుస్తున్న చేతల ప్రభుత్వం ఉంది. లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈవో సత్యనారాయణ చావా మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో ఏపీ పటిష్టంగా ఉంది. ఏపీలో ఎకో సిస్టమ్ బాగా ఉండటం వల్ల కంపెనీలు బలపడుతున్నాయి. ప్రపంచానికి కావాల్సిన కీలక డ్రగ్స్ ఏపీలో తయారవుతున్నాయి. ప్రసిద్ధి చెందిన ఫార్మా కంపెనీలన్నీ ఏపీలో పనిచేస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ప్రభుత్వానికి నా అభినందనలు. ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అనుమతులు లభిస్తున్నాయి. నోవా ఎయిర్ సీఈఓ అండ్ ఎండీ గజానన్ నాజర్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో ఏపీ నంబర్ వన్. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీకి సమర్ధవంతమైన నాయకత్వం ఉంది. రాష్ట్రంలో ప్రతిభగల అధికారులు ఉన్నారు. రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జోష్‌గా సాగింది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు సమ్యలను పరిష్కరిస్తున్నారు అని తెలిపారు. అపాచీ అండ్ హిల్‌టాప్ గ్రూప్ డైరెక్టర్ సెర్జియో లీ మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రగతి కోసం వైఎస్సార్ చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. మూడు దేశాల్లో అపాచీ గ్రూప్ కార్యాకలాపాలున్నాయి. సీఎం జగన్ విజనరీ లీడర్. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీలో డైనమిక్ సీఎం ఉండటంతోనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందన్నారు. -
జీఐఎస్ రెండో రోజు: ఏపీ సర్కార్ కీలక ఎంవోయూలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెట్టుబడుల ఆకర్షణ కోసం.. పరిపాలన రాజధాని విశాఖ వేదికగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 విజయవంతమైంది. సదస్సులో రెండో రోజైన శనివారం(మార్చి 4వ తేదీ) ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు(ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి పలు ప్రతిష్టాత్మక కంపెనీలు. దాదాపు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. వీటిలో.. రిలయన్స్ కంపెనీ 50వేల కోట్ల రూపాయలతో అగ్రగామిగా(ఇవాళ్టి ఒప్పందాల ప్రకారం) ఉంది. విశాఖ జీఐఎస్.. రెండోరోజు ఎంవోయూల జాబితా పరిశీలిస్తే.. ►రిలయన్స్ ఎంవోయూ రూ. 50,000 కోట్లు ►హెచ్‌పీసీఎల్ ఎనర్జీ ఎంవోయూరూ. 14, 320 కోట్లు ►టీవీఎస్ ఐఎల్పీ ఎంవోయూ రూ. 1,500 కోట్లు ►ఎకో స్టీల్ ఎంవోయూ రూ. 894 కోట్లు ►బ్లూస్టార్ ఎంవోయూ రూ. 890 కోట్లు ►ఎస్2పీ సోలార్ సిస్టమ్స్ ఎంవోయూ రూ. 850 కోట్లు ►గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్ ఎంవోయూ రూ. 800 కోట్లు ►ఎక్స్‌ప్రెస్ వెల్ రీసోర్సెస్ ఎంవోయూ రూ. 800 కోట్లు ►రామ్‌కో ఎంవోయూ రూ. 750 కోట్లు ►క్రిబ్కో గ్రీన్ ఎంవోయూ రూ. 725 కోట్లు ►ప్రకాశ్ ఫెరోస్ ఎంవోయూ రూ. 723 కోట్లు ►ప్రతిష్ట బిజినెస్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►తాజ్ గ్రూప్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►కింబర్లీ క్లార్క్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►అలియన్న్ టైర్ గ్రూప్ ఎంవోయూ రూ. 679 కోట్లు ►దాల్మియా ఎంవోయూ రూ. 650 కోట్లు ►అనా వొలియో ఎంవోయూ రూ. 650 కోట్లు ►డీఎక్స్ఎన్ ఎంవోయూ రూ. 600 కోట్లు ►ఈ-ప్యాక్ డ్యూరబుల్ ఎంవోయూ రూ. 550 కోట్లు ►నాట్ సొల్యూషన్న్ ఎంవోయూ రూ. 500 కోట్లు ►అకౌంటిఫై ఇంక్ ఎంవోయూ రూ. 488 కోట్లు ►కాంటినెంటల్ ఫుడ్ అండ్ బెవరేజీస్ ఎంవోయూ రూ. 400 కోట్లు ►నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంవోయూ రూ. 400 కోట్లు ►ఆటమ్‌స్టేట్ టెక్నాలజీస్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►క్లేరియన్ సర్వీసెస్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►చాంపియన్ లగ్జరీ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►వీఆర్‌ఎమ్ గ్రూప్ ఎంవోయూ రూ. 342 కోట్లు ►రివర్ బే గ్రూప్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►హావెల్స్ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు ►సూట్స్ కేర్ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు ►పోలో టవర్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►ఇండియా అసిస్ట్ ఇన్సైట్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►స్పార్క్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►టెక్ విషెన్ సాఫ్ట్వేర్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►మిస్టిక్ పామ్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►నియోలింక్ గ్రూప్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►ఎండానా ఎనర్జీస్ ఎంవోయూ రూ. 285 కోట్లు ►అబ్సింకా హోటల్స్ ఎంవోయూ రూ. 260 కోట్లు ►సర్ రే విలేజ్ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►హ్యాపీ వండర్లాండ్ రిసార్ట్స్ ఎంవోయూరూ. 250 కోట్లు ►చాంపియన్స్ యాచ్ క్లబ్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►టెక్నోజెన్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►పార్లె ఆగ్రో ఎంవోయూ రూ. 250 కోట్లు ►ఎకో అజైల్ రిసార్ట్ ఎంవోయూ రూ. 243 కోట్లు ►ఎల్జీ పాలిమర్స్ ఎంవోయూ రూ. 240 కోట్లు ►హైథియన్ హ్యూయన్ మిషనరీ ఎంవోయూ రూ. 230 కోట్లు ►గోకుల్ ఆగ్రో ఎంవోయూ రూ. 230 కోట్లు ►ఎస్పీఎస్ ఇన్ప్రా ఎంవోయూ రూ. 225 కోట్లు ►డీవీవీ బయో ఫ్యూయల్స్ ఎంవోయూ రూ. 223 కోట్లు ►దాల్వకోట్ బయో ఫ్యూయల్ప్ ఎంవోయూ రూ. 200 కోట్లు ►ఆమ్ కన్స్ట్రక్షన్స్ ఎంవోయూ రూ. 200 కోట్లు ►కేపిటల్ బిజినెస్ పార్క్ ఎంవోయూ రూ. 184 కోట్లు ►చాంయిన్ యాచ్ ఎంవోయూ రూ. 190 కోట్లు ►ఎన్జీసీ ట్రాన్స్మిషన్ ఎంవోయూ రూ. 185 కోట్లు ►యాక్సలెంట్ ఫార్మా సైన్స్ ఎంవోయూ రూ. 176 కోట్లు ►విన్‌విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ ఎంవోయూ రూ. 174 కోట్లు ►ట్రాన్సెండ్ రియాలిటీ డెవలప్మెంట్ ఎంవోయూ రూ. 165 కోట్లు ►చాంపియన్ ఇన్ఫ్రాటెక్ ఎంవోయూ రూ. 150 కోట్లు ►స్విచ్‌గేర్ ఎంవోయూ రూ. 150 కోట్లు ►ఆంబర్ ఎంటర్‌ప్రైజస్ ఇండియా ఎంవోయూ రూ. 150 కోట్లు ►ది రిప్పుల్స్ ఎంవోయూ రూ. 150 కోట్లుగా ఉన్నాయి. ఇక విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ వేదికగా తొలి రోజు కూడా ఏపీ ప్రభుత్వంతో కీలక ఎంవోయూలు కుదిరాయి. మొత్తం 92 ఎంవోయూలు జరిగాయి. వీటి విలువ రూ.11లక్షల 87 వేల 756 కోట్లు. వీటిలో ఎన్టీపీసీ రూ. 2..35లక్షల కోట్ల ఎంవోయూతో అగ్రగామిగా నిలిచింది. ఏబీసీ లిమిటెట్ (రూ. 1.20 లక్షల కోట్లు), రెన్యూ పవర్ (రూ. 97, 550 కోట్లు), ఇండోసాల్ (రూ. 76, 033 కోట్లు), ఏసీఎమ్ఈ (రూ. 68,976 కోట్లు), టీఈపీఎస్ఓఎల్ ( రూ. 65, 000 కోట్లు), జేఎస్‌డబ్యూ గ్రూప్(రూ. 50, 632 కోట్లు), హంచ్ వెంచర్స్(రూ. 50 వేల కోట్లు), అవాదా గ్రూప్( రూ 50 వేల కోట్లు) జాబితాలో అగ్రగామిగా ఉన్నాయి. ఇక రెండు రోజుల ఈ అవగాహన ఒప్పందాల ద్వారా ఏపీకి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సీఎం జగన్ చేసిన ప్రకటన.. కార్యరూపం దాల్చినట్లయ్యింది. మొత్తంగా 340 పెట్టుబడుల ప్రతిపాదనలు, 20 రంగాల్లో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఈ ఎంవోయూల ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. -
సీఎం జగన్ పై నమ్మకంతోనే సదస్సుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు హాజరు
-
సీఎం జగన్ సమర్థవంతమైన నాయకత్వం వల్లే భారీగా పెట్టుబడులు : మంత్రి రోజా
-
వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి సీఎం వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్
-
సీఎం జగన్ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు : అమర్నాథ్
-
విశాఖ అభివృద్ధిలో పోర్టుదే కీలక పాత్ర: చైర్మన్ కె రామ్మోహనరావు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు(జీఐఎస్) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సుకు దిగ్గజ పారిశ్రామిక వేత్తలు. ప్రముఖులు హాజరయ్యారు కూడా. ఈ సందర్భంగా సాక్షి టీవితో విశాఖ పోర్టు చైర్మన్ కే రామ్మోహన్రావు కాసేపు ముచ్చటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "ఏపీ పెట్టుబడులకు అనువైన రాష్ట్రం. ఏపీలో సహజ వనరుల తోపాటు తగినంతలో మానవ వనరులు కూడా ఉన్నాయి. సుదీర్ఘమైన కోస్తా తీర ప్రాంత ఏపీ సొంతం. గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు(జీఐఎస్)కి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు హాజరు కావడం ఎంతో శుభపరిణామం. ఏపీ ప్రభుత్వ విధానాల వల్లే లక్షల కోట్ల రూపాయాలు పెట్లుబడుల వచ్చాయాని సీఎం జగన్ ప్రభుత్వాన్ని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీలో మౌలిక సదుపాయాలు, రహదారులు, పోర్టులు అభివృద్ధిపై దృష్టి సారించడం వల్లే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. అంతేగాదు ఈ విశాఖపట్నం అభివృద్ధిలో పోర్టులదే కీలక పాత్ర. ఈ విశాఖ పోర్టు ఏర్పాటై సుమారు 90 ఏళ్లు అయ్యింది. ఈ పోర్టు ద్వారా రికార్డు స్థాయిలో 77 మిలియన్ల టన్నుల సరుకు రవాణ అయ్యింది. అంతేగాదు పెట్టుబడులకు విశాఖ నగరం అన్ని విధాల అనువైన నగరమే గాక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీనే అగ్రగామిగా ఉంది. ప్రస్తుతం ఈ పోర్టు నుంచి భోగాపురం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణ జరగబోతుంది. "అని చెప్పుకొచ్చారు. (చదవండి: ఎలాంటి సహకారానికైనా ఒక్క ఫోన్‌కాల్ దూరంలో: సీఎం జగన్) -
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్
-
‘ఏపీకి సీఎం జగనే బ్రాండ్ అంబాసిడర్’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని మంత్రి సీదిరి అప్పలరాజు అభివర్ణించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి వెల్లువెత్తుతున్న పెట్టుబడులను ఉద్దేశించి మంత్రి అప్పలరాజు శనివారం మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీకి బ్రాండ్ అంబాసిడర్. ఈ భారీ పెట్టుబడులు ఆయన ఛరిష్మాతోనే వచ్చాయి అని పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. అలాగే.. త్వరలో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారబోతోందన్న ఆయన.. అందులో భోగాపురం మీదుగా ఆరు లైన్ల హైవే ఏర్పాటు అభివృద్ధికి కీలకం కానుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. విశాఖపట్నం ఏయూ గ్రౌండ్ వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల పండుగగా వర్ణిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రెండో రోజూ కొనసాగుతోంది. -
జగన్ దార్శనికతే ఏపీ ప్రగతి దిక్సూచి
-
ఇండియాకే ఏపీ రోల్ మోడల్..!
-
అదానీ గ్రూప్ : మా టార్గెట్ ఇదే..
-
2500 మంది పోలీసులతో భద్రత
-
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2వ రోజు షెడ్యూల్..!
-
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు అనూహ్య స్పందన
-
విశాఖ జీఐఎస్: దిగ్గజ కంపెనీలతో ఏపీ ఎంవోయూలు (ఫొటోలు)
-
విశాఖ జీఐఎస్: వ్యాపార ప్రముఖులను సత్కరించిన సీఎం వైఎస్ జగన్(ఫొటోలు)
-
పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం: సోము వీర్రాజు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో నిర్వహిస్తున్న పెట్టుబడుల సదస్సును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వాగతించారు. పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం అంటూ వ్యాఖ్యలు చేశారు. సదస్సుపై శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం. ఇది విజయవంతమవుతుంది. రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వానికి కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. ప్రధాని నరేంద్రమోదీ నిబద్దతతో కూడిన ప్రయత్నాల కారణంగా నేడు దేశం అనుకూలమైన పారిశ్రామికవాతావరణాన్ని కలిగి ఉంది. విశాఖ వేదికగా చేసిన వాగ్దానాలు రాష్ట్ర అభివృద్ధికి దారితీస్తాయని ఆశిస్తున్నాం. నితిన్ గడ్కరీ హాజరు కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఎలా మద్దతు ఇస్తుందో చూపిస్తోంది’ అంటూ పేర్కొన్నారు. విశాఖలో పెట్టుబడుల సదస్సు రాష్ట్ర అభివృద్ధిలో శుభపరిణామం మరియు ఇది విజయవంతమవుతుంది. రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వానికి కేంద్రం నుండి అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. @narendramodi గారి నిబద్దతతో కూడిన ప్రయత్నాల కారణంగా నేడు దేశం అనుకూలమైన పారిశ్రామిక (1/2)@blsanthosh pic.twitter.com/TzmR5Cqrdz — Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) March 3, 2023 -
జగన్ దార్శనికతే ఏపీ ప్రగతి దిక్సూచి
(గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 ’ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): దేశీయ, అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామికవేత్తలు అంతా ఒకే వేదికపైకి వచ్చిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. అంతకుమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికత, కార్యదక్షతకు నిదర్శనంగా నిలిచింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, సరళతర వాణిజ్య విధానాలు ఎంతటి సత్ఫలితాలను అందిస్తున్నాయో ప్రపంచానికి చాటి చెప్పింది. సదస్సులో తొలి రోజు శుక్రవారం దాదాపు 20 మంది పారిశ్రామికవేత్తలు ప్రసంగించారు. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్‌లో సృష్టించిన పారిశ్రామిక అనుకూల వాతావరణం గురించి దిగ్గజ పారిశ్రామికవేత్తలు ప్రముఖంగా ప్రస్తావించారు. సీఎం వైఎస్ జగన్ యువ నాయకత్వం, దార్శనికతతోనే వృద్ధి రేటు, సులభతర వాణిజ్యంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ కొనియాడటం విశేషం. దక్షిణ భారత దేశంలో నిర్వహించిన ఓ పెట్టుబడుల సదస్సుకు ఆయన హాజరుకావడం ఇదే తొలిసారి. పారిశ్రామికాభివృద్ధిపట్ల సీఎం జగన్ స్పష్టమైన దృక్పథానికి ఆకర్షితుడయ్యే ఆయన ఈ సదస్సుకు హాజరయ్యారు. సహజ వనరులు, భౌగోళిక అనుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకత అని ఆదానీ పోర్ట్ – సెజ్ సీఈవో కరణ్ అదానీ చెప్పారు. దేశంలోనే రెండో అతిపెద్ద తీరరేఖ కలిగిన ఏపీలో పోర్టుల అభివృద్ధికి జగన్ ప్రణాళికలు ఇందుకు నిదర్శనమన్నారు. పారిశ్రామిక విధానం, పరిశ్రమల అనుకూల ఎకోసిస్టమ్ కల్పించేందుకు సమర్థంగా అమలు చేస్తున్న సింగిల్ విండో పాలసీ గురించి జేఎస్పీఎల్ గ్రూప్ చైర్మన్ నవీన్ జిందాల్ ప్రధానంగా ప్రస్తావించారు. సీఎం జగన్ దార్శనిక విధానాల ఫలితంగానే తమ గ్రూప్ ఏపీలో రూ.10 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. జీడీపీ వృద్ధి రేటులో దేశంలోనే అగ్రగామిగా నిలిపి సీఎం జగన్ ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చారన్నారు. సమర్థ నాయకుడు సంక్షోభం తలెత్తినప్పుడు సమర్థంగా వ్యవహరించడమే నాయకత్వ లక్షణమని కియా మోటార్స్‌కు చెందిన కబ్ డాంగ్లీ చెప్పారు. అలాంటి నాయకుడు జగన్ అని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగులు, ముడి సరుకును సురక్షితంగా తరలించడానికి సీఎం జగన్ సత్వరం సహకారం అందించడం ఇందుకు తార్కాణమన్నారు. మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధే ఆర్థికాభివృద్ధికి చోదక శక్తి అనే వాస్తవాన్ని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని సైయెంట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి కొనియాడారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, వైద్య–ఆరోగ్య రంగాలపై ఏపీ ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తుండటం దేశానికే ఆదర్శమన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎంవోయూల పేరుతో చేసిన కనికట్టు అందరికీ తెలిసిందే. ఛోటామోటా నేతలకు సూట్లు వేసి మరీ ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు ప్రజల్ని మోసం చేశారు. అందుకే చంద్రబాబు ప్రభుత్వంలో చేసుకున్న ఎంవోయూలలో 10 శాతం కూడా కార్యరూపం దాల్చలేదు. అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తూ పరిశ్రమల ఏర్పాటును స్వయంగా పర్యవేక్షిస్తుండటం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదే విషయాన్ని కెనాఫ్ సంస్థ సీఈవో సుమిత్ బిదానీ జీఐఎస్ సభా వేదిక మీదే చెప్పారు. 40 మిలియన్ డాలర్ల ప్రాథమిక పెట్టుబడితో దేశంలోనే అతి పెద్ద ప్లాంట్‌ను తాము ఏర్పాటు చేయడం కేవలం సీఎం జగన్ సహకారంతోనే సాధ్యమైందని ఆయన అన్నారు. ఒప్పందం జరిగిన 18 నెలల్లోనే ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇంతటి పారిశ్రామిక అనుకూలత అరుదు సీఎం జగన్ నిబద్ధత గురించి జపాన్‌కు చెందిన టోరే ఇండస్ట్రీస్ ఎండీ మసహిరో యమగుచి చెప్పిన విషయం అబ్బురపరిచింది. శ్రీ సిటీలో రూ.200 కోట్లతో తాము త్వరగా ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం 132 కేవీ విద్యుత్ లైన్‌ను ప్రత్యేకంగా వేయడాన్ని ఆయన ఉదహరించారు. ఇంతటి పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం ఉండటం చాలా అరుదని వ్యాఖ్యానించారు. సంప్రదాయేతర ఇంధన వనరులకు సీఎం జగన్ పెద్దపీట వేస్తుండటం ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్ పారిశ్రామిక పరిణామాలపై ఆయనకున్న ముందు చూపునకు నిదర్శనమని టెస్లా కంపెనీ కో ఫౌండర్ మార్టిన్ ఎబర్‌హార్డ్ తెలిపారు. శ్రీ సిమెంట్ చైర్మన్ హరిమోహన్ బంగర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిమెంట్ రంగంలో తాము ఈ కారణంగానే ఏపీలో పెట్టుబడులు పెడుతున్నామన్నాఉ. ఇప్పటికే రూ.3,000 కోట్లతో గుంటూరులో తాము ఏర్పాటు చేస్తున్న దేశంలోనే మొదటి గ్రీన్ సిమెంట్ ప్లాంట్ పనులు నడుస్తున్నాయని, త్వరలో మరో రూ.5,000 కోట్లు పెట్టుబడులతో 5 వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. అపారమైన సహజ వనరులు.. నైపుణ్యమైన మానవ వనరులు అభివృద్ధికి మూలం. కీలకమైన ఆ రెండింటినీ గరిష్ట స్థాయిలో సద్వినియోగం చేసుకునే సమర్థ నాయకత్వం ఉంటేనే ఆర్థికాభివృద్ధి సాధ్యం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపంలో అటువంటి సమర్థ నాయకత్వం లభించిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలవడం ఖాయం. వైఎస్ జగన్ దార్శనికతే ఏపీ ప్రగతికి దిక్సూచి. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 వేదికపై దిగ్గజ పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేసిన ఏకాభిప్రాయమిది. సీఎం జగన్‌ను చూసి గర్వపడుతున్నా.. పరిశ్రమల ఏర్పాటుకు సీఎం జగన్ ఎంత వేగంగా స్పందిస్తారో చెబుతూ సెంచురీ ప్లై చైర్మన్ సజ్జన్ భజాంకా చెప్పిన ఉదాహరణ ఆకట్టుకుంది. ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలి, అందుకోసం నోడల్ ఆఫీసర్ల నియామకంతోపాటు మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఏఏ మోడల్స్ ఉత్పత్తి చేయాలి తదితర అంశాలన్నీ ఒక్క సమావేశంలోనే కొలిక్కి వచ్చేశాయన్నారు. తాను పుట్టిన నేలకు దేశ, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలను తెచ్చిన సీఎం జగన్‌ను చూసి గర్విస్తున్నానని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు చెప్పారు. జె ఫర్ జగన్ కాస్త జె ఫర్ జోష్‌గా మారిందని దాల్మియా భారత్ గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా వ్యాఖ్యానించారు. -
జీఐఎస్ విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్
GIS-2023 Updates.. సీఎం వైఎస్ జగన్ ముగింపు ఉపన్యాసం ►రెండు రోజుల్లో 352 ఎంవోయూలు ►మొత్తం రూ. 13 లక్షల 5వేల 663 కోట్ల పెట్టుబడులు ► రూ. 6 లక్షల 3 వేల 223 మందికి ఉపాధి ►జీఐఎస్ విజయానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్ ►గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోంది కీలక సమయంలో సమ్మిట్ నిర్వహించాం ►ఏపీని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం ►15 కీలక రంగాల్లో ఫలవంతమైన చర్యలు జరిగాయి ►కరోనా సమయంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అండగా నిలిచాయి ►ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులో వేస్తోంది ►పారదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నాం ►కీలక సమయంలో సమ్మిట్ నిర్వహించాం ►పలు రంగాల్లో నాణ్యమైన పెట్టుబడులు ►గ్రీన్ ఎనర్జీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాం ►పారిశ్రామిక వేత్తలకు సంపూర్ణ సహకారం ►ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేలా ప్రభుత్వ సహకారం ►జీఐఎస్ విజయానికి కృషిచేసిన వారందరికీ కృతజ్ఞతలు ►నూతన పారిశ్రామిక యూనిట్లను ప్రారంభించిన సీఎం జగన్ ►బ్లూస్టార్ యూనిట్లను ప్రారంభించిన సీఎం జగన్ ►పోర్టులు, షిప్పింగ్శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. ‘జీఐఎస్ పాల్గొనడం సంతోషకరం. దేశంలో విశాఖ ప్రత్యేక నగరంగా నిలిచింది: విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం. శతాబ్దాలుగా భారత్‌లో విశాఖ కీలకంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ ఇండియా అభివృద్ధి. విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం. ఏపీ వేగంగా అభివృద్ధి చెందడానికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. విశాఖ పోర్టు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం’అని అన్నారు. ►కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ ఏపీకి పారిశ్రామిక అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జీఐఎస్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. దేశంలో అంతర్జాతీయ రహదారులు నిర్మిస్తున్నాం. ప్రపంచ ఆర్థికప్రగతిలో ఇండియా కీలకమని ఐఎంఎఫ్ ప్రకటించింది. ప్రతిభగల యువత ఏపీలో ఉంది. నైపుణ్యంగల మానవ వనరులు ఏపీ సొంతం’ అని పేర్కొన్నారు. ►భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర కె ఎల్లా మాట్లాడుతూ.. ‘ ఏపీ అభివృద్ధిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతిష్టాత్మకంగా భావించి జీవిఎస్ నిర్వహించారు.పలు కీలక రంగాల్లో ఏపీ ప్రగతి బాగుంది. సీఐఐకి దివంగత సీఎం వైఎస్సార్ సహకారం మరువలేనిది. ఏపీ పారిశ్రామిక ప్రగతికి సీఐఐ సహకారం సంపూర్ణంగా ఉంటుంది. అంతర్జాతీయ కంపెనీలు ఏపీ వైపు చూడటం ప్రశంసనీయం. ఇండియా ప్రగతిలో ఏపీ కీలక భాగస్వామి అవుతోంది. సమ్మిళిత వృద్ధి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారు’ అని ప్రశంసించారు. ► రెడ్డిస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏపీ పెట్టుబడుల కేంద్రంగా మారింది. అంతర్జాతీయంగా ఫార్మా ఇండస్ట్రీ కీలక పాత్ర పోషిస్తోంది. ఏపీ ప్రభుత్వ సహకారం మరిచిపోలేనిది. ఏపీలో పరిశ్రమలకు అపార అవకాశాలున్నాయి. ఏపీలో పారిశ్రామిక విధానాల కారణంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. పరిశ్రమలకు అనుమతులు వెంటనే లభిస్తున్నాయి. ఇన్నోవేషన్‌లో ఏపీ ఆదర్శనీయంగా ఉంది. ఏపీలో సామాజిక సూచికలు విశిష్టంగా ఉన్నాయి. ఆరోగ్య రంగ ప్రగతి కోసం వైఎస్సార్ చేసిన కృషి అమోఘం’ అని పేర్కొన్నారు. ► అపాచీ అండ్ హిల్‌టాప్ గ్రూప్ డైరెక్టర్ సెర్జియో లీ మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రగతి కోసం వైఎస్సార్ చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. మూడు దేశాల్లో అపాచీ గ్రూప్ కార్యాకలాపాలున్నాయి. సీఎం జగన్ విజనరీ లీడర్. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీలో డైనమిక్ సీఎం ఉండటంతోనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమైందన్నారు. ► సెయింట్ గొబెయిన్ సీఈవో సంతానం మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ సమర్థతలో అసాధారణ రీతిలో పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమలు కోరుకునే సుస్థిరమైన విధానాలు ఏపీలో ఉన్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టినందుకు సంతోషంగా ఉంది. ఏపీలో మా పెట్టుబడులు విస్తారిస్తాం. ఏపీ ప్రభుత్వం నిబద్దతలో పనిచేస్తోంది. నాణ్యమైన మానవ వనరులు ఏపీలో తయారవుతున్నాయి. ఉన్నతాధికారులు సహకారం చక్కగా ఉంది. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తున్నారు. ఏపీలో హామీలు నెరవేరుస్తున్న చేతల ప్రభుత్వం ఉంది. ► హెటిరో గ్రూప్ ఎండీ డాక్టర్ వంశీ కృష్ణ బండి మాట్లాడుతూ.. ప్రపంచ ఫార్మా రంగంలో ఏపీ కీలక ప్రాత పోషిస్తోంది. ఏపీలో ఫార్మా విధానాలతో ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతోంది. పరిశ్రమలకు ఏపీ సర్కార్ సహకారం అమోఘం అని అన్నారు. ► లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈవో సత్యనారాయణ చావా మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో ఏపీ పటిష్టంగా ఉంది. ఏపీలో ఎకో సిస్టమ్ బాగా ఉండటం వల్ల కంపెనీలు బలపడుతున్నాయి. ప్రపంచానికి కావాల్సిన కీలక డ్రగ్స్ ఏపీలో తయారవుతున్నాయి. ప్రసిద్ధి చెందిన ఫార్మా కంపెనీలన్నీ ఏపీలో పనిచేస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ప్రభుత్వానికి నా అభినందనలు. ఏపీలో ఇతర రాష్ట్రాల కంటే వేగంగా అనుమతులు లభిస్తున్నాయి. ► నోవా ఎయిర్ సీఈఓ అండ్ ఎండీ గజానన్ నాజర్ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థలో ఏపీ నంబర్ వన్. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీకి సమర్ధవంతమైన నాయకత్వం ఉంది. రాష్ట్రంలో ప్రతిభగల అధికారులు ఉన్నారు. రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జోష్‌గా సాగింది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు సమ్యలను పరిష్కరిస్తున్నారు అని తెలిపారు. ► అవాడ గ్రూప్ ఛైర్మన్ వినిత్ మిట్టల్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీ కీలకంగా ఉంది. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ కీలక పాత్ర పోషించబోతోంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ అప్రోచ్ అమోఘం. కర్బన రహిత పర్యావరణం కోసం ఏపీ కృషి చేస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది. నెంబర్ వన్‌గా నిలవడం సాధారణమైన విషయం కాదు. పారిశ్రామిక అనుకూల వాతావరణంవలనే ఏపీలో మా పెట్టుబడ్డులు పెట్టాం అని తెలిపారు. ► మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మాటల మనిషి కాదు.. చేతల మనిషి. సీఎం జగన్ దార్శనికతతో పారిశ్రామికంగా మందడుగు వేస్తున్నాం. జీఐఎస్ చారిత్రాత్మక విజయం సాధించింది. వివిధ దేశాల నుంచి ప్రసిద్ధ సంస్థలు జీఐఎస్‌కు వచ్చాయి. రెండు రోజల సదస్సులో విలువైన చర్చలు జరిగాయి. పారిశ్రామికవేత్తల అంచనాలకు తగినట్టు ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ► సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. జీఐఎస్ అంచనాలకు మించి విజయం సాధించింది. పారిశ్రామిక దిగ్గజాలు తమ విలువైన అభిప్రాయాలు పంచుకున్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. జీఐఎస్ సూపర్ సక్సెస్ సాధించింది. ► గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ. ► గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. స్వాగతం పలికిన సీఎం జగన్. ► గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదిక వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. పారిశ్రామికవేత్తలతో మాటామంతి. ► లారెస్ కంపెనీ అధినేత సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇది వరకే 5వేల మందికి ఉపాధి కల్పించాము. ఇంకా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాము. కెమికల్స్, లాజిస్టిక్స్, ఫార్మా రంగంలో మరిన్ని పెట్టుబడులు పెడతాం. ► మంత్రి రోజా మాట్లాడుతూ.. సీఎం జగన్ సమర్ధవంతమైన నాయకత్వం వల్లే భారీగా పెట్టుబడులు వచ్చాయి. ప్రజలు ముఖ్యమంత్రి జగన్ మీద పెట్టుకున్న నమ్మకానికి ఇది నిదర్శనం. పారదర్శకమైన పాలన వల్లే ఇది సాధ్యమైంది. ► మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రానికి సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్. ► బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మాట్లాడుతూ.. ఏపీకి పెట్టుబడులు రావడం చాలా సంతోషం. విదేశాల నుంచి పెద్ద ఎత్తున మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్దికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తారని భావిస్తున్నాను. ► విశాఖ చేరుకున్న కేంద్ర పోర్టులు, షిప్పింగ్స్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాలా 2వ రోజు ఎంవోయూలు ►రిలయన్స్ ఎంవోయూ రూ. 50,000 కోట్లు ►హెచ్‌పీసీఎల్ ఎనర్జీ ఎంవోయూరూ. 14, 320 కోట్ల ►టీవీఎస్ ఐఎల్పీ ఎంవోయూ రూ. 1,500 కోట్లు ►ఎకో స్టీల్ ఎంవోయూ రూ. 894 కోట్లు ►బ్లూస్టార్ ఎంవోయూ రూ. 890 కోట్లు ►ఎస్2పీ సోలార్ సిస్టమ్స్ ఎంవోయూ రూ. 850 కోట్లు ►గ్రీన్‌లామ్ సౌత్ లిమిటెడ్ ఎంవోయూ రూ. 800 కోట్లు ►ఎక్స్‌ప్రెస్ వెల్ రీసోర్సెస్ ఎంవోయూ రూ. 800 కోట్లు ►రామ్‌కో ఎంవోయూ రూ. 750 కోట్లు ►క్రిబ్కో గ్రీన్ ఎంవోయూ రూ. 725 కోట్లు ►ప్రకాశ్ ఫెరోస్ ఎంవోయూ రూ. 723 కోట్లు ►ప్రతిష్ట బిజినెస్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►తాజ్ గ్రూప్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►కింబర్లీ క్లార్క్ ఎంవోయూ రూ. 700 కోట్లు ►అలియన్న్ టైర్ గ్రూప్ ఎంవోయూ రూ. 679 కోట్లు ►దాల్మియా ఎంవోయూ రూ. 650 కోట్లు ►అనా వొలియో ఎంవోయూ రూ. 650 కోట్లు ►డీఎక్స్ఎన్ ఎంవోయూ రూ. 600 కోట్లు ►ఈ-ప్యాక్ డ్యూరబుల్ ఎంవోయూ రూ. 550 కోట్లు ►నాట్ సొల్యూషన్న్ ఎంవోయూ రూ. 500 కోట్లు ►అకౌంటిఫై ఇంక్ ఎంవోయూ రూ. 488 కోట్లు ►కాంటినెంటల్ ఫుడ్ అండ్ బెవరేజీస్ ఎంవోయూ రూ. 400 కోట్లు ►నార్త్ ఈస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంవోయూ రూ. 400 కోట్లు ►ఆటమ్‌స్టేట్ టెక్నాలజీస్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►క్లేరియన్ సర్వీసెస్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►చాంపియన్ లగ్జరీ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 350 కోట్లు ►వీఆర్‌ఎమ్ గ్రూప్ ఎంవోయూ రూ. 342 కోట్లు ►రివర్ బే గ్రూప్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►హావెల్స్ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు ►సూట్స్ కేర్ ఇండియా ఎంవోయూ రూ. 300 కోట్లు ►పోలో టవర్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►ఇండియా అసిస్ట్ ఇన్సైట్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►స్పార్క్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►టెక్ విషెన్ సాఫ్ట్వేర్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►మిస్టిక్ పామ్స్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►నియోలింక్ గ్రూప్ ఎంవోయూ రూ. 300 కోట్లు ►ఎండానా ఎనర్జీస్ ఎంవోయూ రూ. 285 కోట్లు ►అబ్సింకా హోటల్స్ ఎంవోయూ రూ. 260 కోట్లు ►సర్ రే విలేజ్ రిసార్ట్స్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►హ్యాపీ వండర్లాండ్ రిసార్ట్స్ ఎంవోయూరూ. 250 కోట్లు ►చాంపియన్స్ యాచ్ క్లబ్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►టెక్నోజెన్ ఎంవోయూ రూ. 250 కోట్లు ►పార్లె ఆగ్రో ఎంవోయూ రూ. 250 కోట్లు ►ఎకో అజైల్ రిసార్ట్ ఎంవోయూ రూ. 243 కోట్లు ►ఎల్జీ పాలిమర్స్ ఎంవోయూ రూ. 240 కోట్లు ►హైథియన్ హ్యూయన్ మిషనరీ ఎంవోయూ రూ. 230 కోట్లు ►గోకుల్ ఆగ్రో ఎంవోయూ రూ. 230 కోట్లు ►ఎస్పీఎస్ ఇన్ప్రా ఎంవోయూ రూ. 225 కోట్లు ►డీవీవీ బయో ఫ్యూయల్స్ ఎంవోయూ రూ. 223 కోట్లు ►దాల్వకోట్ బయో ఫ్యూయల్ప్ ఎంవోయూ రూ. 200 కోట్లు ►ఆమ్ కన్స్ట్రక్షన్స్ ఎంవోయూ రూ. 200 కోట్లు ►కేపిటల్ బిజినెస్ పార్క్ ఎంవోయూ రూ. 184 కోట్లు ►చాంయిన్ యాచ్ ఎంవోయూ రూ. 190 కోట్లు ►ఎన్జీసీ ట్రాన్స్మిషన్ ఎంవోయూ రూ. 185 కోట్లు ►యాక్సలెంట్ ఫార్మా సైన్స్ ఎంవోయూ రూ. 176 కోట్లు ►విన్‌విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ ఎంవోయూ రూ. 174 కోట్లు ►ట్రాన్సెండ్ రియాలిటీ డెవలప్మెంట్ ఎంవోయూ రూ. 165 కోట్లు ►చాంపియన్ ఇన్ఫ్రాటెక్ ఎంవోయూ రూ. 150 కోట్లు ►స్విచ్‌గేర్ ఎంవోయూ రూ. 150 కోట్లు ►ఆంబర్ ఎంటర్‌ప్రైజస్ ఇండియా ఎంవోయూ రూ. 150 కోట్లు ►ది రిప్పుల్స్ ఎంవోయూ రూ. 150 కోట్లు 9:20AM ►నేడు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు ►రెండో రోజు కొనసాగుతున్న ఎంవోయూలు ►ఎంవోయూలతో సదస్సు ప్రారంభం 9:10AM సభాప్థలి వద్ద మీడియాతో మంత్రి గుడివాడ అమర్నాథ్ ►సీఎం వైఎస్ జగన్ క్రెడిబిలీటీగల నాయకుడు ►పారిశ్రామికవేత్తల అభిప్రాయాల అధారంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్‌వన్ అయ్యింది ►రాష్ట్రంలో సంస్కరణలకు ఇతర రాష్ట్రాల ఆదర్శంగా తీసుకుంటున్నాయి ►ఏపీలో పలు రంగాల్లో అవకాశాలు పుష్కలం ►నేడు ఏపీకి వస్తున్నది రియలిస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ ►పారిశ్రామిక దిగ్గజాలు చెప్పిన మాటలను ప్రతిపక్షాలు అవగాహన చేసుకోవాలి ►ప్రతి ఎంవోయూ పారదర్శకంగా రూపొందింది ►మూడేళ్లలో 89 శాతం ఎంవోయూలు వాస్తవరూపం దాల్చాయి 9:00AM 2వ రోజు ప్రారంభమైన జీఐఎస్-2023 ►రెండవ రోజు శనివారం ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ప్రారంభమైంది రెండో రోజు 8 రంగాలపై సెషన్లు విశాఖపట్నం: రెండో రోజు శనివారం ఉదయం 9 గంటలకు ఆటోరియం 1లో పెట్రోలియం అండ్ పెట్రో కెమికల్స్, 2లో హయ్యర్ ఎడ్యుకేషన్, 3లో స్కిల్ డెవలప్మెంట్, 4లో వియత్నాం కంట్రీ సెషన్ జరగనుంది. 9.45 గంటలకు ఆడిటోరియం 1లో టూరిజం అండ్ హాస్పిటాలిటీ, 2లో టెక్స్టైల్స్ అండ్ అపరెల్స్, 3లో ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్, 4లో వెస్టర్న్ ఆస్ట్రేలియా కంట్రీ సెషన్ ఉంటుంది. ఆ తర్వాత నోవా ఎయిర్ సీఈఓ అండ్ ఎండీ గజానన్ నాబర్, అవాడ గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్, లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈఓ సత్యనారాయణ చావ, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ డాక్టర్ వంశీ కృష్ణ బండి, గ్రీన్కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనీల్‌కుమార్ చలమశెట్టి, సెయింట్ గోబిన్ ఆసియా–పసిఫిక్ అండ్ ఇండియా సీఈఓ సంతానం.బి ప్రసంగాలు ఉంటాయి. అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, అపాచీ అండ్ హిల్‌టాప్ గ్రూప్ డైరెక్టర్ అండ్ గ్రూప్ హెడ్ ఇండియా ఆపరేషన్స్ సర్జియో లీ, బ్లెండ్ హబ్ ఫౌండర్ హెన్రిక్ స్టామ్ క్రిస్టెన్సన్, వెల్స్పన్ గ్రూప్ ఎండీ రాజేష్ మండవేవాలా, వెల్స్పన్ గ్రూప్ ఎండీ సతీష్‌రెడ్డి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ, సీఐఐ సదరన్ రీజియన్ చైర్పర్సన్ సుచిత్ర కె.ఎల్లా ప్రసంగిస్తారు. ఆ తర్వాత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కీలక ఉపన్యాసం ఉంటుంది. అనంతరం సమ్మిట్ వేదికపై నుంచి కొత్త పరిశ్రమ యూనిట్ల ప్రారంభోత్సవం, సీఎం వైఎస్ జగన్ ముగింపు ఉపన్యాసం ఉంటుంది. -
ఇక ఈవీలు.. ఏఐ
(గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 ’ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులు లాంటి ఈ–మొబిలిటీదేనని ఎలక్ట్రిక్ వాహన రంగ పరిశ్రమ ప్రముఖులు పేర్కొన్నారు. వాహనాల ధరలు తగ్గి చార్జింగ్ పరమైన సదుపాయాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలపై నిర్వహించిన సెషన్లో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎండీ కేవీ ప్రదీప్, కియా మోటార్స్ ఇండియా వీపీ హర్దీప్ బ్రార్, టెస్లా సహ వ్యవస్థాపకుడు మార్టిన్ ఎబర్‌హార్డ్ తదితరులు పాల్గొన్నారు. ఈవీల బ్యాటరీలు దిగుమతి చేసుకోవడం కొనసాగినంత కాలం వాహనాల ధర అధిక స్థాయిలోనే ఉంటుందని, దేశీయంగా తయారీ చేస్తే భారం తగ్గుతుందని స్పష్టం చేశారు. ఈవీల మార్కెట్ యూరప్, అమెరికాలో గణనీయంగా ఉండగా భారత్‌లో ప్రస్తుతం 1–2 శాతం స్థాయిలోనే ఉందని హర్దీప్ తెలిపారు. సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలతో పోలిస్తే వీటి ధర 80 శాతం అధికంగా ఉండటం, చార్జింగ్ సమస్యలు, మైలేజీపరమైన ఆందోళనే ఇందుకు కారణమన్నారు. ఈ సవాళ్లను అధిగమించేలా దేశీ పరిశ్రమ సరైన దిశలో ముందుకు సాగుతోందని వివరించారు. 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వాటా 5 శాతానికి, అటుపైన 2030 నాటికల్లా 30 శాతానికి పెరుగుతుందని అంచనాలున్నట్లు హర్దీప్ చెప్పారు. 2025 నాటికే 45 పైచిలుకు ఈవీల మోడళ్లు లభ్యమవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల 5,600 బస్సుల కోసం కేంద్ర ప్రభుత్వం టెండర్లు ప్రకటించగా కంపెనీలు పోటీపడి బిడ్లు వేయడం ఈవీల మార్కెట్లో వస్తున్న మార్పులకు నిదర్శనమన్నారు. ఇక ఎలక్ట్రిక్ కార్లే: మార్టిన్ ఎబర్‌హార్ట్, టెస్లా సహ వ్యవస్థాపకుడు త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లే ఉంటాయని అమెరికన్ విద్యుత్ వాహనాల దిగ్గజం టెస్లా సహ వ్యవస్థాపకుడు మార్టిన్ ఎబర్‌హార్డ్ చెప్పారు. కేవలం టెస్లా కార్లే కాకుండా ఇతర కంపెనీలూ ఈ విభాగంలో గణనీయంగా పురోగతి సాధించాయని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద వాహనాల మార్కెట్లలో భారత్ కూడా ఒకటని ఎబర్‌హార్డ్ తెలిపారు. త్వరలోనే ఇక్కడ కూడా పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లనే చూడవచ్చన్నారు. దీన్ని గుర్తించి అవకాశాన్ని అందిపుచ్చుకునే సంస్థలు లబ్ధి పొందుతాయన్నారు. చార్జింగ్, మౌలిక సదుపాయాల కొరత అనేది సమస్యే కాదన్నారు. కియా సంస్థ ఏపీలో అద్భుతమైన కార్లను ఉత్పత్తి చేస్తోందని ప్రశంసించారు. ఆరంభంలో అన్నీ సమస్యలే.. ఎలక్ట్రిక్ కార్లు తొలిసారిగా తెరపైకి వచ్చినప్పుడు ఆకర్షణీయంగా లేకపోవడంతో ప్రజలు ఇష్టపడే వారు కారని ఎబర్‌హార్డ్ చెప్పారు. దీంతో వాటికి స్పోర్ట్స్’ లుక్ కల్పించేందుకు తాము ప్రత్యేకంగా కృషి చేసినట్లు తెలిపారు. సగం మంది సిబ్బందిని ఆటోమోటివ్ రంగం నుంచి, మిగతా వారిని సిలికాన్ వ్యాలీ నుంచి నియమించుకున్నట్లు చెప్పారు. 2 దశాబ్దాల క్రితం తాము ఎలక్ట్రిక్ వాహనాలను తెరపైకి తెచ్చినప్పుడు పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ‘ఉత్పత్తి సంస్థల నుంచి పరికరాల సరఫరా సరిగా ఉండేది కాదు. లిథియం అయాన్ బ్యాటరీల భద్రతపరంగా పలు సవాళ్లు ఎదుర్కొన్నాం. క్రాష్ టెస్టులు నిర్వహించాలన్నా కష్టంగా ఉండేది. ఆటో డీలర్ల ఫ్రాంచైజీల పరంగానూ సమస్యలు తలెత్తాయి. నెమ్మదిగా వాటిని అధిగమించాం. వాటాల విక్రయం ద్వారా నిధులు సమీకరించుకున్నాం. అప్పట్లో ఎలక్ట్రిక్ కార్లకు భవిష్యత్ లేదని అంతా పెదవి విరిచారు. ప్రస్తుతం భవిష్యత్తంతా వాటిదే అన్నట్లుగా పరిస్థితి మారుతోంది’ అని తెలిపారు. చైనా ప్లస్ వన్‌తో భారత్‌కు ప్రయోజనం ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం ఇన్నాళ్లు చైనాపై ఆధారపడిన దేశాలు కోవిడ్ పరిణామాల నేపథ్యంలో ఇతర ప్రత్యామ్నాయాలపై (చైనా ప్లస్ వన్ విధానం) దృష్టి పెడుతున్నాయని సాల్కాంప్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా ఎండీ శశికుమార్ గంధం తెలిపారు. మన దేశం అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) భాగస్వాములుగా చేయాలన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా ఎలక్ట్రానిక్స్‌పై నిర్వహించిన సెషన్లో ఎఫ్ట్రానిక్స్ సీఈవో దాసరి రామకృష్ణ, బ్లూస్టార్ క్లైమేటెక్ ప్రెసిడెంట్ పీవీ రావు తదితరులతో కలసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి విధానపరంగా పరిశ్రమకు మంచి మద్దతు లభిస్తోందని, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) లాంటి స్కీములు ప్రయోజనకరంగా ఉన్నాయని సాల్కాంప్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండియా ఎండీ శశికుమార్ పేర్కొన్నారు. వీటి ఊతంతో దీర్ఘకాలంలో నిలదొక్కుకునేందుకు పరిశ్రమ తగిన ప్రయత్నాలు చేయాలని సూచించారు. నిర్దిష్టంగా దృష్టి సారిస్తే.. ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించి అన్ని ఉత్పత్తులు కాకుండా నిర్దిష్టంగా 2–3 విభాగాలను ఎంచుకుని వాటిపైనే ప్రధానంగా దృష్టి పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు పొందుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రధానంగా పీసీ బోర్డుల తయారీ, ఇతర పరికరాలపై దృష్టి పెట్టాలన్నారు. తాము దక్షిణాదిలో ప్లాంటు కోసం అనువైన ప్రాంతాలను అన్వేషిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అత్యంత ఆకర్షణీయంగా కనిపించిందని పీవీ రావు చెప్పారు. ప్రభుత్వం అత్యుత్తమ సదుపాయాలు, ప్రోత్సాహకాలు కల్పించిందని, తమ కార్యకలాపాలను మరింత విస్తరించే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తమ ప్లాంటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,000 మందికి పైగా ఉపాధి లభిస్తుండగా విస్తరణ అనంతరం ఇది రెట్టింపు స్థాయికి చేరుకుంటుందని తెలిపారు. అన్నింటా కృత్రిమ మేథ వైద్యం విద్య తదితర అన్ని విభాగాల్లో కృత్రిమ మేథకు (ఏఐ) ప్రాధాన్యం పెరుగుతోంది. ఏఐపై పట్టు సాధించేందుకు యువతకు నైపుణ్యాల్లో శిక్షణ కల్పించి పాఠశాల, కళాశాల స్థాయి నుంచి అవగాహన పెంపొందించాలి. ప్రధానంగా గణితంపై మరింత పట్టు సాధించేలా ప్రోత్సహించాలి అని ఐఐటీ తిరుపతి డైరెక్టర్ సత్యనారాయణ అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) అంశంపై జరిగిన సెషన్లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐఐటీలు, ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలెన్నో ఉన్నాయని చెప్పారు. మాస్ మ్యుచువల్ హెడ్ రవి తంగిరాల, ఐట్యాప్ ప్రెసిడెంట్ శ్రీధర్ కొసరాజు, టెక్నోజెన్ సీఈవో లక్స్ రావు చేపూరి, టెక్ బుల్స్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ రెడ్డి తదితరులు ఈ సెషన్లో పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్‌లో సమృద్ధిగా వనరులు
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరులు సమృద్ధిగా ఉన్నాయని పరిశ్రమల శాఖ, ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు అధికారులు విదేశీ ప్రతినిధులకు వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భాగంగా శుక్రవారం మ.3 గంటలు తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ దేశాల ప్రతినిధులతో ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఇందులో పరిశ్రమలు, మారిటైం బోర్డు అధికారులు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ఇక్కడ వర్క్‌ఫోర్స్, ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్రోత్సాహకాలను వారికి విశదీకరించారు. ముఖ్యంగా దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు పోర్టులను సైతం నిర్మిస్తోందని వివరించారు. అలాగే, నెదర్లాండ్స్‌లో పోర్టుల నిర్మాణాలు, వాటి నిర్వహణకు గల అవకాశాలను ఆ దేశ ప్రతినిధులు ఇక్కడి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో పాటు అదాని, ఇతర ప్రైవేటు సంస్థ ప్రతినిధులకు వివరించారు. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయిలో సమీక్ష జరిపి వ్యాపార అవకాశాలపై నిర్ణయం తీసుకుంటామని నెదర్లాండ్స్ ప్రతినిధులు తెలిపారు. -
విజనరీ సీఎం నేతృత్వంలో ముందడుగు
– నవీన్ జిందాల్, జేఎస్పీఎల్ గ్రూప్ చైర్మన్ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములుగా మారుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ఫ్రా బేస్, వ్యాపార అనుకూల వాతావరణానికి రాష్ట్రం అనుకూలమైంది. విజనరీ లీడర్ షిప్‌తో ప్రోగ్రెసివ్ పాలసీ, పారిశ్రామిక అభివృద్ధి పాలసీ, ఇండస్ట్రీస్ ఎకోసిస్టమ్, పెట్టుబడిదారులకు అనుకూలమైన సింగిల్ విండో విధానాలను అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. జిందాల్ గ్రూప్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల్లోనూ వృద్ధిలోనూ ఏపీ ముందడుగు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 140 మెగావాట్ల యూనిట్ల ఉత్పత్తి ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నాం. కృష్ణపట్నం సమీపంలో రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడితో 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 10 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేలా స్టీల్‌ప్లాంట్‌కు ఇటీవలే భూమి పూజ చేశాం. ఏపీకి యంగ్, డైనమిక్ లీడర్ వైఎస్ జగన్ సీఎంగా ఉన్నారు. సీమపురి ఎనర్జీ ప్లాంట్ నుంచి 6 నెలల్లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి అందించనున్నాం. కడప స్టీల్‌ప్లాంట్‌కు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ శంకుస్థాపన చేసింది. సోలార్, హైడ్రో, విండ్ పవర్, సిమెంట్ ప్రాజెక్టు ఎంవోయూలు కూడా ఏపీ ప్రభుత్వంతో చేసుకున్నాం. సమృద్ధిగా వనరులు, అపార అవకాశాలతో ఏపీ స్వర్గధామంలా ఉంది. సీఎం జగన్ నిరంతర శ్రమకు నిదర్శనంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా జీడీపీ వృద్ధి రేటులో ఏపీ అగ్రగామిగా ఉండటం శుభపరిణామం. అపార వనరులున్న రాష్ట్రమిది – బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ మంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ అగ్రగామిగా ఉంది. సహజ వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రమిది. వివిధ రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఆంధ్రప్రదేశ్‌లో కొదవలేదు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాపార, వాణిజ్య రంగాలపై మంచి దార్శనికతతో ఉన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నాం. వేగంగా అనుమతులు.. – అమర్నాథ్, ఐటీ, పరిశ్రమల మంత్రి రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు పుష్కల అవకాశాలున్నాయి. పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు అనుమతుల మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. త్వరితగతిన మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చిన మాదిరిగానే సీఎం నాయకత్వంలో రాష్ట్రానికి వచ్చే ప్రతి పరిశ్రమకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. -
అభివృద్ధిలో భాగస్వాములవుతాం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగులు తీయిస్తూ ఉపాధి కల్పనే లక్ష్యంగా విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 ఊహకు మించి అద్భుతంగా ఆరంభమైంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొనడం హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో ఏ ఒక్క పెట్టుబడుల సదస్సుకు హాజరుకాని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 15 మంది బోర్డు డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లతో కలసి విశాఖ సమ్మిట్‌లో పాల్గొనడం విశేషం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డైనమిక్ లీడర్‌షిప్‌పై ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రాభివృద్ధిలో తాము కూడా భాగస్వాములవుతామని ప్రకటించారు. పెట్టుబడులకు స్వర్గధామం లాంటి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య రంగం అద్భుతం.. – ప్రీతారెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వైస్ చైర్పర్సన్ సమృద్ధి అంటే మనం చూస్తున్నట్లుగా ప్రజల శ్రేయస్సు పరిపూర్ణంగా కనిపించడం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని ఈ భూమి తల్లి కుమార్తెగా చెబుతున్నా. వైద్యారోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు నిజంగా ప్రశంసనీయం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం ఇతర దేశాలకూ విస్తరించింది. ఆ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ మరింత విస్తరింపజేశారు. ఆరోగ్యశ్రీ ఆఫ్రికాలోనూ అమలవుతుండటం గర్వకారణం. ఏపీ ప్రభుత్వంతో అపోలో గ్రూప్స్ భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది. అపోలో కార్యకలాపాలకు సీఎం జగన్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. మనమంతా చూస్తున్నట్లుగా ఏపీవైపు అన్ని పరిశ్రమలు కలసి వస్తున్నాయి. రాష్ట్రంలో అత్యుత్తమ ఆరోగ్య ప్రమాణాలు అందించేందుకు ఒక కుటుంబంగా సహకరిస్తామని హామీ ఇస్తున్నా. రూ.5 వేల కోట్ల పెట్టుబడులు – హరిమోహన్ బంగూర్, శ్రీ సిమెంట్ జీఎస్డీపీలో 11.43 శాతంతో అగ్రభాగంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ దేశ జీడీపీలో 5 శాతం వాటా సాధించినందుకు అభినందనలు తెలియచేస్తున్నా. సీఎం జగన్ కృషితో విద్య, సామాజిక, ఇంజనీరింగ్ రంగాల్లో పరిశ్రమల్ని ఆకర్షించే అద్భుతమైన వనరులున్న రాష్ట్రంగా ఏపీ అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాలతో పాటు మానవ వనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్న రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్ది పారిశ్రామిక వర్గాల్ని ఆకర్షిస్తున్నారు. దాదాపు 50 మిలియన్ టన్నుల సామర్థ్యంతో శ్రీసిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. 55 శాతం గ్రీన్ ఎనర్జీ వినియోగిస్తూ దేశంలోని సిమెంట్ ప్రాజెక్టుల్లో నంబర్ వన్‌గా ఉన్నాం. ప్లాంట్లు మరిన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. మా సామర్థ్యాన్ని విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రాంతంగా భావిస్తున్నాం. రూ.3,000 కోట్లతో గుంటూరులో దేశంలోనే మొదటి గ్రీన్ సిమెంట్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. రూ.5,000 కోట్ల పెట్టుబడులు పెట్టి 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాం. ప్రభుత్వ సహకారంతో 18 నెలల్లోనే పూర్తి – సుమిత్ బిదానీ, కెనాఫ్ సంస్థ సీఈవో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని చెప్పేందుకు మేమే నిదర్శనం. శ్రీసిటీలో పరిశ్రమ ఏర్పాటుకు 2019లో ఒప్పందం కుదుర్చుకున్నాం. దేశంలోనే అతిపెద్ద ప్లాంట్‌గా 40 మిలియన్ డాలర్ల ప్రాథమిక పెట్టుబడితో 24 ఎకరాల్లో నిర్మించాం. 200 మందికి నేరుగా ఉపాధి కల్పించాం. సీఎం జగన్ సహకారం, ప్రోత్సాహంతో పెట్టుబడుల ఒప్పందం జరిగిన 18 నెలల్లోనూ మా ప్రాజెక్టుని పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాం. ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని అనుమతుల్ని తేలికగా పొందాం. శ్రీసిటీలో విద్యుత్ సరఫరా చాలా అద్భుతంగా ఉంది. ముడిపదార్థాలు, ఇతర వస్తువుల్ని దిగుమతి చేసుకునేందుకు పలు పోర్టులు 100 కి.మీ. లోపు ఉండటం, బహుళ రహదారుల అనుసంధాన వ్యవస్థ కూడా ఉపయోగపడుతోంది. రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీ, విద్యుత్ సౌకర్యం ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఇన్వెస్టర్స్ సమ్మిట్ పారిశ్రామికవేత్తలకు బాగా ఉపయోగపడుతుంది. భవిష్యత్తు విస్తరణ ఏపీలోనే – సజ్జన్ భజాంకా, సెంచురీ ప్లై చైర్మన్ ఏపీలో 14 నెలల క్రితం మా కలల ప్రయాణం ప్రారంభమైంది. సీఎం జగన్‌ను మొదటిసారి కలసినప్పుడు మా ప్లాంట్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనతో వెళ్లాం. ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఏ మోడల్స్ ఉత్పత్తి చేయాలి? నోడల్ ఆఫీసర్లు ఎవరు..? ఇలా అన్నీ ఒక్క మీటింగ్‌లోనే డిసైడ్ అయిపోయాయి. అన్నీ కుదిరితే 2024 కల్లా ప్లాంట్‌లో ఉత్పత్తులు ప్రారంభించగలమని అనుకున్నాం. సీఎం ప్రోత్సాహంతో కేవలం రెండేళ్లలోనే 2021 డిసెంబర్లో ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఏపీలో మా ప్రయాణం చాలా సౌకర్యవంతంగా, సులభంగా మారింది. ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత ఇది మా రాష్ట్రం, మా ప్రాంతం అనే భావనకు వచ్చేశాం. ప్రతి ఒక్క అధికారి, రాజకీయ ప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తున్నారు. మరో రెండు ప్లాంట్ల పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఏపీని మా ఫస్ట్ చాయిస్‌గా మార్చేశారు. రూ.10 వేల కోట్లకు కియా పెట్టుబడులు – కబ్ డాంగ్లీ, కియా మోటర్స్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ ప్లాంట్ నిర్మించాం. పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతు మరువలేనిది. ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో కియా ఇండియా లీడింగ్ కంపెనీగా మారడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో ఉంది. 2023 చివరి నాటికల్లా ఈవీ–6 తయారు చేస్తాం. ఏపీలో 2027 నాటికల్లా కియా పెట్టుబడులు రూ.10 వేల కోట్లకు చేరుకోనున్నాయి. నిరంతర విద్యుత్, స్కిల్డ్ మానవ వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అందించారు. కోవిడ్ సమయంలో మా ఉద్యోగులు, ముడి సరుకులను తరలించడంలో సీఎం జగన్ ప్రభుత్వం అందించిన సహకారానికి కృతజ్ఞతలు. రాష్ట్రంలోని సుదీర్ఘ తీరం వెంట పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపార అవకాశాల్ని వినియోగించుకోవాలని పారిశ్రామికవేత్తలను కోరుతున్నా. ప్రభుత్వ సహకారానికి సాహో – మసహిరో యమగుచీ, టోరే ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ ఎండీ శ్రీసిటీలో ప్లాంట్ ఏర్పాటు సమయంలో సీఎం జగన్ సహకారం మరువలేనిది. అనుమతులన్నీ అతి తక్కువ సమయంలోనే మంజూరు చేశారు. ఫస్ట్ ఫేజ్‌లో 2019లోనే ఉత్పత్తులు ప్రారంభించాం. రెండో ఫేజ్‌లో రూ.200 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్‌ను అభివృద్ధి చేసి ఉత్పత్తుల్ని ఈ ఏడాది మొదలు పెట్టాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయో, నానోటెక్నాలజీ, పాలిమర్ కెమిస్ట్రీ కోర్ టెక్నాలజీతో ప్రారంభిస్తున్నాం. శ్రీసిటీలో హైక్వాలిటీ ఉత్పత్తులు ఉత్పత్తి చేస్తున్నాం. 132 కేవీ విద్యుత్ లైన్‌ని ప్రత్యేకంగా మాకోసం అందించారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అద్భుతంగా అమలు చేస్తున్నారు. స్టార్టప్, గ్రీన్ ఎనర్జీపై ఆసక్తి.. – మార్టిన్ ఎబర్‌హార్డ్, టెస్లా కో ఫౌండర్ టెస్లా ప్రారంభించినప్పుడు ఎవరికీ ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తారనే ఆలోచన లేదు. ఈ రోజు ప్రతి దిగ్గజ కార్ల కంపెనీకి ఈవీ కార్ల గురించి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్టార్టప్ కంపెనీలకు గొప్ప ఎకో సిస్టమ్ ఉంది. ఏపీలో స్టార్టప్స్‌తో పాటు గ్రీన్ఎనర్జీ ఉత్పత్తి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో సదస్సుకు హాజరయ్యా. ఈవీ విప్లవం ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది. గ్రీన్ రివల్యూషన్‌కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి స్టార్టప్ కంపెనీ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు ఒక్కటే చెబుతున్నా.. ఓడిపోయామని వదలొద్దు.. విజయం సాధించే వరకూ అడుగులు వేస్తూనే ఉండాలి. -
GIS 2023: 9 రంగాలపై సెమినార్లు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో పలు రంగాలలో మొదటి రోజు సెమినార్లు జరిగాయి. వీటిలో ప్రధానంగా రెన్యువబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ (పునరుత్పాదక శక్తి), ఆరోగ్య భద్రత – వైద్య పరికరాలు, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఐటీ, ఆటోమేటివ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్ ఇన్నోవేషన్స్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రోసెసింగ్ రంగాల్లో సెమినార్లు నిర్వహించారు. పారిశ్రామికవేత్తలకు మంత్రులు, అధికారులు ప్రభుత్వ విధానాలను వివరించారు . ఏపీ ప్రభుత్వం అందించే అవకాశాలతో పాటు ఇక్కడ విస్తారంగా ఉన్న భూమి, వనరులు, నైపుణ్యం కలిగిన యువత, పుష్కలంగా నీటి లభ్యత, నిరంతర విద్యుత్ సరఫరాను వివరించారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామమని తెలిపారు. ఆరోగ్య భద్రత – వైద్య పరికరాలు ‘ఆరోగ్య భద్రత – వైద్య పరికరాలు’ రంగంపై వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని హాజరయ్యారు. వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ఆమె వివరించారు. ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేటు, కార్పొరేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 95 శాతం ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. రాష్ట్రంలోని 2,200 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ద్వారా 3,200 రోగాలకు వైద్యం అందిస్తున్నాం. పార్లమెంట్ నియోజకవర్గానికో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నాం. వైద్య విభాగంలో పెట్టుబడులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది’ అని మంత్రి వివరించారు. దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన మణిపాల్ ఎంటర్‌ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో దిలీప్ జోష్, ఉస్మానియా వైద్య నిపుణులు గురునాథ్‌రెడ్డి, ఎయిమ్స్ హెచ్‌వోడీ ముకేష్ త్రిపాఠి తదితరులు క్వాలిటీ హెల్త్ సిస్టమ్, ప్రైవేట్ సెక్టార్ హెల్త్ కేర్, వైద్య రంగం ద్వారా వచ్చే రెవెన్యూ, ఉద్యోగావకాశాలు, ఇమేజింగ్ హెల్త్ కార్డ్ డెలివరీ, కమ్యునికబుల్, నాన్ కమ్యునికబుల్ డిసీజస్ అనే అంశాలపై మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు అందిస్తున్న ‘ఫ్యామిలీ ఫిజిషియన్’ విధానాన్ని, ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర రాష్ట్రాల్లోనూ తెలుగువారికి అందిస్తున్న ఉచిత వైద్యాన్ని ప్రశంసించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. పునరుత్పాదక ఇంధన శక్తి రెన్యువబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ (పునరుత్పాదక ఇంధన శక్తి) రంగంలో పెట్టుబడిదారులతో రాష్ట్ర ఇంధన శక్తి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధన శక్తి రంగంలో పెట్టుబడులకు ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు. ఈ రంగంలో పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందించే సదుపాయాలు, ఆర్పీవో ప్రయోజనాలను వివరించారు. ‘2030 నాటికి ఏపీలో 500 కేటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రభుత్వ లక్ష్యం. 10 నుంచి 15 బిలియన్ డాలర్ల గ్రీన్ఎనర్జీ అవకాశాలు ఏపీలో ఉన్నాయి. 38 జీడబ్ల్యూ సోలార్, 44 జీడబ్ల్యూ విండ్, 34 జీడబ్ల్యూ హైడ్రో ప్రాజెక్టులకు అవకాశాలున్నాయి. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం, 6 పోర్టులు, ఇతర రాష్ట్రాలతో పోల్చితే 45% ఎకనామికల్ వాటర్ సదుపాయం ఏపీలో ఉన్నాయి. నిపుణులైన మానవ వనరులు కూడా అందుబాటులో ఉన్నాయి’ అని పెద్దిరెడ్డి వివరించారు. -
అపార వనరులు.. యువ నాయకుడు: ముఖేష్ అంబానీ
(విశాఖ జీఐఎస్ వేదిక నుంచి సాక్షి, ప్రతినిధి): దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబడుల సదస్సుకు ఎన్నడూ హాజరు కాని రిలయన్స్ గ్రూపు చైర్మన్ ముఖేష్ అంబానీ విశాఖ వేదికగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పాల్గొనడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఈ సదస్సు కోసం 5 గంటలకు పైగా సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించడమే కాకుండా రాష్ట్రంలోని అపార వనరులు, సీఎం వైఎస్ జగన్ పాలన దక్షత, యువ నాయకత్వాన్ని కొనియాడుతూ ప్రసంగించారు. అపార వనరులు కలిగి ఉండటం ఒక వరమని, ఏపీలో భారీ పెట్టుబడులు పెట్టిన తాము భవిష్యత్తులో కూడా అదే బంధాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 10 గిగావాట్ల రెన్యువబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్‌ను నెలకొల్పనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. జీఐఎస్ సదస్సులో ముఖేష్ అంబానీ ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే... బ్లూ ఎకానమీ (సముద్ర వాణిజ్యం)లో సాగరమంత అవకాశాలను కల్పిస్తూ రాష్ట్రం స్వాగత ద్వారాలు తెరిచింది. రెన్యువబుల్ ఓషన్ ఎనర్జీ, సముద్ర ఖనిజాలు, మెరైన్ బయోటెక్నాలజీ రంగాల్లో చాలా అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ పటిమతో దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా, ఎంత వేగంగా విస్తరిస్తోందో అదేవిధంగా సీఎం వైఎస్ జగన్ యువ నాయకత్వం, దార్శనికతతో వృద్ధి రేటు, సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించడంలో కృషి చేసిన రాష్ట్ర యువత, అధికారులకు శుభాకాంక్షలు. నూతన భారత దేశ వృద్ధిలో ఏపీ ముందుండి నడిపిస్తుందన్న నమ్మకం ఇక్కడ యువత, వ్యాపారవేత్తల్లో ధృడంగా కనిపిస్తోంది. ► ఆంధ్రప్రదేశ్‌లోని అపార అవకాశాలను గుర్తించి చమురు, గ్యాస్ రంగంలో 2002లో అడుగుపెట్టాం. రూ.1,50,000 కోట్లకుపైగా పెట్టుబడులను కేజీ డి–6 అసెట్స్‌పై పెట్టాం. భవిష్యత్తులో దేశ సహజవాయువు ఉత్పత్తిలో 30% కేజీ డి–6 నుంచే వస్తుంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎంత కీలకమో చెప్పేందుకు ఇదే నిదర్శనం. జియో సేవలకు సంబంధించి రాష్ట్రంలో టెలికాం విస్తరణ కోసం రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టాం. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 98 శాతం 4జీ నెట్వర్క్ కవర్ చేసింది. ఇప్పుడు ట్రూ 5జీ సేవలను 2023 చివరి నాటికల్లా మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తాం. 5జీ రాకతో రాష్ట్రంలో డిజిటల్ విప్లవం అన్ని రంగాల్లో వృద్ధికి దోహదం చేస్తుంది. దీని ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. ► ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలంగా సారవంతమైన భూములు, సహజ వనరులు, నైపుణ్యం, విశిష్ట సంస్కృతి ఉన్నాయి. విశాఖలో అందమైన బీచ్‌లున్నాయి. అధిక ఆదాయాన్ని అందించే కృష్ణా, గోదావరి నదుల మధ్య మంచి భూములున్నాయి. విజయనగరం సామ్రాజ్యం నుంచి తిరుమల వరకు ఎంతో చారిత్రక ప్రదేశాలున్నాయి. ఇవన్నీ వినియోగించుకుంటూ ఆధునిక కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తోంది. ఇన్ఫ్రా, ఫార్మా రంగంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలు గణనీయమైన శక్తి కలిగి ఉన్నారు. అంతర్జాతీయంగా పేరొందిన సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు, వృత్తి నిపుణులు పలువురు ఏపీకి చెందిన వారే. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో మంచి నైపుణ్యంతో వివిధ నాయకత్వ హోదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారు. ► రిలయన్స్ రిటైల్ ద్వారా భారీగా విస్తరించాం. రాష్ట్రంలో 1.20 లక్షల మంది కిరాణా వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నాం. 6,000 గ్రామాల్లో రిలయన్స్ రిటైల్ సేవలను అందిస్తోంది. రాష్ట్రంలో 20,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధితోపాటు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాం. రైతులు, హస్తకళాకారుల ఉత్పత్తులను విక్రయిస్తూ నేరుగా 50,000 కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తున్నాం. రిలయన్స్ ఫౌండేషన్ విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో కృషి చేస్తోంది. గ్రామీణ సామాజిక కేంద్రాల్లో రిలయన్స్ భాగస్వామి కానుంది. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలతో ఇదే విధమైన బంధాన్ని కొనసాగిస్తామని హామీ ఇస్తున్నా. రాష్ట్ర వృద్ధి రేటులో రిలయన్స్ భాగస్వామిగా ఉంటుంది. మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికారులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఈ సదస్సు విజయవంతమై రాష్ట్రాభివృద్ధిలో నూతన అధ్యాయాన్ని సృష్టించాలని కోరుకుంటున్నా. -
ఎలాంటి సహకారానికైనా ఒక్క ఫోన్‌కాల్ దూరంలో: సీఎం జగన్
విశాఖ జీఐఎస్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: భూమి, నీరు, సముద్రతీరం, విస్తారమైన ఖనిజ సంపద, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఇతరత్రా ప్రకృతి వనరులు.. వీటన్నింటికీ తోడు పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, పెట్టుబడులకు స్వర్గధామమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 340 పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 రంగాల్లో 6 లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయని చెప్పారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 తొలి రోజు శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం దేశ, విదేశాలకు చెందిన అగ్రశ్రేణి పారిశ్రామిక దిగ్గజాలు హాజరైన ఈ సమ్మిట్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తొలి రోజు రూ.11.87 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 92 ఎంవోయూలు కుదుర్చుకుంటున్నామని, వీటి ద్వారా దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మిగిలిన 248 ఎంవోయూలను శనివారం కుదుర్చుకుంటామని, వాటి విలువ రూ.1.15 లక్షల కోట్లు అని తెలిపారు. వాటితో దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. జీఐఎస్ వేదికపై సీఎం వైఎస్ జగన్‌తో పాటు వరుసగా... మసహిరో యమగుచి (టోరే ఇండియా), సుమిత్ బిదానీ (కెనాఫ్), అరుణ్ ఒబెరాయ్ (ఒబెరాయ్ గ్రూప్), పునీత్ దాల్మియా (దాల్మియా భారత్), ప్రీతా రెడ్డి (అపోలో) కృష్ణ ఎల్లా (భారత్ బయోటెక్), జీఎం రావు (జీఎంఆర్), ముఖేశ్ అంబానీ (రిలయన్స్ గ్రూప్), కరణ్ అదానీ (అదానీ గ్రూప్), బీవీఆర్ మోహన్ రెడ్డి (సైయంట్), సజ్జన్ భజాంకా ( సెంచరీ ఫ్లై), హరిమోహన్ బంగర్ (శ్రీ సిమెంట్), మార్టిన్ ఎబర్ హార్డ్ (టెస్లా), కబ్ డాంగ్ లీ (కియా ప్రతినిధులు), ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పÆమంత్రి గుడివాడ అమర్నాథ్. రిలయెన్స్ గ్రూప్, అదాని గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్ గ్రూప్, మోండలెజ్, పార్లే, శ్రీ సిమెంట్స్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్థాపించి వ్యాపారాన్ని విస్తరించనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఎలాంటి సహకారం అందించేందుకునైనా తమ ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటుందని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం ఏ విధంగా అనుకూలమో ఆయన వారికి స్పష్టంగా వివరించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఎన్నెన్నో అనుకూలతలు ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశ్రమలు, పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాలు, మెడ్‌టెక్ జోన్, ప్రముఖ పర్యాటక కేంద్రాలతో ప్రకృతి అందాలకు నెలవైన విశాఖపట్నం బలమైన ఆర్థిక కేంద్రంగా రూపాంతరం చెందింది. జీ–20 దేశాల వర్కింగ్ కమిటీ సమావేశాలకు కూడా ఇదే విశాఖ మార్చి చివరి వారంలో ఆతిథ్యం ఇవ్వనుంది. సమృద్ధిగా సహజ వనరులు, ఉన్నత విద్యా సంస్థలు, వ్యూహాత్మక ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌కు సానుకూలతలు. వీటికి తోడు పెట్టుబడులకు రాష్ట్రాన్ని ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చేందుకు పటిష్ట కార్యాచరణతో అడుగులు ముందుకు వేసేందుకు చురుకైన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. మూల స్తంభాలుగా 4 అంశాలు గ్రీనిఫికేషన్ సంప్రదాయేతర ఇంధనం దిశగా వ్యవస్థను మార్చడంపై ప్రధానంగా శ్రద్ధ పెట్టాం. రాష్ట్రంలో 82 గిగావాట్ల సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిని సాధించడానికి అవకాశాలున్నాయి. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ.. ఈ మూడు రకాల ఇంధనాలు సమ్మిళితంగా పొందడానికి అవకాశాలున్న అతికొద్ది రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఈ ప్రాజెక్టులను ప్రారంభించడానికి అవసరమైన ల్యాండ్ పార్సిళ్లను కూడా ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక భౌగోళిక లక్షణాలు ఉన్నందున 34 గివావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టులకు అవకాశం ఉంది. 24 గంటలపాటు ఈ ప్రాజెక్ట్ నుంచి సంప్రదాయేతర ఇంధనాన్ని పొందవచ్చును. అతిపెద్ద తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతులకు రాష్ట్రంలో అపార అవకాశాలున్నాయి. పారిశ్రామిక లాజిస్టిక్స్, మౌలిక వసతులు ఈ విషయంలో భారతదేశానికి తూర్పుతీరంలో ఆంధ్రప్రదేశ్ గేట్‌వే గా ఉంది. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. సముద్ర రవాణా రంగంలో రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, భావనపాడులలో కొత్త పోర్టులు నిర్మిస్తున్నాం. ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆరు పోర్టులకు ఇవి అదనం. ఈ పోర్టుల సమీపంలో పారిశ్రామికీకరణకు అపార అవకాశాలున్నాయి. మూడు పారిశ్రామిక కారిడార్లు.. విశాఖపట్నం– చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్– బెంగళూరు పారిశ్రామిక కారిడార్లు వస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. పారిశ్రామికంగా డిమాండ్ ఉన్న ప్రాంతాలకు సమీపంలో ఈ కారిడార్లు ఉన్నాయి. వీటికి పోర్టులతో అద్భుతమైన రవాణా అనుసంధానం ఉంది. ఈ పారిశ్రామిక కారిడార్లలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న 10 నోడ్స్ పారిశ్రామిక హబ్‌లుగా తయారవుతున్నాయి. సరుకు రవాణా సమయాన్ని, వ్యయాన్ని ఆదా చేయడానికి రాష్ట్రంలో వ్యూహాత్మక ప్రాంతాల్లో 5 మల్టీ మోడల్ పార్కులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. సముద్ర ఉత్పత్తులను పెంచడానికి ప్రాసెసింగ్ కోసం కొత్తగా 9 హార్బర్లను నిర్మిస్తున్నాం. వివిధ పారిశ్రామిక రంగాలకు సంబంధించి ప్రత్యేక పారిశ్రామిక క్లస్టర్లు కూడా ఉన్నాయి. ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు నిర్దిష్టంగా క్లస్టర్లు ఉన్నాయి. అవి చక్కటి మౌలిక సదుపాయాలు, మానవ వనరులను అందిస్తున్నాయి. మెడ్‌టెక్ కంపెనీలకు ఏపీ పుట్టిల్లు. విశాఖపట్నం మెడ్‌టెక్ జోన్లో అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ రంగంలో మరింత వృద్ధి కోసం ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. దాంతో సమయం, వ్యయం ఆదా అవుతుంది. డిజిటలైజేషన్ దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల కోసం ప్రభుత్వం సింగిల్ పోర్టల్ సేవలను అందిస్తోంది. 23 విభాగాల్లో 90 రకాల వ్యాపార సేవలు ఈ పోర్టల్‌లో లభిస్తున్నాయి. వ్యాపారాలు ప్రారంభించడానికి గరిష్టంగా 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 540 రకాల సేవలను అందిస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా ఏపీదే మొదటి స్థానం. పరిశ్రమలు పెట్టేవారికి అత్యంత అనుకూలంగా ఉండటం కోసం కొన్ని చట్టాలను సవరించడం, తొలగించడం చేశాం. ఎంటర్‌ప్రైజస్, స్కిల్ డెవలప్మెంట్ పారిశ్రామికంగా నిర్దేశిత లక్ష్యాలు సాధించడానికి మంచి మౌలిక వసతులు, సానుకూల వ్యాపార వాతావరణంతోపాటు నైపుణ్యమైన మానవ వనరులు అత్యంత కీలకం. ఈ దిశగా 26 చోట్ల నైపుణ్యాభివృద్ధి కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్థానిక యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం పారిశ్రామిక సంస్థల సహకారంతో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. దేశంలోనే అత్యధిక జీడీపీ సాధించిన ఏపీ ► 2021–22లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా 11.43 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు సాధించింది. గత మూడేళ్లలో ఏపీ నుంచి ఎగుమతులు కూడా వృద్ధి చెందాయి. సీఏజీఆర్ (సగటు వార్షిక వృద్ధి రేటు) 9.3 శాతంగా నమోదైంది. ► సుస్థిరమైన అభివృద్ధి కోసం మేం చేస్తున్న ప్రయత్నాలను నీతి ఆయోగ్ కూడా గుర్తించింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల్లో 2020–21కి ఇచ్చిన ఎస్జీడీ ఇండియా ఇండెక్స్ ర్యాంకుల్లో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. ► క్షేత్ర స్థాయి నుంచి పరిపాలనను బలోపేతం చేసేందుకు మా ప్రభుత్వం అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించడం, స్థిరమైన విధానాలు, పోటీతత్వాన్ని పెంపొందించడానికి, తక్కువ రిస్క్ పెట్టుబడి వాతావరణాన్ని కల్పించడానికి, పారదర్శకతను పెంపొందించేందుకు పలు చర్యలు తీసుకుంది. త్వరలో కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం అందమైన విశాఖపట్నంలో అద్భుతమైన సమయాన్ని గడపాలని కోరుతున్నాను. విశాఖపట్నం త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని కాబోతోంది. నేనూ త్వరలోనే ఇక్కడి నుంచే పరిపాలన సాగించబోతున్నా. త్వరలోనే అది సాకారం అవుతుంది. -
AP Global Investors Summit: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంతోషిస్తున్నాం
విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా జరుగుతోంది. అనేక మంది దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు ఈ సదస్సుకు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కల్పిస్తున్న స్నేహపూర్వక వాతావరణంతో అనేక కంపెనీలు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. రిలయెన్స్ గ్రూపు, ఆదానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్ గ్రూప్, మోండలీస్, పార్లీ, శ్రీ సిమెంట్స్ వంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి రాష్ట్రంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న పలువురు పారిశ్రామిక వేత్తలు సదస్సును ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. ఏపీ ప్రభుత్వంతో తాము ఎంఓయూలు కుదుర్చుకున్న విషయాన్ని తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సంతోషిస్తున్నామంటూ ట్విటర్ ద్వారా తెలియజేశారు. Happy to announce that we have signed an MoU with the Andhra Pradesh Govt to set up a 3 MTPA steel plant near Krishnapatnam Port. This plant will provide employment to 10,000 people & will strengthen our association with Andhra Pradesh & its people. #APGlobalInvestorsSummit pic.twitter.com/c7HQPt7LRF — Naveen Jindal (@MPNaveenJindal) March 3, 2023 Proud to represent our chairman @gautam_adani and group @adanionline at #APGIS2023 . @APSEZ will add 100 Million tonnes of new capacity at gangavaram and Krishnapattanam. @AdaniGreen will add 15 GW of renewable plant. @AmbujaCementACL will add 10 MMT of cement in AP state. — Karan Adani (@AdaniKaran) March 3, 2023 ReNew is at the Advantage AP: Global Investors Summit 2023. More information to follow!@Advantage_APGov #APGIS2023 pic.twitter.com/V15yRf8tKB — ReNew (@ReNewCorp) March 3, 2023 -
పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్, కేంద్రమంత్రి గడ్కరీ (ఫొటోలు)
-
అచ్చెన్నాయుడు ఇప్పుడే నిద్రలేచారా?: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు పెట్టుబడిదారుల నుంచి వచ్చిన స్పందనే తమ ప్రభుత్వ పారిశ్రామిక విధానమని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కేవలం సంవత్సరం, రెండు సంవత్సరాల్లోనే సాకారమయ్యేలా ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. రికార్డు స్థాయిలో తొలి రోజు రూ.11.87 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. ఈ రెండు రోజుల సదస్సు ద్చారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తున్నామని గర్వంగా చెబుతున్నామన్నారు. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలుంటాయన్నారు. కేవలం సీఎం జగన్ బ్రాండ్ వల్లే ఏపీకి ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టంచేశారు. 14 రంగాలలో ఫోకస్ చేద్దామనుకున్నప్పటికీ 20 రంగాలలో పెట్టుబడులు వచ్చాయి. దేశ, విదేశాల ప్రముఖులకు తమ ప్రభుత్వం ఇచ్చిన నమ్మకం వల్లే పెట్టుబడుల ప్రవాహం వచ్చింది. ఏపీకి సహజ వనరులు ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర అభివృద్దికి సీఎం వైఎస్ జగన్ నిరంతరం కృషి చేస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి రెండో రోజు సదస్సు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ‘‘ఏపీకి వచ్చిన పెట్టుబడులపై ఫాలో అప్ ఉండాలని సీఎం జగన్ సూచించారు. ప్రభుత్వానికి మరింత బాధ్యత పెరిగింది. కోవిడ్ వల్ల రెండేళ్ల పాటు ఈ తరహా సమావేశాలు నిర్వహించలేకపోయాం. టీడీపీ హయాంలో చేసుకున్న ఎంఓయూలలో పది శాతం మాత్రమే ప్రారంభమైతే సీఎం జగన్ హయాంలో ఇప్పటి వరకు 80 నుంచి 90 శాతం ప్రారంభమయ్యాయి. ఈ సమ్మిట్ లో చేసుకున్న ఎంఓయూలు నూరు శాతం ప్రారంభమవుతాయి.’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. అలాగే సమ్మిట్‌పై టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై అమర్నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అచ్చెన్నాయుడు ఇపుడే నిద్రలేచారా?. అంబానీ, అదానీ, దాల్మియా, బజాంకాలని ఆయన ఎపుడైనా చూశాడా?. ఈ సమ్మిట్‌కు వచ్చిన అనూహ్య స్పందనపై ప్రశంసించకపోయినా పర్వాలేదు, కానీ తప్పుడు విమర్శలేంటి?' అంటూ నిప్పులు చెరిగారు. చదవండి: 'కేంద్రం నుంచి ఏపీకి సంపూర్ణ సహకారం.. రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు రూ.20వేల కోట్లు..' -
దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది: సీఎం జగన్
-
ఏపీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మంచి సహకారం
-
Special AV Of Energy Growth: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023
-
సీఎం జగన్ విజన్ అద్భుతం..!
-
కేంద్రం నుంచి ఏపీకి సంపూర్ణ సహకారం: నితిన్ గడ్కరీ
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్‌లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ఏపీ పారిశ్రామిక వృద్ధిలో రోడ్ కనెక్టివిటీ కీలకమని పేర్కొన్నారు. పోర్టులతో రహదారుల కనెక్టివిటీని బలోపేతం చేస్తామని చెప్పారు. పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో రోడ్ కనెక్టివిటీని పెంచేందుకు రూ.20వేల కోట్లు కేటాయిస్తామని గడ్కరీ తెలిపారు. అలాగే ఏపీలో మత్స్య పరిశ్రమ చాలా కీలకంగా మారిందని గడ్కరీ పేర్కొన్నారు. రాష్ట్రంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించారు. 50-50 భాగస్వామ్యంతో లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఈ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోందని వివరించారు. పర్యావరణహిత వాహనాలదే భవిష్యత్ అని స్పష్టంచేశారు. కాలుష్యాన్ని తగ్గించడం చాలా ముఖ్యమని సూచించారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి రాయితీలు ఇస్తున్నట్లు గుర్తుచేశారు. కేంద్రం నుంచి ఏపీకీ సంపూర్ణ సహకారం ఉంటుందని గడ్కరీ చెప్పారు. దేశంలోని ముఖ్య రాష్ట్రాల్లో ఏపీ ఒకటన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఏపీ జాతీయ రహదారులను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. చదవండి: ఏపీలో రిలయన్స్ పెట్టుబడులు.. అంబానీ కీలక ప్రకటన -
పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు ఇలా..
సాక్షి, విశాఖపట్నం: దేశ, విదేశీ కార్పోరేట్ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023’ గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా వాస్తవితకు దగ్గరగా జరుగుతోంది. ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా వంటి 30కి పైగా కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు సదస్సులో పాల్గొన్నారు. పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు ఇలా ఉన్నాయి.. ఏపీలో పెట్టుబడులను ప్రకటించిన రిలయన్స్ గ్రూప్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 10 గిగావాట్ల రెన్యూబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ. ఏపీలో పెట్టుబడులను ప్రకటించిన జిందాల్ గ్రూప్ ఏపీలోని క్రిష్ణ పట్నం సమీపంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జిందాల్ గ్రూపు ఛైర్మన్ నవీన్ జిందాల్ సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకోసం రూ.10వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని జిందాల్ తెలిపారు. ►ఎన్టీపీసా ఎంవోయూ(రూ. 2..35లక్షల కోట్లు) ►ఏబీసీ లిమిటెట్ ఎంవోయూ(రూ. 1.20 లక్షల కోట్లు) ►రెన్యూ పవర్ ఎంవోయూ(రూ. 97, 550 కోట్లు) ►ఇండోసాల్ ఎంవోయూ(రూ. 76, 033 కోట్లు) ►ఏసీఎమ్ఈ ఎంవోయూ(రూ. 68,976 కోట్లు) ►టీఈపీఎస్ఓఎల్ ఎంవోయూ( రూ. 65, 000 కోట్లు) ►జేఎస్‌డబ్యూ గ్రూప్(రూ. 50, 632 కోట్లు) ►హంచ్ వెంచర్స్(రూ. 50 వేల కోట్లు) ►అవాదా గ్రూప్( రూ 50 వేల కోట్లు) ►గ్రీన్ కో ఎంవోయూ(47, 600 కోట్లు) ►ఓసీఐఓఆర్ ఎంవోయూ (రూ. 40వేల కోట్లు) ► హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ (రూ. 30వేల కోట్లు) ► వైజాగ్ టెక్ పార్క్ (రూ. 21,844 కోట్లు) ► అదానీ ఎనర్జీ గ్రూప్ (రూ.21, 820 కోట్లు) ►ఎకోరెన్ ఎనర్జీ (రూ.15,500 కోట్లు) ►సెరంటికా ఎంవోయూ (రూ. 12,500 కోట్లు) ►ఎన్‌హెచ్‌పీసీ ఎంవోయూ (రూ.12వేల కోట్లు) ► అరబిందో గ్రూప్ (రూ.10, 365 కోట్లు) ►ఓ2 పవర్ ఎంవోయూ ( రూ.10వేల కోట్లు) ► ఏజీపీ సిటీ గ్యాస్ (రూ. 10వేల కోట్లు) ► జేసన్ ఇన్ఫ్రా ఎంవోయూ (రూ. 10వేల కోట్లు) ►ఆదిత్య బిర్లా గ్రూప్ (రూ. 9,300 కోట్లు) ►జిందాల్ స్టీల్ (రూ. 7500 కోట్లు) ►టీసీఎల్ ఎంవోయూ(రూ. 5,500 కోట్లు) ►ఏఎం గ్రీన్ ఎనర్జీ(రూ. 5,000 కోట్లు) ►ఉత్కర్ష అల్యూమినియం(రూ. 4,500 కోట్లు) ►ఐపోసీఎల్ ఎంవోయూ(రూ. 4,300 కోట్లు) ►వర్షిణి పవర్ ఎంవోయూ(రూ, 4,200 కోట్లు) ►ఆశ్రయం ఇన్ఫ్రా(రూ. 3,500 కోట్లు) ►మైహోమ్ ఎంవోయూ(3,100 కోట్లు) ►వెనికా జల విద్యుత్ ఎంవోయూ(రూ. 3000 కోట్లు) ►డైకిన్ ఎంవోయూ(రూ. 2,600 కోట్లు) ►సన్నీ ఒపోటెక్ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు) ►భూమి వరల్డ్ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు) ►అల్ట్రాటెక్ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు) ►ఆంధ్రా పేపర్ ఎంవోయూ(ర. 2వేల కోట్లు) ►మోండాలెజ్ ఎంవోయూ(రూ. 1,600 కోట్లు) ►అంప్లస్ ఎనర్జీ(రూ. 1,500 కోట్లు) ►గ్రిడ్ ఎడ్జ్ వర్క్స్ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు) ►టీవీఎస్ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు) ►హైజెన్కో ఎంవోయూ(రూ. 1,500 కోట్లు) ►వెల్స్పన్ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు) ►ఒబెరాయ్ గ్రూప్(రూ. 1,350 కోట్లు) ►దేవభూమి రోప్‌వేస్(రూ. 1,250 కోట్లు) ►సాగర్ పవర్ ఎంవోయూ(రూ. 1,250 కోట్లు) ►లారస్ గ్రూప్(రూ. 1,210 కోట్లు) ►ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్స్(రూ. 1,113 కోట్లు) ►డెక్కన్ ఫైన్ కెమికల్స్(రూ. 1,110 కోట్లు) ►దివీస్ ఎంవోయూ(రూ. 1,100 కోట్లు) ►డ్రీమ్ వ్యాలీ గ్రూప్(రూ. 1,080 కోట్లు) ►భ్రమరాంబ గ్రూప్(రూ. 1,038 కోట్లు) ►మంజీరాహోటల్స్ అండ్ రిసార్ట్స్(రూ. 1,000 కోట్లు) ►ఏస్ అర్బన్ డెవలపర్స్(రూ. 1,000 కోట్లు) ►శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్(రూ. 1,000 కోట్లు) ►ఎంఆర్కేఆర్ కన్స్టక్షన్స్(రూ. 1,000 కోట్లు) ►సెల్కాన్ ఎంవోయూ(రూ.1,000 కోట్లు) ►తుని హోటల్స్ ఎంవోయూ(రూ. 1,000 కోట్లు) ►విష్ణు కెమికల్స్(రూ. 1,000 కోట్లు) -
సీఎం జగన్ విజన్.. ఏపీ NO.1గా ఉంది
-
సీఎం జగన్ డైనమిక్ లీడర్షిప్.. ఏపీకి పెద్ద వరం
-
ఏపీకి పారిశ్రామిక దిగ్గజాల భరోసా.. రూ. 13 లక్షల కోట్లు
విశాఖ జీఐఎస్ వేదిక నుంచి సాక్షి ప్రతినిధి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు అనూహ్య స్పందన లభించింది. విశాఖ వేదికగా రాష్ట్రంలోకి పెట్టుబడుల వరద పారింది. రెండు రోజుల జీఐఎస్ సదస్సు సందర్భంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.13 లక్షల కోట్లకు పైగా విలువైన 340 ఒప్పందాలు రానున్నాయి. తొలి రోజు శుక్రవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కార్పొరేట్ దిగ్గజ సంస్థలు రూ.11,87,756 కోట్ల విలువైన 92 ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటి ద్వారా 3,92,015 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో ఒక్క ఇంధన రంగంలోనే రూ.8,25,639 కోట్ల విలువైన 35 ఒప్పందాలు కుదిరాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ, ఏబీసీ, ఇండోసోల్, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు, ఏసీఎంఈ, టెప్‌సోల్, అవాడా, గ్రీన్కో, అదానీ, అరబిందో, ఎన్‌హెచ్‌పీసీ, ఆదిత్య బిర్లా వంటి సంస్థలున్నాయి. ఇంధన రంగంలో పెట్టుబడుల ద్వారా 1,33,950 మందికి ఉపాధి లభించనుంది. పరిశ్రమలు.. వాణిజ్య విభాగంలో రూ.3,20,455 కోట్ల విలువైన 41 ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా 1,79,850 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో జిందాల్ స్టీల్, శ్రీ సిమెంట్, మైహోమ్ సిమెంట్, అల్ట్రాటెక్, లారస్ మోండలెజ్, వెల్సపన్ వంటి సంస్థలున్నాయి. ఐటీ, ఐటీఈఎస్ రంగంలో రూ.32,944 కోట్ల విలువైన 6 ఒప్పందాలు కుదరగా, వీటి ద్వారా 64,815 మౖందికి ఉపాధి లభించనుంది. ఇందులో టీసీఎల్, రిజల్యూట్, డైకిన్, సన్నీ ఆప్టెక్ వంటి సంస్థలున్నాయి. పర్యాటక రంగంలో రూ.8,718 కోట్ల విలువైన 10 ఒప్పందాలు కుదరగా.. వీటి ద్వారా 13,400 మందికి ఉపాధి లభించనుంది. ఇందులో డ్రీమ్‌వ్యాలీ గ్రూపు, ఒబెరాయ్, భ్రమరాంభ గ్రూపు, ఎంఆర్కేఆర్, మంజీరా హోటల్స్ వంటి సంస్థలున్నాయి. రెండవ రోజు శనివారం రూ.1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు కుదరనున్నట్లు అధికారులు వెల్లడించారు. పారిశ్రామికవేత్తలతో సీఎం జగన్ మాటామంతి రాష్ట్ర ప్రభుత్వ కృషిని కొనియాడిన కార్పొరేట్ దిగ్గజాలు కోవిడ్ తర్వాత తక్కువ కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వేగంగా పరుగులు పెట్టించి, రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ రోడ్‌షోలు నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. జీఐఎస్ సమావేశంలో పాల్గొన్న అంబానీ దగ్గర నుంచి బంగర్ వరకు అందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాగిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పాలనను స్వాగతిస్తూ ప్రసంగించారు. ముఖ్యంగా విద్య, స్కిల్ డెవలప్మెంట్ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ కృషిని కొనియాడారు. సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి వచ్చిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సభ ముగేసే వరకు.. ఆద్యంతం ముఖ్యమంత్రితో చర్చిస్తూ ఉల్లాసంగా కనిపించారు. సీఎం తన ప్రసంగం అనంతరం వేదికపై ఉన్న ప్రతి పారిశ్రామికవేత్త వద్దకు వెళ్లి నమస్కరించి పలకరించారు. ఎంవోయూ కార్యక్రమం అనంతరం పారిశ్రామికవేత్తలను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమం ప్రారంభంలో జ్యోతి ప్రజ్వలన సమయంలో పాదరక్షలు విడిచిన పారిశ్రామికవేత్తలు.. తర్వాత నిలబడి వాటిని ధరించడంలో ఇబ్బంది పడుతుంటే.. ముఖ్యమంత్రి వారికి ఆసరాగా నిలిచి చేయూతనందించడం పలువురిని ఆకర్షించింది. మధ్యాహ్నం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి స్టాల్స్‌ను సందర్శించారు. అంతకు ముందు రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై నాలుగు ఆడియో విజువల్స్ ప్రదర్శించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు జీఐఎస్ సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకర్షించాయి. ఎయిర్‌పోర్టులో అతిథులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, ఆహ్వానం పలికిన విధానం పలువురిని ఆకట్టుకుంది. ఈ విషయాన్ని పలువురు వక్తలు సదస్సులో ప్రస్తావించారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన రాష్ట్ర జానపద కళలు, కొమ్మునృత్యం, తప్పటగుళ్లు, ఉరుములు అందరినీ ఆకర్షించాయి. ఈ సదస్సుకు కార్పొరేట్ ప్రముఖలతో పాటు, విదేశీ రాయబారులు పెద్ద ఎత్తున హాజరు కావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ సమావేశాలకు హాజరైన వారికి ముఖ్యమంత్రి రాత్రి ప్రత్యేకంగా విందు ఇచ్చారు. భారీ పెట్టుబడులు పెడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ సుస్థిర సమగ్రాభివృద్ధిని సాధిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాం. ఏపీలో మరింతగా విస్తరించనున్నాం. – కరణ్ అదానీ, సీఈవో, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ విజనరీ ముఖ్యమంత్రి విజనరీ లీడర్ షిప్‌తో పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఏపీ ప్రభుత్వంతో కలిసి ఇప్పటికే పనిచేస్తున్నాం. పలు ప్రాజెక్టులకు ఎంవోయూలు చేసుకున్నాం. – నవీన్ జిందాల్, జేఎస్పీఎల్ గ్రూప్ చైర్మన్ జగన్ సారథ్యంలో వేగంగా అభివృద్ధి భోగాపురం ఎయిర్‌పోర్టు సిటీ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తుంది. తొలి దశలో రూ.5,000 కోట్లతో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నాం. సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. – జీఎం రావు, జీఎంఆర్ గ్రూపు చైర్మన్ పరిశ్రమలు తరలి వస్తున్నాయి వైద్య, ఆరోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు ప్రశంసనీయం. ఏపీ ప్రభుత్వంతో అపోలో గ్రూప్స్ భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది. ఏపీవైపు అన్ని పరిశ్రమలు తరలి వస్తున్నాయి. – ప్రీతారెడ్డి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వైస్ చైర్పర్సన్ అపార అవకాశాలు.. ఫార్మా రంగంలో ముడి పదార్థాలకు చైనాపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలో తయారీ పార్క్‌ను నెలకొల్పాలని కోరుతున్నా. యానిమల్, ఆక్వా వ్యాక్సినేషన్ల రంగాల్లోనూ అపార అవకాశాలున్నాయి. – కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ We have received 340 investment proposals worth Rs 13 lakh crores, providing employment to 6 lakh people across 20 sectors! #AdvantageAP #APGlobalInvestorsSummit2023 #AndhraPradesh pic.twitter.com/FQBHVm20Sj — YS Jagan Mohan Reddy (@ysjagan) March 3, 2023 -
సీఎం జగన్ సమక్షంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటన
-
ఏపీలో జిందాల్ స్టీల్ భారీ పెట్టుబడులు
-
ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి
-
ఏపీలో శ్రీ సిమెంట్ 5 వేల కోట్లతో పెట్టుబడులు.. 5 వేల మందికి ఉపాధి..
-
ఏపీలో రిలయన్స్ పెట్టుబడులు.. అంబానీ కీలక ప్రకటన
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పారిశ్రామిక అవకాశాలు, భవిష్యత్త్‌లో పెట్టుబడులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. సమ్మిట్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. పలు రంగాల్లో ఏపీ నంబర్‌వన్‌గా మారుతున్నందుకు శుభాకాంక్షలు. నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ కీలకం కాబోతోంది. ఏపీలో జియో నెట్వర్క్ అభివృద్ధి చెందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రగతికి ఏపీ సర్కార్ మంచి సహకారం అందిస్తోంది. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ నుంచే ఉన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రెండో స్టేట్ ఏపీ. సీఎం జగన్ సమర్థవంతమైన నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ సందర్బంగానే ఏపీలో పెట్టుబడులను ప్రకటించారు. ఏపీలో 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ మాట్లాడుతూ.. ఏపీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషకరంగా ఉంది. ఏపీలో మౌలిక సదుపాయాలు బాగున్నాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఏపీ కనెక్టివిటీ బాగుంది. ఒబెరాయ్ హోటల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అర్జున్ బబెరాల్ మాట్లాడుతూ.. ఏపీలో పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో ఉంది. ఏపీ పర్యాటక విధానం ఉత్తమంగా ఉంది. పర్యాటక రంగంలో ప్రీమియర్ డెస్టినేషన్‌గా ఏపీ ఉందని కితాబిచ్చారు. రెన్యూ పవర్ ఎండీ సుమంత్ సిన్హా మాట్లాడుతూ.. పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం చాలా అవసరం. పరిశ్రమల అభివృద్ధికి ఏపీలో మంచి పాలసీలు ఉన్నాయి. పరిశ్రమల పట్ల ఏపీలో పాజిటివ్ అప్రోచ్ ఉంది. ఇంధన రంగంలో ఏపీకి 3 అవార్డులు రావడం ప్రశంసనీయం. పవన, సౌర విద్యుత్ రంగంలో ఏపీలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సీఎం జగన్ దార్శనికతతో తొందరగా అనుమతులు ఇస్తున్నారు. ఏపీలో ఉన్నతాధికారులు వేగంగా స్పందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏపీలో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాం అని హామీ ఇచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చాలా సంతోషంగా ఉంది.. సుస్థిర అభివృద్ధి ప్రపంచానికి చాలా ముఖ్యం
-
6లక్షల మందికి ఉపాధి అవకాశాలు: సీఎం జగన్
-
సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ పాలన..!
-
త్వరలోనే విశాఖ నుంచే పరిపాలన: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పారిశ్రామిక అవకాశాలు, భవిష్యత్త్‌లో పెట్టుబడులపై కీలక ప్రసంగాలు చేశారు. రాబోయే రోజుల్లో భారీ పెట్టనున్నట్టు తెలిపారు. కాగా, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మిట్ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘ఏపీకి రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెబుతున్నాను. 340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయి. తొలిరోజు 92 ఎంవోయూలు రాగా మొత్తం 340 ఎంవోయూలు.. దీని ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఏపీలో కీలక రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చాము. రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏపీ భౌగోళికంగా పరిశ్రమలకు అనుకూలం. పెట్టుబడులకే కాదు ప్రకృతి అందాలకు కూడా విశాఖ నెలవు. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతం. ఏపీలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పోర్టులకు సమీపంలో పుషల్కంగా భూములు ఉన్నాయి. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్స్ ఉంటే అందులో 3 ఏపీలోనే ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు నంబర్ వన్‌గా ఉన్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540 సేవలు అందిస్తున్నాము. అలాగే, త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్‌గా రాజధానిగా అవుతుంది. త్వరలో విశాఖ నుంచే పరిపాలన సాగిస్తామని స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీలతో పారిశ్రామికాభివృద్ధి జరుగుతోంది. ఒక్క ఫోన్ కాల్‌తో సమస్యలు పరిష్కరిస్తాము. భవిష్యతులో గ్రీన్, హైడ్రో ఎనర్జీల్లో ఏపీదే కీలక పాత్ర అని అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు - ఎన్టీపీసా ఎంవోయూ(రూ. 2..35లక్షల కోట్లు) - ఏబీసీ లిమిటెట్ ఎంవోయూ(రూ. 1.20 లక్షల కోట్లు) - రెన్యూ పవర్ ఎంవోయూ(రూ. 97, 550 కోట్లు) - ఇండోసాల్ ఎంవోయూ(రూ. 76, 033 కోట్లు) - ఏసీఎమ్ఈ ఎంవోయూ(రూ. 68,976 కోట్లు) - టీఈపీఎస్ఓఎల్ ఎంవోయూ( రూ. 65, 000 కోట్లు) - జేఎస్‌డబ్యూ గ్రూప్(రూ. 50, 632 కోట్లు) - హంచ్ వెంచర్స్(రూ. 50 వేల కోట్లు) - అవాదా గ్రూప్( రూ 50 వేల కోట్లు) - గ్రీన్ కో ఎంవోయూ(47, 600 కోట్లు) - ఓసీఐఓఆర్ ఎంవోయూ (రూ. 40వేల కోట్లు) - హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ (రూ. 30వేల కోట్లు) - వైజాగ్ టెక్ పార్క్ (రూ. 21,844 కోట్లు) - అదానీ ఎనర్జీ గ్రూప్ (రూ.21, 820 కోట్లు) - ఎకోరెన్ ఎనర్జీ (రూ.15,500 కోట్లు) - సెరంటికా ఎంవోయూ (రూ. 12,500 కోట్లు) - ఎన్‌హెచ్‌పీసీ ఎంవోయూ (రూ.12వేల కోట్లు) - అరబిందో గ్రూప్ (రూ.10, 365 కోట్లు) - ఓ2 పవర్ ఎంవోయూ ( రూ.10వేల కోట్లు) - ఏజీపీ సిటీ గ్యాస్ (రూ. 10వేల కోట్లు) - జేసన్ ఇన్ఫ్రా ఎంవోయూ (రూ. 10వేల కోట్లు) - ఆదిత్య బిర్లా గ్రూప్ (రూ. 9,300 కోట్లు) - జిందాల్ స్టీల్ (రూ. 7500 కోట్లు) -
ఏపీ ప్రభుత్వం మద్దతు అమోఘం
-
మహానేత వైఎస్ఆర్ను గుర్తుచేసిన అపోలో వైస్ చైర్ పర్సన్ ప్రీతారెడ్డి..!
-
ఏపీలో రోడ్ కనెక్టవిటీ విద్యుత్ సోకార్యాలు చాలా బాగున్నాయి
-
టొరే ఇండస్ట్రీస్ ఎండీ మసహీరో హమగుచి స్పీచ్
-
Global Investors Summit 2023: ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి స్పీచ్
-
ఇండియా ఇండస్ట్రియల్ మ్యాప్‌లో ఏపీ దూసుకుపోతుంది..!
-
సమ్మిట్ ను ప్రారంభించిన సీఎం జగన్
-
Global Investors Summit: ఏపీలో జిందాల్ స్టీల్ భారీ పెట్టుబడులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సందర్బంగా ఏపీలో పెట్టుబడులపై వివిధ కంపెనీలు తన పెట్టుబడులను ప్రకటించారు. జిందాల్ కంపెనీ రానున్న రోజుల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టు పేర్కొంది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ మాట్లాడుతూ.. ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఏపీలో మౌలిక వసతులు అద్భుతంగా ఉన్నాయి. ఏపీలో పారిశ్రామిక అనుకూల వాతావరణం భేష్. ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ ఉంది. 10వేల కోట్ల పెట్టుబడులతో 10వేల మందికిపైగా ఉపాధి కల్పించబోతున్నట్టు తెలిపారు. ఆర్థిక వృద్ధిలో ఏపీ నంబర్ వన్‌గా ఉందన్నారు. జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు మాట్లాడుతూ.. ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ ఉంది. సీఎం వైఎస్ జగన్ దార్శనికత ప్రశంసనీయం. సీఎం జగన్ విజన్ అద్భుతం. ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుండటంతో ఏపీకి మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయి. రాష్ట్ర జీడీపీ సుస్థిరంగా ఉండటం ప్రశంసనీయం అని అన్నారు. సియాంట్ చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. విశాఖలో మా కంపెనీలకు మరింత విస్తరిస్తాం. ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం. విద్యారంగంలో ఏపీ కృషి అమోఘం. పలు రంగాల్లో సాంకేతిక పాత్ర వేగంగా జరుగుతోంది. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, విదేశీ విద్యాదీవెన పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి జరుగుతోందన్నారు. భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. ప్రపంచాలనికి ఉత్తమమైన మానవ వనరులను ఏపీ అందిస్తోందన్నారు. నైపుణ్యానికి ఏపీ చేస్తున్న కృషి అభినందనీయం. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా వాడుకుంటే ఏపీలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. -
లేజర్ షో... కార్పొరేట్ దిగ్గజాలు ఫిదా
-
డెలిగేట్స్‌కు సీఎం జగన్ ఘన స్వాగతం
-
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి స్వాగతం పలికిన సీఎం జగన్
-
మహానేత వైఎస్సార్‌ను గుర్తుచేసిన అపోలో వైస్ చైర్పర్సన్ ప్రీతా రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా పారిశ్రామికవేత్తలు ఏపీలో పారిశ్రామిక అవకాశాలు, భవిష్యత్త్‌లో పెట్టుబడులపై కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా నాఫ్ సీఈవో సుమ్మిత్ బిదానీ మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది. ఏపీలో రోడ్, కనెక్టివిటీ, విద్యుత్ సౌకర్యాలు బాగున్నాయి. ఇన్వెస్టర్స్ సదస్సు పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగం అని అన్నారు. టోరో ఇండస్ట్రీస్ ఎండీ మసహిరో యమగూచి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ సహకారం మరువలేనిది. పలు కీలక రంగాల్లో వెంటనే అనుమతులు ఇచ్చారు అని అన్నారు. కియా ఇండియా ప్రతినిథి కబ్ డోంగ్ లి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ మద్దతు అమోఘం. రాష్ట్రాభివృద్ధికి కియా తన పాత్ర పోషిస్తోంది. అతిపెద్ద సముద్రతీరం ఉన్న రాష్ట్రం ఏపీ. రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వ సహకారాలు కియా అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఏపీలో కియా కార్యకలాపాలు సులువుగా సాగిస్తోంది. అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకం ఆవిష్కర్త వైఎస్సార్ కృషిని గుర్తు చేశారు. ఆరోగ్య రంగంలో ఏపీ సర్కార్ కృషి అభినందనీయం. ఏపీలో అపోలో కార్యకలాపాలకు పూర్తి సహకారం లభిస్తోంది. ఏపీలో సర్కార్‌తో అపోలో భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది. ఆరోగ్యశ్రీ ఇతర దేశాలకు విస్తరించింది అని అన్నారు. శ్రీ సిమెంట్ కంపెనీ ఛైర్మన్ హరిమోహన్ మాట్లాడుతూ.. ఏపీలో నైపుణ్యమైన మనవ వనరులు ఉన్నాయి. సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ పరిశ్రమల హబ్‌గా మారింది. రానున్న రోజుల్లో 5వేల కోట్ల పెట్టుబడులతో 5వేల మందికి ఉపాధి కల్పింబోతున్నామని సభా వేదికపైనే స్పష్టం చేశారు. ఏపీ పారిశ్రామికీకరణలో శ్రీ సిమెంట్ తనదైన పాత్ర పోషిస్తుందని అన్నారు. -
విశాఖపట్నం : ఘనంగా ప్రారంభమైన జీఐఎస్-2023 (ఫొటోలు)
-
‘నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదు’
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. పారిశ్రామిక దిగ్గజాలు, 45కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు సమ్మిట్‌కు హాజరయ్యారు. ఇక, ఈ సందర్బంగా ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, అవకాశాలపై మంత్రులు కీలక ప్రసంగం చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. రాష్ట్రంలో సీఎం జగన్ సారధ్యంలో బలమైన నాయకత్వం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పటిష్టంగా ఉంది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయి. బిజినెస్ ఇండస్ట్రీపై సీఎం జగన్ మంచి దార్శనికతతో ఉన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్‌గా ఉంది. ఇండియా ఇండస్ట్రీయల్ మ్యాప్‌లో ఏపీ దూసుకుపోతోంది. -
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో సీఎం జగన్, ముఖేష్ అంబానీ (ఫొటోలు)
-
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023: 92 MoUs worth INR 11,87,756 lakh crores
Updates.. స్టాల్స్‌ను పరిశీలించిన గడ్కరీ.. ► 150కి పైగా స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి గడ్కరీతో కలిసి సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం స్టాల్స్‌ను పరిశీలించారు. జీఐఎస్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగం ►ఏపీకి పారిశ్రామిక వృద్ధిలో రోడ్ కనెక్టివిటీ కీలకం ►పోర్టులతో రహదారుల కనెక్టివిటీ బలోపేతం చేప్తాం ►పరిశ్రమలకు లాజిస్టిక్స్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యం ►ఏనీలో 3 పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయి ►ఏపీలో రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు రూ. 20 వేల కోట్లు: కేంద్ర మంత్రి గడ్కరీ ►ఏపీలో పెట్టుబడులను ప్రకటించిన ముకేష్ అంబానీ ►ఏపీలో 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు: ముకేష్ అంబానీ ►ఎనర్జీ డిపార్ట్మెంట్లో రూ, 8, 25, 639 కోట్ల పెట్టుబడులు పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు ► రూ.11లక్షల 87 వేల 756 కోట్ల విలువ కలిగిన 92 ఒప్పందాలు ►ఎన్టీపీసీ ఎంవోయూ(రూ. 2..35లక్షల కోట్లు) ►ఏబీసీ లిమిటెట్ ఎంవోయూ(రూ. 1.20 లక్షల కోట్లు) ►రెన్యూ పవర్ ఎంవోయూ(రూ. 97, 550 కోట్లు) ►ఇండోసాల్ ఎంవోయూ(రూ. 76, 033 కోట్లు) ►ఏసీఎమ్ఈ ఎంవోయూ(రూ. 68,976 కోట్లు) ►టీఈపీఎస్ఓఎల్ ఎంవోయూ( రూ. 65, 000 కోట్లు) ►జేఎస్‌డబ్యూ గ్రూప్(రూ. 50, 632 కోట్లు) ►హంచ్ వెంచర్స్(రూ. 50 వేల కోట్లు) ►అవాదా గ్రూప్( రూ 50 వేల కోట్లు) ►గ్రీన్ కో ఎంవోయూ(47, 600 కోట్లు) ►ఓసీఐఓఆర్ ఎంవోయూ (రూ. 40వేల కోట్లు) ► హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ (రూ. 30వేల కోట్లు) ► వైజాగ్ టెక్ పార్క్ (రూ. 21,844 కోట్లు) ► అదానీ ఎనర్జీ గ్రూప్ (రూ.21, 820 కోట్లు) ►ఎకోరెన్ ఎనర్జీ (రూ.15,500 కోట్లు) ►సెరంటికా ఎంవోయూ (రూ. 12,500 కోట్లు) ►ఎన్‌హెచ్‌పీసీ ఎంవోయూ (రూ.12వేల కోట్లు) ► అరబిందో గ్రూప్ (రూ.10, 365 కోట్లు) ►ఓ2 పవర్ ఎంవోయూ ( రూ.10వేల కోట్లు) ► ఏజీపీ సిటీ గ్యాస్ (రూ. 10వేల కోట్లు) ► జేసన్ ఇన్ఫ్రా ఎంవోయూ (రూ. 10వేల కోట్లు) ►ఆదిత్య బిర్లా గ్రూప్ (రూ. 9,300 కోట్లు) ►జిందాల్ స్టీల్ (రూ. 7500 కోట్లు) ►టీసీఎల్ ఎంవోయూ(రూ. 5,500 కోట్లు) ►ఏఎం గ్రీన్ ఎనర్జీ(రూ. 5,000 కోట్లు) ►ఉత్కర్ష అల్యూమినియం(రూ. 4,500 కోట్లు) ►ఐపోసీఎల్ ఎంవోయూ(రూ. 4,300 కోట్లు) ►వర్షిణి పవర్ ఎంవోయూ(రూ, 4,200 కోట్లు) ►ఆశ్రయం ఇన్ఫ్రా(రూ. 3,500 కోట్లు) ►మైహోమ్ ఎంవోయూ(3,100 కోట్లు) ►వెనికా జల విద్యుత్ ఎంవోయూ(రూ. 3000 కోట్లు) ►డైకిన్ ఎంవోయూ(రూ. 2,600 కోట్లు) ►సన్నీ ఒపోటెక్ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు) ►భూమి వరల్డ్ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు) ►అల్ట్రాటెక్ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు) ►ఆంధ్రా పేపర్ ఎంవోయూ(ర. 2వేల కోట్లు) ►మోండాలెజ్ ఎంవోయూ(రూ. 1,600 కోట్లు) ►అంప్లస్ ఎనర్జీ(రూ. 1,500 కోట్లు) ►గ్రిడ్ ఎడ్జ్ వర్క్స్ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు) ►టీవీఎస్ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు) ►హైజెన్కో ఎంవోయూ(రూ. 1,500 కోట్లు) ►వెల్స్పన్ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు) ►ఒబెరాయ్ గ్రూప్(రూ. 1,350 కోట్లు) ►దేవభూమి రోప్‌వేస్(రూ. 1,250 కోట్లు) ►సాగర్ పవర్ ఎంవోయూ(రూ. 1,250 కోట్లు) ►లారస్ గ్రూప్(రూ. 1,210 కోట్లు) ►ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్స్(రూ. 1,113 కోట్లు) ►డెక్కన్ ఫైన్ కెమికల్స్(రూ. 1,110 కోట్లు) ►దివీస్ ఎంవోయూ(రూ. 1,100 కోట్లు) ►డ్రీమ్ వ్యాలీ గ్రూప్(రూ. 1,080 కోట్లు) ►భ్రమరాంబ గ్రూప్(రూ. 1,038 కోట్లు) ►మంజీరాహోటల్స్ అండ్ రిసార్ట్స్(రూ. 1,000 కోట్లు) ►ఏస్ అర్బన్ డెవలపర్స్(రూ. 1,000 కోట్లు) ►శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్(రూ. 1,000 కోట్లు) ►ఎంఆర్కేఆర్ కన్స్టక్షన్స్(రూ. 1,000 కోట్లు) ►సెల్కాన్ ఎంవోయూ(రూ.1,000 కోట్లు) ►తుని హోటల్స్ ఎంవోయూ(రూ. 1,000 కోట్లు) ►విష్ణు కెమికల్స్(రూ. 1,000 కోట్లు) జీఐఎస్-2023లో సీఎం జగన్ ప్రసంగం ►త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని ►త్వరలో విశాఖ నుంచి పరిపాలన సాగిస్తాం ►ఏపీ కీలక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు ►ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు నంబర్‌వన్ ►ఏపీలో సులువైన పారిశ్రామిక విధానం ►నైపుణ్యాభివద్ధి కాలేజీలతో పారిశ్రామికాభివృద్ధి ►గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540 సేవలు ►రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరిగాయి ► దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు వస్తుంటే.. ఏపీలోనే 3 పారిశ్రామిక కారిడార్లు ►పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలతో నంబర్‌వన్‌గా నిలిచాం ►గ్రీన్ ఎనర్జీపై ప్రధాన ఫోకస్ ►తొలిరోజే 92 ఎంవోయూలు.. ► మొత్తం రూ 13 లక్షల కోట్ల పెట్టుబడులు ► మొత్తం 20 రంగాల్లో పెట్టుబడులు ►దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది ►340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయి ► మొత్తం 340 ఏంవోయూలు.. 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ముఖేష్ అంబానీ స్పీచ్ ►సమ్మిట్‌లో భాగస్వామ్మనైందుకు సంతోషంగా ఉంది: ►పలు రంగాల్లో ఏపీ నంబర్‌వన్‌గా మారుతున్నందుకు శుభాకాంక్షలు: ముఖేష్ అంబానీ ►ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయి ►పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ నుంచే వచ్చారు ►నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ కీలకం కాబోతుంది: ముఖేష్ అంబానీ సజ్జన్ భుజంకా స్పీచ్ ►ఏపీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మంచి సహకారం ►ఏపీలో మా కంపెనీ మరింత విస్తరణకు సిద్ధంగా ఉంది సెంచరీ ఫ్లై బోర్డ్స్ చైర్మన్ ►ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషకరం: కరణ్ అదానీ ►ఏపీలో మౌలిక సదుపాయాలు బాగాన్నాయి ►15 వేల మెగావాట్ల వపర్ ప్రాజెక్ట్ అభివృద్ధి -కరణ్ అదానీ, సీఈవో అదానీ పోర్ట్స్ ►ఏపీలో వేల కోట్ల పెట్టబడులు పెట్టబోతున్నాం రెన్యూ పవర్ ఎండీ సుమంత్ సిన్హా ►ఏపీలో పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో ఉంది: ఒబెరాయ్ హోట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అర్జున్‌ఒబెరాయ్ ►సీఎం జగన్ దార్శనికతతో తొందరగా అనుమతలు భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా ప్రసంగం ►ప్రపంచానికి ఉత్తమమైన మానవ వనరులను ఏపీ అందిస్తోంది ►ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి ►వాటిని సమర్ధవంతంగా వాడుకుంటే ఏపీలో మరింత అభివృద్ధి ►నైపుణ్యాభివృద్ధికి ఏపీ చేస్తున్న కృషి ప్రశంసనీయం సియాంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి స్పీచ్ ►విశాఖలో మరిన్ని సేవలు విస్తరిస్తాం ►ఏపీలో సంక్షేమ పథకాలు అద్భుతం ►ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం ►విద్యారంగంలో ఏపీ కృషి అమోఘం ►పలు రంగాల్లో సాంకేతిక పాత్ర వేగంగా జరుగుతోంది ►అమ్మఒడి, విద్యాకానుక, విద్యాదీవెన, విదేశీ విద్యా దీవనె పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు స్పీచ్ ►సీఎం జగన్ విజన్ అద్భుతం ►సీఎ జగన్ దార్శనికత ప్రశంసనీయం ►ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది ►ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది ►ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ ఉంది ►ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతండటంతో ఏపికి మరిన్ని పరిశ్రమలు ►రాష్ట్ర జీడీపీ సుస్థిరంగా ఉండటం ప్రశంసనీయం ►ఏపీలో జిందాల్ స్టీల్ భారీ పెట్టుబడులు ►రూ. 10 వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించిన నవీన్ జిందాల్ ►ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది ►రూ. 10 వేల కోట్ల పెట్టుబడులతో 10వేల మందికిపైగా ఉపాధి ►ఆర్థిక వృద్ధిలో ఏపీ నంబర్‌వన్‌గా ఉంది ►వేదికపై రూ. 10 వేల కోట్ల పెట్టుబడి ప్రకటించిన నవీన్ జిందాల్ మార్టిన్ ఎబర్ హార్డ్, టెస్లా కో ఫౌండర్ స్పీచ్ ►గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది ►గ్రీన్ ఎనర్జీ పట్ల ఏపీ ఆసక్తి ప్రశంసనీయం ►సుస్థిర అభివృద్ధి ప్రపంచానికి చాలా ముఖ్యం టోరే ఇండస్ట్రీస్ ఎండీ మసహిరో యమగూచి స్పీచ్ ►ఏపీ ప్రభుత్వం సహకారం మరువలేనిది ►పలు కీలక రంగాల్లో వెంటనే అనుమతులు కియా ఇండియా ప్రతినిధి కబ్ డోంగ్ లి ప్రసంగం ►రాష్ట్ర అభివృద్ధిలో కియా తన పాత్ర పోషిస్తుంది ►ప్రభుత్వ సహకారాలు కియా అభివృద్ధికి దోహదపడుతున్నాయి ►ఏపీలో కియా కార్యకలాపాలు సులువుగా సాగిస్తోంది ►ఏపీ ప్రభుత్వ మద్దతు అమోఘం శ్రీ సిమెంట్ చైర్మన్ హరిమోహన్ స్పీచ్ ►ఏపీలో నైపుణ్యమైన మానవ వనరులు ఉన్నాయి: ►జగన్ నాయకత్వంలో ఏపీ పరిశ్రమల హబ్‌గా మారింది ►కర్బన రహిత వాతావరణం కోసం ఏపీ కృషి ప్రశంసనీయం ►ఏపీ పారిశ్రామికీకరణలో శ్రీసిమెంట్ తనదైన పాత్ర పోషిస్తోంది ►రూ. 5వేల కోట్లతో ఏపీలో శ్రీ సిమెంట్ పెట్టుబడులు ►శ్రీ సిమెంట్ ద్వారా 5 వేల మందికి ఉపాధి ►వేదికపైనే ప్రకటించిన శ్రీ సిమెంట్ చైర్మన్ హరిమోహన్ అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు ►ఆరోగ్య రంగంలో ఏపీ సర్కార్ కృషి అభినందనీయం ►ఏపీ సర్కార్‌తో అపోలో భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది ►ఆరోగ్యశ్రీ పథకం ఆవిష్కర్త వైఎస్పార్‌కృషిని గుర్తు చేసిన ప్రీతారెడ్డి ►ఆరోగ్యశ్రీ పథకం ఇతర దేశాలకు విస్తరించింది నాఫ్ సీఈవో సుమ్మిత్ బిదానీ ప్రసంగం ►పరిశ్రమలకు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం ►ఏపీలో రోడ్ కనెక్టివిటీ, విద్యుత్ సౌకర్యాలు బాగున్నాయి ►ఇన్వెస్టర్స్ సదస్సు పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగం మంత్రి బుగ్గన ప్రసంగం ►ఏపీలో సహజ వనురులు పుష్కలంగా ఉన్నాయి: మంత్రి బుగ్గన ►నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవలేదు ►పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయి ►పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ►బిజినెస్ ఇండస్ట్రీలపై సీఎం జగన్ మంచి దార్శినికతతో ఉన్నారు ►ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉంది ►ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉంది ►ఇండియా ఇండస్ట్రియల్ మ్యాప్‌లో ఏపీ దూసుకుపోతోంది జీఐఎస్‌లో మంత్రి అమర్నాథ్ ప్రసంగం ►రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు: మంత్రి గుడివాడ అమర్నాథ్ ►ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది ►సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్ పాలన ►రాష్ట్రంలో సీఎం జగన్ సారథ్యంల బలమైన నాయకత్వం ఉంది ►ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పటిష్టంగా ఉంది 10:36AM ► జ్యోతి ప్రజ్వలన అనంతరం సీఎస్ జవహర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం ►వీడియో ప్రజెంటేషన్ ద్వారా పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం ఘనస్వాగతం ►అడ్వాంటేట్ ఆంధ్రప్రదేశ్‌పై పలు వివరాలతో వీడియో ప్రజంటేషన్ ►వివిధ రంగాల్లో ఏపీ సాధిస్తున్న పురోగతిపై వీడియో ప్రజెంటేషన్ 10:34AM ►విశాఖలో ఘనంగా ప్రారంభమైన జీఐఎస్ 10:32AM ► జ్యోతిని వెలిగించి సదస్సును ప్రారంభించిన సీఎం జగన్ 10:30AM ► జీఐఎస్‌లో ఏపీ రాష్ట్ర గీతం ‘మా తెలుగు తల్లికి’ ఆలాపన ► అలరించిన లేజర్ షో ► సభా వేదికకు చేరుకున్న సీఎం జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – 2023 ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ ప్రాంగణంలో పలువురు డెలిగేట్స్.. వారిని ఆత్మీయంగా పలకరిస్తున్న సీఎం జగన్ 10:10 AM ►జీఐఎస్‌కు చేరుకుంటున్న పారిశ్రామిక దిగ్గజాలు ►ప్రత్యేక కాన్వాయ్‌లో జీఐఎస్ సదస్సుకు ముఖేష్ అంబానీ ► పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి స్వాగతం పలికిన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు గుడివాడ అమర్నాథ్, విడదల రజినీ ►జీఐఎస్‌కు పారిశ్రామికవేత్తలు కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, నవీన్ జిందాల్, జీఎం రావు, జీఎంఆర్, ప్రీతారెడ్డి ►విశాఖ చేరుకున్న యూకే డిప్యూటీ హైకమిషనర్ 09:51AM ఏయూ ప్రాంగణానికి డెలిగేట్స్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – 2023కు హాజరయ్యేందుకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ ప్రాంగణానికి చేరుకుంటున్న డెలిగేట్స్. 09:30AM ఏయూ ప్రాంగణానికి బయల్దేరిన సీఎం జగన్ 👉 : గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ – 2023కు హాజరయ్యేందుకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ ప్రాంగణానికి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. 👉 :దారిపొడవునా సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన విశాఖవాసులు ఆహుతులకు ఆత్మీయ స్వాగతం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ ప్రాంగణంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ - 2023కు హాజరవుతున్న ఆహుతులకు సాంప్రదాయ నృత్యరూపకాలతో ఆత్మీయ స్వాగతం పలుకుతున్న కళాకారులు. 👉: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023.. దేశ, విదేశీ కార్పోరేట్ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. రాష్ట్ర చరిత్రలో పారిశ్రామిక అభివృద్ధి గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా వాస్తవితకు దగ్గరగా ప్రస్తుత సదస్సు జరగబోతుంది. కీలక పెట్టుబడులే ప్రధాన లక్ష్యం 👉 : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే సదస్సులో రాష్ట్రంలో ఉన్న 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 👉 : దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, హాజరవుతున్నారు. 👉 : 45 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు 18 వేలు దాటడం విశేషం. ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, అర్జున్ ఒబెరాయ్, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, మార్టిన్ ఎబర్ హార్డ్డ్, హరిమోహన్ బంగూర్, సజ్జన్ భజాంకా వంటి 30కి పైగా కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు రెండు రోజుల సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సదస్సు ఏర్పాట్లపై సీఎం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. గురువారం సాయంత్రమే విశాఖకు చేరుకుని, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమరనాథ్‌లు సభా స్థలి, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్పొరేట్ ప్రముఖులు విమానాశ్రయం నుంచి నేరుగా సభా స్థలికి చేరుకునేందుకు మూడు హెలిపాడ్స్‌ను సిద్ధం చేశారు. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. తొలిసారిగా స్నిఫర్ డాగ్స్‌తో కే9 సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. 14 రంగాల్ని ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం 👉: రాష్ట్రంలో సరళమైన పారిశ్రామిక విధానం, సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతకు ఆకర్షితులై దిగ్గజ పరిశ్రమలన్నీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాయి. అడ్వాంటేజ్ ఏపీ పేరుతో రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతుల్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఈ సదస్సు జరగనుంది. మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలో 90 శాతానికి పైగా గ్రౌండ్ అయ్యాయి. అదే స్ఫూర్తితో ఈ సదస్సులో చేసుకునే ఒప్పందాలు 100 శాతం గ్రౌండ్ అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. 👉: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మెరుగైన అవకాశాలు ఉన్న 14 రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, హెల్త్‌కేర్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్స్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాస్యుటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్ అండ్ అప్పరెల్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్స్ తదితర రంగాలపై ఫోకస్ చేస్తోంది. 👉: ఈ రంగాలకు సంబంధించిన కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. వారంతా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఆడియో వీడియో విజువల్ ప్రదర్శన అనంతరం సంబంధిత అధికారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రసంగించనున్నారు. 👉: సభా ప్రాంగణానికి పక్కనే ఉన్న మరో గదిలో 20కి పైగా బ్రేక్ అవుట్ బిజినెస్ సెషన్లు జరగనున్నాయి. సభా ప్రాంగణంలోనే సీఎం కార్యాలయం.. లాంజ్, సమావేశ మందిరం, వ్యక్తిగత గదులను సిద్ధం చేశారు. ఆ పక్కనే మంత్రులకు, మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా డైనింగ్ సౌకర్యం కల్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెట్టుబడులకు పట్టం... ప్రగతికి సాక్ష్యం
‘మనసుంటే మార్గం ఉంటుంద’నే మన తెలుగువాళ్ల నానుడి జగన్ ప్రభుత్వ వ్యవహార శైలికి చక్కగా నప్పుతుంది. రాష్ట్ర అభివృద్ధి కేవలం ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటేనే సాధ్యం అనేది ఈ గ్లోబల్ యుగంలో అవాస్తవం అని వైసీపీ ప్రభుత్వం నిరూపిస్తోంది. ఆయా ప్రాంతాలలో ఉన్న వనరుల లభ్యతను అధ్యయనం చేసి... మూడు ప్రాంతాలలో స్థానిక పరిస్థితులకు అనుకూలమైన పరిశ్రమల స్థాపనకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. దేశంలోనే రెండో అతి పొడవైన కోస్తా తీరాన్ని కలిగి ఉన్న ఏపీ... అద్భుతమైన వ్యూహంతో దానిని అభివృద్ధి వనరుగా మార్చుకో చూడటం ఇందుకు ఒక ఉదాహరణ. విశాఖలో గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇటువంటి ఎన్నో వనరుల వినియోగాన్ని సాకారం చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక విప్లవానికి అంకురార్పణ జరుగుతోంది. పారిశ్రామిక ప్రగతి ఇప్పటివరకు ఒక లెక్క... ఇకపై ఇంకో లెక్క. గత ప్రభుత్వాలకు అసాధ్యమైన పారిశ్రామిక అభివృద్ధిని చేసి చూపించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. మనసుపెట్టి ప్రయత్నిస్తే పరిశ్రమలు రాష్ట్రానికి పరుగులు తీస్తాయన్న గట్టి నమ్మకంతో తన శ్రేణులను నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. గత ప్రభుత్వాలు రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని చిన్నచూపు చూశాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లా లకు పరిశ్రమలను తీసుకురావాలన్న ఆలోచన ఆయా ప్రభుత్వాలకు కలగకపోవడం వల్లే ఈ రెండు ప్రాంతాలు అభివృద్ధిలో వెనకబడి పోయాయి. రాష్ట్ర విభజన తర్వాత అయినా రెండు ప్రాంతాలపై దృష్టి సారించిన దాఖలా గత ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఫలితంగా వేలాది మంది వలసపోవలసిన పరిస్థితి వచ్చింది. కానీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి పదునైన ప్రణాళిక రచించారు. రాష్ట్రంలో ఉన్న 974 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతాన్ని ఎలా ఉపయోగించుకోవాలో గత ప్రభుత్వాలకు తెలియలేదు. తీరం వెంబడి పెద్ద ఎత్తున పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి భారీ అవకాశాలు ఉన్నాయని గ్రహించిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు అడ్రస్ లేకుండా పడి ఉన్న ‘మ్యారిటైమ్ బోర్డు’ను వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ బోర్డు ద్వారా 15 వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో... పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పునాది వేశారు. ఇవి సాకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. గత ప్రభుత్వం పోర్టుల పేర్లు చెప్పి పునాదిరాళ్లు వేసి ప్రచారం చేసుకుందే తప్ప... ఒక పోర్టు పని కూడా ప్రారంభించలేక పోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల కాలాన్ని కరోనా మింగేసింది. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూనే భవిష్యత్తు ప్రణాళికలపై విస్తృతమైన ఆలోచనలు చేస్తూ వచ్చింది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకురావాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు’ను విశాఖలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించింది. ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఈ సదస్సుకు ఆహ్వానించారు. దేశ, విదేశాల నుంచి సుమారు 26 చార్టెడ్ ఫ్లైట్లలో పారిశ్రామిక ప్రముఖులు తరలి వస్తున్నారంటే ఈ సదస్సుకున్న ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి జగన్ నాయ కత్వం, వాణిజ్యవేత్తలతో ఆయన నెరపే స్నేహపూర్వక శైలి, పారదర్శక పరిపాలన, కార్యాలయాలకు వెళ్లనవసరం లేకుండానే ఆన్లైన్లో ఒక్క క్లిక్‌తో అన్ని అనుమతులు పొందగలగడం... పెట్టుబడిదారులు ఏపీ వైపుకు రావడానికి కారణాలు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు విశాఖలో నిర్వహించడానికి ప్రత్యేక కారణాలు లేకపోలేదు. సౌందర్యానికి పుట్టినిల్లు అయిన ఈ నగరాన్ని దేశ పటంలో అగ్రవగామిగా నిలపాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. భారతదేశానికి గేట్ వేగా నిలిచిన విశాఖ... పారిశ్రామిక నగరంగా ఇప్పటికే గుర్తింపు పొందింది. తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఈ నగరానికి మరిన్ని పరిశ్రమలను తీసుకువస్తే, పారిశ్రామిక రాజధానిగా వెలుగొందుతుందన్నది ఆయన ఆలోచన. పరిపాలన రాజధానిని విశాఖకు తీసుకురావాలని నిర్ణయించుకున్న ఆయన ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తూర్పు తీరంలో రోడ్డు, రైలు, జల, వాయు రవాణా నెట్ వర్క్ సౌకర్యం కల్గిన రెండవ పెద్ద పారిశ్రామిక నగరం విశాఖ. అద్భుతమైన సహజ నౌకాశ్రయం ఇక్కడే ఉంది. విశాఖ నుంచి దేశ నలుమూలకూ ప్రయాణించేందుకు అనువైన ఫోర్ వే నెట్ వర్క్ మార్గం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పోర్ట్‌లు, సముద్ర వాణిజ్యం, సెజ్‌లు, కారిడార్లు, భారీ పరిశ్రమలు, విద్యుత్తు పరిశ్రమలు, సర్వీసు సెక్టార్, వేలల్లో చిన్న తరహా పరిశ్రమలు, రక్షణ, ఫార్మా, ఆయుర్వేదం, ఐటీ, వ్యవసాయం, గిరిజన ఉత్పత్తులు, మైనింగ్ పరిశ్రమలు, విద్యా హబ్, హెల్త్ టూరిజం, అంతర్జాతీయ పర్యాటక రంగాల నుంచి విశాఖకు ఎంతో ఆదాయం లభిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం 2019 జూన్ నుంచి 2022 డిసెంబర్ వరకూ వివిధ ఔట్రీచ్ కార్యక్రమాలను నిర్వహించింది. 2019 ఆగస్ట్‌లో నిర్వహించిన తొలి ఔట్ రీచ్‌లో 34 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, కాన్సులేట్ జనరళ్లు భాగస్వా ములయ్యారు. 2022 ఫిబ్రవరి 11 నుండి ఫిబ్రవరి 17 వరకు దుబాయ్ ఎక్స్‌పోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్గొంది. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లోనూ ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రులు– అధికారుల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల స్థాపన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యక్ష, పరోక్షంగా 38,000 మందికి ఉపాధి కల్పించే 4 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది. 2019–2022లో 60.5 వేల మందికి ఉపాధి కల్పించేందుకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం 21 భారీ, మెగా ప్రాజెక్టులకు తగిన ప్రోత్సా హకాలను మంజూరు చేసింది. వాటిలో జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్, ఇండోసొల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి మేజర్ పరిశ్రమలు ఏపీలో ఈ మూడేళ్ల కాలంలో కొలువుదీరాయి. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధానాలు రూపొందించి అనేక పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందజేస్తోంది. ‘పారిశ్రామిక అభివృద్ధి విధానం 2020–23’,‘ఆంధ్ర ప్రదేశ్ లాజిస్టిక్స్ పాలసీ 2022–27’, ‘ఆంధ్రప్రదేశ్ ఎగుమతి ఎక్స్ పోర్ట్స్ ప్రమోషన్ పాలసీ 2022–27’ వంటి అనేక విధానాలను రూపొందించి జగన్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకూ, ఇప్పటికే స్థాపించినవాటికీ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ప్రోత్సాహ కాలు అందిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం ఎమ్ఎస్ఎమ్ఈ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోంది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఎంఎస్ఎమ్ఈలు ఎదుర్కొన్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం రూ. 962.42 కోట్ల ‘రీస్టార్ట్’ ప్యాకేజీతో ముందుకు వచ్చింది. ఇది సుమారు 8 వేల ఎమ్మెస్‌ఎమ్‌ఈలు ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుని నిలబడటానికి సహాయపడింది. అనుకూలమైన పారిశ్రామిక విధానాల ద్వారా అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా ‘వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం’ వంటి పథకాలను రూపొందించింది ప్రభుత్వం. ఈ పాలసీ ప్రధాన లక్ష్యం... పరిశ్రమలకు, ప్రత్యేకించి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వంటివారితో సహా నిరుపేద వర్గాలచే ప్రారంభించబడిన ఎమ్ఎస్ఎమ్ఈలకు అదనపు ప్రోత్సాహాన్ని అందించడం. గత పాలకులు... ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత అధికారాన్ని వెలగబెట్టినవారు సమతుల అభివృద్ధికి ఏమాత్రం కృషిచేయని నేపథ్యంలో వైసీపీ... ఏపీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టి తనదైన విజన్‌తో ముందుకు దూసుకుపోతుందనేది పై వివరాల వల్ల అర్థమవుతోంది. ఈ పురోగామి ప్రయాణంలో విశాఖ సమ్మిట్ కేవలం ఒక మజిలీ మాత్రమే! -గుడివాడ అమర్నాథ్,వ్యాసకర్త ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖల మ్రంతి -
విశాఖపట్నం : సీఎం జగన్‌కు గ్రాండ్ వెల్కమ్ (ఫొటోలు)
-
విశాఖపట్నం: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కి సర్వం సిద్ధం (ఫొటోలు)
-
GIS 2023: అతిథులకు ఆంధ్రా రుచులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)కు దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల వెజ్, నాన్‌వెజ్ రుచులను వీరికి అందించనున్నారు. తొలిరోజు శుక్రవారం మధ్యాహ్నం భోజనంలో బొమ్మిడాయిల పులుసు, గుంటూరు కోడి వేపుడు, రొయ్యల మసాలా, మటన్ కర్రీ, చికెన్ పలావ్, వెజ్ రకాల్లో మష్రూం, క్యాప్సికం కూర, ఆలూ గార్లిక్ ఫ్రై, కేబేజీ మటర్ ఫ్రై, వెజ్ పలావ్, రోటీ, కుల్చా, పన్నీర్ బటర్ మసాలా, మెంతికూర–కార్న్ రైస్, మిర్చి కా సలాన్, టమాటా పప్పు, బీట్రూట్ రసం, మజ్జిగ పులుసు, గోభీ ఆవకాయ, నెయ్యి, వడియాలు, ద్రాక్ష పండ్ల పచ్చడి, చల్ల మిర్చి ఉంటాయి. అలాగే కట్ ఫ్రూట్స్, ఐస్‌క్రీం, పేస్ట్రీ, కాలా జామున్, జున్ను చంద్రకాంతలు సిద్ధం చేస్తున్నారు. రెండో రోజూ విశేషంగానే.. రెండో రోజు శనివారం లంచ్‌లో రష్యన్ సలాడ్స్, వెజ్ సలాడ్లతో పాటు రుమాలి రోటీ, బటర్ నాన్ ఇస్తారు. నాన్ వెజ్ రకాల్లో ఆంధ్రా చికెన్ కర్రీ, చేప ఫ్రై, గోంగూర, రొయ్యల కూర, ఎగ్ మసాలా, మటన్ పలావ్.. వెజ్ ఐటమ్స్‌లో వెజ్ బిర్యానీ, కరివేపాకు రైస్, కడాయ్ పన్నీరు కూర, క్యారెట్ బీన్స్ కొబ్బరి ఫ్రై, వంకాయ మెంతి కారం, బెండకాయ–జీడిపప్పు ఫ్రై, పప్పుచారు, మిరియాల రసం, మజ్జిగ పులుసు, ఉలవచారు–క్రీం వంటివి ఉన్నాయి. ఇంకా కట్ ఫ్రూట్స్, ఐస్‌క్రీం, బ్రౌనీ, గులాబ్‌జామ్, అంగూర్ బాసుంది, డబుల్కా మీఠా ఇస్తారు. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, వడ, టమాటా బాత్, హాట్ పొంగల్, ఉదయం స్నాక్స్‌లో ప్లమ్ కేక్, డ్రై కేక్, వెజ్ బుల్లెట్, మఫిన్స్, స్ప్రింగ్ రోల్స్, సాయంత్రం స్నాక్స్‌లో కుకీస్, చీజ్ బాల్స్, డ్రై ఫ్రూట్ కేక్, ఫ్రూట్ కేక్, కట్ మిర్చి బజ్జీలు, టీ, కాఫీ ఉంటాయి. -
122 ప్రాజెక్టులు.. రూ.21,050.86 కోట్లు
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి ప్రసాదించిన సిరిసంపదలు.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రాలు.. అబ్బురపరిచే పర్యాటక సోయగాలు.. దట్టమైన అడవులు.. కొండ కోనలు.. మన్యాలు.. సుందరమైన నదీతీరాలు.. అత్యంత సువిశాల సాగరతీరం.. ఇదీ ఆంధ్రప్రదేశ్ పర్యాటక వైభవం! సహజ సిద్ధమైన అందాలతో స్వర్గధామంగా భాసిల్లుతున్న రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థలు సిద్ధమయ్యాయి. విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023లో పర్యాటక రంగంలో రూ.21,050 కోట్ల పెట్టుబడులతో ఏకంగా 122 ప్రాజెక్టులకు సంబంధించి ఎంవోయూలు కుదుర్చుకునేందుకు ముందుకొచ్చాయి. సీఎం వైఎస్ జగన్‌సమక్షంలో ఒప్పందాలు చేసుకుని ఏకంగా 39 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. ♦ ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ స్థానంలో నిలబెట్టాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు రూపకల్పన జరుగుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లానూ పర్యాటక ఖిల్లాగా మార్చేందుకు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా మారుతోంది. ప్రతి జిల్లాలో ఒక ప్రాజెక్టు వచ్చేలా ఎంవోయూలు సిద్ధమయ్యాయి. ♦ పర్యాటకాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ అందిపుచ్చుకొని అభివృద్ధి చేసే విధంగా ప్రాజెక్టులని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి రోడ్‌షోలో మంచి స్పందన లభించింది. ఏపీలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు విస్తృత అవకాశాలు ఉండటంతో పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రూ.కోటి నుంచి రూ.1,350 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టేందుకు వివిధ ప్రాజెక్టులతో ముందుకొచ్చాయి. తాజ్‌గ్రూప్, ఒబెరాయ్, గ్యారీసన్ గ్రూప్స్, తులి హోటల్స్, మంజీరా గ్రూప్, డీఎక్స్ఎన్, టర్బో ఏవియేషన్, ఇండియన్ ఏసియన్, రివర్‌బే, పోలో టవర్స్, లాలూజీ అండ్ సన్స్, డ్రీమ్‌వ్యాలీ, సన్ గ్రూప్, విండ్ హెవెన్, ఆదిత్యా గేట్‌వే, సన్‌రే లాంటి ప్రముఖ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ♦ కన్వెన్షన్ సెంటర్లు, స్టార్ హోటళ్లు, వాటర్ స్పోర్ట్స్, రిసార్టులు, సీ ప్లేన్ సర్విసులు, వెల్నెస్ సెంటర్లు, మెగావీల్, అడ్వెంచర్, బీచ్ ఫ్రంట్ రిసార్టులు, వాటర్ థీమ్ పార్కులు, డిన్నర్ క్రూయిజ్, స్విమ్మింగ్ పూల్స్, కల్చరల్ విలేజ్‌లు, యాటింగ్, రెస్టోబార్, స్కైలాంజ్, రేసింగ్ ట్రాక్‌లు, కేబుల్‌కార్, గోల్ఫ్‌కోర్స్, సఫారీ టూరిజం.. ఇలా రూ.21050.86 కోట్లతో 39,022 మందికి ఉపాధి కల్పించేలా 122 ప్రాజెక్టులకు ఎంవోయూలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో 4వతేదీన భాగస్వామ్య ఒప్పందాలకు శ్రీకారం చుట్టేలా పర్యాటక శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. పర్యాటకాభివృద్ధికి అపార అవకాశాలున్నా టీడీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టూ అమలు చేయలేదు. సమీక్షలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు మినహా కార్యాచరణ శూన్యం. -
ఆత్మీయ అతిథులకు అటవీ ఉత్పత్తులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధిలో కొత్త చరిత్ర సృష్టిస్తూ విశాఖ వేదికగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా దేశ విదేశీ ప్రముఖులకు ఆత్మీయ ఆతిథ్యంతోపాటు మధుర స్మృతులను మిగిల్చే కానుకలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక జ్ఞాపికల కిట్స్‌తో పాటు గిరిజన సహకార సంస్థకు చెందిన ఉత్పత్తుల కిట్లను కూడా అందించనున్నారు. జీఐఎస్ సదస్సుకు దాదాపు 3 వేల మంది ప్రముఖులతో కలిపి మొత్తం 8 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ కలకాలం గుర్తుండే ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ జ్ఞాపకాల్ని తమతో మోసుకెళ్లేలా ప్రత్యేక కానుకలు అందించనున్నారు. స్వచ్ఛమైన ప్రేమను పంచే గిరిజనులు సేకరించిన కల్తీ లేని ఉత్పత్తులను కానుకగా ఇవ్వనున్నారు. నాణ్యమైన జీసీసీ ఉత్పత్తుల్ని దేశ విదేశీ ప్రముఖులకు పరిచయం చేయాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, జీసీసీ ఎండీ సురేష్‌కుమార్ తెలిపారు. ఈ సమ్మిట్‌కు హాజరైన ప్రముఖులకు జీసీసీ గిఫ్ట్స్‌ను అందించనున్నారు. ఇందుకోసం 200 కిట్లను జీసీసీ సిద్ధం చేసింది. నాణ్యమైన తేనె, హెర్బల్ ఆయిల్, పెయిన్ రిలీఫ్ నుంచి అరకు కాఫీ వరకూ 12 రకాల జీసీసీ ఉత్పత్తులు ఈ కిట్లలో ఉంటాయి. -
మిల్లెట్స్‌తో మెరిసిన చిత్రాలు
విశాఖ (ఏయూ క్యాంపస్): గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పలువురి పారిశ్రామిక దిగ్గజాల ఛాయాచిత్రాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవనున్నాయి. ఇవన్నీ చిరుధాన్యాలతో తీర్చిదిద్దినవి కావడమే ఇక్కడ విశేషం. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలపై ప్రజల్లో ఆసక్తి, అవగాహన పెంచేందుకు విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్‌కుమార్ విభిన్నంగా ఛాయాచిత్రాలను రూపొందించారు. భారతీయ రైల్వేలో టెక్నీషియన్–1గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన చిరుధాన్యాలతో దేశం గర్వించే నాయకులు, దిగ్గజ పారిశ్రామికవేత్తల చిత్రాలను తయారు చేశారు. జీఐఎస్, జీ–20 సదస్సులలో ప్రదర్శించడంతో పాటు ప్రముఖులకు, పారిశ్రామిక దిగ్గజాలకు వాటిని బహూకరించే విధంగా నెలల పాటు శ్రమించారు. జొన్నలు, గంట్లు, అరికలు, రాగులు, నల్ల నువ్వులు వంటి వాటితో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు బిర్లా, అంబానీ, అదానీ, ఆనంద్ మహీంద్రా తదితరుల చిత్రాలను రూపొందించారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మేయర్ గొలగాని హరి వెంకటకుమారిలకు గురువారం ఈ చిత్రాలను విజయ్‌కుమార్ చూపించారు. జీఐఎస్‌కు విచ్చేసే అతిథులు, ప్రముఖులకు వీటిని బహూకరించాలని కోరారు. వీటిని పరిశీలించిన మంత్రి అమర్నాథ్ చిత్రకారుడు విజయ్‌కుమార్‌ను అభినందించారు. వీటిని శుక్రవారం జరిగే సమ్మిట్‌లో హాజరయ్యే పారిశ్రామికవేత్తలకు బహూకరిస్తామని చెప్పారు. -
AP: జీఐఎస్ సదస్సు తొలిరోజు ఇలా..
దొండపర్తి(విశాఖ దక్షిణ): ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 9.45 గంటలకు అతిథుల ఆహ్వానం, పరిచయ కార్యక్రమంతో సదస్సు ప్రారంభం కానుంది. రేజర్ షో, మా తెలుగు తల్లికి.. గీతాలాపన, జ్యోతి ప్రజ్వలన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఆ తర్వాత ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉంటుంది. అనంతరం నాఫ్ సీఈఓ సుమిత్ బిదాని, భారత్ ఎఫ్ఐహెచ్ లిమిటెడ్ కంట్రీ హెడ్ అండ్ ఎండీ జోష్ ఫాల్గర్, టొరే ఇండస్ట్రీస్(ఇండియా)ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మసహీరో హమగుచి, కియా ఇండియా నుంచి కబ్ డోంగి లీ, ది ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ ఎన్.శ్రీనివాసన్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉంటుంది. అనంతరం అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ప్రీతిరెడ్డి, శ్రీ సిమెంట్ లిమిటెడ్ చైర్మన్ హరి మోహన్ బంగూర్, సెంచురీ ఫ్లైబోర్డ్స్ చైర్మన్ సజ్జన్ భజంకా, టెస్లా ఇంక్ కో ఫౌండర్ అండ్ మాజీ సీఈఓ మార్టిన్ ఎబర్‌హార్డ్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ చైర్మన్ నవీన్ జిందాల్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆడియో విజువల్ ప్రజెంటేషన్ అనంతరం జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జి.ఎం.రావు, సయింట్ ఫౌండర్ చైర్మన్ బీవీ మోహన్‌రెడ్డి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎం.ఎల్లా, దాల్మియా భారత్ గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా, రెనూ పవర్ సీఎండీ సుమంత్ సిన్హా ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉంటుంది. అనంతరం ఒబెరాయ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అర్జున్ ఒబెరాయ్, సీఐఐ అధ్యక్షుడు సంజీవ్ బజాజ్, అదాని పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ సీఈఓ కరణ్ అదాని, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కె.ఎం.బిర్లా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సీఎండీ ముఖేష్ అంబాని ప్రసంగిస్తారు. అనంతరం ఎంఓయూ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరి కీలక ఉపన్యాసం చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సీఎం ప్రముఖులను సన్మానిస్తారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్.కరికాల వలవన్ వందన సమర్పణ చేస్తారు. ఆ తర్వాత ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది. 4 ఆడిటోరియాల్లో సెషన్స్ మధ్యాహ్నం 3 గంటల నుంచి నాలుగు ఆడిటోరియాల్లో వివిధ విభాగాలకు సంబంధించిన సెషన్స్ జరగనున్నాయి. ఆడిటోరియం 1లో ఐటీ, 2లో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 3లో రెనెవబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్, 4లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్ కంట్రీ సెషన్ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఆడిటోరియం 1లో ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, 2లో స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్, 3లో హెల్త్‌కేర్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్, 4లో ది నెదర్లాండ్స్ కంట్రీ సెషన్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు ఆడిటోరియం 1లో ఎల్రక్టానిక్స్, 2లో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, 3లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, 4లో ట్రాన్స్ఫర్మేటివ్ ఫుడ్ సిస్టమ్స్‌పై ప్రత్యేక హైలెవెల్ సెషన్ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు కూచిపూడి కళా ప్రదర్శన, 8 గంటలకు డ్రోన్ షోతో తొలిరోజు సదస్సు ముగుస్తుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Global Investment Summit: విశాఖ ధగ ధగ
విశాఖ జీఐఎస్ వేదిక నుంచి సాక్షి ప్రతినిధుల బృందం: రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా దేశ, విదేశీ కార్పొరేట్ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023కు వేదికగా విశాఖ సిద్ధమైంది. పారిశ్రామిక అభివృద్ధికి గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా వాస్తవికతకు దగ్గరగా జరగబోతున్న ఈ సదస్సు కోసం ప్రపంచ వాణిజ్యవేత్తలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే సదస్సులో రాష్ట్రంలో ఉన్న 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, హాజరవుతున్నారు. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు 18 వేలు దాటడం విశేషం. ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, అర్జున్ ఒబెరాయ్, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, మార్టిన్ ఎబర్ హార్డ్డ్, హరిమోహన్ బంగూర్, సజ్జన్ భజాంకా వంటి 30కి పైగా కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు రెండు రోజుల సదస్సులో పాల్గొంటున్నారు. నేటి ఉదయం 10.15 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సదస్సు ఏర్పాట్లపై సీఎం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. గురువారం సాయంత్రమే విశాఖకు చేరుకుని, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమరనాథ్‌లు సభా స్థలి, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్పొరేట్ ప్రముఖులు విమానాశ్రయం నుంచి నేరుగా సభా స్థలికి చేరుకునేందుకు మూడు హెలిపాడ్స్‌ను సిద్ధం చేశారు. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. తొలిసారిగా స్నిఫర్ డాగ్స్‌తో కే9 సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న ప్రజలు 14 రంగాల్ని ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం ► రాష్ట్రంలో సరళమైన పారిశ్రామిక విధానం, సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతకు ఆకర్షితులై దిగ్గజ పరిశ్రమలన్నీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాయి. అడ్వాంటేజ్ ఏపీ పేరుతో రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతుల్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఈ సదస్సు జరగనుంది. మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలో 90 శాతానికి పైగా గ్రౌండ్ అయ్యాయి. అదే స్ఫూర్తితో ఈ సదస్సులో చేసుకునే ఒప్పందాలు 100 శాతం గ్రౌండ్ అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ► రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మెరుగైన అవకాశాలు ఉన్న 14 రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, హెల్త్‌కేర్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్స్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాస్యుటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్ అండ్ అప్పరెల్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్స్ తదితర రంగాలపై ఫోకస్ చేస్తోంది. ► ఈ రంగాలకు సంబంధించిన కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. వారంతా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఆడియో వీడియో విజువల్ ప్రదర్శన అనంతరం సంబంధిత అధికారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రసంగించనున్నారు. ► సభా ప్రాంగణానికి పక్కనే ఉన్న మరో గదిలో 20కి పైగా బ్రేక్ అవుట్ బిజినెస్ సెషన్లు జరగనున్నాయి. సభా ప్రాంగణంలోనే సీఎం కార్యాలయం.. లాంజ్, సమావేశ మందిరం, వ్యక్తిగత గదులను సిద్ధం చేశారు. ఆ పక్కనే మంత్రులకు, మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా డైనింగ్ సౌకర్యం కల్పించారు. ► సభా ప్రాంగణంలో అత్యంత ఆకర్షణీయంగా ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. దీని చుట్టూ వివిధ కంపెనీలకు చెందిన స్టాల్స్ ఉంటాయి. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థకు సంబంధించిన కార్యాలయ నమూనా, లేపాక్షి హస్త కళా ప్రదర్శన స్టాల్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏరోస్పేస్, మారిటైమ్ బోర్డు, కియా మోటర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తదితర పరిశ్రమలకు చెందిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. దారులన్నీ.. వైజాగ్ వైపే.. ► వేదికకు ఎదురుగా ఏయూకు చెందిన మరో 25 ఎకరాల మైదానాన్ని పార్కింగ్ కోసం సిద్ధం చేశారు. ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధులు, కేంద్ర మంత్రులు 25కు పైగా ఛార్టర్డ్ ఫ్లైట్స్‌లో రానున్నారు. వాటికి విశాఖ, రాజమండ్రి ఎయిర్‌పోర్టులలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. తొలిరోజు రాతిర సాగరతీరం సమీపంలోని వుడాపార్క్ ఎంజీఎం గ్రౌండ్స్‌లో అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 500 డ్రోన్లతో లేజర్ ప్రదర్శన ద్వారా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తారు. దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో సీఎం ముఖాముఖి తొలిరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు 21 మంది కార్పొరేట్ ప్రముఖులు ప్రసంగించనున్నారు. 150కి పైగా స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను సీఎం కేంద్ర మంత్రి గడ్కరీతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సీఎం వైఎస్ జగన్.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, కేఎం బిర్లా, కరణ్ అదానీ, అర్జున్ ఒబెరాయ్, సంజీవ్ బజాజ్, ఎబర్‌హార్డ్, నవీన్ జిందాల్, సుమిత్ బిదానీ తదితరులతో ముఖాముఖి చర్చలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని వారికి స్వయంగా వివరించనున్నారు. రెండో రోజు శనివారం ఉదయం 9.15 నుంచి 10.45 గంటల వరకు పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఉదయం ఎంవోయూల అనంతరం ముగింపు సమావేశంలో 10 మందికిపైగా కార్పొరేట్ ప్రముఖులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శర్బానంద సోనోవాల్ ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్రంలో ఉత్పత్తికి సిద్ధమైన పలు యూనిట్లను ముఖ్యమంత్రి జీఐఎస్ వేదిక నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశాఖ విమానాశ్రయంలో సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్న వైఎస్సార్సీపీపీ నేత విజయసాయిరెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం సాక్షి, విశాఖపట్నం: ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023’లో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గురువారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 5 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి సత్యవతి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, సీపీ సీహెచ్ శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు స్వాగతం పలికారు. అనంతరం రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చంద్రబాబు పోతే తప్ప రాష్ట్రం దరిద్రం పోదు: సీదిరి అప్పల రాజు
సాక్షి, శ్రీకాకుళం/విశాఖపట్నం: టీడీపీ ఇండస్ట్రీస్ ఫ్యాక్ట్ చెక్ అనే పుస్తకం విడుదల చేయడంపై మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. వైజాగ్‌లో ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న గొప్ప సందర్బంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా తప్పుడు బుక్‌లెట్స్‌తో ప్రచారం చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 'సత్యం రామలింగ రాజు, కోనేరు ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్‌ను వేదించామంటున్నారు. వారికి మాకు సంబంధం ఏంటి? చంద్రబాబు హయాంలోనే కదా వారిని వేధించింది. మా మనిషి ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి అబద్ధాలు ప్రచారం చేస్తాం అన్నట్లుగా ఉంది. అదానీ లాంటి వ్యక్తి రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. అంబానీ, టాటా, బిర్లా, జిందాల్ వంటి వారు రాష్ట్రం వైపు చూస్తున్నారు. రిలయన్స్ని వెనక్కి పంపామంటున్నారు. చంద్రబాబు హయాంలో లిటిగేషన్ ఉన్న ల్యాండ్‌ని రిలయన్స్‌కి కేటాయించారు. కోర్టు కేసులతో ఇబ్బందులు పడి రిలయన్స్ వెనక్కి వెళ్లింది. ఇది మీ తప్పిదం కాదా..? జాకీ సైతం మాకు మార్కెట్ లేదంటూ వెనక్కి తగ్గారు. చంద్రబాబు హయాంలోనే లేఖ రాసి వెళ్లిపోయారు. ప్రాంక్లిన్ టెంపుల్ టేన్ దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీ. అమర్ రాజా వారు ఏపీలోనే పెట్టుబడి పెట్టాలని రూల్ ఉందా..? విస్తరణలో బాగంగానే తెలంగాణకు వెళ్లారు. అమరాజా కంపెనీ లెడ్ వల్ల ప్రజలకు ఇబ్బందులు అని పీసీబీ నోటీస్ ఇస్తే.. మేం ఇబ్బందులు కు గురి చేసారంటారా? అన్ని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. ఇన్ఫోసిస్ వారి క్యాంపస్.. మొదలుపెడుతోంది. అనేక దిగ్గజ కంపెనీలు విశాఖ కేంద్రంగా వస్తున్నాయి. ఏడు నెలల్లో 40 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని కేంద్రం స్వయంగా చెప్పింది. ఎక్స్ పోర్ట్స్ లో 4వ ర్యాంక్ లో ఉన్నాం. చంద్రబాబు హయాంలోని పారిశ్రామిక బకాయిలు రూ.3,675 కోట్లు సైతం మేం చెల్లించాం , తిరిగి పారిశ్రామిక రాయితీ ఇచ్చాం. విపత్కర పరిస్థితులను తట్టుకుని 11.4% గ్రోత్ సీఎం జగన్ పరిపాలనతో సాధ్యం అయ్యింది. 108 భారీ పరిశ్రమలు మా హయాంలో వచ్చాయి చంద్రబాబుకి సిగ్గు లజ్జాలేదు. ప్రత్యేక హోదా వచ్చి ఉండుంటే .. ఇలా రాసుకునే బాధ ఉండేది కాదు. డబ్బులు కోసం ఒప్పుకుని వచ్చి నంగవాచి వేషాలు వేశారు. అందుకే ప్రజలు గూబమిద కొట్టి పక్కకు తోశారు. సలహాలు ఇచ్చేది పోయి విషం చిమ్ముతావా? చంద్రబాబు పోతే తప్ప రాష్ట్రం దరిద్రం పోదు అని ప్రజలు అనుకుంటున్నారు. 4 వారాల్లో భావనపాడు పోర్టుకు సీఎం జగన్ శంఖుస్థాపన చేస్తారు. భావన పాడు-మూలపేట పోర్టుతో శ్రీకాకుళం దిశ దశ మారనుంది. మెడలు వంచించుకునే స్థితిలో బీజేపీ లేదు. మేం మాటతప్పాం అనే నైతిక బాధ్యత వహించే స్థితిలో కూడా బీజేపీ లేదు. చంద్రబాబు ఏ ఓక్క సమయంలో కూడా హోదాా గురించి అడగలేదు. ఐపాక్ మాకు సలహాదారు అని ఓపెన్ గా చెప్పాం. ఐప్యాక్ మా పార్టీలో భాగం. పవన్ చెప్పగలరా తన స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో. వారికి కూడా సలహాదారులు ఉన్నారు కదా? రోడ్లు ఏవి వేయాలో ఐపాక్ టీం ఏలా డిసైడ్ చేస్తుంది. ఇది అసత్య ప్రచారం' అని సీదిరి అప్పలరాజు టీడీపీపై ఫైర్ అయ్యారు. స్టాల్స్‌ను పరిశీలించిన విడదల రజిని.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పరిశీలించారు. టిీడీపీ హయాంలో జరిగిన సదస్సులో పెట్టుబడులు కాగితాల పైనే జరిగాయాని ఎద్దేవా చేశారు. ఈ సదస్సు ఏపీ లో భారీ పెట్టుబడులకు అనువైన సమయమన్నారు. పారిశ్రామిక పెట్టుబడుల్లో ఏపీ నెంబర్ వన్ కాబోతోందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ఫ్రెండ్లీ ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. చదవండి: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు -
Global Investors Summit 2023: ‘ఆ రంగాల్లో పెట్టుబడులకు పెద్ద ఎత్తున అవకాశాలు’
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ వేదికగా జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(జీఐఎస్)ల్లో భాగంగా పర్యాటక, ఆతిథ్య రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని పర్యాటక శాఖ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ వెల్లడించారు. తొలి రోజు జీఐఎస్‌లో పర్యాటక, ఆతిథ్య రంగాల్లో రూ. 25 వేల కోట్ల పెట్టబడులు రాబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీలో పర్యాటక, ఆతిథ్య రంగాల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున అవకాశాలున్నాయని, ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారని విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడుతూ రజత భార్గవ స్పష్టం చేశారు. రెండు రోజుల జీఐఎస్‌లో 125కి పైగా ఎంఓయూలు చేసుకోబోతున్నామని, ఈ సదస్సులో పాల్గొనడానికి ఒబెరాయ్, ఐటీసీ లాంటి దిగ్గజ హోటళ్ల చైర్మన్లు వస్తున్నారన్నారు. తొలి రోజు ఏడు పెద్ద ఎంఓయూలు చేసుకోబోతున్నామని, ఒక్కో ఎంఓయూ విలువ వెయ్యి కోట్లగా పైగానే ఉంటుందన్నారు. -
పారిశ్రామిక వేత్తలకు ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
-
AP Global Investors Summit 2023: విశాఖలో సీఎం జగన్..
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖలో రేపు, ఎల్లుండి(శుక్ర, శనివారాల్లో) జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సీఎం జగన్ పాల్గొననున్నారు. దీనిలో భాగంగా ఈరోజు(గురువారం) సీఎం జగన్ తాడేపల్లి నుంచి విశాఖకు బయల్దేరి వెళ్లారు. ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌కు మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుండి రాడిసన్ బ్లూ హోటల్‌కు సీఎం జగన్ చేరుకున్నారు. రాత్రికి నగరంలో బస చేస్తారు సీఎం జగన్. 3వ తేదీ షెడ్యూల్ ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సీఎం పాల్గొంటారు. రాత్రి 8.00-9.00 గంటల సమయంలో ఎంజీఎం పార్క్ హోటల్లో జీఐఎస్ డెలిగేట్స్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస చేయనున్నారు. 4వ తేదీ షెడ్యూల్ ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుని రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: AP Global Investors Summit 2023: పెట్టుబడులకు రాచబాట -
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు (ఫొటోలు)
-
Global Investors Summit:గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు
విశాఖపట్నంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి వచ్చే అతిథులకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాల కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీవీఐపీలు, వీఐపీల కోసం నగరంలోని ప్రముఖ హోటళ్లలో దాదాపు 800 గదులని సిద్దం చేశారు. జీఐఎస్ కి వచ్చే దేశ విదేశీ ప్రతినిధులు సంఖ్య పెరుగుతుండగా వాహనాలు, వసతులకు డిమాండ్ ఏర్పడింది. సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఏపీలో సుధీర్ఘమైన తీరప్రాంతం, విస్తృతమైన వనరులు దేశంలో ఎక్కడా లేని విధంగా 70శాతం మానవ వనరులు, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ, నూతన పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి సమక్షంలో విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక ఎంవోయూలకు వేదికగా నిలవబోతోంది. ఈ సమ్మిట్‌కి 35 మంది టాప్ ఇండస్ట్రీయలిస్టులు... 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హైకమిషనర్లు తరలిరానున్నారు. రెండు రోజుల సమ్మిట్ కోసంఇప్పటికే 12,000కుపైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయంటే స్పందన ఏ స్ధాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు. దీంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన వసతి, రవాణా సౌకర్యాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమ్మిట్‌లో పాల్గొవడానికి అంబానీ, అదానీ, మిట్టల్, బజాజ్, ఆదిత్య బిర్లా, జీఎంఆర్ తదితర పారిశ్రామిక దిగ్గజాలు 16 ప్రత్యేక విమానాల్లో విశాఖ వస్తున్నారు. అలాగే కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి తదితరులు వస్తున్నారు. కేంద్ర మంత్రులని ఎయిర్ పోర్టు నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్ తీసుకుని రావడం కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధం చేశారు. అలాగే ముఖేష్ అంబానీ, నవీన్ జిందాల్, మిట్టల్,అదానీ వంటి పారిశ్రామిక వేత్తలను దృష్టిలో ఉంచుకొని ఖరీదైన లగ్జరీ కార్లను రప్పిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తల కోసం దాదాపు 30కి పైగా బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన వాహనాలను అధికారులు సిద్దం చేశారు. అలాగే 25 దేశాలకి చెందిన సుమారు 50 మంది విదేశీ ప్రతినిధులు, హై కమిషనర్ల కోసం కూడా లగ్జరీ కార్లు రెంట్‌కు తీసుకుంటున్నారు. మొత్తంగా దాదాపు 800 మందికి పైగా విఐపీలు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు 800 వాహనాలని విశాఖ జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి వచ్చే వీవీఐపీలకి ప్రొటోకాల్ ప్రకారం భధ్రత కల్పించడంతో పాటు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని విశాఖ కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండు రోజుల పాటే జరగనున్నప్పటికీ నగరంలోని అన్ని ప్రముఖ హోటళ్లలో గదులు 6వ తేదీ వరకు ఫుల్ అయ్యాయి. జీఐఎస్ సదస్సుకి వచ్చే వీవీఐపీలు, వీఐపీల కోసం దాదాపు 800 పైగా గదులని అధికారులు సిద్దం చేశారు. కేంద్ర మంత్రులు పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ ప్రతినిధులు, డిప్యూటీ హైకమిషనర్లకి రాడిసన్ , నోవాటెల్, పార్క్ లాంటి స్టార్ హోటళ్లలో గదులు సిద్దం చేశారు. ఈ సమ్మిట్‌కి దాదాపు 15 వేల మంది ప్రతినిధులు వస్తుండగా దీనికి బందోబస్తు కోసం దాదాపు ఆరేడు వేల మంది పోలీసులు వస్తుండటంతో వైజాగ్ లో హోటళ్లు మొత్తం ఫుల్ అయిపోయాయి. స్టార్ రేటింగ్స్ ఉన్న హోటళ్లలో సుమారు 1500 రూములు బుక్కయ్యాయి. ఇక వచ్చే అతిథలకి లోటుపాట్లు రాకుండా జిల్లా యంత్రాంగం 12 బృందాలని నియమించింది. విశాఖ ఎయిర్ పోర్టులో దిగిన దగ్గర నుంచి వారిని హోటల్స్‌కి చేర్చడం, అక్కడ నుంచి సమ్మిట్ జరిగే ప్రాంతానికి చేరవేయడం...తిరిగి ఎయిర్ పోర్టుకి తీసుకెళ్లే వరకు పలు విభాగాల ఉద్యోగులకి బాధ్యతలు అప్పగించారు. విశాఖ ఎయిర్ పోర్టులో, హోటళ్ల వద్ద, సమ్మిట్ వద్ద కూడా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. మరోవైపు సమ్మిట్ కోసం వచ్చే ప్రతినిధుల సంఖ్య అంచనాలకు మించి పోతోందని రిజిస్ట్రేషన్లను బట్టి అర్థం అవుతోంది. దీంతో వచ్చే అతిథులకు రవాణా, వసతి సౌకార్యాల్లో ఎటువంటి లోపం రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకి ఆదేశాలిచ్చింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: సీఎం జగన్ ఇంటర్వ్యూ: వనరులు పుష్కలం.. అవకాశాలు అపారం -
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌పై కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విశాఖలో ఇన్వెస్టర్ సమ్మిట్ విజయవంతం కావాలని కేటీఆర్ ఆకాక్షించారు. తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఉండాలని కేటీఆర్ ట్వీటర్లో పేర్కొన్నారు. కాగా, ఏపీకి భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)లో పాల్గొనేందుకు కార్పొరేట్ దిగ్గజాలు విశాఖ చేరుకుంటున్నాయి. విశాఖ సమ్మిట్‌లో పాల్గొనేందుకు బుధవారం ఒక్క రోజే నాలుగు వేలకుపైగా రిజిస్ట్రేషన్స్ నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 12,000కి పైగా నమోదు కావడం గమనార్హం. గత సర్కారు మాదిరిగా ఆర్భాటాలు కాకుండా వాస్తవ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. చదవండి: సీఎం జగన్ ఇంటర్వ్యూ: వనరులు పుష్కలం.. అవకాశాలు అపారం Good luck to our younger brother Vizag & sister state AP as they conduct their Global Investors Summit I wish them the very best 👍 May both Telugu speaking states prosper and be the best in India pic.twitter.com/v6UhGlZ7qP — KTR (@KTRBRS) March 2, 2023 -
Global investors Summit : పెట్టుబడుల సంబరానికి విశాఖ సిద్ధం (ఫొటోలు)
-
సీఎం జగన్ ఇంటర్వ్యూ: వనరులు పుష్కలం.. అవకాశాలు అపారం
మేము అమలు చేస్తున్నవి కేవలం ఉచిత పథకాలు కాదు. ఇదంతా మానవ వనరుల మీద పెడుతున్న పెట్టుబడిగా మేం భావిస్తున్నాం. మానవ వనరుల నైపుణ్యాభివృద్ధిగానే చూస్తున్నాం. ప్రభుత్వం అలా ఆలోచించకపోతే ప్రగతి సాధించలేం. మా విద్యార్థులు సొంత కాళ్ల మీద నిలబడి, ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవసరమైన వనరులను సమకూరుస్తున్నాం. అందుకోసం విద్యా ప్రమాణాలు పెంపొందిస్తున్నాం. అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేస్తున్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘పరిశ్రమలు నెలకొల్పడానికి అన్ని విధాలా అనువైన వాతావరణం, వనరులు మన రాష్ట్రంలో ఉన్నాయి. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం, నిరంతరాయమైన విద్యుత్ సరఫరా, కొత్తగా ఏర్పాటవుతున్న 4 పోర్టులు, నాణ్యమైన వనరులు.. ఇవన్నీ పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన అంశాలు. పోర్టు ఆధారిత పరిశ్రమలకు రాష్ట్రం అత్యంత ఆకర్షణీయం. ఇక్కడ గ్రీన్ ఎనర్జీ రంగంలో అపార అవకాశాలున్నాయి. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు రాబోతుంటే... అందులో మూడు మన రాష్ట్రంలోనే వస్తున్నాయి. మూడు పారిశ్రామిక కారిడార్లున్న ఏకైక రాష్ట్రం కూడా మనదే’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే ‘గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ నేపథ్యంలో బుధవారం ఆయన కొందరు జాతీయ మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ► పెట్టుబడికి ఉన్న అవకాశాలను, పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను పారిశ్రామికవేత్తలకు వివరించడం ద్వారా ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం సదస్సు లక్ష్యం. పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత సానుకూల వాతావరణం రాష్ట్రంలో ఉంది. ప్రభుత్వం తొలి నుంచీ స్నేహపూర్వక పారిశ్రామిక విధానంతో ముందుకు వెళుతోంది. ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమలు నెలకొల్పాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు, ప్రోత్సహకాలు ఇవ్వటం సహజం. ప్రభుత్వం నుంచి అందే సహకారం, రాయితీలు, ప్రోత్సహకాలు, రాష్ట్రంలో ఉన్న అనువైన వాతావరణం, వనరులను పారిశ్రామివేత్తలు చూస్తారు. రాష్ట్రంలో ఇవన్నీ ఉన్నాయి. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరం పరిశ్రమలకు అనుకూలం. ► రాష్ట్రంలో 48 రకాల ఖనిజాలు లభ్యమవుతాయి. ఇది ఖనిజాధారిత పరిశ్రమలకు ఎంతో అనుకూలం. సిమెంట్, లైమ్‌స్టోన్ పరిశ్రమలు నెలకొల్పడానికి మన వద్ద ఎంతో అనుకూల పరిస్థితులున్నాయి. ( ఫైల్ ఫోటో ) ► 6 పోర్టులున్నాయి. కొత్తగా 4 పోర్టులు నిర్మిస్తున్నాం. అందులో 3 పోర్టులను ప్రభుత్వమే సొంత నిధులతో నిర్మిస్తోంది. పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అత్యంత అనుకూలం. పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. పోర్టు రవాణా కారణంగా రాష్ట్రంలో తయారయ్యే వస్తువుల ఎగుమతికి తక్కువ ఖర్చవుతుంది. ► కర్భన ఉద్గారాలను తగ్గించి పర్యావరణ పరిరక్షణకు మేలు చేసే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, పంప్డ్ స్టోరేజ్... గ్రీన్ ఎనర్జీదే భవిష్యత్ అంతా. ఈ రంగంలో పెట్టుబడులకు రాష్ట్రంలో మంచి అవకాశాలున్నాయి. వీటివల్ల చౌకగా విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. రెన్యువబుల్, గ్రీన్ ఎనర్జీకి ఏపీలో పుష్కలమైన వనరులున్నాయి. విండ్, హైడ్రోజన్, సోలార్ విద్యుదుత్పత్తికి ఇక్కడ అపార అవకాశాలున్నాయి. 82 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ, 34 గిగావాట్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లకు అవకాశం ఉంది. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది. ► పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలు తీసుకుని, వాటి ప్రకారం ప్రో యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నాం. అందుకే ఈ రాష్ట్రంవైపు ఎప్పుడూ చూడని అంబానీ, బిర్లా, అదానీ, బంగూర్, బజాంకా, దాల్మియా.. వంటి వారు ఇప్పుడు రాష్టంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. గతంలో ఇంతమంది దిగ్గజ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చింది లేదు. ► 2021–22లో 11.43 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. పలురంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ... సులభతర వాణిజ్య విధానాల్లో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వరుసగా మూడేళ్లు నెంబర్ వన్‌గా నిలిచింది. ( ఫైల్ ఫోటో ) మూడు రంగాల్లో విప్లవాత్మకమైనమార్పులు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వ తప్పులను కొన్నింటిని సరిచేస్తుంది, కొన్ని కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, వ్యవసాయం.. ఈ రంగాల్లో పూర్తి స్థాయిలో విప్లవాత్మక చర్యలు చేపట్టాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ‘నాడు–నేడు’ పేరిట ప్రభుత్వాసుపత్రులు, ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరిస్తున్నాం. ప్రాథమిక విద్యా రంగంలో ‘అమ్మ ఒడి’ పథకం ఓ విప్లవం. మేము అధికారంలోకి వచ్చేనాటికి ప్రాథమిక విద్య ప్రమాణాల్లో ఆంధ్ర ప్రదేశ్ దేశంలో చివరి రెండు, మూడు స్థానాల్లో ఉండేది. ఈ పరిస్థితి మార్చాలనుకున్నాం. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు మేం అమలు చేస్తున్న పథకాలు చెబుతా. అమ్మ ఒడి పథకం కింద పిల్లల్ని బడికి పంపే తల్లుల ఖాతాలో రూ.15వేలు వేస్తున్నాం. దీనికి కనీసం 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన పెట్టాం. ఇంటర్మీడియట్ వరకు అమ్మ ఒడి పథకం ఇస్తున్నాం. తరవాత జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు అందిస్తున్నాం. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుండటంతో పిల్లల చదువు ఎందుకు ఆపాలని తల్లిదండ్రులు భావిస్తారు కదా?. ఇక ఏటా స్కూళ్లు తెరవటానికి ముందే జగనన్న విద్యా కానుక పేరిట సమగ్ర కిట్‌ను ఇస్తున్నాం. తెలుగు, ఇంగ్లీష్ బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, స్కూల్ బ్యాగ్, షూ, సాక్సులు, యూనిఫామ్ ఇస్తూ యూనిఫామ్‌కు కుట్టేందుకు మజూరీ చార్జీలూ ఇస్తున్నాం. దీనికి ఏటా రూ.వేయి కోట్లకుపైగా నిధులు వెచ్చిస్తున్నాం. ఇక మధ్యాహ్న భోజన పథకాన్ని పూర్తిగా మార్చాం. టీడీపీ ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకానికి రూ.600 కోట్ల బడ్జెట్ ఉండేది. దాన్ని రూ.1,908కోట్లకు పెంచాం. జగనన్న గోరుముద్ద పేరుతో భోజనం నాణ్యత పెంచాం. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం. ఆరో తరగతి నుంచి డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. నాడు–నేడు మొదటి దశ కింద 15,275 పాఠశాలలను ఎంపిక చేసి వాటి రూపు రేఖలను సమూలంగా మార్చాం. రాష్ట్రంలో 30,230 తరగతుల డిజిటలైజేషన్‌ను ఈ జూన్ నాటికి పూర్తి చేస్తున్నాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. ఇప్పటివరకు 60వేల మంది ఉపాధ్యాయులకు, 4.70 లక్షల మంది విద్యార్థులకు మొత్తం 5.30 లక్షల ట్యాబ్‌లు పంపిణీ చేశాం. అంతేకాదు! అంగన్వాడీ కేంద్రాలకు నిధులు పెంచాం. గతంలో అంగన్వాడీ కేంద్రాలకు ఏడాదికి రూ.800కోట్లు కేటాయించేవారు. దీన్ని రూ.1,800 కోట్లకు పెంచాం. జగనన్న సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ్ ప్లస్ పేరిట అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహర నాణ్యతను మెరుగుపరిచాం. ఎందుకంటే ఆరేళ్ల వరకే పిల్లలు శారీరకంగా, మానసికంగా వేగంగా ఎదుగుతారు. ఆ సమయంలో వారికి సరైన పోషకాహారం అందించాలి. అదే చేస్తున్నాం. ఆడపిల్లల పెళ్లికి సహకరిస్తూ... వారు చదువు కొనసాగించేలా నిబంధనలు పెట్టాం. 10వ తరగతి పాస్ అవ్వాలని, 18 ఏళ్లు నిండాలని నిబంధన పెట్టడం వల్ల వారు పది తరవాత ఇంటర్ చదువుతారు. డిగ్రీలోనూ చేరతారు. చేరారు కనక పూర్తి చేస్తారు. ఈ ఉద్దేశంతోనే వివాహానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాం. చదువుల్లో రాణిస్తూ విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ‘విదేశీ దీవెన’ పథకాన్ని అందిస్తున్నాం. నిర్దేశిత 21 ఫ్యాకల్టీల్లో ప్రపంచంలోని టాప్–50 యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే మన విద్యార్థులకు గరిష్ఠంగా రూ.1.25 కోట్ల వరకూ ఫీజును చెల్లిస్తున్నాం. గత ఏడాది 200మందికి స్పాన్సర్షిప్ అందించాం. ఇలాంటి వర్సిటీల్లో చదివిన వాళ్లంతా వచ్చే పదేళ్లలో అత్యున్నత స్థాయికి చేరుకుని, మన రాష్ట్రానికి ఆస్తిగా మారతారన్న విశ్వాసం నాకుంది. ► ప్రభుత్వాసుపత్రులకు కాయకల్ప చికిత్స చేస్తున్నాం. ఎవ్వరూ ఊహించని విధంగా వైద్య రంగంలో ఖాళీగా ఉన్న 48,000 పోస్టులను భర్తీ చేశాం. ప్రతి హాస్పిటల్లో డాక్టర్, నర్సులు ఉండేలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. జాతీయస్థాయి ప్రమాణాలు ఉండేలా హాస్పిటల్స్‌ను ఆధునీకరించాం. 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే చికిత్సల సంఖ్యను 1,059 నుంచి ఏకంగా 3,255కు పెంచాం. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ హెల్త్ క్లినిక్, హెల్త్‌కార్డుల డిజిటలైజేషన్ ఇలా అనేక సంస్కరణలు తెచ్చాం. వ్యవసాయ రంగానికి వస్తే... రైతు భరోసా కేంద్రంపేరిట రైతులకు సంబంధించిన సేవలన్నీ ఒకేచోట అందిస్తున్నాం. ప్రతి గ్రామానికీ వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ పొందిన అధికారిని నియమించడమే కాకుండా ప్రతి రైతు తాలూకు పంట వివరాలను ‘ఈ క్రాప్’లో నమోదు చేస్తున్నాం. రైతులకు విత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకోవడం వరకూ ఆర్బీకే ద్వారా చేయూత అందిస్తున్నాం. పాలన సంస్కరణల్లో భాగంగా.... ప్రతి 2000 జనాభాకు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి 50 మంది జనాభాకూ ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేశాం. ఎటువంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. దేశంలో డీబీటీ ద్వారా నేరుగా నగదు అందుకుంటున్న లబ్ధిదారులు రాష్ట్రంలోనే అధికం. మాకు ఓటు వేశారా లేదా, ఏ పార్టీ అనేది చూడకుండా పథకాలు అందిస్తున్నాం. ఎస్డీజీ లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు ఉచిత పథకాలు అంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి చేయకుండా కేవలం సంక్షేమ పథకాలే ఇస్తున్నామనుకుంటే దేశంలోనే అత్యధికంగా 11.43 శాతం వృద్ధిని ఎలా సాధిస్తాం? అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాం. ప్రతి పథకాన్నీ ఎస్డీజీ లక్ష్యాలకు అనుగుణంగా డీబీటీ రూపంలో నేరుగా లబ్ధిదారులకే అందిస్తున్నాం. ఉదాహరణకు జీఈఆర్ గణాంకాలు చూస్తే కాలేజీల్లో చేరే వారి సంఖ్య రాష్ట్రంలో ఎక్కువ. 18 నుంచి 23 ఏళ్ల వయస్సులో ఉన్నవారు చదువు మానకుండా కాలేజీలో చేరేలా పర్యవేక్షిస్తున్నాం. విద్యార్థి డిగ్రీ పూర్తి చేస్తే అతని హోదా మారుతుంది. అందుకే తల్లిదండ్రులకు విద్య భారం కాకుండా ఉండేలా 100 శాతం ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తూ విద్యాదీవెన, వసతిదీవెన, ప్రాధమిక విద్యలో అమ్మఒడి వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఈ మొత్తం నేరుగా కళాశాలలకు ఇవ్వకుండా తల్లుల ఖాతాల్లో వేస్తున్నాం. దీనివల్ల ఆ విద్యార్థి చదువు మధ్యలో ఆగదు. పట్టభద్రుడై ఆదాయాన్ని ఆర్జించడం ద్వారా పేదరికం నుంచి మధ్యతరగతి హోదాలోకి ఆ కుటుంబం మారుతుంది. దేశాభివృద్ధిలో ఇది ఎంతో కీలకమైన అంశం. బడ్జెట్ పరిమితుల్లోనే... పారదర్శకంగా... ఈ పథకాలన్నీ కూడా బడ్జెట్ పరిమితుల్లోనే అమలు చేస్తున్నాం. సాధారణంగా రాజకీయ నేతలు సామాన్యులకు అర్థం కాని రీతిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గతంలో కూడా ఇదే బడ్జెట్ ఉండేది. ఆ నిధులు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ అర్థమయ్యేది కాదు. లబ్ధిదారులెవరో ఆ దేవుడికే తెలియాలి అనే పరిస్థితి ఉండేది. కానీ రాష్ట్రంలో తొలిసారిగా మేము అందరికీ సరళంగా అర్థమయ్యేలా పారదర్శకంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. ప్రతి పథకాన్నీ బడ్జెట్లో కచ్చితంగా నిర్దేశించాం. ప్రతి పథకాన్ని లబ్ధిదారుల ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాలతో అనుసంధానించాం. నేరుగా నగదు బదిలీ విధానంలో పథకాన్ని అమలు చేస్తున్నాం. – ఏ రాష్ట్రానికైనా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అందుకే కేంద్రంలోని బీజేపీతో మేము స్నేహ పూర్వక వాతావరణమే కోరుకుంటున్నాం. మాకు రాజకీయాల కంటే మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ప్రజలకు ఏం కావాలో అది చేయాలనేది మా ప్రభుత్వ విధానం. అందుకే మా ప్రభుత్వం రియాలిటీలో పేదలకు ఏం కావాలో అదే చేస్తోంది. అందుకే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో వేగంగా ముందుకెళ్తున్నాం. -
సీఎం వైఎస్ జగన్ విశాఖ టూర్ షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: రేపటి నుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వైజాగ్‌లో మార్చి 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సీఎం పాల్గొనున్నారు. రేపు(గురువారం) సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, రాత్రికి అక్కడే బస చేస్తారు. 3వ తేదీ షెడ్యూల్: ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సీఎం పాల్గొంటారు. రాత్రి 8.00-9.00 గంటల సమయంలో ఎంజీఎం పార్క్ హోటల్లో జీఐఎస్ డెలిగేట్స్‌కు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస చేయనున్నారు. 4వ తేదీ షెడ్యూల్: ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌కు చేరుకుని రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: విజయవాడ: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ -
ఏయూలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాట్లు
-
మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్