
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం జిందాల్ స్టెయిన్‌లెస్(జేఎస్‌ఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం దాదాపు మూడు రెట్లు ఎగసి రూ. 442 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 170 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,592 కోట్ల నుంచి రూ. 5,682 కోట్లకు జంప్ చేసింది. రుణ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 3,500 కోట్లు సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది.
ఫలితాల నేపథ్యంలో జేఎస్‌ఎల్ షేరు బీఎస్‌ఈలో 0.5 శాతం బలపడి రూ. 218 వద్ద ముగిసింది.