న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్(జేఎస్‌ఎల్) ఎండీగా అభ్యుదయ్ జిందాల్‌ను కొనసాగించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా వాటాదారులకు రూ. 2 ముఖ విలువగల షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు జేఎస్‌ఎల్ తెలియజేసింది. ఇందుకు ఈ నెల 26 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది.
మే నెల 17కల్లా డివిడెండ్ చెల్లించనున్నట్లు వెల్లడించింది. కంపెనీతో జిందాల్ స్టెయిన్‌లెస్(హిస్సార్) విలీనం తదుపరి ఇది తొలి డివిడెండుగా పేర్కొంది. 2023 మే 1 నుంచి అభ్యుదయ్ జిందాల్ మరో ఐదేళ్లపాటు ఎండీగా బాధ్యతలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తాజా ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. కాగా.. మొత్తం డివిడెండు చెల్లింపునకు రూ. 82 కోట్లకుపైగా వెచ్చించనున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment