merger talks
-
పీవీఆర్, ఐనాక్స్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: దేశంలోని టాప్–2 మల్టీప్లెక్స్ దిగ్గజాల విలీనానికి తాజాగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పీవీఆర్, ఐనాక్స్ లీజర్ సంయుక్త సంస్థగా ఆవిర్భవించేందుకు మరో అడుగు ముందుకు పడింది. ప్రతిపాదిత విలీనానికి ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఈ నెల 12న అనుమతించినట్లు పీవీఆర్ వెల్లడించింది. 2022 అక్టోబర్‌లో ప్రత్యర్థి సంస్థ ఐనాక్స్ లీజర్తో విలీనానికి పీవీఆర్ వాటాదారులు ఆమోదముద్ర వేశారు. అంతకుముందు జూన్‌లో స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఇందుకు ఓకే చెప్పాయి. తొలుత గతేడాది మార్చిలో రెండు కంపెనీలూ విలీనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్సీఎల్టీ అనుమతి నేపథ్యంలో పీవీఆర్ షేరు 0.5 శాతం నీరసించి రూ. 1,745 వద్ద, ఐనాక్స్ లీజర్ 0.7 శాతం నష్టంతో రూ. 515 వద్ద ముగిశాయి. -
హెచ్డీఎఫ్సీ విలీనానికి 10 నెలలు
ముంబై: మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీని విలీనం చేసుకునేందుకు మరో 8–10 నెలల సమయం పడుతుందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ పేర్కొన్నారు. విలీనం వల్ల హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్యాపిటల్ అడెక్వెసీ రేషియో 0.20–0.30 శాతం మేర పెరుగుతుందని తెలిపారు. ఈ రెండు సంస్థలు విలీనంపై ఆమోదం కోసం శుక్రవారం వాటాదారుల సమావేశాన్ని నిర్వహించాయి. దేశ చరిత్రలో ఇది అతిపెద్ద విలీనం కానుంది. అయితే, విలీనం వల్ల బ్యాలన్స్ షీటు పెద్దగా మారనుంది. దీంతో ఆర్బీఐ నియంత్రణలకు అనుగుణంగా తప్పనిసరిగా నిర్వహించాల్సిన నగదు నిల్వలు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అవసరాలను వాటాదారులు ప్రస్తావించారు. ఈ విషయంలో ఆర్బీఐ నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఉందా? అనేది తెలుసుకోవాలని అనుకున్నారు. దీనిపై హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ స్పందిస్తూ.. ఈ విషయంలో వాటాదారులు ఆందోళన చెందవద్దంటూ, ఆర్బీఐతో సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు. ఒకవేళ ఆర్బీఐ నుంచి ఏదైనా మినహాయింపు రాకపోయినా, విలీన సంస్థ వద్ద తగినంత లిక్విడిటీ ఉంటుందని.. తప్పనిసరి నిధుల అవసరాలను చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నట్టు తెలిపారు. కొన్నింటిని విక్రయిస్తాం.. విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ అనుబంధ సంస్థలన్నీ కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అనుబంధ కంపెనీలుగా మారతాయని.. బ్యాంక్ చైర్మన్ అతాను చక్రవర్తి తెలిపారు. అదే సమయంలో బ్యాంకు కిందకు రాని కొన్ని వ్యాపారాలను (నిబంధనల మేరకు) విక్రయిస్తామని చెప్పారు. సబ్సిడరీల విలీనానికి ఆర్బీఐ, ఐఆర్డీఏఐ అనుమతి కోరతామన్నారు. వయసు రీత్యా తాను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డులో చేరబోనని, చక్రవర్తి చైర్మన్‌గా సేవలు అందిస్తారని దీపక్ పరేఖ్ స్పష్టం చేశారు. విలీనంతో హెచ్డీఎఫ్సీ డిపాజిట్లు అన్నీ బ్యాంక్ కిందకు వస్తాయని, వాటికి వడ్డీ చెల్లింపులు ఎప్పటి మాదిరే చేస్తామని జగదీశన్ తెలిపారు. -
విలీనమా.. నో వే!...కావాలంటే వారు వెళ్లిపోవచ్చు!
సాక్షి, ముంబై: క్యాబ్ సేవల సంస్థలు, ఈ బిజినెస్‌లో ప్రధాన ప్రత్యర్థలు ఓలా, ఉబెర్ విలీనవుతున్నాయంటూ పలు రిపోర్టులు బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపాయి. ఓలా ఉబర్ సంస్థల విలీనం గురించి ఇప్పటికే చర్చలు ప్రారంభించాయంటూ వార్తలు హల్చల్ చేశాయి. దేశీయ అతిపెద్ద రైడ్-హెయిలింగ్ కంపెనీ ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా ఖండించారు. రబ్బిష్.. పూర్తిగా పుకార్లే అంటూ ఆయన ట్వీట్ చేశారు. దేశంలో తమ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉందనీ, పురోగతి సాధిస్తున్నామని ఈ క్రమంలో విలీనమనే సమస్య లేదని స్పష్టం చేశారు. అంతేకాదు కావాలనుకుంటే విదేశీ కంపెనీలు దేశంనుంచి నిష్క్రమించాలనుకుంటే వారికి స్వాగతం! అంతేకానీ తాము ఎప్పటికీ విలీనం కామంటూ అమెరికా కంపెనీ ఉబెర్‌కు వ్యంగ్యంగా చురకలేశారు. ఈ మేరకు అగర్వాల్ వార్తా నివేదికలను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు. బలమైన బ్యాలెన్స్ షీట్‌తో ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన రైడ్ హెయిలింగ్ కంపెనీలలో ఒకటిగా, అందులోనూ భారతదేశంలో మార్కెట్ లీడర్‌గా ఉన్నామని ఓలా ప్రకటించింది. కాగా రైడ్ హెయిలింగ్ దిగ్గజాలు ఓలా, ఉబెర్ విలీనమార్గంలో ఇప్పటికే చర్చలు ప్రారంభించాయనీ, సీఈఓ అగర్వాల్ అమెరికాలో ఉబెర్ కీలక అధికారులతో భేటీ కానున్నారంటూ పలు వార్తలు వెలువడ్డాయి. రెండు కంపెనీలు ఇంతకు ముందు కూడా విలీన అవకాశాలపై చర్చించాయని, అయితే ఒప్పందం కార్యరూపం దాల్చలేదని నివేదిక పేర్కొంది. అయితే ఓలా తన క్విక్ ఫుడ్ డెలివరీ, యూజ్డ్ కార్ బిజినెస్‌ను మూసివేయడం, ఈ వారంలో దాదాపు 300-350 మంది ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో ఈ ఊహగానాలు వెలువడటం గమనార్హం. చదవండి: ట్విటర్ డీల్ వివాదం: మస్క్ మరో కీలక నిర్ణయం Absolute rubbish. We’re very profitable and growing well. If some other companies want to exit their business from India they are welcome to! We will never merge. https://t.co/X3wC9HDrnr — Bhavish Aggarwal (@bhash) July 29, 2022 -
మరో బ్యాంకింగ్ మెర్జర్‌కు రంగం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలో మరికొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి రంగం సిద్ధమవుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనం తరువాత మరోసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. మూడు ప్రభుత్వరంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్‌బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ ఇండియా విలీనం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం బ్యాంకులతో రెండవ దఫా విలీన చర్చలు జరుపుతోందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. తుది చర్చల అనంతరం విలీనానికి ఆయా బ్యాంకులకు ఆహ్వానం పంపించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ విలీన ప్రక్రియకోసం ఎంతో కాలం వేచి వుండాలని తాము భావించడం లేదనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు లేదా, మూడవ త్రైమాసికంలో విలీనం ఉండవచ్చని సూచన ప్రాయంగా తెలిపారు. అలాగే బ్యాంకులు తగిన ప్రతిపాదనలు ఇవ్వడంలో విఫలమైతే, ప్రత్యామ్నాయ విధానం (ఏఎం) గ్రూప్ తగిన సలహాలను ఇస్తుందని ఆయన మీడియాకు చెప్పారు. కాగా విజయ, దెనా, బీవోబీ విలీన ప్రక్రియ గత ఏడాది అక్టోబరులో మొదలై , ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విలీనం తరువాత బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో మూడవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన సంగతి తెలిసిందే. -
ఏసీసీ-అంబుజా మెర్జర్‌కు బ్రేక్: షేర్ల పతనం
సాక్షి, ముంబై: సిమెంట్ రంగ దిగ్గజ కంపెనీలు ఏసీసీ, అంబుజా మధ్య విలీనాకి చెక్ పడిందన్న వార్తలతో మంగళవారం నాటి మార్కెట్లో ఈ రెండు షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా అంబుజా 4శాతం, ఏసీసీ2 శాతం నష్టపోయాయి. విలీనం చర్చలను నిలిపివేయాలని నిర్ణయించినట్టు ఇరు కంపెనీలూ స్టాక్ ఎక్స్చేంజెస్‌కు అందించిన సమాచారంలో వెల్లడించాయి. సంస్థ ప్రత్యేక కమిటీ, బోర్డు డైరెక్టర్లు రెండింటి ద్వారా జరిపిన సమగ్ర పరిశీలన ఆధారంగా ప్రస్తుతం ఈ విలీనం అమలులో కొన్ని పరిమితులు ఉన్నాయని అభిప్రాయపడినట్టు ఏసీసీ తెలిపింది. కానీ భారతదేశం రెండవ అతిపెద్ద సిమెంటు తయారీ సంస్థను సృష్టించాలనేదే తమ "అంతిమ లక్ష్యం" మని ఏసీసీ, అంబూజా పేర్కొన్నాయి. మైనింగ్ ఆస్తుల బదిలీకి సమస్యలు ఎదురుకావడంతో ప్రస్తుతానికి ఏసీసీ లిమిటెడ్, అంబుజా సిమెంట్ విలీనానికి తెరపడినట్లు తెలుస్తోంది. 18-20 రాష్ట్రాలలో మైనింగ్ ఆస్తుల హక్కుల బదిలీకి సంబంధించి సమస్యలు ఎదురుకావచ్చని విలీన కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే రెండు కంపెనీలూ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి పరస్పరం సహకరించుకోనున్నట్లు పరిశ్రమవర్గాల సమాచారం. కాగా సిమెంట్ రంగంలో ఇటీవల కీలక విలీనాలకు అడుగులు పడుతున్నాయి. గతేడాది మే నెలలో ఏసీపీ, అంబుజా విలీనానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో బినాని సిమెంట్‌ను విలీనం చేసుకునేందుకు అల్ట్రా టెక్ సిమెంట్ ప్రయత్నిస్తోంది. -
ఇలాగైతే చర్చలు రద్దు: పన్నీర్ సెల్వం
అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనం విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యవహరిస్తున్న తీరుపై మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. తమ డిమాండ్లు నెరవేర్చకుండా ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ఇక విలీన చర్చలకు ఫుల్స్టాప్ పెట్టి ప్రజల్లోకి వెళ్లి తేల్చుకోవాలని పన్నీర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. విలీన చర్చల కోసం తాము నియమించిన ఏడుగురు సభ్యుల బృందాన్ని కూడా రద్దు చేయాలని యోచిస్తోంది. అన్నాడీఎంకేలో ఉన్న చీలిక వర్గాలు రెండూ కలిసిపోతే పార్టీకి మేలు జరుగుతుందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండాకుల గుర్తుమీద పోటీ చేయొచ్చని తలపెట్టిన అగ్రనేతలు.. విలీన చర్చలు మొదలుపెట్టారు. అయితే, పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్లను పళనిస్వామి వర్గం, ఆయన మంత్రులు తేలిగ్గా తీసుకోవడం, వాటిని నెరవేర్చేందుకు ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పన్నీర్ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. అసలు వాళ్లను తాము ఎలా నమ్మగలమని పన్నీర్ అంటున్నారు. ఒక పక్క చర్చలు జరుగుతుండగానే మరోవైపు వాళ్లు శశికళ, టీటీవీ దినకరన్‌ల పేర్లతో కూడిన ఒక అఫిడవిట్‌ను ఎన్నికల కమిషన్‌కు సమర్పించి, రెండాకులు గుర్తు కావాలంటున్నారని.. అసలు వాళ్లకు విలీనం కావాలని ఉందా లేదా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ముఖ్యమంత్రి ఈపీఎస్ మాత్రం తాము బేషరతు చర్చలకు సిద్ధంగానే ఉన్నామంటున్నారు. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారు కాబట్టి.. రెండాకుల గుర్తు కూడా తమకే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శశికళ, దినకరన్‌లను తాము పక్కకు పెడతామని ఈపీఎస్ చెబుతున్నా.. వాళ్లను పూర్తిగా పార్టీ నుంచి బహిష్కరించాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తోంది. అలాగే మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం మీద సీబీఐ విచారణ జరిపించాలన్నది కూడా ఆ వర్గం ప్రధాన డిమాండ్లలో ఒకటి. కానీ ఇది కోర్టు పరిధిలో ఉందని సీఎం అంటున్నారు. దానికి తోడు మంత్రులు, ముఖ్యమంత్రి కూడా చర్చల సందర్భంగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇలాగైతే తాము ఎందుకు సహించి భరించాలని పన్నీర్ వర్గం అంటోంది. దాంతో.. ఇక చర్చలకు ఫుల్స్టాప్ పెట్టి, ఈనెల 5వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వర్గం బలాన్ని పెంచుకోవాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు. -
‘ఆమె ఫొటోలు కూడా తీసేస్తే అప్పుడు చర్చలు’
చెన్నై: విలీనం చేసే చర్చలకు ముందు పన్నీర్ సెల్వం వర్గం రోజుకో కొత్త డిమాండ్‌ను తెరమీదకు తెస్తోంది. ఇప్పటి వరకు మొత్తం శశికళ కుటుంబాన్ని పార్టీకి దూరంగా పెట్టాల్సిందేనని డిమాండ్ చేసిన ఆయన వర్గం తాజాగా శశికళ ఫొటోలు కూడా ఉండటానికి వీల్లేదని శాసించింది. ముందు ఆ పని చేస్తేనే చర్చలకు ముందడుగేస్తామంటూ పన్నీర్‌సెల్వం వర్గంలోని కీలక నేత ఈ మధుసూదనన్ డిమాండ్ చేశారు. ‘శశికళ ఛాయా చిత్రాలన్నింటిని బయటపడేయండి. పార్టీ కార్యాలయ పవిత్రతను కాపాడండి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. చెన్నైలోని రాయపీఠ్‌లో త్వరలో పన్నీర్ వర్గం, పళనీస్వామి వర్గం ఏకమయ్యే అంశానికి సంబంధించి చర్చలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికీ పార్టీకి సంబంధించిన ప్రధాని కార్యాలయంతోపాటు ఇతర చిన్న చిన్న కార్యాలయాల్లో కూడా శశికళ ఫొటోలు డామినేట్ చేస్తున్నాయంట. ఈ నేపథ్యంలో వాటన్నింటిని తీసిపారేయండి అంటూ తాజాగా డిమాండ్ తెరపైకి తెచ్చారు. -
పళనికి పన్నీరు సెల్వం షరతు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గాల విలీనంపై అన్నాడీఎంకేలో హైడ్రామా కొనసాగుతోంది. పన్నీరు సెల్వం వర్గం స్వరం పెంచడంతో చర్చలపై మళ్లీ సందిగ్ధత ఏర్పడింది. శశికళ, ఆమె బంధువు దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరించినట్టు అధికారికంగా ప్రకటించాలని, జయలలిత మృతిపై విచారణకు ఆదేశించాలని పన్నీరు వర్గీయులు డిమాండ్లు చేస్తున్నారు. ఆ తర్వాతే విలీనం, పార్టీ బాధ్యతలపై చర్చలకు వెళతామని సెల్వం వర్గీయులు మునుస్వామి, సీహెచ్ పాండియన్ షరతు విధించారు. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై చర్చలంటూనే అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని వారు విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిని పన్నీరు సెల్వంకు అప్పగించాలని ఆయన వర్గీయులు మరో డిమాండ్ చేస్తున్నారు. జయలలిత నియమించినందున సీఎం పదవి తనకే దక్కాలని సెల్వం భావిస్తున్నారు. కాగా సీఎం పదవి ఇచ్చేదిలేదని పళనిస్వామి వర్గం తెగేసి చెబుతోంది. పళనిస్వామికి 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఆయనే సీఎంగా కొనసాగుతారని తంబిదురై స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య విలీన చర్చలు ఇంకా ఓ కొలిక్కిరాలేదు. -
టెలికాం ఇండస్ట్రీలో మరో భారీ విలీనం
న్యూఢిల్లీ : టెలికాం ఇండస్ట్రీ మొత్తం తమ చెప్పుచేతల్లో నడవాలని భావిస్తున్న టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌కు, కొత్తగా మార్కెట్లోకి ఎంట్రీ అయిన జియోకు పెద్ద ముప్పు ఎదురుకాబోతుంది. మరో రెండు దేశీయ టెలికాం దిగ్గజాలు ఐడియా, వొడాఫోన్లు ఒకటి కాబోతున్నాయి. వొడాఫోన్‌ను ఐడియాలో విలీనం చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్‌తో చర్చలు సాగుతున్నాయని బ్రిటిష్ దిగ్గజం క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ రెండు కంపెనీలు చేతులు కలుపబోతున్నాయని మార్కెట్లోనూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను ధృవీకరిస్తూ వొడాఫోన్ సైతం ఓ ప్రకటన విడుదల చేసేసింది. దీంతో రెండు కంపెనీల మధ్యే ఉంటుందన్న పోటీ త్రిముఖంగా మారింది. ఇన్నిరోజులు నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్‌తో మార్కెట్లోకి కొత్తగా వచ్చిన జియో పోటీపడుతోంది. ఎయిర్‌టెల్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల విడుదైన ఫలితాల్లోనూ ఎయిర్టెల్ లాభాలకు జియో ఏ మేర గండికొడుకుతుందో అర్థమైంది. ప్రస్తుతం ఐడియాలో వొడాఫోన్ విలీనమైతే నెంబర్ వన్ స్థానం కోసం మూడు దిగ్గజాలు పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది. బ్రిటీష్‌కు చెందిన దిగ్గజం వొడాఫోన్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఐడియాలు భారత మార్కెట్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. లాభాలను సమంగా పంచుకోనేలా డీల్ కుదుర్చుకోవాలని భావిస్తున్న ఈ రెండు కంపెనీలు.. దీనివల్ల మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీని తట్టుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. వొడాఫోన్‌కు ఐడియా కొత్తగా షేర్లు జారీ చేస్తేనే ఈ విలీనం జరుగుతుందని స్పష్టంచేసింది. అయితే కచ్చితంగా ఈ విలీనం ఎప్పుడు ఉంటుందన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఈ విలీనంతో రెండు కంపెనీల సంస్థ సబ్‌స్క్రైబర్ సంఖ్య 39 కోట్లకు ఎగబాకనుంది. ఇది ఎయిర్టెల్కున్న 27 కోట్ల కంటే ఎక్కువ. జియోకు ప్రస్తుతం 7.2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. అయితే ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్‌కు ఉన్న 42 శాతం వాటాతో ఈ విలీనానికి ఎలాంటి సంబంధం ఉండదు. విలీన చర్చలను వొడాఫోన్ ధృవీకరించడంతో ఐడియా సెల్యులార్ 26 శాతం ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ ఇతర టెలికాం స్టాక్స్‌లోనూ నెలకొంది. భారతీ ఎయిర్టెల్ 8 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్ 12.5 శాతం పెరిగాయి. -
యాహూలో ట్విట్టర్ విలీనం...?
న్యూయార్క్ : ఫ్రీ సోషల్ నెట్ వర్క్, మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్, ఇంటర్నెట్ సేవ ఆధారిత సంస్థ యాహూ లో విలీనం కాబోతుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. ఈ విలీనం విషయం చర్చించడానికి ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ లు యాహూ సీఈవో మెరిస్సా మేయర్ తో భేటీ అయినట్టు తెలుస్తోంది. కాలానుగుణంగా ట్విట్టర్ సేవలకు పడిపోతున్న డిమాండ్ తో, ఈ మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ను యాహూలో విలీనం చేయాలని యోచిస్తున్నారు. మేనేజ్ మెంట్ మీటింగ్ లో ట్విట్టర్, యాహూ ఎగ్జిక్యూటివ్ లు చాలా గంటలు చర్చలు జరిపినట్టు న్యూయార్క్ పోస్టు నివేదించింది. వెనువెంటనే సమాచారాన్ని అందించడంలో ట్విట్టర్ ఓ మాధ్యమంగా యూజర్లకు ఉపయోగపడుతోంది. ఈ-మెయిల్ వ్యవస్థతో పాటు వివిధ రకాల వెబ్ ఆధారిత సేవలను అందించడంలో యాహూ ముందంజలో ఉంది. యాహూ నుంచి సమాచారాన్ని తీసుకోవడానికి ట్విట్టర్ ఎక్కువగా ఆసక్తి చూపుతుందని, ఈ బిడ్డింగ్ ప్రాసెస్ ను త్వరలోనే పూర్తికాబోతుందని రిపోర్టులు చెబుతున్నాయి. అయిత్ ట్విట్టర్ సీఈవో డోర్సే ఈ సమావేశ వివరాలను బయటకు వెల్లడించలేదు. ట్విట్టర్ ఈ వివరాలను బయటికి వెల్లడించకపోవడాన్ని మార్కెట్ వర్గాలు తప్పుబడుతున్నాయి. యాహూ అధికారులు సైతం ఈ విలీన ప్రతిపాదనపై స్పందించడానికి తిరస్కరించారు. యాహూ కోర్ ఇంటర్నెట్ బిజినెస్ ల రెండో రౌండ్ బిడ్ లు టెలికాం దిగ్గజం ఒరిజన్ వద్ద వచ్చే వారం మొదట్లో జరుగనున్నాయి. -
ఇంకా 30 రోజులూ విలీన చర్చలే
ముంబై : దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్ కామ్), ఎయిర్ సెల్ లు విలీనానికి సంబంధించి చర్చల గడువును మరో 30 రోజులు పొడిగించాయి. చర్చల గడువును పొడిగిస్తున్నట్టు రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ కంపెనీ ప్రకటించింది. ఈ విలీన చర్చల గడువును పొడిగించడం ఇది రెండోసారి. మొదటిసారి మార్చి 22న విలీన చర్చల గడువును 60 రోజులుకు పెంచుతున్నట్టు కంపెనీలు ప్రకటించాయి. మరింత గణనీయమైన పురోగతి కోసం ఆర్ కామ్, మాక్సిస్ కమ్యూనికేషన్ బెర్హడ్(ఎమ్ సీబీ), సింద్యా సెక్యురిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ సెల్ పెట్టుబడిదారులు పరస్పరం ఈ ప్రత్యేక సమయ వ్యవధిని 2016 జూన్ 22 వరకు పెంచాలని నిర్ణయించినట్టు ఆర్ కామ్ తెలిపింది. అయితే ఈ విలీన ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. షేర్ హోల్డింగ్ గురించి ప్రస్తుత చర్చలు జరుగుతున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొత్త సంస్థలో ఆర్ కామ్ ఎక్కువ షేరును ఆశిస్తున్నట్టు సమాచారం. ఆర్ కామ్ టవర్, ఆప్టికల్ ఫైబర్ ఆస్తులను వదిలేసి, విలీన చర్చలను 90 రోజుల ప్ర్యతేక సమయ వ్యవధితో ప్రారంభిస్తున్నట్టు డిసెంబర్ 22న ఈ కంపెనీలు ప్రకటించాయి. అయితే మార్చి 22న మరో 60 రోజులు ఈ విలీన చర్చల గడువును పొడిగిస్తున్నట్టు పేర్కొన్నాయి. ఆర్ కామ్, ఎయిర్ సెల్ చర్చలు సఫలమైతే, మొత్తం స్పెక్ట్రమ్ పరిశ్రమలో ఈ రెండు 19.3శాతం వాటాను కలిగి ఉంటాయి. 2జీ, 3జీ, 4జీ సర్వీసుల కొరుకు 800 ఎమ్ హెచ్ జడ్, 900ఎమ్ హెచ్ జడ్ ,1800ఎమ్ హెచ్ జడ్,2100ఎమ్ హెచ్ జడ్,2300 ఎమ్ హెచ్ జడ్ స్పెక్ట్రమ్ లను ఇవి పొందనున్నాయి.