greensignal
-
రిలయన్స్ ఇన్ఫ్రాకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: మౌలికసదుపాయాల కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధుల సమీకరణ ప్రతిపాదనకు వాటాదారులు అనుమతించారు. షేర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ. 6,000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు సెపె్టంబర్ 19న గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా నిధులు సమకూర్చుకోనుంది. ఇందుకు పోస్టల్ బ్యాలట్ ద్వారా 98 శాతం మంది వాటాదారుల నుంచి అనుమతి పొందినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. నిధుల్లో షేర్ల ప్రిఫరెన్సియల్ కేటాయింపుల ద్వారా రూ. 3,000 కోట్లు, మారి్పడికి వీలయ్యే వారంట్ల జారీ(క్విప్) ద్వారా మరో రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. తొలి దశలో భాగంగా షేరుకి రూ. 240 ధరలో 12.56 కోట్ల ఈక్విటీ షేర్లు లేదా మారి్పడికి వీలయ్యే వారంట్లను ప్రిఫరెన్షియల్ పద్ధతిలో జారీ చేయనుంది. తద్వారా రూ. 3,014 కోట్లు అందుకోనుంది. వీటిలో 4.6 కోట్ల షేర్ల(రూ. 1,104 కోట్ల విలువ)లో ప్రమోటర్ సంస్థ రైజీ ఇనిఫినిటీ ప్రయివేట్ ఇన్వెస్ట్ చేయనుంది. -
ఆజాద్ ఇంజినీరింగ్ @ రూ. 740 కోట్లు సమీకరణ లక్ష్యం
ఇంజినీరింగ్ ప్రొడక్టుల కంపెనీ ఆజాద్ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. లిస్టింగ్ కోసం ఈ హైదరాబాద్ కంపెనీ సెపె్టంబర్లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 240 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 740 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ కస్టమర్లలో జనరల్ ఎలక్ట్రిక్, హనీవెల్ ఇంటర్నేషనల్, మిత్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్, సీమెన్స్ ఎనర్జీ, ఈటన్ ఏరోస్పేస్ తదితర గ్లోబల్ దిగ్గజాలున్నాయి. కాగా.. ఇప్పటికే పార్క్ బ్రాండ్ హోటళ్ల కంపెనీ ఏపీజే సురేంద్ర పార్క్ హోటల్స్, హెల్త్‌టెక్ సంస్థ మెడీ అసిస్ట్ హెల్త్‌కేర్ సరీ్వసెస్, క్రయోజెనిక్ ట్యాంకుల తయారీ కంపెనీ ఐనాక్స్ ఇండియా, లగ్జరీ ఫరీ్నచర్ తయారీ కంపెనీ స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ ఐపీవోలు చేపట్టేందుకు సెబీ నుంచి అనుమతులు పొందిన సంగతి తెలిసిందే. -
అ్రల్టాటెక్ తాజా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ సిమెంట్ రంగ దిగ్గజం అ్రల్టాటెక్ విస్తరణపై మరో సారి దృష్టి పెట్టింది. మూడో దశలో భాగంగా ఇందుకు రూ. 13,000 కోట్లు వెచి్చంచనుంది. తద్వారా 2.19 కోట్ల టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని జత చేసుకోనుంది. వెరసి కంపెనీ మొత్తం సిమెంట్ తయారీ సామర్థ్యం వార్షికంగా 18.2 కోట్ల టన్నులకు చేరనుంది. నిధులను అంతర్గత వనరుల నుంచి సమకూర్చుకోనున్నట్లు అ్రల్టాటెక్ వెల్లడించింది. వారాంతాన సమావేశమైన బోర్డు ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొంది. పాత ప్లాంట్ల విస్తరణ, కొత్త ప్లాంట్ల ఏర్పాటు సమ్మిళితంగా తాజా సామర్థ్య విస్తరణ చేపట్టనుంది. ప్రస్తుతం కంపెనీ సిమెంట్ తయారీ వార్షిక సామర్థ్యం దాదాపు 13.25 కోట్ల టన్నులుగా ఉంది. సామర్థ్య వినియోగం 75 శాతంగా నమోదవుతోంది. మూడో దశ విస్తరణ పూర్తయితే దక్షిణాదిలో 3.55కోట్ల టన్నులు, తూర్పు ప్రాంతంలో 4.04 కోట్ల టన్నులు, ఉత్తరాదిన 3.62 కోట్ల టన్నులు, పశి్చమాన 3.38 కోట్ల టన్నులు, మధ్య భారతంలో 3.57 కోట్ల టన్ను లు చొప్పున సిమెంట్ తయారీ సామర్థ్యాలను అందుకోనున్నట్లు అల్ట్రాటెక్ వివరించింది. -
భలే చాన్స్
‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి మంచి జోరుమీద ఉన్నారు. ఇటీవల తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ సినిమాలో ఓ హీరోయిన్గా నటించేందుకు శ్రీనిధి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ భలే చాన్స్ అందుకున్నారు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సరసన నటించను న్నారు శ్రీనిధి శెట్టి. హీరో సుదీప్, దర్శకుడు చేరన్ కాంబినేషన్లో సత్యజ్యోతి ఫిలింస్ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా నటించనున్నారు శ్రీనిధి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ కానున్నారట ఈ బ్యూటీ. -
బీజేపీ తొలి జాబితాకు నేడు గ్రీన్‌సిగ్నల్!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తర ఫున బరిలోకి దిగే అభ్యర్థుల తొలి జాబితాకు శుక్రవారం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. సీఈసీకి పంపే జాబితాకు సంబంధించి గురువారం ఢిల్లీలో వరు సగా భేటీలు, చర్చలు జరిగాయి. బీజేపీ రాష్ట్ర చీఫ్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షు రాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, ప్రకాశ్ జవదేకర్ తదితరులు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. పార్టీ బలంగా ఉన్న సీట్లు, అభ్యర్థుల బలాబలా లపై పార్టీ పెద్దలతో రాష్ట్ర నేతలు చర్చించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్య క్షుడు జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు, ముఖ్య నేతల పర్యటనలు, అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేశారు. ఇక తెలంగాణలో ఒంటరిగానే పోటీచేయాలని బీజేపీ నిర్ణయించిన నేపథ్యంలో.. ఇటీవల జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో జరిగిన చర్చల అంశాన్ని పార్టీ పెద్దలకు కిషన్‌రెడ్డి వివరించారు. వరుసగా భేటీలతో.. తొలుత గురువారం మధ్యాహ్నం పార్టీ ఎన్నికల ఇన్ చార్జి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ నివా సంలో రాష్ట్ర కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. ఈ భేటీలో తెలంగాణ నేతలతోపాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్స ల్లు పాల్గొన్నారు. ఇందులో ఒకే అభ్యర్థి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాపై చర్చించారు. ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్న సెగ్మెంట్లకు సంబంధించి ఆయా అభ్యర్థుల బలాబలాలను సమీక్షించారు. తర్వాత గురువారం సాయంత్రం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మరో సారి కోర్ గ్రూప్ భేటీ అయ్యింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇందులో పాల్గొన్నారు. తొలి జాబితా విడుదలయ్యాక ఎలాంటి అసంతృప్త స్వరాలు వినిపించకుండా ఉండేలా.. ఒక్కో నియో జకవర్గానికి సంబంధించి క్షుణ్నంగా సమీక్షించారు. చర్చించే సమయంలో తెలంగాణ అభ్యర్థుల జాబితాలను మూడు కేటగిరీలుగా.. పార్టీ బలంగా ఉన్న స్థానాలు, గట్టి పోటీ ఇచ్చే స్థానాలు, బలం పుంజుకోవాల్సిన సీట్లుగా జాబితాలను సిద్ధం చేసినట్టు తెలిసింది. ప్రచార ప్రణాళికపైనా చర్చ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారాన్ని దూకుడుగా కొనసాగించే అంశంపై రాష్ట్ర నాయకు లకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి, ఎక్కడ భారీ ర్యాలీలు చేపట్టాలన్న దానిపై ఇప్పటికే ఖరారైన ప్రణాళికను అమిత్ షా, నడ్డాలకు రాష్ట్ర నేతలు వివరించారు. వీటితోపాటు కేంద్ర పెద్దల పర్యట నలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. -
మరో స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుల్కర్
‘మహానటి’, ‘సీతారామం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరో స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తెలుగులో ‘తొలిప్రేమ’, ‘రంగ్ దే’, ‘సార్’ వంటి సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్న చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘అక్టోబరులో షూటింగ్‌ను ఆరంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులను అలరించే మరో మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
వరుణ్‌తేజ్‌తో పలాస డైరెక్టర్ మూవీ? వైజాగ్ నేపథ్యంలో...
హీరో వరుణ్ తేజ్, దర్శకుడు కరుణకుమార్ (‘పలాస’ మూవీ ఫేమ్) కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరుణ్‌కి ఓ కథను వినిపించారట కరుణకుమార్. స్క్రిప్ట్ నచ్చడంతో ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా వైజాగ్ నేపథ్యంలో ఉంటుందట. ఈ మూవీ కోసం వరుణ్ స్పెషల్ మేకోవర్ కానున్నారని టాక్. సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అవుతుందని భోగట్టా. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు ‘గాండీవధారి అర్జున’ సినిమా కోసం ప్రస్తుతం వరుణ్ తేజ్ బుడాపెస్ట్‌లో ఉన్నారు. అలాగే హిందీలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు వరుణ్ తేజ్. -
జిందాల్ స్టెయిన్లెస్ డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్(జేఎస్‌ఎల్) ఎండీగా అభ్యుదయ్ జిందాల్‌ను కొనసాగించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా వాటాదారులకు రూ. 2 ముఖ విలువగల షేరుకి రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు జేఎస్‌ఎల్ తెలియజేసింది. ఇందుకు ఈ నెల 26 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. మే నెల 17కల్లా డివిడెండ్ చెల్లించనున్నట్లు వెల్లడించింది. కంపెనీతో జిందాల్ స్టెయిన్లెస్(హిస్సార్) విలీనం తదుపరి ఇది తొలి డివిడెండుగా పేర్కొంది. 2023 మే 1 నుంచి అభ్యుదయ్ జిందాల్ మరో ఐదేళ్లపాటు ఎండీగా బాధ్యతలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తాజా ప్రతిపాదనకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. కాగా.. మొత్తం డివిడెండు చెల్లింపునకు రూ. 82 కోట్లకుపైగా వెచ్చించనున్నట్లు వివరించింది. -
కాకినాడ సెజ్‌కు ప్రత్యేక రైల్వేలైన్.. దక్షిణ మధ్య రైల్వే గ్రీన్‌సిగ్నల్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: దాదాపు పదేళ్లపాటు పడకేసిన కాకినాడ ఎస్ఈజడ్లో పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన పనులు ఇప్పుడు ఊపందుకున్నాయి. కాకినాడ తీరంలో తొండంగి వద్ద నిర్మాణంలో ఉన్న కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ (కేజీపీఎల్)ను మెయిన్ రైల్వేలైన్‌తో అనుసందానించే ప్రక్రియ ఎట్టకేలకు పట్టాలెక్కుతోంది. ఇందుకోసం కేజీపీఎల్ నుంచి అన్నవరం వరకు 15 కిలోమీటర్లు మేర ప్రత్యేక రైల్వేలైన్ నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే కూడా ఇందుకు పచ్చజెండా ఊపింది. ప్రత్యేక రైల్వేలైన్‌తో పాటు దశాబ్దాల కాలంగా సత్యదేవుని భక్తుల కలగా మిగిలిన అన్నవరం రైల్వేస్టేషన్ ఆధునీకరణను కూడా చేపడుతున్నారు. ఇందుకోసం సుమారు రూ.300 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తం రైల్వే పనులను కేజీపీఎల్ సొంతంగా చేపడుతోంది. సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు నిజానికి.. చంద్రబాబు హయాంలో మౌలిక సదుపాయాల కల్పనను అటకెక్కించేశారు. కానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో బహుళ జాతి కంపెనీలు, ఎగుమతి, దిగుమతి ఆధారిత పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఇలా వస్తున్న పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు ఇస్తోంది. మరోవైపు.. కేజీపీఎల్కు ప్రత్యేక రైల్వేలైన్ కోసం 90 ఎకరాల భూసేకరణకు రైతులతో చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా.. విజయవాడ–విశాఖపట్నం మధ్య అన్నవరం రైల్వేస్టేషన్ నుండి కేజీపీఎల్ వరకు 15 కిలోమీటర్ల మేర సరుకు రవాణా కోసం ప్రత్యేక రైల్వేట్రాక్ నిర్మించనున్నారు. ఇక ప్రాజెక్టులో భాగంగా అన్నవరం రైల్వేస్టేషన్, ప్లాట్‌ఫారమ్‌లతో పాటు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఇందుకు దక్షిణ మధ్య రైల్వే నుంచి ఇప్పటికే అన్ని రకాల అనుమతులు వచ్చాయి. వచ్చేనెలలో పనులు మొదలు కానున్నాయి. ఈ రైల్వే ప్రాజెక్టు నిర్మాణంతో కాకినాడ గేట్‌వే పోర్టుకు ప్రతిరోజు 16వేల టన్నుల సామర్థ్యం కలిగిన బొగ్గు, ఎరువులతో పాటు కంటైనర్లలో ఆయిల్, ఎల్ఎన్జీ రవాణా కానుంది. తొలిదశలో నాలుగు గూడ్స్ రైళ్లను నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. చదవండి: ‘జగన్‌బాబు దేవుడయ్యా.. మాలాంటి ముసలోళ్ల కడుపులు నింపుతున్నాడు’ ఈ రైల్వేలైన్ కేఎస్‌ఈజెడ్‌లో ఏర్పాటవుతున్న కేజీపీఎల్, బల్‌్కడ్రగ్ పార్కు, అరబిందో పెన్సిలిన్ జీ, దివీస్ తదితర పరిశ్రమలకు ఎంతో ఉపయోగపడుతుంది. వీటిపై కేఎస్ఈజెడ్ ప్రాజెక్టు హెడ్ గరుడ సీతారామయ్య స్పందిస్తూ.. రైల్వేస్టేషన్, రైల్వేట్రాక్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి అనుమతులు కూడా లభించాయన్నారు. -
4 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నాలుగు కంపెనీల నిధుల సమీకరణ ప్రణాళికలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో సైయంట్ డీఎల్ఎం, రాశి పెరిఫెరల్స్, హెల్త్విస్టా ఇండియా, జాగిల్ ప్రీపెయిడ్ ఓషియన్ సర్వీసెస్ ఉన్నాయి. ఇవన్నీ 2022 జూలై– 2023 జనవరి మధ్య సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. తద్వారా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు మార్చి 29–31 మధ్య అనుమతి పొందాయి. వెరసి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్‌కు దారి ఏర్పడింది. ఐటీ సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందించే రాశి పెరిఫెరల్స్ ఐపీవోలో భాగంగా రూ. 750 కోట్లను సమీకరించే యోచనలో ఉంది. పూర్తిగా షేర్ల జారీ ద్వారా నిధులను సమకూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 400 కోట్లను రుణ చెల్లింపులు, రూ. 200 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల సంస్థ సైయంట్ డీఎల్ఎం సైతం రూ. 740 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తోంది. ఇందుకు అనుగుణంగా తాజా ఈక్విటీ జారీకి తెరతీయనుంది. ఈ నిధులను మూలధన అవసరాలు, విస్తరణ వ్యయాలు, రుణ చెల్లింపులు, ఇతర కంపెనీల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. హెల్త్‌కేర్ సేవలు పోర్టీ బ్రాండుతో ఆసుపత్రుల బయట ఆరోగ్య పరిరక్షణ సేవలందించే హెల్త్విస్టా ఇండియా ఐపీవో ద్వారా రూ. 1,000 కోట్ల సమీకరణపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 5.62 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ మెడీబిజ్ ఫార్మా వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రుణ చెల్లింపులు, మెడికల్ పరికరాల కొనుగోళ్లు, ఇతర కంపెనీల కొనుగోళ్లకు వినియోగించనుంది. ఫైనాన్షియల్ సేవలు ఐపీవోలో భాగంగా ఫైనాన్షియల్ సేవలందించే ఫిన్‌టెక్ కంపెనీ జాగిల్ ప్రీపెయిడ్ ఓషియన్ సర్వీసెస్ రూ. 490 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు 1.05 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వినియోగదారులను పెంచుకోవడం, టెక్నాలజీ, ప్రొడక్టుల అభివృద్ధి, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. -
ఎన్సీడీల జారీతో రూ. 57,000 కోట్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 57,000 కోట్లు సమీకరించనుంది. ఈ ప్రతిపాదనకు తాజాగా బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. అన్సెక్యూర్డ్, రిడీమబుల్, నాన్‌కన్వర్టిబుల్ డిబెంచర్ల జారీకి బోర్డు క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలియజేసింది. షెల్ఫ్ ప్లేస్మెంట్ మెమొరాండంకింద మొత్తం రూ. 57,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు వివరించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్లో భాగంగా వివిధ దశలలో వీటిని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. గతేడాది(2022) జూన్ 30న నిర్వహించిన 45వ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఇందుకు అనుమతించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. మరోవైపు కంపెనీ మొత్తం రుణ సమీకరణ సామర్థ్యాన్ని రూ. 6 లక్షల కోట్ల నుంచి రూ. 6.5 లక్షల కోట్లకు పెంచేందుకు సైతం బోర్డు ఆమోదించినట్లు తెలియజేసింది. ఈ అంశంపై ఎప్పుడైనా పోస్టల్ బ్యాలట్ ద్వారా సభ్యుల నుంచి అనుమతి కోరేందుకు బోర్డు అనుమతించినట్లు పేర్కొంది. ప్రస్తుతం సుమారు రూ. 5.7 లక్షల కోట్లుగా ఉన్న ఔట్‌స్టాండింగ్ రుణాలను బిజినెస్ అవసరాలరీత్యా పెంచుకునేందుకు వీలున్నట్లు తెలియజేసింది. గ్రూప్‌లోని మరో దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో విలీనంకానున్న నేపథ్యంలో అంతకంటే ముందుగానే రుణ సమీకరణ చేపట్టవచ్చని తెలియజేసింది. ఈ ఏప్రిల్‌తో ప్రారంభంకానున్న వచ్చే ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో విలీనం పూర్తికావచ్చని అంచనా. విలీనం తదుపరి ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐతో పోలిస్తే హెచ్డీఎఫ్సీ బ్యాంకు విలువ రెట్టింపుకానుంది! -
ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్‌కు సీసీఐ ఓకే
న్యూఢిల్లీ: సింగపూర్ నిధుల సమీకరణ సంస్థ ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ(క్యూఐఏ) ప్రతిపాదిత పెట్టుబడులకు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. క్యూఐఏ ఖతార్‌కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్‌కాగా.. మర్డోక్ సంస్థ లుపా సిస్టమ్స్(జపాన్)తోపాటు, స్టార్, డిస్నీ ఇండియా మాజీ చైర్మన్ ఉదయ్ శంకర్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ వెంచర్ సంస్థే బీటీఎస్1. అయితే బీటీ ఎస్1లో క్యూఐఏ పెట్టుబడులు పెట్టనుంది. వయాకామ్18లో పెట్టుబడుల కోసం బీటీఎస్1 వివిధ సంస్థల నుంచి నిధులు సమీకరిస్తోంది. క్యూఐఏ నుంచి 1.5 బిలియన్ డాలర్ల సమీకరణకు గతేడాది ఫిబ్రవరిలో మర్డోక్, ఉదయ్ శంకర్ బోధి ట్రీ సిస్టమ్స్(బీటీఎస్)ను ఏర్పాటు చేశారు. తదుపరి ఏప్రిల్‌లో బిలియనీర్ ముకేశ్ అంబానీతో భాగస్వా మ్యం ద్వారా బీటీఎస్.. వయాకామ్18లో రూ. 13,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ త్రిముఖ ఒప్పందం ద్వారా దేశీయంగా భారీస్థాయిలో టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఆపై 2022 సెప్టెంబర్‌లో బీటీఎస్ ఇన్వెస్ట్మెంట్, రిలయన్స్ ప్రాజెక్ట్స్, ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పెట్టుబడుల నేపథ్యంలో జియో సినిమా, వయాకామ్18 మీడియా విలీనానికి సీసీఐ అనుమతించింది. -
3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలను అనుమతించింది. ఫస్ట్‌మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్, ఐఆర్ఎం ఎనర్జీ లిమిటెడ్, లోహియా కార్ప్ నిధుల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ కంపెనీలు 2022 సెప్టెంబర్– 2023 జనవరి మధ్య కాలంలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఫస్ట్‌మెరిడియన్ సిబ్బంది నియామక(స్టాఫింగ్) సంస్థ ఫస్ట్‌మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీవో ద్వారా రూ. 740 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 690 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌సహా ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. అంతేకాకుండా మరో రూ. 50 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ప్రధానంగా ప్రమోటర్ సంస్థ మ్యాన్‌పవర్ సొల్యూషన్స్ రూ. 615 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనుంది. కాగా.. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఐఆర్ఎం ఎనర్జీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా సిటీ గ్యాస్ పంపిణీ కంపెనీ ఐఆర్ఎం ఎనర్జీ 1.01 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 650–700 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిధులను తమిళనాడులోని నమక్కల్, తిరుచిరాపల్లిలలో బిజినెస్(సిటీ గ్యాస్ పంపిణీ) నెట్వర్క్ విస్తరణకు అవసరమైన పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వినియోగించనుంది. పీఎన్జీ, సీఎన్జీ పంపిణీ చేసే కంపెనీ గుజరాత్, పంజాబ్‌లోనూ కార్యకలాపాలు విస్తరించింది. లోహియా కార్ప్ టెక్నికల్ టెక్స్టైల్స్ ఉత్పత్తికి వినియోగించే మెషినరీ తయారీ కంపెనీ లోహియా కార్ప్ ఐపీవోలో భాగంగా 3.17 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు వీటిని ఆఫర్ చేయనున్నారు. 2022 మార్చి31కల్లా కంపెనీ 90 దేశాలలో 2,000 మంది కస్టమర్లను కలిగి ఉంది. ప్రధానంగా పాలీప్రొపిలీన్, హైడెన్సిటీ పాలీఎథిలీన్ వొవెన్ ఫ్యాబ్రిక్, సేక్స్ తదితర టెక్నికల్ టెక్స్టైల్స్ తయారీకి వినియోగించే మెషీనరీ, పరికరాలను కంపెనీ రూపొందిస్తోంది. -
పీవీఆర్, ఐనాక్స్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: దేశంలోని టాప్–2 మల్టీప్లెక్స్ దిగ్గజాల విలీనానికి తాజాగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పీవీఆర్, ఐనాక్స్ లీజర్ సంయుక్త సంస్థగా ఆవిర్భవించేందుకు మరో అడుగు ముందుకు పడింది. ప్రతిపాదిత విలీనానికి ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఈ నెల 12న అనుమతించినట్లు పీవీఆర్ వెల్లడించింది. 2022 అక్టోబర్‌లో ప్రత్యర్థి సంస్థ ఐనాక్స్ లీజర్తో విలీనానికి పీవీఆర్ వాటాదారులు ఆమోదముద్ర వేశారు. అంతకుముందు జూన్‌లో స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఇందుకు ఓకే చెప్పాయి. తొలుత గతేడాది మార్చిలో రెండు కంపెనీలూ విలీనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్సీఎల్టీ అనుమతి నేపథ్యంలో పీవీఆర్ షేరు 0.5 శాతం నీరసించి రూ. 1,745 వద్ద, ఐనాక్స్ లీజర్ 0.7 శాతం నష్టంతో రూ. 515 వద్ద ముగిశాయి. -
3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పబ్లిక్ ఇష్యూలను చేపట్టేందుకు తాజాగా మూడు కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో ఆఫీసర్స్ చాయిస్ విస్కీ తయారీ కంపెనీ అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లరీస్, లైడ్ లైటింగ్ సొల్యూషన్ల సంస్థ ఐకియో లైటింగ్, ఆటో విడిభాగాల కంపెనీ డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ చేరాయి. ఈ మూడు సంస్థలూ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెప్టెంబర్, అక్టోబర్లలో సెబీకి ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. కాగా.. అక్టోబర్‌లో మోటిసన్స్ జ్యువెలర్స్ దాఖలు చేసిన ముసాయిదా పత్రాలను ఈ నెల 16న రిటర్న్ చేసినట్లు వెబ్సైట్లో సెబీ పేర్కొంది. ఇతర వివరాలు చూద్దాం.. అలైడ్ బ్లెండర్స్ ఐపీవోలో భాగంగా అలైడ్ బ్లెండర్స్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ సంస్థ విక్రయానికి ఉంచనున్నాయి. ప్రధానంగా బినా కిషోర్ చాబ్రియా రూ. 500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ దేశీ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్ఎల్) విభాగంలో 10 బ్రాండ్లు కలిగి ఉంది. ప్రధాన బ్రాండ్లలో ఆఫీసర్స్ చాయిస్ విస్కీ, జాలీ రోజర్ రమ్, క్లాస్ 21 వోడ్కా తదితరాలున్నాయి. డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా డివ్జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 31,46,802 షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలతోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. తయారీకి వీలుగా ఎక్విప్మెంట్ కొనుగోలు చేయనుంది. కంపెనీ ప్రధానంగా సిస్టమ్ లెవల్ ట్రాన్స్ఫర్ కేస్, టార్క్ కప్లర్, డ్యూయల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ సొల్యూషన్స్ తదితరాలను అందిస్తోంది. ఐకియో లైటింగ్ ఐపీవోలో భాగంగా ఐకియో లైటింగ్ రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 75 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 50 కోట్లను రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. మరో రూ. 237 కోట్లను సొంత అనుబంధ సంస్థ ఐకియో సొల్యూషన్స్ నోయిడాలో ఏర్పాటు చేయనున్న యూనిట్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా లెడ్ లైటింగ్ సొల్యూషన్స్ అందిస్తోంది. -
కళామందిర్‌కు సెబీ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: సంప్రదాయ దుస్తుల విక్రయ సంస్థ సాయి సిల్క్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవో ద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా 1.80 కోట్లకుపైగా షేర్లను ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచనున్నాయి. కళామందిర్, వరమహాలక్ష్మి సిల్క్స్, కేఎల్ఎం, మందిర్ బ్రాండ్లతో కంపెనీ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్విటీ జారీ నిధులను 25 కొత్త స్టోర్లు, 2 వేర్‌హౌస్‌ల ఏర్పాటుకు వినియోగించనుంది. అంతేకాకుండా రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలు తదితరాలకు సైతం కేటాయించనుంది. కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులలో 50 స్టోర్లను నిర్వహిస్తోంది. రూ. 2,400 కోట్లపై కేఫిన్ కన్ను ఫైనాన్షియల్ సర్వీసుల ప్లాట్‌ఫామ్ కేఫిన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా అనుమతించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 2,400 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేసింది. కంపెనీ ప్రమోటర్ జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్ పీటీఈ లిమిటెడ్ వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం కేఫిన్‌లో జనరల్ అట్లాంటిక్ దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం కొటక్ మహీంద్రా 9.98 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఐపీవో దరఖాస్తును కంపెనీ మార్చిలో సెబీకి దాఖలు చేసింది. -
టీడీపీ నేత నారాయణను విచారించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
మళ్లీ ఐపీవోల స్పీడ్
న్యూఢిల్లీ: ఆటుపోట్ల మధ్య స్టాక్ మార్కెట్లు బలపడుతుండటంతో ప్రైమరీ మార్కెట్లకు మళ్లీ కళ వస్తోంది. తాజాగా మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిధుల సమీకరణ చేపట్టనున్న జాబితాలో జ్యువెలరీ రిటైల్ కంపెనీ సెన్కో గోల్డ్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ సబ్‌సిస్టమ్స్, కేబుళ్ల(ఎలక్ట్రానిక్) తయారీ సంస్థ డీసీఎక్స్ సిస్టమ్స్, మాంసం(ఫ్రోజెన్) ఎగుమతుల కంపెనీ హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ చేరాయి. ఈ కంపెనీలు ఐపీవోలు చేపట్టేందుకు వీలుగా మార్చి, ఏప్రిల్ నెలల్లోనే సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ప్రాస్పెక్టస్‌ల ప్రకారం మూడు కంపెనీలూ ఉమ్మడిగా రూ. 1,605 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నాయి. సెన్కో గోల్డ్ ఐపీవోలో భాగంగా సెన్కో గోల్డ్ రూ. 325 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ వాటాదారు సైఫ్ పార్టనర్స్ ఇండియా 4 లిమిటెడ్ మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనుంది. వెరసి కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 525 కోట్లు సమకూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 240 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ప్రస్తుతం కంపెనీ 127 షోరూమ్‌లను నిర్వహిస్తోంది. వీటిలో 70 సొంతంకాగా.. మరో 57 ఫ్రాంచైజీలు. ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా సైతం ప్రొడక్టులను విక్రయిస్తోంది. జ్యువెలరీని దుబాయ్, మలేసియా, సింగపూర్‌లకు ఎగుమతి చేస్తోంది. డీసీఎక్స్ సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూ ద్వారా డీసీఎక్స్ సిస్టమ్స్ రూ. 600 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ సంస్థలు ఎన్‌సీబీజీ హోల్డింగ్స్, వీఎన్‌జీ టెక్నాలజీ ఆఫర్ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సొంత అనుబంధ సంస్థ రేనియల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్‌లో పెట్టుబడులు తదితరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా సిస్టమ్ ఇంటిగ్రేషన్‌తోపాటు వివిధ ఎలక్ట్రానిక్ కేబుళ్లు, అసెంబ్లీలను రూపొందిస్తోంది. హెచ్ఎంఏ ఆగ్రో ఐపీవో ద్వారా హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ రూ. 480 కోట్ల నిధులను సమకూర్చుకునే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా రూ. 150 కోట్ల ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 330 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవో నిధుల్లో రూ. 135 కోట్లను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఆగ్రా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ఘనీభవించిన ఎద్దు మాంసంతో కూడిన ప్రొడక్టులను 40 దేశాలకుపైగా ఎగుమతి చేస్తోంది. అమ్మకాలలో 90 శాతం ఎగుమతుల ద్వారానే సమకూరుతోంది. -
కమోడిటీ డెరివేటివ్‌లలో ఎఫ్‌పీఐలకు సై
ముంబై: ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్(ఈటీసీడీ) విభాగంలో కార్యకలాపాలు చేపట్టేందుకు సెబీ తాజాగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు)కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్లో మరింత లిక్విడిటీ, గాఢత పెరిగేందుకు వీలుంటుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బోర్డు బుధవారం నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంది. వీటిలో భాగంగా మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజర్ల పాలనా సంబంధ నిబంధనల సవరణలకు బోర్డు ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా కార్పొరేట్ బాండ్లు, రెపో లావాదేవీలకు సంబంధించిన లిమిటెడ్ పర్పస్ క్లయరింగ్ కార్పొరేషన్(ఎల్‌పీసీసీ)కు చెందిన ఎస్ఈసీసీ నియంత్రణల ప్రొవిజన్ల సవరణలకు సైతం ఓకే చెప్పింది. మార్చితో ముగిసిన గతేడాది(2021–22)కి వార్షిక నివేదికను బోర్డు ఆమోదించింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి దాఖలు చేయనుంది. వ్యవసాయేతర విభాగం అన్ని రకాల వ్యవసాయేతర కమోడిటీ డెరివేటివ్స్‌లోనూ ట్రేడింగ్ చేపట్టేందుకు ఎఫ్‌పీఐలను సెబీ బోర్డు అనుమతించింది. వీటితోపాటు కొన్ని ఎంపిక చేసిన ప్రామాణిక ఇండెక్సులలోనూ లావాదేవీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో నగదు ద్వారా సెటిల్ చేసుకునే కాంట్రాక్టుల్లో ట్రేడింగ్‌కు మాత్రమే ఎఫ్‌పీఐలకు వీలుంటుంది. ఈటీసీడీలో విదేశీ ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించడం ద్వారా మార్కెట్లలో గాఢతను పెంచడంతోపాటు మరింత లిక్విడిటీకి అవకాశముంటుందని బోర్డు సమావేశం అనంతరం సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో సరైన ధర నిర్ణయాని(ప్రైస్ డిస్కవరీ)కి సైతం వీలుంటుందని తెలియజేసింది. ఈ విభాగంలో ఇప్పటికే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్(ఏఐఎఫ్‌లు), పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసులు, మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) తదితర కేటగిరీ–3 పెట్టుబడిదారులకు అనుమతి ఉంది. అర్హతగల విదేశీ సంస్థ(ఈఎఫ్ఈ)లు మార్గంలో ప్రస్తుతం అమల్లో ఉన్న దేశీ ఫిజికల్ కమోడిటీల ట్రేడింగ్‌ను రద్దు చేయనుంది. అయితే ఈటీసీడీలలో ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లుగా భారీ కొనుగోలు శక్తి కలిగిన ఎఫ్‌పీఐలను అనుమతించరు. తాజా నిర్ణయాల అమలు తేదీలను తదుపరి ప్రకటించనుంది. ప్రస్తుతం 10,000 ఎఫ్‌పీఐలు రిజిస్టరై ఉన్నప్పటికీ, పదో వంతు పార్టిసిపేట్ చేసినప్పటికీ మార్కెట్లు భారీగా విస్తరించే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. -
527 మద్యం దుకాణాలకు గ్రీన్‌సిగ్నల్
6,317 దరఖాస్తుల ద్వారా రూ.39.66 కోట్ల ఆదాయం సింగిల్ దుకాణాలు –42 ఇంకా 18 దుకాణాలకు మళ్లీ నోటిఫికేష¯ŒS కాకినాడ క్రైం: తూర్పు గోదావరి జిల్లాలో 2017–19 సంవత్సరానికి 527 మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎక్సైజ్ అధికారులు లైసెన్సులు జారీ చేశారు. 545 దుకాణాలకు నోటిఫికేష¯ŒS వెలువడగా 527 దుకాణాలకు 6,545 మంది వ్యాపారస్తుల నుంచి ఆ¯ŒSలైన్లో దరఖాస్తు చేసుకోగా 232 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని 18 దుకాణాలకు వ్యాపారుల నుంచి ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. 42 మద్యం దుకాణాలకు ఒక్కో దరఖాస్తు రావడంతో వీటికి అధికారులు ఎటువంటి లాటరీ నిర్వహించకుండా నేరుగా లైసెన్సులు జారీ చేశారు. మిగతా మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా లైసెన్సులు జారీ చేశారు. కోలాహలంగా దుకాణాలకు లాటరీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్యం పాలసీ ప్రకారం ఏప్రిల్, జూలై ఒకటో తేదీ నుంచి జిల్లాలో 527 మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్సుల జారీ ప్రక్రియను శుక్రవారం కాకినాడ ఎ¯ŒSఎఫ్‌సీఎల్ రోడ్డులోని జీ కన్వెన్ష¯ŒS హాల్లో ఎౖMð్సజ్ డిప్యూటీ కమిషనర్ బి. అరుణారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పుననుసరించి జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల అవతల మద్యం దుకాణాలు ఉండేలా ఎక్సైజ్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులను జిల్లా పంచాయతీ అధికారి టీవీజీఎస్ కుమార్, డీఆర్డీఏ పీడీ మల్లిబాబుల ఆధ్వర్యంలో ఎౖMð్సజ్ అధికారులు జారీ చేశారు. తొలుత సింగిల్ దరఖాస్తులు వచ్చిన వ్యాపారులకు ఎటువంటి లాటరీ నిర్వహించకుండా లైసెన్సులు జారీ చేశారు. అనంతరం ఒకటి కంటే ఎక్కువ వచ్చిన టెండర్లకు లాటరీ నిర్వహించి, విజేతలకు లైసెన్సు జారీ చేశారు. లాటరీ నిర్వహించిన దుకాణాలకు ఒక విజేతతో పాటు రిజర్వులో మరొకర్ని ఎంపిక చేశారు. తొలుత కేటాయించిన వ్యాపారుస్తుడు అనివార్య కారణాల వల్ల లైసెన్సు ఫీజు చెల్లించకపోయినా, బ్యాంకు గ్యారంటీ ఇవ్వకపోయినా ప్రత్యామ్నాయంగా దుకాణం కేటాయించేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ ఫోర్లో తూర్పున అమలాపురం డివిజ¯ŒSకి డీఆర్డీఏ పీడీ మల్లిబాబు, కాకినాడ యూనిట్‌కి డీపీవో కుమార్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి వ్యాపారులకు లైసెన్సులు జారీ చేశారు. మద్యం దుకాణాల ఏర్పాటుకు నిర్వహించిన లాటరీలో సుమారు 50 మంది మహిళలు అత్యంత హుషారుగా పాల్గొనటం విశేషం. 18 దుకాణాలకు మళ్లీ నోటిఫికేష¯ŒS జారీ జిల్లాలో మిగిలిపోయిన 18 మద్యం దుకాణాలకు రెండోసారి నోటిఫికేష¯ŒS విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్ డీసీ అరుణారావు వెల్లడించారు. రీ నోటిఫికేష¯ŒS కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్టు చెప్పారు. జిల్లాలో కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం యూనిట్ల పరిధిలో రాత్రి 10 గంటల సమయానికి 350 మద్యం దుకాణాల ఏర్పాటుకి వ్యాపారస్తులకు లైసెన్సులు జారీ చేసినట్లు ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ బి.అరుణారావు వెల్లడించారు. మిగతా షాపులకి శనివారం తెల్లవారుజాము దాకా లైసెన్సుల జారీ పూర్తయ్యే దాకా నిరంతరం కొనసాగుతుందన్నారు. దరఖాస్తులిలా.... మద్యం దుకాణాల ఏర్పాటుకు మున్సిపల్ కార్పొరేష¯ŒS నుంచి 326 దరఖాస్తులు, మున్సిపాలిటీల నుంచి 219, నగర పంచాయతీల నుంచి 138, మండలాల నుంచి 5,598 దరఖాస్తులు ఆ¯ŒSలైన్లో వచ్చాయి. రంపచోడవరం పరిధిలోని 15 మద్యం దుకాణాలకు 736 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో చింతూరులో షాపు నెంబర్ 538 దుకాణానికి 102 దరఖాస్తులు రావడం విశేషం. అలాగే 538 దుకాణానికి 96 దరఖాస్తులు వచ్చాయి. దేవీపట్నంలో 20 వ షాపుకి 77 దరఖాస్తులు రాగా, వీఆర్ పురంంలో షాపునెంబర్ 540 కి 56 దరఖాస్తులు వచ్చాయి. కూనవరంలో 542 షాపుకి 66 దరఖాస్తులు వచ్చాయి. రాజమహేంద్రవరం నార్త్ పరిధిలోని 427 దుకాణానికి 30 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.ఇవికాకుండా ప్రత్తిపాడులో 159 దుకాణానికి 62 దరఖాస్తులు రాగా, తునిలో 177,178 దుకాణాలకు తలో 30, సామర్లకోటలో 102 దుకాణానికి 54 దరఖాస్తులు వచ్చాయి. -
కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!
జిల్లాలో 672 పోస్టులు ఖాళీ 289 ఉద్యోగాలు మాత్రమే భర్తీ ఈనెల 22న నోటిఫికేషన్ జారీ వచ్చే నెల 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ నెల్లూరు(క్రైమ్): జిల్లా పోలీసు శాఖలో మూడేళ్లుగా సిబ్బంది కొరత వేధిస్తోంది. సివిల్ విభాగంలో 565, ఏఆర్ విభాగంలో 107కానిస్టేబుల్ పోస్టులు (మొత్తంగా 672) ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్నవారిపైనే పనిభారం పెరిగి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే పూర్తిస్థాయిలో ఖాళీలు భర్తీ అవుతాయని పనిభారం తగ్గుతుందని ఓ వైపు సిబ్బంది, నోటిఫికేషన్ విడుదల ద్వారా ఉద్యోగం దక్కుతుందని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూశారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన తాజా నోటిఫికేషన్లో 9 బ్యాక్లాగ్ పోస్టులతో పాటు సివిల్విభాగంలో 246, ఏఆర్ విభాగంలో కేవలం 43 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడంతో వారి ఆశలపై నీళ్లుచల్లినట్లైంది. ఇది ఇలా ఉంటే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించేందుకు నిరుద్యోగులు భారీస్థాయిలో పోటీ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపిక ఇలా... గత నోటిఫికేషన్లకు భిన్నంగా నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో కానిస్టేబుల్ పోస్టుకు దరఖాస్తు చేసిన అభ్యర్థి తొలుత 5 కిలోమీటర్ల పరుగుపందెంలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఇతర పరీక్షలకు అర్హుడు. అయితే తాజా నోటిఫికేషన్లో ఐదు కిలోమీటర్ల పరుగు పందెం రద్దుచేయడం నిరుద్యోగులకు కాస్త ఉపశమనం కల్పించారు. అదే క్రమంలో తొలుత ప్రిలిమనరీ పేరిట రాతపరీక్ష నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. వాటిలో అర్హత సాధించిన వారికి చిట్టచివరగా రాత పరీక్ష నిర్వహించి మెరిట్, రిజర్వేషన్ అధారంగా పోస్టులు భర్తీచేయనున్నారు. 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ: ఆగష్టు 3వ తేదీ ఉదయం 10 నుంచి సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు అభ్యర్థులు డబ్లూడబ్ల్యూడబ్ల్యూ.రిక్రూట్మెంట్.ఎపిపోలీస్.జీవోవి.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తుచేసుకోవాలి. దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 16 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రిలిమనరీ రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు 10 రోజుల ముందుగానే వెబ్సైట్లో హాల్‌టిక్కెట్లు అందుబాటులో ఉంచుతారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్ష, పరుగుపందెం, లాంగ్‌జంప్ తదితరాలను నిర్వహిస్తారు. 2016 జూలై ఒకటికి ఇంటర్ ఉత్తీర్ణులైన ఓబీసీలు, పదోతరగతి ఉత్తీర్ణులై ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. -
టీచర్ల బదిలీలకు టీసర్కారు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : టీచర్ల బదిలీల అంశంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. టీచర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రోజు రాత్రిలోగా బదిలీలకు సంబంధించిన విధివిధానాలు ఖరారుచేయనున్నట్లు సమాచారం. రాజకీయ జోక్యం లేకుండా బదిలీలు జరిగేలా టీఆర్ఎస్ సర్కారు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.