న్యూఢిల్లీ: దేశంలోని టాప్–2 మల్టీప్లెక్స్ దిగ్గజాల విలీనానికి తాజాగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పీవీఆర్, ఐనాక్స్ లీజర్ సంయుక్త సంస్థగా ఆవిర్భవించేందుకు మరో అడుగు ముందుకు పడింది. ప్రతిపాదిత విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్ ఈ నెల 12న అనుమతించినట్లు పీవీఆర్ వెల్లడించింది.
2022 అక్టోబర్‌లో ప్రత్యర్థి సంస్థ ఐనాక్స్ లీజర్‌తో విలీనానికి పీవీఆర్ వాటాదారులు ఆమోదముద్ర వేశారు. అంతకుముందు జూన్‌లో స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ ఇందుకు ఓకే చెప్పాయి. తొలుత గతేడాది మార్చిలో రెండు కంపెనీలూ విలీనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎన్‌సీఎల్‌టీ అనుమతి నేపథ్యంలో పీవీఆర్ షేరు 0.5 శాతం నీరసించి రూ. 1,745 వద్ద, ఐనాక్స్ లీజర్ 0.7 శాతం నష్టంతో రూ. 515 వద్ద ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment