Energy resources
-
G20 Summit: తీర్మానాలపై ఎన్నో ఆశలు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో విస్తృత చర్చల తర్వాత దేశాధినేతలు ప్రపంచ శ్రేయస్సు కోసం ఎలాంటి తీర్మానాలు చేయనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. జులైలో జీ20 దేశాల పర్యావరణశాఖ మంత్రుల సదస్సులో శిలాజ ఇంథనాల వినియోగాన్ని దశాలవారీగా తగ్గించడంపై చర్చలో ఏకాభిప్రాయం కుదరనే లేదు. పునరుత్పాదక ఇంథన ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికల్లా 11 టెరావాట్లకు తేవడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం వంటి అంశాల్లోనూ ఉమ్మడి నిర్ణయం తీసుకోలేకపోయాయి. శిలాజ ఇంధనాలకు బదులు మరో ఇంధన వనరులకు మారడం, బహుళ అభివృద్ధి బ్యాంకు(ఎండీబీ)లో సంస్కరణలు వంటి అంశాల్లో కనీస ఉమ్మడి నిర్ణయాలైనా దేశాధినేతలు తీసుకుంటారేమోనని పలు రంగాల వర్గాలు ఆశగా చూస్తున్నాయి. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు మేలు చేకూర్చేలా తక్కువ వడ్డీకి రుణాలు అందేలా ఎండీబీలో సంస్కరణలు తేవాలన్న చర్చ జీ20 శిఖరాగ్ర సదస్సు స్థాయిలో జరగడం ఇదే తొలిసారి. సంస్కరణలు వాస్తవరూపం దాల్చితే ఎంతో మేలు’ అని క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ సంస్థలో గ్లోబల్ పాలసీ విభాగం నేత ఇంద్రజిత్ బోస్ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే ఇక్కడో సమస్య ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు తాము అందుకున్న నిధులను పర్యావరణ మార్పులు తదితరాలను ఎదుర్కొనేందుకు ఖర్చుచేస్తాయి. గ్రాంట్స్‌గా కాకుండా రుణాలు, పెట్టుబడుల రూపంలో ఈ నిధుల్ని అందుకుంటాయి. వీటిని తిరిగి చెల్లించాలి. కానీ ఆ దేశాలకు ఆ స్తోమత ఉండదు. దీంతో ఈ దేశాలను ఆదుకునేందుకు సంపన్న దేశాలు వెనుకంజ వేస్తున్నాయి. 2011–20కాలంలో ఇలాంటి దేశాలకు కేవలం 5 శాతం నిధులే దక్కాయి. ఈ నేపథ్యంలో గత వాగ్దానాలు, తీర్మానాలకు కట్టుబడేలా ఈసారైనా జీ20 దేశాలు ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటాయో లేదో చూడాలి. -
గ్రీన్కో రూ. 5,700 కోట్ల నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ గ్రీన్కో రూ.5,700 కోట్ల నిధులను సమీకరించింది. సింగపూర్‌కు చెందిన జీఐసీ, జపాన్ కంపెనీ ఓరిక్స్ కార్పొరేషన్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీతోపాటు (ఏడీఐఏ) సంస్థ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, మహేశ్ కొల్లి ఈ మొత్తాన్ని సమకూర్చినట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఈ ఈక్విటీ నిధులను 25 గిగావాట్ అవర్ కంటే అధిక నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లకు ఉపయోగిస్తామని గ్రీన్కో గ్రూప్ జేఎండీ మహేశ్ కొల్లి వెల్లడించారు. తాజాగా అందుకున్న పెట్టుబడిలో జీఐసీ 51 శాతం, ఓరిక్స్ 16, ఏడీఐఏ 14, వ్యవస్థాపకులు 13 శాతం సమకూర్చినట్టు తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ప్రముఖ సంస్థల్లో ఒకటైన గ్రీన్కో గ్రూప్ ఖాతాలో భారత్‌లో 15 రాష్ట్రాల్లో 7.5 గిగావాట్ల సామర్థ్యం గల సౌర, పవన, జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. -
సుస్థిర ఇంధన వనరులతోనే సుస్థిరాభివృద్ధి
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరులు తగినంతగా ఉన్న భారత్, హరిత హైడ్రోజన్‌కు ప్రపంచ హబ్‌గా మారగలదని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సుస్థిర ఇంధన వనరులతో మాత్రమే సుస్థిరాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నామన్నారు. ‘సుస్థిరాభివృద్ధికి ఇంధనం’అంశంపై శుక్రవారం జరిగిన వెబినార్‌లో ప్రధాని మాట్లాడారు. హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థ ఎరువులు, శుద్ధి కర్మాగారాలు, రవాణా రంగంతో సంబంధం కలిగి ఉందన్నారు. ఇందులోకి ప్రవేశించే ప్రైవేట్ రంగానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందజేస్తుందని హామీ ఇచ్చారు. సుస్థిర ఇంధన వనరుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు లక్ష్యాలను విధించుకుందన్నారు. 2070 నాటికి ఉదార్గాలను సున్నా స్థాయికి తీసుకురావడం, 2030 నాటికి మృత్తికేతర విద్యుత్ సామర్థ్యాన్ని 500 గిగావాట్లు సాధించడం, మన విద్యుత్ ఉత్పత్తిలో సగం మృత్తికేతర వనరుల ద్వారా పొందడం లక్ష్యమని వివరించారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే మాడ్యూళ్ల తయారీకి బడ్జెట్లో రూ.19,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇధనాల్ ఉత్పత్తిని పెంచేందుకు చక్కెర మిల్లులను ఆధునీకరిస్తున్నామన్నారు. ఈ దిశగా ఎదురయ్యే సవాళ్లను మనం అవకాశాలు మార్చుకుంటున్నామని పేర్కొన్నారు. వెబినార్‌లో విదేశాంగ, పెట్రోలియం, సహజవాయువు, పర్యావరణ శాఖల మంత్రులు పాల్గొన్నారు. -
ఎడారి పండు.. పోషకాలు మెండు
సాక్షి, సిటీబ్యూరో: అలసిన దేహమనే యంత్రానికి ‘ఖర్జూరం’ ఓ శక్తి వనరు.. తక్షణ శక్తి ప్రదాయని. ఎన్నో పోషకాలతో నిగనిగలాడే ఈ పండు ఆరోగ్యాన్ని పరిపుష్టం చేస్తోంది. నిగనిగలాడే రంగు, మంచి రుచితో ప్రతి ఒక్కరినీ తనవైపు తిప్పుకుంటుంది. రంజాన్ మాసంలో దీనికో ప్రత్యేకత ఉంది. ‘రోజా’ దీక్షలను పాటించేవారు ఈ పండునే బాగా ఇష్టపడతారు. ఉపవాసం పూర్తయిన తర్వాత దేహానికి కావాల్సిన తక్షణ శక్తి కోసం దీన్ని తీసుకోవడం అనవాయితీ. ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఈ పండుకు మరింత డిమాండ్ పెరిగింది. ఎడారి దేశాల్లో పండే ఈ ఫలం వివిధ అరబ్ దేశాల నుంచి 15 నుంచి 20 రకాల ఖర్జూరాలు నగర మార్కెట్లను ముంచెత్తాయి. ఇరానీ (నలుపు, ఎరుపు), కిమియా ఖజూర్, కల్మీ ఖజూర్, తైబా ఖజూర్, మగ్ధీ ఖజూర్, ఆల్ మదీనా.. తదితర రకాలు లభిస్తున్నాయి. వీటి విక్రయాలకు నిలయమైన బేగంబజార్, గుల్జార్ హౌస్ తదితర ప్రాంతాల్లో హోల్‌సేల్ దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడుతున్నాయి. ఇరాక్, ఇరాన్, సౌదీ, ఒమన్ దేశాల నుంచి ఈ పండ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు బేగం బజార్‌లోని కాశ్మీర్ హౌస్ అధినేత ధీరజ్ కుమార్ తెలిపారు. కిలో ఇరాకీ ఖజూర్ రూ.50 నుంచి రూ.60, నలుపు రకం ఇరానీవి రూ.80 నుంచి రూ.100, ఎరుపు రూ.60, కీమియా ఖజూర్కు రూ.120-130 (బాక్స్), తైబా మగ్ధీ రకాలు రూ.130-140, ఆల్ మదీనా ఖజూర్ రూ.160-180 ధర పలుకుతోంది. క్యాలరీస్ అధికం - ఖర్జూరాల్లో క్యాలరీస్ అధికమని, మన దగ్గర డ్రై డేట్స్ వినియోగం ఎక్కువని గాంధీ ప్రకృతి వైద్యశాల వైద్యులు డా. శ్యామల తెలిపారు. ఈ పండులో పోషకాలు అధికమని వివరించారు. - 100 గ్రాముల ఖర్జూరంతో 400-600 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఫ్రెష్ డేట్స్‌లో క్యాలరీలు కాస్త తక్కువ. - ఖర్జూరాల్లో ఐరన్, ఫైబర్ ఎక్కువ. క్యాల్షియం, పొటాషియం, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్స్, కాపర్ పాళ్లు కూడా పుష్కలంగా ఉంటాయి. - 100 గ్రాముల డేట్స్‌లో 8-10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. - డేట్స్‌ను పాలతో కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పిల్లల్లో, వృద్ధుల్లో, ఏదైనా జబ్బు నుంచి కోలుకునే వారికి ఇది మంచి ఆహారం. ఖర్జూరం తినడం వల్ల ఎల్డీఎల్ కొలస్ట్రాల్ బాగా తగ్గి గుండె పనితీరు బాగుంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. -
భూమి పచ్చగా...
ఈ నెల 22న ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఆధారం మాత్రం నేలమీదనే. ఈ వాక్యంలో గొప్ప తాత్వికత ఉంది. జీవితసత్యమూ ఉంది. మనిషి జీవించడానికి భూమి మీద ఎంతగా ఆధారపడ్డాడో తెలియచేసే శాస్త్రీయ ఆలోచన కూడా ఉంది. భూమి మీద నివసిస్తూ, భూమి లోపల ఉన్న సహజవనరులను వాడుకుంటూ అంతరిక్షంలోకి ఎగిరే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ వాడుక మితిమీరిపోతోందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఈ వాడకం ఇదే రకంగా కొనసాగితే... భవిష్యత్తు తరాలకు చిక్కులు తప్పవనీ చెబుతున్నారు. వనరులను యధేచ్ఛగా వాడేస్తున్న పది దేశాల వివరాలను గణాంకాలతో వివరించారు. పెరుగుతున్న గిరాకీ... ఇంధన వనరుల గిరాకీకి, వాటి లభ్యతకు వ్యత్యాసం నానాటికీ పెరుగుతోంది. ఈ వినియోగంలో అమెరికాదే పైచేయి. వినియోగం పెరగడం, నిల్వలు తరగడం ఒకెత్తయితే... భూమండలం కాలుష్యకాసారంగా మారడంలోనూ ఈ టాప్‌టెన్ దేశాల వాటా ఎక్కువగా ఉంటోంది. ఎడాపెడా వాడేస్తున్న ఇంధన వనరుల వల్ల వాతావరణంలోకి చేరుతున్న కర్బన ఉద్గారాల సంగతి సరే, ఘనంగా చెప్పుకుంటున్న పారిశ్రామిక ‘పురోగతి’ ఫలితంగా పచ్చని పంటపొలాల్లో నేలలోకి ఇంకిపోతున్న ప్రమాదకర రసాయనాలు తిండిని, తాగేనీటిని విషతుల్యం చేస్తున్నాయి. సౌరశక్తి, పవనశక్తి వంటి పునర్వినియోగ ఇంధనాల వల్ల కాలుష్యాన్ని కొంతవరకు నియంత్రించగల అవకాశాలు ఉన్నా, ప్రపంచంలో వాటి వినియోగం నామమాత్రమే. పారిశ్రామిక పురోగతి పరుగులు తీస్తున్న దేశాలే ఇంధన వనరులను విపరీతంగా వినియోగిస్తున్నాయి. వాటి ప్రభావం మిగిలిన దేశాలపైనా పడుతోంది. ముడిచమురు, బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వినియోగం పెరుగుతున్నందునే వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. సహజ వనరుల వినియోగంలో గణనీయమైన పెరుగుదలకు జనాభా పెరుగుదల కూడా ఒక కారణమే. కానీ అగ్రరాజ్యాల అంతులేని ఆధిపత్య దాహమే భూమండలాన్ని కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేస్తోంది. భూమి ఉపరితలంపైనున్న వనరులనే కాదు, అట్టడుగున దాగి ఉన్న భూగర్భ జల, ఖనిజ వనరులనూ పలు దేశాలు విచక్షణారహితంగా వాడేసుకుంటున్నాయి. ఈ వాడుక ఇలాగే కొనసాగితే వందేళ్లలో ముడి చమురు నిల్వలు అంతరించిపోవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పవన విద్యుత్తు, సౌరశక్తి వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగంలోకి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. తాజా పరిశోధనల ప్రకారం ఇతర గ్రహాలలో మనిషి జీవించే పరిస్థితులు ఏర్పడే వరకు మనిషికి భూమి ఒక్కటే ఆధారం. అప్పటి వరకైనా ఆ భూమాతను కాపాడుకోవాల్సిందే. అంటే ఈ తరానికి ఉన్న ఏకైక మార్గం భూమిని రక్షించుకోవడమే. ప్రతి ఒక్కరం ఓ మొక్కను బతికిద్దాం... భూమాత వేడిని తగ్గిద్దాం. -
నిరంతర విద్యుత్ ఎప్పుడిస్తారు?
ఆంద్రప్రదేశ్ తీరుపై కేంద్రం అసంతృప్తి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు కేంద్ర ఇంధనశాఖ ఆదేశం గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు రూ.1,350 కోట్లు మంజూరు రాష్ట్రానికిచ్చే సోలార్ పంపుసెట్లు 4,000 నుంచి 8,000 కు పెంపు వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నుంచి అదనంగా లక్ష మిలియన్ టన్నుల బొగ్గు ‘నిరంతర విద్యుత్’పై ఏపీ అధికారులతో కేంద్ర అధికారుల సమీక్ష సాక్షి, హైదరాబాద్: ‘ఇంతకీ మీ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ పథకాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తున్నారు? అసలు అమలు చేసే వీలుందా? వెనకడుగు వేయడానికి కారణాలు ఏంటి? సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండానే ముందుకొస్తే ఎలా? దీనివల్ల కేంద్రం అబాసుపాలవ్వదా?’ అంటూ ఆంధ్రప్రదేశ్ ఇంధన అధికారులపై కేంద్ర విద్యుత్ అధికారులు అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. నిరంతర విద్యుత్ సరఫరా అంశంపై గురువారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి అజయ్‌జైన్, కోల్ డెరైక్టర్ ప్రభాకర్‌రావు హాజరయ్యారు. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్.ఎన్.చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంప్రదాయేతేర ఇంధన వనరులు, పునరుత్పాదన బొగ్గు మంత్రిత్వశాఖ, ఆర్థిక, పెట్రోలియం శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ను అమలు చేయకపోవడం, దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయడంపై కేంద్ర అధికారులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. పథకం పేరుతో నిధులు కోరుతున్నారే తప్ప, ఇది కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే ప్రచారం చేయకపోవడం ఏమిటని ప్రశ్నించినట్టు చెప్తున్నారు. ఈ అంశంపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శిని కేంద్రం ఆదేశించినట్టు సమాచారం. కేంద్రం ఈ పథకాన్ని వెల్లడించిన అతి కొద్ది సమయంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకంలోకి తమ రాష్ట్రాన్ని చేర్చాలని కోరారు. ఆయన ఒత్తిడి మేరకు సెప్టెంబర్‌లోనే ఆర్భాటంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరిగాయి. అక్టోబర్ 2వ తేదీ నుంచి పథకాన్ని అధికారికంగా వెల్లడిస్తామని బాబు స్వయంగా చెప్పారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు రూ. 1,350 కోట్లు ఏపీలో నిరంతర విద్యుత్ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రాయితీలను ప్రకటించింది. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి జాతీయ హరిత ఇంధన నిధి కింద రాష్ట్రంలోని గ్రీన్ ఎనర్జీ కారిడార్‌కు రూ. 1,350 కోట్లు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించింది. సోలార్ పంపుసెట్లను 4,000 నుంచి 8,000 కు పెంచింది. సమావేశ వివరాలను స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వివరిస్తూ.. రాష్ట్రంలో 20 ఏళ్ళ కిందట ఏర్పాటురేసిన ఎన్టీపీసీ, ఆర్‌టీపీపీలను ఆధునీకరించాలని కేంద్రం దృష్టికి తెచ్చామన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు తగ్గిందనే విషయాన్నీ కేంద్ర ఇంధన శాఖకు తెలిపామని.. వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నుంచి అదనంగా లక్ష మిలియన్ టన్నుల బొగ్గు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని వివరించారు. ఏపీలో విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలపై ఈ సమావేశంలో అజయ్‌జైన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. -
జీవరాశి నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్?
సైన్స అండ్ టెక్నాలజీ శక్తి వనరులు ఒక దేశ సామాజిక ఆర్థిక ప్రగతికి శక్తి రంగం వెన్నెముక లాంటిది. ఉత్పాదకత ఉన్న అన్ని కార్యకలాపాల్లో శక్తి కీలక వనరు. దేశ సమగ్ర అభివృద్ధిలో తలసరి శక్తి వినియోగం, లభ్యత మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. భారతదేశంలో నేడు అపారమైన బొగ్గు, సహజ వాయువు, షేల్ గ్యాస్, కోల్బెడ్ మీథేన్, థోరియం లాంటి శక్తి నిల్వలు ఉన్నప్పటికీ, ముందుచూపు లేక, టెక్నాలజీ లేమి వల్ల అవసరాలకు తగ్గట్టుగా వినియోగించకపోవడం ప్రస్తుత శక్తి సంక్షోభానికి కారణం. 1897లో డార్జిలింగ్‌లో విద్యుత్ సరఫరాతో శక్తి ఉత్పాదన మొదలైంది. 1902లో కర్ణాటకలోని శివ సముద్రం వద్ద హైడ్రో పవర్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. దేశంలో శక్తి ఉత్పాదన, శక్తి రంగం, అభివృద్ధి ప్రణాళికలు, విధాన రూపకల్పనను కేంద్ర శక్తి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. అన్ని సాంకేతిక అంశాల్లో Central Electricity Authority Ôక్తి మంత్రిత్వ శాఖకు సలహాలు, సూచనలు ఇస్తుంది. జాతీ య స్థాయిలో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, ఉత్పత్తి, సరఫరా కోసం కింది సంస్థలు కృషి చేస్తున్నాయి. National Thermal Power Corporation (NTPC) National Hydro Electric Power Corporation (NHPC) North Eastern Electric Power Corporation (NEEPCO) Power Grid Corporation Of India Limited (PGCIL) ప్రస్తుతం, భవిష్యత్‌లో శక్తి సరఫరా ప్రాజెక్టుల నిర్వహణ, జాతీయస్థాయి పవర్‌గ్రిడ్ ఏర్పాటుకు పీజీసీఐఎల్ కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌కు కావాల్సిన రుణాలు, నిధులను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) సమకూరుస్తుంది. అదేవిధంగా విద్యుత్ ప్రాజెక్టులకు దీర్ఘకాలిక రుణాలను పవర్ ఫైనాన్స కార్పొరేషన్(పీఎఫ్సీ) అంది స్తుంది. మానవ వనరుల అభివృద్ధి, శిక్షణ, పరిశోధనల కోసం నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టి ట్యూట్, సెంట్రల్ పవర్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ అనే స్వయం ప్రతిపత్తి ఉన్న రెండు సంస్థలు శక్తి వనరుల శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో మెగా పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు, శక్తి కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోవడానికి పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్(పీటీసీ)ని కేంద్ర ప్రభు త్వం ఏర్పాటు చేసింది. నవీన పునర్వినియోగ శక్తి వనరుల అభివృద్ధి కోసం 1992లో సంప్రదాయేతర శక్తి వనరుల మంత్రిత్వశాఖ ఏర్పాటైంది. ఆ తర్వాత దీన్ని నవీన, పునర్వినియోగ శక్తి మంత్రిత్వ శాఖగా మార్చారు. భారత స్థాపిత సామర్థ్యంలో పునర్వినియోగ, నవీన శక్తి వనరుల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సౌర శక్తి, పవన శక్తి, చిన్న తరహా జల విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం ఈ మంత్రిత్వశాఖ ప్రధాన లక్ష్యం. దేశంలో అణుశక్తి ఉత్పత్తిని పెంచడం, మూడు రకాల అణుశక్తి కార్యక్రమాల నిర్వహణ, వ్యవసాయం, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఉప యోగించే రేడియోధార్మిక ఐసోటోప్ల ఉత్పత్తి లాంటి లక్ష్యాలతో అణుశక్తి విభాగం పని చేస్తోంది. శక్తి వనరులు: శక్తి వనరులు ప్రధానంగా రెండు రకాలు. సంప్రదాయ, సంప్రదాయేతర. మొద టి నుంచి అధిక వినియోగంలో ఉన్నవి సంప్రదాయ శక్తి వనరులు. వీటిని బొగ్గు, చమురు, సహజ వాయువు, జలవిద్యుత్, అణుశక్తిగా విభజిస్తారు. సంప్రదాయేతర శక్తి వనరులు రెండు రకాలు. ఇవి పునర్వినియోగ, నవీన శక్తి వనరులు. జీవ శక్తి, సౌర శక్తి, పవన శక్తి, చిన్నతరహా జలవిద్యుత్ మొదలైనవి పునర్వినియోగ శక్తి వనరులు. హైడ్రోజన్, జియోథర్మల్, సముద్ర తరంగ శక్తి, బ్యాటరీతో నడిచే వాహనాలు నవీన శక్తి వనరులు. సంప్రదాయ శక్తి వనరులు బొగ్గు: శక్తి రంగానికి బొగ్గు వెన్నెముక లాం టిది. భారత్‌లో స్థూల బొగ్గు నిల్వలు 285.86 బిలియన్ టన్నులు. 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో దేశంలో ఏటా బొగ్గు డిమాండ్ 7.1 శాతం చొప్పున పెరుగుతూ 2016-17 నాటికి 980.5 మిలియన్ టన్నులకు చేరనుందని ఈ రంగంపై అధ్యయనం చేసిన ఒక వర్కింగ్ గ్రూప్ తెలియజేసింది. 2021-22 నాటికి బొగ్గు డిమాండ్ 1373 మిలియన్ టన్నులకు పెరగనున్నట్లు అంచనా. భారత్‌లో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో 60 శాతం; ఇనుము, స్టీల్ పరిశ్రమల్లో 7 శాతం; సిమెంట్ పరిశ్రమల్లో 5 శాతం బొగ్గును వినియోగిస్తున్నారు. మిగతా బొగ్గును అసంఘటిత రంగంలో ఎక్కువగా వాడు తున్నారు. మూడేళ్ల నుంచి సహజ వాయువు ఉత్పత్తి ఆశించిన రీతిలో లేనందున బొగ్గుకు డిమాండ్ మరింత పెరిగింది. సహజ వాయువు: దీన్ని 21వ శతాబ్దపు శక్తి వనరుగా పరిగణిస్తారు. విద్యుత్ ఉత్పత్తి, రవాణా రంగంలో Compressed Natural Gas (CNG), Liquefied Natural Gas (LNG) రూపంలో వినియోగిస్తున్నారు. దేశంలో సహజవాయువు శక్తి నిల్వలు 1,074 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు. కోల్బెడ్ మీథేన్ (CBM): బొగ్గు నిక్షేపాలతో ముడిపడిన మీథేన్‌ను CBM అంటారు. ఇప్పటికే దేశంలోని నాలుగు ప్రాంతాల్లో సీబీఎం వెలికితీత మొదలైంది. దేశంలో 26,000 చ.కి.మీ. ప్రాంతంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. 17,000 చ.కి.మీ.లలో సీబీఎం అన్వేషణ ప్రారంభమైంది. వీటి నిల్వలను 98 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్‌గా అంచనా వేశారు. 9.9 ఖీఇఊలు ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. రోజుకు సుమారు 4.5 మిలియన్ స్టాండర్డ క్యూబిక్ మీటర్ల సీబీఎం ఉత్పత్తి అవుతుంది. షేల్‌గ్యాస్: షేల్ ఒక రకమైన శిల. ఈ శిలల్లోని పొరల మధ్య నిక్షిప్తమైన సహజ వాయువు షేల్‌గ్యాస్. ఇది భారత్‌లో సరికొత్త శక్తి వనరుగా అవతరించనుంది. కృష్ణా, గోదావరి, కావేరి, గొండ్వానాల్లో షేల్ నిర్మాణాలను గుర్తించారు. దేశంలో షేల్‌గ్యాస్ వనరుల అంచనా, శాస్త్రవేత్తల శిక్షణ కోసం కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వశాఖ అమెరికాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా భారత్‌లో 6.1 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ మేరకు షేల్ గ్యాస్ వనరులు ఉన్నట్లు అంచనా వేసారు. చమురు: చమురు వినియోగంలో 80 శాతం దిగుమతిపై ఆధారపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో చమురు ఉత్పాదన, ధరల్లో ఏ మాత్రం ఒడిదుడుకులున్నా, భారత్‌పై తీవ్ర ప్రభావం ఉంటుంది. రవాణా ఖర్చులు పెరిగే కొద్దీ ఇతర రంగాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టం వాటిల్లుతుంది. ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. జల విద్యుత్: సంప్రదాయశక్తి వనరుల్లో పునర్వినియోగానికి వీలయ్యేది జలవిద్యుత్ మాత్రమే. దేశ స్థూల జలవిద్యుత్ శక్తి సామర్థ్యం 1.5 లక్షల మెగావాట్లు. స్థాపిత సామర్థ్యం చాలా తక్కువ. ప్రస్తుతం దేశంలో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి తీవ్రస్థాయిలో పర్యావరణ పరమైన వ్యతిరేకతలు వస్తున్నాయి. పునరావాస సమస్య కూడా తీవ్రంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో జలవిద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. అణుశక్తి: దేశ స్థాపిత శక్తి సామర్థ్యంలో అణుశక్తి వాటా 2.5 శాతం కంటే తక్కువ. ఇప్పటివరకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రంగాన్ని అభివృద్ధి చేసినప్పటికీ, శక్తి డిమాండ్ దృష్ట్యా యురేనియం ఇంధనం, రియాక్టర్లను దిగుమతి చేసుకోవడంపై భారత్ దృష్టి సారించింది. మనదేశం అణుశక్తి స్థాపిత సామర్థ్యం 4780 మెగావాట్లు. కూడంకుళంలో రెండు రియాక్టర్లు త్వరలో పూర్తిస్థాయిలో వాణిజ్య విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. సంప్రదాయేతర శక్తి వనరులు మనదేశ శక్తి అవసరాలన్నీ సంప్రదాయ వనరులపై ఆధారపడి ఉన్నాయి. బొగ్గు నిల్వలు క్రమంగా తగ్గడం, భారీ జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి పర్యావరణ, సామాజిక కారణాలు అడ్డురావడం, చమురుకోసం దిగుమతులపైనే ప్రధానంగా ఆధారపడటం లాంటి కారణాల వల్ల సంప్రదాయ శక్తి వనరులను దీర్ఘకాలం వినియో గించలేం. కాబట్టి పునర్వినియోగ నవీన శక్తి వనరుల ప్రాధాన్యం పెరిగింది. జీవ శక్తి: ఈ శక్తి జీవరాశి నుంచి ఉత్పత్తి అవుతుంది. జీవ శక్తికి దేశంలో ఎన్నో అనుకూల అంశాలు ఉన్నాయి. జీవ శక్తిలో ప్రధానమైంది బయోగ్యాస్. పశువుల పేడ, ఇతర జీవ వ్యర్థాలను ప్రత్యేక బయోగ్యాస్ ప్లాంట్లలోకి తీసుకొని, నియంత్రిత గాలి సరఫరా వద్ద వియోగం చెందించినప్పుడు బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. వంట, విద్యుత్ కోసం దీన్ని వినియోగిస్తారు. జీవరాశి నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌ను బయోమాస్ పవర్ అంటారు. దీనికోసం వినియోగించే జీవరాశి అనేక రకాలుగా ఉంటుంది. వరిపొట్టు, గడ్డి, కొబ్బరి చిప్పలు, రంపపు పొట్టు మొదలైన వాటిని వేడిచేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. చెరకు నుంచి రసాన్ని సంగ్రహించిన తర్వాత మిగిలే పిప్పిని బగాసీ అంటారు. దీని నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విధానమే బగాసీ కోజనరేషన్. దేశంలోని 550 ప్రధాన చక్కెర పరిశ్రమల్లో లభ్యం అవుతున్న బగాసీ ద్వారా అధిక శక్తిని ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది. సౌర శక్తి: దేశంలో సౌర శక్తి అపారంగా ఉంది. ఎడారిలో 300 రోజుల పాటు 5000 ట్రిలియన్ కిలోవాట్ పవర్ల సౌర శక్తి భారత భూభాగాన్ని చేరుతుంది. సౌర శక్తిని రెండు రకాలుగా ఉపయోగిస్తారు. కిరణ శక్తిని విద్యుత్‌గా మార్చే టెక్నాలజీ Solar Photovoltaics. కిరణ శక్తిని ఉష్ణంగా మార్చే టెక్నాలజీ Solar Thermal. దేశ వ్యాప్తంగా సౌరశక్తి వినియోగాన్ని విస్తరించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం జాతీయ సౌర మిషన్‌ను అమలు చేస్తోంది. పవన శక్తి: కదులుతున్న గాలి నుంచి ఉత్పత్తి చేసే శక్తి పవన శక్తి. దీని వల్ల ఏ రకమైన పర్యావరణ కాలుష్యం ఉండదు. భారత స్థూల పవన శక్తి సామర్థ్యం 45,000 మెగావాట్లు. పవనశక్తి ఉత్పాదనకు తమిళనాడు, గుజరాత్, మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌లు అనువైన రాష్ట్రాలుగా గుర్తించారు. అంతర్జాతీయ స్థాయిలో పవన శక్తి ఉత్పాదనను ప్రోత్సహించేందుకు చెన్నైలో Centre for Wind Energy Technology కృషి చేస్తోంది. చిన్న తరహా జల విద్యుత్: గరిష్టంగా 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న వాటిని చిన్నతరహా జల విద్యుత్ ప్రాజెక్టులు అంటారు. వీటి స్థూల సామర్థ్యం 15000 మెగావాట్లుగా అంచనా వేశారు. ఎత్తయిన పర్వత, చిన్నపాటి జలపాతాలు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వీలువుతుంది. నవీన శక్తి వనరులు హైడ్రోజన్ శక్తి: ఏ మాత్రం కాలుష్యానికి కారణం కాని శక్తి వనరు హైడ్రోజన్. నీటి జల విశ్లేషణ, కేంద్రక చర్యల ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. రవాణా రంగంలో ఫ్యూయల్ సెల్ వినియోగం ద్వారా కాలుష్య రహిత ఇంధనంగా దీన్ని వినియోగిస్తారు. విద్యుత్ ఉత్పత్తిలోనూ ఉపయోగపడుతుంది. 2020 నాటికి పది లక్షల వాహనాలు హైడ్రోజన్‌పై నడిచే విధంగా వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ ప్రోగ్రామ్ మొదలైంది. జియో థర్మల్ ఎనర్జీ: భూపటలం లోపలి పొరల్లోని వేడి శిలలు, నీటిలోని ఉష్ణశక్తి నుంచి ఉత్పత్తి చేసేదాన్ని జియో థర్మల్ శక్తి అంటారు. దేశంలో దీని స్థూల సామర్థ్యం 45,000 మెగా వాట్లుగా అంచనా వేశారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్‌లను జియో థర్మల్ ఎనర్జీకి అనువైన ప్రాంతాలుగా గుర్తించారు. సముద్రతరంగ శక్తి: సముద్ర అలల శక్తిని ప్రత్యేక నీటి టర్బైన్లు ఉపయోగించి విద్యుత్‌గా మార్చే అవకాశాన్ని దేశంలో పరిశీలిస్తున్నారు. ఈ శక్తి స్థూల సామర్థ్యం 8000-9000 మెగా వాట్లుగా గుర్తించారు. ఇందులో సుమారు 7000-8000 మెగావాట్లు గుజరాత్ తీరంలో ఉత్పత్తి చేసేందుకు వీలవుతుందని అంచనా. బ్యాటరీతో నడిచే వాహనాలు: వీటి వినియోగం వల్ల వాహన కాలుష్యం బాగా తగ్గుతుంది. తక్కువ డిశ్చార్జి, అధిక సాంద్రత ఉన్న నికెల్ మెటల్ హైడ్రైడ్, లిథియం అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేస్తున్నారు. దేశంలో అభివృద్ధి చెందిన ఈ తరహా మొదటి వాహనం రేవా (Reva). -
మెట్రోకు సౌర వెలుగులు
- మూడు స్టేషన్లలో ప్లాంట్లు - ప్రైవేటు సంస్థతో డీఎంఆర్సీ ఒప్పందం న్యూఢిల్లీ: పర్యావరణానికి అనుకూలమైన ఇంధన వనరులు, పద్ధతులను ప్రోత్సహించడంతో భాగంగా ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మూడు స్టేషన్లలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు నిర్మించనుంది. స్టేషన్ల ఆవరణలోని భవనాలపై పైకప్పులపై వీటిని బిగిస్తారు. మొత్తం 250 కిలోవాట్ల పీక్ (కేడబ్ల్యూపీ) కరెంటును అందించగల ఈ ప్లాంట్లను ఆనంద్ విహార్ అంతర్రాష్ట్ర బస్సు టెర్మినల్ (ఐఎస్బీటీ) మెట్రో స్టేషన్, ప్రగతి మైదాన్ స్టేషన్‌తోపాటు, డీఎంఆర్సీ పుష్పవిహార్ కార్యాలయంలో నిర్మిస్తారు. ఆనంద్‌విహార్ ప్లాంటు 115 కేడబ్ల్యూపీ, ప్రగతిమైదాన్ 85 కేడబ్ల్యూపీ, పుష్ప్‌విహార్ ప్లాంటు కేడబ్ల్యూపీల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయని డీఎంఆర్సీ అధికారవర్గాలు తెలిపాయి. సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం డీఎంఆర్సీ.. తన ఎండీ మంగూసింగ్ సమక్షంలో నోయిడాకు చెందిన ప్రైవేటు సంస్థ జాక్సన్ ఇంజనీర్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత సౌర విద్యుత్ సంస్థ (ఎస్ఈసీఐ) ఇందుకు సహకరించింది. ఇది వరకు ద్వారక సెక్టార్ 21 స్టేషన్లో నిర్మించినట్టుగానే, ఈ మూడు స్టేషన్లలో ‘ఆర్ఈఎస్సీఓ’ విధానంలోనే సోలార్ విద్యుత్ ప్లాంట్లు నిర్మిస్తారు. ఈ విధానం లో ఉత్పత్తి అయిన కరెంటును డీఎంఆర్సీ యూనిట్ల చొప్పున కొంటుంది. ప్రైవేటు సంస్థే మూలధన పెట్టుబడిని సమకూర్చుకుంటుందని డీఎంఆర్సీ ఉన్నతాధికారి అనుజ్ దయాళ్ అన్నారు. ఇలా సమకూరిన కరెంటును స్టేషన్ల విద్యుత్ దీపాలు, ఇతర నిర్వహణ అవసరాలకు వాడుతారు. ‘స్టేషన్లతోపాటు మెట్రోరైళ్ల డిపోలు, పార్కింగ్ కేంద్రాలు, నివాస సముదాయాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి మేం ప్రయత్నిస్తాం. మూడోదశలో నిర్మిస్తున్న స్టేషన్లను సోలార్ప్లాంట్లతో అనుసంధానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని దయాళ్ వివరించారు. అంతేగాక మూడోదశ కోసం వినియోగించే అన్ని భవనాలనూ పర్యావరణానికి అనుకూల పద్ధతిలోనే నిర్మిస్తారు. నగరంలో వాయుకాలుష్యం నివారణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నందుకుగానూ డీఎంఆర్సీకి ఐక్యరాజ్యసంస్థ 2011 లో కార్బన్ క్రెడిట్లు ప్రదానం చేసింది. ఇదిలా ఉంటే గుర్గావ్ రైల్వే స్టేషన్ రెండో ప్లాట్ఫారంపైన కూడా సోలార్‌ప్లాంటు ఏర్పాటు చేశారు. దీనివల్ల చాలా వరకు కరెంటు అవసరాలు తీరుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ‘మేం ఇటీవలే 25 కిలోవాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్ ప్లాంటును నిర్మించాం. త్వరలో మొదటి ప్లాట్‌ఫారంపైనా కూడా ఇదే సామర్థ్యం గల మరో ప్లాంటు ను ఏర్పాటు చేస్తాం’ అని ఉత్తర రైల్వే అధికారి ఒకరు అన్నారు.