న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ గ్రీన్‌కో రూ.5,700 కోట్ల నిధులను సమీకరించింది. సింగపూర్‌కు చెందిన జీఐసీ, జపాన్ కంపెనీ ఓరిక్స్ కార్పొరేషన్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీతోపాటు (ఏడీఐఏ) సంస్థ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, మహేశ్ కొల్లి ఈ మొత్తాన్ని సమకూర్చినట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది.
ఈ ఈక్విటీ నిధులను 25 గిగావాట్ అవర్ కంటే అధిక నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లకు ఉపయోగిస్తామని గ్రీన్‌కో గ్రూప్ జేఎండీ మహేశ్ కొల్లి వెల్లడించారు. తాజాగా అందుకున్న పెట్టుబడిలో జీఐసీ 51 శాతం, ఓరిక్స్ 16, ఏడీఐఏ 14, వ్యవస్థాపకులు 13 శాతం సమకూర్చినట్టు తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ప్రముఖ సంస్థల్లో ఒకటైన గ్రీన్‌కో గ్రూప్ ఖాతాలో భారత్‌లో 15 రాష్ట్రాల్లో 7.5 గిగావాట్ల సామర్థ్యం గల సౌర, పవన, జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment