‘‘సెట్‌లో కూడా స్టార్ హీరోలుగా ఉండే ఆర్టిస్టులను హ్యాండిల్ చేయడం నాకు కాస్త కష్టంగా ఉంటుంది. కానీ, తన స్టార్ హీరో ఇమేజ్‌ని బయటపెట్టి సెట్స్‌లో అందరితో హుందాగా ఉంటారు వరుణ్ తేజ్. ‘పలాస 1978’ సినిమాను ఎంత స్వేచ్ఛగా చేశానో, అంతే హాయిగా ‘మట్కా’ ని తీశాను. ఇరవై ఏళ్ల తర్వాత కూడా ‘మట్కా’లోని వరుణ్ నటన గురించి చెప్పుకుంటారు. వరుణ్ లుక్స్ విషయంలో చిరంజీవిగారి గెటప్స్‌ను రిఫరెన్స్ లుగా తీసుకున్నా’’ అని దర్శకుడు కరుణ కుమార్ అన్నారు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ‘మట్కా’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లు.
విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం రేపు(గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా కరుణ కుమార్ మాట్లాడుతూ– ‘‘బర్మా నుంచి వైజాగ్‌కు శరణార్థిగా వచ్చిన వాసు అనే వ్యక్తి కథే ఈ ‘మట్కా’. రతన్ ఖత్రి జీవితాన్ని ‘మట్కా’గా తీయలేదు. రతన్ ఖత్రీ ఏం చేసి ఉండేవాడోనని ఆలోచించి, ఓ ఐడియాతో ఈ స్క్రిప్ట్‌ని రాశాను. ‘మట్కా’ గేమ్ గురించి కూడా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాం. మొబైల్ ఫోన్స్ లేని రోజుల్లో కూడా దేశం మొత్తం ఒక నంబర్‌ని ఓ వ్యక్తి అతి తక్కువ సమయంలో ఎలా పంపాడు? అనే పాయింట్ ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది.
జీవీ ప్రకాష్‌కుమార్ మంచి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. విజయేందర్ రెడ్డి, రజనీ చాలా సపోర్ట్ చేశారు. సినిమా అనేది కళతో కూడిన వ్యాపారమని నా అభి్రపాయం. నా నిర్మాతలు లాభపడాలనే కోరుకుంటాను. అందుకే ఎక్కవ ఫుటేజ్‌ని కూడా చిత్రీకరించను. నా ప్రతి సినిమాలో కూడా నా మార్క్ ఫిల్మ్‌మేకింగ్ సెన్సిబిలిటీస్ ఉంటాయి.. అలా చేయలేని రోజు సినిమాలు మానేస్తాను’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment