వరుణ్‌తేజ్‌తో పలాస డైరెక్టర్‌ మూవీ? వైజాగ్‌ నేపథ్యంలో... | Varun Tej next film with Palasa director Karuna Kumar | Sakshi
Sakshi News home page

వరుణ్‌తేజ్‌తో పలాస డైరెక్టర్‌ మూవీ? వైజాగ్‌ నేపథ్యంలో...

Published Mon, May 8 2023 1:27 AM | Last Updated on Mon, May 8 2023 7:28 AM

Varun Tej next film with Palasa director Karuna Kumar - Sakshi

హీరో వరుణ్‌ తేజ్, దర్శకుడు కరుణకుమార్‌ (‘పలాస’ మూవీ ఫేమ్‌) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరుణ్‌కి ఓ కథను వినిపించారట కరుణకుమార్‌. స్క్రిప్ట్‌ నచ్చడంతో ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. పీరియాడికల్‌ క్రైమ్‌ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా వైజాగ్‌ నేపథ్యంలో ఉంటుందట.

ఈ మూవీ కోసం వరుణ్‌ స్పెషల్‌ మేకోవర్‌ కానున్నారని టాక్‌. సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుందని భోగట్టా. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు ‘గాండీవధారి అర్జున’ సినిమా కోసం ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ బుడాపెస్ట్‌లో ఉన్నారు. అలాగే హిందీలో శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు వరుణ్‌ తేజ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement