jindal group
-
పరిశ్రమలకు 'కూటమి' కాటు
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో పరిశ్రమలు తెస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలు తేకపోగా, ఉన్న వాటిని కూడా వెళ్లగొట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. వారి అరాచకాలకు భయపడి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకొని కూటమి నేతలు పన్నిన కుట్రతో రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన ప్రముఖ జెఎస్డబ్ల్యూ జిందాల్ గ్రూప్ వెనకడుగు వేసింది. గత నెలలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కృష్ణపట్నం పోర్టు దగ్గర అదానీ గ్రూపు ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారు. తాజాగా వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగులో అక్కడి ఎమ్మెల్యే వర్గీయులు అదానీ ప్రాజెక్టులో విధ్వంసానికి దిగారు. దీంతో దేశంలో అతి పెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన అదానీ గ్రూపే రాష్ట్రమంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. ప్రతి పనికీ కమీషన్లు ఇవ్వాలని, పనులు తమకే ఇవ్వాలంటూ పలువురు ఎమ్మెల్యేలు చేస్తున్న దాడులు పారిశ్రామికవేత్తల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు కూడా ఎమ్మెల్యేల దుశ్చర్యలను అడ్డుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ తీరు రాష్ట్రానికి భారీ నష్టాన్ని కలగజేస్తుందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. ఇదీ జరిగింది..వైఎస్సార్ జిల్లాలో గండికోట ప్రాజెక్టు ఆధారంగా వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాజెక్టు అదానీ సంస్థకు దక్కింది. తొలి విడతగా రూ.1,800 కోట్లతో అదానీ సంస్థ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. టెండర్లలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు సివిల్ పనులు దక్కాయి. పనులు కూడా మొదలు పెట్టారు. ఈ పనులు తమకే ఇవ్వాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబట్టారు. అయినా స్పందన లేకపోవడంతో మంగళవారం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనారాయణరెడ్డి, మరో సోదరుడి కుమారుడు రాజేష్‌రెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో ఎమ్మెల్యే వర్గీయులు ప్రాజెక్టు వద్ద విధ్వంసం సృష్టించారు. అక్కడి సిబ్బందిపై దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడి ఉద్యోగులు, ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇక్కడ పనులు కూడా చేసుకునే పరిస్థితి లేదంటూ రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి, ఎంపీ సీఎం రమేష్ సోదరుడు రాజేష్‌నాయుడు బుధవారం సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఎటువంటిస్పందనా రాలేదు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య జరుగుతున్న ఘర్షణ మొత్తం ప్రాజెక్టు పైనే పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్టం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వర్గీయుల విధ్వంసంతో అదానీ సంస్థకు నష్టం కలిగిందని, నాయకుల మధ్య ఈ దందాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు కొనసాగుతుందో, ఆగిపోతుందోనని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఆగిపోయిన జిందాల్ స్టీల్ పరిశ్రమవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ సంస్థ జేఎస్‌డబ్ల్యూ జిందాల్ గ్రూప్ ముందుకు వచ్చింది. వైఎస్సార్ జిల్లాలో భారీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతోపాటు మరికొన్ని భారీ పెట్టుబడులు పెట్టాలని కూడా నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ నటి కాదంబరి జత్వానీ పేరుతో దారుణంగా కేసులు పెట్టించి, రాష్ట్రంలో ఆ గ్రూపు పెట్టుబడులు పెట్టకుండా కూటమి పెద్దలు అడ్డుకొంటున్నారు. దీంతో ఆ గ్రూపు ఇప్పుడు రాష్ట్రం వైపు చూడటానికే జంకుతోంది. వైఎస్సార్ జిల్లాలో స్టీల్ పరిశ్రమ నిలిచిపోయింది.కృష్ణపట్నం పోర్టు వద్ద సోమిరెడ్డి దాడులుగత నెలలో కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే స్వయంగా దాడికి పాల్పడ్డారు. పోర్టులో కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణపై మాట్లాడుతానంటూ తన అనుచరులతో కలిసి పోర్టుకు వెళ్లిన సోమిరెడ్డి.. అక్కడి అదానీ సంస్థ ఉద్యోగులను దూషిస్తూ దాడికి దిగారు. పోర్టు డీజీఎంపైనా దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన పారిశ్రామిక, వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగించింది.అదానీ పవర్ ప్రాజెక్టుపై దాడి ఘటనలో కేసు నమోదుకొండాపురం: అదానీ సంస్థ హైడ్రో పవర్ ప్రాజెక్టుపై మంగళవారం జరిగిన దాడి ఘటనకు సంబంధించి కొందరిపై కేసు నమోదు చేసినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ హృషికేశ్వర్‌రెడ్డి తెలిపారు. అదానీ సంస్థకు చెందిన రామకృష్ణ, రిత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామన్నారు. -
ఈ ఏడాది ఈమే టాప్.. తర్వాతే అంబానీ, అదానీ.. కానీ..
సంపన్నుల జాబితా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు అంబానీ, అదానీ కదా.. అయితే వారి సంపాదన ఎక్కువగా ఉండడం వల్ల వారు సంపన్నుల జాబితాలో చోటుసంపాదిస్తుంటారు. ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్(73) అగ్రస్థానంలో నిలిచినట్లు ‘బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ నివేదించింది. ఆమె మొత్తం సంపద రూ.2.1 లక్షల కోట్లు. అయితే ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద రూ.80 వేలకోట్లు పెరిగిందని నివేదిక వెల్లడించింది. దాంతో అంబానీ, అదానీ, బిర్లా.. వంటి ప్రముఖుల సంపదను సావిత్రి జిందాల్ మించిపోయారు. దాంతో ఈ ఏడాది అధికంగా సంపదించిన జాబితాలో ఆమె అందరి కంటే ముందు నిలిచారని నివేదిక తెలిపింది. అయితే మొత్తంగా మాత్రం రూ.7.7 లక్షల కోట్ల సంపదతో ముఖేష్ అంబానీ అత్యధిక సంపన్నుడిగానే కొనసాగుతున్నారు. ప్రపంచ కుబేరుల్లో 13వ స్థానంలో నిలిచారు. అయితే ఈ ఏడాది ఆయన సంపద రూ.43 వేలకోట్లు పెరిగినట్లు తెలిసింది. రూ.7 లక్షల కోట్ల సంపదతో దేశంలోని సంపన్నుల జాబితాలో గౌతమ్అదానీ రెండో స్థానంలో ఉన్నారు. జిందాల్ గ్రూప్‌ను స్థాపించిన ఓం ప్రకాశ్ జిందాల్ సతీమణే సావిత్రి జిందాల్. ఆయన మరణానంతరం ఓపీ జిందాల్ గ్రూప్ ఛైర్‌పర్సన్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అండ్ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్లెస్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు కంపెనీల షేర్లు దేశీయ మార్కెట్లో లాభాల్లో దూసుకెళ్లడంతో సావిత్రి జిందాల్ సంపద భారీగా పెరిగింది. దేశీయ కుబేరుల జాబితాలో అయిదో స్థానంలో నిలిచినా.. దేశంలోని మహిళా సంపన్నుల జాబితాలో ఆమెదే అగ్రస్థానం. మొత్తం సంపద విషయంలో అజీమ్ ప్రేమ్‌జీ (రూ.2 లక్షల కోట్లు)ను సావిత్రి దాటేశారు. ఇదీ చదవండి: తగ్గిన ‘తీపి’ ఉత్పత్తి..! కారణాలు ఇవే.. ఈ ఏడాది ఎక్కువ సంపదను ఆర్జించిన వారి జాబితాలో హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్‌నాడార్ రూ.66 వేలకోట్లతో రెండో స్థానంలో నిలిచారు. స్థిరాస్తి సంస్థ డీఎల్ఎఫ్ లిమిటెడ్ ఛైర్మన్ కేపీ సింగ్ సంపద రూ.59వేలకోట్లు పెరగడంతో మూడో స్థానంలో ఉన్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ బిర్లా, షాపూర్ మిస్త్రీ రూ.52 వేలకోట్ల చొప్పున సంపదను పెంచుకున్నారు. ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది రూ.43 వేలకోట్లు పెరిగింది. సన్‌ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి, రవి జైపురియా, ఎంపీ లోథా, సునీల్ మిత్తల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
‘70 గంటల పని’ వివాదంపై జిందాల్ ఏమన్నారంటే..
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. భారత యువత వారంలో కనీసం 70 గంటలు పనిచేయాలని ఆయన అనడంతో ఐటీ ఉద్యోగులతో సహా ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. అయితే ఆయన మాటలను సమర్థిస్తూ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్పర్సన్ సజ్జన్ జిందాల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. యువత విశ్రాంతి కంటే పనికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి ఐదు రోజులపాటే పని చేయాలనే సంస్కృతి అవసరం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రోజూ 14-16 గంటలకు పైగా పని చేస్తారని, తానూ రోజూ 10-12 గంటలు విధుల్లో ఉంటానని తెలిపారు. A 5 day week culture is not what a rapidly developing nation of our size needs. Our PM @narendramodi ji works over 14-16 hours everyday. My father used to work 12-14 hours, 7 days a week. I work 10-12 hours everyday. We have to find passion in our work and in Nation Building. — Sajjan Jindal (@sajjanjindal) October 27, 2023 -
విజనరీ సీఎం నేతృత్వంలో ముందడుగు
– నవీన్ జిందాల్, జేఎస్పీఎల్ గ్రూప్ చైర్మన్ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములుగా మారుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ఫ్రా బేస్, వ్యాపార అనుకూల వాతావరణానికి రాష్ట్రం అనుకూలమైంది. విజనరీ లీడర్ షిప్‌తో ప్రోగ్రెసివ్ పాలసీ, పారిశ్రామిక అభివృద్ధి పాలసీ, ఇండస్ట్రీస్ ఎకోసిస్టమ్, పెట్టుబడిదారులకు అనుకూలమైన సింగిల్ విండో విధానాలను అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. జిందాల్ గ్రూప్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల్లోనూ వృద్ధిలోనూ ఏపీ ముందడుగు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 140 మెగావాట్ల యూనిట్ల ఉత్పత్తి ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నాం. కృష్ణపట్నం సమీపంలో రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడితో 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో 10 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించేలా స్టీల్‌ప్లాంట్‌కు ఇటీవలే భూమి పూజ చేశాం. ఏపీకి యంగ్, డైనమిక్ లీడర్ వైఎస్ జగన్ సీఎంగా ఉన్నారు. సీమపురి ఎనర్జీ ప్లాంట్ నుంచి 6 నెలల్లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి అందించనున్నాం. కడప స్టీల్‌ప్లాంట్‌కు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ శంకుస్థాపన చేసింది. సోలార్, హైడ్రో, విండ్ పవర్, సిమెంట్ ప్రాజెక్టు ఎంవోయూలు కూడా ఏపీ ప్రభుత్వంతో చేసుకున్నాం. సమృద్ధిగా వనరులు, అపార అవకాశాలతో ఏపీ స్వర్గధామంలా ఉంది. సీఎం జగన్ నిరంతర శ్రమకు నిదర్శనంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా జీడీపీ వృద్ధి రేటులో ఏపీ అగ్రగామిగా ఉండటం శుభపరిణామం. అపార వనరులున్న రాష్ట్రమిది – బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్థిక శాఖ మంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ అగ్రగామిగా ఉంది. సహజ వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రమిది. వివిధ రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయి. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఆంధ్రప్రదేశ్‌లో కొదవలేదు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాపార, వాణిజ్య రంగాలపై మంచి దార్శనికతతో ఉన్నారు. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నాం. వేగంగా అనుమతులు.. – అమర్నాథ్, ఐటీ, పరిశ్రమల మంత్రి రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు పుష్కల అవకాశాలున్నాయి. పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు అనుమతుల మంజూరులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. త్వరితగతిన మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చిన మాదిరిగానే సీఎం నాయకత్వంలో రాష్ట్రానికి వచ్చే ప్రతి పరిశ్రమకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. -
సీఎం జగన్ విజయమిది..
ఒకప్పుడు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ తర్వాత కానీ.. విశాఖలో ఉక్కు ప్యాక్టరీ ఏర్పాటు కాలేదు. ఇప్పుడు ఎలాంటి నిరసనలు అవసరం లేకుండానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగు నియోజకవర్గం సున్నపురాళ్ల పల్లె వద్ద ఉక్కు కర్మాగారానికి బీజం పడింది. ఇది నిజంగా రాయలసీమ ప్రాంత వాసులే కాకుండా మొత్తం విభజిత ఏపీ ప్రజలంతా సంతోషించాల్సిన సమయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చొరవను ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ గొప్పగా ప్రశంసించారు. ఆంధ్రలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను కూడా ఆయన మెచ్చుకున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 8,800 కోట్ల వ్యయంతో ఈ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్తులో ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ స్టీల్ ప్లాంట్‌గా రూపొందించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి ప్రభుత్వం కూడా 700 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. ఒకవైపు కొప్పర్తి ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ, మరో వైపు స్టీల్ ప్లాంట్ సిద్దమైతే ఈ జిల్లా ముఖ చిత్రం మారిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మామూలుగా అయితే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందా? లేదా? అన్న సందేహం ఉండేది. ఈసారి స్టీల్ ప్లాంట్లను నిర్వహిస్తున్న జిందాలే దీనిని టేకప్ చేయడం , భూమి పూజ పూర్తి చేయడం, తన ప్రణాళికను వెల్లడించడంతో నమ్మకం పెరుగుతుంది. ఆయన ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్రల్లో భారీ స్టీల్ కర్మాగారాలను నడుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన వ్యక్తి. ఈ రంగంలో ఆయనో దిగ్గజం. అందువల్ల ఈ ప్లాంట్ వచ్చే రెండు, మూడేళ్లలో ఒక రూపానికి వస్తుందన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లుతున్న తీరు మరి కొద్దినెలల్లోనే క్షేత్ర స్థాయిలో అర్ధం అవుతుంది కూడా.. నిజమే! పదిహేనేళ్ల క్రితమే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఊపిరి పోసుకుని ఉండవలసింది. వివిధ కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఇదే ప్రాంతంలో కర్నాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి ఉక్కు ప్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన ఇందుకోసం సుమారు రెండువేల ఎకరాల భూమి సేకరణ చేశారు. నిర్వాహకుల లోపాలతో పాటు తెలుగుదేశానికి చెందిన వారు, ఆ పార్టీకి సంబంధించిన మీడియా వారు పలు అడ్డంకులు సృష్టించారు. బల్లులు కూడా గుడ్లు పెట్టని స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేస్తే టీడీపీ మీడియా ఆనాడు ఏమని వార్తా కథనాలు రాసిందో తెలుసా!. అక్కడ సెలయేర్లు, జలపాతాలు ఉన్నాయని, జింకలు, లేళ్లు చెంగు చెంగున గంతులు వేస్తుంటాయని, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని అబద్దపు కథనాలు ఇచ్చారు. అయినా ప్రాజెక్టు ముందుకు వెళ్లి ఉండేదేమో. కానీ.. దురదృష్టవశాత్తు వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో అది వెనుకపడిపోయింది. ఇక్కడ మరో సంగతి కూడా ప్రస్తావించాలి. వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో ఆయన కుమారుడు సీఎం వైఎస్ జగన్ కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ పెట్టుకోవడం, దాంతో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం జగన్‌పై సీబీఐ కేసులు పెట్టి జైలుపాలు చేయడం వంటివి కూడా ఏపీకి తీరని నష్టం చేశాయి. అప్పట్లో సోనియాగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వారి చేతిలో పనిముట్టుగా మారిన సీబీఐ అధికారి ఒకరు కలిసి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేశారు. పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చినవారిని ఏదో ఒక సాకు చూపి జైలులో పెట్టించారు. ఒకవైపు పరిశ్రమలు స్థాపిస్తామని బ్యాంకుల వద్ద వేల కోట్ల రూపాయల రుణాలు పొందిన కొందరు రాజకీయ ప్రముఖులు ఆయా జాతీయ పార్టీలలో సేఫ్‌గా ఉండగా, పరిశ్రమలు పెడుతున్నవారు నానా ఇక్కట్లు పడవలసి వచ్చింది. దానికి తోడు తెలంగాణ ఉద్యమ ప్రభావం ఉండనే ఉంది. దీంతో ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడేలా చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. విభజన చట్టంలో కడప స్టీల్ ప్లాంట్ పై అధ్యయనం చేయాలని ఒక క్లాజ్ పెట్టారు. దాని ప్రకారం కేంద్రం చర్యలు తీసుకోవలసి ఉండగా, ఆయా కారణాలతో కేంద్రం చొరవ తీసుకోలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం ఏపీలో అప్పట్లో అధికారంలో ఉంది. కానీ.. వారు కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టలేకపోయారు. దీనిపై ప్రజలలో వ్యతిరేకత వస్తోందని శంకించిన టీడీపీ ప్రభుత్వం 2018లో అంటే ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన అంటూ హడావుడి చేసింది. దానికి ముందుగా రాజ్యసభ సభ్యుడు సీ.ఎమ్. రమేష్ నిరాహార దీక్ష డ్రామా కూడా జరిగింది. అదేదో కర్మాగారం వచ్చేసినంత హడావుడి చేశారు. అదంతా ఉత్తుత్తిదే అన్న సంగతి ప్రజలకు అర్ధం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 2019లో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రభుత్వమే దీని ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని భావించి శంకుస్థాపన చేశారు. ఇందుకోసం భాగస్వామిని ఎంపిక చేసే యత్నం జరిగింది. ఇంతలో కరోనా సమస్య అతలాకుతలం చేయడంతో రెండేళ్లపాటు ఇది ఆలస్యం అయింది. అయినా సీఎం జగన్ దీనిని వదలిపెట్టలేదు. పట్టువదలని విక్రమార్కుడి మాదిరి ఈ రంగంలో అనుభవజ్ఞులతో సంప్రదింపులూ జరిపి, వారిని ఒప్పించడానికి ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆ కృషి ఫలించి ఇప్పుడు అది కార్యరూపం దాల్చుతోంది. ఈ ప్లాంట్ సజావుగా పూర్తి అయి, వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాందీ పలుకుతుందని ఆశిద్దాం. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్‌ను దక్కించుకున్న ప్రిటోరియా క్యాపిటల్స్!
దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్‌లో భాగంగా ప్రిటోరియా ఫ్రాంచైజీను ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ జట్టు ఈ లీగ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్ పేరిట బరిలోకి దిగనుంది. తాజాగా ఈ లీగ్‌లో తమ ఫ్రాంఛైజీ తరపున ఆడనున్న ఇద్దరి ఆటగాళ్ల పేర్లను ప్రిటోరియా క్యాపిటల్స్ ప్రకటించింది. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే, ఆల్ రౌండర్ మెగాన్ ప్రిటోరియస్తో ప్రిటోరియా క్యాపిటల్స్ ఒప్పందం కుదర్చుకుంది. ఈ సందర్భంగా ప్రిటోరియా క్యాపిటల్స్ యాజమాని ప్రాత్ జిందాల్ మాట్లాడుతూ.. గత కొన్ని సీజన్ల నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ అభివృద్ది, విజయంలో అన్రిచ్ నోర్ట్జే భాగంగా ఉన్నాడు. కాబట్టి మేము అతడిని తన స్వదేశంలో జరగనున్న లీగ్‌లో కూడా భాగం చేయాలని అనుకున్నాము. అతడు ఎల్లప్పడూ మాకు ప్రధాన ఎంపికగా ఉంటాడు. అతడు ఢిల్లీకు ఏ విధంగా అయితే తన సేవలు అందించాడో ప్రిటోరియాకు కూడా అదే చేస్తాడని అశిస్తున్నాము" అని అతడు పేర్కొన్నాడు. కాగా నోర్ట్జే ప్రోటిస్ జట్టులో కీలక బౌలర్‌గా ఉన్నాడు. ఇప్పటి వరకు 30 అంతర్జాతీయ టీ20లు ఆడిన అన్రిచ్ 43 వికెట్లు పడగొట్టాడు. ఇక దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించేందుకు ప్రోటిస్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లును ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం గమనార్హం. కేప్‌టౌన్, జోహెన్నెస్‌బర్గ్, డర్బన్, పోర్ట్ ఎలిజిబెత్, ప్రిటోరియా, పార్ల్ ఫ్రాంఛైజీలను ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ దక్కించుకున్నాయి. చదవండి: CSA T20 League: జట్టు పేరును వెల్లడించిన రాయల్స్ గ్రూప్.. బట్లర్ సహా.. -
కలిసొచ్చిన అదృష్టం: ఆసియా రిచెస్ట్ విమెన్‌గా సావిత్రి జిందాల్ రికార్డు
సాక్షి, ముంబై: ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్ నిలిచారు. ఇప్పటిదాకా ఆసియా సంపన్న మహిళగా ఉన్న యాంగ్ హుయాన్‌ను స్థానంలో సావిత్రి ముందుకు దూసుకొచ్చారు. చైనాలో రియల్ ఎస్టేట్ సెక్టార్ తీవ్ర సంక్షోభంలో పడిపోవడంతో చైనీస్ రియల్ ఎస్టేట్ దిగ్గజం కంట్రీ గార్డెన్ మేజర్ వాటాదారురాలైన యాంగ్ సంపద ఈ ఏడాది సగం సంపదహారతి కర్పూరంలా కరిగిపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే యాదృచ్చికంగా 2005 లోనే (తండ్రినుంచి యాంగ్, భర్త అకాలమరణంతో సావిత్రి జిందాల్) ఇద్దరూ వ్యాపార బాధ్యతలను చేపట్టడం విశేషం. 11.3 బిలియన్ల డాలర్ల నికర విలువతో 72 ఏళ్ల జిందాల్ భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళ రికార్డు దక్కించుకున్నారు. 18 బిలియన్ల డాలర్ల నికర విలువతో 2021లో ఫోర్బ్స్ అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో చోటు సంపాదించారు సావిత్రి జిందాల్. అంతేకాదు దాదాపు 1.4 బిలియన్ డాలర్లతో దేశంలో టాప్-10లో ఉన్న ఏకైక మహిళ కూడా. 2005లో భర్త ఓం ప్రకాష్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత సావిత్రి జిందాల్ జిందాల్ గ్రూపు పగ్గాలను చేపట్టవలసి వచ్చింది. ఆమె నాయకత్వంలో ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. ఇటీవలి సంవత్సరాలలో జిందాల్ నికర విలువ విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనైంది. ముఖ్యంగా కోవిడ్-19 కారణంగా 2020 ఏప్రిల్‌లో 3.2 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కానీ ఉక్రెయిన్‌పై రష్యా దాడి తరువాత వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో 2022 ఏప్రిల్ నాటికి 15.6 బిలియన్ల డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఆమె ఎప్పుడూ కాలేజీకి వెళ్లలేదని చెబుతారు. అయినప్పటికీ జిందాల్ గ్రూపు వ్యాపారాన్ని విస్తరించి ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో టాప్ 13 మహిళా బిలియనీర్లలో ఒకరిగా నిలిచారు. కాగా 1950లో మార్చి 20న అస్సాంలోని టిన్సుకియా పట్టణంలో జన్మించిన సావిత్రి 1970లలో ఓపీ జిందాల్‌ను వివాహం చేసుకున్నారు. విజయవంతమైన వ్యాపారవేత్తగానే కాకుండా, భూపీందర్ సింగ్ ప్రభుత్వంలో హర్యానా మంత్రిగా కూడా సావిత్రిజిందాల్ పాపులర్. హిసార్ నియోజకవర్గం నుంచి హర్యానా విధానసభకు ఎన్నికయ్యారు. కానీ 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాగా 2005లో చైనాలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలో తన తండ్రి వాటాను వారసత్వంగా పొంది ఈ గ్రహం మీద ఎక్కువ సంపద గల అత్యంత పిన్న వయస్కుల్లో ఒకరిగా నిలిచారు యాంగ్ హుయాన్. 20215 దాదాపు 24 బిలియన్ డాలర్లతో ఆసియాలోనే రిచెస్ట్ మహిళగా నిలిచింది. అయితే గత ఐదేళ్లుగా ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా నిలిచిన యాంగ్ సంపద ప్రస్తుతం 11.3 బిలియన్ డాలర్లకు పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ పేర్కొంది. దీంతో బిలియనీర్ ఇండెక్స్‌లో టాప్‌ర్యాంక్‌ను కోల్పోయారు. 2005లో యాంగ్ తండ్రి వాటాను వారసత్వంగా స్వీకరించి ఈ గ్రహం మీద అత్యంత ధనవంతురాలైన పిన్న వయస్కుల్లో ఒకరిగా నిలిచారు. -
మీరు ఆడండి.. మేము అండగా ఉంటాం.. ‘టోక్యో’తో మారిన సీన్!
టోక్యో ఒలింపిక్స్ భారత క్రీడా ముఖ చిత్రాన్ని మార్చనున్నాయా? క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలకు కార్పోరేటు దన్ను విస్తరించనుందా? ఆటగాళ్లకు మెరుగైన సౌకర్యాలు, శిక్షణ లభించనున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. సాక్షి, వెబ్‌డెస్క్: అనేక అనుమానాల మధ్య మొదలైన టోక్యో ఒలింపిక్స్ భారత క్రీడలపై భారీ ప్రభావం చూపింది. ఆరంభంలో అపజయాలు పలకరించినా విశ్వ క్రీడల చివరల్లో భారత ఆటగాళ్లు చూపిన తెగువ, పోరాడిన తీరు ఇండియన్ల మనసుపై చెరగని ముద్రని వేశాయి. గట్టి ప్రోత్సాహం లభిస్తే మన ఆటగాళ్లు విశ్వవేదికలపై మరింత మెరుగైన ప్రదర్శన, పతాకలు తేవడం గ్యారంటీ అనే భరోసా ఇచ్చాయి. దీంతో ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడంతో పాటు ఆర్థికంగా అండగా ఉండేందుకు కార్పోరేటు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో కోచింగ్ సెంటర్లు ఒలింపిక్ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో అప్పుడెప్పుడో రన్నింగ్ రేసులో పీటీ ఉష పతకం ఆశలు రేపగా దాదాపు నలభై ఏళ్లకు జావెలిన్ త్రోలో నీరజ్ చోప్డా ఆ కలను నిజం చేశాడు. రెజ్లింగ్‌లో భజరంగ్ పునియా రజతంతో మెరిశాడు. అయితే వీరిద్దరు ఒలింపిక్స్‌కి ముందు ఇన్స్పైర్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఐఐఎస్)లో శిక్షణ పొందారు. ఇండియా నుంచి ఒలింపిక్స్‌లో పోటీ పడుతున్న క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు ఐఐఎస్ పని చేస్తోంది. దీనికి ఆర్థిక సహకారాన్ని జిందాల్ ఇండస్ట్రీస్‌తో పాటు కోటక్ గ్రూప్, ఇండస్ఇండ్, సిటీబ్యాంక్, బ్రిడ్జిస్టోన్, బోరోసిల్ ఇలా మొత్తం 20కి పైగా కార్పోరేట్ కంపెనీలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా కాకుండా క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇచ్చే ప్రైవేటు ఇన్సిస్టి్యూట్గా ఐఐఎస్ పేరు మార్మోగిపోతుంది. పెరుగుతున్న ఫండింగ్ ఐఐఎస్‌లో శిక్షణ తీసుకున్న ఇద్దరు ఒలింపిక్ పతకాలు తేవడంతో ఈ ఏడాది ఐఐఎస్‌కు తమ ఫండింగ్‌ను 40 శాతం పెంచుతామంటూ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్స్ ఎండీ పార్థ్ జిందాల్ ప్రకటించారు. తమలాగే రిలయన్స్, ఆదానీ, టాటాలు కూడా పెంచే అవకాశం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషఁంలో రిలయన్స్ ఒక అడుగు ముందుకు వేసి గోస్పోర్ట్స్ ఫౌండేషన్ పేరుతో ఎన్జీవోని నిర్వహిస్తోంది. కంపెనీలకు అవసరమే మనదేశంలో క్రికెట్‌కి క్రేజ్ ఎక్కువ. బ్రాండ్ ప్రచారం చేసుకోవాలన్నా క్రికెట్ ప్రధానంగా అయ్యింది. అయితే క్రికెట్ స్సాన్సర్షిప్, ఆటగాళ్ల ఎండార్స్మెంట్ ఫీజులు కోట్లలో ఉంటున్నాయి. వీటిని దక్కించుకోవాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఇతర క్రీడలను ప్రోత్సహించడం అనివార్యత ఎప్పటి నుంచో ఉంది. ఎడిల్‌వైస్ కంపెనీ అయితే 2008 నుంచి ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ (ఏజీక్యూ) పేరుతో ప్రత్యేకంగా ఫండ్ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది. అయితే దేశం మొత్తం గుర్తించి... సెలబ్రేట్ చేసుకునే స్థాయిలో ఆటగాళ్ల నుంచి విజయాలు రాలేదు. ఒలింపిక్ చరిత్రలోనే ఈసారి ఇండియాకు అత్యధిక పతకాలు వచ్చాయి. దీంతో మెరుగైన ఆటగాళ్లకు స్పాన్సర్ చేసేందుకు ఒలింపిక్ అసోసియేషన్‌తో ఎడిల్‌వైస్ కంపెనీ చర్చలు ప్రారంభించింది. పీపీపీ మోడ్ ఒడిషా, టాటా గ్రూపులు సంయుక్తంగా పబ్లిక్, ప్రైవేటు పార్ట్నర్షిప్లో పురుష, మహిళా హకీ జట్లను స్పాన్సర్షిప్ అందించాయి. నలభై ఏళ్ల తర్వాత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించగా మహిళల జట్టు తృటిలో పతకాన్ని కోల్పోయినా స్ఫూర్తిదాయక ఆటతీరుని కనబరిచింది. దీంతో పీపీపీ మోడ్‌లో ఆటగాళ్లకు అండగా నిలించేందుకు రియలన్స్, జిందాల్‌లు ముందుకు వచ్చాయి. అథ్లెటిక్స్‌కి రిలయన్స్ స్పాన్సర్ చేస్తుండగా స్విమ్మింగ్‌కి చేదోడుగా ఉండేందుకు జిందాల్ అంగీకారం తెలిపింది. ఒడిషా తరహాలో ఒక్కో రాష్ట్రం ఒక్కో క్రీడకు అండగా నిలిస్తే విశ్వపోటీల్లో ఇండియా ప్రదర్శన మరో స్థాయిలో ఉంటుందని జిందాల్ స్పోర్ట్స్ హెడ్ వినీల్ కార్నిక్ తెలిపారు. -
బిర్లా కార్పొరేషన్- జిందాల్ హిసార్.. భళా
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో డైవర్సిఫైడ్ కంపెనీ బిర్లా కార్పొరేషన్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో మెటల్ రంగ కంపెనీ జిందాల్ స్టెయిన్లెస్(హిసార్) కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి.. వివరాలు చూద్దాం.. బిర్లా కార్పొరేషన్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో బిర్లా కార్పొరేషన్ నికర లాభం 87 శాతం ఎగసి రూ. 166 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 2 శాతమే పెరిగి రూ. 1,675 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో బిర్లా కార్పొరేషన్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 9.6 శాతం జంప్‌చేసి రూ. 705కు చేరింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 671 వద్ద ట్రేడవుతోంది. జిందాల్ స్టెయిన్లెస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జిందాల్ స్టెయిన్లెస్(హిసార్) రూ. 111 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2తో పోలిస్తే ఇది 35 శాతం అధికంకాగా.. మొత్తం ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 2,076 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు యథాతథంగా 12 శాతం వద్దే నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో జిందాల్ హిసార్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్ చేసి రూ. 104 వద్ద ట్రేడవుతోంది. -
ప్రజలకు ఉచితంగా అత్యంత ఖరీదైన టాయిలెట్
ముంబై : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నగరంలోనే అత్యంత ఖరీదైన పబ్లిక్ టాయిలెట్‌ను బ్రిహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రారంభించింది. దక్షిణ ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్ద, ఎయిరిండియా ఆఫీసుకు ఎదురుగా ఈ టాయిలెట్‌ను నిర్మించారు. ఐదు సీటు గల ఈ టాయిలెట్ కోసం సుమారు 90 లక్షల రూపాయలతో ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. ఐదు సీట్లలో రెండు సీట్లను మహిళల కోసం కేటాయించారు. ఈ పబ్లిక్ టాయిలెట్ సోలార్ ప్యానల్‌తో రూపొందింది. నీటిని పొదుపు చేసేందుకు వాక్యుమ్ టెక్నాలజీని కూడా దీని కోసం వాడారు. పైన సోలార్ ప్యానల్స్‌తో రూపొందిన తొలి వాక్యుమ్ టాయిలెట్ ఇదేనని బీఎంసీ అధికారి చెప్పారు. మెరైన్ డ్రైవ్ యొక్క ఆర్కిటెక్చర్ దీనికి డిజైన్ చేశారు. ఈ టాయిలెట్‌ను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా జిందాల్ గ్రూపు నిర్మించింది. అయితే మొదటి రెండు నెలలు ఉచితంగా సర్వీసులను ప్రజలకు అందించనున్నారు. అయితే ఆ తర్వాత ప్రజలు రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఖరీదైన టాయిలెట్ నేటి నుంచి ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఎయిర్ ఇండియా భవనానికి ఎదురుగా ఉన్న ఈ పబ్లిక్ టాయిలెట్‌ను బీఎంసీ ఆధ్వర్యంలో సోమవారం యువసేన చీఫ్ ఆదిత్య థాక్రే లాంఛనంగా ప్రారంభించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా పౌరులకు అందుబాటులో అత్యంత ప్రమాణాలు కలిగిన టాయిలెట్లో ఇది ఒకటి. ఇది పూర్తిగా సీఎస్ఆర్ నిధులతో నిర్మించబడింది. మా బాధ్యత కూడా దీన్ని ఇంతే శుభ్రంగా కాపాడుకోవడం’ అని బీఎంసీకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. సాధారణంగా ఒక టాయిలెట్‌ను ఒక్కసారి ఫ్లస్ చేస్తే, ఎనిమిది లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. అదే వాక్యుమ్ టెక్నాలజీతో నీటి వినియోగం బాగా తగ్గుతుందని, కేవలం 800 ఎంఎల్ నీరు మాత్రమే అవసరం పడుతుందని సమటెక్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు అక్షత్ గుప్త చెప్పారు. -
జడ్జిని కలిసేందుకు నిందితుడి యత్నం
న్యూఢిల్లీ: బొగ్గు స్కాం కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు జడ్జిని కలవడానికి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జిందాల్ గ్రూప్‌నకు చెందిన నిందితుల్లో ఒకరు పలుమార్లు ప్రయత్నించినట్లు వెలుగుచూసింది. సోమవారం కేసు విచారణ సందర్భంగా జడ్జి భరత్ పరాశర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇలా మరోసారి జరగరాదని నిందితుల తరఫు న్యాయవాదులను హెచ్చరించారు. అయితే తనను కలవడానికి ప్రయత్నించిన నిందితుడి పేరును మాత్రం జడ్జి వెల్లడించలేదు. ఈ కేసులో నిందితుడైన జిందాల్ గ్రూప్ అధినేత నవీన్ జిందాల్ కూడా ఈ సమయంలో కోర్టులోనే ఉన్నారు. విచారణ ప్రారంభంకాగానే జడ్జి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘ఇది మళ్లీ జరిగింది. ఈ కేసులో నిందితుల తరఫున సీనియర్ లాయర్లు వాదిస్తున్నా ఇలా జరగడం విచారకరం. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. దీన్ని కోర్టు రికార్డుల్లో నమోదు చేయాలని మీరు అనుకుంటే.. అలాగే చేస్తాను’ అని జడ్జి వ్యాఖ్యానించారు. మళ్లీ ఇలా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.