PVR Talkies
-
ఎంతసేపు సినిమా చూస్తే అంతే ధర చెల్లించేలా..
ఎంతో ఆసక్తిగా సినిమా చూసేందుకు వెళ్తారు. తీరా అరగంట చూశాక సినిమా నచ్చకో లేదా ఏదైనా అత్యవసర పనిమీదో బయటకు వెళ్లాల్సి రావొచ్చు. అలాంటి సందర్భంలో టికెట్ డబ్బులు వృథా అయినట్టే కదా. ఇలాంటి ప్రత్యేక సమయాల్లో టికెట్ డబ్బు నష్టపోకుండా మీరు ఎంతసేపు సినిమా చూస్తారో అంతే మొత్తం చెల్లించేలా పీవీఆర్ ఐనాక్స్ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులో తీసుకొచ్చినట్లు తెలిపింది. అందులో భాగంగా ‘ఫ్లెక్సీ షో’ అనే కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.ఈ ఫ్లెక్సీ షో ద్వారా సినిమా చూసే సమయానికి మాత్రమే డబ్బు చెల్లించవచ్చు. ఈ వినూత్న టికెటింగ్ మోడల్లో సీటు ఆక్యుపెన్సీని పర్యవేక్షించడానికి, మూవీ మిగిలి ఉన్న సమయం ఆధారంగా రీఫండ్లను లెక్కించడానికి ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.ఎలా పని చేస్తుందంటే..టికెట్ స్కానింగ్: మీరు సినిమా థియేటర్లోకి వెళ్లేప్పుడు టికెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తారు. మీ ఎంట్రీ, ఎక్జిట్ సమయాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. దానిపరంగా మీకు డబ్బు రీఫండ్ అవుతుంది.రీఫండ్ సిస్టమ్: సినిమా 75% కంటే ఎక్కువ మిగిలి ఉంటే, టికెట్ ధరలో 60% తిరిగి పొందవచ్చు. సినిమా వ్యవధి 50-75%కు మధ్య ఉంటే 50% రీఫండ్ అవుతుంది. ఇంకా 25-50% సినిమా మిగిలి ఉన్నప్పుడు మీరు థియేటర్ నుంచి బయటకు వెళితే 30% రీఫండ్ ఇస్తామని పీవీఆర్ ఐనాక్స్ పేర్కొంది.అదనపు ఛార్జీలుఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునేవారు టికెట్ బుకింగ్ సమయంలోనే ‘ఫ్లెక్సీ షో’ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే అందుకు సాధారణ ధర కంటే టికెట్ ఫేర్‌లో 10 శాతం అధికంగా చెల్లించాలి.ఎక్కడ అమలు చేస్తున్నారు..ఈ సదుపాయాన్ని ప్రస్తుతం న్యూఢిల్లీ, గుర్గావ్ల్లో అమలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అదికూడా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో మాత్రమే దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రేక్షకుల స్పందన ఆధారంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో జాబ్స్ పెరుగుతాయా? తగ్గుతాయా?కంపెనీపై ప్రభావంప్రేక్షకుల సంతృప్తి: సినిమా చూసే సమయానికి మాత్రమే ధర నిర్ధారించడం వల్ల పీవీఆర్ ఐనాక్స్‌పై ప్రేక్షకులకు విశ్వసనీయత పెరుగుతుందని కంపెనీ అధికారులు తెలిపారు. ప్రేక్షకుల సంతృప్తికి సంస్థ పెద్దపీట వేస్తుందని చెప్పారు.ఆదాయ వృద్ధి: ఫ్లెక్సీ షో టికెట్ల ధర 10% ఎక్కువగా ఉన్నప్పటికీ, సినిమా వీక్షించిన సమయం ఆధారంగా రీఫండ్లను అందిస్తుండడంతో కంపెనీ ఆదాయం పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కంపెనీ అందించే సౌలభ్యాన్ని వినియోగించుకునేందుకు అదనపు ఛార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారని కంపెనీ భావిస్తుంది.పోటీని తట్టుకునేలా..: ఈ వినూత్న టికెటింగ్ మోడల్ పీవీఆర్ ఐనాక్స్ ఇతర ఎంటర్టైన్మెంట్ రంగంలోని సంస్థలతో పోటీ పడేందుకు ఉపయోగపడుతుంది.డేటా సేకరణ: సీట్ల ఆక్యుపెన్సీని పర్యవేక్షించడానికి, రీఫండ్లను లెక్కించడానికి ఏఐ ఆధారిత వీడియో విశ్లేషణలు ఉపయోగించనున్నారు. దాంతో ప్రేక్షకుల ప్రవర్తన, వారి ప్రాధాన్యతలకు సంబంధించిన డేటాను సేకరించే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో ప్రేక్షకులకు మరింత మెరుగైన సినిమా అనుభవాన్ని అందించేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది. -
సినీ ప్రియులకు బంపర్ ఆఫర్.. మల్టీప్లెక్స్‌లో కేవలం రూ.99 కే టికెట్
మీకు అతి తక్కువ ధరకే సినిమా టికెట్ కావాలా? కేవలం వంద రూపాయల్లో సినిమా చూసేయలనుకుంటున్నారా? అది కూడా సాధారణ థియేటర్లలో కాదండోయ్. అన్ని హంగులుండే మల్టీప్లెక్స్‌ల్లో ఈ ధరకు టికెట్ అందిస్తోంది పీవీఆర్ సినిమాస్. సినీ ప్రియులకు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది. సినిమా ప్రేమికుల కోసం పీవీఆర్ సినిమాస్ ఈ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈనెల 20న సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది. పీవీఆర్ సినిమాస్‌లో అన్ని షోలను రూ.99 కే చూడవచ్చని ప్రకటించింది. అయితే ఈ టికెట్లకు జీఎస్టీ అదనంగా ఉండనుంది. కేవలం ఎంపిక చేసిన నగరాల్లో ఈ బంపర్ ఆఫర్ వర్తించనుంది. అయితే పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్, పఠాన్‌కోట్‌తో పాటు పుదుచ్చేరి నగరాల్లో ఉన్న పీవీఆర్ సినిమాలో ఈ ఆఫర్ వర్తించదు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో టికెట్ ధర రూ.100+ జీఎస్టీతో కలిపి ఉండనుంది. మొత్తంగా తెలంగాణలో రూ.112+జీఎస్టీతో కలిపి టికెట్లు ఉండనున్నాయి. అయితే ప్రీమియం కేటగిరి సీట్స్ ఈ ఆఫర్ పరిధిలోకి రావని తెలిపింది యాజమాన్యం. మరింత సమాచారం కోసం పీవీఆర్ సినిమాస్ వెబ్సైట్ చూడాలని సూచించింది. -
పీవీఆర్, ఐనాక్స్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: దేశంలోని టాప్–2 మల్టీప్లెక్స్ దిగ్గజాల విలీనానికి తాజాగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పీవీఆర్, ఐనాక్స్ లీజర్ సంయుక్త సంస్థగా ఆవిర్భవించేందుకు మరో అడుగు ముందుకు పడింది. ప్రతిపాదిత విలీనానికి ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఈ నెల 12న అనుమతించినట్లు పీవీఆర్ వెల్లడించింది. 2022 అక్టోబర్‌లో ప్రత్యర్థి సంస్థ ఐనాక్స్ లీజర్తో విలీనానికి పీవీఆర్ వాటాదారులు ఆమోదముద్ర వేశారు. అంతకుముందు జూన్‌లో స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఇందుకు ఓకే చెప్పాయి. తొలుత గతేడాది మార్చిలో రెండు కంపెనీలూ విలీనాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్సీఎల్టీ అనుమతి నేపథ్యంలో పీవీఆర్ షేరు 0.5 శాతం నీరసించి రూ. 1,745 వద్ద, ఐనాక్స్ లీజర్ 0.7 శాతం నష్టంతో రూ. 515 వద్ద ముగిశాయి. -
పీవీఆర్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నష్టాలు సగానికిపైగా తగ్గాయి. రూ. 71.5 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 153 కోట్లకుపైగా నికర నష్టం ప్రకటించింది. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడంతో ఫిల్మ్ ఎగ్జిబిషన్ బిజినెస్ ఊపందుకున్నట్లు కంపెనీ పేర్కొంది. క్యూ2లో మొత్తం ఆదాయం సైతం రూ. 120 కోట్ల నుంచి దాదాపు రూ. 687 కోట్లకు దూసుకెళ్లింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 461 కోట్ల నుంచి భారీగా ఎగసి రూ. 813 కోట్లను తాకాయి. ఈ కాలంలో 1.8 కోట్ల మంది సినిమాలను సందర్శించగా.. టికెట్ సగటు ధరలు 11 శాతం మెరుగై రూ. 224కు చేరాయి. ఆహారం, పానీయాలపై ఒక్కో వ్యక్తి వినియోగ వ్యయం 31 శాతం పుంజుకుని రూ. 129కు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
పీవీఆర్ కొత్త స్క్రీన్ల ఏర్పాటు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో కొత్తగా 100 స్క్రీన్లు(తెరలు) ఏర్పాటు చేయనున్నట్లు మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 350 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. మల్టీప్లెక్స్ రంగంలోని మరో కంపెనీ ఐనాక్స్ లీజర్తో విలీనం 2023 ఫిబ్రవరికల్లా పూర్తికావచ్చని అంచనా వేస్తోంది. దీంతో పీవీఆర్ ఐనాక్స్‌గా సంయుక్త బిజినెస్‌ను నిర్వహించనున్నట్లు పీవీఆర్ సీఈవో గౌతమ్ దత్తా పేర్కొన్నారు. వీక్షకులు తిరిగి సినిమా థియేటర్లకు వచ్చేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నట్లు వెల్లడించారు. దీంతో ఆహారం, పానీయాల విభాగం అమ్మకాలు సైతం పుంజుకున్నట్లు ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలపై స్పందిస్తూ వివరించారు. వెరసి తెరల విస్తరణకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఏడాది బాటలోనే వచ్చే రెండు, మూడేళ్లలో కూడా విస్తరణను కొనసాగించే వీలున్నట్లు తెలియజేశారు. 60 శాతం తెరలను నగరాలలో ఏర్పాటు చేయనుండగా.. మిగిలిన వాటిని కొత్త ప్రాంతాలలో నెలకొల్పనున్నట్లు వివరించారు. రూర్కెలా, డెహ్రాడూన్, వాపి, చెన్నై, కోయంబత్తూర్, తిరువనంతపురం, అహ్మదాబాద్‌లో విస్తరణను చేపట్టనున్నట్లు వెల్లడించారు. నిధులను నగదు నిల్వలు, అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకోనున్నట్లు తెలియజేశారు. -
క్రికెట్ ప్రియులకు ఇక పండగే.. మల్టీప్లెక్స్‌ల్లో టీ-20 ప్రపంచకప్ లైవ్ మ్యాచ్‌లు
న్యూఢిల్లీ: సినిమా థియేటర్లలో క్రికెట్ లైవ్ మ్యాచ్ చూస్తే ఎలా ఉంటుదో ఒకసారి ఊహించుకోండి! బొమ్మ అదుర్స్ కదూ. అలా వింటుంటే ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అనిపిస్తుందా?. అయితే, కొంచెం ఓపిక పట్టండి మీ కల కొద్ది రోజుల్లో నిజం కాబోతుంది. ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని తమ థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు మల్టీప్లెక్స్ చైన్ ఇనాక్స్ లీజర్ లిమిటెడ్ తెలిపింది. యూఏఈ, ఒమన్లలో బీసీసీఐ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 7వ ఎడిషన్ అక్టోబర్ 17న ప్రారంభం కాబోతోంది. ఇనాక్స్ మల్టీప్లెక్స్‌ల్లో ఈ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబరు 14న జరగనుంది. మార్క్యూ లీగ్ మ్యాచ్ లు, సెమీ ఫైనల్స్, ఫైనల్‌తో పాటు టీమ్ ఇండియా ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్‌లను మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శించనున్నట్లు ఇనాక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ప్రధాన నగరాల్లోని ఇనాక్స్ మల్టీప్లెక్స్‌ల్లో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా ప్రదర్శించనుంది. పెద్ద థియేటర్ స్క్రీన్ పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా.. క్రికెట్ మైదానంలోనే మ్యాచ్‌ను వీక్షిస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు కలగజేయాలన్నదే దీని వెనక ఉద్దేశమని కంపెనీ పేర్కొంది. (చదవండి: AICF: చెస్‌కు ‘ఎంపీఎల్’ అండ.. కోటితో మొదలుపెట్టి..) క్రికెట్ మ్యాచ్‌ల వీక్షణకు టికెట్టు ధర నగరాన్ని బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుందని తెలిపింది. ఐనాక్స్కు 70 నగరాల్లో 56 మల్టీప్లెక్స్‌లు, 658 థియేటర్లు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే టికెట్ విక్రయించనునట్లు సంస్థ తెలిపింది. ఈ సంస్థ ఇటీవల లక్నోలోని పలాసియో మాల్లో, ముంబైలోని మలాడ్ లోని ఇనార్బిట్ మాల్లో భారీ మెగాప్లెక్స్ ప్రారంభించింది. పీవీఆర్ సినిమాస్ ఇండియాలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2021ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో ఒక ఒప్పందాన్ని చేసుకున్నట్లు పీవీఆర్ సినిమాస్ కూడా ప్రకటించింది. పీవీఆర్ సినిమాస్ మల్టీప్లెక్స్‌ల్లో సెమీ ఫైనల్స్, ఫైనల్‌తో పాటు టీమ్ ఇండియా ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా ప్రదర్శించనుంది. దేశంలోని 35కి పైగా నగరాల్లో 75కు పైగా మల్టీప్లెక్స్‌ల్లో ఈ మ్యాచ్‌లు ప్రసారం చేయనున్నారు. ఇందులో న్యూఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్ వంటి టైర్-1, టైర్-2 నగరాలు ఉన్నాయి.(చదవండి: బైక్ కొనేవారికి రివోల్ట్ మోటార్స్ శుభవార్త!) -
సినిమా థియేటర్స్‌లో బ్యాటిల్ గ్రౌండ్
న్యూఢిల్లీ: గేమ్స్‌కి సంబంధించి లైవ్ టోర్నమెంట్లను థియేటర్లలో వెండి తెరపై ప్రదర్శించే దిశగా ఈ–స్పోర్ట్స్ కంపెనీ నాడ్విన్ గేమింగ్‌తో జట్టు కట్టినట్లు థియేటర్ల చెయిన్ పీవీఆర్ వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు ముంబై, గురుగ్రామ్, ఇండోర్ వంటి నాలుగు నగరాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నట్లు సంస్థ చీఫ్ ఆఫ్ స్ట్రాటజీ కమల్ జ్ఞాన్చందాని తెలిపారు. సిల్వర్ స్క్రీన్‌పై ఈ మధ్య ప్రాచుర్యం పొందిన బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) కాంపిటీషన్‌ను ఆయా నగరాల్లోని థియేటర్లలో లైవ్‌గా చూపించనున్నట్లు వివరించారు. గేమర్లు ప్రారంభ రౌండ్లను మొబైల్లో పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని తదుపరి క్వార్టర్, సెమీస్, ఫైనల్స్‌ను సినిమా హాళ్లలో ప్రదర్శిస్తామని కమల్ వివరించారు. అక్టోబరు 7న తొలి రౌండు చాంపియన్‌షిప్ అక్టోబర్ 7న గురుగ్రామ్‌లోని పీవీఆర్ యాంబియన్స్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో ప్లేయర్లు తమ ఫోన్లు లేదా చేతి పరికరాల్లో ఆడే గేమ్‌ను వెండి తెరపై ప్రదర్శిస్తామని .. అదనంగా కామెంటరీ, గ్రాఫిక్స్, చర్చలు వంటి హంగులన్నీ కూడా ఉంటాయని కమల్ పేర్కొన్నారు. పీవీఆర్‌కు భారత్, శ్రీలంకలోని 72 నగరాల్లో 842 స్క్రీన్లు ఉన్నాయి. చదవండి : Netflix: ఆ వెబ్‌సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త తలనొప్పి..! -
ఎల్ఈడీ సినిమా తెర
ఇప్పటి వరకు ఎల్ఈడీ టీవీలనే చూశాం. ఇకపై సినిమా థియేటర్లలో కూడా ఎల్ఈడీ తెరను చూడవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో ఎల్ఈడీ తెరను ఇటీవల ఏర్పాటు చేశారు. దేశంలో మొట్టమొదటి ఎల్ఈడీ సినిమా తెర ఇదే. శామ్సంగ్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేశారు. మామూలు తెరతో పోలిస్తే ఎల్ఈడీ తెరపై సినిమా మరింత ప్రకాశవంతంగా స్పష్టంగా కనిపిస్తుందని, శబ్దం కూడా క్లియర్‌గా ఉంటుందని పీవీఆర్ మల్లీప్లెక్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లి చెప్పారు. ఎల్ఈడీ తెరకు ప్రొజెక్టర్ అవసరం ఉండదు. మామూలుగా సినిమా నడిచేటప్పుడు హాల్లో లైట్లన్నీ ఆర్పేస్తారు. అయితే, ఎల్ఈడీ తెర ఉంటే లైట్లు ఆర్పాల్సిన అవసరం లేదు. థియేటర్లో లైట్లు ఉన్నా సినిమా చూడటా నికి ప్రేక్షకులకు ఇబ్బంది ఉండదు. ఈ తెర ఏర్పాటుకు రూ.7 కోట్లు ఖర్చయింది. 2017లో తొలిసారిగా కొరియాలో ఎల్ఈడీ తెర(ఆనిక్స్ స్క్రీన్)ను పరిచయం చేశామని, ఇంతవరకు ప్రపంచంలో 12 చోట్ల ఈ తెర లున్నాయని శామ్సంగ్ ప్రతినిధి చెప్పారు. -
మూడేళ్లలో మరో 150 థియేటర్లు: పీవీఆర్
న్యూఢిల్లీ : రాబోయే 2-3 సంవత్సరాల్లో ‘పీవీఆర్ టాకీస్’ బ్రాండ్ కింద సుమారు 150 చౌక స్క్రీన్స్‌ను (థియేటర్స్) ప్రారంభించాలని యోచిస్తున్నట్లు మూవీ థియేటర్స్ సంస్థ పీవీఆర్ సీఎండీ అజయ్ బిజ్లి వెల్లడించారు. కొత్త టెక్నాలజీ ‘డాల్బీ అట్మాస్’ కోసం డాల్బీ ల్యాబరేటరీస్‌తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా అజయ్ ఈ విషయాలు తెలిపారు. దాదాపు 50 పీవీఆర్ స్క్రీన్స్‌లో సుమారు రూ.40 కోట్లతో డాల్బీ అట్మాస్ టెక్నాలజీని ఇన్స్టాల్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. పీవీఆర్ టాకీస్ పేరిట ప్రస్తుతం 80 స్కీన్లున్నాయి. మొత్తం అన్ని బ్రాండ్లు కలిపి 43 నగరాల్లో 474 స్క్రీన్స్ ఉన్నాయి.