Karuna Kumar
-
గ్యాంగ్‌స్టర్‌గా వరుణ్ తేజ్.. ‘మట్కా’ గ్లింప్స్ చూశారా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , ‘పలాస 1978’ఫేమ్ కరుణ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మట్కా’. . వైర ఎంటర్టైన్మెంట్స్పై నిర్మాత డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి SRT ఎంటర్టైన్మెంట్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. నేడు(జనవరి 19) వరుణ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్‌తో పాటు ‘మట్కా’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కథానాయకుడు గ్రామోఫోన్‌లో మ్యూజిక్ ని ప్లే చేయడంతో టీజర్ ప్రారంభం అవుతుంది. ఇది రెండు వేర్వేరు టైమ్లైన్లలో పాత్రలని ప్రజెంట్ చేస్తోంది. నవీన్ చంద్ర గ్యాంగ్‌స్టర్‌గా కనిపించగా, పి రవిశంకర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. గ్యాంగ్‌స్టర్ పాత్రలో వరుణ్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీతో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. -
సెట్లో స్టార్ట్
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లు. కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని విజయేందర్ రెడ్డి తీగల, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ‘‘యావత్ దేశాన్ని కదిలించిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ‘మట్కా’ను తెరకెక్కిస్తున్నాం. ఇందులో వరుణ్ తేజ్ నాలుగు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారు. ఈ సినిమా కథాంశం ప్రధానంగా 1958–1982ల మధ్య జరుగుతుంది. అందుకుని 1950, 1980 నాటి పరిస్థితులను రీ క్రియేట్ చేస్తున్నాం. అలా రీ క్రియేట్ చేసిన ఓ భారీ సెట్లోనే ‘మట్కా’ షూటింగ్ జరుగుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
హైదరాబాద్‌లో వైజాగ్
యాక్షన్ మోడ్‌లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు హీరో వరుణ్ తేజ్. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న యాక్షన్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించనున్నారు. వైర ఎంటర్టైన్ మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సీవీఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్స్‌కి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ‘‘దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఓ వాస్తవ ఘటన ఆధారంగా వైజాగ్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుంది. 24 ఏళ్ల వ్యవధిలో (1958 –1982) జరిగే ఈ సినిమాలో వరుణ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. 1950, 1980 నాటి వాతావరణాన్ని తలపించేలా భారీ సెట్స్‌ను రూపొందిస్తున్నాం. హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్ సిటీని క్రియేట్ చేసేందుకు ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నాం. ఈ సినిమాకు నలుగురు ఫైట్ మాస్టర్స్ వర్క్ చేస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్. -
యాక్టర్లుగా మారుతున్న దర్శకులు.. తెరపై సత్తా చూపిస్తుందెవరు?
నటీనటులు...వెండితెర మీద మెరిస్తే, దర్శకుడు అనే వాడు..అన్ని శాఖలను ముందుండి నడిపిస్తాడు. ఓ యాక్టర్ నుండి ఎంత పర్ఫామెన్స్ రాబట్టాలో అనేది డైరెక్టర్ వర్క్. అయితే సెట్లో యాక్షన్ కట్ చెప్పే కొందరు...ముఖానికి రంగేసుకొని..నటనాభినయం చూపిస్తున్నారు. అంటే దర్శకులు కాస్తా...యాక్టర్లుగా మారుతున్నారు. ఈ మధ్యకాలంలో యాక్టర్స్‌గా రాణిస్తున్న దర్శకులపై ఓ లుక్కేద్దాం. ఫ్యామిలి సబ్జెక్టులు తెరకెక్కించే శ్రీకాంత్ అడ్డాల..నారప్పా లాంటి ఊరా మాస్ మూవీ తెరకెక్కించి అందరికి షాక్ ఇచ్చారు.లేటెస్ట్ గా పెద కాపు 1 లో విలన్ గా నటించాడు. ఈ పాత్ర కోసం తొలుత ఓ మలయాళ నటుడిని సెలక్ట్ చేసుకున్నారు. అయితే అనుకోకుండా ఈ యాక్టర్ ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు.దాంతో శ్రీకాంత్ నెగిటివ్ రోల్ లో వెండితెర మీద కనిపించాడు. మరో దర్శకుడు కూడా వెండితెర మీద విలన్ పాత్రలు పోషించటానికి రెడీ అయిపోయాడు. పలాస 1978 దర్శకుడు కరుణా కుమార్...ప్రస్తుతం మట్కా మూవీ తెరకెక్కిస్తున్నాడు.ఓ మూవీకి యాక్షన్ కట్ చెప్తునే...నాగార్జున హీరోగా నటిస్తున్నా ...నా సామి రంగ లో విలన్‌గా కనిపించబోతున్నాడు.ఈ మూవీ గ్లింప్స్‌లో తాను నెగిటివ్ రోల్లో ఎలా ఉంటాడో చూపించాడు షార్ట్ ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన తరుణ్ భాస్కర్..పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా మారాడు.విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ...బాక్సాఫీసు ముందరా హిట్ కొట్టింది.తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే యూత్ ఫుల్ సినిమాను కూడా దర్శకత్వం చేసాడు తరుణ్ .ఇక విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి మీకు మాత్రమే చెప్తాను అనే మూవీని రూపొందించాడు.ఈ మూవీలో కథానాయకుడిగా తరుణ్ బాస్కర్నే సెలక్ట్ చేసుకున్నాడు. తరుణ్ హీరోగా నటించిన మీకు మాత్రమే చెప్తాను సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే నటుడిగా మాత్రం మంచి మార్కులు వేసుకున్నాడు.ఆ తర్వాత సీతా రామం,దాస్ కా దమ్కీ లాంటి సినిమాలలో నటించాడు.పిట్ట కథలు లాంటి వెబ్ సిరీస్‌లలో కనిపించాడు.తొందర్లో స్వీయ దర్శకత్వంలో కీడా కోలా సినిమాతో రాబోతున్నాడు. ఎస్వీ కృష్ణారెడ్డి ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న దర్శకుడు.ఈ బహుముఖ ప్రజ్ణాశాలి నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాడు.కాని..దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల మనసుదోచుకున్నాడు.తనలోని కోరికను..ఉగాది సినిమాతో తీర్చుకున్నాడు. ఈ మూవీలో కథానాయకుడిగా నటించాడు. ఆతర్వాత అభిషేకం మూవీతో మరోసారి హీరోగా ట్రై చేసాడు. అయితే ఈ మూవీలు ఆకట్టుకోలేకపోయాయి. ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమకు,భారీ విజయాలను అందించిన దర్శకులంతా,ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు గానూ, విలన్స్ గానూ నటిస్తున్నారు. గౌతమ్ వాసు దేవ్ మీనన్, సముద్రఖని, ఎసే జే సూర్య వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. దర్శకులు ..నటులుగా మారటం అనేది ఇప్పటిది కాదు.ఎప్పటి నుండో ఈ సంప్రదాయం కొనసాగుతుంది. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్‌తో సహా చాలామంది పెద్ద దర్శకులు నటులుగా మంచి పేరు సంపాదించారు. దాసరి శిష్యుడు కోడి రామకృష్ణ కూడా వెండితెర మీద కనిపించారు. దాసరి మరో ప్రియ శిష్యుడు..ఆర్ నారాయణ మూర్తి...స్వీయ దర్శకత్వం పలు చిత్రాలు వచ్చాయి . దాసరి నారాయణ..నటుడిగా..ప్రత్యేక ముద్రవేసాడు. ఈయన కోసమే కొన్ని పాత్రలు పుట్టాయా అన్నంతగా..మెప్పించాడు. -
అక్టోబరులో ఆరంభం
వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ చిత్రం రూ΄పొందుతున్న సంగతి తెలిసిందే. మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు మొదటివారంలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని, ఈ తొలి షెడ్యూల్ దాదాపు ఇరవై రోజుల పాటు హైదరాబాద్‌లోని విభిన్నమైన లొకేషన్స్‌లో జరుగుతుందని సమాచారం. వైజాగ్ నేపథ్యంలో 1958 – 1982 టైమ్ పీరియడ్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ‘మట్కా’ చిత్రం తెరకెక్కనుంది. కథానుగుణంగా అప్పటి వైజాగ్‌ను తలపించేలా సెట్‌ను నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారట యూనిట్. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ!
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. చేసినవి తక్కువ సినిమాలే అయినా.. ప్రతి సినిమాలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటాడు. ప్రస్తుతం ఈ మెగా ప్రిన్స్ ‘గాండీవధారి అర్జున’అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతలోనే తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చాడు వరుణ్ తేజ్. (చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? తెలుగులో చేసింది ఒకటే సినిమా!) ‘గాండీవధారి అర్జున’తర్వాత వరుణ్, ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం టైటిల్‌ని అనౌన్స్ చేశారు. కొత్త సినిమాకు ‘మట్కా’అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు వెల్లడించారు. 1975 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. మట్కా ఆట ప్రధానంగా ఈ సినిమా తెరకెక్కుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, నోరా ఫతేహి కీలక పాత్ర పోషించారు. -
ధ్వని.. ది బెస్ట్ కాన్సెప్ట్: బెల్లంకొండ సురేశ్
‘ధ్వని’ కాన్సెప్ట్ చాలా బాగుంది. పదేళ్ల కుర్రాడు లక్ష్మిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం అభినందించదగ్గ విషయం. చాలా మంది నూతన దర్శకుల కంటే లక్షిన్ బెటర్ గా ధ్వని షార్ట్ ఫిలిం ను తీశాడు’అని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ అన్నారు. ఎల్.వి ప్రొడక్షన్ బ్యానర్ లో లక్షిన్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిలిం ధ్వని. డెఫ్ అండ్ డంప్ కాన్సెప్ట్ ఈ షార్ట్ ఫిలిం రూపొందించబడింది. నీలిమ వేముల నిర్మాతగా వ్యవహరించిన ధ్వని షార్ట్ ఫిలింకు అశ్విన్ కురమన సంగీతం అందించారు. ధ్వని షార్ట్ ఫిలిం రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ సంరద్భంగా బెల్లంకొండ సురేశ్మాట్లాడుతూ.. లక్ష్మిస్ ఈ లఘు చిత్రాన్ని చాలా బాగా తీశాడు. అబ్బాయి భవిష్యత్తులో మరిన్నిమంచి ప్రాజెక్ట్స్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు. దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ...లక్షిన్ తీసిన షార్ట్ ఫిలిం చాలా బాగుంది. ఈ వయసులో అబ్బాయి తీసిన విధానం ఎంతో బాగుంది. ధ్వని కసెప్ట్ తో పదకొండు నిమిషాల్లో అద్భుతంగా తెరకెక్కించారు’ అన్నారు. డైరెక్టర్ లక్షిన్ మాట్లాడుతూ...నేను ధ్వని షార్ట్ ఫిలిం చెయ్యడానికి నన్ను ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ కు థాంక్స్. చిన్న కాన్సెప్ట్ తో తీసిన ఈ షార్ట్ ఫిలిం కు అందరి నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. దర్శకుడిగా మంచి సినిమాలు చెయ్యాలి అనేది నా కోరిక. భవిషత్తులో నా పేవరేట్ హీరో అల్లు అర్జున్ తో మూవీ చేయాలనేది నా డ్రీమ్ అని తెలిపారు. -
వరుణ్‌తేజ్‌తో పలాస డైరెక్టర్ మూవీ? వైజాగ్ నేపథ్యంలో...
హీరో వరుణ్ తేజ్, దర్శకుడు కరుణకుమార్ (‘పలాస’ మూవీ ఫేమ్) కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరుణ్‌కి ఓ కథను వినిపించారట కరుణకుమార్. స్క్రిప్ట్ నచ్చడంతో ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని సమాచారం. పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా వైజాగ్ నేపథ్యంలో ఉంటుందట. ఈ మూవీ కోసం వరుణ్ స్పెషల్ మేకోవర్ కానున్నారని టాక్. సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అవుతుందని భోగట్టా. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు ‘గాండీవధారి అర్జున’ సినిమా కోసం ప్రస్తుతం వరుణ్ తేజ్ బుడాపెస్ట్‌లో ఉన్నారు. అలాగే హిందీలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు వరుణ్ తేజ్. -
తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో డీజీపీ ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు 9 తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏసీబీ విభాగం టోల్‌ఫ్రీ నంబర్ 14400, ఏసీబీ యాప్ 14400లకు వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. బద్వేల్(వైఎస్సార్ జిల్లా), తిరుపతి రూరల్, అనంతపురం రూరల్, విశాఖపట్నం జగదాంబ, తుని(కాకినాడ జిల్లా), నర్సాపురం, ఏలూరు, కందుకూరు (నెల్లూరు జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, మేడికొండూరు(గుంటూరు), జలుమూరు(శ్రీకాకుళం) తహశీల్దార్ కార్యాలయాల్లో దాదాపు 35 మంది అధికారుల బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. కాగా, గుంటూరు జిల్లా మేడికొండూరు తహసీల్దార్ కరుణకుమార్ కారులో అనధికారికంగా ఉన్న రూ.లక్షా, 4 వేల, 7 వందలు నగదును, çకారు డ్యాష్ బోర్డులో ఉన్న పలు రికార్డులు, సర్టిఫికెట్లను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడ్డ నగదుపై పూర్తి స్థాయి వివరాలు చెప్పకపోవడంతో తహసీల్దార్‌ను కార్యాలయానికి తీసుకొచ్చి కంప్యూటర్ డేటాను తనిఖీ చేశారు. ఇదే తహసీల్దార్ కరుణకుమార్ మేడికొండూరు కార్యాలయంలోనే సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయం(2009)లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వీరవెంకటప్రతాప్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ మేడికొండూరు తహసీల్దార్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రత్యేక నిఘా పెట్టినట్టు తెలిపారు. తహశీల్దార్ కార్యాలయాల్లో పలు రికార్డుల్లో అక్రమాలను గుర్తించినట్టు తెలిసింది. నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాల్సిన అర్జీలను కూడా ఉద్దేశపూర్వకంగా పక్కనబెడుతున్నట్టు గుర్తించారు. తనిఖీలు గురువారం కొనసాగనున్నాయి. అనంతరం వివరాలను మీడియాకు వెల్లడించనున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లెక్కల్లో చూపని నగదు స్వాధీనం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏబీసీ దాడులు చేసి లెక్కల్లో చూపని నగదు భారీగా స్వా«దీనం చేసుకున్నారు. అనంతపురం రూరల్ (రుద్రంపేట) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన సోదాల్లో రిజిస్ట్రేషన్ చలానాల పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ అలీ స్వయాన అల్లుడు, ఆయన వాహన డ్రైవరుగానూ ఉన్న షేక్ ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద అక్రమంగా దాచుకున్న రూ.2.27 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జగదాంబ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన సోదాల్లో ఇటీవల కాలంలో జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన దస్త్రాలను ఏసీబీ పరిశీలించారు. బుధవారం జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీలకు మించి అధికంగా నగదు, అలాగే అనధికార వ్యక్తులు కార్యాలయంలో ఉండటంపైనా ఆరా తీశారు. తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై జరిగిన సోదాల్లో లెక్కల్లో చూపకుండా ఉన్న మొత్తం రూ.1,53,410 నగదును సీజ్ చేశారు. ‘నవరత్నాలు–పేదలు అందరికీ ఇళ్ల’ పథకం కింద ఇంటి బిల్లులను మంజూరు చేసేందుకు ఓ లబ్ధిదారు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ గృహనిర్మాణ శాఖ ఏఈ బుధవారం ఏసీబీకి చిక్కారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం గృహనిర్మాణ శాఖ ఏఈ ఎం.వెంకటేశ్వరరావు బిల్లు మంజూరు చేసేందుకు రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై లబ్దిదారుడు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 14400కు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన లబ్దిదారు నుంచి లంచం తీసుకుంటుండగా ఏఈ వెంకటేశ్వరరావును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన్ని విశాఖపట్నం ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. -
'కళాపురం'.. ఇక్కడ అందరూ కళాకారులే రిలీజ్ డేట్ ఫిక్స్
‘పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాల ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కళాపురం’. ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ అన్నది ఉపశీర్షిక. ‘సత్యం’ రాజేష్, ‘చిత్రం’ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. కరుణ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు కంటెంట్ బేస్డ్ సినిమాలు చేశాను. ‘కళాపురం’ కామెడీ సినిమా. అయితే కామెడీలో అశ్లీలత ఉండవు’’ అన్నారు. ‘‘మా సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు రజనీ తాళ్లూరి. ‘‘మా మూవీ ప్రేక్షకులను బాగా నవ్విస్తుంది’’ అన్నారు ‘జీ స్టూడియో’ నిమ్మకాయల ప్రసాద్.‘‘క్యూట్ కామెడీ చిత్రమిది’’ అన్నారు ‘సత్యం’ రాజేష్. ‘‘చాలా రోజుల తర్వాత ఈ మూవీలో మంచి పాత్ర చేశాను’’ అన్నారు ‘చిత్రం’ శ్రీను. -
'పలాస'కు అరుదైన గౌరవం.. ఆ ఫెస్టివల్‌కు ఎంపిక
Karuna Kumar Palasa 1978 Movie Selected For PK Rose Film Festival: 1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన ఈ చిత్రంతో కరుణ కుమార్ అనే నూతన దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రఘు కుంచె కీలక పాత్ర పోషిస్తూ సంగీతమందించాడు. మార్చి 6, 2020న విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షాదరణ పొందింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఈనెల 9,10,11 తేదిలలో చెన్నైలో నిర్వహించే పికె. రోజ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కాబోయే సినిమాల్లో 'పలాస 1978' కూడా ఎంపికైంది. ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. 'ఎస్సీ, ఎస్టీల జీవనాన్ని, వారి జీవిత గాథలను కథా చిత్రాలుగా మలిచే డైరెక్టర్ పా రంజిత్. ఆయన 2018లో వానమ్ ఆర్ట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. కరోనా తర్వాత మళ్లీ ఈ వేడుక జరగనుంది. ఏప్రిల్ నెలను 'దళిత్ మంత్'గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ పుట్టినరోజు పురస్కరించుకొని చేస్తున్న ఈ ఫెస్టివల్లో సాహిత్యం, సినిమా రెండు కూడా ప్రధాన భూమికలు పోషిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ పాలిటిక్స్‌ను ఇతివృత్తంగా తెరకెక్కించిన సినిమాలను ఈ వేడుకలో ప్రదర్శిస్తారు. దేశం గర్వించే దర్శకుల సినిమాల పక్కన 'పలాస 1978' చిత్రానికి చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఫెస్టివల్లో భాగమైనందుకు నాకు గర్వంగా కూడా ఉంది. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని 'పలాస'తో నాకు అనుభవంలోకి వచ్చింది. దానితో పాటు ఇటువంటి వేదికలపై 'పలాస 1978 ' సినిమా ప్రదర్శించడం దర్శకుడుగా మరిచిపోలేని అనుభవం కాబోతుంది.' అని కరుణ కుమార్ తెలిపారు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు.. -
జీఏ 2 బ్యానర్లో నూతన చిత్రం
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాసు, విద్య మాధురి నిర్మాతలుగా నూతన చిత్రం ప్రారంభమైంది. వరుస సక్సెస్ ఫుల్ సినిమాలతో తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని విజయవంతమైన సినిమాలను నిర్మిస్తున్న సినీ నిర్మాణ సంస్థగా ఇమేజ్ అందుకున్న జీఏ 2పిక్చర్స్ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ 7గా ఈ నూతన చిత్రం రాబోతుంది. పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో ప్రేక్షకాధరణ అందుకున్న దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ అంజలి, ప్రముఖ నటలు రావు రమేశ్, ప్రియదర్శీ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరక్టర్ మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది, అల్లు అన్విత క్లాప్ ఇచ్చి ఈ సినిమాను ప్రారంభించారు, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ఛ్ ఆన్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్. -
‘శ్రీదేవి సోడా సెంటర్’ రిలీజ్: కేక్ కట్ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి,శ్రీకాకుళం (కాశీబుగ్గ): సినీ చరిత్రలో పలాసకు ప్రత్యేక స్థానం ఉందని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఏ సినిమా విడుదలైనా ఇక్కడ ప్రజలు ఆదరించి భారీ కలెక్షన్లు పంపేవారన్నారు. ఇప్పుడు పలాస ప్రాంతానికి చెందినవారే సినిమాలు తీయడం సంతోషకరమన్నారు. శుక్రవారం ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా విడుదల సందర్భంగా పలాసలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పలాస మండలంలో మారుముల కంట్రగడ గ్రామంలో పుట్టిపెరిగిన కరుణ కుమార్ ‘పలాస–1978’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై రికార్డు సృష్టించారన్నారు. ఇప్పుడు ‘శ్రీదేవి సోడా సెంటర్’ బడ్జెట్ సినిమా తీసి దేశవ్యాప్తంగా విడుదల చేయడం ఆనందదాయకమన్నారు. పలాస అన్ని రంగాల్లో ప్రత్యేకత చాటుకుంటూ వస్తోందన్నారు. ఈ సినిమాలో పదుల సంఖ్యలో నటీనటులు ఈ ప్రాంతానికి చెందినవారు ఉండడంతో పలాసకు కళ వచ్చిందన్నారు. డైరెక్టర్ కరుణ కుమార్ తల్లి సరోజినమ్మకు అభినందనలు తెలియజేశారు. చిత్రంలో నటించిన నటులు మంత్రి అప్పలరాజును సత్కరించారు. కార్యక్రమంలో నటుడు గార రాజారావు, మల్లా భాస్కరరావు, పెంట రాజు, దువ్వాడ హేమబాబు చౌదిరి, కోత పూర్ణచంద్రరావు, పైల చిట్టి, జోగి సతీష్, దువ్వాడ మధుబాబు, ఉంగ సాయి ఉన్నారు. చదవండి: చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా -
శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ
టైటిల్: శ్రీదేవి సోడా సెంటర్ నటీనటులు: సుధీర్ బాబు, ఆనంది, నరేశ్, పావల్ నవగీతమ్, తదితరులు దర్శకత్వం: కరుణ కుమార్ నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాణ సంస్థ: 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్ సైనుద్దీన్ విడుదల తేదీ: 27 ఆగస్టు 2021 Sridevi Soda Center Movie Review: సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్'. అమలాపురం బ్యాక్ డ్రాప్లో రూపొందించిన ఈ సినిమాకు 'పలాస 1978' డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వం వహించారు. 'వి' పరాజయం తర్వాత సుధీర్‌బాబు చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో ఎలక్ట్రీషియన్ సూరిబాబుగా నటించిన హీరో తనకు ఇష్టమైన అమ్మలాంటి అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు. కానీ వీరి ప్రేమ ఎన్నో మలుపులు తిరుగుతూ చివరాఖరకు ఏ తీరానికి చేరుకుందనేది మిగతా కథ. 'చాలామంది మలయాళ సినిమా కథల గురించే మాట్లాడుకుంటారు. కానీ మా సినిమా చూశాక తెలుగు సినిమా కథల గురించి మాట్లాడుకుంటారని ఎంతో ధీమాగా చెప్పాడు సుధీర్ బాబు. మరి ఆగస్టు27న విడుదలైన ఈ సినిమా నిజంగానే జనాలను కట్టిపడేసిందా? లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే! కథ సూరిబాబు (హీరో సుధీర్ బాబు) అమలాపురంలో ఎలక్ట్రీషియన్. ఓ గుడిలో లైట్ సెట్టింగ్ వేస్తున్న సమయంలో అక్కడ సోడాలు అమ్ముకునే శ్రీదేవి(ఆనంది)ని చూసి లవ్‌లో పడతాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో ఆ ఊళ్లో పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకు కాశీ.. శ్రీదేవిని ఇష్టపడతాడు. దానికితోడు సూరిబాబును తక్కువ కులం అని వారి ప్రేమను భగ్నం చేయాలనుకుంటాడు. మరోపక్క మూడు ముళ్లు వేసేందుకు మనసులు కలిస్తే సరిపోదని, కులం కూడా కలవాలంటూ ఈ ప్రేమజంట పెళ్లికి విముఖత చూపిస్తారు పెద్దలు. ఇంతలో ఆ గ్రామంలో హత్య జరుగుతుంది. దానికి సూరిబాబే కారణమని అతడిని జైల్లో వేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? సూరిబాబు జైలు నుంచి విడుదలయ్యాడా? అతడు జైలు నుంచి తిరిగొచ్చేలోపు శ్రీదేవి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉందా? లేదా కులం కట్టుబాట్లను దాటుకుని సూరిబాబుతో ఏడడుగులు నడిచిందా? అదీ కాకుండా పెద్దల మనసు మార్చి వారి ఆశీస్సులతో పెళ్లి చేసుకున్నారా? అసలు సూరిబాబుకు ఆ హత్యకు సంబంధం ఏంటి? విలన్ కాశీ, హీరోయిన్ తండ్రి చావుకు కారణాలేంటి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే థియేటర్లలో బొమ్మ చూడాల్సిందే! విశ్లేషణ సుధీర్ బాబు సిక్స్‌ప్యాక్ కోసం పడ్డ కష్టం ఏమాత్రం వృథా కాలేదు. అతడి పర్ఫామెన్స్‌ను, అప్పియరెన్స్‌ను అభిమానులు ఎంజాయ్ చేస్తారు. ఇక కథ స్టార్ట్ అవడమే జైలు సన్నివేశంతో మొదలవుతుంది. తర్వాత వచ్చే బోట్ సీన్లు, ఫైటింగ్, బీజీఎమ్ ఓ లెవల్లో ఉంటాయి. పల్లెటూరి అందాలను తెరపై మనోహరంగా చూపించారు. కామెడీ, ప్రేమ కథతో ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిపోతుంది. లవ్ స్టోరీ కొంత రొటీన్‌గా అనిపించక మానదు. పైగా కథలో పలు సన్నివేశాలను ప్రేక్షకుడు ముందే ఊహించేలా ఉండటం నెగెటివ్ అని చెప్పొచ్చు. సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టులు ఎదురవుతుంటాయి. శ్రీదేవిని విలన్కిచ్చి పెళ్లి చేస్తాడు ఆమె తండ్రి. అయినప్పటికీ శ్రీదేవి అతడితో జీవించేందుకు అంగీకరించదు. హీరో రాక కోసం నిరీక్షిస్తుంది. అతడితో వెళ్లిపోవాలని డిసైడ్ అవుతుంది. ఈ క్రమంలో కథను ఊహించని మలుపు తిప్పుతాడు డైరెక్టర్. ఎమోషనల్ సీన్లతో ప్రేక్షకులను కంటతడి పెట్టించే ప్రయత్నం చేశాడు. కానీ నత్తనడకన సాగే కథతో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాడు. ఇక కథ చివర్లో వచ్చే క్లైమాక్స్ సినిమా మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుంది. సినిమా గురించి స్థూలంగా చెప్పాలంటే పాత చింతకాయ పచ్చడికే మరికొంత మసాలా వేసి జనాలకు వడ్డించాడు డైరెక్టర్. నటీనటులు సుధీర్ బాబు సినిమా కోసం ప్రాణం పెట్టినట్లు కనిపిస్తుంది. సూరిబాబు పాత్రలో జీవించేశాడు. లవ్ సీన్లు, ఎమోషనల్ సీన్లలో ఇరగదీశాడు. హీరోయిన్ ఆనంది కూడా సుధీర్‌తో పోటీపడి మరీ నటించింది. నరేశ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ప్లస్ పాయింట్స్ ♦ క్లైమాక్స్ ♦ సంగీతం ♦ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ ♦ రొటీన్ కథ ♦ ఫస్టాఫ్ -
'కథ చెప్పడానికి ఫోన్ చేస్తే..మేనేజర్లకు చెప్పమన్నారు'
‘‘పరభాషా చిత్రాలు చూసి తెలుగులో అలాంటివి రావడం లేదని ఆ చిత్రాలను అభినందిస్తుంటాం. ‘శంకరాభరణం, సిరివెన్నెల, జ్యోతి, విజేత, ఛాలెంజ్’ వంటి లిటరేచర్ బేస్డ్ సినిమాలు తెలుగులో వచ్చినన్ని ఇతర భాషల్లో రాలేదు. ప్రపంచాన్ని షేక్ చేసిన ‘అరుంధతి, బాహుబలి’ వంటి సినిమాలు కూడా తెలుగులోనే వచ్చాయి. కథలు చెబుదామనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నేను రాసుకునే సినిమా కథల్లో కథలే హీరోలు’’ అన్నారు కరుణ కుమార్. సుధీర్‌బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా కరుణ కుమార్ మాట్లాడుతూ – ‘‘అమలాపురం పక్కన ఉన్న గ్రామాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఓ సోడా సెంటర్ యజమాని కూతుర్ని ఓ ఎలక్ట్రీషియన్ ప్రేమిస్తాడు. అక్కడి ప్రాంతాల్లోని సాంఘిక, ఆర్థిక, సామాజిక పరమైన ఇబ్బందుల వల్ల వీరి ప్రేమకథ ఏమైంది? అన్నదే ఈ సినిమా కంథాంశం. సుధీర్‌కి రెండు కథలు చెబితే, ‘శ్రీదేవి సోడా సెంటర్’ను సెలక్ట్ చేసుకున్నారు. నిర్మాతలు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమాలో మణిశర్మగారి కొత్తరకం బాణీలు వింటారు’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. నా సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కొంతమంది తెలుగు అమ్మాయిలకు ఫోన్ చేయగా, కొందరు సినిమాలో ‘హీరో ఎవరు?’ అని అడిగారని, మరికొందరు వాళ్ల మేనేజర్‌కు కథలు చెప్పమన్నారనీ.. అంతేకానీ కథలు ఎవరూ వినలేదనీ అన్నారు కరుణ కుమార్. చదవండి : ‘సర్కారువారి పాట’ : గోవా షెడ్యూల్ పూర్తి అందగత్తెను కాదని ఎగతాళి చేశారు: నటి భావోద్వేగం -
శ్రీదేవి సోడా సెంటర్: ఇరగదీసిన సుధీర్ బాబు
నేడు(మే 11) టాలెంటెడ్ హీరో సుధీర్‌బాబు బర్త్‌డే. ఈ సందర్భంగా అతడు సూరిబాబుగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో నదిలో ఏదో పడవ పందెం జరుగుతున్నట్లుగా కపిపిస్తోంది. అయితే ఓడలో ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడీ హీరో. పనిలో పనిగా సిక్స్‌ప్యాక్ బాడీని కూడా చూపించారు. తిరునాళ్లలో హీరో సిగ్గు, ప్రేమ, ఫైటింగ్.. అంతా చూపించారు. కానీ హీరోయిన్ను మాత్రం ఎక్కడా ఫ్రేమ్‌లో చూపించనేలేదు. కాగా ఈ చిత్రానికి ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్ సినిమాలను అందించిన విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా వుంటే సమ్మోహనం, వి చిత్రాల తర్వాత సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో మూడో చిత్రం తెరకెక్కుతోంది. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను గాజుల పల్లి సుధీర్‌బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ‘వెన్నెల’కిశోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
‘పలాస’ డైరెక్టర్‌కు అరవింద్ ఆఫర్
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా నటించిన ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అయితే తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా విడుదల కాకముందే కరుణ కుమార్ బంపర్ ఆఫర్ దక్కించుకున్నాడు. ఈ టాలీవుడ్ కొత్త డైరెక్టర్ తన రెండో సినిమా గీతా ఆర్ట్స్ వంటి భారీ నిర్మాణ సంస్థలో చేయనున్నాడు. దీనికి సంబంధించి గీతా ఆర్ట్స్ అధినేత, నిర్మాత అల్లు అరవింద్ కరుణ కుమార్‌కు అడ్వాన్స్‌గా ఓ చెక్ కూడా ఇచ్చాడు. ‘పలాస 1978’ చిత్ర బృందం ఆహ్వానం మేరకు నిర్మాతలు అల్లు అరవింద్, బన్ని వాస్‌లు మూవీ ప్రివ్యూ షో చూశారు. సినిమా చూసిన అనంతరం దర్శకుడు కరుణ కుమార్‌ను అల్లు అరవింద్ అభినందించారు. యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం చాలా నేచురల్‌గా ఉందని, ప్రతిభ గల డైరెక్టర్ అంటూ ప్రశంసించారు. అంతేకాకుండా ఆయనతో కలిసి ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటిస్తూ మీడియా సమక్షంలోనే అడ్వాన్స్‌గా చెక్‌ను అందించారు. దీంతో కరుణ కుమార్ తన రెండో సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్లో చేయబోతున్నట్లు ఖరారైంది. ఇక తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల కానుంది. రఘు కుంచె ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా సంగీతమందించాడు. చదవండి: పలాస నాకు చాలా ప్రత్యేకం పలాస చూశాక ధైర్యం వచ్చింది -
వాస్తవ సంఘటనల పలాస
‘‘స్వచ్ఛ భారత్‌కి నేను చేసిన ‘చెంబుకు మూడింది’ లఘు చిత్రం జాతీయ స్థాయిలో రెండో బహుమతి తెచ్చుకోవడం నా జీవితంలో కీలక మలుపు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి కేటీఆర్‌గార్లు అప్పుడు నన్ను సన్మానించారు. కేటీఆర్‌గారి ప్రోత్సాహంతో చాలా ప్రభుత్వ యాడ్స్ చేశాను. ‘పలాస ’ నా మొదటి సినిమా అవుతుందనుకోలేదు’’ అన్నారు దర్శకుడు కరుణ కుమార్. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యా¯Œ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్ష¯Œ ్స ద్వారా ఈ నెల 6న విడుదల కానుంది. కాగా ‘పలాస 1978’ ట్రైలర్‌ని రానా ట్విట్టర్లో విడుదల చేసి, ‘ఈ చిత్రం విజువల్స్, నేపథ్యం చాలా కొత్తగా ఉన్నాయి’’ అన్నారు. కరుణ కుమార్ మాట్లాడుతూ– ‘‘1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. తమ్మారెడ్డి భరద్వాజగారికి కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం అని, నిర్మాత ప్రసాద్‌గారిని పరిచయం చేశారు. ఇది ఒక వ్యక్తి కథో, కుటుంబం కథో కాదు.. ఇది ఒక సమూహం కథ. ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా పలాస కథను తెరకెక్కించాం. ఈ చిత్రంలో ఒక నిజాయతీ కథ కనిపిస్తుంది. సెన్సార్ బోర్డ్‌వారు ఎక్కువ కట్స్ సూచించడంతో రివైజ్ కమిటీకి వెళ్లాం.. వాళ్లు మా చిత్రాన్ని చూసి, ప్రశంసించారు’’ అన్నారు. -
కథా బలం ఉన్న సినిమాలు హిట్టే
‘‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమా ట్రైలర్ చూస్తుంటే మంచి సందేశాత్మక చిత్రమని తెలుస్తోంది. ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి. అందరూ బాగా నటించారు’’ అని హీరో రాజశేఖర్ అన్నారు. సంజయ్ ఇదామ, శ్రీనాథ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ ముఖ్య తారలుగా జె.కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’. రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సినిమా పాటల విడుదల వేడుకలో రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘రాజమౌళిగారి దగ్గర పనిచేసిన కరుణ కుమార్ ఈ సినిమాను బాగా తెరకెక్కించారు. యాజమాన్య పాటలు బాగున్నాయి. కథా బలం ఉన్న సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతుంటాయి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’లో కథతో పాటు సందేశం ఉన్నందున తప్పకుండా సక్సెస్ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో విద్యార్థుల గురించి ఒక మంచి సందేశం ఉంది. ప్రతి తల్లిదండ్రులు, విద్యార్థులు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు నటి జీవిత. ‘‘ఈ చిత్రం నాకు నచ్చింది.. అందుకే స్వయంగా విడుదల చేస్తున్నా’’ అన్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్. ‘‘తెలుగులో నేను తీసిన మూడో సినిమా ఇది. డబ్బు వస్తుందా?లేదా? అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశానన్న సంతృప్తి ఉంది’’ అన్నారు బి.ఓబుల్ సుబ్బారెడ్డి. ‘‘ఆత్మహత్య సమస్యకు పరిష్కరం కాదని ఈ సినిమాలో చెప్పాం’’ అన్నారు కరుణ కుమార్. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. -
రియల్ స్టోరీ!
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం అభిజిత్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. జె. కరుణకుమార్ దర్శకుడు. ఎ.మోహన్‌నాయుడు నిర్మాత. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘ఉత్తర భారత దేశంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందనున్న వినోదాత్మక కథాంశమిది. త్వరలోనే టైటిల్‌ని ఖరారు చేస్తాం. ఈ నెల 25న షూటింగ్ ప్రారంభించి, రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి రచన: పృధ్వీతేజ్, సంగీతం: యాజమాన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామస్వామి, సమర్పణ: డీఎస్ రావు.