Jindal Steel
-
విమానంలో మహిళ పట్ల జిందాల్ స్టీల్ సీఈవో పైత్యం : స్పందించిన సంస్థ
జిందాల్ గ్రూప్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు విమానంలో తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ కోలకతాకు చెందిన ఒక మహిళ ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో శుక్రవారం ఒక పోస్ట్ పెట్టింది. దీంతో జిందాల్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ నవీన్ జిందాల్ స్పందించారు. నిందితుడైన ఉద్యోగిపై "కఠినమైన చర్యలు" తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోల్‌కతా నుంచి అబుదాబీ వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు బాధితురాలు వెల్లడించింది. ఆమె అందించిన వివరాల ప్రకారం కోల్‌కతా నుంచి బోస్టన్‌కు అబుదాబీకి ఎతిహాద్ ఎయిర్వేస్కు చెందిన ట్రాన్సిట్ విమానంలో బయలుదేరింది. విమానంలో ఆమె పక్కన కూర్చున్న 65 ఏళ్ల వ్యక్తి తాను జిందాల్ స్టీల్ సీఈఓ దినేష్ కుమార్ సరయోగిని తాను పరిచయం చేసుకున్నాడు. కుటుంబం, నేపథ్యంలో అంటూ మెల్లిగా మాటలు కలిపాడు. తాను ఒమన్‌లో నివసిస్తున్నానని, కానీ తరచూ ప్రయాణిస్తుంటా అని చెప్పాడు. తన కొడుకులు పెళ్లిళ్లు అయ్యి, అమెరికాలో స్థిరపడ్డారు అంటూ కబుర్లు చెప్పాడు. ఇక ఆ తరువాత అతగాడి అసలు రూపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. ఆమెను అసభ్య చిత్రాలు చూడమని బలవంతం చేశాడు ఈ షాక్ నుంచి తేరుకునే లోపలే శరీరం చుట్టూ చేతులేసి అసభ్యకరంగా తాకాడు. దీంతో అక్కడినుంచి తప్పించుకుని వాష్‌రూమ్‌కి పారిపోయి విమానంలోని సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వారు పోలీసులకు సమాచారం అందించారు. విమానం అబుదాబీలో దిగే సమయానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అయితే తనకు బోస్టన్‌కు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవుతుందనే భయంతో లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వలేకపోయానని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. మరోవైపు నిందితుడిపై అబుదాబి పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.అయితే తనలాంటి పరిస్థితి మరి ఏ మహిళకు రాకూడదనే ఉద్దేశంతో సోషల్‌మీడియా వేదికగా బహిరంగంగా వెల్లడిస్తున్నట్టు తెలిపింది. దీనిపై స్పందించిన జిందాల్ గ్రూప్ చైర్మన్ ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటి వాటిని కంపెనీ అస్సలు సహించదని స్పష్టం చేశారు. -
బీజేపీలో చేరిన స్టీల్ టైకూన్.. గంటల్లోనే టికెట్!
పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ ఆదివారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. అలా చేరారో లేదో కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనకు బీజేపీ టికెట్ ప్రకటించింది. హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి రంగంలోకి దించింది. అంతకుముందు రోజు నవీన్ జిందాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్'లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘నేను పదేళ్లు కురుక్షేత్ర నుంచి ఎంపీగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించాను. కాంగ్రెస్ నాయకత్వానికి, అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేడు రాజీనామా చేస్తున్నాను’ అన్నారు. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన నవీన్ జిందాల్ న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. పార్టీతో జిందాల్ అనుబంధం దేశ ఆర్థిక వ్యవస్థను పెంపొందించే ప్రభుత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళుతుందన్నారు. దేశంలోని ప్రముఖ జిందాల్ స్టీల్ & పవర్ (JSP) గ్రూప్‌నకు నవీన్ జిందాల్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీకి వ్యవస్థాపక ఛాన్సలర్‌గా కూడా ఉన్నారు. పోలో, స్కీట్ షూటింగ్ వంటి క్రీడల్లో జాతీయ గుర్తింపును సాధించారు. శాస్త్రీయ కూచిపూడి కళాకారిణి షల్లు జిందాల్‌ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవీన్ జిందాల్ 2004 నుంచి 2014 వరకు కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. 2014 జాతీయ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రాజ్ కుమార్ సైనీపై ఓటమిని ఎదుర్కొన్నారు. తదనంతరం 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. -
జిందాల్ స్టెయిన్లెస్ డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్(జేఎస్‌ఎల్) ఎండీగా అభ్యుదయ్ జిందాల్‌ను కొనసాగించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా వాటాదారులకు రూ. 2 ముఖ విలువగల షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు జేఎస్‌ఎల్ తెలియజేసింది. ఇందుకు ఈ నెల 26 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. మే నెల 17కల్లా డివిడెండ్ చెల్లించనున్నట్లు వెల్లడించింది. కంపెనీతో జిందాల్ స్టెయిన్లెస్(హిస్సార్) విలీనం తదుపరి ఇది తొలి డివిడెండుగా పేర్కొంది. 2023 మే 1 నుంచి అభ్యుదయ్ జిందాల్ మరో ఐదేళ్లపాటు ఎండీగా బాధ్యతలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తాజా ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. కాగా.. మొత్తం డివిడెండు చెల్లింపునకు రూ. 82 కోట్లకుపైగా వెచ్చించనున్నట్లు వివరించింది. -
జిందాల్ స్టెయిన్లెస్ జూమ్...
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం జిందాల్ స్టెయిన్లెస్(జేఎస్‌ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం దాదాపు మూడు రెట్లు ఎగసి రూ. 442 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 170 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,592 కోట్ల నుంచి రూ. 5,682 కోట్లకు జంప్ చేసింది. రుణ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 3,500 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జేఎస్‌ఎల్ షేరు బీఎస్ఈలో 0.5 శాతం బలపడి రూ. 218 వద్ద ముగిసింది. -
ఉత్పత్తి ఉరకలెత్తేలా, రాష్ట్రానికి క్యూ కడుతున్న ఉక్కు కంపెనీలు
సాక్షి, అమరావతి: ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతం అవుతున్నాయి. రాష్ట్రంలో భారీ ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థలతో పాటు దేశీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)తో పాటు చిన్నాచితకా కలిపి మొత్తం 33 ఉక్కు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏటా 8.4 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి వున్నాయి. ఇందులో ఆర్ఐఎన్ఎల్ ఒక్కటే 6.3 మిలిమిన్ టన్నుల సామర్థ్యంతో ఉంటే మిలిగిన 32 కంపెనీలు 2.1 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా ఉక్కు ఉత్పత్తిలో దేశంలోనే ఐదో స్థానంలో ఉన్న ఏపీని మూడవ స్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుతం ఉక్కు ఉత్పత్తిలో మొదటి నాలుగు స్థానాల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. రాష్ట్రానికి కంపెనీల క్యూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కడప ఉక్కు ఫ్యాక్టరీలో భాగస్వామిగా చేరడానికి ఎస్సార్ స్టీల్ కంపెనీ ముందుకొచ్చింది. మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ పనులను నవంబర్ నుంచి ప్రారంభించే విధంగా ఎస్సార్ స్టీల్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నం రేవుకు సమీపంలో రూ.7,500 కోట్ల పెట్టుబడితో 2.25 మిలియన్ టన్నుల ఉక్కు తయారీ యూనిట్ ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ముందుకు రాగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. మరోవైపు దక్షిణ కొరియా ఉక్కు దిగ్గజ కంపెనీ పోస్కో కూడా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఆ కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే కృష్ణపట్నం వద్ద స్థలాలను పరిశీలించి వెళ్లారు. మరోవైపు హ్యుందాయ్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ, గ్రీనె ట్క్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దేశంలో తయారవుతున్న వాహనాల్లో ఉపయోగించే 55 శాతం ఉక్కు దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అవుతుండటం, రాష్ట్రంలో సుదీర్ఘ సముద్ర తీరం, పోర్టులు ఉండటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు వంటి అంశాలు ఉక్కు దిగ్గజ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. -
ఉత్తమ్ గాల్వా ఎవరి పరం?
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీని టేకోవర్ చేయడానికి పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. విలువాధారిత ఉక్కు ఉత్పత్తులను విక్రయించడం ద్వారా మంచి పేరు సాధించిన ఈ కంపెనీ ఆ తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రుణాల చెల్లింపుల్లో విఫలం కావడంతో ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. టేకోవర్ బిడ్లకు సంబంధించిన గడువు గత నెల ముగిసింది. ఈ కంపెనీ టేకోవర్‌కు సంబంధించి సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ టేకోవర్ పోరు రసవత్తరంగా ఉండనున్నది. లోహ దిగ్గజ కంపెనీలు ఈ కంపెనీని టేకోవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. లోహ కుబేరులు–లక్ష్మీ మిట్టల్, జిందాల్ సోదరులు(సజ్జన్, నవీన్ జిందాల్‌లు), వేదాంత కంపెనీ అనిల్ అగర్వాల్ ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీని టేకోవర్ రేసులో ఉన్నారని సమాచారం. 2018లో దివాలా ప్రక్రియ ద్వారా ఈఎస్ఎల్ స్టీల్‌ను వేదాంత కంపెనీ టేకోవర్ చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారానే వేదాంత కంపెనీ టేకోవర్ బిడ్‌ను వేదాంత సమర్పించిందని సమాచారం. ఈ లోహ కుబేరులతో పాటు కోటక్ మహీంద్రాకు చెందిన ఫీనిక్స్అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ) కూడా ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీపై కన్నేసింది. అయితే టేకోవర్ వార్తలపై ఈ సంస్థలు స్పందించడానికి నిరాకరించాయి. విలువాధారిత ఉక్కు ఉత్పత్తులు... ఉత్తమ్ గాల్వా కంపెనీని రాజేంద్ర మిగ్లాని స్థాపించారు. వాహనాలు, విమానాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమల్లో ఉపయోగించే విలువాధారిత ఉక్కు ఉత్పత్తులు తయారు చేసే పెద్ద కంపెనీల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీకి తొలి ఆర్నెల్లలో రూ.277 కోట్ల ఆదాయంపై రూ.140 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. 2020 మొదట్లో ఉత్తమ్ గాల్వా స్టీల్స్ కంపెనీ 67 లక్షల డాలర్ల విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) చెల్లింపుల్లో విఫలమైంది. దీంతో ఈ కంపెనీపై దివాలా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ 2020 మార్చిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)లో ఒక పిటీషన్‌ను దాఖలు చేసింది. ఆరు నెలల తర్వాత ఎస్బీఐ పిటీషన్‌ను ఎన్సీఎల్టీ స్వీకరించింది. దివాలా ప్రక్రియను నిర్వహించడానికి కేఎమ్డీఎస్ అండ్ అసోసియేట్స్‌కు చెందిన మిలింద్ కసోద్కర్ను నియమించింది. అగ్ర భాగంలో ఆర్సెలర్ మిట్టల్... ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ టేకోవర్ పోరులో లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకే అధిక అవకాశాలున్నాయని సమాచారం. ఉత్తమ్ గాల్వా కంపెనీకి అత్యధికంగా అప్పులిచ్చింది లక్ష్మీ మిట్టల్ కంపెనీయే. ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ మొత్తం రుణ భారం రూ.9,742 కోట్లుగా ఉంది. దీంట్లో ఆర్సెలర్ మిట్టల్ సంస్థల(ఆర్సెలర్ మిట్టల్ ఇండియా, ఏఎమ్‌ఎన్‌ఎస్ లగ్జెంబర్గ్) వాటాలే రూ.7,922 కోట్లుగా ఉన్నాయి. రుణదాతలకున్న మొత్తం ఓటింగ్ రైట్స్‌లో ఈ రెండు సంస్థలకు కలిపి 87.2% వాటా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ చెల్లించాల్సిన రుణాలను ఈ సంస్థలను చెల్లించి, ఆ మేరకు అప్పుల్లో వాటాను తీసుకున్నాయి. ఒకప్పు డు ఉత్తమ్ గాల్వాలో ఒక ప్రమోటర్‌గా ఆర్సెలర్ మిట్టల్ ఉండేది. దివాలా తీసిన ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి గాను ఉత్తమ్ గాల్వా స్టీల్ నుంచి ఆర్సెలర్ మిట్టల్ వైదొలగింది. ఎస్సార్ స్టీల్‌ను టేకోవర్ చేసి ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియాగా పేరు మార్చింది. -
బిర్లా కార్పొరేషన్- జిందాల్ హిసార్.. భళా
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో డైవర్సిఫైడ్ కంపెనీ బిర్లా కార్పొరేషన్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడంతో మెటల్ రంగ కంపెనీ జిందాల్ స్టెయిన్లెస్(హిసార్) కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి.. వివరాలు చూద్దాం.. బిర్లా కార్పొరేషన్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో బిర్లా కార్పొరేషన్ నికర లాభం 87 శాతం ఎగసి రూ. 166 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 2 శాతమే పెరిగి రూ. 1,675 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో బిర్లా కార్పొరేషన్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 9.6 శాతం జంప్‌చేసి రూ. 705కు చేరింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 671 వద్ద ట్రేడవుతోంది. జిందాల్ స్టెయిన్లెస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో జిందాల్ స్టెయిన్లెస్(హిసార్) రూ. 111 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2తో పోలిస్తే ఇది 35 శాతం అధికంకాగా.. మొత్తం ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 2,076 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్లు యథాతథంగా 12 శాతం వద్దే నమోదయ్యాయి. ఫలితాల నేపథ్యంలో జిందాల్ హిసార్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్ చేసి రూ. 104 వద్ద ట్రేడవుతోంది. -
జెఎస్పీఎల్ భారీ పెట్టుబడులు
రాంచి: జార్ఖండ్‌లో ప్రముఖ స్టీల్ సంస్థ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జెఎస్పిఎల్) భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇప్పటికే రాష్టంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన జెఎస్పీఎల్ తన పెట్టుబడులును భారీగా పెంచనుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో రూ. 20వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే దాదాపు రూ.3వేల కోట్లను ఇన్వెస్ట్ చేసిన తాము మరిన్ని అదనపు పెట్టుబడులకు నిర్ణయించామని సంస్థ ఛైర్మన్ నవీన్ జిందాల్ ప్రకటించారు. ఈ పెట్టుబడుల ద్వారా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్నిబాగా పెంచుతున్నట్టు తెలిపారు. తమ పత్రాటు స్టీల్ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం సాలీనా ప్రస్తుతం 1.6 మిలియన్ టన్నుల నుంచి 6 మిలియన్ టన్నుల కు పెంచుతున్నట్టు చెప్పారు. మూమెంటం జార్ఖండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2017 నవీన్ ఈ విషయాన్ని ప్రకటించారు. జార్ఖండ్‌లో అపారమైన ఖనిజ వనరులు ఉన్నా రాజకీయ అస్థిరత కారణంగా ఇబ్బందులుపడిందని చెప్పారు. కానీ రాష్త్ర్ట్రం ఇప్పుడు అభివృద్ధిమార్గంలో పయనిస్తోందన్నారు. మరోవైపు ఇదే సదస్సులో పాల్గొన్న టాటా గ్రూపు అధినేత రతన్ టాటా జార్ఖండ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సింది తన సమకాలీన దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. -
బొగ్గు సంస్కరణల జోష్
146 పాయింట్లు అప్ 26,576 వద్దకు సెన్సెక్స్ వారం రోజుల గరిష్టం లాభాల్లో పవర్, మెటల్ బొగ్గు క్షేత్రాల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చాయ్. దీంతో పవర్, మెటల్, బ్యాంకింగ్ షేర్లు వెలుగులో నిలిచాయి. ప్రభుత్వ సంస్థలకు నేరుగానూ, ప్రయివేట్ రంగ కంపెనీలకు ఈవేలం ద్వారానూ బొగ్గు గనుల కేటాయింపును చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయనుండటంతో సెంటిమెంట్ మెరుగుపడింది. ఇందుకు ఎఫ్ఐఐలు మళ్లీ కొనుగోళ్లబాట పట్టడం కూడా జత కలిసింది. వెరసి సెన్సెక్స్ మరోసారి లాభాలతో మొదలైంది. ఆపై 26,615 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే మిడ్ సెషన్లో ఉన్నట్టుండి అమ్మకాలు పెరగడంతో లాభాలు పోగొట్టుకున్నప్పటికీ, చివర్లో మళ్లీ పురోగమించింది. ట్రేడింగ్ ముగిసేసరికి 146 పాయింట్ల లాభంతో 26,576 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ సైతం 48 పాయింట్లు బలపడి 7,928 వద్ద నిలిచింది. వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 576 పాయింట్లు జమ చేసుకుంది. జిందాల్ స్టీల్ జోరు: మెటల్ షేర్లలో జిందాల్ స్టీల్ అత్యధికంగా 7.5% జంప్‌చేయగా, సెన్సెక్స్ దిగ్గజాలు గెయిల్, సెసాస్టెరిలైట్, భెల్, విప్రో, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ, మారుతీ, భారతీ 4.5-2.5% మధ్య పుంజుకున్నాయి. ఇక రియల్టీ షేర్లు శోభా, డీఎల్ఎఫ్, ఒబెరాయ్, గోద్రెజ్, ఇండియాబుల్స్, ఫీనిక్స్ 6.5-2.5% మధ్య దూసుకెళ్లడంతో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 2.6% లాభపడింది. కాగా, మరోవైపు బ్లూచిప్స్ ఓఎన్జీసీ, ఎం అండ్ఎం, కోల్ ఇండియా 2.5-1.5% మధ్య నష్టపోయాయి. -
మార్కెట్లకు సుప్రీం దెబ్బ
బొగ్గు క్షేత్రాల కేటాయింపులన్నీ అక్రమాలేనంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో మెటల్, పవర్ రంగ షేర్లు దెబ్బతిన్నాయి. 1993 మొదలు 2011 వరకూ ప్రభుత్వ, ప్రయివేట్ రంగ సంస్థలకు వివిధ ప్రభుత్వాలు కేటాయించిన బొగ్గు క్షేత్రాలలో ఎలాంటి పారదర్శకతా లేదని సుప్రీం పేర్కొంది. దీంతో తొలుత సరికొత్త రికార్డులను నమోదుచేసిన స్టాక్ మార్కెట్లు చివర్లో బలహీనపడ్డాయి. ఒక దశలో 211 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ 26,630ను అధిగమించింది. ఇది సరికొత్త రికార్డుకాగా, నిఫ్టీ సైతం చరిత్రలో తొలిసారి 7,968ని తాకింది. అయితే చివరి గంటలో అమ్మకాలు ఊపందుకుని నష్టాలలోకి మళ్లాయి. సెన్సెక్స్ 26,401 పాయింట్ల వద ్ద, నిఫ్టీ 7,898 వద్ద కనిష్టానికి చేరాయి. వెరసి ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 26,437 వద్ద నిలిచింది. నిఫ్టీ మాత్రం 7 పాయింట్ల నష్టంతో 7,906 వద్ద స్థిరపడింది. మెటల్, పవర్ షేర్లు డీలా! మెటల్ షేర్లలో జిందాల్ స్టీల్ 14% , హిందాల్కో 10% తగ్గాయి. భూషణ్ స్టీల్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెసాస్టెరిలైట్, హిందుస్తాన్ జింక్, సెయిల్ 5-2% మధ్య నీరసించాయి. దీంతో మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 4.5%నష్టపోయింది. పవర్ షేర్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, అదానీ పవర్, రిలయన్స్ పవర్, టాటా పవర్, ఎన్‌హెచ్‌పీసీ 5-3% మధ్య క్షీణించాయి. కాగా రియల్టీ షేర్లు శోభా, యూనిటెక్, హెచ్‌డీఐఎల్, డీబీ, ఇండియాబుల్స్, డీఎల్ఎఫ్ సైతం 4-2% మధ్య తిరోగమించాయి. అయితే సెన్సెక్స్ దిగ్గజాలలో టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్, ఐటీసీ 2.5-1.5% మధ్య లాభపడ్డాయి. కాగా, డెట్ రేటింగ్‌ను ఇక్రా డౌన్‌గ్రేడ్ చేయడంతో జె ట్ ఎయిర్వేస్ షేరు 5% పతనమైంది. -
వెలుగులో చిన్న షేర్లు
మూడు రోజులుగా బలపడ్డ సెంటిమెంట్ చిన్న షేర్లకు టానిక్‌లా పనిచేస్తోంది. గత రెండు రోజుల్లో మార్కెట్లకు మించి పరుగు తీసిన బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు మరోసారి 1.4% ఎగశాయి. వెరసి ట్రేడైన షేర్లలో 1,746 లాభపడితే, 1,188 మాత్రమే నష్టపోయాయి. ఇక మరోవైపు మార్కెట్లు రోజంతా స్వల్ప ఒడిదుడుకులకులోనై చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 11 పాయింట్లు పెరిగి 25,561 వద్ద నిలిచింది. నిఫ్టీ మరింత అధికంగా 16 పాయింట్లు పుంజుకుని 7,640 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 554 పాయింట్లు జమ చేసుకుంది. ఎఫ్‌పీఐల పెట్టుబడుల జోరు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,912 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ ఫండ్స్ రూ. 1,316 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో ప్రధానంగా మెటల్స్, పవర్, వినియోగవస్తు రంగాలు 2%పైగా పురోగమించాయి. మెటల్ దిగ్గజాలు హిందాల్కో, టాటా స్టీల్, కోల్ ఇండియా, జిందాల్ స్టీల్, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4-2% మధ్య పుంజుకోగా, పవర్ షేర్లు సీఈఎస్సీ, టాటా పవర్, అదానీ పవర్, పీటీసీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎన్టీపీసీ, రిలయన్స్ పవర్ 4-2% మధ్య ఎగశాయి. సెన్సెక్స్‌లో ఎంఅండ్ఎం 3%, బజాజ్ ఆటో 2% చొప్పున క్షీణించాయి. రెండు సంస్థలుగా క్రాంప్టన్ గ్రీవ్స్ వినియోగ వస్తువుల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసి లిస్ట్ చేయనుండటంతో క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు 13% జంప్‌చేసింది. రూ. 211 వద్ద ముగిసింది. 2.3 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. వినియోగ వస్తు విభాగాన్ని (బీటూసీ) ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు బెల్జియం మాతృసంస్థ నిర్ణయించినట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ బీఎస్ఈకి తెలిపింది. ప్రధాన కంపెనీ చేతిలో విద్యుత్, పారిశ్రామిక, ఆటోమేషన్ ఉత్పత్తుల బిజినెస్ ఉంటుందని తెలియజేసింది.