– నవీన్ జిందాల్, జేఎస్‌పీఎల్ గ్రూప్ చైర్మన్
రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములుగా మారుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్‌ఫ్రా బేస్, వ్యాపార అనుకూల వాతావరణానికి రాష్ట్రం అనుకూలమైంది. విజనరీ లీడర్ షిప్‌తో ప్రోగ్రెసివ్ పాలసీ, పారిశ్రామిక అభివృద్ధి పాలసీ, ఇండస్ట్రీస్ ఎకోసిస్టమ్, పెట్టుబడిదారులకు అనుకూలమైన సింగిల్ విండో విధానాలను అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు.
జిందాల్ గ్రూప్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల్లోనూ వృద్ధిలోనూ ఏపీ ముందడుగు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 140 మెగావాట్ల యూనిట్ల ఉత్పత్తి ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నాం. కృష్ణపట్నం సమీపంలో రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడితో 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 10 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేలా స్టీల్‌ప్లాంట్‌కు ఇటీవలే భూమి పూజ చేశాం. ఏపీకి యంగ్, డైనమిక్ లీడర్ వైఎస్ జగన్ సీఎంగా ఉన్నారు.
సీమపురి ఎనర్జీ ప్లాంట్ నుంచి 6 నెలల్లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి అందించనున్నాం. కడప స్టీల్‌ప్లాంట్‌కు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ శంకుస్థాపన చేసింది. సోలార్, హైడ్రో, విండ్ పవర్, సిమెంట్ ప్రాజెక్టు ఎంవోయూలు కూడా ఏపీ ప్రభుత్వంతో చేసుకున్నాం. సమృద్ధిగా వనరులు, అపార అవకాశాలతో ఏపీ స్వర్గధామంలా ఉంది. సీఎం జగన్ నిరంతర శ్రమకు నిదర్శనంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా జీడీపీ వృద్ధి రేటులో ఏపీ అగ్రగామిగా ఉండటం శుభపరిణామం.
అపార వనరులున్న రాష్ట్రమిది
– బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ మంత్రి
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ అగ్రగామిగా ఉంది. సహజ వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రమిది. వివిధ రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఆంధ్రప్రదేశ్‌లో కొదవలేదు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాపార, వాణిజ్య రంగాలపై మంచి దార్శనికతతో ఉన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నాం.
వేగంగా అనుమతులు..
– అమర్‌నాథ్, ఐటీ, పరిశ్రమల మంత్రి
రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు పుష్కల అవకాశాలున్నాయి. పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు అనుమతుల మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. త్వరితగతిన మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చిన మాదిరిగానే సీఎం నాయకత్వంలో రాష్ట్రానికి వచ్చే ప్రతి పరిశ్రమకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment