![Crisil reports 13percent rise in Q3 net profit at Rs 171. 55 crore](/styles/webp/s3/article_images/2024/10/17/CRISIL.jpg.webp?itok=Sl_1K21B)
క్యూ3లో రూ. 172 కోట్లు
షేరుకి రూ. 15 డివిడెండ్
న్యూఢిల్లీ: రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ ఈ ఏడాది(2024) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్(క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ. 172 కోట్లకు చేరింది. గతేడాది(2023) ఇదే కాలంలో రూ. 152 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం రూ. 772 కోట్ల నుంచి రూ. 833 కోట్లకు బలపడింది. కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించే సంగతి తెలిసిందే. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 15 చొప్పున మూడో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.
ఈ షేరు బీఎస్‌ఈలో 2% లాభంతో రూ. 4,790 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment