న్యూఢిల్లీ: సింగపూర్ నిధుల సమీకరణ సంస్థ ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ(క్యూఐఏ) ప్రతిపాదిత పెట్టుబడులకు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. క్యూఐఏ ఖతార్‌కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్‌కాగా.. మర్డోక్ సంస్థ లుపా సిస్టమ్స్(జపాన్)తోపాటు, స్టార్, డిస్నీ ఇండియా మాజీ చైర్మన్ ఉదయ్ శంకర్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ వెంచర్ సంస్థే బీటీఎస్1. అయితే బీటీ ఎస్1లో క్యూఐఏ పెట్టుబడులు పెట్టనుంది. వయాకామ్18లో పెట్టుబడుల కోసం బీటీఎస్1 వివిధ సంస్థల నుంచి నిధులు సమీకరిస్తోంది.
క్యూఐఏ నుంచి 1.5 బిలియన్ డాలర్ల సమీకరణకు గతేడాది ఫిబ్రవరిలో మర్డోక్, ఉదయ్ శంకర్ బోధి ట్రీ సిస్టమ్స్(బీటీఎస్)ను ఏర్పాటు చేశారు. తదుపరి ఏప్రిల్‌లో బిలియనీర్ ముకేశ్ అంబానీతో భాగస్వా మ్యం ద్వారా బీటీఎస్.. వయాకామ్18లో రూ. 13,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. ఈ త్రిముఖ ఒప్పందం ద్వారా దేశీయంగా భారీస్థాయిలో టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఆపై 2022 సెప్టెంబర్‌లో బీటీఎస్ ఇన్వెస్ట్‌మెంట్, రిలయన్స్ ప్రాజెక్ట్స్, ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ పెట్టుబడుల నేపథ్యంలో జియో సినిమా, వయాకామ్18 మీడియా విలీనానికి సీసీఐ అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment