బిర్లా కార్పొరేషన్- జిందాల్ హిసార్.. భళా  | Birla corporation- Jindal stainless Hissar jumps on Q2 results | Sakshi
Sakshi News home page

బిర్లా కార్పొరేషన్- జిందాల్ హిసార్.. భళా 

Published Fri, Nov 6 2020 3:15 PM | Last Updated on Sat, Nov 7 2020 8:43 AM

Birla corporation- Jindal stainless Hissar jumps on Q2 results - Sakshi

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో డైవర్సిఫైడ్ కంపెనీ బిర్లా కార్పొరేషన్ కౌంటర్‌కు డిమాండ్‌ నెలకొంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో మెటల్‌ రంగ కంపెనీ జిందాల్ స్టెయిన్లెస్(హిసార్) కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి.. వివరాలు చూద్దాం..

బిర్లా కార్పొరేషన్
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో బిర్లా కార్పొరేషన్ నికర లాభం 87 శాతం ఎగసి రూ. 166 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 2 శాతమే పెరిగి రూ. 1,675 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో బిర్లా కార్పొరేషన్ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 9.6 శాతం జంప్‌చేసి రూ. 705కు చేరింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 671 వద్ద ట్రేడవుతోంది. 

జిందాల్ స్టెయిన్లెస్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో జిందాల్ స్టెయిన్లెస్(హిసార్) రూ. 111 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2తో పోలిస్తే ఇది 35 శాతం అధికంకాగా..  మొత్తం ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 2,076 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు యథాతథంగా 12 శాతం వద్దే నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో జిందాల్ హిసార్ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం జంప్ చేసి రూ. 104 వద్ద ట్రేడవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement