న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ట్రావెల్ సరీ్వసుల కంపెనీ ఈజీ ట్రిప్ ప్లానర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 46 కోట్లకు చేరింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 42 కోట్లు ఆర్జించింది.
ఈజ్‌మైట్రిప్ బ్రాండుతో సరీ్వసులందించే కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 136 కోట్ల నుంచి 161 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 83 కోట్ల నుంచి రూ. 105 కోట్లకు పెరిగాయి. ఎయిర్ టికెటింగ్ బిజినెస్‌కుతోడు హోటళ్లు, హాలిడేస్, ట్రాన్స్‌పోర్టేషన్ తదితర విభాగాలలోనూ సేవలను విస్తరిస్తున్నట్లు కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో నిశాంత్ పిట్టి పేర్కొన్నారు.
ఫలితాల నేపథ్యంలో ఈజీ ట్రిప్ షేరు బీఎస్‌ఈలో 3 శాతం పతనమై రూ. 51 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment